![New Ration Card Applications in Meeseva Centers](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/455.jpg.webp?itok=MgLOfVUH)
సాక్షి, హైదరాబాద్: రేషన్ కార్డులు లేని నిరుపేద కుటుంబాలకు శుభవార్త. మీ సేవ ఆన్‌లైన్ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు ఆన్‌లైన్ ఎఫ్‌ఎస్‌సీ లాగిన్ పునరుద్ధరణకు పౌరసరఫరాల శాఖ అదేశాలు జారీ చేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2021 ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వెబ్‌సైట్ లాగిన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు తాజాగా మీ సేవ ద్వారా దరఖాస్తుకు కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది.
ఆఫ్‌లైన్‌లో 5.73 లక్షల దరఖాస్తులు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం గ్రేటర్‌లో ప్రజాపాలన ద్వారా సుమారు 5.73 లక్షల కుటుంబాల నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేశారు. వీటిని పక్కన పెట్టగా..విమర్శలు రావడంతో తిరిగి ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరణకు రంగం సిద్ధమైంది. కాగా గ్రేటర్‌లో రేషన్‌కా ర్డులు లేని పేద కుంటుంబాలు పది లక్షలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment