సాక్షి, హైదరాబాద్: మూ సీ నది ప్రక్షాళనపై ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూటకోమాట మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎ క్స్’ వేదికగా విమర్శించారు. మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి కోసం రూ. 1.50 లక్షల కోట్ల ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జూలై 20న సీఎం ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. అలాగే సెప్టెంబర్ 6న సీఎం విడుదల చేసిన ‘తెలంగాణ గ్రోత్ స్టోరీ: దిరోడ్ టు వన్ ట్రిలియన్ డాలర్ ఎకాన మీ’ అనే విజన్ డాక్యుమెంట్‌లోనూ ఇదే విష యాన్ని పొందుపరిచారని పేర్కొన్నారు. కానీ దీనిపై విపక్షాలు ప్రశి్నస్తే తాను ఎన్నడూ రూ. 1.50 లక్షల కోట్ల ఖర్చవుతుందని చెప్పలేదంటూ సీఎం ఆవేశంతో ఊగిపోతున్నారని హరీశ్ ఎద్దేవా చేశారు. మూసీ పునరుజ్జీవం పేరిట ప్ర జాధనం లూటీ చేయాలనుకొనే ప్రభుత్వ కు ట్రను బట్టబయలు చేస్తామనిస్పష్టం చేశారు.
ప్రవీణ్‌ను ఆహ్వానించి అరెస్టు చేస్తారా?
గోషామహల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరుల సంస్మరణ కార్యక్రమానికి మాజీ ఐపీఎస్ అధికారి, తమ పార్టీ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌ను ఓవైపు ఆహా్వనించి మరోవైపు హౌస్ అరెస్ట్ చేయడాన్ని హరీశ్‌రావు ఖండించారు. కాగా, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రకటన చేశారని.. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదమని హరీశ్‌రావు ఓ ప్రకటనలో మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment