ఉస్మానియా యూనివర్సిటీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ ఎల్జిబిలిటీ టెస్ (ఏపీ, టీఎస్ సెట్)లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 14 నుంచి సర్టిఫికెట్లను నేరుగా జారీ చేయనునట్లు సెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. పోస్టు ద్వారా జారీ చేయాలని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 20 నుంచి పోస్టు చేయనునట్లు చెప్పారు.
గతంలో అర్హత సాధించిన అభ్యర్థులు సైతం సర్టిఫికెట్లను పొందవచ్చు నన్నారు. అభ్యర్థులు ఓయూ క్యాంపస్‌లోని దూరవిద్య కేంద్రం భవనంలోని సెట్ కార్యాలయం నుంచి వాటిని తీసుకోవచ్చునని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 040-27097733 నంబర్‌కు ఫోన్ చేసిగాని వర్సిటీ వెబ్‌సైట్ ద్వారాగాని తెలుసుకోవచ్చు.
14 నుంచి ఏపీ, టీఎస్ సర్టిఫికెట్ల జారీ
Published Fri, Aug 7 2015 11:00 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
Advertisement
Advertisement