9 రకాల సేవలు మీ సేవకు బదలాయింపు
క్రీమీలేయర్–నాన్‌క్రీమీలేయర్, మార్కెట్‌వాల్యూ సరి్టఫైడ్‌కాపీ, ఖాస్రా, సెస్లా పహాణీలు..
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు మాన్యువల్‌గా రెవెన్యూవర్గాలు జారీ చేస్తున్న 9 రకాల సర్టీఫికెట్లు ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో విద్య, ఉద్యోగార్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలకు తోడు రెవెన్యూ సంబంధిత రికార్డులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు మీసేవ ద్వారానే ఆన్‌లైన్‌లో ఇస్తున్నారు. అయితే, ఈ సర్టీఫికెట్లు ఏడాదిలోపు రెండోసారి తీసుకుంటే మాత్రం మాన్యువల్‌గా తహసీల్దార్ కార్యాలయాలే ఇస్తున్నాయి. ఇప్పుడు ఏడాదిలోపు తీసుకున్నప్పటికీ ఆన్‌లైన్‌లో ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.
గ్యాప్ సర్టీఫికెట్, పేరు మారి్పడి పత్రం, స్థానికత నిర్ధారణ, క్రీమీలేయర్–నాన్‌క్రీమీలేయర్, మార్కెట్‌వాల్యూ సర్టీఫైడ్‌కాపీ, ఖాస్రా, సెస్లా పహాణీలు, ఆర్వోఆర్–ఐబీ రికార్డులు ఇక నుంచి మీసేవకేంద్రాల ద్వారా ఇవ్వాలనుకుంటున్నామని, ఇందుకు సంబంధించిన సమాచారం, సర్టీఫికెట్ ఫార్మాట్‌లను తమకు పంపాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేశారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే ఈ సమాచారం ఆధారంగా ముందుకెళ్లాలని సీసీఎల్‌ఏ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ సర్టీఫికెట్ల కోసం మీసేవకేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే, అక్కడి నుంచే వాటిని జారీ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment