బీడు భూముల్లో బంగారం పండించేలా చేస్తామని భీమాలిఫ్ట్-2ను ఆశగా చూపారు. అప్పటి భారీనీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య 2006లో దీనికి భూమిపూజ చేశారు. మెల్లగా ఓ ఏభైశాతం పూర్తి చేశారు. అక్కడితో సరి..పనులు నిలిచి పోయాయి. ఇక మిగిలినవి హామీలే. ఇలా ఏళ్లు గడుస్తున్నాయి. సీజన్లు నడుస్తున్నాయి. అన్నదాతలకు మాత్రం సాగునీరు కలగానే మారుతోంది. ప్రభుత్వ ఉదాశీనతకు ...ప్రజాప్రతినిధుల అలక్ష్యానికి సాక్ష్యంగా నిలుస్తోంది.
వనపర్తిరూరల్, న్యూస్‌లైన్ : వనపర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు కొత్తకోట శంకర సముద్రం నుంచి పెబ్బేరు మండలం రంగ సముద్రం రిజర్వాయర్‌కు నీరు పారే రాజీవ్ భీమాలిఫ్ట్-2, శంకర సముద్రం ప్రధాన ఎడమకాల్వలో నీరు పారితే వనపర్తి మండలం పెద్దగూడెం, కడుకుంట్ల, కిష్టగిరి, మెంటపల్లి, రాఘవేంద్రకాలనీ, నీచహళ్లి గ్రామాల్లోని 35వేల సుమారు ఎకరాలరు సాగునీరు అందుతుంది. 2006 ఏప్రిల్ 04వ తేదిన అప్పటి రాష్ట్ర భారీ, మధ్య తరహా నీటి పారుదల శాఖ మంత్రి పొన్నల లక్ష్మయ్య కాల్వ నిర్మాణంను పెద్దగూడెం గ్రామ శివారులో భూమిపూజ చేశారు.
50శాతం పనులు పూర్తయిన తర్వాత కాల్వ నిర్మాణం నిర్లక్ష్యానికి గురైంది. దీంతో ఎనిమిదేళ్లు కావస్తున్నా నేటికీ చుక్కనీరు పారడంలేదు. భీమా కాల్వలో నీరొస్తాయి మా పొలాల్లో పంటలు పండుతాయని ఎదురుచూస్తున్న ఈ నాలుగు గ్రామాల్లోని వందలాది మంది రైతుల ఆశలు అడి ఆశలుగానే మిగిలాయి.
వనపర్తికి అతిసమీపంలో కృష్ణానది ఉన్నా ఇక్కడి ప్రజలకు వ్యవసాయానికి నీరులేక రైతులు అల్లాడుతున్నారు. ఉన్న ఒక్క అవకాశాన్ని వినియోగించుకునేందుకు నాయకులు సహకరించటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ ఉన్న నీటిని బట్టి సాగు చేస్తూ మిగతా భూమిని బీడు గా వదిలేస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరుబావుల తవ్వటానికి రూ.వేలల్లో వెచ్చించాల్సి వస్తోందని అలా వెచ్చించినా అవి ఎన్నాళ్లు పని చేస్తోందో తెలియని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఈ కాల్వ నిర్మాణంపై రైతులు, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు స్పందించి అధికారులపై వత్తిడి తీసుకురావటానికి భీమా కార్యాలయాల్లో కనీసం ఒక్కటికూడా వనపర్తి మండలం, పట్టణంలో లేవు. అన్ని కార్యాలయాలు గద్వాలలో ఏర్పాటు చేయటం వలన అధికారులపై రైతులు వత్తిడి తీసుకువచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో రైతులు ప్రజా ప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. అయినా స్పందన లేక పోవటంతో ఆశలు వదులుకుని ఉన్నంతలో వ్యవసాయం చేసుకోవటం లేకుంటే పట్టణం బస్సు ఎక్కటం లాంటి రెండు మార్గాలను అనుసరిస్తున్నారు.
ఏళ్లుగా ఎదురుచూస్తున్నా మాగోడుపట్టించుకోరా..
గత ఏడేళ్లుగా కాల్వనీళ్లొస్తాయి పుష్కలంగా పంటలు పండుతాయని ఎదురుచూస్తున్నాం. కానీ నీళ్లు వచ్చేలా లేవు. మాగోడు పట్టించుకోవాల్సిన వారు వినిపించుకునేలా లేరు. ఉన్న భూమినంతా సాగు చేసుకునేందుకు నీళ్లు చాలటం లేదు. కాల్వనీళ్లొస్తే మా గ్రామంలో ప్రతికుంటా పంట పండుతుంది.
- చంద్రయ్య, రైతు, కడుకుంట్ల
భూములంతా ప్లాట్లుగా మారిన తర్వాత
కాల్వకు నీరిస్తారా
భీమాకాల్వకు నీళ్లురావు మా భూముల్లో పంటలు పండించేలేదు. అని పలువురు రైతులు ఇప్పటికే భూములను ప్లాట్లుగా చేసి వ్యాపారులకు అమ్మేశారు. ఇంకా కొన్నాళ్లు పోతే అందరూ పొలాలను అమ్ముకుని పట్టణాలకు పోతారు. ఆ తర్వాత కాల్వ పనులు పూర్తిచేసి నీరు వదిలినా ప్రయోజనం ఎవరికి ఉంటుంది.
- బజార్, రైతు, కడుకుంట్ల
బీడు.. గోడు
Published Sun, Jan 5 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement