heavy winds
-
‘మహా ప్రళయమే’ ముంచుకొస్తోందా? అనే స్థాయిలో ప్రచండ గాలులు
టోక్యో: ఈ ఏడాదిలో అత్యంత శక్తివంతమైన గాలివాన తుపానుగా అభివర్ణిస్తున్న హిన్నమ్నోర్.. ఇప్పుడు దక్షిణాసియా దేశాలను వణికిస్తోంది. మహా ప్రళయమే ముంచుకొస్తోందా అనే రేంజ్లో ముందుకొస్తోంది తుపాను. జపాన్ వాతావరణ సంస్థ సూచన ప్రకారం.. తూర్పు చైనా సముద్రం నుంచి ఈ బలమైన ఉష్ణమండల తుపాను జపాన్ దీవుల దూసుకువస్తోంది. దీంతో తూర్పు చైనా, జపాన్ సహా పలు దేశాలు, దక్షిణ దీవులు భయాందోళనలకు లోనవుతున్నాయి. సూపర్ టైపూన్ హిన్నమ్నోర్గా నామకరణం చేసిన ఈ శక్తివంతమైన తుపాను.. 50 అడుగుల ఎత్తులో.. గంటకు 160 మైళ్లు(257 కిలోమీటర్ల) వాయువేగంతో దూసుకొస్తోందని అమెరికా జాయింట్ టైపూన్ వార్నింగ్ సెంటర్ ప్రకటించింది. ఈ ప్రభావంతో గాలులు గంటకు 195 మైళ్ల (314 కిలోమీటర్ల) వేగంతో వీస్తాయని హెచ్చరించింది. ఈ ప్రభావం.. చైనా, జపాన్‌తో పాటు ఫిలిప్పీన్స్‌పైనా తీవ్రంగా చూపించనుంది. చిన్న చిన్న ద్వీపాలపై దీని ప్రభావం మరింతగా ఉండొచ్చని భావిస్తోంది. అయితే దక్షిణం వైపు ఉన్న ప్రాంతాలు, భారత్ తీర ప్రాంతాలపై ప్రభావం తక్కువగా చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2.5-minute rapid scan #Himawari8 Infrared images showing Super Typhoon #Hinnamnor as it reached Category 5 intensity while approaching the island of Minamidaitōjima, Japan (station identifier ROMD): https://t.co/oPnRJDgHbY pic.twitter.com/zIkcWGDrEG — UW-Madison CIMSS (@UWCIMSS) August 30, 2022 ఈ ఏడాదిలో వేగం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే దూసుకొచ్చిన 11 తుపానులలో.. హిన్నమ్నోర్ అత్యంత శక్తివంతమైన తుపానుగా పేర్కొంటున్నారు వాతావరణ నిపుణులు. మరోవైపు జపాన్ ఒకినావా నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఈ ఉదయం తుపాను కేంద్రీకృతమై ఉందని, గంటకు 22 కిలోమీటర్ల వేగంతో రియూక్యూ ద్వీపాల వైపు దూసుకొస్తోందని హాంకాంగ్ అబ్జర్వేటరీ ప్రకటించింది. ఇప్పటికే జపాన్ తీర ప్రాంతాల వెంబడి బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్రమక్రమంగా పశ్చిమం వైపు కదులుతూ ఈ తుపాను బలహీన పడొచ్చని అంచనా వేస్తున్నారు. BREAKING: TY #Hinnamnor is now a SUPER TYPHOON in PAGASA. This was based on their 4 PM Daily Weather Update. It will retain its "super typhoon" status as it enters PAR tomorrow, becoming the first storm to do so since #OdettePH (#Rai) in 2021, and the fourth overall since 2015. pic.twitter.com/2TCLDZRlKS — Matthew Cuyugan (@MatthewCuyugan) August 30, 2022 ఇదిలా ఉంటే.. ఆఫ్రికా, కరేబియన్ మధ్య ఉండే అట్లాంటిక్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రశాంతత వాతావరణం నెలకొంది అక్కడ. సాధారణంగా ఆగస్టు నెల తుపాను సీజన్ అయినప్పటికీ.. దాదాపు 25 తర్వాత ఈ రీజియన్‌లో ఇలా ప్రశాంత వాతావరణం కనిపిస్తుండడంపై వాతావరణ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. Super Typhoon #Hinnamnor has rapidly intensified in the Western Pacific Ocean with sustained winds of 150 mph and gusts up to 185 mph and could impact Miyakojima of the Miyako Islands of Okinawa. @JaneMinarWX with the latest. pic.twitter.com/V6Cp4UqDCS — FOX Weather (@foxweather) August 31, 2022 ఇదీ చదవండి: అమెరికాకు గట్టి షాక్ ఇచ్చిన చిన్న ద్వీపం -
గాలివాన బీభత్సం
సాక్షి నెట్వర్క్: తెలంగాణలో శనివారం పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. వడగండ్ల వాన, ఈదురుగాలులు, ఉరుములు, పిడుగుల శబ్దంతో జనం బెంబేలెత్తిపోయారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడ్డారు. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి ఉంచిన ధాన్యం తడిసిపోగా.. ఈదురుగాలులకు చెట్లు, ఇళ్ల పైకప్పులు, విద్యుత్ స్తంభాలు, పౌల్ట్రీఫారాలు నేలకూలాయి. నోటికాడికి వచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్ జిల్లాల్లోని పలుచోట్ల వర్షానికి కొనుగోలు కేంద్రాలు కుంటలను తలపించాయి. వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. చొప్పదండి (కరీంనగర్జిల్లా) : వడగండ్లను చూపిస్తున్న గుమ్లాపూర్ రైతు సిద్దిపేట రూరల్ మండలం తోర్నాలలో కూలిపోయిన పౌల్ట్రీఫాం కళ్లముందే ధాన్యం కొట్టుకుపోవడంతో రైతన్న కన్నీటి పర్యంతమయ్యాడు. టార్పాలిన్ కవర్లు కప్పేందుకు యత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో వడగండ్లు పడటంతో రైతులు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యుత్ తీగలు తెగిపడటంతో పలుచోట్ల సరఫరా నిలిచిపోయింది. సిద్దిపేట జిల్లా తోర్నాల గ్రామంలో పౌల్ట్రీఫాం కుప్పకూలడంతో వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. అలాగే.. నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం గోవూర్ గ్రామంలో పిడుగు పడి కొబ్బరి చెట్టు కాలిపోయింది. భారీ శబ్దం రావడంతో జనం పరుగులు తీశారు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రోడ్డుపై ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అరగంట పాటు గాలివాన బీభత్సం సృష్టించింది. మొత్తానికి అకాల వర్షం రైతులను నిండా ముంచింది. గోవూర్ (నిజామాబాద్జిల్లా) లో పిడుగు పడటంతో కాలుతున్న కొబ్బరి చెట్టు -
ఒమన్ వైపు ‘వాయు’ గమనం
అహ్మదాబాద్: గుజరాత్‌ను భయపెట్టిన ‘వాయు’ తుపాను తన దిశను మార్చుకుంది. అరేబియా సముద్రంలో అల్లకల్లోలం రేపుతున్న ఈ తుపాను ప్రస్తుతం ఒమన్ వైపు పయనిస్తోంది. అయినప్పటికీ, గుజరాత్ తీరం వెంబడి వర్షాలు, గాలుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. ‘వాయు’ తుపాను హెచ్చరికలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఇప్పటికే మూడు లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ‘వాయు’ గమనం మార్చుకున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపినప్పటికీ మరో 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించినట్లు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తెలిపారు. ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని పాఠశాలలు శుక్రవారం కూడా మూసే ఉంటాయని ప్రకటించారు. ‘వాయు’ దిశ మారినప్పటికీ సౌరాష్ట్ర తీరం వెంబడి రాగల 24 గంటల్లో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. అరేబియా సముద్రంలో దాదాపు 900 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న వాయు తుపాను ప్రభావం తొలగిపోయినట్లు భావించలేమని అధికార వర్గాలు చెప్పాయి. వాయు ప్రభావంతో రాష్ట్రంలో ఎటువంటి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు సమాచారం లేదని తెలిపాయి. పోర్బందర్లోని 150 ఏళ్ల నాటి భూతేశ్వర్ మహాదేవ్ ఆలయం తీవ్ర గాలులు, భారీవర్షం ధాటికి కుప్పకూలిందని వెల్లడించాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైల్వే శాఖ 86 రైళ్లను రద్దు చేసి, 37 రైళ్ల ప్రయాణ మార్గాన్ని కుదించింది. -
గుజరాత్‌కు ‘వాయు’ గండం
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ఉత్తరభారతంలో ఒక వైపు సూర్యుడి ప్రతాపంతో జనం అల్లాడుతుండగా మరోవైపు ‘వాయు’తుపాను గుజరాత్ వైపు ప్రచండ వేగంతో దూసుకువస్తోంది. గుజరాత్ తీరంలోని కచ్, సౌరాష్ట్ర ప్రాంతంపై ‘వాయు’ ప్రభావం మరో 24 గంటలు ఉంటుందని, భారీ వర్షాలు కురియడంతోపాటు గంటకు 170 కిలోమీటర్ల వేగంతో తీవ్రగాలులు వీస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా తీరం ప్రాంతాల్లోని పది జిల్లాల లోతట్టు ప్రాంతాలకు చెందిన 3 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎన్డీఆర్ఎఫ్, సైన్యం, నావికా దళం, వాయుసేన ప్రభావిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. ప్రభుత్వం, స్థానిక విభాగాలు అందించే సూచనలు, సలహాలను పాటించి సురక్షితంగా ఉండాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులను ట్విట్టర్లో కోరారు. వాతావరణ శాఖ హెచ్చరిక ‘వాయు’తుపాను అతితీవ్రంగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పోర్బందర్, కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూల మధ్య గురువారం ఉదయం భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. తీరం దాటిన తర్వాత తుపాను సాధారణంగా బలహీన పడుతుంది. ఇందుకు విరుద్ధంగా, ‘వాయు’మరింత తీవ్రంగా మారనుందని తెలిపింది. వెరావల్‌కు దక్షిణంగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ‘వాయు’ గురువారం మధ్యాహ్నం వెరావల్, దక్షిణ ద్వారక మధ్య తీరాన్ని తాకే అవకాశ ముందని తెలిపింది. అరేబియా సముద్రంలో అలలు ఉవ్వెత్తున లేచి తీరాన్ని తాకుతాయని తెలిపింది. అధికార యంత్రాంగం అప్రమత్తం తుపాను హెచ్చరికలతో గుజరాత్, డయ్యూ యంత్రాంగాలతోపాటు కేంద్రం అప్రమత్తమైంది. జాతీయ విపత్తు నిర్వహణ సహాయ దళం(ఎన్డీఆర్ఎఫ్), సైన్యం ప్రభావిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. యుద్ధ నౌకలు, నావికా దళ విమానాలను కూడా సిద్ధం చేశారు. తీరంలోని నౌకాశ్రయాలను ముందు జాగ్రత్తగా మూసివేయాలని ఆదేశించినట్లు ప్రభుత్వం పేర్కొంది. పోర్బందర్, డయ్యూ, భావ్‌నగర్, కెశోద్, కాండ్లా ఎయిర్‌పోర్ట్‌లను 13వ తేదీ అర్ధరాత్రి వరకు మూసివేస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని కొన్ని బస్ సర్వీసులను రద్దు చేసింది. విద్యా సంస్థలకు 12, 13 తేదీల్లో సెలవులిచ్చారు. ఇప్పటికే 70 రైళ్లు రద్దుచేశారు. వచ్చే రెండు రోజులపాటు కొన్ని రైళ్లను రద్దు చేయడమో లేక దారిమళ్లించడమో చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ముంబైకి రాకపోకలు సాగించే 400 విమానాలకు అంతరాయం కలిగింది. జామ్‌నగర్‌కు విమానంలో బయల్దేరిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు -
ప్రకృతి ప్రకోపం.. 23 మంది మృతి
తిరువనంతపురం/లక్నో: దేశవ్యాప్తంగా ప్రకృతి ప్రకోపానికి 23 మంది చనిపోయారు. భారీ వర్షాలు, కొండచరియలు కేరళలో బీభత్సం సృష్టించగా, యూపీలో పెనుగాలులు భారీగా ప్రాణ నష్టం కలిగించాయి. మరోవైపు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, మణిపూర్, మిజోరాం అతలాకుతలమయ్యాయి. యూపీలో 15 మంది, కేరళలో నలుగురు, ఈశాన్య రాష్ట్రాల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. కేరళలో కురుస్తున్నభారీ వర్షాలకు కోజికోడ్ జిల్లా తమరస్సెరి తాలుకాలోని కట్టిపారా గ్రామంలో గురువారం కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. అందులో ముగ్గురు చిన్నారులున్నారు. మరో 10 మంది గల్లంతయ్యారు. దీంతో ఇప్పటి వరకు వర్ష సంబంధ ఘటనల్లో రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 27కు పెరిగిందని ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ వెల్లడించారు. కోజికోడ్, మలప్పురం, కన్నూర్, వాయనాడ్, కసర్గాడ్ జిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఈశాన్యంలో కుండపోత.. గత మూడురోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా వరదలు పోటెత్తాయి. నలుగురు మృతి చెందగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తక్షణమే మరిన్ని మిలిటరీ, ప్రకృతి విపత్తు నిర్వహణ బృందాలను పంపాలని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవదేవ్ విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పొరుగు రాష్ట్రమైన మణిపూర్‌లో వరదల కారణంగా రాజధాని ఇంఫాల్, ఇతర ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలకు శుక్రవారం వరకూ సెలవు ప్రకటించారు. -
ఉత్తరాదిపై ఉరిమిన తుపాను
పట్నా/లక్నో: ఉత్తరాది రాష్ట్రాలపై ప్రకృతి కన్నెర్ర చేసింది. భారీ వర్షాలు, పిడుగుపాట్లు, పెనుగాలులు బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లలో బీభత్సం సృష్టించాయి. ఈ 4 రాష్ట్రాలో 54 మంది మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో చెట్లు కూలకూలాయి. ఇళ్లు, గుడిసెలు నేలమట్టమయ్యాయి. సోమవారం రాత్రి నుంచి తుపాను తీవ్రరూపం దాల్చింది. బిహార్‌లో 19 మంది, ఉత్తరప్రదేశ్‌లో 17 మంది, జార్ఖండ్‌లో 12 మంది, మధ్యప్రదేశ్‌లో నలుగురు, పశ్చిమ బెంగాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. ఈ నెలలో అకాల వర్షాలకు దేశవ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య 290కి చేరింది. బిహార్‌లో బెంబేలెత్తించిన పిడుగులు.. తుపాను ప్రభావం అధికంగా ఉన్న బిహార్‌లో గంటకు 70 కి.మీ.కు పైగా వేగంతో పెనుగాలులు వీచాయి. గయ, ఔరంగాబాద్ జిల్లాల్లో సోమవారం రాత్రి ఐదుగురు చొప్పున మృతిచెందినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. ఇంకా ముంగర్, కతియార్, నవాడా జిల్లాల్లోనూ ప్రాణనష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఔరంగాబాద్‌లో పిడుగుపాటుకు మృతిచెందినవారిలో ఇద్దరు మహిళలున్నారు. గయలో ఇంటి పైకప్పులు, చెట్లు కూలిపోవడంతో మరణించినవారిలో ఇద్దరు మహిళలు, బాలుడు, బాలిక ఉన్నారు. ఇదే జిల్లాలో ఇద్దరు బాలికలు, బాలుడు గాయపడ్డారు. ముంగర్‌లో పిడుగుపాటుకు ముగ్గురు పిల్లలు సహా నలుగురు చనిపోయారు. నవాడా జిల్లాలో పిడుగుపాటు 16 ఏళ్ల బాలిక, 45 ఏళ్ల వ్యక్తిని బలితీసుకుంది. కతియార్‌లో విరిగిపడిన చెట్టు కింద నలిగి 70 ఏళ్ల వృద్ధుడు, 11 ఏళ్ల బాలిక, 45 ఏళ్ల మహిళ మరణించారు. ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేసిన బిహార్ సీఎం నితీశ్‌కుమార్ బాధిత కుటుంబాలకు పరిహారం పంపిణీలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. యూపీలో 17 మంది మృత్యువాత.. యూపీలో 17 మంది మృతిచెందగా, మరో 10 మంది గాయపడినట్లు సీనియర్ అధికారి చెప్పారు. అందులో ఉన్నావ్‌లో ఆరుగురు పిడుగుపాటు, వర్షానికి బలికాగా, రాయ్‌బరేలీలో ముగ్గురు, కాన్పూర్, పిలిబిత్, గోండా జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించినట్లు తెలిపారు. తుపాను ధాటికి రాయ్‌బరేలీ, ఉన్నావ్ జిల్లాల్లో పలు గుడిసెలు నేలకూలినట్లు చెప్పారు. హర్దోయ్–ఉన్నావ్ రహదారిపై చెట్లు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. బాధితులకు సాధ్యమైనంత త్వరగా ఉపశమనం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు ప్రిన్సిపల్ కార్యదర్శి(సమాచార శాఖ) అవినాశ్ అవస్తి తెలిపారు. మరోవైపు, పశ్చిమబెంగాల్లోని మాల్డా జిల్లాలోనూ భీకర గాలులకు ఇళ్లు కూలిపోవడంతో ఇద్దరు మరణించారు. కర్ణాటకలో బీభత్సం మంగళూరు: కర్ణాటకలోని పలు ప్రాంతాలను మంగళవారం వర్షాలు ముంచెత్తాయి. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో వరుసగా మూడోరోజూ భారీ వర్షాలు కురవడంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కర్ణాటక ప్రభుత్వానికి కేంద్రం నుంచి అవసరమైన సాయం అందించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు. మంగళూరులో పరిస్థితిని సమీక్షించామనీ, సహాయక చర్యల్లో పాల్గొనేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) నుంచి అదనపు బృందాలను అక్కడకు పంపుతున్నామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా మంగళూరు నగరంలో వర్షం కురిసిందనీ, అనేక ప్రాంతాల్లో భవనాలు సగం వరకు మునిగాయని అధికారులు చెప్పారు. ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాల్లో విద్యాసంస్థలకు బుధవారం సెలవు ప్రకటించారు. పాఠశాలలో చిక్కుకున్న పిల్లలను పడవల సాయంతో సిబ్బంది కాపాడారు. వందకుపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. మంగళూరులో వరద ప్రాంతాల నుంచి విద్యార్థులను తరలిస్తున్న సిబ్బంది -
ప్రకృతి ప్రకోపానికి 86 మంది మృతి
న్యూఢిల్లీ: బలమైన ఈదురు గాలులు, ఇసుక తుపాను, పిడుగుపాట్లతో సంభవించిన భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, బిహార్ రాష్ట్రాల్లో ఆది,సోమవారాల్లో 86 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. అలాగే 136 మంది ప్రజలు గాయపడినట్లు వెల్లడించింది. మొత్తం మృతుల్లో 51 మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారేనంది. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో 12 మంది, పశ్చిమబెంగాల్లో 14 మంది, బిహార్‌లో ఆరుగురు, ఢిల్లీలో ఇద్ద రు, ఉత్తరాఖండ్‌లో మరొకరు చనిపోయారంది. మరోవైపు మంగళవారం ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్లో వర్షాలు కురవచ్చని అధికారులు చెప్పారు. -
మళ్లీ తుపాను బీభత్సం
న్యూఢిల్లీ: పెనుగాలులు, ఇసుక తుపాను, పిడుగుపాటులతో కూడిన భారీ వర్షం పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో ఆదివారం బీభత్సం సృష్టించింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి కనీసం 43 మంది చనిపోగా, నష్టం కూడా భారీగానే వాటిల్లింది. పశ్చిమ బెంగాల్లో నలుగురు చిన్నారులు సహా 12 మంది మరణించారు. యూపీలో 18 మంది, ఏపీలో 11 మంది, ఢిల్లీలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో గంటకు 100 కి.మీకు పైగా వేగంతో వీచిన పెనుగాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సాయంత్రం నాలుగు గంటలకే చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. నోయిడా, పరిసర ప్రాంతాలు ఇసుక తుపానులో చిక్కుకున్నాయి. దీంతో మెట్రో, రైలు, విమాన సేవలకు అంతరాయం కలిగింది. పిడుగుపాటుకు పలు రాష్ట్రాల్లో వందలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఆదివారం నోయిడాకు సమీపంలోని ఇటాడా గ్రామాన్ని కప్పేసిన ఇసుక తుపాను -
ప్రకృతి ప్రకోపానికి 116 మంది బలి
న్యూఢిల్లీ: రెండు రోజుల వ్యవధిలో ప్రకృతి ప్రకోపానికి యూపీ, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో 116 మంది మృతిచెందగా, 300 మందికి పైగా గాయపడినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, యూపీలకు రాష్ట్రాలకు వర్షం, పెనుగాలుల ముప్పు ఉందని శుక్రవారం తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఇసుక తుపాన్, గాలి వాన, పిడుగుపాటులకు గురువారం ఉత్తరప్రదేశ్‌లో 73 మంది మరణించగా, 91 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ప్రభావిత రాష్ట్రాల్లో సుమారు 12 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరగగా, 2,500 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. మరోవైపు, యూపీలో ప్రకృతి బీభత్సం ఎక్కువగా ఉండడంతో.. కర్ణాటక ఎన్నికల ప్రచారం వాయిదావేసుకుని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హుటాహుటిన లక్నో చేరుకున్నారు. యోగి వేరే రాష్ట్రంలో ప్రచారం చేయడంపై విమర్శలు పెరిగాయి. ‘యూపీ ప్రజలు యోగిని ఎన్నుకున్నది తమ రాష్ట్రంలో పనిచేయమనే.. కర్ణాటక ఎన్నికల ప్రచారం కోసం కాదు’ అని మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా యోగిపై విమర్శలు చేశారు. -
యాదాద్రి కొండపై ఈదురుగాలుల బీభత్సం!
యాదాద్రి: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి కొండపై బుధవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా విరుచుకుపడిన ఈదురుగాలులతో యాదాద్రి కొండపై ఉన్న శాశ్వత పూజల షెడ్డు కుప్పకూలింది. లడ్డూ కౌంటర్ రేకులు గాలిలోకి ఎగిరాయి. దీంతో ఒక భక్తుడు గాయపడ్డాడు. శ్రీరామనవమి పర్వదినం కావడంతో యాదగిరి నరసింహాస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఈదురుగాలులు విరుచుకుపడటంతో భక్తులు ఒక దశలో భయాందోళనకు గురయ్యారు. -
మెట్టకు నష్టం
నిడదవోలు రూరల్/కొవ్వూరు : ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం మెట్ట ప్రాంత రైతులను నిలువునా ముంచేసింది. వాణిజ్య పంటల్ని నేలకూల్చి అపార నష్టానికి గురి చేసింది. మొక్కజొన్న పంటకు భారీ నష్టం వాటిల్లగా.. అరటి, నిమ్మ, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల వరి దుబ్బులు సైతం నేలనంటాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక కొవ్వూరు, నిడదవోలు, చాగల్లు, ద్వారకాతిరుమల, జీలుగుమిల్లి, టి.నరసాపురం, ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొవ్వూరు గరిష్టంగా 18.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాగల్లులో 13.8, ద్వారకా తిరుమలలో 8.8, జీలుగుమిల్లిలో 7.2, నిడదవోలులో 9.2, తాడేపల్లిగూడెంలో 1.2, దెందులూరు 6.2 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 1.3 మిల్లీమీటర్ల సగటు వర్షం కురిసింది. దెబ్బతీసిన ఈదురుగాలులు ఈదురు గాలుల తీవ్రతకు వాణిజ్య పంటలు నేలకొరిగాయి. నిడదవోలు మండలం తాడిమళ్ల, కోరుమామిడి, సూరాపురం, రావిమెట్ల, కంసాలిపాలెం, కాటకోటేశ్వరంలో 800 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలవాలగా, మరో 100 ఎకరాల్లో వరి పంటలకు నష్టం వాటిల్లింది. నేలవాలిన పంట లను మండల వ్యవసాయాధికారి జి.సత్యనారాయణ పరిశీలించారు. నష్టానికి సంబంధించి ప్రాథమిక అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగిపోవడంతో గ్రామాలు అంధకారంలో మగ్గాయి. దెందులూరు మండలం చల్లచింతలపూడి, కొత్తకమ్మవారిగూడెం, కేఎన్ పురం, తిమ్మనగూడెం, పెరుగ్గూడెం, మేదినరావుపాలెం గ్రామాల్లో 300 ఎకరాల్లో మొక్కజొన్న, అరటి పంటలు నేలకొరిగాయి. ఉంగుటూరు మండలం నీలాద్రిపురం, నల్లమాడు, గోపీనాథపట్నం, గొల్లగూడెం, రామచంద్రపురం గ్రామాల్లో 692 హెక్టార్లలో అకాల వర్షాలకు మొక్కజొన్న పంట దెబ్బతింది. అక్కడక్కడా వరిచేలు, అరటి దెబ్బతిన్నాయి. భీమడోలు మండలం పోలసానిపల్లి, సూరప్పగూడెం, అంబర్‌పేట, దుద్దేపూడి, అన్నేవారిగూడెం తదితర గ్రామాల్లో మొక్కజొన్న నేలకొరిగింది. ఎకరానికి రూ.23 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతులు లబోదిబోమంటున్నారు. చివరి దశలో ఉన్న వరి పంటకు సైతం నష్టం వాటిల్లింది. ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. పలు గ్రామాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాగల్లు మండలంలో శనివారం వేకువజామున ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. చాగల్లు, నెలటూరు తదితర గ్రామాల్లో మొక్కజొన్న, ఆరటి తోటలు నేలకొరిగాయి. పలుచోట్ల వరిచేలు కూడా నేలనంటాయి. చిక్కాల, కలవలపల్లిలో మామిడి కాయ లు నేలరాలాయి. చంద్రవరం, మల్లవరంలో అరటి తోటలు పడిపోయాయి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
రెండు రోజులు తీవ్ర వడగాడ్పులు
హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరిక వడదెబ్బకు 50 మంది బలి సాక్షి,హైదరాబాద్: మరో 2 రోజులపాటు రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, నల్లగొండ జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. 4 రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం రామగుండంలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్‌లో గురువారం 40.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో ఒక్క గురువారమే 50 మంది మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లాలో 23 మంది, నల్లగొండ జిల్లాలో పది మంది, వరంగల్‌లో ఏడుగురు, ఆదిలాబాద్‌లో ఇద్దరు, కరీంనగర్లో ముగ్గురు, నిజామాబాద్‌లో ముగ్గు రు, మెదక్ జిల్లాలో ఒకరు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకరు మరణించారు. -
హైదరాబాద్ లో గాలివాన బీభత్సం
హైదరాబాద్: వారంరోజుల కిందటి వర్ష బీభత్సం నుంచి నగరం ఇంకా తేరుకోకముందే శనివారం రాత్రి హైదరాబాద్ అంతటా గాలివాన చిన్నపాటి విలయాన్ని సృష్టించింది. ఉదయం నుంచి ఎండ నిప్పులు కురిపించగా, సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి 9:30 నుంచి ఉరుములు, మెరుపులతో మొదలై భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులతో ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షపు నీటితో రహదారులు జలమయమయ్యాయి. సెక్రటేరియట్ కు సమీపంలోని ఎన్టీఆర్ గార్డెన్స్ ముందు హైమాస్ లైట్ స్తంభం రోడ్డుకు అడ్డంగా ఒరిగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. రామంతాపూర్‌లోని ఇందిరానగర్ వద్ద ఓ చెట్టుపై పిడుగుపడి సగానికి కాలిపోయింది. సికింద్రాబాద్ నామాలగుండు వద్ద చెట్లు కూలి విద్యుత్ స్తంభంపై పడడంతో ట్రాన్స్ఫార్మర్నుంచి మంటలు లేచాయి. ఇక ఎల్బీనగర్, ఉప్పల్, అంబర్పేట్, ఈసీఐఎల్,తార్నాక, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్ , జూబ్లీహిల్స్,బంజారాహిల్స్, అమీర్‌పేట్,కూకట్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి,తదితర ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. రోడ్లు,లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. వంద ఫీడర్ల పరిధిలో కరెంట్ సరఫరా నిలిచిపోయినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. శనివారం వీకెండ్ కావడంతో కాలక్షేపం కోసం బయటకు వెళ్లిన న గరవాసులు తిరిగి ఇళ్లకు చేరుకొనేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇలా ఉండగా, శనివారం పగలంతా భానుడు తీవ్ర ప్రతాపం చూపాడు.మధ్యాహ్నం 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 28.7 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భానుడి భగభగలతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు.దీంతో మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. -
కరెంట్ వైర్లు తెగి పదెకరాల్లో పంట నష్టం
స్టేషన్ ఘన్పూర్ : వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం మీడికొండ గ్రామంలో శనివారం రాత్రి వీచిన భారీ గాలులకు అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ వైర్లు తెగిపడడంతో మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకునే సరికి.... స్థానిక రైతులకు చెందిన సుమారు పది ఎకరాల్లో వరి పంట దగ్ధమైంది. అలాగే, గ్రామంలోని మామిడి తోటలకు కూడా కొంత నష్టం వాటిల్లింది. -
రాజధాని భూమి పూజకు స్వల్ప ఆటంకాలు
-
రాజధాని భూమి పూజకు స్వల్ప ఆటంకాలు
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి మరికొద్ది సేపట్లో భూమిపూజ ప్రారంభం కానుండగా తుళ్లూరు మండలంలో ఒక్కసారిగా ప్రకృతి ప్రకోపించింది. మందడం- తాళ్లాయపాలెంలో శనివారం ఉదయం బలమైన ఈదురుగాలులు వీయడంతోపాటు వర్షం కురుస్తుండటంతో భూమి పూజకు స్వల్ప ఆటంకాలు ఎదురయ్యాయి. గాలుల ధాటికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన టెంట్లు కూలిపోయాయి. ఆహుతుల కోసం పేర్చి ఉంచిన కుర్చీలన్నీ చెల్లాచెదురుగా ఎగిరిపోయాయి. శనివారం ఉదయం 8:49 నిమిషాలకు ముహుర్తం ఖరారుకాగా, ప్రస్తుత వాతావరణ పరిస్థితి అధికారులను కలవరపెడుతోంది. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సతీసమేతంగా రాజధాని ప్రాంతానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. బంగారు తాపీ, వెండి గమేలాతో భూమి పూజ నిర్వహించనున్నారు. -
గాలి వాన బీభత్సం
చోడవరం రూరల్/చోడవరం టౌన్: వర్షం,ఈదురు గాలులు జిల్లాలో శనివారం బీభత్సం సృష్టించాయి. ఏజెన్సీతోపాటు మైదానంలోని పలు ప్రాంతాల్లోనూ గంటల తరబడి దపదపాలుగా వాన పడింది. దానికి భారీ గాలులు తోడవ్వడంతో పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. చెట్ల కొమ్మలు తీగలపై పడి విద్యుత్ సరఫరాకు గంటల తరబడి అంతరాయం ఏర్పడింది. రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. చోడవరం ప్రాంతంలో ప్రభావం పెద్ద ఎత్తున కనిపించింది. పిడుగుపడి డుంబ్రిగుడ మండలం అరకు గ్రామానికి చెందిన గొల్లోరి బిమల(55) అక్కడికక్కడే మృతి చెందింది. చోడవరం మండలం వెంకన్నపాలెం సమీపంలో రోడ్డుకడ్డంగా చెట్లు విరిగి పడి సుమారు గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. గోవాడ సుగర్ ప్యాక్టరీ సమీపంలోనూ చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. చోడవరం-పిఎస్పేట రోడ్డులో విద్యుత్ స్తంభాలు నాలుగు చోట్ల నేల కూలాయి. చోడవరం పట్టణంతోపాటు పరిసర గ్రామాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. తొలుత వడగళ్లు పడ్డాయి. అనంతరం భారీ గాలులతో గోవాడ,అంభేరుపురం, వెంకన్నపాలెం, గజపతినగరంలలో వర్షం కురిసింది. ఇంటిపై కూలిన భారీ వృక్షం గొలుగొండ : మండలంలోని ఆరిలోవ, యర్రవరం, చీడిగుమ్మల ప్రాంతాల్లో భారీ వర్షం కురి సింది. దానికి ఈదురు గాలులు తోడవ్వడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రాజు బాబుల గుడివద్ద పూరింటిపై పెద్ద చెట్టు పడింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. యర్రవరం వద్ద చెట్లుపడటంతో 33కేవీ సబ్-స్టేషన్ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. గొలుగొండకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆరిలోవ ప్రాంతంలో కురిసిన భారీ వర్షం వల్ల ఊర చెరువుల్లోకి నీరు చేరింది. ఈదురు గాలుల వల్ల మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వర్షం సరుగుడు, చెరకుతో పాటు ఇతర పంటలకు అనుకూలమని రైతులు అంటున్నారు. పిడుగుపడి మహిళ మృతి డుంబ్రిగుడ: భారీ వర్షానికి మండలంలో పిడుగుపడి గిరిజన మహిళ మృతి చెందింది. అరకు గ్రామానికి చెందిన గొల్లోరి బిమల(55) కట్టెల కోసం అడవికి వెళ్లింది. తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో ఆమె ప్రమాదానికి గురయి అక్కడిక్కడే చనిపోయింది. విషయం తెలుసుకున్న బంధువులు మృతదేహాన్ని ఇంటికి తరలించారు. ఈ వర్షం తొలకరి దుక్కులకు ఉపయోగపడుతుందని రైతులు అంటున్నారు. ఇళ్లల్లోకి నీరు అరకు రూరల్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలో శనివారం కుండపోత వర్షం కురిసింది. సుమారు గంటసేపు కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పంటపొలాలు నీటమునిగాయి. కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో మురుగునీరు రోడ్డుపై పొంగి ప్రవహించింది. మసీదు కాలనీ, కంఠబౌంసుగుడ, కొండవీధుల్లో ఇళ్లల్లోకి నీరు ప్రవేశించడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మన్యంలో కుండపోత అరకులోయ/పాడేరు : అరకులోయ, పాడేరు పరి సర ప్రాంతాల్లో శనివారం కుండపోతగా వర్షం కురిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా పడింది. పెద్ద పెద్ద పిడుగుల శబ్దానికి ఈదురు గాలులు తోడవ్వడంతో గిరిజనులు భయాందోళనకు గురయ్యా రు. పంట పొలాలన్నీ నీటితో నిండిపోయాయి. ఎండ తీవ్రత నుంచి జనానికి కాస్త ఉపశమనం లభించింది. రోజు వర్షాలు కురుస్తుండటంతో మన్యంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. -
హెలెన్ బీభత్సం
సాక్షి, ఏలూరు : భీకర గాలులు వీచాయి. భారీ వృక్షాలను సైతం కూకటి వేళ్లతో పెకలించాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఇళ్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలి పోయాయి. కల్లోల సాగరం ప్రజలను గజగజ వణికించింది. శుక్రవారం జిల్లాలో హెలెన్ తుపాను సృష్టిం చిన భీతావహ దృశ్యాలివి. వాయుగుండం పెను తుపానుగా మారి ‘పశ్చిమ’ వైపు దూసుకువచ్చి ప్రజాజీవనాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. తుపాను నష్టాలను చూసేందుకు కారులో బయలుదేరిన పెనుమంట్ర తహసిల్దార్ దంగేటి సత్యనారాయణ భట్లమగుటూరు వద్ద గాలుల ప్రభావానికి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్‌కు చెందిన పోతినేని భాస్కరరావు (62)అనే రైతు పొలంలోకి వెళ్లి వస్తుండగా, చెట్టు విరిగి మీదపడటంతో మరణించాడు. నాలుగో బోట్లలో బయలుదేరిన కాకినాడ ప్రాంతానికి చెందిన 31 మంది మత్స్యకారులు దారితప్పి నరసాపురం మండలం చినమైనివానిలంక వద్ద నడిసముద్రంలో చిక్కుకుపోయారు. రాత్రివరకూ వారిని అధికారులు ఒడ్డుకు తీసుకురాలేదు. అనూహ్య అలజడి ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా పశ్చిమ తీరంలోని నరసాపురం సమీపంలో వాయుగుండం కేంద్రీకృతం కావడంతో తీర గ్రామాల్లో అలజడి రేగింది. శుక్రవారం వేకువజాము నుంచి మొగల్తూరు, నరసాపురం మండలాలతో పాటు భీమవరం, యలమంచిలి, కాళ్ల, ఆచంట, వీరవాసరం, పాలకొల్లు తదితర మండలాల్లో 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. 8మండలాల్లో 37 గ్రామాలు తుపాను ప్రభావానికి గురయ్యాయి. ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు నేలకూలడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం 3-4 గంటల మధ్య మచిలీపట్నానికి 10 కిలోమీటర్ల దూరంలో తుపాను తీరం దాటిందని తెలుసుకుని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 2004లో సంభవించిన సునామి ధాటికి చినమైనవానిలంక తీరప్రాంతంలో ఆరుగురు మృతిచెందగా, అప్పట్లో తీరప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తర్వాత 2011లో వచ్చిన థానే తుపాను అలజడి సృష్టించి తీరప్రాంతానికి కోత మిగిల్చింది. రెండేళ్ల తర్వాత తిరిగి హెలెన్ తుపాను తీర ప్రాంతవాసులను సునామీ స్థాయిలో వణికించింది. అపార నష్టం హెలెన్ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 223 ఇళ్లు దెబ్బతిన్నాయి. వాటిలో 14 ఇళ్లు పూర్తిగా కుప్పకూలాయి. మూడిళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 80 కచ్చా ఇళ్లు, 35 గుడిసెలు, మరో 80 ఆవాసాలు చెల్లాచెదురయ్యాయి. వందలాది కొబ్బరి చెట్లు, తాటిచెట్లతోపాటు 62 భారీ వృక్షాలు పూర్తిగా నేలకొరిగాయి. వేలాది చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. 2.25 లక్షల ఎకరాల్లో వరి చేలు నీట మునిగాయి. పనలు, కుప్పలపై ఉన్న 25 వేల ఎకరాల్లో పంట తడిసి ముద్దయ్యింది. 15 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 4,908 మందిని తరలించారు. 40 విపత్తు నివారణ బృందాలు రంగంలోకి దికి సహాయక చర్యలు ప్రారంభించారుు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ భోజనం, 12,730వాటర్ ప్యాకెట్లతో తాగునీటి సదుపాయం కల్పించారు. 71 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి గర్భిణులకు, తుపాను బాధితులకు సేవలు అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 250 విద్యుత్ స్తంభాలు పడిపోడవంతో 14 కిలోమీటర్ల మేర లైన్లు తెగిపోయాయి. శుక్రవారం రాత్రి నుంచి 130 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల నుంచి సరఫరా నిలిపివేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కటిగా సరఫరా పునరుద్ధరించడం ప్రారంభించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీర గ్రామాల్లో అంధకారం అలముకుంది. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ మధ్యాహ్నం వరకూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఏటిగట్లు కోతకు గురయ్యాయి. రోడ్లు ఛిద్రమయ్యాయి.