నేడు ఏపీ సెట్
13 కేంద్రాలు
6623 మంది అభ్యర్థులు
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : రాజమహేంద్రవరంలోని 13 కేంద్రాల్లో ఆదివారం నిర్వహించే ఏపీ సెట్-2017 పరీక్షలకు గానూ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కేంద్రాల్లో ఉభయ గోదావరి జిల్లాల నుంచి 6623 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి.సురేష్ వర్మ తెలిపారు. శనివారం ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. ఏపీ సెట్ పరీక్షలు రాసే అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో ఉదయం 9 గంటలకు సంబంధిత పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఆలసమైతే అనుమతించేది లేదన్నారు. రాజమహేంద్రవరంలో తరచూ ఎదురయ్యే ట్రాఫిక్ జామ్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. సమావేశంలో ప్రత్యేక పరిశీలకులు డాక్టర్ టి.మురళీకృష్ణ, అసోసియేట్ రీజనల్ కోఆర్డినేటర్ ఎన్. సూర్యరాఘవేంద్ర, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ పద్మావతి, డాక్టర్ టి. సత్యనారాయణ, డాక్టర్ అశోక్, డాక్టర్ సింహాచలం పాల్గొన్నారు.