Bhoomi pooja
-
టీటీడీ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆహ్వానం
సాక్షి, తిరుపతి/ఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పరిధిలో జరగబోయే ఓ కార్యక్రమం కోసం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆహ్వానం వెళ్లింది. టీటీడీలో నిర్మించబోయే ఉడిపి మఠం భూమి పూజకు ఆయన్ని ఆహ్వానించారు బీజేపీ జాతీయస్థాయి సభ్యుడు, ఆ పార్టీ జాతీయ మీడియా ఇంచార్జి పెరిక సురేష్. ఈ మేరకు పలువురు ప్రతినిధులతో కలిసి వెళ్లిన సురేష్.. పార్లమెంట్ హౌజ్‌లో స్పీకర్ ఓం బిర్లాను కలిసి, ఆయనకు శాలువా కప్పి సాదరంగ భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానం అందించారు. ఇదీ చదవండి: కొల్లేరు పక్షుల లెక్క తేలింది -
Anchor Syamala Photos: ఏడాది తిరగకముందే మరో ఇల్లు కడుతున్న యాంకర్ శ్యామల (ఫొటోలు)
-
మరో కొత్త ఇల్లు కట్టబోతున్న యాంకర్ శ్యామల.. భర్తతో కలిసి భూమి పూజ..
యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ప్రముఖ యాంకర్లలో ఆమె ఒకరు. యాంకర్‌గానే కాదు నటిగానూ ఆమె గుర్తింపు పొందింది. టీవీ షోలు, ఆడియో ఫంక్షన్స్ చేస్తూనే మరోవైపు వెండితెరపై సందడి చేస్తు రెండు చేతులా సంపాదిస్తుంది. ఇక ఆమె భర్త కూడా నటుడనే విషయం తెలిసిందే. టీవీ నటుడు యువరాజ్(అలియాస్ నరసింహా)ను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం కూడా యాంకర్‌గా రాణిస్తున్న శ్యామల తాజాగా మరో కొత్త ఇంటికి శ్రీకారం చుట్టింది. చదవండి: అక్క మంచు లక్ష్మిపై మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. ఏ జన్మ పుణ్యమో.. గతేడాది ఓ లగ్జరీ ఇంటిని కోనుగోలు చేసిన ఆమె ఏడాది తిరక్కుండానే మరో ఇంటిని నిర్మించడంపై నెటిజన్ల నుంచి రకరకాలుగా ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. కొత్త ఇంటి కోసం భూమి పూజ చేసిన ఫొటోలను తాజాగా షేర్ చేసింది. దీనికి ‘మేము కట్టబోయే కొత్త ఇంటికి భూమి పూజ చేశాం’ అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో రీసెంట్‌గానే కదా కొత్త ఇల్లు కొన్నావ్, ఆప్పుడే మరో ఇల్లా? అంత డబ్బు ఎక్కడిది అంటూ తనపై పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: పెళ్లిలో మోహన్ బాబును చూసి ఎమోషనల్ అయిన మౌనిక రెడ్డి ఈ ఫొటోల్లో శ్యామల తన భర్త నరసింహా, కొడుకుతో కలిసి భూమి పూజ చేసింది. కాగా గతేడాది జులైలో ఆమె లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు హోంటూర్ చేసి తన సొంతింటి కల నెరవేరిందంటూ కొత్త ఇంటిని చూపిస్తూ మురిసిపోయింది. ఇప్పుడు తాజా మరో మరో కొత్త ఇంటి కోసం నిర్మాణం చేపట్టడంతో యాంకర్ శ్యామల వార్తల్లో నిలిచింది. View this post on Instagram A post shared by Are Syamala (@syamalaofficial) -
సాకారమవుతున్న స్వప్నం
సాక్షి ప్రతినిధి, కడప: ‘మనందరి చిరకాల స్వప్నం సాకారమౌతోంది. వేలాది మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు మన ముంగిట్లోకి రానున్నాయి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేవుడి దయతో ఇవాళ వైఎస్సార్ జిల్లాలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. పెద్ద ఎత్తున జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ నేపథ్యంలో, వీలైనంత తక్కువ మందితో జరపాల్సి వచ్చిందన్నారు. ‘మమ్మల్ని కూడా పిలవండని కార్యకర్తలు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని అడుగుతున్నారు. కోడ్ అడ్డంకిగా ఉందన్న విషయాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ప్రతి అన్నకు, తమ్ముడికి పేరుపేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు’ అని చెప్పారు. స్టీల్ ప్లాంట్ వస్తే ఆ ప్రాంతం ఏ విధంగా నగరంగా మారిపోతోందో గమనించామన్నారు. విశాఖపట్నం తీసుకున్నా, కర్ణాటకలోని విజయనగర్ పక్కన జిందాల్ ఫ్యాక్టరీ చూసినా, ఇతర ప్రాంతాల్లోని స్టీల్ ప్లాంట్లను గమనించినా.. ఆయా ప్రాంతాలు అభివృద్ధి బాటలో పయనిస్తుండటం చూస్తున్నామన్నారు. ఇక్కడా అదే జరగాలి అని అప్పట్లో నాన్న గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కలలుకన్నారని, ఇక్కడ స్టీల్ ప్లాంట్ కావాలని ఆలోచించారని చెప్పారు. ఆయన చనిపోయాక జిల్లాను ఏ నాయకుడూ పట్టించుకోనందున జిల్లా మొత్తం వెనుకబాటుకు గురవ్వడం మన కళ్లతో మనం చూశామన్నారు. దేవుడి ఆశీస్సులతో, మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక.. మళ్లీ ఈ ప్రాంతానికి ఒక్కొక్కటిగా పరిశ్రమలు రావడంతో మంచి రోజులు వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అగ్రగామి జిందాల్ గ్రూపు – ఇక్కడ నిర్మించబోయే స్టీల్ ప్లాంట్ మరో 24–30 నెలల్లోపు ప్రారంభమవుతుంది. 3 మిలియన్ టన్నుల ప్లాంటును రెండు దశల్లో కట్టడానికి జిందాల్ కార్యాచరణ తయారు చేశారు. రూ.3,300 కోట్లతో మొదటి దశ పూర్తవుతుంది. ఆ తర్వాత రూ.5,500 కోట్లతో సెకండ్ ఫేజ్ మరో ఐదేళ్లలో అందుబాటులోకి వస్తుంది. మొత్తంగా రెండు దశల్లో రూ.8,800 కోట్లతో ఈ ప్రాంతంలో 3 మిలియన్ టన్నుల సామర్థ్యమున్న స్టీల్ ప్లాంట్ వేగంగా నిర్మాణం పూర్తి చేసుకోనుంది. – జిందాల్ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్ 28.5 మిలియన్న్టన్నుల స్టీల్ సామర్థ్యంతో దాదాపు రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులతో స్టీల్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నారు. అటువంటి వ్యక్తి మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ 3 మిలియ¯Œన్ టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించారు. – ఇది ఇక్కడితో ఆగిపోదు. బళ్లారిలో కూడా జిందాల్ గ్రూపు స్టీల్ ప్లాంట్ మొదలు పెట్టినప్పుడు 3 మిలియన్ టన్నుల సామర్థ్యం అనే చెప్పారు. ఇవాళ అది పెరుగుతూ వచ్చి.. 13 మిలియ¯Œన్ టన్నుల ప్లాంట్‌గా సామర్థ్యం పెంచుకోవడంతో ఆ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి రావాలని మనసారా కోరుకుంటున్నాను. రూ.700 కోట్లతో మౌలిక సదుపాయాలు – ఈ ప్రాంతం సముద్ర తీరానికి దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ ప్లాంట్ కోసం ఇక్కడ మిగిలి ఉన్న భూములను రూ.40 కోట్లతో కొనుగోలు చేసి.. దాదాపు 3,500 ఎకరాలు జిందాల్ ఫ్యాక్టరీకి ఇస్తున్నాం. – ఇక్కడ జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీతోపాటు పక్కన అనుబంధ పరిశ్రమల వ్యవస్థ కూడా ఏర్పడుతుంది. ఫలితంగా ఇక్కడో స్టీల్ సిటీ ఆవిర్భవిస్తుందన్న ఉద్దేశంతో గొప్పగా అడుగులు వేస్తున్నాం. ఈ ప్లాంట్‌కు సంబంధించి 67వ నంబరు జాతీయ రహదారిని కలుపుతూ.. ఏడున్నర కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రోడ్డు వేస్తున్నాం. ప్రొద్దుటూరు, ఎరగ్రుంట రైల్వే లైను కోసం కొత్తగా మరో పది కిలోమీటర్ల లైన్ నిర్మాణం కూడా జరుగుతుంది. – ఈ ప్లాంట్ కోసం గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటి సరఫరా కోసం ప్రత్యేక పైపులై¯Œన్ చేపడుతున్నాం. నిరంతరంగా విద్యుత్ సరఫరా కోసం తలమంచిపట్నం సబ్స్టేషన్న్నుంచి ప్రత్యేకంగా 220 కేవీ లై¯Œన్ నిర్మిస్తున్నాం. ఇలా మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ ప్లాంట్ వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. అపారంగా ఉద్యోగావకాశాలు – జిల్లాలో ఇప్పటికే కొప్పర్తిలో 550 ఎకరాలు కేటాయించి.. ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)ను తీసుకొచ్చాం. ఇక్కడకు దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తున్నాయి. ఆ 550 ఎకరాల్లో మొత్తం పరిశ్రమలు వస్తే.. మొత్తంగా లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయి. – ఇప్పటికే అక్కడ రూ.1,100 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 11,500 మందికి ఉద్యోగాలకు సంబంధించిన కార్యాచరణ కూడా వేగంగా జరుగుతోంది. అదే కొప్పర్తిలో జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ పేరుతో 3,155 ఎకరాలను కేటాయించి.. అడుగులు ముందుకు వేస్తున్నాం. అక్కడ రూ.18 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వచ్చే అవకాశాలు సృష్టిస్తున్నాం. తద్వారా అపారంగా.. 1.75 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. – చదువుకున్న ప్రతి పిల్లాడికి మన ప్రాంతంలోనే ఉద్యోగాలు రావాలన్న తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని మీ బిడ్డ ప్రభుత్వం ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చింది. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ అత్యంత అనుకూలం – గడిచిన మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే నంబర్ వ¯Œన్ స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది. 2019 నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇచ్చే ముందు పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల స్థాపనకు చేస్తున్న కృషితో పాటు పారిశ్రామికవేత్తలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ వల్లే మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్ వన్ స్థానంలో స్థిరంగా కొనసాగుతున్నాం. – 2021–22లో 11.43 శాతం గ్రోత్ రేటుతో ఏపీ దేశంలోనే వేగవంతమైన గ్రోత్ రేటు గల రాష్ట్రంగా కూడా మొదటి స్థానంలో నిలిచింది. ఈ రెండు అంశాల ద్వారా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఎంత అనుకూలమో స్పష్టంగా తెలుస్తోంది. – మీకు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి అసౌకర్యం కలిగినా కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే అందుబాటులో ఉంటాం. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ సమస్యను పరిష్కరిస్తుంది. ఇక్కడకు వస్తున్న పెట్టుబడులను మనసారా ఆహ్వానిస్తూ.. పారిశ్రామిక వేత్తలకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నాను. అభివృద్ధిలో వెనుకబడిన ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా ఈ జిల్లా ముఖచిత్రం మారిపోనుంది. ఈ ప్రాంత అభివృద్ధికి ఒక ఆశ కల్పించిన సజ్జన్ జిందాల్‌కు ధన్యవాదాలు. రూ.8,800 కోట్ల పెట్టుబడితో ఆగిపోకుండా మిగిలిన గ్రీన్ హైడ్రోజన్, సోలార్, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల దిశగా కూడా పెట్టుబడులు పెట్టాలని ఆశిస్తున్నాం. ఈ రంగంలో దాదాపు రూ.30 వేల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్ వన్‌గా, అత్యంత వేగవంతమైన గ్రోత్ రేటు కలిగిన రాష్ట్రంగా పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలంగా ఉందనే విషయాన్ని పారిశ్రామికవేత్తలందరూ గమనించాలి. – సీఎం వైఎస్ జగన్ -
ఐఏఎంసీతో హైదరాబాద్‌కు ప్రపంచ ఖ్యాతి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఏర్పాటుతో హైదరాబాద్‌కు ప్రపంచ ఖ్యాతి లభిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. గచ్చిబౌలిలోని ఐకియా వెనుక భాగంలో ఐఏఎంసీకి ప్రభుత్వం కేటాయించిన భూమిలో శాశ్వత భవన నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌తో కలిసి జస్టిస్ రమణ శనివారం భూమిపూజ చేశారు. ఐఏఎంసీకి విలువైన భూమితో పాటు నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయించిన ప్రభుత్వానికి సీజేఐ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాదిలోగా భవన నిర్మాణం పూర్తిచేసుకొని దుబాయ్, సింగపూర్, లండన్ ఆర్బిట్రేషన్ కేంద్రాల తరహాలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ నెల 17, 18 తేదీల్లో దుబాయ్‌లో సెమినార్ ఏర్పాటు చేశామని, అంతర్జాతీయంగా ఆర్బిట్రేషన్ కేసులను ఆకర్షించేందుకు ఈ సెమినార్ దోహదపడుతుందని చెప్పారు. ఐఏఎంసీకి ఇప్పటికే ఆర్బిట్రేషన్ కేసులు వస్తున్నాయని, మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించడంలో ప్రపంచంలోనే మంచి గుర్తింపు సాధించబోతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్రావు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలు, సౌకర్యాలతో నిర్మించబోయే ఈ కేంద్రం నగరానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెడుతుందన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, ఇతర న్యాయమూర్తులు, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్‌అలీ, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సీఎస్ సోమేశ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. -
తిరుమలలో హనుమాన్ జన్మస్థల అభివృద్ధికి భూమిపూజ
తిరుమల: ఆకాశగంగ సమీపంలోని హనుమాన్ జన్మస్థలంలో అభివృద్ధి పనులకు బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి, శ్రీతులసీ పీర్ సేవాన్యాస్, చిత్రకూటం పద్మభూషణ్ శ్రీ రామభద్రాచార్య మహరాజ్, ఆయోధ్య, రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవిందదేవ్‌గిరీజీ మహారాజ్, వీహెచ్‌పీ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కప్పగంతుల కోటేశ్వరశర్మ పాల్గొన్నారు. అనంతరం విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి మాట్లాడుతూ.. 'తిరుమల వేంకటేశ్వరస్వామి పాదాల చెంత హనుమాన్ జన్మ స్థలానికి భూమిపూజ జరిగింది. వేదాలకు పుట్టినిళ్లు ఆంధ్రప్రదేశ్. తిరుమల శ్రీవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ ఆస్థి. వేంకటేశ్వరస్వామి అనుగ్రహం అనుమతి లేనిదే ఏదీ జరగదు. అన్నమయ్య, పురందరదాసు, తరిగొండ వెంగమాంబ వేంకటేశ్వరస్వామిని సాక్షాత్కరించారు. అంజనాద్రే హనుమాన్ జన్మస్థలం అనేది సామాన్యమైన విషయం కాదు. అనేకమంది వేదపండితులు, శాస్త్ర పండితులు పరిశోధించి నిర్థారించారు' అని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. చదవండి: (సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి) టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అంజనాద్రిలో అభివృద్ధి పనులకి భూమిపూజ చెయ్యడం గొప్ప కార్యక్రమం. ఆకాశగంగ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. కోర్టులో దీనిపై స్టే వచ్చిందని అడిగారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ఆలయంలో ఎలాంటి మార్పులు చెయ్యడం లేదు. భక్తులకి సౌకర్యమైన వసతులు ఏర్పాటు చేస్తాము. వివాదాల జోలికి మేము వెళ్లడం లేదు. సీఎం జగన్ హిందూ ధర్మ ప్రచారం పెద్దఎత్తున చెయ్యాలని ఆదేశించాడు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలో 502 ఆలయాలు నిర్మిస్తున్నాము. వెనుకబడిన, బలహీన వర్గాలున్న ప్రాంతాలలో ఆలయాలు నిర్మాణం చేస్తున్నాము. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తున్నాము. స్వామి ఆశీస్సులు, ఆజ్ఞతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాము' అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. -
జై శ్రీరామ్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్
ఇస్లామాబాద్: అయోధ్యలో జరిగిన రామ మందిర భూమి పూజపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రామ మందిర భూమి పూజ గురించి ట్విటర్ ద్వారా కనేరియా స్పందించాడు. న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో డిస్ప్లే చేసిన రామమందిరం ఫోటోను షేర్ చేసి దానికి ‘జై శ్రీరామ్’ అనే శీర్షికను జోడించాడు. శ్రీరాముడి అందం ఆయన పేరులో కాకుండా వ్యక్తిత్వంలో దాగి ఉందని, శ్రీరాముడు మంచితనానికి, సౌభ్రాతృత్వానికి, ఐకమత్యానికి ప్రతీక అని పేర్కొన్నాడు. Today is the Historical Day for Hindus across the world. Lord Ram is our ideal. https://t.co/6rgyfR8y3N — Danish Kaneria (@DanishKaneria61) August 5, 2020 ఎప్పటి నుంచో వివాదంలో ఉన్న అయోధ్యలో రామ మందిర భూమి పూజ జరగడంతో ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఆనందంగా ఉన్నారని కనేరియా తెలిపాడు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌లో ఆడిన రెండవ హిందూ క్రికెటర్ కనేరియా, అంతకు ముందు అనిల్ దల్పత్ అనే హిందూ బౌలర్ 1980 ప్రాంతంలో పాక్ జట్టు తరుపున ఆడిన హిందూ క్రికెటర్. అనిల్ దల్పత్, కనేరియాకు బంధువు. ఇక రామ మందిరం గురించి కనేరియా వ్యాఖ్యలపై ప్రపంచంలో ఉన్న హిందువులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నా, ఆయన అభిమానులు మాత్రం కనేరియా భద్రత విషయం గురించి ఆందోళన చెందుతున్నారు. ఇక మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడటంతో కనేరియాపై జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ... నిషేధాన్ని ఎత్తివేయాలని పాక్ క్రికెట్ బోర్డును కోరానని, తాను ఒక హిందువు అయినందునే పీసీబీలో మద్దతు దొరకడం లేదని చెప్పాడు. ఓ పాకిస్తాన్ ఆటగాడిపై మూడేళ్ల నిషేధాన్ని పీసీబీ ఇటీవల సగానికి తగ్గించిందని, తన విషయంలో మాత్రం పీసీబీ కఠినంగా వ్యవహరిస్తోందని డానిష్ కనేరియా వాపోయాడు. (గంగూలీని ఆశ్రయిస్తా : పాక్ మాజీ క్రికెటర్) We are safe and no one should have any problem with our religious beliefs. Life of Prabhu Shri Ram teaches us unity and brotherhood. https://t.co/De7VaZ5QhS — Danish Kaneria (@DanishKaneria61) August 5, 2020 చదవండి: అయోధ్య భూమిపూజ: రావణుని గుడిలో వేడుకలు The beauty of Lord Rama lies in his character, not in his name. He is a symbol of the victory of right over the evil. There is wave of happiness across the world today. It is a moment of great satisfaction. #JaiShriRam pic.twitter.com/wUahN0SjOk — Danish Kaneria (@DanishKaneria61) August 5, 2020 -
టైమ్ స్క్వేర్‌పై రాముడి చిత్రాలు.. నిజమేనా?
నూయార్క్ : అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రపంచంలోని కోట్లాది మంది హిందువుల కల. ఆ అపురూప ఘట్టానికి బుధవారం (ఆగస్టు 5) అంకురార్పణ పడింది.ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఉత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో బిల్‌బోర్డ్స్ మీద రామాలయం, రాముడి ఫొటోలు, రామనామం, శంకుస్థాపన జరుగుతున్న వీడియోలను 3డీ పోర్ట్‌రైట్స్‌లో డిస్ప్లే చేసినట్లు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోలు ఫేక్ అని తేలింది. అసలు చిత్రం అసలు టైమ్ స్క్వేర్‌లో బిల్‌బోర్డ్స్ మీద రాముడు ఫోటోలు డిస్ప్లే చేయలేదని ఓ జాతీయ మీడియా వెల్లడించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు నకిలీవని, డిజిటల్ మీడియా ద్వారా మార్ఫింగ్ చేశారని తేల్చిచెప్పారు. అసలు ఫోటోలు ఎలా ఉన్నాయో కూడా చూపించారు. దీంతో టైమ్స్‌స్క్వేర్ బిల్‌బోర్డ్స్ మీద డిస్ప్లే అయిన రాముడు ఫోటోలు ఫేక్ అని తేలిపోయింది. -
రాముడంటే దేవుడు కాదు..
దేశ ప్రజలంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన అపురూప ఘట్టం నేడు నిజమయ్యింది. రామ మందిర నిర్మణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. పరస్పర ప్రేమ, సోదరభావం మీద మందిర నిర్మాణం జరగనున్నట్లు ప్రకటించారు. నేటి చారిత్రత్మాక సంఘటనపై నటి కంగనా రనౌత్ స్పందించారు. దేశ చరిత్రలో ఇది ఒక మరపురాని సంఘటన అన్నారు. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. ‘మందిరం అంటే కేవలం దేవాలయం మాత్రమే కాదు.. అది ఒక భావోద్వేగం. అయోధ్య నాగరికతకు ప్రతీక. దీనికి 500-600 సంవత్సరాల చరిత్ర ఉంది. మందిరం అంటే కేవలం స్తంభాలు, ఇటుకలతో కూడిన ఓ నిర్మాణం కాదు. ఇది మన నాగరికతను ఉన్నతంగా చూపే ఓ చిహ్నం. రాముడు అంటే దేవుడు కాదు. పురుషోత్తముడు. ఒక మహోన్నత వ్యక్తి. అతడు లేకపోయినా.. ఆయన గుణాలు నేటికి జనాలు పాటిస్తున్నారు. ఈ ఆలయం వాటికి చిహ్నం. రామ రాజ్యాన్ని స్థాపించాడు.. దానిని చాలావరకు మహాత్మా గాంధీ అనుసరించారు. ఆ దారిలోనే మనకు స్వేచ్ఛను సంపాదించారు’ అని తెలిపారు కంగనా. (భారత్‌లో లౌకికవాదం ఓడిన రోజు: ఒవైసీ) అయోధ్య రామ మందిరానికి దాదాపు 600 వందల ఏళ్ల చరిత్ర ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని తన మణికర్ణిక బ్యానర్లో కంగనా ‘అపరాజిత అయోధ్య’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. విజయేంద్ర ప్రసాద్ ఇందుకు సంబంధించిన కథను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. ‘నా చిత్రంలో రామ మందిరానికి అనుకూలంగా వ్యవహరించిన ముస్లింలను చూపించబోతున్నాను. ఈ చిత్రంలో దైవం, నమ్మకం అన్నింటికి మించి దేశ ఐక్యతను చూపించబోతున్నాం. కులమతాలకు అతీతమైనది రామ రాజ్యం. అది ఎలా ఉంటుందో మా చిత్రంలో చూపిస్తాం. సినిమాకు సంబంధించిన లోగోను లాంచ్ చేయడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి లేదు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతున్నాం’ అన్నారు కంగనా. అపరాజిత అయోధ్య చిత్రం గురించి ఈ ఏడాది ప్రారంభంలోనే కంగనా ప్రకటన చేశారు. ఈ చిత్రానికి తనే నిర్మత, దర్శకురాలు కూడా. -
అయోధ్య రామ మందిరం భూమి పూజ ఫొటోలు
-
రామరాజ్య స్థాపనకు పునరంకితమవుదాం
సాక్షి, న్యూఢిల్లీ : శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యలో రామ మందిర నిర్మాణం అంటే మర్యాదపురుషోత్తముడైన శ్రీరాముడు తన జీవితంలో ఆచరించి చూపిన సత్య, నైతికత, సౌభ్రాతృత్వం వంటి ఆదర్శ విలువలకు పట్టాభిషేకం చేయడమేనని భావిస్తున్నట్టు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాఖ్యానించారు. అయోధ్యకు రాజుగా శ్రీరాముడు పాటించిన శ్రేష్టమైన , ఆదర్శవంతమైన జీవితం, సమాజంలోని సామాన్యులు, ఉన్నత వర్గాలవారు అనే భేదభావాల్లేకుండా ప్రజలందరికీ అనుసరణీయంగా ఉండేవని అన్నారు. శ్రీరాముడి సత్ప్రవర్తనే కాదు, స్వయంగా పాటించి చూపిన విలువలు భారతీయ చేతనలోని మూలాలను ప్రతిబింబిస్తాయని అన్నారు. (చదవండి : రాముడు అందరి వాడు : ప్రధాని మోదీ) ఇవి మత , ప్రాంత విభేదాల్లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైనవని పేర్కొన్నారు. ఆ విలువలు కాలాతీతమైనవని, నేటికీ సందర్భోచితమైనవని అన్నారు. రామ మందిర నిర్మాణాన్ని ఒక మతపరమైన కార్యక్రమంగా కాక, ఆ ఆలోచనా పరిధుల్ని దాటి మచింత విస్తృతమైన అంశంగా చూడాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ మందిరం ఉన్నతమైన , సనాతనమైన మానవవిలువలకు ప్రతీకగా మనకు ఎల్లప్పుడూ మార్గదర్శనం చేస్తూనే ఉంటుందన్నారు. ఎలాంటి వివక్షకు తావులేకుండా మనమంతా ఒకటని తెలిపే భారతీయ నైతిక విలువలను మనకు నిరంతరం గుర్తుచేస్తూంటుంది. అలాంటి అద్భుతమైన ప్రాధాన్యత గల రామమందిరానికి భూమి పూజ, భారతీయ చరిత్రలో సువర్ణరాక్షలరాలతో లిఖితమైన శ్రీరాముడు పాటించిన విలువల వైభవాన్ని కళ్లకు కడుతూనే ఉంటుందన్నారు. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఈ వివాదంలో న్యాయ, శాంతి పూర్వక పరిష్కారంలో భాగస్వాములైన కక్షిదారులందరికీ పేరు పేరునా అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు. (చదవండి : ఐదు శతాబ్దాల నిరీక్షణ ముగిసింది : యోగి) ‘ఈ సందర్భంగా అయోధ్య స్థల వివాదంలో కక్షిదారుగా ఉన్నటువంటి శ్రీ ఇక్బాల్ అన్సారీ (దివంగత శ్రీ హషీమ్ అన్సారీ గారి కుమారుడు)ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. భారతీయ సాంస్కృతిక విలువల స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ.. ప్రతి ఒక్కరూ గతాన్ని మరచి ముందుకు సాగాలని ప్రజలందరికీ వారు గొప్పమనుసుతో చేసిన విజ్ఞప్తి అభినందనీయం. ఇంతటి చారిత్రకమైన ఈ రోజును.. అన్ని విశ్వాసాల పట్ల పరస్పర గౌరవం, సామరస్యపూర్వక జీవనంతో కూడిన.. కొత్త శకానికి నాందిగా భావించి ముందుకెళ్దాం. ఈ సంకల్పంతో ప్రతి పౌరుడి కలలు సాకారమయ్యే భారతావని నిర్మాణం జరగాలని కోరుకుందాం.ఈ సందర్భంగా, జాతిపిత మహాత్మాగాంధీ ఆలోచించినట్లుగా.. ప్రజాస్వామ్య, ధర్మబద్ధమైన ఆదర్శాలతో ప్రజా శ్రేయస్సును, సమాజంలో ఆనందాన్ని ప్రతిబింబించే, సమాజంలో అందరికీ శాంతిసామరస్యాలు, సమానత్వాన్ని కల్పించే రామరాజ్య స్థాపనకు పునరంకితమవుదామని ప్రతినబూనుదాం’అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. -
రాముడు అందరి వాడు
-
రాముడు అందరి వాడు : ప్రధాని మోదీ
లక్నో, అయోధ్య: దేశ ప్రజలంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న అపూరూప ఘట్టానికి నేడు అంకురార్పణ జరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జై శ్రీరాం నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ నినాదం కేవలం భారత్‌లోనే కాక ప్రపంచం అంతా ప్రతిధ్వనిస్తుంది. ఈ మహత్కార్యం సందర్భంగా దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులందరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మందిర నిర్మాణానికి సంబంధించి భూమి పూజకు నన్ను ఆహ్వానించినందుకు రామ్ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అన్నారు మోదీ. (గత 500 సంవత్సరాల్లో ఆ ఘనత మాత్రం మోదీకే) ‘నేడు ప్రతి ఒక్కరి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. మందిర నిర్మాణం దేశానికి ఒక ఉద్వేగభరితమైన క్షణం. ఏళ్ల తరబడి కొనసాగిన సుదీర్ఘ నిరక్షణ నేటితో ముగియనుంది. ఇన్నేళ్లు ఒక గుడారం కింద నివసించిన రాముడికి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించబోతున్నాం. అయోధ్య చరిత్రలో నేడు ఒక సువర్ణ అధ్యాయం. ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి చిహ్నంగా నిలుస్తుంది. ఆలయం కోట్ల మంది ప్రజల సమిష్టి తీర్మానం శక్తికి ప్రతీక. ఇది భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది. ఈ నాడు దేశమంత రామమయమయ్యింది. మందిర నిర్మాణం కోసం ఎందరో ప్రాణ త్యాగం చేశారు. వారందరి త్యాగాల ఫలితమే నేటి మందిర నిర్మాణం. ఈ రోజు వారందరికి దేశ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అన్నారు మోదీ. (అయోధ్యలో భూమి పూజ: ఒవైసీ వ్యాఖ్యలు) ‘భారతీయ సంస్కృతికి రాముడు ప్రతీక. మందిర నిర్మాణంతో చరిత్ర సృష్టించడమే కాక.. చరిత్ర పునరావృతమవుతోంది. నదిని దాటడానికి రాముడికి గుహుడు సాయం చేశాడు.. గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి కృష్ణుడికి పిల్లలు సాయం చేశారు. అలానే అందరి ప్రయత్నం, కృషితో మందిర నిర్మాణం పూర్తవుతుంది. మందిర నిర్మాణంతో అయోధ్య రూపు రేఖలు మారిపోతాయి. దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడకు వస్తారు. దాంతో ఆర్థికంగా కూడా అభివృద్ధి జరుగుతుంది. మానవుడు రాముడిని విశ్వసించినప్పుడల్లా పురోగతి జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. ఆ మార్గం నుంచి తప్పుకున్నప్పుడల్లా.. విధ్వంసం తలుపులు తెరవబడ్డాయి. మనం అందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలి. అందరి మద్దతు, నమ్మకంతో ప్రతి ఒక్కరి అభివృద్ధిని ఆకాంక్షించాలి’ అని మోదీ కోరారు. ‘అయోధ్యలో నిర్మించబోయే మందిరం శ్రీరాముని పేరు వలే.. భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని నేను నమ్ముతున్నాను. ఇది సమస్త మానవాళిని ప్రేరేపిస్తుందని నా నమ్మకం. రాముడు అందరి వాడు.. ప్రతి ఒక్కరిలో ఉన్నాడు’ అన్నారు మోదీ. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణం శిలాఫలాకాన్ని మోదీ ఆవిష్కరించారు. రామ మందిర నిర్మాణ చిహ్నంగా పోస్ట్‌ల స్టాంప్‌ను విడుదల చేవారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ తదితరులు పాల్గొన్నారు. -
అయోధ్య రామమందిరం: చరిత్రలో లిఖించదగ్గ రోజు
సాక్షి, విజయవాడ : అయోధ్యలో నేడు రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం సంతోషదాయకమని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రతి భారతీయ పౌరుడు కోవిడ్-19 నియమాలు పాటిస్తూ ఇంట్లో దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. బుధవారం అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణ భూమి పూజ నేపథ్యంలో విజయవాడ విశ్వహిందు పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 11.30 నుంచి 1 గంట వరకూ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ.. అయోధ్యలో రామమందిరం నిర్మించటం శుభపరిణామమన్నారు.(అయోధ్య అప్డేట్స్; హనుమాన్ గడీలో ప్రధాని) ‘రామమందిరం నిర్మాణం కోసం 7 సార్లు పోరాటాలు చేసి తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామమందిరం నిర్మాణం కోసం ఈ రోజు భూమి పూజ చేసుకోవటం హర్షించదగ్గ విషయం. 1984లో విశ్వహిందు పరిషత్ రామమందిరం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. 1992 డిసెంబర్ 6వ తేదీన జరిపిన కర సేవ కార్యక్రమంలో దేశ, విదేశాల నుంచి లక్షలాది మందిగా కర సేవలో పాల్గొన్నారు. తాత్కాలిక రామమందిరం ఏర్పాటు చేసి బాలరాముడిని అందులో ప్రతిష్టించారు’. అని గోకరాజు గంగరాజు తెలిపారు. (అయోధ్య రామాలయం: అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు) కాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం భూమి పూజ సందర్భంగా బీజేపీ శ్రేణులు విజయవాడలో సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్సి, స్వీట్లు పంచారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం భారత దేశ ప్రజల చిరకాల వాంఛ అని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రాజు అన్నారు. రాముని జన్మ స్థలంలో రామాలయం నిర్మించడం శుభపరిణామమని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిరానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు. భారత సంస్కృతిని విదేశీయులు నాశనం చేశారని, ప్రపంచంలో అత్యంత పురాతనమైన సంస్కృతి భారతదేశానిదని పేర్కొన్నారు. (అయోధ్య చరిత్రలో దశాబ్దాల పోరాటం.) ‘ప్రపంచానికే భారత్ ఆచార్య వ్యవహారాలు, సంస్కృతి నేర్పిర్పించిన దేశం. భారతదేశంలో పురాతనమైన దేవాలయాలకు పునర్వైభవం ప్రధాని మోడీ తీసుకువస్తారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని దేశ వ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరిగింది. దేశ వ్యాప్తంగా ఉన్న పవిత్ర పుణ్య స్థలాలు నదుల నుంచి మట్టి నీరు తెచ్చి శంకుస్థాపన చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. భరతదేశ చరిత్రలో ఈ రోజు లిఖించ దగ్గ రోజు’. అని శ్రీనివాస్ రాజు అన్నారు. -
అయోధ్య భూమిపూజ: హైదరాబాద్ పోలీసులు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: అయోధ్య రామమందిరం భూమిపూజ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు నగరపోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ.. రామమందిర శంకుస్థాపన సందర్భంగా హైదరాబాద్‌లో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదు. రాజకీయ, సామాజిక ర్యాలీలకు అనుమతి లేదు. సామూహికంగా గుమికూడి పూజలు చేయవద్దు. లడ్డూల పంపిణీకి కూడా అనుమతి లేదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అందరూ పాటించాల్సిందేనని అంజనీ కుమార్ పేర్కొన్నారు. కాగా.. నగరంలో పలు పోలీస్ స్టేషన్స్‌కి సంబంధించిన కమ్యూనల్ రౌడీషీటర్లను పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎలాంటి సంఘటనల్లో పాల్గొనవద్దని పోలీసులు వారిని హెచ్చరించారు. -
భూమిపూజపై ప్రియాంక కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో ఆగస్ట్ 5న రామమందిర నిర్మాణానికి శంకుస్ధాపన సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాముడిని కొనియాడుతూ ట్వీట్ చేశారు. అయోధ్య అంశంపై పార్టీ వైఖరికి సంకేతంగా రాముడు అందరివాడని, అందరి హృదయాల్లో రాముడు ఉన్నాడంటూ మంగళవారం ప్రియాంక ట్వీట్ చేశారు. అయోధ్యలోని రామజన్మభూమిలో బుధవారం జరిగే భూమిపూజ కార్యక్రమం జాతీయ ఐక్యతను చాటే సాంస్కృతిక సమ్మేళనంగా నిలిచిపోతుందని ఆమె వ్యాఖ్యానించారు. నిరాడంబరత, ధైర్యం, సహనం, త్యాగం, అంకితభావాలకు ప్రతీక అయిన రాముడు అందరితో ఉంటాడని ప్రియాంక హిందీలో ట్వీట్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన ప్రియాంక గాంధీ ఆ రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి జరిగే భూమిపూజకు కాంగ్రెస్‌ను ఆహ్వానించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ఈ కార్యక్రమంలో 100 మందికిపైగా వీఐపీలు పాల్గొంటారని భావిస్తున్నారు.అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్వాగతిస్తూ తీర్మానించిన సంగతి తెలిసిందే. చదవండి : బీజేపీ ఎంపీకి ప్రియాంక ఆహ్వానం -
అయోధ్య భూమి పూజ: విశ్వ హిందూ పరిషత్ ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: రామజన్మభూమిలో మందిర పునర్నిర్మాణం కోసం భగవంతుని ఆరాధన ఏ రకంగా చెయ్యాలి అనే దాని గురించి విశ్వహిందూ పరిషత్ సమగ్ర కార్యాచరణ రూపొందించింది. దీనికి సంబంధించిన పత్రికా ప్రకటనను విశ్వ హిందూ పరిషత్ విడుదల చేసింది. అయోధ్య రామమందిర నిర్మాణ ప్రారంభ పూజా కార్యక్రమం రోజున కరోనా నియమాలను పాటిస్తూ ఉత్సవం ఎలా జరుపుకోవాలి అనే విషయాన్ని దానిలో వివరించారు. దీని ప్రకారం ఆగష్టు 5 వ తేదీ(బుధవారం) ప్రధాని నరేంద్రమోదీ సాధు సంతులు, వేద పండితులు, ట్రష్టు సభ్యులు, ఇతర విశిష్ట అతిధులతో కలిసి రామ జన్మభూమిలో శ్రీరామునికి విశేషమైన పూజలు చేస్తారు. ఈ చారిత్రకమైన ఘట్టాన్ని మొత్తం భారతదేశమే కాక యావత్ ప్రపంచం దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. దేశం నలుమూలలలోని పవిత్ర నదులనుంచి సేకరించిన జలాలను, పుణ్య క్షేత్రాల నుంచి సేకరించిన మృత్తికను ఈ పూజా కార్యక్రమంలో వినియోగించనున్నారు. 2020 ఆగష్టు 5 బుధవారం రోజున ఉదయం 10.30 గంటలకు సాధుసంతులు వారి వారి పీఠాల్లో, ఆశ్రమాల్లో, దేశ విదేశాలలో నివసిస్తున్న భక్తులందరూ వారి వారి గృహాల్లో లేదా వారికి దగ్గరలో ఉండే దేవాలయాల్లో, ఆశ్రమాల్లో కలిసి కూర్చుని వారి వారి ఇష్ట దేవతల భజన, కీర్తన, జపము, అర్చనలు చేసి హారతి ఇచ్చి ప్రసాద వితరణ చెయ్యాలని విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే రామ భక్తులకు విజ్ఞప్తి చేశారు. అవకాశం ఉంటే అయోధ్యలో జరుగుతున్న పూజా కార్యక్రమం టీవీలో ప్రత్యక్ష ప్రసారం వస్తున్న సమయంలో చుట్టుప్రక్కల వారందరూ కలిసి వీక్షించే విధంగా ఆడిటోరియంలో గాని, హాల్ లో గాని పెద్ద తెరను ఏర్పాటు చేసుకుని వీక్షించే ప్రయత్నం చెయ్యాలని కోరారు. ఈ సందర్భంగా ఇళ్ళను, ఆశ్రమాలను, పీఠాలను వీలైనంత అందంగా ఉండేటట్లు అలంకరణ చేసి అందరికి ప్రసాద వితరణ చెయ్యండి అని ఆయన విన్నవించారు. అదేవిధంగా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపాలు వెలిగించండి అని రామ భక్తులను కోరారు. రామమందిర నిర్మాణంలో మీ భాగస్వామ్యం ఉండేందుకు ఎంతవరకు విరాళం ఇవ్వగలరో అంత ఇవ్వడానికి సంకల్పం చెయ్యండి అని అన్నారు. ప్రస్థుత పరిస్థితిలో భక్తులు అయోధ్య రావటం చాలా కష్ట సాధ్యమైనందున ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు, ఎవరి ఆశ్రమాల్లో వాళ్ళు ఈ ఉత్సవాన్ని ఘనంగా జరిపించండి అని పిలుపునిచ్చారు. అందుబాటులో ఉన్న ప్రసార మాధ్యమాలన్నిటినీ అధికంగా ఉపయోగించుకొని ఈ విశేష కార్యక్రమంలో సమాజంలోని వ్యక్తులందరూ భాగస్వామ్యం అయ్యేటట్లు చూడండి అన్ని కోరారు. పైన పేర్కొన్న వివిధ రకాలైన పద్దతులలో కార్యక్రమాలు అమలు చేసేటప్పుడు కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా ప్రభుత్వము, స్థానిక అధికారులు విధించిన నియమాలను అందరూ పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని మిలింద్ పరాండే సూచించారు. చదవండి: భూమి పూజకు ముహూర్తం..పూజారికి బెదిరింపు కాల్స్ -
అయోధ్య భూమి పూజకు మోదీ, షెడ్యూల్ ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర భూమి పూజ వేడుకకు అందరూ సన్నద్ధమయ్యారు. బుధవారం నాడు జరగనున్న భూమి పూజ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో పాటు మరికొంత మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రధాని బుధవారం నాడు ఢిల్లీ నుంచి బయలుదేరి రెండు గంటల పాటు అయోధ్య భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. బుధవారం నాడు మోదీ ప్రత్యేక జెట్‌లో ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరతారు. 10.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో మోదీ అయోధ్యకు బయలు దేరతారు. 11.30లకు ఆయన అయోధ్య చేరుకుంటారు. 11:40 గంటలకు హనుమాన్‌గడి ఆలయంలో పూజలు చేయనున్నారు. 10వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ఆయన ఏడు నిమిషాల పాటు గడుపుతారని, ఆ సమయంలోనే ప్రధాని ఆరోగ్యం బాగుండాలని, దేశంలో కరోనా వ్యాప్తి తగ్గాలని వేద మంత్రాలు చదువుతామని హనుమాన్ గడి ప్రధాన పురోహితుడు మహంతి రాజు దాస్ మీడియాకు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు రామజన్మభూమి ప్రాంతానికి ప్రధాని చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12:30 నుంచి 12:40 వరకు భూమి పూజ జరుగుతుంది. మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది. 2:15 గంటలకు తిరిగి ఢిల్లీకి ప్రధాని పయనమవుతారు. భూమి పూజకు ఆహ్వానించిన వారే అయోధ్యకు రావాలని ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ విజ్ఞప్తి చేశారు. నిఘావర్గాల హెచ్చరికల నేపధ్యంలో అయోధ్య భూమిపూజ జరిగే వేదికపై ప్రధానితో పాటు మరో నలుగురికి మాత్రమే చోటు కల్పించనున్నారు. మొత్తం 175 మంది అతిధులకు మాత్రమే ఆహ్వానం అందించారు. యూపీ సీఎం, డిప్యూటీ సీఎం మినహా ఇతర మంత్రులకు ఆహ్వానం అందలేదు. భూమిపూజ కార్యక్రమానికి దేశంలోని 2 వేల ప్రాంతాల నుండి పవిత్రమైన మట్టి, 100 నదుల నుండి నీరు వినియోగించనున్నారు. చదవండి: ‘నాకు తొలి ఆహ్వానం అందడం రాముని కోరిక’ -
కాశీ నుంచి వెండి తమలపాకులు
లక్నో: హిందూ మతంలో తమలపాకులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇళ్లు, ఆలయాలు ఇలా ఎక్కడ ఏ పూజ చేసినా తమలపాకులు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఈ నెల ఐదున అయోధ్యలో జరిగే రామ మందిర భూమి పూజకు కాశీ నుంచి వెండి తమలపాకులు తరలి వెళ్లాయి. నాడు నిర్వహించే భూమి పూజ కార్యక్రమంలో ఈ వెండి తమలపాకులను వినియోగించనున్నారు. వారణాసిలోని కాశీ చౌరాసియా సంఘానికి చెందిన వారు వెండితో ప్రత్యేకంగా ఐదు తమలపాకులను తయారు చేయించారు. ఆ సంఘం అధ్యక్షుడు నాగేశ్వర్ చౌరాసియా వీటిని వేద పండితులకు అందజేయగా.. వారు వీటిని తీసుకుని నేడు అయోధ్యకు బయలుదేరారు. (‘నాకు తొలి ఆహ్వానం అందడం రాముని కోరిక’) అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తిగా రాతితోనే జరగునున్న సంగతి తెలిసిందే. నిర్మాణంలో ఇనుము, ఉక్కు వినియోగించడం లేదని.. మందిర నిర్మాణ పర్యవేక్షకుడు అను భాయ్ సోంపురా తెలిపారు. తాను గత 30 ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్నాను అన్నారు. మందిర నిర్మాణానికి ఇక్కడ లభించే రాళ్లతో పాటు.. రాజస్తాన్ నుంచి కూడా తెప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 5న జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా కేవలం 180 మంది మాత్రమే హాజరవుతున్నారు. -
‘నాకు తొలి ఆహ్వానం అందడం రాముని కోరిక’
లక్నో: అయోధ్యలో రామమందిరం భూమిపూజకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమం కోసం దేశ ప్రజలంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వేడుకకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో మతసామరస్యం వెల్లివిరిసే చర్యలు కూడా తీసుకుంటున్నారు అధికారులు. అయోధ్య భూమిపూజకు సంబంధించిన తొలి ఆహ్వానాన్ని అధికారులు ఓ ముస్లింకు అందించారు. అది కూడా అయోధ్యలోని వివాదాస్పద స్థలం ముస్లింలకే దక్కాలని పోరాడిన ఇక్బాల్ అన్సారీకి. (అయోధ్య చరిత్రలో దశాబ్దాల పోరాటం..) ఈ ఆహ్వానంపై అన్సారీ హర్షం వ్యక్తం చేశారు. ‘నాకు తొలి ఆహ్వానం అందడం ఆ శ్రీరాముడి కోరిక అనుకుంటాను. దీన్ని మనసారా స్వీకరిస్తున్నాను. ఆలయం నిర్మాణం పూర్తయతే.. అయోధ్య చరిత్ర కూడా మారుతుంది. ఎంతో అందంగా తయారవుతుంది. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు ఈ పట్టణాన్ని సందర్శిస్తారు. కాబట్టి స్థానిక జనాభాకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అన్నారు. అయోధ్య ప్రజలు గంగా-జముని నాగరికతను అనుసరిస్తున్నారని, ఎవరిలోనూ చెడు భావన లేదని తెలిపాడు అన్సారీ. ‘ఈ ప్రపంచం నమ్మకం మీదనే నడుస్తోంది. ఈ కార్యక్రమానికి నన్ను పిలిస్తే.. వస్తాను అని నేను ముందే చెప్పాను. అయోధ్యలో ప్రతి మతానికి, వర్గానికి చెందిన దేవతలు ఉన్నారు. ఇది సాధువుల భూమి. రామ మందిరం నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అన్నాడు అన్సారీ. (150 నదుల జలాలతో అయోధ్యకు..) భూమిపూజకు ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అడ్వాణీతోపాటు పలువురు నేతలకు కూడా ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వల్ల రద్దీకి చోటు లేకుండా కేవలం 180 మంది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. -
అయోధ్యకు వెళ్తా.. అక్కడికి మాత్రం వెళ్లను
న్యూఢిల్లీ: ఆగస్టు 5న అయోధ్యలో జరిగే రామ మందిర పునాది కార్యక్రమానికి వచ్చే ఆహ్వానితుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి అయోధ్యకు చెందిన రామ్ జన్మభూమి న్యాస్, ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. 'కరోనా వైరస్ మహమ్మారి మధ్య అయోధ్యలో జరిగే కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోడీ, ఇతరుల ఆరోగ్యం గురించి తాను ఆందోళన చెందుతున్నానంటూ' ఉమాభారతి ట్వీట్ చేశారు. (150 నదుల జలాలతో అయోధ్యకు..) కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీకి చెందిన మరికొందరు ముఖ్యనేతలకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన వార్తలు విన్న తర్వాత ఆమె ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. అయితే భోపాల్ నుంచి యూపీకి రైళ్లో వెళ్తానని అనేక మంది ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని సరయూ నది తీరంలోనే ఉంటానని.. భూమిపూజ జరిగిన చోటు నుంచి అందరూ వెళ్లిపోయిన తర్వాత భూమిపూజ స్థలానికి వెళ్తానని ఆమె స్పష్టం చేశారు. -
150 నదుల జలాలతో అయోధ్యకు..
న్యూఢిల్లీ/అయోధ్య: అయోధ్యలో భవ్య రామాలయం ఈ సోదరుల కల. అది నెరవేరుతుందనే విశ్వాసం నిలువెల్లా నింపుకుని దేశంతోపాటు శ్రీలంకలోని సముద్ర, నదీ జలాలతో పాటు పవిత్ర ప్రదేశాల్లో మట్టిని వీరు సేకరిస్తూ వచ్చారు. ఈ క్రతువును ప్రారంభించిన రాధేశ్యామ్ పాండే, శబ్ద్ వైజ్ఞానిక్ మహాకవి త్రిఫల అనే ఈ అన్నదమ్ముల వయస్సు 70ఏళ్లుపైనే. ఇప్పటివరకు 150కిపైగా నదుల జలాలను సేకరించి, భద్రపరిచారు. చివరికి వారి కల నిజమైంది. మందిర నిర్మాణం ఖాయమైం ది. తాము సేకరించిన జలాలను, మట్టిని తీసుకుని ఆదివారం అయోధ్యకు చేరుకున్నారు. ‘శ్రీరాముని కృపతో మా కల ఫలించింది. 151 నదులు, 8 మహానదులు, 3 సముద్రాల నీటితోపాటు శ్రీలంకలోని 16 పవిత్ర ప్రదేశాల మట్టిని సేకరించాము. వీటి కోసం 1968 నుంచి 2019 వరకు కాలినడకన, సైకిల్, బైక్, రైలు, విమాన ప్రయాణాలు చేశాము. వీటిని ఆ రాముడికి అర్పించుకుంటాం’అని వారు తెలిపారు. మందిరంతో సోదరభావం, సామరస్యం మందిరం ఉద్యమం కారణంగా రాజకీయంగా, సామాజికంగా ఏర్పడిన అంతరం, మందిరం నిర్మాణంతో సమసిపోతుందని ఆలయ ట్రస్టు సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ చెప్పారు. ‘అయోధ్యలో భూమిపూజ రామరాజ్యానికి పునాది కానుంది. శ్రీరాముని జీవితం సోదరభావం, సామరస్యాలతో ముడిపడి ఉంది. ఆలయ నిర్మాణంతో ఇవే విలువలు∙సమాజంలో పెంపొందుతాయి’అన్నారు. అయో«ధ్యలో ఆలయ పరిసరాలను శానిటైజ్ చేస్తున్న సిబ్బంది -
రాంమందిర నిర్మాణంపై శివసేన కీలక వ్యాఖ్యలు
ముంబై : అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని బీజేపీ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటోందని శివసేన ఆరోపించింది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో రామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేపడుతున్నారని దుయ్యబట్టింది. కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న సమయంలో రానున్న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే భూమిపూజ నిర్వహిస్తున్నారని ఆరోపించింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మందిర నిర్మాణంతో పాటు అభివృద్ది పనులను హడావిడిగా చేపట్టారని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం ఆరోపించింది. ఆగస్ట్ 5న అయోధ్యలో నిర్వహించే భూమిపూజకు మందిర నిర్మాణ ఉద్యమంతో మమేకమైన కీలక వ్యక్తులను ఆహ్వానించాలని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే ఈ కార్యక్రమానికి కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా కేవలం 200 మందినే అనుతిస్తారు. చదవండి : టార్గెట్ మహారాష్ట్ర : ప్లాన్ అమలు చేయండి -
బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే సవాల్
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విపక్ష బీజేపీకి సవాల్ విసిరారు. తమ ప్రభుత్వ భవితవ్యం విపక్షం చేతిలో లేదని ప్రభుత్వాన్ని ఎలా కూలదోస్తారో చూస్తానని ఠాక్రే కాషాయపార్టీని హెచ్చరించారు. ఒకట్రెండు నెలల్లో తన ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్నారని, వారిని తన ప్రభుత్వాన్ని పడగొట్టాలని కోరుతున్నానని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఆటో రిక్షా మాదిరిగా మూడు చక్రాలతో సాగుతోందని, పేద ప్రజల కోసం స్టీరింగ్ తన చేతిలో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. మరో ఇద్దరు (కాంగ్రెస్, ఎన్సీపీ) వెనుకనుంచి తమకు మద్దతుగా కూర్చున్నారని అన్నారు. మరి కేంద్రంలో ఎన్డీయే పరిస్థితి ఏంటి? వారికి ఎన్ని చక్రాలున్నాయని ప్రశ్నించారు. గతంలో తాను ఎన్డీయే సమావేశానికి హాజరైనప్పుడు వారికి రైలు తరహాలో 30-35 చక్రాలున్నాయ’ని (పార్టీలు) ఠాక్రే ఎద్దేవా చేశారు. ఇక చైనాతో సరిహద్దు వివాదాన్ని ఠాక్రే ప్రస్తావిస్తూ ఈ అంశంపై దేశానికి ఓ విధానాన్ని నిర్ణయించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించానిని అన్నారు. 20 మంది అమర జవాన్ల త్యాగానికి మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని ఠాక్రే వ్యాఖ్యానించారు. కానీ మనం చైనా యాప్‌లను నిషేధించి సంబరపడ్డామని మోదీ సర్కార్‌కు చురకలు వేశారు. చదవండి : అమెరికా అధ్యక్షుడిపై ఉద్ధవ్ ఠాక్రే సెటైర్లు భూమిపూజకు హాజరవుతా! అయోధ్యలో ఆగస్ట్ 5న రామ మందిర నిర్మాణానికి నిర్వహించే భూమి పూజకు తాను హాజరవుతానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. అయోధ్యలో జరిగే ప్రార్ధనల్లో తాను పాల్గొంటానని ఆయన శివసేన పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్ధారించారు. ‘నేను అయోధ్యకు వెళతా..భూమి పూజలో పాల్గొంటా..ముఖ్యమంత్రి కాకముందూ మందిర నిర్మాణం పట్ల విశ్వాసం ఉందని, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అయోధ్యకు వెళ్లి ప్రార్ధనల్లో పాల్గొంటా’నని చెప్పారు. -
మొదటి ఇల్లు పోలీసు కిష్టయ్య కుటుంబానికే
కరీంనగర్ : కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీలో డబుల్ బెడ్రూం ఇళ్ల స్థలాలకు స్థానిక ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మొట్టమొదటగా తెలంగాణ అమరవీరుడు పోలీసు కిష్టయ్య కుటుంబానికి అందజేస్తామని వినోద్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ప్లాట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.