![ASIC a Guide on Brand Endorsements by Celebrities and Social Media Influencers](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/social-media-main.jpg.webp?itok=5zlPokbf)
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రభావం అధికంగా ఉంటోంది. వీరు ఫేస్‌బుక్ (Facebook), ట్విట్టర్ (Twitter), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) యూట్యూబ్ (YouTube) తదితర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లో చేసే పోస్టులకు మంచి రీచ్ వస్తోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు వినియోగదారులపై తమ ఉత్పత్తుల ప్రచారంతో విపరీతమైన ప్రభావాన్ని చూపుతున్నారు. అయితే వీరిలోని కొందరు చేసే అడ్వెర్టైజ్‌మెంట్లు, అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టిసెస్ వినియోగదారులను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలి(ఏఎస్‌సీఐ) హెచ్చరించింది.
ఏఎస్‌సీఐ గతంలో సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఆగడాలను కట్టడి చేసేందుకు పలు మార్గదర్శకాలను రూపొందించిన ప్రకటించింది. అయితే వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇన్‌ఫ్లుయెన్సర్లు వ్యవహరిస్తూ, వినియోగదారులను నిలువునా ముంచేస్తున్నారు. ఏఎస్‌సీఐ ప్రకటించిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
1. పారదర్శకత: ఇన్‌ఫ్లుయెన్సర్లు తాము ప్రచారం చేస్తున్న బ్రాండ్‌లకు సంబంధించిన వస్తుపరమైన ప్రయోజనాలను బహిర్గతం చేయాలి. ఆ వస్తువు లేదా సేవలకు సంబంధించిన చెల్లింపులు, బహుమతులు, ఉచిత ఉత్పత్తులు లేదా పరిహారం లాంటివి తప్పనిసరిగా వెల్లడించాలి.
2. సరైన వివరణ: ఇన్‌ఫ్లుయెన్సర్లు ఏదైనా బ్రాండ్ గురించి చెబుతున్నప్పుడు అది వినియోగదారునికి సులభంగా అర్థమయ్యేలా ఉండాలి. హ్యాష్‌ట్యాగ్‌లు లేదా టెక్స్ట్‌లో అంతర్గతంగా దాచివుంచకూడదు. ఆ వివరాలు వినియోగదారునికి తెలిసేలా ఉండాలి
3. స్పష్టత: ఎండార్స్‌మెంట్స్ తప్పనిసరిగా సరళమైన, భాషలో ఉండాలి. అది అడ్వెర్టైజ్‌మెంట్, స్పాన్సర్డ్, పెయిడ్ ప్రమోషన్ లాంటి పదాలను ఉపయోగిస్తూ స్పష్టతవ్వాలి.
4. వివిధ ప్లాట్‌ఫారాలు: ఏఎస్‌సీఐ వివిధ ప్లాట్‌ఫారాలకు నిర్దిష్ట రూపంలో మార్గదర్శకాలను ప్రకటించింది. ఇన్‌ఫ్లుయెన్సర్లు వాటిని గమనించి, ఆ నిర్దిష్ట నియమాలను పాటించాలి.
5. ప్రస్తావన: ఇన్‌ఫ్లుయెన్సర్ మొదటి పోస్ట్‌లో మాత్రమే కాకుండా, స్పాన్సర్ చేస్తున్న ఉత్పత్తి లేదా సేవను గురించి ప్రస్తావించిన ప్రతిసారీ పారదర్శకత పాటించాలి.
6. చట్టపరమైన సమ్మతి: ఇన్‌ఫ్లుయెన్సర్లు వారుంటున్న ప్రాంతంలోని మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. భారతదేశంలో ఈ మార్గదర్శకాలను అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ), సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ)లు రూపొందించి, అమలు చేస్తున్నాయి.
7. పరిణామాలు: ఇన్‌ఫ్లుయెన్స ఈ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైతే వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టే అవకాశముంది. వారికి జరిమానా కూడా విధిస్తారు. ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా మార్థదర్శకాలను ఉల్లంఘించినప్పుడు అని వారి ఖ్యాతిని దెబ్బతీస్తుంది. వినియోగదారులతో సత్సంబంధాలను కోల్పోతారు. ఏఎస్‌సీఐ రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించడం వలన ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ ఫాలోవర్స్‌లో నమ్మకాన్ని పెంచుకోగలుగుతారు.
ఇది కూడా చదవండి: 11 ఏళ్లలో 86 విదేశీ పర్యటనలు.. ప్రధాని మోదీ ఎప్పుడు ఎక్కడికి వెళ్లారు?
Comments
Please login to add a commentAdd a comment