
సాక్షి, హైదరాబాద్: ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు కొనసాగుతున్న ద్రోణి గురువారం బలహీనపడిందని... దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గత 24 గంటల్లో గద్వాల జిల్లా జూరాలలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా ఖిలా ఘన్‌పూర్‌లో 4, నల్లగొండ జిల్లా దేవరకొండలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు శుక్రవారం ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం, అదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం కొమురం భీం జిల్లా కుంచవెల్లిలో అత్యధికంగా 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment