మూసీకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
మూసీకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
Published Sat, Sep 24 2016 9:22 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
కేతేపల్లి: ముసీ రిజర్వాయర్‌కు శనివారం సైతం భారీగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో అధికారులు ప్రాజెక్టు 9 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీకి ఎగువ ప్రాంతాలైన హైదరాబాద్, జనగాంతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో మూసీ, బిక్కేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో శనివారం 30 వేల క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మెుత్తం 9 గేట్లను ఎత్తి 35 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి ఇన్‌ఫ్లో 25 వేలకు తగ్గడంతో గేట్లను ఒక అడుగు మేర కిందకు దించారు. ప్రాజెక్టులో నీటిమట్టం 644 అడుగుల వద్ద నిలకడగా ఉండేలా చూస్తు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పర్యాటకుల సందడి
మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో సందర్శకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేతేపల్లి, సూర్యాపేట, నకిరేకల్, అర్వపల్లి తదితర మండలాల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు ప్రాజెక్టు వద్దకు వస్తున్నారు. ప్రాజెక్టు వద్ద ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement