reservior
-
రిజర్వాయర్ని వేలానికి పెట్టడం గురించి విన్నారా?
రిజర్వాయర్లు అమ్మాకానికి వెళ్లడం ఏంటీ అని అనుకుంటున్నురా? ఔను ఇది నిజం అక్కడ స్థానిక ప్రజలకు ఆ రిజర్వాయర్ తలనొప్పిగా మారిందట. అందుకని దాన్ని వేలానికి వేయాలని నిర్ణయించారు దాని యజమాని. ఏంటా రిజర్వాయర్ ? ఎందువల్ల ఇలా అమ్మకానికి పెట్టారంటే.. యూకేలోని 200 ఏళ్ల నాటి రిజర్వాయర్ దాదాపు మూడు ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఈ రిజర్వాయర్ పడమటి వైపు దాదాపు 900 మీటర్లు కలిగిన ఫుట్‌పాత్ ఉంది. ఇది అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రాంతం కావడంతో ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో చెత్త సమస్య ఎక్కువయ్యింది. వీటన్నింటితో విసిగిపోయిన అక్కడ స్థానిక ప్రజలు రిజర్వాయర్ తమకు తలనొప్పిగా మారిందని స్తానిక నీత్ పోర్ట్ టాల్బోట్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. చెప్పాలంటే ఈ రిజర్యాయర్ మంచి బ్యూటిఫుల్ స్పాట్ కావడంతో ఇక్కడకు టూరిస్ట్‌లు తాకిడి బాగా ఎక్కువ, పైగా ఈ ప్రాంతం సరదాగా గడిపేందుకు, వాకింగ్‌కి మంచి ప్రసిద్ధి. దీంతో ఈ ప్రదేశం అంతా అత్యంత రద్దీగా మారిపోయింది. దీన్ని తట్టుకోలేక స్థానిక ప్రజలు తమ గోడుని కౌన్సిల్ వద్ద మొరపెట్టుకున్నారు. ముఖ్యంగా టూరిస్ట్‌లు ఆ రిజర్యావయర్ సమీపంలోనే స్టే చేయడం స్థానికులకు మరింత సమస్యాత్మకంగా మారింది దీంతో ఈ రిజర్వాయర్ని గతేడాది నుంచి సమంత ప్రైస్ అనే వేలం సంస్థ వేలానికి ఉంచింది. గతేడాది దాదాపు రూ. 80 లక్షల వరకు పలకగా ఈ ఏడాది మాత్రం అత్యంత తక్కువ ధర రూ. 16 లక్షలు పలకడం గమనార్హం. దీనిపేరు బ్రోంబిల్ రిజర్వాయర్. ఇది స్థానిక ఉక్కు పరిశ్రమకు నీటిని సరఫరా చేయడం కోసం నిర్మించిన రిజర్వాయర్. ఇప్పటికీ ఇది పనిచేస్తుంది. సైక్లిస్టులకు, చేపలు పట్టేవాళ్లకు మంచి ప్రసిద్ధ ప్రదేశం. అయితే ఈ రిజర్వాయర్ని తొలగించడం అనేది అత్యంత రిస్క్‌తో కూడుకున్నది కూడా. ముఖ్యంగా చుట్టు పక్కల స్థానికులు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, పర్యావరణానికి ఇబ్బందిక కలగకుండా నిర్ణిత ప్రమాణాలకు లోబడి చేయాల్సి ఉంటుంది. అంతేగాదు ఇలా రిజర్వాయర్లు వేలానికి వెళ్లడం అత్యంత అరుదు అని స్థానిక మీడియా పేర్కొంది. (చదవండి: స్ట్రీట్ కేప్‌లో సర్వ్ చేస్తున్న రోబో వెయిటర్! నెటిజన్లు ఫిదా!) -
ఫోన్ కోసం డ్యామ్ నీటిని ఎత్తిపోసిన ఘటన.. డబ్బు చెల్లించమంటూ లేఖ!
చత్తీస్‌గఢ్‌లో ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజేష్ విశ్వాస్ ఫోన్ కోసం రిజర్వాయర్ నీటిని ఎత్తిపోయించడంతో సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంద్రావతి ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఫోన్ కోసం నీటిని వృధా చేసినందుకు గానూ అతడి జీతం నుంచి డబ్బులు ఎందుకు వసూలు చేయకూడదంటూ సబ్ డివిజనల్ అధికారి ఆర్కే ధివర్‌కు ఈనెల 26న లేఖ రాశారు. వృధాగా పోయిన 21 లక్షల నీటి కోసం ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ వేతనం నుంచి డబ్బు వసూలు చేయండని అని లేఖలో పేర్కొన్నారు. వేసవిలో సాగు నీరు, ఇతర అవసరాల కోసం అన్ని రిజర్వాయర్లలో నీరు అవసరమని ఆ లేఖలో తెలిపారు. అయితే సదరు ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజేష్ విశ్వాస్ తన ఫోన్లో అధికారిక డిపార్టమెంటల్ డేటా ఉన్నందున దాన్ని తిరిగి పొందేందుకు యత్నించినట్టు తెలిపాడు. నిజానికి ఆ నీరు ఆ నిరుపయోగంగానే ఉందంటూ వాదిస్తున్నాడు. తాను వారాంతం కావడంతో తన స్నేహితులతో కలిసి కాంకేర్ జిల్లాలోని ఖేర్‌కట్టా డ్యామ్ వద్ద స్నానం చేయడానికి వెళ్లానని, సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు ఫోన్ డ్యామ్ నీటిలో పడిపోయిందని చెప్పాడు. స్థానికులు ప్రయత్నించి విఫలమయ్యారు. అందులోని నీరుని రెండు నుంచి మూడడుగులు తోడిస్తే ఫోన్ దొరుకుతుందని అక్కడి వారు చెప్పడంతో.. ఎస్డీఓకి కాల్ చేసి అభ్యర్థించానని చెప్పుకొచ్చాడు. ఆయన అదేమంతా సమస్య కాదనడంతో ముందుకెళ్లానని చెబుతున్నాడు. మూడు, నాలుగు అడుగుల నీటిని తోడించగానే తన ఫోన్ దొరికేసిందని రాజేష్ చెప్పారు. ఎక్కువ మొత్తంలో నీరు ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతోనే కేవలం మూడు లేదా నాలుగు అడుగుల నీటిని తోడించేందుకు అంగీకరించానని, అందుకు స్థానికుల సాయం కూడా తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా జలవనరుల శాఖ అధికారి మాత్రం తాను ఐదడుగులు నీటిని తీసేందుకే పర్మిషన్ ఇచ్చానని చెబుతుండటం గమనార్హం. (చదవండి: రూ.లక్ష ఫోన్ కోసం డ్యామ్‌లో నీటిని ఎత్తిపోశాడు.. తీరాచూస్తే..) -
విషాదం మిగిల్చిన ఈత సరదా
ధారూరు: ఈత సరదా విషాదంగా మారింది. నలుగురు వ్యక్తులు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. పండుగ వేళ విషాదం నింపిన ఈ ఘటన సోమవారం వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కోట్‌పల్లిలో చోటుచేసుకుంది. సీఐ అప్పయ్య కథనం ప్రకారం.. పూడూర్ మండలం మన్నెగూడకు చెందిన బాయికని పెంటయ్య కుమారులు లోకేశ్ (28), వెంకటేశ్(25), వీరి బాబాయి బుచ్చయ్య కొడుకు జగదీశ్(24), మేనత్త కొడుకు రాజేశ్ (24).. తమ కుటుంబ సభ్యులైన మరో 9 మందితో కలసి కోట్‌పల్లి ప్రాజెక్టుకు వచ్చారు. అక్కడి పరిసరాలను, అడవి అందాలను వీక్షించారు. అనంతరం సేదతీరేందుకు నీటి ఒడ్డుకు చేరుకున్నారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్న సమయంలో ఈత వచ్చిన లోకేశ్, జగదీశ్ నీటిలోకి దిగారు. వీరిని చూసి వెంకటేశ్, రాజేశ్ కూడా నడుములోతు వరకు వెళ్లి నీటిలో ఆడుకోవడం ప్రారంభించారు. కాగా, లోకేశ్, జగదీశ్ జలాశయంలో కొద్ది దూరంలో ఉన్న బండరాయి వద్దకు వెళ్లి వెనుదిరుగుతున్న సమయంలో ఈతరాని వెంకటేశ్, రాజేశ్‌లు వీరికి ఎదు రుగా వెళ్లేందుకు ప్రయత్నించి నీటిలో ముని గారు. వీరిని కాపాడేందుకు లోకేశ్, జగదీశ్‌లు ఒక్కొక్కరిని పట్టుకున్నారు. అయితే ఆందోళనకు గురైన వెంకటేశ్, రాజేశ్ వారిని గట్టిగా పట్టుకుని ఈత కొట్టే వీలులేకుండా చేశారు. దీంతో నలుగురూ నీటిలో మునిగిపోయారు. దీంతో ఒడ్డున ఉన్న ఇతర కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గమనించి గట్టిగా కేకలు వేయడంతో కొద్ది దూరంలో ఉన్న బోటింగ్ సిబ్బంది అక్కడికి చేరుకుని నీటిలో మునిగిన వారి కోసం గాలించారు. అయితే అప్పటికే వారు మరణించడంతో మృతదేహాలను బయటకు తీశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బుచ్చయ్య కొడుకు జగదీశ్ స్వగ్రామంలోనే వ్యవసాయం చేస్తున్నాడు. లోకేశ్ హైదరాబాద్‌లోని కూకట్పల్లి కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వెంకటేశ్, రాజేశ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. లోకేశ్, వెంకటేశ్, రాజేశ్ తమ కుటుంబాలతో హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. సంక్రాంతి పండుగ కోసం వీరంతా సొంతూరు మన్నెగూడకు వచ్చారు. (చదవండి: కి‘లేడీ’ ప్లాన్.. హోం డెలివరీ పేరిట మహిళ హనీ ట్రాప్) -
అదిగో పులి... ఇదిగో తోక
కోటవురట్ల: పులి భయంతో అటవీ పరిధి గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు అటవీ పరిధిలో సంచరించిన పులి తాజాగా నర్సీపట్నం–రేవుపోలవరం రోడ్డుపై కూడా సంచరిస్తోందన్న ప్రచారం సాగుతోంది. గురువారం రాత్రి ఇందేశమ్మవాక ఘాట్‌రోడ్డులో పలువురికి పులి కనిపించినట్టు చెబుతున్నారు. ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వెళుతుండగా ఘాట్‌రోడ్డులో పులి కనిపించడంతో బైకును అక్కడే వదిలేసి వెనక్కి పరుగులు తీసినట్టు చెబుతున్నారు. పందూరు గ్రామానికి చెందిన కిర్రా నాగేశ్వరరావు ఇందేశమ్మతల్లి ఆలయంలో ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ఎప్పటిలానే గురువారం రాత్రి 9 గంటల సమయంలో అమ్మవారికి దీపం పెట్టి తిరిగి పందూరులోని ఇంటికి వెళ్లేందుకు బయటకొచ్చి బైక్ స్టార్ట్ చేసేసరికి లైట్ వెలుతురులో సుమారు 200 అడుగుల దూరంలో పులి కొండపైకి ఎక్కుతూ కనిపించినట్టు నాగేశ్వరరావు చెబుతున్నారు. తాను స్పష్టంగా చూశానని, పులి తోక, కాళ్లు కనిపించాయని రోడ్డు నుంచి కొండపైకి ఎక్కుతుండడంతో భయపడి వెంటనే గుడిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నట్టు తెలిపాడు. మరికొద్ది సమయానికి అటుగా రెండు లారీలతో పాటు కొందరు యువకులు బైకులపై రావడంతో వారితో పాటు హారన్లు కొట్టుకుంటూ ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్నట్టు చెబుతున్నారు. అయితే ఇదంతా కేవలం వదంతులేనని ఫారెస్టు రేంజరు రాజుబాబు కొట్టిపారేస్తున్నారు. పులి కొండల్లో సంచరిస్తున్న మాట వాస్తవమేనని, ఘాట్‌రోడ్డుపైకి రావడం కేవలం వదంతులే అన్నారు. శ్రీరాంపురంలో దున్నపై దాడి జరిగిన ప్రాంతంలో ట్రాక్ కమెరాలు ఏర్పాటు చేశామని, ఆ పులి మళ్లీ అటువైపు రాలేదని తెలిపారు. ప్రస్తుతం దాని దిశ మార్చుకుని నక్కపల్లి, పాయకరావుపేట మండలాల వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. దున్నను వేటాడి ఆహారం తీసుకుని సుమారు 30 గంటలు దాటుతోందని, మళ్లీ అటాక్ చేసే అవకాశం ఉందన్నారు. దానిని బట్టి పులి ఆచూకీ తెలుసుకుని ఆ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమ సిబ్బంది, రెస్క్యూ టీమ్ అనుమానం వచ్చిన ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పులి పాదముద్రలు లభ్యం కావడం లేదన్నారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం.. ఇందేశమ్మ వాక ఘాట్‌రోడ్డులో పులి తిరుగుతోందని అడ్డురోడ్డు నుంచి కోటవురట్ల వైపు ఎవరూ వెళ్లొద్దని గురువారం రాత్రి వాట్సప్ గూపుల్లో ప్రచారం జరిగింది. వేర్వేరు ప్రాంతాలల్లో పులి సంచరిస్తున్న వీడియోలను గ్రూపుల్లో అప్లోడ్ చేసి హడలెత్తిస్తున్నారు. దాంతో ఘాట్‌రోడ్డులో రాకపోకలు బాగా తగ్గిపోయాయి. అణుకు, అల్లుమియ్యపాలెం, రామచంద్రపురం, గూడెపులోవ, పందూరు, బంద, శ్రీరాపురం, తడపర్తి, బోనుకొత్తూరు గ్రామాలను పులిభయం వెంటాడుతోంది. ఒంటరిగా బైకులపై వెళ్లేందుకు భయపడుతున్నారు. అడవి వైపు వెళ్లొద్దు... యలమంచిలి రూరల్ : రిజర్వ్ ఫారెస్ట్‌ను అనుకొని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆటవీశాఖ అధికారి రామ్ నరేష్ అన్నారు. శుక్రవారం పెదపల్లి అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వ్ ఫారెస్ట్‌లోకి పులి ప్రవేశించడంతో ప్రజలు ఒంటరిగా అడవిలోకి వెళ్లరాదన్నారు. అడవిని ఆనుకొని ఉన్న రైతులు పశువులను ఇంటికి తరలించడంతో పాటు అటు వైపు వెళ్లరాదని హెచ్చరించారు. పెదపల్లి రిజర్వాయర్, కొక్కిరాపల్లి రిజర్వాయర్ సమీపంలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండడంతో పాటు పశువులను గ్రామానికి తరలించాలని సూచించారు. పులికి ఆహారం లభించు స్థలం, నీరు అందుబాటులో ఉన్న ప్రదేశాలను పరిశీలించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పెదపల్లి ఆటవీ శాఖ ప్రాంతంలోకి బెంగాల్ టైగర్ ప్రవేశించడంతో అటవీ శాఖ అధికారులు వెంకటపురం, పెదగొల్లలపాలెం, చిన గొల్లలపాలెంతో పాటు పలు గ్రామాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి ఆటవీ శాఖ అధికారులు రవి కుమార్, గోవిందు, ప్రభాకర్, మూర్తి పాల్గొన్నారు. (చదవండి: రైతులకు సిరులు కురిపిస్తోన్న పత్తి..) -
నీటి వృథాకు సెన్సర్‌తో చెక్
సాక్షి, హైదరాబాద్: వందల కిలోమీటర్ల దూరం నుంచి నగరానికి తరలిస్తున్న కృష్ణా, గోదావరి జలాలు వృథా కాకుండా జలమండలి సెన్సర్ సాంకేతికతతో చెక్ పెట్టనుంది. మహానగరం పరిధిలో జలమండలికున్న సుమారు 400 సర్వీసు రిజర్వాయర్లు.. ఓఆర్ఆర్ ఫేజ్–2 పథకం కింద నూతనంగా ఏర్పాటు చేయనున్న మరో వందకు పైగా రిజర్వాయర్లకు ఈ సాంకేతికతను ఏర్పాటు చేయనున్నారు. ఆయా రిజర్వాయర్ల వద్ద ప్రతి నిత్యం ఏరులై పారుతున్న శుద్ధి చేసిన నీటిని వృథాను కట్టడి చేయనున్నారు. తద్వారా నగరంలో రోజువారీగా 45 శాతం లెక్కలోకి రాని నీటి మొత్తంలో కనీసం పదిశాతం నీటినైనా ఒడిసిపట్టనున్నారు. అలారం మోతతో అప్రమత్తం ఫిల్టర్బెడ్ల నుంచి రిజర్వాయర్లకు శుద్ధి చేసిన జలాలను పంపింగ్ చేయడం ద్వారా నింపుతున్న విషయం విదితమే. ఇదే సమయంలో ఆయా రిజర్వాయర్ల లోపల సెన్సర్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో స్టోరేజి రిజర్వాయర్ నిండుతున్న క్రమంలో పూర్తిస్థాయి నీటిమట్టానికి ఒక అడుగు ఉన్న సమయానికే ఈ సెన్సర్ గ్రహించి అలారానికి సంకేతాలు పంపుతుంది. అలారం పెద్ద శబ్దంతో మోగుతుంది. వెంటనే అక్కడి క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తమై వెంటనే రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించే వాల్వును ఆపేస్తారు. ఒకవేళ అలారం మోగినపుడు సిబ్బంది అందుబాటులో లేనప్పటికీ.. ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా సంబంధిత మేనేజర్‌తోపాటు రిజర్వాయర్ ఇన్చార్జికి సైతం ఫోన్‌కాల్ వెళ్తుంది. రిజర్వాయర్ నిండింది అంటూ వాయిస్‌కాల్ వెళ్తుంది. వెంటనే వారు అప్రమత్తమై వాల్వును ఆపేసే అవకాశం ఉంటుంది. ఈ సాంకేతికతను పర్యవేక్షించేందుకు ప్రతి 5– 6 రిజర్వాయర్లకు ఒక ఇన్చార్జిని జలమండలి నియమించనుంది. అన్ని రిజర్వాయర్లకు ఈ సాంకేతికతను ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.కోటి వ్యయం అవుతుందని జలమండలి అధికారులు అంచనా వేస్తున్నారు. మరో రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు తెలిపారు. పొంగిపొర్లడం నిత్యకృత్యమే.. నగరంలో జలమండలి స్టోరేజి రిజర్వాయర్లున్న ప్రతీ వీధి, కాలనీలో స్వచ్ఛమైన తాగునీరు పొంగిపొర్లడం స్థానికులకు నిత్యకృత్యమే. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రతి రిజర్వాయర్ ఓవర్ ఫ్లో అయ్యే వరకు వాల్వ్‌ను నిలిపివేయరు. దీంతో విలువైన తాగునీరు రహదారులు, కాలనీలను ముంచెత్తుతోంది. ఈ పరిస్థితికి సెన్సర్ సాంకేతికతతో చెక్ పెట్టనున్నట్లు జలమండలి తెలిపింది. నీటి వృథాను అరికట్టండి నగరానికి జలమండలి సరఫరా చేస్తున్న నీటి వాటాలో ఎలాంటి కోతలు లేవు. వేసవి కారణంగా వినియోగం అనూహ్యంగా పెరిగింది. దీంతో వాహనాలు, ఫ్లోర్ క్లీనింగ్, గార్డెనింగ్ అవసరాలకు నల్లా నీటిని వినియోగించవద్దు. తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వాడుకోవాలి. నీటి పొదుపుపై అన్ని వర్గాలు అవగాహన పెంపొందించుకోవాలి. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ (చదవండి: ఆ చిరునవ్వులిక కానరావు) -
అందాల అనంతగిరి.. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మానసపుత్రిక
సాక్షి, కరీంనగర్: ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా పడావు పడ్డ భూములు సాగవ్వడమే కాదు.. పర్యాటకంగా కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది’ అంటూ అందమైన అనంతగిరి (అన్నపూర్ణ) రిజర్వాయర్ ఫొటోతో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు ట్విట్టర్లో చేసిన పోస్ట్ వైరల్ అయింది. హైదరాబాద్ నుంచి 2 గంటల వ్యవధిలో ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌ను సందర్శించవచ్చని ఆయన పేర్కొనడంతో హైదరాబాద్‌తో పాటు దూర ప్రాంతాల ప్రజల దృష్టి ఇటు మళ్లింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎల్లంపల్లి నుంచి దిగువన మిడ్‌మానేరుకు వచ్చే నీళ్లు అక్కడి నుంచి అనంతగిరిలో నిర్మించిన అన్నపూర్ణ రిజర్వాయర్‌కు చేరుకుంటాయి. 3.5 టీఎంసీల సామర్థ్యం గల ఈ రిజర్వాయర్ కొండల నడుమ పర్యాటకులను ఆహ్లాదపరుస్తోంది. కాళేశ్వరానికి గుండెకాయగా.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 10వ ప్యాకేజీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి వద్ద 3.5 టీఎంసీల సామర్థ్యంతో అన్నపూర్ణ(అనంతగిరి) రిజర్వాయర్‌ను నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోనే ఇదో అద్భుత దృశ్యంగా కనువిందు చేస్తోంది. మిడ్‌మానేరు నుంచి 7.65 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా ప్రవహించే నీరు తిప్పాపూర్‌లోని 92 మీటర్ల సర్జ్‌పూల్‌లో చేరుతోంది. అక్కడి నుంచి నాలుగు పంపుల ద్వారా అనంతగిరి రిజర్వాయర్‌లోకి నీటిని పంప్ చేస్తారు. దాంతో రిజర్వాయర్ నిండుగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచే సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ రిజర్వాయర్లకు నీటిని తరలించడం జరుగుతోంది. రిజర్వాయర్ పక్కనే పోచమ్మ గుడి అనంతగిరి రిజర్వాయర్ కట్ట పక్కనే ప్రసిద్ధి గాంచిన పోచమ్మ దేవాలయం ఉంది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, మహా రాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. వచ్చిన వారంతా అనంతగిరి అందాలను వీక్షిస్తున్నారు. రిజర్వాయర్‌లో బోటింగ్ ప్రారంభిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు అంటున్నారు. సిద్దిపేట–సిరిసిల్ల జిల్లాల సరిహద్దుల్లోనే.. అన్నపూర్ణ(అనంతగిరి) రిజర్వాయర్ సిద్దిపేట–రాజన్న సిరిసిల్ల జిల్లాలకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఈ రిజర్వాయర్ రూపుదిద్దుకుంది. తాజాగా సిద్దిపేట నుంచి ఇల్లంతకుంట వరకు రూ.254 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డు మంజూరైంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే సిద్దిపేట నుంచి 20 నిమిషాల్లో ఈ రిజర్వాయర్‌కు చేరుకోవచ్చు. సిరిసిల్ల నుంచి వచ్చే పర్యాటకులు కూడా జిల్లెల్ల మీదుగా రావచ్చు. హైదరాబాద్‌కు 125 కిలోమీటర్ల దూరంలో ఈ రిజర్వాయర్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి కేవలం రెండు గంటల్లోనే అనంతగిరి చేరుకోవచ్చని కేటీఆర్ ట్విట్టర్లో చెప్పడంలో ఆంతర్యం అదే. ప్రభుత్వం దృష్టి సారించాలి తెలంగాణ ప్రభుత్వం అనంతగిరి రిజర్వాయర్‌ను మరింత అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా మారే అవకాశం ఉంది. తిప్పాపూర్ పంపు హౌస్, అనంతగిరి టెంపుల్ సమీపంలో బోటింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తే పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైన్ కూడా ఈ రూట్లోనే ఉండడంతో భవిష్యత్‌లో పర్యాటక తాకిడి పెరుగనుంది. మహానేత వైఎస్ ఆలోచనల్లోంచి... మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞంలో రూపకల్పన చేసిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగానే అనంతగిరి రిజర్వాయర్ తెరపైకి వచ్చింది. మిడ్‌మానేరు నుంచి చేవెళ్లకు నీటిని తీసుకెళ్లే క్రమంలో 1.5 టీఎంసీల సామర్థ్యంతో అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణానికి అంకురార్పణ చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రాణహిత చేవెళ్లకు బదులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. దాంతో అనంతగిరి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 3.5 టీఎంసీలకు పెంచారు. తిప్పాపూర్ పంప్ హౌస్ నుంచి నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసేలా నిర్మించారు. ప్రాజెక్టుకు నాలుగు వైపులా గుట్టలు ఉండటంతో రిజర్వాయర్‌లోకి పంపుల ద్వారా వెళ్లే నీరు ఒక నదిలా కనువిందు చేస్తోంది. చుట్టూ పచ్చదనం.., గుట్టలతో అనంతగిరి అందాలు రెట్టింపయ్యాయి. -
అటు జలకళ..ఇటు విలవిల
అట్లూరు: సోమశిల రిజర్వాయర్ పూర్తి జలకళతో ఉట్టిపడుతోంది. బుధవారం సాయంత్రానికి దీని నీటిమట్టం 78 టీఎంసీలకు చేరుకుంది. ఈ జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టమిది. దీంతో నెల్లూరు జిల్లాలో ఆనందం వ్యక్తమవుతుంటే మన జిల్లాలో మాత్రం ఆందోళన చెందుతున్నారు. కారణం ఈ రిజర్వాయరును నెల్లూరు జిల్లా సోమశిల దగ్గర నిర్మించినా దీని వెనుక జలాలతో మన జిల్లాలోని కొన్ని మండలాలకు ముంపునకు గురవుతున్నాయి. తాజాగా రిజర్వాయరు నిండిపోవడంతో అట్లూరు, ఒంటిమిట్ట, నందలూరు, గోపవరం మండలాలలోని వందకు పైగా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పంట పొలాలు కూడా ముంపు బారిన పడ్డాయి. ముంపు బాధితులను ఆదుకుంటాం:ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి ఒంటిమిట్ట: సోమశిల ముంపు బాధితులను అన్ని విధాల ఆదుకుంటాంమని ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి చెప్పారు. బుధవారం పెన్నపేరూరు, గంగపేరూరు, తప్పెటవారిపల్లె, వెంకటాయపల్లె, ఇబ్రహీంపేట, చిన్నకొత్తపల్లె గ్రామాలను ఆయన పరిశీలించారు. సోమశిల జలాశయం పూర్తి స్థాయికి చేరడంతో తప్పెటవారిపల్లె, పెన్నపేరూరులలో ఇళ్లలోకి నీరు చేరింది. అక్కడి ప్రజలు చాలా యాతన పడుతున్నారు. నరసన్నగారిపల్లెలో 40 ఎకరాల్లో వెనుక జలాలు వచ్చాయని బాధిత రైతులు తహసీల్దార్ విజయకుమారి దృష్టికి తీసుకొచ్చారు. ఆమె వెళ్లి ఆ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ సోమశిల ఇరిగేషన్ ఇంజనీర్ల అభ్యర్థన మేరకు గురువారం సోమశిల స్పెషల్ కలెక్టరు పరిశీలించనున్నారన్నారు. పరిహారం అందని భూముల్లో పంటలకు, పంట వేసిన భూములకు పరిహారం అందిస్తామన్నారు. పరిహారం తీసుకున్న ముంపు భూముల్లో దెబ్బతిన్న పంటలకు మానవత్వదృక్పథంతో నష్టపరిహారం చెల్లించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. బాధితులకు రేషన్ సహాయం అందిస్తామన్నారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, మేకపాటి నందకిషోర్‌రెడ్డి, ముమ్మడి నారాయణరెడ్డిలతోపాటు అధికారులు పాల్గొన్నారు. పరిహారానికి నోచుకోని పలుగ్రామాలు సోమశిల జలాశయం ముంపు జలాలతో (బ్యాక్‌వాటర్) బాధితులు బిక్కుబిక్కుమంటున్నారు. ముంపు బాధ ఓపక్క వీరిని వెంటాడుతుంటే కనీసం పరిహారం చెల్లించలేదని ఆగ్రహం చెందుతున్నారు. పరిహారం చెల్లింపు విషయంలో గత ప్రభుత్వాలు పూర్తిగా పట్టించుకోలేదు. టీడీపీ హయాంలో బాధితులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించలేదు. కనీస చర్యలు కూడా తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. భూములు, ఇళ్లకు నష్టపరిహారం కొంతమేర చెల్లించినప్పటికీ అట్లూరు మండలంలోని ఆకుతోటపల్లి, చింతువాండ్లపల్లి, వరికుంట ఎస్సీ కాలనీ, రంగంపల్లి, గొల్లపల్లి గ్రామాలకు ఇంతవరకూ నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వలేదు. బుధవారం సాయంత్రం ఈ మండల గ్రామాలను బ్యాక్‌వాటర్ చుట్టుముట్టింది. తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే గ్రామాలను ముంచారని బాధితులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వచ్చి తమ గ్రామాలను పరిశీలించి త్వరితగతిన నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ముంపు బాధిత గ్రామాలైన ఆకుతోటపల్లి, చింతువాండ్లపల్లిలను మంగళవారంఎమ్మెల్యే డాక్టరు వెంకటసుబ్బయ్య పరిశీలించారు. తమ ప్రభుత్వం ఆయా గ్రామాల బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
కేశవాపూర్ కుదింపు!
సాక్షి, హైదరాబాద్:మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ సమీపంలో చేపట్టదలిచిన కేశవాపూర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని కుదించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ అంశంలో చిక్కు ముళ్లు కొలిక్కి వచ్చే అవకాశాలు సన్నగిల్లిన నేపథ్యంలో దీని సామర్థ్యాన్ని సగానికి తగ్గించాలని భావిస్తోంది. ప్రస్తుతం 10 టీఎంసీల సామర్థ్యంతో దీనికి ఇప్పటికే పరిపాలనా అనుమతులు ఇవ్వగా, తాజాగా 5.04 టీఎంసీలకే దీన్ని పరిమితం చేసేలా వ్యాప్కోస్ సంస్థతో సర్వే చేయించింది. 5 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మాణం చేపడితే దాని నిర్మాణానికి రూ.3,363 కోట్ల మేర వ్యయం అవుతుందని వ్యాప్కోస్ నీటిపారుదల శాఖకు, మున్సిపల్ శాఖకు నివేదించింది. భూసేకరణ జాప్యంతోనే.. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా ఉన్న కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా తరలించి హైదరాబాద్ తాగునీటి అవసరాలను చేపట్టేలా కేశవాపూర్ రిజర్వాయర్‌ను 10 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాలని నిర్ణయిం చారు. రిజర్వాయర్ నిర్మాణానికి 13 కి.మీ. కట్ట నిర్మాణం చేయాల్సి ఉంటుందని తేల్చగా, కొండపోచమ్మ సాగర్ మీదుగా కేశవాపూర్ రిజర్వాయర్‌కు మూడు 3,600 ఎంఎం డయా గ్రావిటీ పైప్ లైన్ల ద్వారా నీటిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రిజర్వాయర్ నుంచి వచ్చే రా వాటర్‌ను ఘణపూర్‌లో నీటి శుద్ధి కేంద్రంలో (డబ్ల్యూటీపీ) శుద్ధి చేసి శామీర్‌పేట్, సైనిక్‌పురి మీదుగా ఉన్న గోదావరి రింగ్ మెయిన్ పైప్ లైన్లకు స్వచ్ఛమైన జలాలను పంపింగ్ చేయాల్సి ఉంటుంది. కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి 3,822 ఎకరాల భూమి అవసరం ఉండగా, మొత్తంగా రూ.4,777.59 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. భూసేకరణ, పరిహారం చెల్లింపునకు రూ.518.7 కోట్ల అంచనా వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇవి పోనూ రిజర్వాయర్ పనులకు రూ.3,918 కోట్లతో టెండర్ల ప్రక్రియ సైతం పూర్తికాగా, పనులు మాత్రం మొదలు కాలేదు. ఈ పనులు చేపట్టేందుకు బొంరాస్‌పేట, పొన్నాల గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉంది. ఇక్కడి రైతులు భూసేకరణకు సహకరించడం లేదు. భూసేకరణ కోసం రెవెన్యూ అధికారులు సమావేశాలు నిర్వహించినా ముంపు గ్రామాల ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సమీక్షించిన ప్రభుత్వం 5 టీఎంసీలు కుదించి, దానికనుగుణంగా ప్రాజెక్టు నివేదికతతయారు చేసి ఇవ్వాలని వ్యాప్కోస్ను ఆదేశించింది. దీనిపై కసరత్తు చేసి న వ్యాప్కోస్ ప్రభుత్వ భూమి 918.84 ఎకరాల మేర అటవీ భూమి ప్రాం తంలోనే నిర్మాణం చేసేలా 5.04 టీఎంసీలతో కేశవాపూర్‌ను నిర్మించే అవకాశం ఉందని తేల్చింది. రూ.3,363 కోట్లు అవసరం.. రా వాటర్ తరలించేందుకు ఏర్పాటు చేయనున్న రెండు వరుసల ప్రధాన పైప్ లైన్ పొడవు గతంలో 18.2 కి.మీ. ఉండగా, ప్రస్తుతం దాన్ని ఒకటే వరుసలో 34.85 కి.మీ.లకు ప్రతిపాదించింది. దీనికి మొత్తంగా రూ.3,363 కోట్లు అవుతుందని లెక్కగట్టింది. ఇందులో భూసేకరణ అవసరాలకు రూ.75 కోట్లు అవసరం ఉంటుందని తేల్చింది. దీంతో పాటే కొండపోచమ్మ సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని శుద్ధి చేసేందుకు డబ్ల్యూటీపీ నిర్మాణం చేయాల్సి ఉండగా, దానికి రూ.1,006 కోట్లు అంచనా కట్టింది. ఇందులో పైప్ లైన్ నిర్మాణానికే రూ.385 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టింది. -
వీడిన కట్ట లోగుట్టు
సాక్షి, కరీంనగర్: ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రధానమైన మిడ్‌మానేరు రిజర్వాయర్ కట్ట భద్రతపై నెలకొన్న సందేహాలకు పుల్‌స్టాప్‌పడనుంది. నిండుకుండలా ఉండాల్సిన మిడ్‌మానేరు 2 టీఎంసీల నీటి నిలువలకు పడిపోవడం వెనుక రిజర్వాయర్ కట్ట పటిష్టంగా లేకపోవడమే కారణమని తేలింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, కేంద్ర ప్రతినిధి బృందం పలుమార్లు కట్టను సందర్శించి, రిజర్వాయర్ నుంచి లీకవుతున్న నీరుకు అడ్డుకట్ట వేయాలంటే ఆ ప్రాంతంలో కట్ట అడుగుభాగాన్ని పునర్నిర్మించడం ఒక్కటే మార్గమని తేల్చారు. ఈ మేరకు బోగంఒర్రె ప్రాంతంలో 200 మీటర్ల పొడవున కట్ట అడుగుభాగంలో పునాదిగా వేసిన రాతి కట్టడాల(రాక్టో నిర్మాణాలు)ను తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు శుక్రవారం నుంచి పనులు ప్రారంభించిన అధికారులు శనివారం కూడా కొనసాగించారు. కట్ట అడుగు భాగంలో పదిమీటర్ల లోతు, పది మీటర్ల వెడల్పులో తవ్వకాలు జరిపి, తిరిగి పటిష్టవంతంగా మట్టితో నింపాలని నిర్ణయించినట్లు సమాచారం. చర్చనీయాంశంగా రాక్టో తొలగింపు మిడ్‌మానేరు ప్రాజెక్టు కట్ట భద్రతపై గత ఆగస్టు నెలలోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆగస్టులో కురిసిన వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పెరగడంతో నీటిని దిగువన ఉన్న మిడ్‌మానేరుకు వదిలిన విషయం తెలిసిందే. ఆగస్టు 31న రాత్రి 10 గంటలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే సహకారంతో 25 గేట్లు ఎత్తి నీటిని లోయర్ మానేరు డ్యాంకు విడుదల చేశారు. అంత అర్జెంట్‌గా నీటిని ఎందుకు విడుదల చేశారన్న అంశంపై అనుమానాలు వ్యక్తమైనా.. ఎల్లంపల్లి నుంచి మళ్లీ నీటిని నింపేందుకే అనుకున్నారు. 10 టీఎంసీల నీటిని దిగువకు వదిలిన అధికారులు మళ్లీ మిడ్‌మానేరు నింపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్ బృందం స్పందించారు. ‘మిడ్‌మానేరుకు ఏమైంది?’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించడంతో అందరి దృష్టి ప్రాజెక్టు భద్రతపై పడింది. ఈ నేపథ్యంలో లీకేజీ కాదు సీపేజీ అంటూ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి స్పందించారు. ‘సాక్షి’ దినపత్రికలో మిడ్‌మానేరు ప్రాజెక్టు భద్రత, రిజర్వాయర్ నీటిని పూర్తిగా దిగువకు వదలడం అంశాలపై వరుస కథనాలు ప్రచురించడంతో అందరి దృష్టి ప్రాజెక్టుపై పడింది. ఆసక్తి రేపిన కట్ట నాణ్యత పరీక్షలు మిడ్‌మానేరు ప్రాజెక్టు కట్ట భద్రతపై పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో, అధికారులు ప్రాజెక్టుకు పలు పరీక్షలు చేయించారు. ఈ క్రమంలో కట్టపైన ఫిజోమీటర్లను ఏర్పాటు చేశారు. బోగెంఒర్రె పరిసరాల్లో కట్ట నాణ్యత, భద్రత అంశాలు పరిశీలించడానికి ఢిల్లీకి చెందిన పర్సాన్ అనే సంస్థతో నీటిపారుదల శాఖ అధికారులు పలు రకాల జియో ఫిజికల్ టెస్టులు(పరీక్షలు) చేయించారు. ఇందులో భాగంగా కట్ట కింద 25 మీటర్ల లోతులో పలు చోట్ల ఎలక్ట్రికల్ సర్వే చేశారు. ఎలక్ట్రికల్ సర్వేలో భూమి అడుగు భాగానా.. తవ్వే అవసరం లేకుండా భూమి కింద 25 మీటర్ల లోపల కట్ట పరిస్థితి ఎలా ఉంది అనే విషయం తెలుస్తుంది. దీనికోసం అధికారులు కట్ట కింద ఎలక్ట్రికల్ సర్వేలు, సెప్మో రిట్రాక్టివ్(కట్ట స్కానింగ్) టెస్టులు చేశారు. దీంతో లోపల కట్ట బలంగా ఉందా..? రాక్ ఉన్నదా.. మట్టి బలంగా ఉందా.. లేదా అనే విషయాలు తెలుస్తాయి. ఈ టెస్టులన్నీ ఇటీవల పూర్తి చేశారు. టెస్టులపై ఢిల్లీ సంస్థ ఇచ్చిన నివేదిక అనంతరం డ్యాం సేఫ్టీ అధికారులు ప్రాజెక్టును సందర్శిస్తారని అధికారులు తెలిపారు. డ్యాం సేఫ్టీ అధికారుల సూచనలను పరిగణనలోకి తీసుకుని చర్యలకు శ్రీకారం చుట్టారు. 200 మీటర్లు వెడల్పు... 10 మీటర్ల లోతు ప్రాజెక్టు కట్ట నుంచి సీపేజీ జరుగుతున్న బోగం ఒర్రె ప్రాంతంలో 2475 నెంబర్ నుంచి 2675 నెంబర్ వరకు 200 మీటర్ల పొడవున కట్ట కింద సుమారు రాతి కట్టడాల(రాక్టో)ను తొలగిస్తున్నారు. 10 మీటర్ల లోతు, వెడల్పులో రాతి నిర్మాణాలను తొలగించి తిరిగి పనులు చేస్తున్నారు. కట్టకింద భాగంలో తొలగించడం వల్ల కట్ట కూడా దెబ్బతినే అవకాశం ఉన్నందున 200 మీటర్ల మేర పూర్తిగా కొత్త నిర్మాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాక్టో తొలగింపునకు పెద్ద మొత్తంలో జేసీబీలు, టిప్పర్లు వాడుతుతున్నారు. 200 మీటర్ల మేర కట్ట కిందనే తొలగిస్తారా? లేదా మొత్తం తొలగిస్తారా..? రాక్టో తొలగింపుల అనంతరం డ్యాం సేఫ్టీ, సెంట్రల్ డిజైనింగ్ అధికారులు ఏమంటారు..? తదితర సందేహాలపై అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కాగా శనివారం సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఎస్ఈ చంద్రశేఖర్, మిడ్‌మానేరు ఎస్ఈ శ్రీకాంత్‌రావు, ఈఈ అశోక్‌కుమార్ కట్టను సందర్శించారు. కట్టకు భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు రక్షణ చర్యలు చేపట్టామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కాగా రిటైర్డ్ ఇంజినీర్ల బృందం కూడా శనివారం మరోసారి మానేరు కట్టను సందర్శించింది. 200 నుంచి 300 మీటర్ల పొడవున కట్టను పునర్నిర్మించాలని అధికారులు సూచించారు. గతంలో ఓసారి తెగిన కట్ట మిడ్‌మానేరు రిజర్వాయర్ నిర్మాణం సమయంలోనే ఓసారి గండిపడింది. 2016, సెప్టెంబర్ 24న మిడ్‌మానేరు ఎగువన కురిసిన భారీ వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఎడమవైపు కట్ట తెగింది. కట్ట తెగిన తరువాత మరింత పటిష్టంగా నిర్మించాల్సి ఉండగా, లోపాలను సరిదిద్దే ప్రయత్నాలు జరగలేదని ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. గతంలో తెగిన ఎడమవైపే బోగం ఒర్రె ప్రాంతంలో కట్ట సీపేజీ రావడం, దానిని పునర్నిర్మించాలని నిర్ణయించి పనులు ప్రారంభించడం గమనించాల్సిన విషయం. కాగా, ఇంత జరుగుతున్నా... రిజర్వాయర్ కట్ట విషయంలో అధికారులు వాస్తవాలు తెలియజేయకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కాని విషయం. -
సారూ.. మా నోట్లో మట్టి కొట్టొద్దు!
సాక్షి, రావికమతం(చోడవరం) : అప్పులు చేసి పెట్టుబడులు పెడితే ప్రకృతి సహకరించక పంటంతా నాశనం అయిపోయింది. ఆదుకుంటుందని ఆశలు పెట్టుకున్న గత ప్రభుత్వం హయాంలో నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు అనుమతులిచ్చి మా నోట మట్టి కొట్టిందని కళ్యాణపులోవ రిజర్వాయర్ ఆయకట్టు రైతులు కన్నీరు కారుస్తున్నారు. ఈ అనుమతులు తక్షణమే వెనక్కు తీసుకోవాలంటూ కళ్యాణపులోవ రిజర్వాయర్ల పరిరక్షణ కమిటీ ఆందోళనలు, పత్రికల్లో వస్తున్న కథనాలతో పాటు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అన్ని శాఖల అధికారులతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ క్రమంలో జెడ్.కొత్తపట్నంలో గురువారం జరిగిన సభకు ఇరిగేషన్ ఎస్ఈ సూర్యకుమార్, మైన్స్ ఏడీలు ప్రసాద్, వెంకట్రావు, నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు, అటవీశాఖ అధికారి శివప్రసాద్, పంచాయతీ అధికారి రమణయ్యల సమక్షంలో రైతుల అభిప్రాయాలు సేకరించారు. రైతులకు మేలు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని నిర్భయంగా మీ అభిప్రాయాలు చెప్పొచ్చని భరోసా ఇవ్వడంతో గుండెల్లో ఆవేదనను ఇలా ఒక్కొక్కరిగా సభ ముందుంచారు. 5 వేల ఎకరాల్లో పంటలు నాశనం కళ్యాణపులోవ ప్రాంతంలో మైనింగ్ క్వారీ లారీలు భారీలోడ్లుతో నడవటం వల్ల ఇప్పటికే రోడ్లన్నీ పూర్తిగా గుంతలు పడ్డాయి. రోడ్డు బాగాలేక 108 రాలేని పరిస్థితి. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 50 ఏళ్లలో రిజర్వాయర్ ఎండిపోయి 5 వేల ఎకరాల్లో పంటలు పండడం లేదు. కల్యాణపులోవ రిజర్వాయర్‌లో ఏటా రూ.25 లక్షల చేప పిల్లలు వేసి ఆ మత్స్య సంపద ద్వారా జీవనోపాధి పొందుతున్నాం. ఈ ఏడాది నారుపోతలు వద్దంటూ అధకారులు చాటింపులు వేస్తున్నారు. పంట లేకుంటే మేమెలా బతకాలి. టీడీపీ ప్రభుత్వం పుణ్యమా అని మా బతుకులు రోడ్డునపడ్డాయంటూ రైతులు, మత్స్యకారులు కన్నీరు కార్చారు. కల్యాణపులోవ రిజర్వాయర్ పరీవాహక ప్రాంతం సామాలమ్మ కొండపై పలు గ్రానైట్ కంపెనీలు విచ్చలవిడి మైనింగ్, పేలుళ్ల కారణంగా ఊట గెడ్డలు కనుమరుగైపోయాయి. రిజర్వాయర్ మనుగడకే ముప్పు మహారాష్ట్రలో ఇటీవలే ఒక రిజర్వాయర్ కట్ట తెగి పోయి మూడు ఊళ్లు కొట్టుకుపోయాయి. అధికారులు తేరుకోకపోతే ఇక్కడా అలాంటి ముప్పు రావచ్చు. -
రూ.14.23 కోట్లు వృథా
సాక్షి, సింగరాయకొండ: నిధులు మంజూరయ్యాయి.. ఇక తమ కష్టాలు తీరతాయి.. పుష్కలంగా పంటలు పండుతాయనుకున్న రైతన్న ఆశలు నెరవేరలేదు. అధికారులు, కాంట్రాక్టర్ల అవినీతి అన్నదాతలకు నిరాశే మిగిల్చింది. సింగరాయకొండ ప్రాంత రైతాంగానికి ప్రధాన నీటి వనరు అయిన పీబీ (పాలేరు–బిట్రగుంట) సప్లయ్ చానల్‌కు కాంగ్రెస్ హయాంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14.23 కోట్ల రూపాయల జపాన్ నిధులు మంజూరయ్యాయి. కానీ,ఆ ప్రభుత్వ హయాంలో 50 శాతం కూడా పని జరగలేదని, తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఒక్క శాతం కూడా పని చేయలేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగం పనులు కూడా జరగ లేదని రైతులంటుండగా ఇరిగేషన్‌శాఖ అధికారులు మాత్రం 10 శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్టు చెబుతుండటం విశేషం. పీబీ సప్లయ్ చానల్ ఆయకట్టు.. ఈ చానల్ పరిధిలో సింగరాయకొండ, జరుగుమల్లి మండలాలలోని తొమ్మిది మీడియం ఇరిగేషన్ చెరువులకు పాలేరు పై జిల్లెళ్లమూడి వద్ద నిర్మించిన రిజర్వాయర్ ద్వారా సాగు నీరు సరఫరా అవుతుంది. రిజర్వాయర్ నుంచి సుమారు 30 కిలోమీటర్లు ఉన్న ఈ చానల్ ద్వారా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట చెరువుకు, సింగరాయకొండ మండల పరిధిలోని కలికవాయ పంచాయితీలో చవిటిచెరువు, మూలగుంటపాడు పంచాయతీలో జువ్వలగుంట చెరువు, పాకల పంచాయతీ పరిధిలోని కొత్తచెరువు, పాంచ్ చెరువు, సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని రాజు చెరువు, మర్రిచెరువు, కొండ్రాజుగుంట చెరువు, బింగినపల్లి పంచాయతీలోని బింగినపల్లి చెరువుకు నీరు సరఫరా అవుతుంది. ఈ చెరువుల పరిధిలో సుమారు 7 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా సుమారు 10 వేల ఎకరాలలో అనధికారికంగా సాగవుతోంది. ఈ చానల్ పరిధిలోని చెరువుల కింద ప్రధానంగా రబీలో వరి సాగు చేస్తారు. చెరువులు ఏటా రెండు సార్లు నిండితేనే ఆయకట్టులో పంట పూర్తిగా పండుతుంది. పూడికతో ఉన్న చానల్,రిజర్వాయర్.. రిజర్వాయర్ వద్ద ఇసుక మేట కారణంగా వర్షపునీటిని రిజర్వాయర్‌లో నిల్వ చేసే పరిస్థితి లేదు. రిజర్వాయర్‌లో పూడిక తీయాలని ఆయకట్టు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదు. రిజర్వాయర్ కందుకూరు నియోజకవర్గ పరిధిలో ఉండటంతో పాటు రిజర్వాయర్ చుట్లూ చుట్టు పక్కల గ్రామాల రక్షిత మంచినీటి పధకం బోర్లు ఉండటంతో తమ మంచినీటి స్కీములు దెబ్బతినే అవకాశం ఉందని ఆ ప్రాంత ప్రజలు అడ్డుపడటంతో రాజకీయ ప్రాబల్యం కారణంగా పూడికతీయక పోవటంతో చానల్ సక్రమంగా పారక ఆయకట్టు సక్రమంగా పండటం లేదని రైతులు వాపోతున్నారు. నాడు రెండు పంటలు.. పీబీ చానల్లో పూడిక పేరుకు పోయి ఉండటంతో సుమారు పాతికేళ్ల క్రితం ప్రభుత్వం పై ఆధారపడకుండా ఆయకట్టు రైతులు నడుంబిగించి సొంతంగా చానల్లో పూడిక తొలగించుకుని రెండు పంటలు పండించారు. తరువాత చానల్లో పూడికపేరుకు పోవడం, వర్షాభావ పరిస్థితులు తోడవటంతో ఒక్క పంటే పండిస్తున్నారు. జపాన్ నిధులు మాయం.. చానల్ అభివృద్ధికి 14.23 కోట్ల రూపాయల జపాన్ నిధులు మంజూరయ్యాయి. అయితే కాంట్రాక్టర్ పనులు నాసిరకంగా చేయడంతో పాటు 50 శాతం పనులు కూడా చేయలేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. చివరికి నిధుల వినియోగానికి కాలపరిమితి ముగిసే లోపు 90 శాతం పనులు చేసినట్లు అధికా>రులు ప్రకటించడంతో రైతాంగం విస్తుపోయింది. ప్రశ్నార్థకంగా వరిసాగు.. పీబీ చానల్ పరిధిలోని ఆయకట్టు రైతాంగం గత మూడేళ్లగా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవడంతో ఆయకట్టు రైతులు వరిసాగు కన్నా జామాయిల్ సాగుపై ఆశక్తి చూపుతున్నారు. వర్షాభావ పరిస్థితులు కారణంగా నిరుడు కేవలం 600 ఎకరాలలో వరిసాగు చేయగా, ఈ సంవత్సరం కేవలం 100 ఎకరాలలో వరి కాకుండా వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఏటా చానల్లో సుమారు 10 నుంచి 15 రోజుల పాటు పారగా నిరుడు 5 రోజులు మాత్రమే నీరు పారింది. ఈ సంవత్సరం ఒక్కరోజు కూడా పారలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇరిగేషన్ ఏఈ విజయలక్ష్మి మాట్లాడుతూ రిజర్వాయర్ వద్ద ఆనకట్ట అభివృద్ధికి 20 లక్షల రూపాయలు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఇతర పనులకు ఎటువంటి ప్రతిపాదనలు పంపలేదని చెప్పారు. -
గోదావరిపై మరో రిజర్వాయర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గోదావరి నీటిని వినియోగంలోకి తెచ్చేలా మరో రిజర్వాయర్ నిర్మాణా నికి రంగం సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడ మండలాల మధ్య కుప్టి గ్రామం వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్) శనివారం ప్రభుత్వానికి అందింది. 5.32 టీఎంసీల సామర్ధ్యంతో రూ. 744.44 కోట్ల వ్యయ అంచనాతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయి. దీనిపై నీటిపారుదలశాఖ ఉన్నతస్థాయి పరిశీలన పూర్తయ్యాక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. కడెం ఆయకట్టుకు ధీమా: ఆదిలాబాద్ జిల్లాలో నేరడిగొండ, ఇచ్చోడ మండలాల పరిధిలో రెండు కొండల మధ్య నుంచి కడెం వాగు ప్రవహిస్తుంటుంది. ఈ కొండలను కలుపుతూ ఆనకట్ట నిర్మాణం చేపడితే సుమారు 6.22 టీఎంసీల నీటిని వినియోగంలోకి తేవచ్చని ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ నీటి నిల్వలకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రతిపాదించారు. ఈ ఆదేశాల మేరకు ఎస్ఆర్ఎస్ కన్సల్టెన్సీ డీపీఆర్ సమర్పించింది. గోదావరిపై 394 మీటర్ లెవల్‌తో 5.32టీఎంసీల సామర్ధ్యంతో రిజర్వాయర్ నిర్మించేలా ప్రతిపాదించింది. దీన్ని కడెం ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకోవచ్చంది. కడెం ప్రాజెక్టుకు 13.42 టీఎంసీల కేటాయింపులున్నా ప్రాజెక్టులో పూర్తి నిల్వ సామర్థ్యం 7.2 టీఎంసీలు మాత్రమే. మిగిలిన 6.22 టీఎంసీల నీటిని వాడులేకపోతున్న దృష్ట్యా కుప్టితో ఆ కొరత తీర్చవచ్చని తెలిపింది. రిజర్వాయర్ నిర్మాణంతో 4 గ్రామాల్లోని 1,037 కుటుంబాలు నిర్వాసితుల వుతాయని, మొత్తం నిర్వాసితుల సంఖ్య 3,024గా ఉంటుందని అంచనా వేసింది. నిర్వాసిత గ్రామా లతోపాటు మహుడ, మలకలపాడు, రాయికల్ గ్రామాల్లో మొత్తంగా 2,519.88 ఎకరాల భూమి ముంపు పరిధిలోకి రానుంది. -
తగ్గిన సాగర్ ఇన్‌ఫ్లో
నాగార్జునసాగర్ : సాగర్ జలాశయం నీటి మట్టం 532.80(173.664టీఎంసీలు) అడుగులకు చేరింది. ‡జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు). ఇన్‌ఫ్లో తగ్గడంతో నీటిమట్టం నిలకడగా ఉంది. శ్రీశైలం జలాశయం ఎడమ విద్యుదుత్ ఉత్పాదన కేంద్రం ద్వారా గడిచిన 24 గంటల్లో 5,094 క్యూసెక్కులు విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885.00 అడుగులు(214 టీఎంసీలు). కాగా ప్రస్తుతం 882.80 (203.4270టీఎంసీలు) అడుగులున్నది. ఎగువనుంచి 48,000 క్యూసెక్కుల నీరు జలాశయంలో చేరుతుంది. కొంతనీటిని పోతిరెడ్డి పాడు ద్వారా విడుదల చేస్తున్నారు. రైతులకు అందుబాటులో... సాగర్ ఆయకట్టు రైతులకు 245 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. రబీలో ఆరుతడి పంటలు సాగు చేసేందుకు సరిపోతుందని అధికారులు అంచనావేస్తున్నారు. శ్రీశైలంలో 203 టీఎంసీలు ఉండగా నాగార్జునసాగర్ జలాశయంలో 510 అడుగులు కనీస నీటిమట్టం పైన 42టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. దిగువన గల నీటిని రెండు రాష్ట్రాల్లో గల పలు జిల్లాలకు తాగు నీటి అవసరాలకు మాత్రమే వాడుకునేందుకు వీలుంటుంది. వాస్తవంగా సాగర్ ఆయకట్టుకు రెండు రాష్ట్రాల్లోని కుడి, ఎడమ కాల్వలకు వరి పంటకు గాను ఒక పంటకు 132 టీఎంసీల చొప్పున 264 టీఎంసీల నీరు కావాలి. అదే విధంగా ఆవిరి నష్టం మరో 17 టీఎంసీలు అవసరమవుతాయి. ఈనీటితో కుడికాల్వ కింద 11,74,874 ఎకరాలు, ఎడమ కాల్వ కింద 10,37,796 ఎకరాలు మొత్తం 22,12,670 ఎకరాలకు నీరందుతుంది. ఈ పంటల ద్వారా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.10 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. గత రెండేళ్లుగా సాగర్ జలాశయం నిండకపోవడంతో ఆయకట్టు రైతులు ఆర్థికంగా చితికిపోయారు. ఈ సీజన్లోనైనా ప్రభుత్వం నీటిని విడుదల చేస్తే పంటలను సాగు చేయనున్నారు. నిండుకుండల్లా ఎగువన జలాశయాలు కృష్ణానది పైన గల జలాశయాలు సాగర్ మినహా మిగతావన్నీ నిండుకుండలా ఉన్నాయి. ఆల్మట్టి నుంచి నారాయణపూర్, జూరాల, శ్రీశైలం వరకు పూర్తిస్థాయి నీటి మట్టంతో కళకళలాడుతున్నాయి. ఇకపై ఎగువ నుంచి అదనంగా వచ్చే ప్రతి నీటి బొట్టు సాగర్ జలాశయానికే వచ్చే అవకాశాలున్నాయి. -
పాలేరును పరిశీలించిన ఎన్నెస్పీ ఎస్ఈ
కూసుమంచి : పాలేరు రిజర్వాయర్‌ను ఆదివారం ఎన్నెస్పీ ఎస్ఈ కోటేశ్వరరావు పరిశీలించారు. ఎగువన భారీ వర్షాల కురిసిన కారణంగా రిజర్వాయర్‌కు వరదనీరు వచ్చి చేరుతుండటంతో ఆయన సిబ్బందితో కలిసి సమీప నల్గొండ జిల్లాలోని నర్సింహాపురం వాగును పరిశీలించారు. వరద ఉధృతిని అంచనా వేశారు. రిజర్వాయర్‌కు ప్రమాదం తలెత్తకుండా సిబ్బందిని అప్రమత్తం చేశారు. రిజర్వాయర్‌కు సుమారు 4,000 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో అంతే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం నాయక¯ŒSగూడెం వద్ద ఇ¯ŒSఫాల్ రెగ్యులేటరీ కాలువలో నీటి ప్రవాహాన్ని ఎస్ఈ పరిశీలించారు. పాలేరు రిజర్వాయర్ వద్ద పరిస్థితిని సిబ్బందితో సమీక్షించారు. ఇ¯ŒSటేక్‌వెల్ రింగ్‌బండ తెగి పోయి ఇ¯ŒSటేక్‌వెల్‌లోకి నీరు చేరగా.. దీని గురించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద ఎక్కువైతే ఎడమ కాలువకు నీటి విడుదలను పెంచాలని సూచించారు. ఈ నీటితో చెరువులను నింపనున్నట్లు ఎస్ఈ వివరించారు. ఆయన వెంట డీఈలు మన్మధరావు, వెంకటేశ్వరరావు, జేఈలు రమేష్‌రెడ్డి, నరేందర్, వర్క్ ఇ¯ŒSస్పెక్టర్ వాసూ తదితరులు ఉన్నారు. -
మూసీకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
కేతేపల్లి: ముసీ రిజర్వాయర్‌కు శనివారం సైతం భారీగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో అధికారులు ప్రాజెక్టు 9 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీకి ఎగువ ప్రాంతాలైన హైదరాబాద్, జనగాంతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో మూసీ, బిక్కేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో శనివారం 30 వేల క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మెుత్తం 9 గేట్లను ఎత్తి 35 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి ఇన్‌ఫ్లో 25 వేలకు తగ్గడంతో గేట్లను ఒక అడుగు మేర కిందకు దించారు. ప్రాజెక్టులో నీటిమట్టం 644 అడుగుల వద్ద నిలకడగా ఉండేలా చూస్తు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పర్యాటకుల సందడి మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో సందర్శకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేతేపల్లి, సూర్యాపేట, నకిరేకల్, అర్వపల్లి తదితర మండలాల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు ప్రాజెక్టు వద్దకు వస్తున్నారు. ప్రాజెక్టు వద్ద ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
నీటి వృథా అరికట్టేందుకు చర్యలు
కూడేరు: పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజ ర్వాయర్(పీఏబీఆర్ డ్యాం) నుంచి ధర్మవరం కుడి కాలువకు విడుదల చేసిన నీరు వృథా కాకుండా చర్యలు చేపడతామని కలెక్టర్ కోనా శశిధర్ తెలిపారు. జల్లిపల్లి నుంచి కూడేరు వరకు గల 25 కిలో మీటర్లు పొడవు గల ధర్మవరం కుడికాలువ గుండా కలెక్టర్ పర్యటించి కాలువను పరిశీలించారు. 7.5 , 10, 12వ కిలో మీటర్ల వద్ద కాలువకు ఒక్క పక్క కొంత దూరం గోడను నిర్మించకపోవడాన్ని కలెక్టర్ గమనించారు. ఎందుకు గోడ నిర్మించలేదు. ఇలాగైతే నీరు వృధా కాదా. వేగంగా నీరు ముందుకు ఎలా ప్రవస్తుందని అధికారులను ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చెక్ డ్యాంలా గోడను నిర్మంచేందుకు చర్యలు చేపట్టాలని హెచ్ఎల్సీ అధికారులకు సూచించారు. 15వ కిలో మీటర్ వద్ద కలగళ్ళకు చెందిన రైతులు గోపాల్, ప్రభాకర్, నారాయణలు కలెక్టర్‌ను కలిశారు. కుడికాలువ కింద తగ్గు భాగంలో తమ పొలాలు ఉన్నాయని , కాలువకు నీరు విడుదల చేసినపుడు నీరు లీకై పొలంలోకి రావడంతో పంటలన్నీ దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లీకేజీలకు మరమ్మతులు చేపట్టి తమ పంటలను కాపాడాలని విన్నవించుకున్నారు. చెరువులన్నింటికీ నీరందించడమే లక్ష్యం : 112 కిలోమీటర్లు పొడవునా గల కుడికాలువ కింద ఉన్న 49 చెరువులన్నింటినీ పూర్తి స్థాయిలో నింపడమే లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ విలేకరులకు తెలిపారు. ధర్మవరం కుడి కాలువకు గత ఏడాది రోజు సుమారు 700 క్యూసెక్కులు వరకు నీరు విడుదల చేస్తే లీకేజీల వల్ల ధర్మవరం చెరువుకు వెళ్లే సరికి 300 క్యూసెక్కులే మిగిలేవన్నారు. ప్రస్తుతానికి ఉన్న బడ్జెట్‌తో అత్యవసర ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. నీటిని విడుదల చేసినపుడు హెచ్చెల్సీ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు సమిష్టిగా పని చేస్తు పక్కా ప్రణాళికతో నీరు వృధా కాకుండా ముందుకు సాగేలా చూడాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట హెచ్చెల్సీ ఎస్ఈ శేషగిరిరావు. ఈఈ మగ్బుల్ బాషా, డీఈఈ ఏడు కొండలు, డీఈలు శ్రీధర్, మరళి, రమణ, మూర్తి, ఆర్డీఓ హుసేన్ సాహెబ్, డీపీఆర్ఓ జయమ్మ, ఆత్మకూరు ఎస్ఐ , ఏఎస్ఐ రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పైరుకు ప్రాణం
గద్వాల/ధరూరు: జూరాల ఆయకట్టులోని పంటలు ఇక కళకళలాడనున్నాయి. ఎగువప్రాంతాల నుంచి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో మంగళవారం కుడి, ఎడమ ప్రధానకాల్వల ద్వారా ఖరీఫ్ పంటలకు నీటిని వదిలారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులను దాటి కృష్ణానది పరవళ్లు రాష్ర్టంలోకి అడుగుపెట్టాయి. బుధవారం సాయంత్రం జూరాల రిజర్వాయర్‌కు భారీ స్థాయిలో ఇన్‌ఫ్లో చేరనుంది. కాగా, ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్‌లో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరడంతో 15 క్రస్టుగేట్లను ఒక మీటరు ఎత్తి దిగువనదిలోకి 72,298 క్యూసెక్కుల ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుక ఇన్‌ఫ్లో 68,252 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దీంతో నారాయణపూర్ ప్రాజెక్టులో నీటినిల్వ గరిష్టస్థాయికి చేరడంతో 25 క్రస్టుగేట్లను ఎత్తి దిగువనదిలోకి 36,478 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ నుంచి విడుదలైన భారీ వరద ప్రవాహం బుధవారం జూరాల ప్రాజెక్టుకు చేరనుంది. జూరాల జలవిద్యుత్ కేంద్రంలో ఉన్న 234 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన ఆరు టర్బయిన్ల ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభించేందుకు జెన్కో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియ జరిగితే కృష్ణమ్మ పరవళ్లు గురువారం నుంచి శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్‌కు చేరడం ప్రారంభం కానుందని అధికారులు చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం: జెడ్పీచైర్మన్ భాస్కర్ రాష్ట్రప్రభుత్వం రైతుల ప్రయోజనాలు, సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిస్తుందని జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన జూరాల ప్రధానకాల్వల ద్వారా ఖరీఫ్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తూ కొత్తగా నిర్మితమైన ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కృష్ణా, తుంగభద్ర, భీమా ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందించే పనులను పూర్తిచేయడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు. కొత్త ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేసి లక్షలాది ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటిని అందించడంతో పా టు జిల్లాలో భూగర్భజలాల అభివృద్ధి, తాగునీ టి సమస్యను తీర్చేందుకు కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుభాన్, శాంతి, జెడ్పీటీసీ సభ్యుడు పద్మా వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షులు సీసల వెంకట్‌రెడ్డి, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించే సమయం లో ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలన్న ప్రొటోకాల్ తెలియదా? అని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ జూరాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూరాల ప్రధానకాల్వకు నీటి విడుదలను ఎమ్మెల్యే అరుణ ప్రారంభించారు. ఆమెతో పాటు అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కాదని, ప్రజలకు సేవలందించడం ద్వారానే గుర్తింపు వస్తుందన్న వాస్తవాన్ని గమనించాలన్నారు. రైతులకు సేవలందించడంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల సాధనలో తాము ముందున్నామన్నారు. పోటాపోటీగా..! జూరాల ప్రాజెక్టు జాతికి అంకితమైన 18ఏళ్ల తరువాత మొదటిసారి ప్రధానకాల్వ ద్వారా ఆయకట్టుకు నీటి విడుదలను ఒకేరోజు వేర్వేరు సమయాల్లో ఇద్దరునేతలు ప్రారంభించారు. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మంగళవారం మధ్యాహ్నం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ప్రారంభోత్సవానికి వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులకు సమాచారమిచ్చారు. మధ్యాహ్నం 3గంటలకు జెడ్పీచైర్మన్ జూరాల ప్రాజెక్టుకు చేరుకొని కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేసే గేట్లకు పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో పాటు అక్కడికి సాయంత్రం 4గ ంటలకు చేరుకున్నారు. కనీసం ప్రోటోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వకుండానే ప్రారంభించడంపై అక్కడున్న అధికారులపై ఎమ్మెల్యే అరుణ మండిపడ్డారు. ప్రారంభించిన కాల్వగేట్లకు మరోసారి పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. స్థానికులు ఇదేమిటని చర్చించుకున్నారు. -
అనగనగా ఒక చేప
అనగనగా ఓ చేప.. పెన్నహోబిలం రిజర్వాయర్ నుంచి వస్తూ..వస్తూ.. నీటి ప్రవాహం ఆగిపోవడంతో అనంతపురం సమీపంలోని కెనాల్ వద్ద ఆగిపోయింది. దాని వెనకే మరికొన్ని చేపలు. అప్పటికే కొండెక్కిన చికెన్, మటన్ ధరలతో మాంసం ముక్క రుచి చూడని వారికి చేపల విషయం తెలిసింది. అంతే.. కెనాల్లోకి దిగి చేపలు పట్టసాగారు. ఒక దాని కోసం వెళితే మరొకటి దొరికినట్లు.. చేప కోసం వెళితే ఎండ్రకాయా దొరికింది. వాటిని పట్టుకున్నాక.. ఇంటికి తీసుకెళ్లి వండాలా? ఇక్కడే కాల్చుకుతినాలా? ఈ ప్రశ్నకు జవాబు దొరికేలోగా కొంత మంది అట్ట ముక్కలు, కంపలు తీసుకొచ్చి మంట పెట్టారు. ఎంచక్కా.. ఎండ్రకాయల్ని కాల్చుకు తిని.. ‘అబ్బ.. ఏముందిరా’ అనుకుంటూ చేపల్ని ఇంటికి తీసుకెళ్లిపోయారు. - న్యూస్‌లైన్, అనంతపురం -
బీడు.. గోడు
బీడు భూముల్లో బంగారం పండించేలా చేస్తామని భీమాలిఫ్ట్-2ను ఆశగా చూపారు. అప్పటి భారీనీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య 2006లో దీనికి భూమిపూజ చేశారు. మెల్లగా ఓ ఏభైశాతం పూర్తి చేశారు. అక్కడితో సరి..పనులు నిలిచి పోయాయి. ఇక మిగిలినవి హామీలే. ఇలా ఏళ్లు గడుస్తున్నాయి. సీజన్లు నడుస్తున్నాయి. అన్నదాతలకు మాత్రం సాగునీరు కలగానే మారుతోంది. ప్రభుత్వ ఉదాశీనతకు ...ప్రజాప్రతినిధుల అలక్ష్యానికి సాక్ష్యంగా నిలుస్తోంది. వనపర్తిరూరల్, న్యూస్‌లైన్ : వనపర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు కొత్తకోట శంకర సముద్రం నుంచి పెబ్బేరు మండలం రంగ సముద్రం రిజర్వాయర్‌కు నీరు పారే రాజీవ్ భీమాలిఫ్ట్-2, శంకర సముద్రం ప్రధాన ఎడమకాల్వలో నీరు పారితే వనపర్తి మండలం పెద్దగూడెం, కడుకుంట్ల, కిష్టగిరి, మెంటపల్లి, రాఘవేంద్రకాలనీ, నీచహళ్లి గ్రామాల్లోని 35వేల సుమారు ఎకరాలరు సాగునీరు అందుతుంది. 2006 ఏప్రిల్ 04వ తేదిన అప్పటి రాష్ట్ర భారీ, మధ్య తరహా నీటి పారుదల శాఖ మంత్రి పొన్నల లక్ష్మయ్య కాల్వ నిర్మాణంను పెద్దగూడెం గ్రామ శివారులో భూమిపూజ చేశారు. 50శాతం పనులు పూర్తయిన తర్వాత కాల్వ నిర్మాణం నిర్లక్ష్యానికి గురైంది. దీంతో ఎనిమిదేళ్లు కావస్తున్నా నేటికీ చుక్కనీరు పారడంలేదు. భీమా కాల్వలో నీరొస్తాయి మా పొలాల్లో పంటలు పండుతాయని ఎదురుచూస్తున్న ఈ నాలుగు గ్రామాల్లోని వందలాది మంది రైతుల ఆశలు అడి ఆశలుగానే మిగిలాయి. వనపర్తికి అతిసమీపంలో కృష్ణానది ఉన్నా ఇక్కడి ప్రజలకు వ్యవసాయానికి నీరులేక రైతులు అల్లాడుతున్నారు. ఉన్న ఒక్క అవకాశాన్ని వినియోగించుకునేందుకు నాయకులు సహకరించటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ ఉన్న నీటిని బట్టి సాగు చేస్తూ మిగతా భూమిని బీడు గా వదిలేస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరుబావుల తవ్వటానికి రూ.వేలల్లో వెచ్చించాల్సి వస్తోందని అలా వెచ్చించినా అవి ఎన్నాళ్లు పని చేస్తోందో తెలియని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఈ కాల్వ నిర్మాణంపై రైతులు, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు స్పందించి అధికారులపై వత్తిడి తీసుకురావటానికి భీమా కార్యాలయాల్లో కనీసం ఒక్కటికూడా వనపర్తి మండలం, పట్టణంలో లేవు. అన్ని కార్యాలయాలు గద్వాలలో ఏర్పాటు చేయటం వలన అధికారులపై రైతులు వత్తిడి తీసుకువచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో రైతులు ప్రజా ప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. అయినా స్పందన లేక పోవటంతో ఆశలు వదులుకుని ఉన్నంతలో వ్యవసాయం చేసుకోవటం లేకుంటే పట్టణం బస్సు ఎక్కటం లాంటి రెండు మార్గాలను అనుసరిస్తున్నారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్నా మాగోడుపట్టించుకోరా.. గత ఏడేళ్లుగా కాల్వనీళ్లొస్తాయి పుష్కలంగా పంటలు పండుతాయని ఎదురుచూస్తున్నాం. కానీ నీళ్లు వచ్చేలా లేవు. మాగోడు పట్టించుకోవాల్సిన వారు వినిపించుకునేలా లేరు. ఉన్న భూమినంతా సాగు చేసుకునేందుకు నీళ్లు చాలటం లేదు. కాల్వనీళ్లొస్తే మా గ్రామంలో ప్రతికుంటా పంట పండుతుంది. - చంద్రయ్య, రైతు, కడుకుంట్ల భూములంతా ప్లాట్లుగా మారిన తర్వాత కాల్వకు నీరిస్తారా భీమాకాల్వకు నీళ్లురావు మా భూముల్లో పంటలు పండించేలేదు. అని పలువురు రైతులు ఇప్పటికే భూములను ప్లాట్లుగా చేసి వ్యాపారులకు అమ్మేశారు. ఇంకా కొన్నాళ్లు పోతే అందరూ పొలాలను అమ్ముకుని పట్టణాలకు పోతారు. ఆ తర్వాత కాల్వ పనులు పూర్తిచేసి నీరు వదిలినా ప్రయోజనం ఎవరికి ఉంటుంది. - బజార్, రైతు, కడుకుంట్ల -
ముంపు ముప్పు ఏది కనువిప్పు
గట్టు, న్యూస్‌లైన్: ఉన్న ఊరు..పుట్టి పెరి గిన ఊరిలో ఉండలేక ఆలూరు వాసులు ముంపు భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ ముంపు గ్రామమైన ఆలూరులో ఇప్పటికే వందలాది ఎకరాల్లో పం టలు నీటమునిగాయి. అయినా అధికారులకు కనువిప్పు కలగడం లేదు. పునరా వాసచర్యలను వేగవంతం చేసి బాధితుల కు స్వాంతన చేకూర్చులనే కనీసం ధర్మా న్ని విస్మరించారు. రిజర్వాయర్‌కు నీటి విడుదల కొనసాగుతుండటంతో ఇప్పటి కే ఆలూరు స్టేజీ నుంచి గ్రామానికి వెళ్లే ర హదారి పూర్తిగా నీటమునిగింది. అలాగే స్టేజీ మీద ఉండే కొత్తకాలనీ వాసులు చు ట్టు తిరిగి ఊళ్లోకి రావాల్సి వస్తుంది. అయినప్పటికీ అధికారులు ర్యాలంపాడు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. గ్రామ సమీపంలోకి నీళ్లు చేరడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కా లం గడుపుతున్నారు. మరోవారం రోజు ల పాటు నీటి పంపింగ్ కొనసాగితే పూర్తి గా గ్రామంలోకి పూర్తికా నీళ్లొచ్చే అవకాశం ఉంది. పూర్తికాని పునరావాసం నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణం లో భాగంగా ర్యాలంపాడు రిజర్వాయర్ కు సమీపంలో ఉన్న ఆలూరును ముంపు ప్రాంతంగా ప్రకటించారు. ఇక్కడ మూ డువేల మంది నివాసం ఉంటున్నారు. ఇ ప్పటికే ముంపు బాధితులకు పరిహారం కూడా అందజేశారు. అయితే పునరావాస కేంద్రంలో సౌకర్యాలు కల్పించకుండానే కేవలం పట్టాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో ఆలూరు నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. ఇచ్చి న పట్టాలకు పునరావాస కేంద్రంలో నెం బర్లు కేటాయించలేదని గ్రామస్తులు వా పోతున్నారు. రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీటిమట్టం పెరుగుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉన్న ఊరును ఖా ళీ చేద్దామంటే పునరావాస కేంద్రంలో ప నులు పూర్తి కాలేదు. అలాగే పాఠశాలకు సమీపంలోకి నీళ్లు చేరడంతో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా ఆం దోళన చెందుతున్నారు. ఆట విడుపు స మయంలో విద్యార్థులు రిజర్వాయర్ నీటి వైపు వెళ్లకుండా ఉపాధ్యాయులు కా పాలాకాయాల్సి వస్తోంది. స్టేజీ వద్ద కొత్తకాలనీలో ఉన్న ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు కూతవేటు దూరంలో ఉన్న పాఠశాలకు కిలోమీటన్నర చుట్టూ తిరిగి రావాల్సి వ స్తుంది. పంట నీటిపాలు ర్యాలంపాడు రిజర్వాయర్ కింద పం టలు సాగుచేయొద్దని అధికారుల ముం దస్తుగా చెప్పని కారణంగా ఆలూరు రైతు లు ఈ ఏడాది ఖరీఫ్‌లో పెద్ద ఎత్తున పం టలు నష్టపోవాల్సి వచ్చింది. మరో మూ డు నెలలు గడిస్తే కేవలం సీడ్ పత్తి ద్వారా ఈ రైతులు సుమారు కోటిన్నర విలువైన పంటను పండించేవారు. ర్యాలంపాడు రి జర్వాయర్కు నీటి విడుదల కారణంగా 60 ఎకరాల్లో సాగుచేసిన పత్తి పంట మొ త్తం నీటిలో మునిగిపోయింది. దీంతో సుమారు తీవ్రనష్టం వాటిల్లినట్లయింది. కళ్లెదుటే నీటమునుగుతున్న పంటను చూస్తూ ఉండలేక కొందరు రైతులు కా యలు పట్టిన పత్తి మొక్కలను పెరికి గడ్డ కు వేసుకుంటున్నారు. మరికొందరు ప త్తి కాయలను తెంచి ఇంట్లో ఆరబెట్టుకుం టున్నారు. వీటితో పాటు ఆముదం, వరి, జొన్న, వేరుశనగ తదితర పంట పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దీంతో బాధిత రై తులు లబోదిబోమంటున్నారు. -
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు