today
-
పన్నూ మమ్మల్ని బెదిరించాడు: ఆస్ట్రేలియన్ టుడే
భారతదేశ విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఇంటరర్వ్యూ ప్రసారం చేసినందుకు ఆస్ట్రేలియా టుడే మీడియా సంస్థపై ఇటీవల కెనడా నిషేధం విధించింది. అయితే.. వ్యవహారంపై తాజాగా ఆ మీడియా సంస్థ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్ జితార్థ్ జై భరద్వాజ్ స్పందించారు. ప్రతికాస్వేచ్ఛను హత్య చేయటమేనని జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై మండిపడ్డారు. గుళ్లపై పదేపదే దాడులు జరుగుతున్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నిచారు.‘‘ కెనడా చర్య.. పత్రికా స్వేచ్ఛను హతమార్చటం అవుతుంది. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉంది. విభిన్న అభిప్రాయాలన్నింటినీ చర్చించడానికి, అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికే పత్రికలు ఉన్నాయి. గురుపత్వంత్ సింగ్ పన్నూ మమ్మల్ని బెదిరించాడు. ...ఇతర వేర్పాటువాదుల నుంచి కూడా బెదిరింపులు వచ్చాయి. అమెరికా, కెనడాలో కవరేజీ చేసినందుకు మా చిత్రాలను పన్నూ ఆన్లైన్లో పెట్టారు. అనేక రకాలుగా హాని తలపెట్టమని ఆయన మద్దతుదారులను ఉసిగొల్పారు. అయినా.. మేం భయపడకుండా నిరంతరం రిపోర్టింగ్ చేస్తున్నాం’’అని అన్నారు.చదవండి: కెనడాలో ‘ఆస్ట్రేలియా టుడే’పై నిషేధం -
రాజధానిలో నేటి నుంచి ‘గ్రాప్-1’ అమలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది చలికాలం ప్రారంభానికి ముందే రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగింది. రాజధానిలో గాలి నాణ్యత వరుసగా రెండో రోజు ‘పూర్’ కేటగిరీలో నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీపీబీ) తెలిపిన వివరాల ప్రకారం దసరా తర్వాత ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 224 కు చేరుకుంది.దీనిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో ఈ ఏడాది కూడా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్) అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా గ్రాప్-1ని నేటి నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అవి నేటి నుంచి(మంగళవారం) నుంచి అమలు కానున్నాయి. గ్రాప్-1 దశలో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చడం, డీజిల్ జనరేటర్ల వినియోగాన్ని పరిమితం చేయడం, రెస్టారెంట్లలో బొగ్గు లేదా కట్టెల వినియోగాన్ని నిషేధించడం వంటివి ఉంటాయి. నగరంలో ఏక్యూఐ 200 దాటినప్పుడు గ్రాప్-1 అమలు చేస్తారు.గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే గాలి నాణ్యత క్షీణతను నిరోధించడానికి అమలు చేసే విధానం. ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత ఆధారంగా గ్రాప్ విధానాన్ని నాలుగు దశలుగా విభజించారు. మొదటి దశలో ఢిల్లీకి 300 కి.మీ. పరిధిలో కాలుష్యం కలిగించే పారిశ్రామిక యూనిట్లు, థర్మల్ పవర్ ప్లాంట్లపై చర్యలు తీసుకుంటారు. రెండవ దశలో వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో సీఎన్జీ/ఎలక్ట్రిక్ బస్సు మెట్రో సేవలను ప్రోత్సహిస్తారు.మూడవ దశలో ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్లలో పెట్రోల్‌తో నడిచే బీఎస్-3 ఫోర్-వీలర్లు, డీజిల్‌తో నడిచే బీఎస్-4 ఫోర్-వీలర్ల వినియోగాన్ని నిషేధించనున్నారు. నాల్గవ దశలో అన్ని రకాల నిర్మాణ, కూల్చివేత పనులను నిషేధిస్తారు. పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల సిబ్బందికి ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పిస్తారు.ఇది కూడా చదవండి: రసవత్తర పోరు.. ‘అంకెల్లో’ అమెరికా అధ్యక్ష ఎన్నికలు -
ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
న్యూఢిల్లీ: తమిళనాడు, పుదుచ్చేరి సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఈరోజు(శనివారం) కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 12 నుంచి 16 వరకు 10 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో అక్టోబర్ 12న భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో అస్సాం, మేఘాలయలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల నుండి దాటనున్నాయి. యూపీలోని కొన్ని చోట్ల తేలికపాటి పొగమంచు కమ్ముకుంది. అక్టోబర్ 16 వరకు ఢిల్లీలో ఆకాశం నిర్మలంగా ఉంటుందని అంచనా. దేశ రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌గానూ, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గానూ ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: ఆరు నెలల్లో 7897 కోట్ల లావాదేవీలు -
జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. 3.5 తీవ్రత నమోదు
జమ్ముకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) విడుదల చేసిన సమాచారం ప్రకారం జమ్ము కాశ్మీర్లో శనివారం సాయంత్రం 5.34 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. అయితే దీని కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు.జమ్ముకాశ్మీర్‌లో సంభవించే తేలికపాటి భూకపాలు కూడా కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంటాయి. తాజాగా సంభవించిన భూకంప కేంద్రం కిష్త్వార్ ప్రాంతంలో ఉందని అధికారులు తెలిపారు. భూమికి 10 కి.మీ లోతున ఈ భూకంప కేంద్రం ఉంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కశ్మీర్ లోయ కూడా ఒకటి. గతంలో ప్రకృతి ప్రకోపానికి ఈ ప్రాంతం బలయ్యింది.2005లో కశ్మీర్ లోయలో సంభవించిన భూకంపాన్ని నేటికీ ఎవరూ మరచిపోలేదు. ఆ ఏడాది అక్టోబర్ 8న ఇక్కడ బలమైన భూకంపం వచ్చింది. దీని ప్రభావానికి 69 వేల మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోగా, 75 వేల మంది గాయపడ్డారు. నాడు భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. -
అలర్ట్: యూపీలో భారీవర్షాలు.. ఉత్తరాఖండ్‌కు కొండచరియల ముప్పు
దేశంలోని పలుప్రాంతాల్లో రుతుపవనాలు జోరందుకున్నాయి. అయితే ఢిల్లీలోకి రుతుపవనాలు ప్రవేశించి, 20 రోజులకు పైగా సమయం గడిచినా గత కొద్ది రోజులుగా ఇక్కడ భారీ వర్షాలు లేవు. ఊహించని విధంగా ఎండలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఇక్కడికి పక్కనే ఉన్న తూర్పు యూపీలో ప్రతిరోజూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా వాతావరణం ఎలా ఉండబోతున్నదనేది ఇప్పుడు తెలుసుకుందాం.ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు (శనివారం) చినుకులు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా ఉండవచ్చు. శుక్రవారం నాటి ఉష్ణోగ్రత కంటే ఈరోజు రాజధానిలో ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదుకానున్నదని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్‌లో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. తూర్పు, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఈరోజు కూడా వర్షం పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఉత్తరాఖండ్‌లో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ వారాంతంలోగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతోపాటు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే నాలుగైదు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లోని పోర్బందర్ ప్రాంతమంతా జలమయమైంది. జూలై 22 వరకు గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. -
మూడు లక్షలకు అమర్నాథ్ యాత్రికుల సంఖ్య
అమర్‌నాథ్‌లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు జమ్ముకశ్మీర్‌కు తరలివస్తున్నారు. ఆదివారం నాటికి యాత్రికుల సంఖ్య మూడు లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శనివారం అమరనాథుణ్ణి 14,200 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 2,93,929 మంది భక్తులు అమర్నాథ్కు తరలివచ్చారు.అమరనాథుణ్ణి త్వరగా దర్శించుకోవాలనే ఉత్సాహం భక్తుల్లో కనిపిస్తోంది. ఇందుకోసం టోకెన్లు పొందేందుకు, భక్తులు తెల్లవారుజాము నుంచే సేవా కేంద్రాలకు చేరుకుంటున్నారు. తాజాగా 1,630 మంది భక్తులు 74 చిన్న, పెద్ద వాహనాల్లో జమ్ము నుంచి బల్తాల్‌కు బయలుదేరారు. వీరిలో 1068 మంది పురుషులు, 546 మంది మహిళలు, 16 మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా పహల్గాం మార్గంలో 109 చిన్న, పెద్ద వాహనాల్లో 3039 మంది భక్తులు కశ్మీర్‌కు తరలి వెళ్లారు. వీరిలో 2350 మంది పురుషులు, 584 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు, 96 మంది సాధువులు, ఇద్దరు సాధ్వులు ఉన్నారు. కాగా ఆగస్టు 19న అమర్నాథ్ యాత్ర ముగియనుంది. -
అత్త ఇంటికి జగన్నాథుడు.. రథయాత్రలో అద్భుత ఘట్టం
ఒడిశాలోని పూరీలో జరిగే రథయాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. నిన్న (సోమవారం) ఉదయం మంగళ హారతితో రథయాత్ర ప్రారంభమైంది. జై జగన్నాథ్ అంటూ భక్తులు నినాదాలు చేస్తుండగా రథయాత్ర మొదలయ్యింది.భక్తులు రెట్టించిన ఉత్సాహంతో రథాల తాళ్లను ముందుకు లాగారు. డప్పుల దరువులుల మధ్య బలభద్రుడి రథంతో జగన్నాథుడు తన అత్త అయిన గుండిచా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కొద్దిసేపటికి జగన్నాథుని సోదరి దేవి సుభద్ర ఆశీనురాలైన రథం కూడా గుండిచా ఆలయానికి చేరుకుంది. నేటి (మంగళవారం) తెల్లవారుజాము వరకు రథాలపైనే ఆశీనులై పూజలు అందుకున్న జగన్నాథుడు, సుభద్రలు గుండిచా ఆలయంలోకి ప్రవేశించనున్నారు.53 ఏళ్ల తర్వాత ఈసారి పూరీలో రథయాత్ర రెండు రోజుల పాటు జరుగుతోంది. కాగా ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో రథయాత్ర సందర్భంగా శ్యామ్ సుందర్ కిషన్ (45) అనే భక్తుడు రథం చక్రాల కింద పడి మృతి చెందాడు. ఆదివారం కుకుజుంఘా గ్రామంలో జగన్నాథ రథాన్ని లాగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు ఆదివారం పూరీలో జరిగిన రథయాత్రలో కొంతమంది పోలీసులతో సహా 130 మంది గాయపడ్డారు, వారిలో సగం మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ కాగా, 40 మందికి చికిత్స కొనసాగుతోంది. -
పొంచివున్న ‘కారింగ్టన్ ఈవెంట్’.. మానవాళికి పెను ముప్పు?
ఈ అనంత విశ్వంలో ఊహకందని ఘటనలు అనేకం జరుగుతుంటాయి. ఇవి మనల్ని ఆలోచింపజేయడమే కాకుండా ఆందోళనకు కూడా గురిచేస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా విమానాలన్నీ రద్దయితే? శాటిలైట్లు పనిచేయడం మాసేసి, ఇంటర్నెట్ ఆగిపోతే? అటు ఫోన్లు మూగబోయి.. ఇటు విద్యుత్ అంతరాయం ఏర్పడితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. వినడానికే ఆందోళన కలిగించే ఇటువంటి ఘటన 150 ఏళ్ల క్రితం సంభవించింది. దీనిని కారింగ్టన్ ఈవెంట్ అని పిలుస్తారు. కారింగ్టన్ ఈవెంట్ అంటే..1859, సెప్టెంబరు 2న కారింగ్టన్ ఈవెంట్‌ను నాటి శాస్త్రవేత్తలు గుర్తించారు. లండన్‌లోని రెడ్ హిల్‌లో ఉంటున్న శాస్త్రవేత్తలు రిచర్డ్ క్రిస్టోఫర్ కారింగ్టన్, అతని సహోద్యోగి రిచర్డ్ హోడ్గ్సన్లు సూర్యునిపై ఉన్న చీకటి మచ్చల సమూహం(సన్ స్పాట్)పై అధ్యయనం చేస్తుండగా వారు సూర్యునిపై సంభవించిన భారీ పేలుడును గమనించారు. దీనినే కారింగ్టన్ ఈవెంట్‌గా పేర్కొన్నారు. ఈ పేలుడు ప్రభావం భూమికున్న ధ్రువ ప్రాంతాలలో కనిపించింది. ఇదే తొలి సౌర తుఫానుగా నమోదయ్యింది.భారీ పేలుళ్ల గుర్తింపురిచర్డ్ క్రిస్టోఫర్ కారింగ్టన్ సూర్యునిపై ఐదు నిమిషాల పాటు సంవించిన భారీ పేలుళ్లను గమనించారు. ఈ భారీ సౌర తుఫానును గమనించిన ఏడు రోజుల తర్వాత లండన్‌లోని క్యూ అబ్జర్వేటరీలోని అయస్కాంత సెన్సార్లు భూ అయస్కాంత క్షేత్రంలో గణనీయమైన మార్పును గుర్తించాయి. ఈ పేలుడు జరిగిన రెండు రోజుల తర్వాత భూమికి చెందిన మాగ్నెటోస్పియర్ చుట్టూ కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) విక్షేపం చెందడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు.కుప్పకూలనున్న కమ్యూనికేషన్ వ్యవస్థ?1859లో సంభవించిన కారింగ్టన్ ఈవెంట్ సమయంలో ప్రపంచంలో భారీ విద్యుత్తు వ్యవస్థ, ఉపగ్రహాలు మొదలైనవి లేవు. అందుకే నాడు భారీ విధ్వంసం కనిపించలేదు. అయితే ఇప్పుడు ఈ స్థాయి సౌర తుఫాను సంభవిస్తే, ప్రపంచంలో భారీ విపత్తులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఫలితంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో విద్యుత్తు అంతరాయాలు ఏర్పడవచ్చు. భూమి చుట్టూ తిరుగుతున్న వేలాది ఉపగ్రహాలు స్థంభించిపోవచ్చు. కమ్యూనికేషన్ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ చాలా కాలం పాటు నిలిచిపోయే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.రాబోయే రోజుల్లో..కాగా 2003 అక్టోబరులో సంభవించిన సౌర తుఫాను దక్షిణాఫ్రికాలో కమ్యూనికేషన్ వ్యవస్థలను, విద్యుత్ సౌకర్యాలను అస్తవ్యస్తం చేసింది. దీనికి ‘హాలోవీన్ సౌర తుఫాను’అని నామకరణం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని సౌర తుఫానులు భూమిని ఢీకొనవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సౌర తుఫానుల కారణంగా భూ అయస్కాంత క్షేత్రాలలో హెచ్చతగ్గులు ఏర్పడతాయి. అది బ్లాక్అవుట్లకు దారితీసి, విద్యుత్ వ్యవస్థలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే స్పేస్‌క్రాఫ్టులు అధిక రేడియేషన్ ముప్పును ఎదుర్కొంటాయి.భూమికి పొంచివున్న ప్రమాదం?రెండు దశాబ్దాల తర్వాత 2024 మే 10న అత్యంత శక్తివంతమైన సౌర తుఫాను భూమిని తాకింది. ఈ సౌర తుఫానును తొలుత తీవ్రమైంది కాదని భావించారు. కానీ, తర్వాత అత్యంత శక్తివంతమైందిగా అంచనా వేశారు. సూర్యుడి సన్‌స్పాట్ ఏఆర్ 3663 వద్ద అత్యంత శక్తివంతమైన రెండు విస్ఫోటనాలు సంభవించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల భూమికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు చేశారు. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను సానుకూలంగా ప్రారంభించాయి. ఉదయం 9:20 సమయానికి ఎన్ఎస్ఈ నిఫ్టీ 35.80 పాయింట్లు (0.15 శాతం) పెరిగి 23,661 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 132.49 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో 77,729.48 వద్ద ప్రారంభమయ్యాయి.ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్ షేర్లు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. టాటా స్టీల్, హెచ్‌యూఎల్, టాటా మోటర్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ ఎంటర్‌ప్రైజస్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నేటితో ‘హిమాచల్’కు 76 ఏళ్లు!
హిమాచల్ ప్రదేశ్ ఈరోజు 76వ ఏట అడుగుపెట్టింది. ఈ రాష్ట్రం 1948 ఏప్రిల్ 15న ఆవిర్భవించింది. నేడు హిమాచల్ దినోత్సవాన్ని సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జానపద కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. అనేక మైలురాళ్లను దాటిన హిమాచల్ ప్రదేశ్ నేడు అన్ని రంగాల్లోనూ ముందు వరుసలో ఉంది. 1948లో హిమాచల్ ప్రదేశ్‌లో అక్షరాస్యత రేటు ఏడు శాతంగా ఉంది. ఇది 76 సంవత్సరాల తర్వాత అంటే నేటికి 82.80 శాతానికి చేరుకుంది. రాష్ట్రంలో మూడు విమానాశ్రయాలు ఉన్నాయి. 1948లో వీటి సంఖ్య సున్నా. ఆరోగ్య రంగంలో కూడా రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. హిమాచల్‌లో ప్రస్తుతం ఒక ఎయిమ్స్, ఐదు వైద్య కళాశాలలు, ఐదు డెంటల్ కళాశాలలు, పలు నర్సింగ్, ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యనభ్యసించేందుకు విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. 1948వ సంవత్సరంలో హిమాచల్ ప్రజల తలసరి ఆదాయం రూ.240 కాగా, ప్రస్తుతం రూ.2,35,199కి చేరుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త యశ్వంత్ సింగ్ పర్మార్ హిమాచల్ తొలి ముఖ్యమంత్రి. ఈయన 1952 నుండి 1977 వరకు అధికారంలో ఉన్నారు. ఠాకూర్ రామ్ లాల్ 1977, 1980లలో రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. శాంత కుమార్ 1977, 1990లో రెండుసార్లు అధికారంలో కొనసాగారు. వీరభద్ర సింగ్ 1985, 1993, 2003, 2012,2017లో ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రేమ్ కుమార్ ధుమాల్ 1998, 2007లో అధికారాన్ని చేపట్టారు. 2017లో జైరాం ఠాకూర్ ముఖ్యమంత్రి అయ్యారు. సుఖ్విందర్ సింగ్ సుఖు 2023 నుండి అధికారంలో కొనసాగుతున్నారు. -
Bank holiday : ఈరోజు బ్యాంకులు పనిచేస్తాయా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి సంవత్సరం బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. ఇందులో గెజిట్ పబ్లిక్ హాలిడేస్తోపాటు ముఖ్యమైన పండుగలు ఉంటాయి. అయితే ఈ జాబితాలో ప్రాంతీయ పండుగలు, సందర్భాలను బట్టి రాష్ట్రాల వారీగా సెలవులు ఉండవు. ఆర్బీఐ జాబితా ప్రకారం.. 2024 ఫిబ్రవరిలో మొత్తం 11 బ్యాంకు సెలవులు ఉన్నాయి. అయితే ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం బ్యాంకులు పనిచేస్తాయా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి దృష్ట్యా మహారాష్ట్ర అంతటా బ్యాంకులు పనిచేయవు. మిగతా అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు సోమవారం సాధారణ పని దినం ప్రకారం పనిచేస్తాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని శివ జయంతి అని కూడా పిలుస్తారు. ఇది మహారాష్ట్ర అంతటా జరుపుకుంటారు. ఇది రాష్ట్రంలో ప్రభుత్వ సెలవు దినం. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19న పండుగలా జరుపుకుంటారు. బ్యాంకులు మూతపడినప్పటికీ ఆన్లైన్ మోడ్ ద్వారా ఆర్థిక లావాదేవీలను నిర్వహించవచ్చు. ఫిబ్రవరిలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఫిబ్రవరి 4 - ఆదివారం ఫిబ్రవరి 10- రెండవ శనివారం ఫిబ్రవరి 11- ఆదివారం ఫిబ్రవరి 14- బసంత్ పంచమి (త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో సెలవు) ఫిబ్రవరి 15- లూ-నాగి-ని (మణిపూర్‌లో సెలవు) ఫిబ్రవరి 18- ఆదివారం ఫిబ్రవరి 19- ఛత్రపతి శివాజీ జయంతి (మహారాష్ట్రలో సెలవు) ఫిబ్రవరి 20- రాష్ట్ర దినోత్సవం (మిజోరం, అరుణాచల్ ప్రదేశ్లలో సెలవు) ఫిబ్రవరి 24- రెండవ శనివారం ఫిబ్రవరి 25- ఆదివారం ఫిబ్రవరి 26- న్యోకుమ్ (అరుణాచల్ ప్రదేశ్‌లో సెలవు) -
‘బంగారం’ లాంటి వార్తే.. తెలిస్తే ఈరోజే కొనేస్తారు!
Gold Rate today : పసిడి ప్రియులకు ఇది నిజంగా బంగారం లాంటి వార్తే. వారం రోజులుగా దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గిపోయాయి. నిన్నటి రోజున స్పల్పంగా తగ్గిన పసిడి ధరలు ఈరోజు భారీగా దిగొచ్చాయి. వారం రోజుల వ్యవధిలో బంగారం ధరలు రూ.1000 పైగా తగ్గాయి. హైదరాబాద్‌తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు (ఫిబ్రవరి 14) బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,000 లకు దిగివచ్చింది. అలాగే 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.660 చొప్పున తగ్గి రూ.62,180 వద్ద ఉంది. పవిత్రమైన మాఘమాసంలో బంగారం ధరలు భారీగా తగ్గడంతో మహిళలు, పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం పసిడి కొనుగోలుచేసేవారికి భారీ ఊరట లభిస్తోంది. దేశంలోని ఇతర నగరాల్లో.. ➦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,150 వద్ద, 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.680 తగ్గి రూ.62,310 వద్ద కొనసాగుతోంది. ➦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,000 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.62,180 వద్ద ఉంది. ➦ చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.600 దిగొచ్చి రూ.57,500లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.650 క్షీణించి రూ.62,730 ఉంది. ➦ ముంబైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.600 తగ్గి రూ.57,000 లకు చేరింది. 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.660 చొప్పున తగ్గి రూ.62,180 వద్ద ఉంది. Silver Price : ఇక దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న వెండి ధర ఈరోజు (ఫిబ్రవరి 14) కేజీకి ఏకంగా రూ. 1500 తగ్గింది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 75,500లుగా ఉంది. -
శుభ ముహూర్తాల వేళ పసిడి ప్రియులకు ఊరట!
Gold Rate today : దేశవ్యాప్తంగా బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతకు ముందు పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో పవిత్రమైన మాఘమాసం ప్రారంభమైంది. శుభ ముహుర్తాల వేళ బంగారం ధరల్లో పెరుగుదల లేకపోవడం కొనుగోలుదారులకు కలిసొచ్చే అంశం. హైదరాబాద్‌తోపాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు (ఫిబ్రవరి 12) బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,700 వద్ద ఉండగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.62,950 వద్ద ఉంది. ఇతర నగరాల్లో ఇలా.. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,700 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.62,950 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.58,300లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.63,600 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,850, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.63,100 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.57,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.62,950 వద్ద స్థిరంగా ఉంది. -
బంగారం కొనుగోళ్లు... ఇదే మంచి తరుణమా?
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఊరటనిచ్చాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న పసిడి ధర ఈరోజు (ఫిబ్రవరి 9) స్వల్పంగా తగ్గింది. దీంతో ఈరోజు బంగారం కొనేవారికి ధరలు కాస్త దిగివచ్చినట్లయింది. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. హైదరాబాద్ నగరంతోపాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.57,900 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.70 చొప్పున దిగొచ్చి రూ.63,160 వద్ద ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో.. ♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.57,900 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.70 తగ్గి రూ.63,160 వద్దకు చేరింది. ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర అత్యల్పంగా రూ.10 తగ్గి రూ.58,390లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.10 చొప్పున తగ్గి రూ.63,710 ఉంది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.58,050 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.20 తగ్గి రూ.63,310 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.57,900 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.70 తగ్గి రూ.63,160 వద్దకు చేరింది. cost of silver today: ఇక వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా వెండి ధరలు పెరిగాయి. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న రజతం ఈరోజు కేజీకి రూ.500 చొప్పున పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.76,500 వద్ద ఉంది. ఇది క్రితం రోజున రూ. 76,000 లుగా ఉండేది. -
పండగ పూట బంగారం కొనేవారికి షాక్!
పండగ పూట బంగారం కొనేవారికి పెరిగిన ధరలు షాకిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈరోజు (జనవరి 13) పసిడి ధరలు మరింతగా పెరిగాయి. నిన్నటి రోజున స్పల్పంగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు ఇంకాస్త ఎగిశాయి. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర తులానికి (10 గ్రాములు) రూ.320 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.300 ఎగిసింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,270లకు, 22 క్యారెట్ల పుత్తడి తులం ధర రూ. 58,000లకు చేరింది. క్రితం రోజు ఈ ధరలు వరుసగా రూ. 62,950, రూ.57,700 ఉండేవి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలు ప్రభావితం చేసే ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. వెండి కూడా.. Silver Rate: దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా పెరిగాయి. మూడు రోజుల నుంచి శాంతించిన వెండి ధరల్లో మళ్లీ పెరుగుదల నమోదైంది. హైదరాబాద్‌తోపాటు ఇరు రాష్ట్రాల్లో వెండి ధర కేజీకి రూ.500 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.78,000 లకు చేరింది. నిన్నటి రోజున కేజీ వెండి ధర రూ.77,500 ఉండేది. -
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?
నేడు దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతియేటా రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26 న జరుపుకుంటారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ అధికారికంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. రాజ్యాంగ విలువల పట్ల పౌరులలో గౌరవ భావాన్ని పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించడం అనేది ప్రారంభమైంది. సామాజిక న్యాయం, సాధికారతను గుర్తుచేసుకుంటూ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం పిలుపునిచ్చింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి మొత్తం రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. రాజ్యాంగ రచన 1949 నవంబర్ 26న పూర్తయింది. మన దేశ రాజ్యాంగం మొత్తం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు అనేక దేశాల నియమాలను చేర్చారు. అమెరికా, ఐర్లాండ్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల రాజ్యాంగాల సహాయం తీసుకున్నారు. ఈ దేశాల రాజ్యాంగాల నుండి, పౌరుల విధులు, ప్రాథమిక హక్కులు, ప్రభుత్వ పాత్ర, ఎన్నికల ప్రక్రియ వంటి ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: దేశంలోని పలు రాష్ట్రాలకు వర్షసూచన -
పశువుల కొనుగోలులో ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదు
సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ పథకం కింద పశువుల కొనుగోలులో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగలేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ స్పష్టం చేశారు. ఈ పథకంలో లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదని, అవినీతికి ఆస్కారమే లేదని చెప్పారు. వైఎస్సార్ చేయూత లబ్ధిదారుల్లో ఆసక్తి చూపించిన వారు మాత్రమే స్త్రీ నిధి, ఉన్నతి, బ్యాంక్ రుణాల ద్వారా పాడి పశువులను కొనుగోలు చేశారన్నారు. వీటి కొనుగోలులో ప్రభుత్వం, పశు సంవర్ధక శాఖ ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. ఇష్టపూర్వకంగా ముందుకొచ్చిన లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన చేయూత లబ్ధి ద్వారా పొందిన రుణంతో వారికి నచ్చిన పాడి పశువులను నచ్చిన చోట బేరసారాలు సాగించి మరీ కొనుక్కొంటారని చెప్పారు. ఈ విధంగా నాలుగేళ్లలో ఈ పథకం కింద 3.94 లక్షల పాడి పశువుల యూనిట్లు మహిళా లబ్ధిదారులు పొందారన్నారు. పాడి పశువుల కొనుగోలు యూనిట్ రూ.75 వేలుగా నిర్దేశించామన్నారు. వైఎస్సార్ చేయూత లబ్ధి రూ.18,750కి అదనంగా బ్యాంకుల నుంచి రూ.56,250 రుణం రూపంలోనూ లేదా స్త్రీ నిధి, ఉన్నతి పథకాల కింద రుణంగా తీసుకున్నారని చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుని నిర్ణయం మేరకు రైతుల నుంచి నచ్చిన జాతి పశువులను నేరుగా కొన్నారని చెప్పారు. లబ్ధిదారులకు రుణం సమకూర్చడం తప్ప పశువుల కొనుగోలులో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదన్నారు. బ్యాంక్ నుంచి పొందిన రుణం చెల్లింపునకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పొందిన ప్రభుత్వ సాయాన్ని వాయిదాల పద్దతిలో చెల్లించే వెసులుబాటు మాత్రమే ప్రభుత్వం కల్పించిందన్నారు. రుణాన్ని తిరిగి చెల్లించవలసిన భాద్యత లబ్ధిదారులదేనని అన్నారు. అమూల్ పాల సేకరణ కేంద్రాలకు పాలు పోసే లబ్ధిదారులను గుర్తించడం కోసం ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సర్వే నిర్వహించిందే తప్ప వైఎస్సార్ చేయూత లబ్ధిదారులను గుర్తించడానికి కాదన్నారు. సాధారణంగా పాడి రైతులు వారి అవసరాలను బట్టి పశువులను కొనడం, అమ్మడం చేస్తుంటారన్నారు. ఈ పథకం లబ్ధిదారుల్లో ఎక్కువ మంది రాష్ట్ర పరిధిలోని రైతుల నుంచి, అతి కొద్ది మంది మాత్రమే పొరుగు రాష్ట్రాల రైతుల నుంచి వారికి నచ్చిన పశువులను కొన్నారని తెలిపారు. ఈ కారణంగా పాడి సంపద పెరగదని, అలాంటప్పుడు స్థూల పాల దిగుబడులలో పెరుగుదల ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి అందించే లబ్ధిదారుని వాటా, స్త్రీనిధి, ఉన్నతి లేదా బ్యాంక్ రుణాలు నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు జమ అవుతాయని, ఆ డబ్బుతోనే లబ్ధిదారులు పాడి పశువులను కొంటున్నారని తెలిపారు. అవినీతికి ఆస్కారం లేని రీతిలో పూర్తి పారదర్శకతతో ఈ ప«థకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ‘పాడి పశువుల కొనుగోలులో రూ.2,887 కోట్లు తినేశారు’ అంటూ ఈనాడులో ప్రచురితమైన కథనంలో అన్నీ అవాస్తవాలేనని ఆయన స్పష్టం చేశారు. -
ఈ సినిమా నాకో పెద్ద వేడుక
‘సత్యం’ రాజేష్, కామాక్షీ భాస్కర్ల ప్రధాన తారాగణంగా, రాకేందు మౌళి, బాలాదిత్య, కరుణకుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పోలిమేర 2’. 2021లో వీక్షకుల ముందుకు వచ్చిన ‘మా ఊరి పోలిమేర’కు ఇది సీక్వెల్ చిత్రం. గౌరీకృష్ణ నిర్మించిన ఈ చితాన్ని పంపిణీదారుడు వంశీ నందిపాటి నేడు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ‘సత్యం’ రాజేశ్ మాట్లాడుతూ– ‘‘మా ఊరి పోలిమేర’కు వీక్షకుల నుంచి వచ్చిన స్పందనను బట్టి ‘మా ఊరి పోలిమేర 2’ చేద్దామని అనుకున్నాం. తొలి భాగం ముగిసిన దగ్గర్నుంచే మలి భాగం ఆరంభమవుతుంది. కొమరయ్య (సినిమాలో ‘సత్యం’ రాజేశ్ పాత్ర) గురించి నిజాలు తెలుసుకున్న లక్ష్మి (కామాక్షీ పాత్ర) ఏం చేసింది? ఏ విధంగా పగ తీర్చుకోవాలనుకుంది? కవిత ఎలా జీవించి ఉంది? ఇలాంటి ఆసక్తికరమైన కథనంతో మంచి ట్విస్ట్‌లతో సాగుతుంది. నా కెరీర్లో ఓ పెద్ద వేడుకలా ఈ సినిమాను భావిస్తున్నాను. ప్రస్తుతం ‘గీతాంజలి’ సీక్వెల్, వరుణ్‌తేజ్ ‘మట్కా’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాను. హీరోగా ‘టెనెంట్’ చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. -
తగ్గిన బంగారం, వెండి ధరలు - నేటి ధరలు ఇలా..
పండుగ సీజన్లో రోజురోజుకి పెరుగుతున్న పసిడి ధరలు గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర రూ. 150 (22 క్యారెట్స్) నుంచి రూ. 160 (24 క్యారెట్స్) తగ్గింది. ఈ రోజు విజయవాడలో ఒక గ్రామ్ 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 5495 & 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 5995గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ఒక గ్రామ్ మీద రూ. 15 నుంచి రూ. 16 వరకు తగ్గింది. దీని ప్రకారం 10 గ్రాముల పసిడి ధర రూ. 54950 & రూ. 59950గా ఉంది. ఇదే ధరలు హైదరాబాద్, గుంటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి. చైన్నైలో నేటి బంగారం ధరలు రూ. 150 నుంచి రూ. 160 వరకు తగ్గి రూ. 55,150 (10 గ్రామ్స్ 22 క్యారెట్ గోల్డ్), రూ. 60,160గా (10 గ్రామ్స్ 24 క్యారెట్ గోల్డ్) ఉన్నాయి. వెండి ధరలు కేజీ మీద రూ. 500 తగ్గి రూ. 77,000 వద్ద ఉంది. ఇదీ చదవండి: ధనవంతుల జాబితాలో రైతు బిడ్డ - సంపద తెలిస్తే అవాక్కవుతారు! దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 55,100 & 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గి రూ. 60,100గా ఉంది. వెండి ధరలు కేజీ మీద రూ. 500 తగ్గి రూ. 73,600 వద్ద ఉంది. -
షాకిచ్చిన బంగారం! భారీగా పెరిగిన ధరలు.. ఇక కొన్నట్టే..!
Gold rate today: దేశంలో ఈరోజు (అక్టోబర్ 14) బంగారం ధరలు భారీగా పెరిగాయి. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఖచ్చితమైన రక్షణగా, ముఖ్యమైన పెట్టుబడి సాధనంగా బంగారాన్ని చూస్తున్న నేపథ్యంలో దేశంలో పసిడికి అత్యంత డిమాండ్ ఉంటోంది. దేశంలోని ప్రసిద్ధ జువెలర్స్ అందించిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా ఈ రోజు బంగారం 22 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ. 1400, 24 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ. 1530 పెరిగింది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1400 పెరిగి రూ. 55,400లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.1530 పెరిగి రూ.60,440 లకు చేరింది. క్రితం రోజు ఈ ధరలు రూ. 54,000, రూ.58,910 లుగా ఉండేవి. ఎగిసిన వెండి Silver price today: దేశవ్యాప్తంగా వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ వెండి ఈరోజు (అక్టోబర్ 14) ఈరోజు ఏకంగా రూ.1500 పెరిగింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.77,000 ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
కొనేట్టులేదుగా! మళ్లీ పెరిగిన బంగారం ధర..
Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు (అక్టోబర్ 9) మళ్లీ పెరిగాయి. వరుసగా నాలుగు రోజులుగా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నాలుగు రోజుల్లో పుత్తడి 10 గ్రాములకు ఏకంగా రూ.1000 దాకా పెరిగింది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఈరోజు రూ.200 మేర పెరిగింది. అలాగే 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.220 ఎగిసింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 53,350లకు చేరింది. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 58,200లకు చేరింది. క్రితం రోజు ధరలు వరుసగా రూ. 53,150, రూ. 57,980గా ఉండేవి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! వెండి కూడా.. Silver rate today: దేశవ్యాప్తంగా ఈరోజు (అక్టోబర్ 9) వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీకి రూ.500 చొప్పున వెండి ధర పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర రూ.75,500లకు చేరింది. క్రితం రోజు ఇది రూ.75,000 లుగా ఉండేది. -
దూసుకెళ్తున్న బంగారం.. స్థిరంగా వెండి - నేటి ధరలు ఇలా..!
గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్ళీ భారీ పెరుగుదల దిశవైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ రోజు ఒక గ్రామ్ గోల్డ్ ధర రూ. 400 నుంచి రూ. 410 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ రోజు విజయవాడలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 5315 (ఒక గ్రామ్), 24 క్యారెట్స్ పసిడి ధర రూ. 5798 (ఒక గ్రామ్)గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రామ్స్ పసిడి ధరలు వరుసగా రూ. 53150 & రూ. 57980గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలు రూ. 400, రూ. 410 ఎక్కువ. ఇదే ధరలు మిగిలిన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటాయి. చెన్నైలో ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కావున నిన్నటికి.. ఈ రోజుకి పెద్దగా తేడా లేదు. 22 క్యారెట్స్ 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 5370 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 5858గా ఉంది. ఈ లెక్కన 10 గ్రామ్స్ గోల్డ్ ఖరీదు వరుసగా రూ. 53700 & రూ. 58580గా ఉంది. ఇదీ చదవండి: ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు - కియా నుంచి లాంబోర్గినీ వరకు.. దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఇక్కడ ఒక గ్రామ్ 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 5330 & ఒక గ్రామ్ 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 5813గా ఉంది. దీని ప్రకారం 10 గ్రాముల పసిడి ధర రూ. 53300.. రూ. 58130 గా ఉంది. వెండి ధరలు వెండి ధరల విషయానికి వస్తే విజయవాడ, చెన్నై, ఢిల్లీలలో ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. అంటే నిన్నటి ధరలే ఈ రోజు కూడా ఉన్నాయి. -
బంగారం, వెండి కొనేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు
గత వారం రోజులుగా రోజురోజుకి బంగారం ధరలు తగ్గిపోతూనే ఉన్నాయి. ఈ రోజు ఏకంగా 10 గ్రాముల బంగారం ధరలు మునుపటి కంటే రూ. 600 నుంచి రూ. 660 వరకు తగ్గింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం & వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో చూసేద్దాం. ⭐ విజయవాడలో ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5260 కాగా, 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5738గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం రూ. 55260, 24 క్యారెట్ పసిడి ధర రూ. 57380గా ఉంది. ఇదే ధరలు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు, విశాఖపట్టణంలో కూడా ఉన్నాయి. ⭐ వెండి ధరల విషయానికి వస్తే విజయవాడలో 10 గ్రాముల వెండి రూ. 735. కావున ఒక కేజీ వెండి ధర రూ. 73500గా ఉంది. ఈ ధర నిన్నటి కంటే కూడా రూ. 2000 తక్కువ. నిన్న కేజీ వెండి ధర రూ. 75500గా ఉంది. వెండి కొనేవారికి ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి. ఇదే ధరలు ఇతర తెలుగు రాష్ట్రాల్లో కూడా కొనసాగుతాయి. ⭐ దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ. 5275 (1 గ్రామ్ 22 క్యారెట్), రూ. 5753 (1 గ్రామ్ 24 క్యారెట్). దీని ప్రకారం 10 గ్రాముల బంగారం ధరలు రూ. 52750 & రూ. 57530గా ఉన్నాయి. నిన్నటి పోలిస్తే ఈ ధరలు రూ. 600 & రూ. 660 తగ్గింది. ⭐ వెండి విషయానికి వస్తే.. ఒక గ్రామ్ వెండి రూ. 71. కావున 10 గ్రాముల వెండి రూ. 710, కేజీ ధర రూ. 71000గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు రూ. 2000 తక్కువ కావడం గమనార్హం. ⭐ చెన్నైలో పసిడి ధరల విషయానికి వస్తే.. ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5290 కాగా.. 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 5771గా ఉంది. నిన్నటి కంటే ఏ రోజు ధరలు రూ. 660 & రూ. 720 తక్కువ. ⭐ వెండి ధర చెన్నైలో రూ. 73.50. అంటే 1 కేజీ వెండి ధర ఇక్కడ రూ. 75500. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర కేజీ మీద రూ. 2000 తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
తగ్గిన బంగారం ధరలు - తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లు ఇలా!
దేశీయ మార్కెట్లో ఈ రోజు (2023 సెప్టెంబర్ 11) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,840కు చేరింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధర రూ. 10 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 10 తగ్గి రూ. 59,830కు చేరింది. ఒక గ్రామ్ 22 క్యారెట్ అండ్ 24 క్యారెట్ గోల్డ్ ధరలు వరుసగా రూ. 5484 & రూ. 5983గా ఉన్నాయి. ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54990 కాగా 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ రూ. 59830గా ఉంది. ముంబై, పూణే, కేరళలో కూడా ఇదే ధరలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, కడపలలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 54,840 కాగా 24 క్యారెట్ల గోల్డ్ (10 గ్రాములు) ప్రైస్ రూ. 59,830 వద్ద ఉన్నాయి. చెన్నైలో 10 గ్రాములు 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55320 కాగా 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,340 వద్ద ఉంది. ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు బంగారం ధరలలో హెచ్చు తగ్గులకు కారణమవుతుందని తెలుస్తోంది. వెండి ధరలు.. వెండి ధరలు ఈ రోజు కొంత పెరిగినట్లు తెలుస్తుంది. 100 గ్రాముల వెండి ధర రూ. 7750 కాగా 1 కేజీ వెండి ధర రూ. 77500గా ఉంది. నిన్న ఒక కేజీ వెండి ధర రూ. 77000 కావడం గమనార్హం. హైదరాబాద్, విజయవాడలో కేజీ సిల్వర్ ధర రూ. 77500గా ఉంది. బెంగళూరులో కేజీ వెండి రూ. 73000 కావడం గమనార్హం. -
కర్ణాటక సర్కార్‌కు ఉచితాల సెగ..
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రైవేట్ వెహికిల్స్ ఓనర్ అసోసియేషన్ బెంగళూరులో బందుకు పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి స్కీంకు వ్యతిరేకంగా ఈ బందుకు పిలుపునిచ్చినట్లు స్పష్టం చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు బంద్‌ను కొనసాగిస్తామని వెల్లడించింది. మొత్తం 32 ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్స్ ఈ బంద్‌లో పాల్గొన్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. The Federation of Karnataka State Private Transport Association had placed 28 demands in front of the #Karnataka government. With no consensus between the two parties, more than 10,000 members will gather for a protest march to Freedom Park in #Bengaluru.https://t.co/dw8rGmm4su — The Hindu-Bengaluru (@THBengaluru) September 11, 2023 బంద్‌కు కారణం.. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం శక్తి స్కీంను అమలుపరిచింది. దీని ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దీని వల్ల తమ ఉపాధిపై దెబ్బపడుతోందని ప్రైవేట్ ట్యాక్సీవాలాలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోని బెంగళూరులో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఇతర ప్రయాణ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విన్నవించారు. ప్రధాన డిమాండ్.. బంద్ అమలుతో బెంగళూరులో ప్రైవేటు ట్యాక్సీలు, ఆటోలు, ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ బైక్ ట్యాక్సీలు కూడా అందుబాటులో లేవు. శక్తీ స్కీంను ప్రైవేటు బస్సులకు కూడా విస్తరించాలనేది యూనియన్ల డిమాండ్లలో ప్రధానమైనది. ప్రభుత్వ పథకంతో తమకు జీవనోపాధి లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో అనేకమార్లు చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని యూనియన్లు చెబుతున్నాయి. దాదాపు 10 లక్షల ప్రైవేట్ వాహనాలు నిలిచి ఉండనున్నాయి. Members 32 unions part of the Federation of Karnataka State Private Transport Association protest at Freedom Park in #Bengaluru demanding a ban on bike taxis. Around 7 lakh vehicles operated by private persons or companies will stay off the roads on Sept 11 📹: @photomurali1 pic.twitter.com/LOmi0awTLL — The Hindu-Bengaluru (@THBengaluru) September 11, 2023 ప్రభుత్వం చర్యలు.. బంద్‌తో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో వీలైనన్ని అధిక బస్సులను నడుపుతున్నామని రవాణా మంత్రి రామలింగా రెడ్డి స్పష్టం చేశారు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 500 అధిక బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: జీ20 కేంద్రం వద్ద వర్షం నీరు.. విపక్షాల వ్యాఖ్యలపై కేంద్రం క్లారిటీ..