సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ మూసీ కార్యక్రమంలో రెండో రోజు కొనసాగుతోంది. రెవెన్యూ అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే చేస్తున్నారు. దీంతో, అక్కడ ఉద్రికత్త చోటుచేసుకుంది. బాధితులు.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాలను సర్వే చేస్తూ రెవెన్యూ అధికారులు రెండో రోజు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో మార్కింగ్ చేస్తున్నారు. కూల్చివేయబోయే ఇళ్లకు నెంబరింగ్ ఇస్తూ మార్క్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అధికారులు సర్వేను ముమ్మరం చేశారు. గురువారం దాదాపు 12 ఇళ్లను ఖాళీ చేయించారు. ఈ క్రమంలో తమ ఇళ్లకు మార్క్ చేయకుండా అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. తమ ఇళ్లను కూల్చే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. దీంతో, పలు చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.
మరోవైపు.. శని, ఆదివారాల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా ప్లాన్ చేసింది. అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెండు రోజుల్లో కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్ధమవుతున్నారు. దీని కోసం అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: నిజాం కన్నా దుర్మార్గుడు రేవంత్: ఎంపీ ఈటల ఫైర్
Comments
Please login to add a commentAdd a comment