మూసీ కుడికాల్వకు నీటిని విడుదల చేయాలి
మూసీ కుడికాల్వకు నీటిని విడుదల చేయాలి
Published Sun, Aug 7 2016 10:19 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
కేతేపల్లి(బొప్పారం) : మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరువలోకి చేరినందున కుడికాల్వకు నీటిని విడుదల చేయాలని తెలంగాణ ఉద్యమవేదిక(టీయూవీ) జిల్లా కన్వీనర్ యానాల లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు టీయూవీ ఆధ్వర్యంలో ఆదివారం పలువురు రైతు ప్రతినిధులు బొప్పారం సమీపంలోని మూసీ కుడికాల్వ గేటు వద్ద కాల్వలోకి దిగి ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోనే మూసీ ప్రాజెక్టు ఉన్నప్పటికీ సాగు, తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత రెండేళ్లుగా సరైన వర్షాలు లేక ఆయకట్టు గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నీటిని కాల్వకు వదిలి ఆయకట్టు గ్రామాల చెరువులు, కుంటలు నింపి భూగర్భజల మట్టం పెరిగేలా చూడాలని కోరారు. ఆందోళనలో టీయూవీ నాయకులు, రైతులు నార్కట్‌పల్లి రమేష్, బయ్య క్రిష్ణ, గిన్నె నాగయ్య, చల్ల శేఖర్‌రెడ్డి, బి.జానయ్య, ఉప్పల శంకర్, దుర్గం వెంకన్న, చల్ల వెంకట్‌రెడ్డి, డి.ప్రవీణ్, రజనీకాంత్, శంకర్, డి.సైదులు, శ్రీను, సాయి పాల్గొన్నారు.
Advertisement