హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరిక
వడదెబ్బకు 50 మంది బలి
సాక్షి,హైదరాబాద్: మరో 2 రోజులపాటు రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, నల్లగొండ జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. 4 రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
గురువారం రామగుండంలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్‌లో గురువారం 40.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో ఒక్క గురువారమే 50 మంది మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లాలో 23 మంది, నల్లగొండ జిల్లాలో పది మంది, వరంగల్‌లో ఏడుగురు, ఆదిలాబాద్‌లో ఇద్దరు, కరీంనగర్‌లో ముగ్గురు, నిజామాబాద్‌లో ముగ్గు రు, మెదక్ జిల్లాలో ఒకరు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకరు మరణించారు.