Published
Sat, Sep 3 2016 9:40 PM
| Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
640 అడుగులకు చేరిన మూసీ నీటిమట్టం
కేతేపల్లి : మూసీ రిజర్వాయర్ నీటిమట్టం 640 అడుగులకు చేరుకుంది. నాలుగు రోజులుగా మూసీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో ప్రారంభమైంది. దీంతో ప్రాజెక్ట్‌లో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రాజెక్ట్‌లో గరిష్ట నీటి మట్టం 645 అడుగులు ఉండగా శనివారం సాయంత్రానికి 640 అడుగులకు చేరుకుంది. ఎగువన కురుస్తన్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్‌ఫ్లో తగ్గిపోయంది. ఎగువ నుంచి కేవలం 1,400 క్యూసెక్‌ల వరద నీరు రిజర్వాయర్‌లో చేరుతుందని ప్రాజెక్టు ఇంజినీర్ ఎన్.రమేష్ తెలిపారు. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 3.17 టీఎంసీల నీరు చేరిందని అధికారులు తెలిపారు.