History of 15th August: ఆగస్టు 15న ఏమేం జరిగాయంటే.. | History of 15th August | Sakshi
Sakshi News home page

History of 15th August: ఆగస్టు 15న ఏమేం జరిగాయంటే..

Published Wed, Aug 14 2024 9:20 AM | Last Updated on Wed, Aug 14 2024 10:03 AM

History of 15th August

బ్రిటీష్ వారి నుంచి భారతదేశం 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం పొంది, స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంది. ఇదొక్కటే కాదు చరిత్రలో ఆగస్టు 15న పలు ఘటనలు చోటుచేసుకున్నాయి.

1972, ఆగస్టు 15న భారత పోస్టల్ సర్వీస్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం మొదలయ్యింది. ఆ రోజున ‘పోస్టల్ ఇండెక్స్ నంబర్’ అంటే పిన్ కోడ్ ఆవిర్భావమయ్యింది. నాటి నుంచి ప్రతి ప్రాంతానికి ప్రత్యేక పిన్ కోడ్‌ అమలులోకి వచ్చింది.

1854: ఈస్ట్ ఇండియా రైల్వే కలకత్తా నుంచి హుగ్లీకి మొదటి ప్యాసింజర్ రైలును నడిపింది. ఈ రైలు అధికారికంగా 1855 నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది.

1866: లీచ్టెన్‌స్టెయిన్ దేశానికి జర్మన్ పాలన నుండి విముక్తి  లభించింది.

1872: భారతీయ తత్వవేత్త అరబిందో జననం.

1886: రామకృష్ణ పరమహంస కన్నుమూత

1945: దక్షిణ కొరియా, ఉత్తర కొరియా రెండూ స్వతంత్రంగా మారాయి.

1947: రక్షణ శౌర్య పురస్కారాలైన పరమవీర చక్ర, మహావీర చక్ర, వీరచక్రల ప్రధాన ప్రకటన.

1975: బంగ్లాదేశ్‌లో సైనిక విప్లవం.

1950: భారతదేశంలో 8.6 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 30 వేల మంది మృతి.

1960: ఫ్రెంచ్ బానిసత్వం నుండి కాంగోకు స్వాతంత్య్రం.

1971: బ్రిటీష్ పాలన నుండి బహ్రెయిన్‌కు స్వాతంత్య్రం.

1982: రంగులలో జాతీయ టీవీ ప్రసారాలు ప్రారంభం.

1990: ఉపరితలం నుండి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి ఆకాష్ ప్రయోగం విజయవంతం

2007: దక్షిణ అమెరికా దేశం పెరూలోని మధ్య తీర ప్రాంతంలో 8.0 తీవ్రతతో భూకంపం. 500 మంది మృతి.

2021: తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకుంది. దేశం విడిచిపెట్టిన ఆఫ్ఘన్‌ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.

2021: హైతీ దేశంలో భూకంపం కారణంగా 724 మంది మృతి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement