![10 February History Today Establishment of Democracy in India](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/history-main.jpg.webp?itok=C8kIXlvl)
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్న భారతదేశంలో ఫిబ్రవరి 10కి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజును ప్రజాస్వామ్యంలో పండుగ రోజుగా అభివర్ణిస్తారు. దేశంలోని పౌరులు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేయడం ద్వారా తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అయితే 1952లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికలు పెద్ద సవాలుగా నిలిచాయి.
1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ దేశ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూవచ్చారు. 1952 ఫిబ్రవరి 10.. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ముఖ్యమైన రోజుగా మారింది. ఆరోజు నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ లోక్‌సభలోని 489 సీట్లలో 249 సీట్లు గెలుచుకుని మెజారిటీ సాధించింది. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడంలో ఈ ఎన్నికలు విజయబావుటా ఎగురవేశాయి.
ఫిబ్రవరి 10న భారత్‌తో పాటు ప్రపంచ చరిత్రలో ప్రముఖంగా నిలిచిన ఘట్టాలను ఒకసారి నెమరువేసుకుందాం.
1818: ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో బ్రిటిష్ సైన్యం, మరాఠా సైన్యం మధ్య మూడవ, చివరి యుద్ధం జరిగింది.
1921: మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠాన్ని ప్రారంభించారు.
1921: బ్రిటిష్ పాలకుడు కన్నాట్ డ్యూక్ ఇండియా గేట్ నిర్మాణానికి పునాది రాయి వేశారు.
1952: స్వాతంత్ర్యం తర్వాత జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్కును దాటి, దేశంలో ప్రజాస్వామ్య స్థాపనను ప్రకటించింది.
1990: గెలీలియో అంతరిక్ష నౌక బృహస్పతి వైపు వెళుతూ, శుక్ర గ్రహం ముందునుంచి వెళ్లింది.
1996: చదరంగం ఒక మైండ్ గేమ్‌గా పేరొందింది. ప్రపంచ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్- డీప్ బ్లూ మధ్య ఫిబ్రవరి 10న ఒక మ్యాచ్ జరిగింది. దీనిలో కాస్పరోవ్ 4-2 తేడాతో గెలిచారు. మరుసటి సంవత్సరం ఈ పోటీలో డీప్ బ్లూ విజయం సాధించించారు.
2005: బ్రిటన్ యువరాజు చార్లెస్ తన చిరకాల స్నేహితురాలు కెమిల్లా పార్కర్‌తో వివాహాన్ని ప్రకటించారు.
2009: ప్రముఖ శాస్త్రీయ గాయకుడు పండిట్ భీమ్‌సేన్ జోషికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. 2008 నవంబర్‌లో ఆయనకు భారతరత్న అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు.
2010: పాకిస్తాన్‌లోని పెషావర్ సమీపంలోని ఖైబర్ పాస్ ప్రాంతంలో పోలీసు అధికారుల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. దీనిలో 13 మంది పోలీసు అధికారులతో పాటు మొత్తం 17 మంది మృతిచెందారు.
2013: అలహాబాద్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 36 మంది మృతిచెందారు. 39 మంది గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: 11 ఏళ్లలో 86 విదేశీ పర్యటనలు.. ప్రధాని మోదీ ఎప్పుడు ఎక్కడికి వెళ్లారు?
Comments
Please login to add a commentAdd a comment