ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి మరికొద్ది సేపట్లో భూమిపూజ ప్రారంభం కానుండగా తుళ్లూరు మండలంలో ఒక్కసారిగా ప్రకృతి ప్రకోపించింది. మందడం- తాళ్లాయపాలెంలో శనివారం ఉదయం బలమైన ఈదురుగాలులు వీయడంతోపాటు వర్షం కురుస్తుండటంతో భూమి పూజకు స్వల్ప ఆటంకాలు ఎదురయ్యాయి. గాలుల ధాటికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన టెంట్లు కూలిపోయాయి. ఆహుతుల కోసం పేర్చి ఉంచిన కుర్చీలన్నీ చెల్లాచెదురుగా ఎగిరిపోయాయి.