rules
-
వినియోగదారుడా మేలుకో.. ఇన్ఫ్లుయెన్సర్ల మాయాజాలమిదే..
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం అధికంగా ఉంటోంది. వీరు ఫేస్బుక్ (Facebook), ట్విట్టర్ (Twitter), ఇన్స్టాగ్రామ్ (Instagram) యూట్యూబ్ (YouTube) తదితర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లో చేసే పోస్టులకు మంచి రీచ్ వస్తోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు వినియోగదారులపై తమ ఉత్పత్తుల ప్రచారంతో విపరీతమైన ప్రభావాన్ని చూపుతున్నారు. అయితే వీరిలోని కొందరు చేసే అడ్వెర్టైజ్మెంట్లు, అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టిసెస్ వినియోగదారులను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలి(ఏఎస్సీఐ) హెచ్చరించింది. ఏఎస్సీఐ గతంలో సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ఆగడాలను కట్టడి చేసేందుకు పలు మార్గదర్శకాలను రూపొందించిన ప్రకటించింది. అయితే వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇన్ఫ్లుయెన్సర్లు వ్యవహరిస్తూ, వినియోగదారులను నిలువునా ముంచేస్తున్నారు. ఏఎస్సీఐ ప్రకటించిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.1. పారదర్శకత: ఇన్ఫ్లుయెన్సర్లు తాము ప్రచారం చేస్తున్న బ్రాండ్లకు సంబంధించిన వస్తుపరమైన ప్రయోజనాలను బహిర్గతం చేయాలి. ఆ వస్తువు లేదా సేవలకు సంబంధించిన చెల్లింపులు, బహుమతులు, ఉచిత ఉత్పత్తులు లేదా పరిహారం లాంటివి తప్పనిసరిగా వెల్లడించాలి.2. సరైన వివరణ: ఇన్ఫ్లుయెన్సర్లు ఏదైనా బ్రాండ్ గురించి చెబుతున్నప్పుడు అది వినియోగదారునికి సులభంగా అర్థమయ్యేలా ఉండాలి. హ్యాష్‌ట్యాగ్‌లు లేదా టెక్స్ట్‌లో అంతర్గతంగా దాచివుంచకూడదు. ఆ వివరాలు వినియోగదారునికి తెలిసేలా ఉండాలి3. స్పష్టత: ఎండార్స్మెంట్స్ తప్పనిసరిగా సరళమైన, భాషలో ఉండాలి. అది అడ్వెర్టైజ్మెంట్, స్పాన్సర్డ్, పెయిడ్ ప్రమోషన్ లాంటి పదాలను ఉపయోగిస్తూ స్పష్టతవ్వాలి.4. వివిధ ప్లాట్‌ఫారాలు: ఏఎస్సీఐ వివిధ ప్లాట్‌ఫారాలకు నిర్దిష్ట రూపంలో మార్గదర్శకాలను ప్రకటించింది. ఇన్ఫ్లుయెన్సర్లు వాటిని గమనించి, ఆ నిర్దిష్ట నియమాలను పాటించాలి.5. ప్రస్తావన: ఇన్ఫ్లుయెన్సర్ మొదటి పోస్ట్‌లో మాత్రమే కాకుండా, స్పాన్సర్ చేస్తున్న ఉత్పత్తి లేదా సేవను గురించి ప్రస్తావించిన ప్రతిసారీ పారదర్శకత పాటించాలి.6. చట్టపరమైన సమ్మతి: ఇన్ఫ్లుయెన్సర్లు వారుంటున్న ప్రాంతంలోని మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. భారతదేశంలో ఈ మార్గదర్శకాలను అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ), సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ)లు రూపొందించి, అమలు చేస్తున్నాయి.7. పరిణామాలు: ఇన్‌ఫ్లుయెన్స ఈ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైతే వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టే అవకాశముంది. వారికి జరిమానా కూడా విధిస్తారు. ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా మార్థదర్శకాలను ఉల్లంఘించినప్పుడు అని వారి ఖ్యాతిని దెబ్బతీస్తుంది. వినియోగదారులతో సత్సంబంధాలను కోల్పోతారు. ఏఎస్సీఐ రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించడం వలన ఇన్ఫ్లుయెన్సర్లు తమ ఫాలోవర్స్‌లో నమ్మకాన్ని పెంచుకోగలుగుతారు.ఇది కూడా చదవండి: 11 ఏళ్లలో 86 విదేశీ పర్యటనలు.. ప్రధాని మోదీ ఎప్పుడు ఎక్కడికి వెళ్లారు? -
ద రూల్ ఆఫ్ అఖాడా..!
సాక్షి, న్యూఢిల్లీ: జీవితం మీద అసంతృప్తితో ఈ భవ బంధాలన్నీ వదిలేసి సన్యాసం తీసుకుంటే బాగుంటుంది అని అంటూ ఉంటారు కొందరు. ఏదైనా అనుభవిస్తే కానీ అసలు విషయం తెలియదంటారు మన పెద్దలు. అవును..లోతుగా పరిశీలిస్తే సన్యాసం కూడా అంత సులువైంది కాదని అర్థమవుతుంది. అక్కడా నియమాలు పాఠించాలి. సన్యాస అఖాడా (ఆశ్రమం)ల్లోనూ సొంత చట్టాలు ఉంటాయి. వాటిని అమలు చేసేందుకు వారికి ప్రత్యేకంగా పోలీస్స్టేషన్లు (కొత్వాలీలు) ఉంటాయి. సభ్యులు ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే కొన్నిసార్లు వింత శిక్షలు, నేరాలు చేస్తే కఠిన శిక్షలు, తీవ్ర నేరాలకు పాల్పడితే అఖాడా నుంచి బహిష్కరణ వేటు తప్పదు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం మహాకుంభమేళా సమయంలో పుణ్యస్నానాలకు వచ్చిన నాగా సాధువుల జీవన శైలి గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం... దేశంలో 13 అఖాడాలు అఖాడా అనేది సంస్కృత పదం. కుస్తీ బరి లేదా చర్చ వేదిక అని అర్థం. సన్యాస దీక్ష తీసుకున్న వారు, సాధువులు, నాగ సాధువులు, సంతులకు ఆశ్రయం ఇస్తాయి. వీటి కేంద్రంగానే వారు సంప్రదాయాలకు అనుగుణంగా దైవాన్ని ఆరాధిస్తారు. 2019 నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం 13 అఖాడాలున్నాయి. వీటిలో ఏడింటిని ఆది శంకరాచార్య స్థాపించారు. 13 అఖాడాల్లో ఏడు శైవ అఖాడాలు. ఇక్కడ శివుడిని ఆరాధిస్తారు. మూడు వైష్ణవ అఖాడాలు. వీటినే బైరాగి అఖాడాలనీ అంటారు. వీరు విష్ణు మూర్తిని కొలుస్తారు. మిగతా మూడు ఉదాసిన్ అఖాడాలు. వీరు గురునానక్ పెద్ద కుమారుడు శ్రీచంద్ బోధనలను అనుసరిస్తారు. అలాగే ట్రాన్స్‌జెండర్లకూ ప్రత్యేకంగా కిన్నెర అఖాడా ఉంది. ఆది శంకరాచార్య స్థాపించిన జూనా అఖాడా అతి పెద్దది. కిన్నెర అఖాడా దీని పరిధిలోనే ఉంటుంది. కొత్వాల్దే బాధ్యత దశానమి సంప్రదాయాన్ని పాఠించే అన్ని శైవ అఖాడాలకు సొంత చట్టాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఒక్కో అఖాడాకు ఒక పోలీస్‌స్టేషన్ (కొత్వాలీ) ఉంటుంది. అఖాడా నియమ నిబంధనలు అమలు చేయడానికి ప్రత్యేకంగా ఒకరికి కొత్వాల్‌గా బాధ్యతలు అప్పగిస్తారు. అలాగే అంతర్గత భద్రత బాధ్యత కూడా వీరిదే. ఆయన అఖాడాలోని నాగ సాధువులను, ఇతర సాధువులను నియంత్రిస్తాడు. అఖాడా సభ్యుడు ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. అఖాడాల్లో ఏదైనా అంతర్గత వివాదం తలెత్తిదే దానిపై కోర్డును అశ్రయించేందుకు అఖాడాలు అనుమతించవు. అంతా కలిసి సమావేశమై వివాదాన్ని పరిష్కరించుకుంటారు. అఖాడా భద్రత కోసం వేర్వేరు రక్షక భటులు ఉంటారు. నాగ సన్యాసులు మాత్రమే కొత్వాల్ పదవికి అర్హులు. శిక్షించే అధికారం అతడిదే అఖాడాలో రూల్స్ అమలు పరిచేందుకు నియమించిన కొత్వాల్‌కు మాత్రమే శిక్షలు కూడా అమలు చేసే బాధ్యత ఉంటుంది. ఆయనకు వెండి పూత కలిగిన ఒక దండాన్ని ఇస్తారు. నిబంధనలు అతిక్రమించిన వారిని కొత్వాల్ వద్దకు తీసుకువస్తారు. విచారణ తర్వాత చిన్న తప్పుకు చిన్న శిక్షలే ఉంటాయి. చేసిన తప్పులు గ్రహించే విధంగా కూడా శిక్షలు విధిస్తారు. కొత్వాల్ సమక్షంలో గంగానదిలో 108 మునకలు వేయడం. ౖ అఖాడాలోని ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వారికి పళ్లు తోముకునేందుకు పళ్లపొడి లేదా పళ్లపుల్ల ఇవ్వడం. ఒక వారం పాటు అఖాడాలో శుచీ శుభ్రత బాధ్యతలు చూసుకోవడం, అఖాడా గురువు వినియోగించే పాత్రలను శుభ్రం చేయడం వంటి శిక్షలు విధిస్తారు. ఆరోపణలు తీవ్రంగా ఉంటే కఠిన శిక్షలు ఉంటాయి. వివాహం, అత్యాచారం, ఆర్థిక నేరం వంటి ఆరోపణలు నిరూపణ అయితే అఖాడా నుంచి బహిష్కరిస్తారు. ఈ శిక్షల్లో ఎక్కువగా జరిమానాలను విధించడం వంటివి ఉండవు. అఖాడాలోని పరిస్థితులను బట్టి కొత్వాల్‌ను కూడా మారుస్తారు. దీక్షకు ముందే పిండ ప్రదానంహిందూ మతంలో ఒక వ్యక్తి మరణానంతరం మాత్రమే పిండ ప్రదానం చేస్తారు. కానీ అఖాడాలో సన్యాస దీక్ష తీసుకోవాలంటే ముందుగా తనకు తానే పిండ ప్రదానం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తన పూరీ్వకుల రుణం నుంచి విముక్తి పొందడానికి ఈ విధి తప్పనిసరి. అలాగే ఈ ప్రక్రియతో అతని సామాజిక బాధ్యతలన్నిటితో బంధాలు తెగిపోయినట్లే. దీక్ష తీసుకున్న తర్వాత ఏ వ్యక్తి అయినా సామాజిక జీవితంలోకి తిరిగి రాలేడు. -
బంగారం ఎంత కొనచ్చు? పెళ్లికానివారికైతే అంతే!
భారత దేశంలో బంగారాన్ని (Gold) సంపదకు, ఐశ్వర్యానికి చిహ్నంగా పరిగణిస్తారు. మన సంప్రదాయాలలో పసిడి లోతుగా పాతుకుపోయింది. బంగారం కొనడాన్ని భారతీయులు అదృష్టంగా భావిస్తారు. ముఖ్యంగా పండుగ సందర్భాలలో పుత్తడి కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. నాణేలు, ఆభరణాలు.. ఇలా వివిధ రూపాల్లో బంగారాన్ని కొని ఇంట్లో పెట్టుకుంటారు.అంతటి ప్రాధాన్యత ఉన్న బంగారాన్ని కొనడానికి ముందు దానికి సంబంధించిన నిబంధనలను తెలుసుకోవడం, అనుసరించడం కూడా అంతే ముఖ్యం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) మార్గదర్శకాల ప్రకారం, డిక్లేర్డ్ ఆదాయం, వ్యవసాయ ఆదాయం, సహేతుకమైన గృహ పొదుపులు లేదా చట్టబద్ధంగా సంక్రమించిన ఆస్తులతో కొనుగోలు చేసిన బంగారంపై ఎటువంటి పన్నులు ఉండవు. ఇలా కాకుండా వేరే మార్గాల ద్వారా సమకూర్చుకున్న బంగారం పరిమితులకు మించి ఉంటే అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.ఎంత బంగారం ఉండొచ్చు?వివాహిత మహిళలు: 500 గ్రాముల వరకుఅవివాహిత స్త్రీలు: 250 గ్రాముల వరకుపురుషులు (వివాహితులు, అవివాహితులు ఎవరైనా): 100 గ్రాముల వరకుబంగారం.. పెట్టుబడి మార్గంస్టాక్లు, మ్యూచువల్ ఫండ్లు బాండ్లతో పాటు బంగారం కూడా చాలా కాలంగా విశ్వసనీయ పెట్టుబడి ఎంపికగా ఉంది. సంపదను పెంచుకోవడానికి ఇది నమ్మదగిన మార్గంగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది. డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGBs) వంటి బంగారు పెట్టుబడుల కొత్త రూపాలు ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, చాలా మంది ఇప్పటికీ భౌతిక బంగారాన్ని ఇష్టపడుతున్నారు. వివిధ రకాల గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లు వాటి నిబంధనలను పరిశీలిస్తే..ఫిజికల్ గోల్డ్: పురుషులు 100 గ్రాముల వరకు కలిగి ఉండవచ్చు. వివాహిత మహిళలు 500 గ్రాములు, అవివాహిత స్త్రీలు 250 గ్రాములు గరిష్టంగా కలిగి ఉండవచ్చు. మూడు సంవత్సరాల తర్వాత భౌతిక బంగారాన్ని విక్రయిస్తే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 20 శాతంతోపాటు సెస్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్వల్పకాలిక అమ్మకాలపై ఆదాయ స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను ఉంటుంది. అలాగే కొనుగోళ్లపైనా 3% జీఎస్టీ (GST) ఉంటుంది.డిజిటల్ గోల్డ్: ఇది మరింత అనుకూలమైన ఎంపిక. డిజిటల్ గోల్డ్‌లో నిల్వ అవాంతరాలు ఉండవు. ఉపసంహరణపై మాత్రమే పన్నులు వర్తిస్తాయి. దీనిపై పెట్టే రోజువారీ ఖర్చు రూ. 2 లక్షలకు పరిమితం.సావరిన్ గోల్డ్ బాండ్: ఈ బాండ్లు సంవత్సరానికి 4 కిలోల వరకు పెట్టుబడిని అనుమతిస్తాయి. దీనిపై 2.5% వార్షిక వడ్డీ లభిస్తుంది. అయితే ఇది పన్ను పరిధిలోకి వస్తుంది. ఎనిమిది సంవత్సరాల తర్వాత వీటి నుండి వచ్చే లాభాలు పన్ను రహితంగా ఉంటాయి.గోల్డ్ ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్లు: వీటి నుండి వచ్చే లాభాలపై భౌతిక బంగారంతో సమానంగా పన్ను ఉంటుంది. దీర్ఘకాలిక మూలధన లాభాలపై మూడేళ్ల తర్వాత 20 శాతం పన్ను విధిస్తారు. -
ECపై ‘సుప్రీం’లో కాంగ్రెస్ పిటిషన్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ(Congress Party) కోర్టుకెక్కింది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో ఒక రూల్‌కు ఇటీవల ఈసీ సవరణ చేసింది. అయితే.. ఈ చర్యతో ఎన్నికల ప్రక్రియ సమగ్రత క్షీణిస్తోందంటూ కాంగ్రెస్ సర్వోన్నత న్యాయస్థానంలో మంగళవారం ఓ రిట్ పిటిషన్ వేసింది. ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు గతంలో అనుమతి ఉండేది. అయితే ఈసీ ఈ మధ్యే ఈ రూల్‌కు సవరణ చేసింది. కొత్త రూల్ ప్రకారం.. ఇక నుంచి పోలింగ్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను, వెబ్‌కాస్టింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది. కొత్త సవరణతో(Amendments) ఎలక్ట్రానిక్ రికార్డులు మినహా ఇతర పత్రాలు, డాక్యుమెంట్లు తనిఖీకి అందుబాటులో ఉంటాయి. పోలింగ్ బూత్‌లలోని సీసీ టీవీ కెమెరాల తనిఖీవల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతోందని, అందుకే నిషేధం విధించామని ఈసీ వర్గాలు వెల్లడించాయి. పైగా ఫుటేజ్‌ను వినియోగించుకుని కృత్రిమ మేధ(Artificial Intelligence) ద్వారా నకిలీ వీడియోలను తయారు చేస్తున్నారని తెలిపాయి. రూల్ 93కి సవరణ తర్వాతా అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ రికార్డులు అందుబాటులో ఉంటాయని, కానీ ఇతరులు తనిఖీ చేయడానికి అనుమతి ఉండదని స్పష్టత ఇచ్చింది.ఎన్నికల సంఘం(Election Commission) సిఫార్సు మేరకే.. ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని రూల్ 93(2)(ఏ)ను కేంద్ర న్యాయశాఖ సవరించింది. ఈ సవరణకు ఓ కోర్టు కేసు కారణమని ఈసీతోపాటు న్యాయశాఖ వేర్వేరుగా గత శుక్రవారం వివరణ ఇచ్చాయి. ఇక.. అయితే ఈ పరిణామంపై కాంగ్రెస్(Congress Party) మండిపడింది. ఎన్నికల్లో పారదర్శకతకు ఇది విఘాతమని స్పష్టం చేసింది. ఎన్నికల నిబంధనను మార్చడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పారదర్శకతకు ఈసీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించింది. ఈ సవరణను న్యాయపరంగా సవాలు చేస్తామని ఇంతకు ముందే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పష్టం చేశారు. కోర్టు తీర్పును పాటించాల్సిన ఈసీ.. అందుకు విరుద్ధంగా నిబంధనలకు సవరణ చేయడం విడ్డూరమని ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ముంచెత్తిన మంచులో వాహనాలు -
ఖో..ఖో : ఇంట్రస్టింగ్ స్టోరీ.. ఖో అంటే అర్థం ఏంటి?
ఇప్పుడు కొన్ని స్కూళ్లలో దీనిని మర్చిపోయారుకాని ఒకప్పుడు ప్రతి స్కూల్లో ఆడించేవారు. పిల్లలు ఉత్సాహంగా ఆడేవారు. ఖొఖొ ఆట ఆడటం సులువు కాబట్టి పిల్లలు స్కూళ్లలో, ఇంటి వద్ద, మైదానాల్లో ఆడవచ్చు. ఇది ఆడేందుకే కాదు, చూసేందుకూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఖొఖొ చరిత్రేమిటో తెలుసా? ఖొఖొ దక్షిణాసియా సంప్రదాయ క్రీడ. క్రీ.పూ నాలుగో శతాబ్దం నుంచే ఈ ఆట ఆడి ఉంటారని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. మహాభారతంలో కూడా ఖొఖొ ప్రస్తావన ఉందని కొందరి మాట. అప్పట్లో దీన్ని ‘ఖొ ధ్వని క్రీడ’ అని పిలిచేవారు. అంటే ‘ఖొ’ అని శబ్దం చేస్తూ ఆడే ఆట అని అర్థం.రకరకాల నియమాలు, విధానాలతో ఆడే ఈ ఆట 1914 నుంచి ఒక స్థిరమైన రూపాన్ని పొందింది. పుణెలోని డక్కన్ జింఖాన్ క్లబ్ వారు ఈ ఆటకు సంబంధించి నిబంధనలు ఏర్పాటు చేసి తొలి రూల్ బుక్ తయారుచేశారు. అనంతరం అనేక పోటీల్లో ఖొఖొ భాగమైంది. దక్షిణాసియా క్రీడాపోటీలు, ఖేలో ఇండియా, నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా వంటి వేదికలపై ఖొఖొ చోటు దక్కించుకుంది. ఆటలో ఒక జట్టుకు ఏడుగురు క్రీడాకారులు ఉంటారు. వారిలో ఒకరు పరిగెడుతూ ఉండగా మరో జట్టులోని వ్యక్తి అతణ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అతని వెళ్లే మార్గాన్ని బట్టి పరిగెత్తే వ్యక్తి మరో వ్యక్తిని తట్టి ‘ఖొ’ అంటాడు. వెంటనే అతను లేచి అవతలి జట్టు వ్యక్తి కోసం పరిగెడతాడు. అతని స్థానంలో అతనికి ‘ఖొ’ ఇచ్చిన వ్యక్తి కూర్చుంటాడు. ఇది ‘ఖొఖొ’ ఆడే విధానం. మొదట్లో మట్టి, ఇసుక వంటివి ఉన్నచోట ఖొఖొ ఆడేవారు. ప్రస్తుతం స్టేడియంలో ఏర్పాటు చేసిన కోర్టుల్లోనూ ఆడుతున్నారు. మనదేశంలో నస్రీన్ షేక్, సతీష్రాయ్, సారికా కాలె, పంకజ్ మల్హోత్రా, మందాకినీ మఝీ, ప్రవీణ్‌కుమార్ వంటివారు ఖొఖొ క్రీడాకారులుగా గుర్తింపు పొందారు. 2024 మార్చిలో జాతీయ ఖొఖొ ఛాంపియన్ షిప్‌పోటీలు నిర్వహించారు. అందులో మహారాష్ట్ర జట్లు స్త్రీ, పురుషుల విభాగాల్లో విజేతలుగా నిలిచాయి. ఖొఖొకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ‘అంతర్జాతీయ ఖొఖొ సమాఖ్య’ 2025లో ‘ఖొఖొ ప్రపంచ కప్ పోటీలను నిర్వహించాలని అనుకుంటోంది. ఇందులో భారత ఖొఖొ సమాఖ్య కూడా భాగం కానుంది. దీంతోపాటు 2036లో జరిగే ఒలింపిక్స్‌లో ఖొఖొను కూడా చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖొఖొ నేర్చుకోండి. ఈసారి మరింత ఉత్సాహంగా ఆడండి. -
ఇలా చేస్తే... మీరు రిచ్చో రిచ్చు!
జీవితంలో ఎవరికైనా సరే ధనవంతునిగా మారాలని, అన్ని సౌకర్యాలను అందిపుచ్చుకోవాలని ఉంటుంది. అయితే అందుకు పరిస్థితులు అడ్డంకిగా మారాయని పలువురు చెబుతుంటారు. సరైన పెట్టుబడి వ్యూహంతో ముందుకెళితే డబ్బుకి చింత లేకుండా జీవితాన్ని నిశ్చింతగా గడపవచ్చని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.పెట్టుబడి పెట్టడంలో ఎల్లప్పుడూ తగిన వ్యూహాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మనం సంపాదించిన డబ్బును సరైన మార్గంలో వినియోగించినట్లవుతుంది. మనం సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని సరైన పద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా జీవితాంతం డబ్బుకు లోటు లేకుండా హాయిగా జీవించగలుగుతాం. ఇందుకు దోహదపడేలా నిపుణులైన ఇన్వెస్టర్లు కొన్ని సూత్రాలు చెప్పారు. 1. రూల్ ఆఫ్ 7272 నియమం సహాయంతో స్థిర వడ్డీ రేటుతో డబ్బు ఎంత సమయంలో రెట్టింపు అవుతుందో తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు పెట్టుబడిపై పొందుతున్న వడ్డీ రేటును 72తో భాగించవలసి ఉంటుంది. ఉదాహరణకు, మీరు బ్యాంకులో ఎఫ్డీపై 7 శాతం వడ్డీని పొందుతున్నారనుకుందాం. అప్పుడు మీరు 72ని 7తో భాగిస్తే, సమాధానం 10.28 అవుతుంది. అంటే 7 శాతం వడ్డీతో మీ డబ్బు 10.28 ఏళ్లలో రెట్టింపు అవుతుంది.2. 10-12-10 10-12-10 నియమం ప్రకారం 10 సంవత్సరాలకు 12శాతం వార్షిక రాబడిని ఇచ్చే పెట్టుబడి ఎంపికలో ప్రతి నెలా రూ. 10,000 పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు దాదాపు రూ. 23-24 లక్షలను కూడబెట్టవచ్చు. అయితే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో లేదా సగటు వార్షిక రాబడి 12శాతం ఉన్న షేర్లలో ప్రతి నెలా రూ. 43,000 పెట్టుబడి పెడితే, మీరు 10 సంవత్సరాలలో రూ. ఒక కోటి కార్పస్‌ను సృష్టించగలుగుతారు.3. 20-10-12 20-10-12 నియమం అనేది దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహం. మీరు 12శాతం వార్షిక రాబడిని ఇచ్చే పెట్టుబడి ఎంపికలో 20 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 10,000 ఇన్వెస్ట్ చేస్తే, మీరు కోటి రూపాయల కార్పస్‌ను కూడబెట్టుకోవచ్చు.4. 50-30-2050-30-20 నియమం అనేది మీ ఆదాయాన్ని వివిధ ఆర్థిక లక్ష్యాలకు కేటాయించడంలో మీకు సహాయపడే వ్యక్తిగత ఆర్థిక సూత్రం. ఈ నియమం ప్రకారం మీరు మీ ఆదాయంలో 50 శాతం అవసరమైన ఖర్చుల కోసం, 30 శాతం వినోదం, భోజనం వంటి ఖర్చులకు 20 శాతం పొదుపు,పెట్టుబడుల కోసం కేటాయించాలి.5. 40-40-12 మీరు 10-20 సంవత్సరాలలో పెద్ద కార్పస్‌ను అందుకునేందుకు 40-40-12 నియమాన్ని అనుసరించాల్సివుంటుంది. ఇందులో మీరు అధికమొత్తంలో పొదుపు చేయాలి. ఈ నియమంలో మీరు మీ నెలవారీ ఆదాయంలో 40 శాతం మొత్తాన్ని పొదుపు, పెట్టుబడులకు కేటాయించాలి. మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్లలో మీ పోర్ట్‌ఫోలియోలో 40 శాతం ఉంచాల్సి ఉంటుంది. ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా సగటు వార్షిక రాబడిని 12 శాతం లక్ష్యంగా చేసుకోవాలి.6. 15-15-15 15-15-15 నియమం ప్రకారం మీరు సంవత్సరానికి సగటున 15శాతం రాబడిని పొందే పెట్టుబడి ఎంపికలో 15 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 15,000 పెట్టుబడి పెడితే, మీరు సుమారు కోటి రూపాయలు అందుకో గలుగుతారు.7. 25X ఈ నియమం త్వరగా పదవీ విరమణ పొందాలనుకునే వారి కోసం ఉద్దేశించినది. ఈ నియమం ప్రకారం మీరు హాయిగా పదవీ విరమణ చేయగలిగేలా మీ వార్షిక ఖర్చుల కోసం ముందుగానే 25 రెట్లు ఆదా చేయాలి. ఉదాహరణకు మీ జీవనానికి సంవత్సరానికి రూ. 4 లక్షలు అవసరమైతే, మీ పదవీ విరమణ నిధికి రూ. ఒక కోటి (రూ. 4 లక్షలు x 25) అవసరం. సిప్ తరహా పెట్టుబడి ఎంపికలను అవలంబించడం ద్వారా మీరు ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు. మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, ఈ లక్ష్యాన్ని సాధించడం అంత సులభం అవుతుందని గుర్తించండి. ఇది కూడా చదవండి: 60 గంటల్లో ప్రపంచాన్ని చుట్టి.. ‘నాసా’ కొత్త చీఫ్ ఇసాక్‌మన్ సక్సెస్ స్టోరీ -
తెలంగాణ ఐఏఎస్ అధికారులపై ప్రభుత్వం వరుస ఆంక్షలు
-
టెలికం సంస్థలకు సైబర్ సెక్యూరిటీ నిబంధనలు
న్యూఢిల్లీ: దేశ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, సర్వీసులకు భద్రత కల్పించే దిశగా టెలికం సైబర్ సెక్యూరిటీ నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. సైబర్ సెక్యూరిటీకి భంగం కలగకుండా పాటించాల్సిన మార్గదర్శకాలు, ఒకవేళ ఉల్లంఘన ఉదంతాలేమైనా తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలు మొదలైనవి వీటిలో ఉన్నాయి.వీటి ప్రకారం ప్రతి టెలికం సంస్థ సైబర్ సెక్యూరిటీ పాలసీని (భద్రత చర్యలు, రిస్క్ మేనేజ్మెంట్ విధానాలు, శిక్షణ, ఉత్తమ విధానాలు.. టెక్నాలజీలను వినియోగించడం మొదలైనవి) అమలు చేయాల్సి ఉంటుంది. చీఫ్ టెలికమ్యూనికేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ని నియమించుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ ఉల్లంఘన జరిగితే ఆరు గంటల్లోగా ప్రభావిత సిస్టం వివరాలను కేంద్రానికి తెలియజేయాలి. 24 గంటల వ్యవధిలో ఏ ప్రాంతంలో, ఎంత మంది యూజర్లపై, ఎంత సేపు ప్రభావం పడింది, తీసుకున్న దిద్దుబాటు చర్యలేమిటి తదితర వివరాలను ఇవ్వాలి.అలాగే, మొబైల్ పరికరాల తయారీ సంస్థలు ఆయా ఉత్పత్తులను విక్రయించడానికి ముందే, వాటి ఐఎంఈఐ నంబరును ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. సైబర్ సెక్యూరిటీని మెరుగుపర్చే దిశగా టెలికం సంస్థల నుంచి ట్రాఫిక్ డేటా, ఇతరత్రా వివరాలను తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. -
‘బ్లడ్‌బ్యాంకులకు ‘రక్తహీనత’ అధ్వాన్నంగా పరిస్థితి
సాక్షి, దాదర్: ముంబైసహా రాష్ట్రంలోని వివిధ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు భారీగా తగ్గిపోయాయి. పరిస్ధితి ఇలాగే కొనసాగితే వివిధ ప్రభుత్వ, కార్పొరేషన్ ఆస్పత్రుల్లో అత్యవసరమైనవి మినహా సాధారణ ఆపరేషన్లన్నిటినీ వాయిదా వేయాల్సిన పరిస్ధితి ఎదురుకానుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ బ్లడ్ బ్యాంకుల్లో, కేంద్రాలలో కేవలం 43,062 యూనిట్ల రక్తం నిల్వలున్నాయి. అయినప్పటికీ కొన్ని బ్లడ్‌బ్యాంకులు ఇక్కడి రోగులకు అందించాల్సిన రక్తాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై సీరియస్‌గా స్పందించిన రాష్ట్ర రక్త నిల్వల పరిషద్ కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. పరిస్ధితులు సాధారణ స్ధితికి వచ్చే వరకు ఇతర రాష్ట్రాలకు రక్తాన్ని పంపించడాన్ని నిషేధించాలని పరిషద్ నిర్ణయించింది. ప్రైవేట్ బ్లడ్‌బ్యాంకుల దోపిడీ... సాధారణంగా ఏటా దీపావళి, వేసవి సెలవుల్లో పెద్ద సంఖ్యలో జనాలు తమ కుటుంబ సభ్యులతో స్వగ్రామాలకు లేదా విహార యాత్రలకు, పుణ్యక్షేత్ర సందర్శనకు వెళుతుంటారు. ఈ సమాయల్లో స్వచ్చంద సేవా సంస్ధలు, రాజకీయ పార్టీలు అక్కడక్కడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినప్పటికీ దాతలు ఎవరూ ముందుకురారు. దీంతో దీపావళి, వేసవి సెలవుల్లో బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వల కొరత తీవ్రంగా ఉంటుంది. ఈసారి దీపావళి పర్వదినానికి అసెంబ్లీ ఎన్నికలు కూడా తోడు కావడంతో పరిస్ధితి మరింత దారుణంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు, పదాధికారులు బిజీగా ఉన్నారు. వీరిలో రక్తదాతలు కూడా ఉండడంతో పరిస్ధితి అధ్వాన్నంగా తయారైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంవల్ల రాజకీయ పార్టీల తరఫున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి వీలులేకుండా పోయింది. స్వయం సేవా సంస్ధలు శిబిరాలు ఏర్పాటు చేసినప్పటికి ఎన్నికల ప్రచారంలో ప్రజలు బిజీగా ఉండడంతో రక్త దానం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఫలితంగా బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గిపోవడంతో అత్యవసర ఆపరేషన్లకే రక్తాన్ని సరఫరా చేస్తున్నారు. ఫలితంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, వారి వెంట ఉన్న బంధువులు రక్తం కోసం ఉరుకులు, పరుగులు తీయాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో, కేంద్రాలలో రక్తం లభించకపోవడంతో ప్రైవేటు బ్లడ్ బ్యాంకులపై దృష్టిసారించారు. గత్యంతరం లేక వారు అడిగినంత చెల్లించి రక్తాన్ని తీసుకువస్తున్నారు. కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో అయితే రోగుల బంధువులు రక్త దానం చేస్తేనే అందుకు బదులుగా అక్కడ నిల్వ ఉన్న బ్లడ్ గ్రూపు రక్తాన్ని ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కూడా కొద్ది రోజుల వరకూ ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఫలితాల అనంతరం విజయోత్సవాలు, ర్యాలీలతో రాజకీయ పార్టీలు చాలా బిజీగా ఉంటాయి. అంతేగాకుండా పదాధికారులు, కార్యకర్తలు విందులు, వినోదాలతో బిజీగా ఉండడంవల్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి సమయం దొరకదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత పరిస్ధితులన్నీ సాధారణ స్ధితికి వస్తే తప్ప రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి వీలుకాదు. అంతవరకు రక్తం కొరతను చవిచూడక తప్పదని తాజా పరిస్ధితులను బట్టి స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల తరపున కాకుండా వివిధ ధార్మిక, సామాజిక సేవా సంస్ధల ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని పరిషద్ పిలుపు నిచ్చింది. నివాస సొసైటీల ఆవరణలో, పాఠశాల మైదానాలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. శిబిరాలు తమకు దగ్గరలోనే ఉండటం వల్ల రక్తదాతలు స్వచ్చందంగా ముందుకు వస్తారని పరిషద్ భావిస్తోంది. లేదంటే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్ధితి చేయి దాటిపోయే ప్రమాద ముందని ఆందోళన వ్యక్తంచేసింది. -
వందేళ్ల శివాజీ పార్క్: ఎన్నికల ప్రచారానికి నిబంధనల షాక్!
వందేళ్ల చరిత్ర: శివాజీపార్క్ మైదానానికి సుమారు వందేళ్ల చరిత్ర ఉంది. ముంబై నడిరోడ్డున దాదర్ ప్రాంతంలో ఉన్న శివాజీపార్క్ మైదానం 1925లో బీఎంసీ ప్రజల కోసం అందుబాటులోకి తెచి్చంది. అప్పట్లో ఈ మైదానాన్ని మాహిం పార్క్‌గా పిలిచేవారు.సుమారు లక్షా మందికిపైగా కూర్చునేందుకు వీలుంది. దీంతో వివిధ పారీ్టల రాజకీయ నాయకులు తమ ప్రచార సభలు, ర్యాలీలు ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సహా అనేక మంది ఆటగాళ్లు క్రికెట్ నేర్చుకున్నది, ప్రాక్టీస్ చేసింది ఇక్కడే. భారత్‌కు పేరు తెచ్చిన అనేక మంది క్రికెటర్లకు ఈ మైదానమే వేదికగా నిలిచింది. అంతేగాకుండా సుమారు ఆరు దశాబ్దాల కిందట దివంగత బాల్ ఠాక్రే శివసేన పార్టీ స్ధాపించింది ఇక్కడే. అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు ఏటా ఇక్కడే విజయ దశమి రోజున ‘దసరా మేళావ’పేరుతో బహిరంగ సభ నిర్వహించేవారు. ఆ తరువాత ఉద్ధవ్ ఠాక్రే దీన్ని కొనసాగిస్తున్నారు. బాల్ ఠాక్రే అంత్యక్రియలు కూడా ఇక్కడే నిర్వహించారు. అదేవిధంగా ఏటా డిసెంబరు ఆరో తేదీన అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది అభిమానులకు ఇక్కడే బస ఏర్పాట్లు చేస్తారు. ఇలా శివాజీపార్క్ మైదానానికి ఎంతో చరిత్ర ఉంది. మైదానంలో ఒకపక్క అశ్వాన్ని అదిరోహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ భారీ విగ్రహాన్ని 1956లో ఏర్పాటు చేశారు. దీనిపక్కనే సావర్కర్ స్మారకం, గణేశ్ మందిరం, శివాజీపార్క్ జింఖాన, మాహిం స్పోర్ట్స్ క్లబ్, సమర్థ్ వ్యాయామ శాల, బాల్మోహన్ విద్యా మందిర్ తదితర కట్టడాలు, సంస్ధలు ఉన్నాయి. దాదర్: ప్రముఖ శివాజీపార్క్ మైదానంలో శివసేన(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే ఇరువురికీ బహిరంగ సభలకు ప్రధాన వేదికైన శివాజీపార్క్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆ రెండు పారీ్టలు ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో బహిరంగ సభలు, రోడ్ షోలు, ర్యాలీలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ పారీ్టల ప్రచార సభలు శివాజీపార్క్ మైదానంలో నిర్వహించే అవకాశం ఇరు పార్టీలకు లభించకుండా పోవడంతో ఆ పార్టీల పదాధికారులు, నాయకులు అయోమయంలో పడిపోయారు. ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నందువల్లే... శివాజీపార్క్ మైదానాన్ని సంవత్సరంలో కేవలం 45 రోజులు మాత్రమే వినియోగించాలనే బీఎంసీ నియమ నిబంధనలు తెలియజేస్తున్నాయి. మిగతా రోజుల్లో ఈ మైదానంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని బీఎంసీ కఠిన నిబంధనలు విధించింది. కాగా అనుమతినిచ్చిన 45 రోజుల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా ఇప్పటికే పలు సభలు, ధార్మిక జాతీయ కార్యక్రమాలు, ఉత్సవాలు జరిగాయి. అదేవిధంగా గత నెలలో ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే వివిధ రాజకీయ పార్టీలు మైదానాన్ని బుకింగ్ చేసుకున్నాయి. దీంతో వరుసగా రాజకీయ ప్రచార సభలు జరుగుతున్నాయి. మరికొన్ని జరగనున్నాయి. దీంతో బీఎంసీ నిబంధనల ప్రకారం రిజర్వ్ చేసిన 45 రోజులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్న యూబీటీ–శివసేనకు, ఎమ్మెన్నెస్‌కు శివాజీపార్క్ మైదానాన్ని అద్దెకు ఇచ్చేందుకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిరాకరించింది. కఠిన నిబంధనలు ఇందుకేఒకప్పుడు శివాజీపార్క్ మైదానం ర్యాలీలు, సాధా రణ సభలతోపాటు వివిధ ధార్మిక, ప్రవచన కార్యక్రమాలకు, రాజకీయ పార్టీల ప్రచార సభలకు వేదికగా ఉండేది. ఎలాంటి ధార్మిక, రాజకీయ ప్రచార కార్యక్రమాలైన నిర్వాహకులు ముందుగా శివాజీపార్క్ మైదానాన్ని ఎంపిక చేసుకుంటారు. దీంతో ఈ మైదానం సంవత్సర కాలంలో దాదాపు 200 రోజులకుపైగా సభలు, సమావేశాలు, ర్యాలీలతో సందడిగా ఉండేది. ఈ కారణంగా మైదానం పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ సమస్య తీవ్రమయ్యేది. ఇదికాక ర్యాలీలు, సభల్లో ప్రజలు, కార్యకర్తల నినాదాలు లౌడ్స్పీకర్లలో ప్రముఖులు, ఇతర వక్తల ప్రసంగాల హోరుతో స్ధానికులకు కంటినిండా నిద్రలేకుండా గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో తమకు ట్రాఫిక్ జామ్, శబ్ద కాలుష్య సమస్యల నుంచి విముక్తి కలి్పంచాలని స్ధానిక రహివాసి సంఘటన దాదాపు రెండు దశాబ్దాల కింద హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు సంవత్సర కాలంలో కేవలం 45 రోజులు ఈ మైదానా న్ని రిజర్వు చేసి ఉంచాలని ఆదేశించింది. అలాగే ఈ మైదానం పరిసరాలను సైలెన్స్ జోన్‌గా ప్రకటించింది. రిజర్వు చేసిన 45 రోజుల్లో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం (జనవరి–26), ఉగాది, బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్–14), మహారాష్ట్ర అవతరణ దినోత్సవం (మే–1), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు–15), గణేశోత్సవాలు, నవరాత్రి, దసరా, ఛట్‌పూజ, దీపావళి, బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి (డిసెంబరు–6), డిసెంబరు 31, నూతన సంవత్సరం తదితర పండుగలు, ఉత్సవాలు, జాతీయ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ పోగా మిగిలిన రోజులను రాజకీయ పార్టీల ప్రచార సభలు, ఇతర ధార్మిక, ప్రవచన, ప్రచార కార్యక్రమాలకు కేటాయించారు. ఇలా మొత్తం 45 రోజుల రిజర్వేషన్లో ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికే ప్రాధాన్యత ఇస్తారు. ఆ మేరకు ఈ నెల 17వ తేదీన ప్రచార సభ నిర్వహించేందుకు అనుమతివ్వాలని అక్టోబరు 14వ తేదీన ఎమ్మెన్నెస్ దరఖాస్తు చేసుకుంది. అదే రోజున తమకూ అనుమతివ్వాలని యూబీటీ శివసేన కూడా దరఖాస్తు చేసుకుంది. కాని ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ శిందేలు ప్రధాని నరేంద్ర మోడీతోపాటు తమ సొంత ప్రచార సభలు నిర్వహించేందుకు ఈ మైదానాన్ని బుకింగ్ చేసుకున్నారు. ముఖ్యంగా శివాజీపార్క్ మైదానం మాహిం నియోజక వర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి రాజ్ ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే మొదటిసారి పోటీ చేస్తున్నారు. దీంతో అమిత్‌తోపాటు రాజ్ ఠాక్రే కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శివాజీపార్క్ మైదానంలో భారీ ప్రచార సభ నిర్వహించాలని ఇటు యూబీటీ, అటు ఎమ్మెన్నెస్ భావించాయి. కాని 45 రోజుల రిజర్వేషన్ కోటా పూర్తికావడంతో నిరాశే మిగిలింది. ఇంత తక్కువ సమయంలో మరోచోట ప్రచార సభకు ఏర్పాట్లు చేయడం, జనాన్ని సమీకరించడం, వాహనాలు బుకింగ్ చేయడం సాధ్యం కాదు. దీంతో ఈ సారి శివాజీపార్క్ మైదానంలో ప్రచార సభలు లేకుండానే ఈ పారీ్టలు ఎన్నికల ముందుకు వెళ్లాల్సిన పరిస్ధితి వచ్చింది. -
భారత మార్కెట్లోకి స్టార్‌లింక్!
న్యూఢిల్లీ: పలు దేశాలకు ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ భారతీయ విపణిలో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధంచేసుకుంటోంది. భారత చట్టాల ప్రకారం సంస్థను నడిపేందుకు స్టార్లింగ్ ముందుకు వచ్చిందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ప్రభుత్వ సవరించిన నియమనిబంధనల ప్రకారం ఏదైనా విదేశీ కంపెనీ తమ భారతీయ యూజర్ల సమాచారాన్ని దేశీయంగానే నిల్వచేయాల్సి ఉంటుంది. ఇందుకు స్టార్‌లింక్ ఒప్పుకుందని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో స్టార్‌లింక్ ప్రతినిధులు పలుమార్లు సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.శాటిటైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవల(జీఎంపీసీఎస్) లైసెన్స్ మంజూరుకు అనుసరించాల్సిన విధివిధానాలను పాటిస్తామని సంస్థ తెలిపింది. స్టార్‌లింక్ సంస్థ ఇంకా తమ సమ్మతి పత్రాలను సమర్పించాల్సి ఉంది. సమర్పణ పూర్తయితే సంస్థ కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభంకానున్నాయని తెలుస్తోంది. 2022 అక్టోబర్‌లో జీఎంపీసీఎస్ లైసెన్స్ కోసం స్టార్‌లింక్ దరఖాస్తు చేసుకుంది. ఈ రంగంలోని భారత నియంత్రణసంస్థ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్–స్పేస్) సంబంధిత అనుమతులను మంజూరుచేయనుంది. ఆలోపు తమ అభ్యంతరాలపై సరైన వివరణ ఇవ్వాలని స్టార్‌లింక్‌ను ఇన్–స్పేస్ కోరింది. స్టార్‌లింక్‌కు పోటీగా మరో ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌కు చెందిన అమెజాన్ సంస్థలో భాగమైన ‘ప్రాజెక్ట్ కూపర్’సంస్థ సైతం జీఎంపీసీఎస్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది.ఈ రెండు సంస్థల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని ఇన్–స్పేస్ చైర్మన్ పవన్ గోయంకా చెప్పారు. భద్రతా నియమాలకులోబడి సంస్థ కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుందని కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం అన్నారు. అగ్రరాజ్యాధినేతగా తన సన్నిహితుడు ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో భారత్‌సహా కీలక శాటిటైల్ ఇంటర్నెట్ సేవల మార్కెట్లలో మెజారిటీ వాటా కైవసంచేసుకోవాలని మస్క్ ఉవ్విళ్లూరుతున్నారు. స్ప్రెక్టమ్ కేటాయింపులు, తుది ధరలపైనే భారత్‌లో స్టార్‌లింక్ భవితవ్వం ఆధారపడిఉంటుంది. భారత ప్రభుత్వం ఇప్పటికే భారతి గ్రూప్‌కు చెందిన వన్‌వెబ్, జియా–ఎస్ఈఎస్ సంయుక్త సంస్థ అయిన జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్‌కు లైసెన్సులు ఇచ్చింది. వీటికి ఇంకా స్ప్రెక్టమ్ కేటాయింపులు జరగలేదు. అయితే స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించిన సిఫార్సులకు ట్రాయ్ డిసెంబర్ 15వ తేదీలోపు తుదిరూపునివ్వనుంది. -
ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే.. ఆర్బీఐ రూల్స్ తెలుసా?
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసే సమయంలో కొన్ని సార్లు చిరిగిన నోట్లు వస్తుంటాయి. ఈ చిరిగిన నోట్లను బయట దుకాణదారులకు ఇస్తే తీసుకోరు. దీంతో ఆందోళన మొదలవుతుంది. ఇప్పుడు ఏం చేయాలనే ప్రశ్న మెదులుతుంది. మీకు కూడా అలాంటి సంఘటన జరిగితే చింతించాల్సి పని లేదు. చిరిగిన నోట్లను సులభంగా మార్చుకోవచ్చు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం.. ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు బయటకు వస్తే వాటిని మార్చేందుకు బ్యాంకు నిరాకరించకూడదు. నోట్లను మార్చుకోవడానికి బ్యాంకులో సుదీర్ఘ ప్రక్రియ ఉండదు. నిమిషాల్లో నోట్లు మార్చుకోవచ్చు. చిరిగిన నోట్లు ఏ ఏటీఎం నుండి వచ్చాయో ఆ ఏటీఎంకి లింక్ చేసిన బ్యాంక్‌కి తీసుకెళ్లి డబ్బు విత్‌డ్రా చేసిన తేదీ, సమయం, విత్ డ్రా చేసిన ఏటీఎం వివరాలతో ఫారం నింపి అందజేయాలి.ఏటీఎంలో వచ్చినవే కాకుండా ఇతర చిరిగిపోయిన, పాడైపోయిన నోట్లను కూడా బ్యాంక్ బ్రాంచ్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో సులభంగా మార్చుకోవచ్చు. అయితే దీనికి పరిమితిని నిర్ణయించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒకసారికి గరిష్టంగా 20 నోట్లను మార్చుకోవచ్చు. అలాగే వాటి విలువ రూ. 5000 మించకూడదు. మార్పిడి చేసుకునే చిరిగిన, పాడైన నోట్లపై ముఖ్యమైన సమాచారం కచ్చితంగా ఉండాలి.దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అత్యాధునిక నోట్ సెట్టింగ్ మెషీన్లతో బ్యాంకులోని నోట్ల నాణ్యతను తనిఖీ చేస్తుందని తెలిపింది. దీంతో చిరిగిన లేదా దెబ్బతిన్న నోట్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఖాతాదారుడికి ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే, బ్యాంకుకు చెందిన ఏదైనా బ్రాంచ్‌కైనా వెళ్లి వాటిని మార్చుకోవచ్చు. -
‘మీ పేర్లు తప్పనిసరి’.. ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్
ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, హోటల్ యజమానులు వారి పేర్లతో పాటు సిబ్బంది పేర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ అయ్యాయని, జనవరి నుంచి ఈ నిబంధన అమలులోకి రానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గుర్తింపు కార్డులను సిద్ధం చేసుకునేందుకు తగినంత సమయం ఇచ్చినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ మాదిరిగానే పరిశుభ్రమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించే ఉద్దేశ్యంతో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని మేము నిర్ణయించుకున్నాము’ అని పట్టణాభివృద్ధి మంత్రి విక్రమాదిత్య సింగ్ అన్నారు. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.BIG NEWS 🚨 Himachal Congress Minister Vikramaditya Singh announces that all restaurants, food outlets will have to display owner’s identification. SHOCKING part is he referenced recent directive from CM Yogi Adityanath in his postYOGI MAGIC ACROSS INDIA 🔥🔥Yesterday CM… pic.twitter.com/J8YltyFvF4— Times Algebra (@TimesAlgebraIND) September 25, 2024పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహించిన సమావేశంలో ఆహార లభ్యతపై ప్రజల్లో నెలకొన్న భయాలు, ఆందోళనలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఈ కొత్త నిబంధనల్ని అమలు చేయాలని భావించినట్లు విక్రమాదిత్య సింగ్ చెప్పారు. 👉 చదవండి : రాష్ట్రంలో సీఎం యోగి సర్కార్ కొత్త రూల్స్యూపీ యోగి సర్కార్ సైతంకాగా,మంగళవారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ రాష్ట్రంలో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. వినియోగదారులకు పరిశుభ్రమైన ఆహారం అందించేలా కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. హోటల్స్, రెస్టారెంట్లతో పాటు తినుబండరాలు అమ్మే ప్రదేశాల్లో యజమానులు, సిబ్బంది, చెఫ్‌లు తప్పని సరిగా మాస్క్‌లు, గ్లౌజ్స్ ధరించాలి. హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు సిబ్బంది, ఇతర మేనేజర్లు ఇతర ఉద్యోగులు తప్పని సరిగా వారి వివరాల్ని మెనూ కార్డ్‌లో ప్రదర్శించాలని సీఎం యోగి ఆధిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం యోగి ఆదేశాలు జారీ చేసిన గంటల వ్యవధిలోనే మధ్యప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
డబ్బుతో విమానం ఎక్కుతున్నారా.. ఈ రూల్స్ తెలుసా?
Airport Rules: ప్రస్తుతం విమాన ప్రయాణం సర్వ సాధారణంగా మారిపోయింది. విదేశాలకు, దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే విమానాల్లో వెళ్లడానికే చాలా మంది ఇష్టపడతారు. గమ్యాన్ని తక్కువ సమయంలో చేరుకోవడం, ఫ్లైట్ ఫేర్లు తక్కువగా ఉండటం వంటి కారణాలతో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య ఇటీవల పెరుగుతూ వస్తోంది.అయితే విమానంలో ప్రయాణించడానికి లగేజీకి సంబంధించిన పరిమితులు ఉంటాయని చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ప్రయాణికులు తమ వెంట ఎంత నగదు తీసుకువెళ్లవచ్చు అనే దానిపైనా పరిమితులు ఉన్నాయని మీకు తెలుసా? దేశం వెలుపల, విదేశాలలో నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ, తమ సౌలభ్యం కోసం నగదును తమ వెంట తీసుకెళ్లేందుకు ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు.ఎంత తీసుకెళ్లొచ్చు?నగదును తీసుకెళ్లేందుకు సంబంధించిన నిబంధనలు దేశీయ విమానాలకు, అంతర్జాతీయ విమానాలకు వేరువేరుగా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. దేశీయ విమానాల్లో గరిష్టంగా రూ. 2 లక్షల నగదును తీసుకెళ్లవచ్చు. కానీ మీరు విదేశీ పర్యటనకు వెళుతున్నట్లయితే ఈ నిబంధన వర్తించదు.ఇక మీరు నేపాల్, భూటాన్ మినహా మరే ఇతర దేశానికి వెళుతున్నా 3000 డాలర్ల వరకు విదేశీ కరెన్సీని తీసుకెళ్లవచ్చు. దీని కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లాలనుకుంటే స్టోర్ వ్యాల్యూ, ప్రయాణ తనిఖీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.లగేజీ బరువు ఎంత ఉండాలి?విమానంలో మీ హ్యాండ్‌బ్యాగ్‌లో 7 నుండి 14 కిలోల బరువును తీసుకెళ్లవచ్చు. మీరు చెక్-ఇన్ కౌంటర్ వద్ద ఇచ్చే చెక్-ఇన్ బ్యాగేజీ బరువు 20 నుండి 30 కిలోల వరకు ఉంటుంది. అంతర్జాతీయ విమానాలకు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి.ఏవి తీసుకెళ్లకూడదు?విమాన ప్రయాణంలో మీరు కొన్ని వస్తువులను తీసుకెళ్లకూడదు. క్లోరిన్, యాసిడ్, బ్లీచ్ మొదలైన రసాయనాలను అస్సలు తీసుకెళ్లలేరు. ఇక మద్యం విషయానికి వస్తే దేశీయ విమానాల్లో మీ చెక్-ఇన్ బ్యాగ్‌లో ఆల్కహాల్ తీసుకెళ్లవచ్చు. కానీ అది 5 లీటర్లకు మించకూడదు. -
త్వరలోనే డేటా రక్షణ నిబంధనలు
న్యూఢిల్లీ: వ్యక్తిగత డిజిటల్ డేటా పరిరక్షణ చట్టం ముసాయిదా నిబంధనలను నెలరోజుల్లోనే విడుదల చేస్తామని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. ప్రభుత్వం తొలుత డిజిటల్‌గా ఈ చట్టం అమలుపై దృష్టి పెట్టినట్టు.. అందుకు అనుగుణంగా నిబంధనలు రూపొందించినట్టు చెప్పారు.‘‘కార్యాచరణ సిద్ధమైంది. సంప్రదింపుల కోసం ముసాయిదా నిబంధనలను నెల రోజుల్లోపు ప్రజల ముందు ఉంచుతాం’’ అని మీడియా ప్రతినిధులకు వైష్ణవ్ తెలిపారు. నిబంధనలకు సంబంధించి భాష సరళతరంగా ఉంటుందన్నారు. గోప్యత హక్కు అన్నది ప్రాథమిక హక్కుల్లో భాగమేనంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఆరేళ్ల తర్వాత.. 2023 ఆగస్ట్ 9న ‘ద డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు’కు పార్లమెంట్ ఆమోదం తెలపడం గమనార్హం.ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు యూజర్ల వ్యక్తిగత డేటా దుర్వినియోగాన్ని ఈ చట్టం అడ్డుకుంటుంది. వ్యక్తిగత డేటా సేకరణ, ప్రాసెసింగ్‌కు సంబంధించి నిబంధనలను కచ్చితగా అమలు చేయాల్సి ఉంటుంది. డేటా ఉల్లంఘన చోటుచేసుకుంటే రూ.250 కోట్ల వరకు జరిమాన చెల్లించే నిబంధన సైతం ఈ చట్టంలో భాగంగా ఉంది. -
క్రెడిట్ కార్డ్ క్లోజింగ్.. ఆర్బీఐ రూల్స్ తెలుసా?
ఈరోజుల్లో చాలా మందికి ఒకటి మించి క్రెడిట్ కార్డులు ఉండటం సాధారణమైపోయింది. బ్యాంకులు, ప్రవేటు సంస్థలు ఇబ్బడిముబ్బడిగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండటంతో అవసరం లేకున్నా కొన్ని సార్లు క్రెడిట్ కార్డులు తీసుకుంటుంటారు. వీటికి వార్షిక రుసుములు లేకపోతే సమస్య లేదు కానీ, ఒక వేళ రుసుము చెల్లించాల్సి ఉంటే అవసరం లేనివాటిని క్లోజ్ చేసుకోవడం మంచిది. అయితే వీటిని ఎలా క్లోజ్ చేసుకోవాలి.. ఆర్బీఐ నిబంధనలు ఏమిటీ అన్న విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం..ఆర్బీఐ నిబంధనలురిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. కస్టమర్ క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయాలని అభ్యర్థిస్తే.. సదరు బ్యాంకు, సంస్థ దానిని 7 రోజుల్లోపు అమలు చేయాలి. కార్డును జారీ చేసే బ్యాంకు లేదా సంస్థ అలా చేయలేకపోతే, 7 రోజుల వ్యవధి తర్వాత, దానిపై రోజుకు రూ. 500 జరిమానాను కస్టమర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ క్రెడిట్ కార్డ్‌లో ఎలాంటి బకాయిలు ఉండకూడదు.క్రెడిట్ కార్డును క్లోజ్ చేయండిలా..» ఏదైనా క్రెడిట్ కార్డ్‌ని మూసివేసే ముందు దాని బకాయిలన్నింటినీ చెల్లించాలి. బకాయిలు ఎంత చిన్న మొత్తం అయినప్పటికీ, బకాయి మొత్తాన్ని చెల్లించే వరకు క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసేందుకు వీలుండదు.» క్రెడిట్ కార్డ్‌ను మూసివేయాలనే తొందరలో చాలా మంది తమ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేయడం మర్చిపోతుంటారు. కార్డ్‌ను మూసివేసేటప్పుడు రివార్డ్ పాయింట్లను తప్పనిసరిగా రీడీమ్ చేసుకోండి» కొంతమంది బీమా ప్రీమియం, ఓటీటీ నెలవారీ ఛార్జ్ వంటి పునరావృత చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్‌పై స్టాండింగ్ సూచనలను పెట్టుకుంటుంటారు. కార్డ్‌ను మూసివేయడానికి ముందు, దానిపై అలాంటి సూచనలేవీ లేవని నిర్ధారించుకోండి.» అన్నీ సరిచూసుకున్నాక క్రెడిట్ కార్డ్ బ్యాంక్‌ను సంప్రదించాలి. క్రెడిట్ కార్డ్ మూసివేయడానికి గల కారణాన్ని అడిగితే తెలియజేయాల్సి ఉంటుంది. అనంతరం క్రెడిట్ కార్డ్ క్లోజింగ్ అభ్యర్థన తీసుకుంటారు. ఒకవేళ బ్యాంక్ ఈమెయిల్ పంపమని అడగవచ్చు. కత్తిరించిన కార్డ్ ఫోటోను కూడా ఈమెయిల్ చేయమని అడగవచ్చు.» క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తున్నప్పుడు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏమిటంటే దానిని ఆ మూల నుంచి ఈ మూల వరకూ క్రాస్‌గా కత్తిరించడం. అలా కాకుండా కార్డును ఎక్కడపడితే అక్కడ పడేయకండి. మీ కార్డు తప్పుడు చేతుల్లోకి వెళితే, దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. -
రాష్ట్రాలకే మైనింగ్ ట్యాక్స్ రాయల్టీ: సుప్రీం
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగే మైనింగ్ పై రాయల్టీ పొందే హక్కు విషయమై సుప్రీంకోర్టు నేడు(గురువారం) చారిత్రక తీర్పు వెలువరించింది. ఖనిజాలు కలిగిన భూములపై రాయల్టీని విధించే హక్కు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందన్న వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది.వివిధ రాష్ట్రాల్లో మైనింగ్ కంపెనీల నుంచి రాయల్టీ వసూలు చేసుకునే హక్కు కేంద్ర, రాష్ట్రాల్లో ఎవరికి ఉందన్న అంశంపై దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది. సుప్రీంకోర్టులో సీజే డీవై చంద్రచూడ్ సారధ్యంలోని ధర్మాసనం 8:1 మెజార్టీతో ఈ తీర్పు వెలువరించింది. ఈ నేపధ్యంలో ఖనిజ సంపద అధికంగా ఉన్న ఒడిశా, జార్ఖండ్, బెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు ప్రయోజనం కలగబోతోంది.రాయల్టీ అనేది పన్నుతో సమానమైనది కాదని న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న అభిప్రాయపడ్డారు. అయితే ఖనిజ హక్కులపై పన్ను విధించే విషయంలో ఆయా రాష్ట్రాలకు అనుమతి కల్పిస్తే వివిధ రాష్ట్రాల మధ్య అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుందని అన్నారు. ఇది మార్కెట్ దోపిడీకి దారితీయవచ్చని అభిప్రాయపడ్డారు. గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టంలో మైనింగ్ పై రాష్ట్రాలు పన్ను విధించకుండా అడ్డుకునే అధికారం పార్లమెంట్ కు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
న్యూజిలాండ్ వీసా రూల్స్‌లో మార్పులు
న్యూజిలాండ్ వీసా రూల్స్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. తమ దేశంలో కొన్ని పాత్రల్లో పనిచేస్తున్న విదేశీయులు తమ ద్వారా తమవారికి వర్క్, విజిటర్, స్టూడెంట్ వీసాలకు స్పాన్సర్ చేయడానికి అనుమతించని కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలను న్యూజిలాండ్ ప్రకటించింది.వీసా స్పాన్సర్లు న్యూజిలాండ్ ఆర్థిక, ఇమ్మిగ్రేషన్ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్దిష్ట ప్రమాణాలను చేరుకునేలా వీసా ప్రక్రియలను క్రమబద్ధీకరించడమే ఈ నిబంధనల లక్ష్యం. వీటి ప్రకారం జూన్ 26 నుంచి ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్స్ (ANZSCO) లెవల్స్ 4, 5 లో రెసిడెన్సీ పాత్‌వేస్ (వివిధ రంగాల్లో నైపుణ్యాలు) లేకుండా అక్రిడేటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా ఉన్నవారు ఇకపై తమ భాగస్వాములు, పిల్లల కోసం వర్క్, విజిట్, స్టూడెంట్ వీసా దరఖాస్తులకు మద్దతు ఇవ్వలేరు.ఈ సంవత్సరం ప్రారంభంలో ఏఈడబ్ల్యూవీ పథకానికి చేసిన విస్తృత సవరణలకు అనుగుణంగా ఈ సర్దుబాటు ఉంటుంది. అయితే భాగస్వాములు, పిల్లలు సంబంధిత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే ఎక్రిడేటర్ ఎంప్లాయర్ వర్క్ వీసా లేదా అంతర్జాతీయ స్టూడెంట్ వీసా వంటి వాటి కోసం సొంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే భాగస్వాములుగా లేదా డిపెండెంట్ పిల్లలుగా వీసాలను కలిగి ఉన్నవారిపై ఈ మార్పుతో ప్రభావం ఉండదని న్యూజిలాండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా.. మారిన రూల్స్ తెలుసా?
ఐటీఆర్ రిటర్న్స్ ఫైలింగ్‌కు ఇంక కొన్ని రోజులే ఉంది. 2024 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఏటా ఐటీఆర్ దాఖలు చేస్తున్నవారైనా, ఈసారి కొత్తగా ఫైలింగ్ చేస్తున్నవారైనా పన్నుకు సంబంధించిన మార్పుల గురించి తప్పక తెలుసుకోవాలి.గత కొన్నేళ్లలో సీబీడీటీ అనేక పన్ను సంబంధిత నిబంధనలను మార్చింది. ఐటీఆర్ ఫైలింగ్‌కు సంబంధించి మారిన నిబంధనల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ విషయాల పట్ల జాగ్రత్త వహించకపోతే ట్యాక్స్ రీఫండ్ ఆగిపోయే అవకాశం ఉంది.కొత్త పన్ను విధానం2024 సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. దీని కింద రూ .7 లక్షల వరకు ఆదాయంపై ఎటువంటి పన్నూ ఉండదు. అయితే మీరు కొత్త, పాత పన్ను విధానం ఏదోఒక దాని కింద ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. కొత్త పన్ను విధానం డిఫాల్ట్ గా ఉంటుంది. పాత పన్ను విధానం ఐచ్ఛికం. ఎలాంటి మినహాయింపు, డిడక్షన్ లేకుండా క్లెయిమ్ సమర్పిస్తే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలి. ఒక వేళ పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే దాని కింద వివిధ పన్ను మినహాయింపులు, డిడక్షన్లను క్లెయిమ్ చేయవచ్చు.స్టాండర్డ్ డిడక్షన్వేతన జీవులకు రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను ఇటీవల ప్రవేశపెట్టారు. ఈ స్టాండర్డ్ డిడక్షన్ పెన్షనర్లకు మాత్రమే. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకునేందకు స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.50,000 తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. దీంతో పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.సెక్షన్ 80సీసెక్షన్ 80సీ పరిమితిని రూ.1.5 లక్షలకు పెంచారు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, ఎల్ఐసీ, ఎన్ఎస్సీ, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఇన్వెస్ట్ చేస్తే 80సీ కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. ఇది కాకుండా, 80డీ కింద మీరు మీ కుటుంబం, సీనియర్ సిటిజన్లైన తల్లిదండ్రుల కోసం తీసుకున్న ఆరోగ్య బీమాపై పన్ను మినహాయింపు పొందవచ్చు. రెండింటి గరిష్ట ప్రీమియం రూ.75,000. 80సీలో హోమ్ లోన్, పిల్లల ఎడ్యుకేషన్ ఫీజుల అసలు మొత్తాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.హోమ్ లోన్మీరు ఇల్లు కొనుగోలు చేసి, దాని కోసం హోమ్ లోన్ తీసుకున్నట్లయితే 80ఈఈఏ కింద దాని వడ్డీపై మినహాయింపు పొందుతారు. గృహ రుణ వడ్డీపై రూ .2 లక్షల వరకు అదనపు తగ్గింపును ప్రోత్సహించడమే దీని లక్ష్యం. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం, అఫోర్డబుల్ హౌసింగ్‌ను ప్రోత్సహించడం ఈ మినహాయింపు ఉద్దేశం.అదనపు వివరాలుఐటీఆర్ ఫారాన్ని సవరించి అదనపు వివరాలను పొందుపరిచారు. ముఖ్యంగా విదేశీ ఆస్తులు, ఆదాయం, భారీ లావాదేవీలు వెల్లడించేలా నిబంధనలు మార్చారు. విదేశీ పెట్టుబడులు లేదా గణనీయమైన ఆర్థిక కార్యకలాపాలు ఉన్న పన్ను చెల్లింపుదారులు జరిమానాను నివారించడానికి వివరణాత్మక సమాచారాన్ని అందించాలి. 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు పెన్షన్, వడ్డీ ద్వారా మాత్రమే ఆదాయం ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేయాల్సిన బాధ్యత నుంచి వారికి మినహాయింపు ఉంది. అయితే దీని కోసం పెన్షన్, వడ్డీ డబ్బుల నుంచి బ్యాంకులు టీడీఎస్‌ను మినహాయించడం మాత్రం తప్పనిసరి. -
రుణమాఫీకి ‘పీఎం కిసాన్’ రూల్స్!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సచివా లయంలో రాష్ట్రమంత్రివర్గం సమావేశమై వ్యవసాయ రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలపై చర్చించి ఖరారు చేయనుంది. రుణమాఫీకి అర్హులను గుర్తించడానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం విధివిధానాలనే వర్తింపజేయాలా? లేక ఇతర పద్ధతులను అనుసరించాలా? అనే అంశంపై రాష్ట్రమంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రప్రభుత్వం దేశంలో అర్హులైన రైతులందరికీ ఏటా రూ.6 వేలు ఆర్థికసాయం అందిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, మేయర్లు, జెడ్పీ ఛైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఐటీ పన్ను చెల్లించేవారిని ఈ పథకం నుంచి మినహాయించింది. ఉన్నత ఆదా యం పొందే సంతానం ఉన్నా ఈ పథకం కింద అనర్హులే. రాష్ట్రంలో రుణమాఫీ అమలుకు సైతం ఇలాంటి మార్గదర్శకాలనే అమలు చేయాలనే భావనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ సహాయం పొందడానికి అర్హులైన రైతులెవరూ నష్టపోకుండా మార్గదర్శకాలను మంత్రివర్గం ఖరారు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 15 లోగా రుణమాఫీ అమలు చేస్తామని ఇప్పటికే సీఎం హామీ ఇచ్చారు. రుణమాఫీకి అర్హులైన రైతులు ఎవరు ? ప్రభుత్వ సహాయం అవసరమున్న రైతులను ఏ ప్రాతిపదికన గుర్తించి రుణమాఫీ వర్తింపజేయాలి ? ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీకి అమలు చేసిన మార్గదర్శకాలు ఏమిటి? వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. రుణమాఫీకి కటాఫ్ తేదీతోపాటు ఈ పథకం అమలుకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా రుణమాఫీపైనే చర్చ జరుగుతుందని, ఎజెండాలో ఇతర అంశాలు లేవని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. -
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? తప్పకుండా ఇవి తెలుసుకోండి
పర్సనల్ లోన్ అనేది ప్రస్తుతం సర్వసాధారణం అయిపోయింది. ఉద్యోగం చేస్తున్నవారు, బిజినెస్ చేసేవారు ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో లోన్ తీసుకోవడానికి సిద్దమైపోతారు. ఇంతకీ పర్సనల్ లోన్ తీసుకునే ముందు తెలుసుకోవలసిన విషయాలు ఏంటి? ఏ సమయంలో పర్సనల్ లోన్ తీసుకోవాలి అనే విషయాలను వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..వడ్డీ రేటుపర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వ్యక్తి బ్యాంకులు ఎంత వడ్డీకి లోన్ ఇస్తుంది అనే విషయాన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే వెహికల్ లోన్స్, హోమ్ లోన్స్ వంటి వాటితో పోలిస్తే.. పర్సనల్ లోన్ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా తీసుకొనే మొత్తాన్ని (డబ్బు) బట్టి, వ్యవధి, క్రెడిట్ స్కోరును బట్టి కూడా ఈ వడ్డీని నిర్ణయిస్తారు. పర్సనల్ లోన్ మీద వడ్డీ రేటు 12 నుంచి 21 శాతం వరకు ఉంటుంది. కాబట్టి లోన్ తీసుకునే వ్యక్తి తప్పకుండా ఈ విషయంలో జాగ్రత్తపడాలి. అంతే కాకుండా.. మీకు వచ్చే వార్షిక ఆదాయానికి మించి లోన్ తీసుకుంటే.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఎవరికి లోన్ ఇస్తారులోన్ అనేది ఉద్యోగం చేసేవారికైనా.. సొంతంగా బిజినెస్ చేసేవారికైనా ఇస్తారు. అయితే ఉద్యోగికి బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే.. వారు మూడు నెలల పేస్లిప్ ఇవ్వాల్సి ఉంటుంది. సొంతంగా బిజినెస్ చేసేవారికి డెబిట్ / క్రెడిట్ కార్డు హిస్టరీని చూసి లోన్ మంజూరు చేయడం జరుగుతుంది. కొన్ని బ్యాంకులు ఫేమస్ కంపెనీలలో ఉద్యోగం చేసేవారికి మాత్రమే లోన్ ఇస్తాయి.ఆదాయాన్ని మించకుండా..పర్సనల్ లోన్ తీసుకునే వ్యక్తి తన నెలవారీ జీతం కంటే ఎక్కువ లోన్ తీసుకోకూడదు. ఎందుకంటే వచ్చే డబ్బుతోనే నిత్యావసరాలు, ఈఎంఐ వంటి వాటితో పాటు పిల్లల చదువులు ఇతరత్రా ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ పూర్తిగా బేరీజు చేసుకున్న తరువాత ఎంత లోన్ తీసుకుంటే.. ఎంత ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. నెల జీతంలో ఈఎంఐ పోగా ఎంత మిగులుతుంది అనేది చూసుకోవాలి. ముఖ్యంగా పర్సనల్ లోన్ అనేది 12 నెలలు (ఒక సంవత్సరం) మించగకుండా ఉండేలా చూసుకోవడం ఉత్తమం.లోన్ ఎప్పుడు తీసుకోవాలి?లోన్ తీసుకోవడం అనేది కొంతవరకు కరెక్ట్ కాదు. అయితే అత్యవసర పరిస్థితుల్లో, వేరే మార్గం లేని సమయంలో తీసుకోవాలి. ఆరోగ్యం మందగించినప్పుడు లేదా అనుకోని దుర్ఘటనలు జరిగినప్పుడు తీసుకోవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. సరదాల కోసం, గ్యాడ్జెట్స్ కొనుగోలు కోసం, విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి లోన్ తీసుకోకూడదు. తప్పకుండా ఇవన్నీ గుర్తుంచుకోవాలి. -
రాజకీయ పార్టీని ఎలా పెట్టాలి? నియమ నిబంధనలేమిటి?
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు 18వ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యాయి. అయితే రాజకీయ పార్టీ ఎలాపెట్టాలి? పేరు ఎలా నిర్ణయించాలి? పార్టీకి చిహ్నం ఎలా వస్తుంది? ఇందుకు ఎన్నికల సంఘం ఎటువంటి నిబంధనలు రూపొందించింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ఎవరైనా రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత, దానిని ఎన్నికల కమిషన్‌లో నమోదు చేయడం తప్పనిసరి. రాజకీయ పార్టీల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లో పేర్కొన్నారు. దీనిప్రకారం రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి, ఎన్నికల సంఘం జారీ చేసిన దరఖాస్తు ఫారాన్ని పూరించాలి. దీనిని ఆన్లైన్లో నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాని ప్రింటౌట్ను తీసుకుని, ఇతర ముఖ్యమైన పత్రాలు జతచేసి, 30 రోజుల్లోగా ఎన్నికల కమిషన్‌కు పంపాలి. రిజిస్ట్రేషన్ కోసం రూ.10వేలు ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. పార్టీని ఏర్పాటు చేసినవారు ఎన్నికల కమిషన్ దరఖాస్తు ఫారంలో ఆ రాజకీయ పార్టీ పేరు ఏమిటి? దాని పని విధానం ఏమిటి? పార్టీ అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు? అనే వివరాలతో పాటు పార్టీలో కీలకమైన పదవుల్లో ఉన్నవారి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. పార్టీ సమర్పించే దరఖాస్తు ఫారంపై పార్టీలోని సభ్యులందరి సంతకాలు తప్పనిసరిగా ఉండాలి. పార్టీకి సంబంధించిన బ్యాంకు ఖాతా వివరాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. పార్టీ పేరును ఆ పార్టీ వ్యవస్థాపకులే నిర్ణయిస్తారు. అయితే ఆ పేరు చెల్లుబాటును ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే అటువంటి పేరు నమోదు అయ్యిందో లేదో తనిఖీ చేస్తుంది. ఇప్పటికే పార్టీపేరు నమోదై ఉంటే ఆ పేరుతో మళ్లీ పార్టీ రిజిస్టర్ కాదు. ఇలా జరిగినప్పుడు పార్టీ పేరును మార్చుకోవలసి ఉంటుంది. ఏదైనా రాజకీయ పార్టీని స్థాపించడానికి, దానిలో కనీసం 500 మంది సభ్యులు ఉండాలి. అంతే కాదు ఆ సభ్యులు ఏ ఇతర పార్టీతోనూ సంబంధం కలిగివుండకూడదు. దీనికి సంబంధించిన అఫిడవిట్‌ను కూడా సమర్పించాలి. పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాత, ఎన్నికల సంఘం సదరు పార్టీకి గుర్తును ఇస్తుంది. అయితే దీనికి కొన్ని ప్రత్యేక నియమాలు కూడా ఉన్నాయి. ఎన్నికల చిహ్నాలను జారీ చేసే విషయానికి వస్తే ముందుగా కమిషన్ పార్టీకి ఒక గుర్తును జారీ చేస్తుంది. అయితే ఏ పార్టీ అయినా నిర్దిష్ట ఎన్నికల గుర్తును జారీ చేయాలని కూడా కోరవచ్చు. ఆ తర్వాత ఎన్నికల సంఘం దానిని పరిశీలిస్తుంది. ఒకవేళ ఆ ఎన్నికల గుర్తు ఏ పార్టీకీ కేటాయించకపోతే అప్పుడు దానిని జారీ చేస్తుంది. -
ఉల్లం'ఘను'లు .. యథేచ్ఛగా టీడీపీ నేతల కోడ్ ఉల్లంఘన
ప్రొద్దుటూరు/ చిత్తూరు అర్బన్/ కొమ్మాది(విశాఖ)/ పాలకొల్లు (సెంట్రల్)/భాకరాపేట(తిరుపతి జిల్లా)/హిందూపురం అర్బన్: ఈసీ ఆదేశాలను టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కోడ్‌కు విరుద్ధంగా అనుమతులు లేకుండానే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేవాలయాలను సైతం ప్రచారానికి వినియోగిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఓటర్లకు చీరలు, ఇతర సామగ్రి పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. ప్రొద్దుటూరులో.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి స్థానిక టీడీపీ నేతలు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని టీచర్స్ కాలనీలో మంగళవారం సాయంత్రం టీచర్స్ కాలనీలో సమావేశానికి టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి హాజరై ప్రసంగించారు. బుధవారం ఉదయం గోపవరం గ్రామంలో 22వ వార్డు కౌన్సిలర్ మహ్మద్‌గౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వరదరాజులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యతోపాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో వరదరాజులురెడ్డి ప్రసంగించారు. విషయం తెలుసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి హైమావతి సంఘటన స్థలానికి వెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పినా పట్టించుకోలేదు. దీనిపై ఎన్నికల కోడ్‌కు సంబంధం లేదంటూ అధికారితో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఆమె ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు వరదరాజులరెడ్డితోపాటు మహ్మద్ గౌస్‌పై కేసు నమోదు చేశారు. అయినప్పటికీ వరదరాజులురెడ్డి బుధవారం సాయంత్రం గోపవరం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన సమావేశానికి సైతం హాజరవడం గమనార్హం. రెండు రోజుల్లో నాలుగు సమావేశాలు ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు వరదపై ఒక్క కేసు మాత్రమే నమోదైంది. వైద్యం పేరుతో వల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన నాయకులు వైద్యం పేరుతో ఓటర్లకు వల వేస్తున్నారు. విశాఖ నగరం 8వ వార్డు గొల్లల ఎండాడలో బసవతారకం, గీతం ఆస్పత్రులు సంయుక్తంగా బుధవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని టీడీపీ, జనసేన నాయకులు ప్రారంభించారు. ఇది వైద్య శిబిరంలా కాకుండా పార్టీ ప్రచార కార్యక్రమంలా సాగింది. ఇటీవల 39వ వార్డు లక్ష్మీటాకీస్ ప్రాంతంలో బసవతారకం ఆస్పత్రి, గీతం ఆస్పత్రి సంయుక్తంగా వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. టీడీపీ విశాఖ పార్లమెంట్ ఇన్చార్జి భరత్, జనసేన నాయకుడు వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరై.. ఓటర్లను ప్రభావితంచేసేలా కార్యక్రమం చేపట్టారు. పార్టీ గుర్తుతో పూజలు ఎన్నికల నియమావళి ప్రకారం ఆలయాల్లో రాజకీయ ప్రచారాలు చేయకూడదు. చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు సైకిల్ గుర్తును చొక్కాకు పెట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రి పక్కనున్న ఈశ్వరుని ఆలయంలో పూజలు చేశారు. అదేరీతిలో బుధవారం రాత్రి చిత్తూరు కట్టమంచి వద్ద ఉన్న శ్రీ సాయిబాబా ఆలయంలోనూ టీడీపీ కండువా ధరించి పూజలు నిర్వహించారు. తొలగించని టీడీపీ పోస్టర్లు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఇంకా తెలుగుదేశం పార్టీకి చెందిన వాల్ పోస్టర్లు, ట్రీ గార్డులపై పేర్లు తొలగించలేదు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా టీడీపీ వాల్‌పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. అధికార పక్షానికి చెందిన పోస్టర్లు, బ్యానర్లు తొలగించిన అధికారులు టీడీపీకి చెందిన వాల్‌పోస్టర్ల జోలికి వెళ్లకపోవడం విశేషం. టీడీపీ ప్రచారంలో కానిస్టేబుల్, ఏఎన్ఎం టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దిశ కానిస్టేబుల్ సాకిరి రాజశేఖర్‌పై భాకరాపేట పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. మంగళవారం అన్నమయ్య జిల్లా రాయచోటికి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వెళుతుండగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటలో టీడీపీ శ్రేణులు మార్గమధ్యలో స్వాగతం పలికారు. దిశ కానిస్టేబుల్ టీడీపీ నాయకులతో కలసి పూలమాలలు వేయడం, భాకరాపేటలో పార్టీ కరపత్రాలు పంచుతూ టీడీపీకి ఓటు వేయమని అభ్యర్థించడం, వాటర్ బాటిళ్లపై సైతం టీడీపీ నాయకుల ఫొటోలు వేయించుకోవడం చర్చనీయాంశమైంది. బుధవారం రాత్రి ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పడాల్ ఉత్తర్వులిచ్చారు. అలాగే టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిత్తూరు జిల్లా చౌడేపల్లి సచివాలయ గ్రేడ్ 3 ఏఎన్ఎం లతను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. హిందూపురంలో ప్రలోభాలు శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ ప్రలోభాలకు తెరలేపింది. యథేచ్ఛగా చీరల పంపిణీ చేపడుతోంది. బుధవారం రాత్రి హిందూపురం పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో టీడీపీ వర్గీయులు ఓటర్ల జాబితా చేతబట్టుకుని ఇంటింటికీ చీరలు పంపిణీ చేస్తుండగా అధికారులు కొన్ని చీరలు, ఓటర్ల జాబితాను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. -
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు
సాక్షి, అమరావతి: ఎటువంటి హింస, రీపోలింగ్ వంటివి లేకుండా స్వేఛ్చాయుత వాతావరణంలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో మే 13న జరిగే ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. ఆయన శనివారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. ఎక్కడైనా అల్లర్లు జరిగితే ఆ జిల్లా ఎస్పీ, రీపోలింగ్ జరిగితే ఆ జిల్లా కలెక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా గతంలోకంటే అధికంగా పోలింగ్, పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 46,156 పోలింగ్ స్టేషన్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల సంఖ్య 1600 దాటితే వాటిని రెండు పోలింగ్ స్టేషన్లుగా విభజిస్తామని, దీనివల్ల 887 కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామన్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించేలా కేవలం మహిళా సిబ్బందితో 179 పోలింగ్ కేంద్రాలు, అదే విధంగా దివ్యాంగులతో 63, యువతతో 50, మోడల్ పోలింగ్ స్టేషన్లు 555 ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు 1 ప్లస్ 5 మంది ఉద్యోగులు ఉంటారన్నారు. గతంలో ఎన్నికల విధుల్లో అంగన్వాడీలు, తాత్కాలిక సిబ్బంది సేవలను కూడా వినియోగించుకున్నారని, ఈ సారి పూర్తిగా రెగ్యులర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులనే నియమిస్తున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బందికి ప్రధాన బాధ్యతలు కాకుండా సిరా వేయడం వంటి విధులను అప్పగిస్తామన్నారు. ఎవరు ఎక్కడ విధుల్లో పాల్గొంటారో ర్యాండమ్‌గా సాఫ్ట్వేర్ ద్వారా ఎంపిక చేస్తామని చెప్పారు. వలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండరన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలింగ్ స్టేషన్‌కు కనీసం ఇద్దరు పోలీసు సిబ్బంది ఉంటారన్నారు. ఇందుకోసం 1,14,950 మంది సివిల్ పోలీసులు, 58 కంపెనీల రాష్ట్ర ఆర్మ్డ్ పోలీసులు, 465 కంపెనీల కేంద్ర బలగాలు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు శనివారం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, కోడ్ ఉల్లంఘిస్తే తనతో సహా ఏ స్థాయి అధికారిపైన అయినా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే ఫిర్యాదులు అందిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నిరంతరం నిఘా కోసం 50 మంది జనరల్ అబ్జర్వర్లు, 115 మంది వ్యయ పరిశీలకులు, 13 మంది పోలీసు అబ్జర్వర్లు ఉంటారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 22 విభాగాలతో తనిఖీలు చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 121 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. వీటికి అదనంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే తనిఖీల ద్వారా రూ.164.35 కోట్లు విలువైన నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రధాన మంత్రి మినహా మిగతా రాజకీయ నేతలందరినీ తనిఖీ చేస్తారని, చేతి బ్యాగులు తప్ప మిగతా వాటిని సోదా చేస్తారని చెప్పారు. విమానాశ్రయాల్లో కాకుండా ప్రైవేటుగా విమానాలు, హెలికాప్టర్లలో దిగిన స్థలాల వద్దకు సంచార స్క్వాడ్స్ వెళ్లి తనిఖీలు చేస్తాయన్నారు. అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలను జిల్లా కలెక్టర్లకు తెలియజేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పెయిడ్ ఆర్టికల్స్, సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలపైనా నిఘా ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎటువంటి మత ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల ఉల్లంఘనలపై 1950 నంబరుకు లేదా సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులకుఇంటి వద్దే ఓటింగ్ 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్ద లేదా పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేయొచ్చని మీనా తెలిపారు. ఇంటి వద్దే ఓటు వేయాలనుకొంటే ముందుగా ఫారం 12 పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి ఇస్తే దాన్ని పరిశీలించి పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతిస్తారన్నారు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతి లభిస్తే వారు పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేయడానికి కుదరదని స్పష్టం చేశారు. ఇలా పోస్టల్ బ్యాలెట్ కోరిన వారికి ఎన్నికల తేదీకి పది రోజుల ముందే వీడియోగ్రాఫర్‌తో కలిపి ఐదుగురు సిబ్బంది ఇంటికి వచ్చి పోస్టల్ బ్యాలెట్‌కు ఏర్పాట్లు చేస్తారని చెప్పారు. పోలింగ్ బూత్‌లో లానే గోప్యంగా ఓటు హక్కును వినియోగించుకొని ఆ పోస్టల్ బ్యాలెట్‌ను రెండు కవర్లలో పెట్టి పోలింగ్ బాక్స్‌లో వేయాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్‌కు ఇంటికి వస్తున్న సమాచారాన్ని పోటీలో ఉన్న అభ్యర్థులకు ముందుగానే తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు డీజీపీ (లా – ఆర్డర్) శంకబ్రత్ బాగ్చీ, అదనపు సీఈవోలు హరేంధర ప్రసాద్, పి. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 53 రోజుల్లో కొత్తగా 1.30 లక్షల మంది ఓటర్లు ఈ నెల 16 నాటికి 4.09 కోట్లు దాటిన ఓటర్లు జనవరి 22న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాతో పోలిస్తే ఈ నెల 16 నాటికి ఓటర్ల సంఖ్య 1,30,096 పెరిగినట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. జనవరిలో విడుదల చేసిన జాబితాలో ఓటర్ల సంఖ్య 4,08,07,256 మంది ఉండగా ఇప్పడు 4,09,37,352కు చేరినట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూలు వచ్చినందున ఓట్ల తొలిగింపు, చిరునామా మార్పులకు అవకాశం ఉండదని, కొత్త ఓటర్ల నమోదుకు నామినేషన్ల చివరి రోజు వరకు అవకాశం ఉందని చెప్పారు. ఇవి చేయొచ్చు ♦ ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల లబ్ధిదారులకు ప్రయోజనాలను కొనసాగించవచ్చు ♦ చేయూత పథకానికి ఇప్పటికే నిధులిస్తే వాటిని కొనసాగించవచ్చు ♦ ఇప్పటికే చేపట్టిన పనులు కొనసాగించొచ్చు. పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించొచ్చు ♦ ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ వంటి సంస్థలు ఉద్యోగాల నియామకాల ప్రక్రియ కొనసాగించొచ్చు ఇవి చేయకూడదు ♦ పథకాలకు కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేయకూడదు ♦ పథకాలకు కొత్తగా నిధులు విడుదల చేయాల్సి వస్తే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి ♦ పనులు మంజూరైనప్పటికీ, ఇంకా ప్రారంభించని వాటిని ఇప్పుడు చేపట్టకూడదు ♦ కంపెనీలకు, వ్యక్తులకు భూములు కేటాయించకూడదు. అసాధారణ కేసుల్లో సీఎంఆర్ఎఫ్ మంజూరుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలి ♦ మంత్రులు ఫైలెట్ కార్లను వినియోగించకూడదు ♦ ప్రధానమంత్రి తప్ప మిగతా ఏ రాజకీయ నాయకులకు ప్రొటోకాల్ ఉండదు -
‘నిమిషం నిబంధన వద్దు’.. దీని కారణంగానే ఇప్పుడిలా..
ఆదిలాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో నిమిషం ఆలస్యం నిబంధన తొలగించాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో డీఐఈవో రవీందర్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్ బీ రాహుల్ మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి టేకం శివకుమార్ ‘నిమిషం’ నిబంధన కారణంగా పరీక్షకు దూరమై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిమిషం ఆలస్యం నిబంధన ఎత్తివేస్తూ శివకుమార్ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎఫ్డీఎస్ జిల్లా కార్యదర్శి కుంటాల నవీన్‌కుమార్, టీఏజీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పూసం సచిన్, ఏఎస్యూ జిల్లా కార్యదర్శి అశోక్, టీఎస్ఎఫ్ నాయకుడు సత్యనారాయణ, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సిడం సాయికుమార్, ఎస్వీఏ జిల్లా అధ్యక్షుడు గొప్లే సుజయ్, నాయకులు ఇఫ్తెఖార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలి.. ఇంటర్ విద్యార్థి శివకుమార్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసం సచిన్ డిమాండ్ చేశారు. రిమ్స్ మార్చురీలో శివకుమార్ మృతదేహాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఆయన కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్షకు సంబంధించి నిమిషం ఆలస్యం నిబంధన విద్యార్థుల పాలిట శాపంగా మారిందని పేర్కొన్నారు. నిమిషం నిబంధన వెంటనే ఎత్తి వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు ఆత్రం కిష్టన్న, లక్ష్మణ్ తదితరులున్నారు. ఇవి చదవండి: హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్! -
ఈవీలకు ప్రత్యేక మీటర్.. విద్యుత్ కనెక్షన్లలో కీలక మార్పులు!
దేశంలో విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో నివసించే వారు ఇప్పుడు ఏడు రోజులకు బదులుగా కేవలం మూడు రోజుల్లోనే విద్యుత్ కనెక్షన్లను పొందవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను (EV) ఛార్జ్ చేయడానికి ప్రత్యేక విద్యుత్ కనెక్షన్‌ను పొందవచ్చు. ఈ మేరకు విద్యుత్ (వినియోగదారుల హక్కులు) రూల్స్, 2020ని సవరించినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. సవరించిన నిబంధనల ప్రకారం కొత్త విద్యుత్ కనెక్షన్ పొందేందుకు గల గడువును మహానగరాల్లో ఏడు రోజుల నుంచి మూడు రోజులకు, ఇతర మున్సిపల్ ప్రాంతాల్లో 15 రోజుల నుంచి ఏడు రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించారు. ఇక కొండ ప్రాంతాలు ఉన్న గ్రామీణ ప్రాంతాలు, కొత్త కనెక్షన్లు లేదా ఇప్పటికే ఉన్న కనెక్షన్లలో మార్పుల కోసం వ్యవధి 30 రోజులు ఉంటుందని కేంద్ర విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రూఫ్‌టాప్ సోలార్ రూఫ్‌టాప్ సోలార్ పీవీ సిస్టమ్‌లను ఏర్పాటు చేయడానికి డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ కాలపరిమితిని కూడా 30 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించింది ప్రభుత్వం. ఏడాదిలో కోటి గృహాలకు రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిర్యాదులొస్తే అదనపు మీటర్ వినియోగదారులు మీటర్ రీడింగ్‌లు తమ వాస్తవ విద్యుత్ వినియోగంతో సరిపోలడం లేదని ఫిర్యాదులు చేసిన సందర్భాల్లో డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ ఫిర్యాదు అందిన తేదీ నుంచి ఐదు రోజులలోపు అదనపు మీటర్‌ను ఏర్పాలు చేయాల్సి ఉంటుంది. ఈ అదనపు మీటర్ ద్వారా మూడు నెలలపాటు విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తారు. కో-ఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, బహుళ అంతస్థుల భవనాలు, నివాస కాలనీలు మొదలైన వాటిలో నివసిస్తున్నవారు పంపిణీ లైసెన్స్‌దారు నుంచి ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత కనెక్షన్లు లేదా మొత్తం ప్రాంగణానికి సింగిల్ పాయింట్ కనెక్షన్‌ని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. -
గుడ్‌న్యూస్! కెనడాలో వర్క్ పర్మిట్.. కీలక మార్పులు
Canada work permit : కెనడాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు శుభవార్త ఇది. పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్ (PGWP) కి కెనడా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రెండేళ్లలోపు వ్యవధి ఉన్న మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఇప్పుడు 3 సంవత్సరాల పీజీడబ్ల్యూపీకి అర్హత పొందుతారు. 2024 ఫిబ్రవరి 15 నుంచి ఈ మార్పులను ఆ దేశ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అయితే 2024 సెప్టెంబరు 1 నుండి కరికులమ్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకున్న విద్యార్థులు ఇకపై పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్‌కి అర్హత పొందలేరు. అలాగే దూరవిద్య, పీజీడబ్ల్యూపీ చెల్లుబాటు కోసం ప్రత్యేక చర్యలను 2024 ఆగస్టు 31 వరకు పొడిగించింది. పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ అనేది కెనడాలో చదువులు పూర్తయిన తర్వాత విదేశీ విద్యార్థులకు మంజూరు చేసే ఓపెన్ వర్క్ పర్మిట్. పీజీడబ్ల్యూపీ హోల్డర్లు కెనడాలో ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా తమకు నచ్చినన్ని గంటలు పని చేసుకోవచ్చు. పీజీడబ్ల్యూపీ చెల్లుబాటు ఎంత కాలం ఉంటుందనేది స్టడీ ప్రోగ్రామ్ స్థాయి, వ్యవధితోపాటు పాస్‌పోర్ట్ గడువు తేదీపై ఆధారపడి ఉంటుంది. విదేశీ విద్యార్థులందరూ అర్హులేనా? కెనడాలోని ఆమోదిత విద్యా సంస్థలలో కనీసం రెండు సంవత్సరాల నిడివి ఉన్న డిగ్రీ ప్రోగ్రామ్‌లు పూర్తి చేసి తాత్కాలికంగా కొన్నాళ్లపాటు కెనడాలో ఉండాలనుకుంటున్న విదేశీ విద్యార్థులందరూ 3 సంవత్సరాల పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్ (PGWP)కి అర్హులు. ఇక మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల విషయానికి వస్తే కనీసం 8 నెలలు (లేదా 900 గంటల క్యూబెక్ క్రెడెన్షియల్స్ ) వ్యవధి ఉండాలి. అన్ని ఇతర అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నంత వరకు మాస్టర్స్ డిగ్రీ వ్యవధి 2 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ 3 సంవత్సరాల పీజీడబ్ల్యూపీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇది సర్టిఫికేట్ లేదా డిప్లొమా ప్రోగ్రామ్‌లకు వర్తించదు. -
రైలు ప్రయాణికులకు అలర్ట్.. ట్రైన్ ఎక్కే ముందు తప్పక తెలుసుకోండి..
దేశవ్యాప్తంగా రోజూ కొన్ని లక్షల మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. ప్రజా అవసరాలు, సరుకుల రవాణా కోసం ఇండియన్ రైల్వేస్ వేల సంఖ్యలో రైళ్లను నడుపుతోంది. టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించడం సహజంగా జరిగే ప్రక్రియ. అయితే కొన్ని సందర్భాల్లో రైలు బయలుదేరే సమయానికి కౌంటర్ వద్ద క్యూ ఎక్కువగా ఉండటం వల్లనో లేదా టికెట్ కొనే సమయం లేకపోవడం వల్లనో కొందరు టికెట్ లేకుండానే రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. ఏది ఏమైనా టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించడం చట్టరీత్యా నేరం. రైళ్లలో ప్రయాణికులు అందరూ టికెట్ తీసుకున్నారా.. ఎవరైనా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా అన్నది పరీశీలించడానికి టీటీఈలు (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) ఉంటారు. వీరిలో కొంతమంది టికెట్ లేని ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారు. వేలాది రూపాయలు వసూలు చేస్తుంటారు. టికెట్ లేకపోతే ఏం చేయాలి.. రైళ్లలో రోజూ కొన్ని లక్షల మంది ప్యాసింజర్లు ప్రయాణిస్తుంటారు. వీరిలో కొందరు టికెట్ లేకుండా ప్రయాణించే సందర్భం వస్తుంది. ఈ క్రమంలో కొందరు టీటీఈలు దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల లక్నో ఎక్స్‌ప్రెస్‌లో ఓ రైల్వే అధికారి ప్రయాణికుడిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతన్ని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేసింది రైల్వే శాఖ. ఇలా అధికారులు ప్రవర్తించవచ్చా.. టికెట్ లేకుండా రైలు ఎక్కిన ప్రయాణికులు ఏం చేయాలి అన్న విషయాలు ఇక్కడ తెలుసుకుందాం... ఇదీ చదవండి: IRCTC: రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో మార్పులు టికెట్ లేకుండా రైలు ఎక్కిన ప్రయాణికులు మొదటగా టీటీఈని సంప్రదించి మీ పరిస్థితి గురించి వారికి తెలియజేయాలి. మీ వద్ద రిజర్వేషన్ టికెట్ లేకపోతే మీరు వెళ్ళాల్సిన గమ్య స్థానానికి అయ్యే టికెట్ ధరతో పాటు రూ.250 జరిమానా విధిస్తారు. అంటే మీరు రైలు ఎక్కిన ప్రదేశం నుండి గమ్యస్థానానికి అయ్యే చార్జీతో పాటు అదనంగా రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేశాక ఒకవేళ ట్రైన్లో సీట్లు కాళీ ఉంటే సీటును కూడా కేటాయిస్తారు. ఇదీ చదవండి: ఓటీపీలకు స్వస్తి.. ఆర్బీఐ కీలక ప్రతిపాదన! -
ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ రూల్స్ మారాయ్.. ఇక అది అవసరం లేదు!
IMPS Rules change: ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంకుకు చేసే ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ నిబంధనలు మారాయి. వినియోగదారులు ఫిబ్రవరి 1 నుంచి రిసీవర్ మొబైల్ నంబర్, పేరుతోనే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) ద్వారా డబ్బును బదిలీ చేయవచ్చని, ఐఎఫ్ఎస్సీ కోడ్ జోడించాల్సిన అవసరం లేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది. 2024 జనవరి 31 నాటికి అన్ని ఐఎంపీఎస్ ఛానెల్‌లలో మొబైల్ నంబర్ + బ్యాంక్ పేరు ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ను అనుమతించాలని బ్యాంకులను అభ్యర్థిస్తున్నట్లు ఎన్పీసీఐ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. అలాగే డిఫాల్ట్ ఎంఎంఐడీ (మొబైల్ మనీ ఐడెంటిఫైయర్- MMID)తో సభ్యుల బ్యాంక్ పేర్లను మ్యాపింగ్ చేయాలని రిమిటర్ బ్యాంకులకు సూచించింది. ఐఎంపీఎస్ అంటే.. ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, బ్యాంక్ శాఖలు, ఏటీఎంలు, ఎస్ఎంఎస్, ఐబీఆర్ఎస్ వంటి వివిధ ఛానెల్‌ల ద్వారా డబ్బు ట్రాన్స్‌ఫర్‌కు అత్యంత సాధారణంగా ఉపయోగించే పద్ధతుల్లో ఒకటి. ఈ ఐఎంపీఎస్ ప్రస్తుతానికి P2A (అకౌంట్ + ఐఎఫ్ఎస్సీ) లేదా P2P (మొబైల్ నంబర్ + ఎంఎంఐడీ) ట్రాన్స్ఫర్ విధానాల్లో లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది. ఒక వేళ ఒకే మొబైల్ నంబర్‌తో ఎక్కువ అకౌంట్లను లింక్ చేసిన సందర్భంలో కస్టమర్ సమ్మతి ఆధారంగా ప్రాథమిక/డిఫాల్ట్ అకౌంట్‌కు బెనెఫీషియరీ బ్యాంక్ డబ్బును జమ చేస్తుంది. ఒక వేళ కస్టమర్ సమ్మతి లేని పక్షంలో బ్యాంకు ఆ లావాదేవీని తిరస్కరించాలి. -
రామ్‌లల్లా దర్శనానికి ఎలా వెళ్లాలి?
జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తయ్యాక అయోధ్యను సందర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇందుకు ఎటువంటి విధివిధానాలు అనుసరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. రామాలయంలో బాలరామునికి రోజుకు ఐదుసార్లు హారతులు ఇవ్వనున్నారు. అయితే భక్తులు మూడు హారతులను మాత్రమే దర్శించుకోగలుగుతారు. ఈ హారతులు ఉదయం 6:30 గంటలకు, మధ్యాహ్నం 12:00 గంటలకు, సాయంత్రం 7:30 గంటలకు నిర్వహిస్తారు. ఇక శ్రీరాముని దర్శనం విషయానికి వస్తే ఉదయం 6 నుండి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్టేషన్ చేసుకోవాలి. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం (https://online.srjbtkshetra.org) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, మొబైల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. ఓటీపీ నమోదు చేశాక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో ‘దర్శన్’ ఎంపికపై క్లిక్ చేశాక, ఓపెన్ అయిన పేజీలో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతోపాటు వచ్చేవారి సంఖ్య, దేశం, రాష్ట్రం, మొబైల్ నంబర్‌తో పాటు మీ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. శ్రీరాముని హారతులను చూడాలనుకుంటే ఇందుకోసం ప్రత్యేకంగా బుక్ చేసుకోవాలి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు పొందాలనుకుంటే ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్లి, ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి, టికెట్ పొందవచ్చు. కాగా పదేళ్లకన్నా తక్కువ వయసుగల పిల్లలకు దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. దర్శనం కోసం టిక్కెట్‌తో పాటు ఐడీప్రూప్ ప్రూఫ్‌ను ఖచ్చితంగా వెంట తీసుకువెళ్లాలి. ఎవరైనా భక్తుడు తన టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే, ఆ స్లాట్ మరో భక్తుడికి అందుబాటులోకి వస్తుంది. దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టిక్కెట్‌ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా స్త్రీలు, పురుషులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే దర్శనానికి రావాలి. పురుషులు ధోతీ-కుర్తా లేదా కుర్తా, పైజామా.. మహిళలు చీర, దుపట్టాతో కూడిన పంజాబీ దుస్తులు లేదా దుపట్టాతో చుడీదార్ సూట్ ధరించి శ్రీరాముని దర్శనానికి రావచ్చు. ఇది కూడా చదవండి: అయోధ్యలో త్రేతాయగం... అంతా రామమయం! -
డేంజర్ యాప్స్‌పై డాట్ పంజా.. డిలీట్ చేసిన గూగుల్, యాపిల్
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త యాప్స్ పేరుతో ఇప్పటికే చాలామంది మోసపోవడంతో.. 'డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్' (DoT) కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ఈసిమ్ యాప్‌లను గూగుల్, యాపిల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆదేశాల ప్రకారం.. గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి ఎయిర్‌లో (Airalo), హోలాఫ్లై (Holafly), eSIM వంటి యాప్‌లను తొలగించాయి. భారతదేశంలో ఈసిమ్ విక్రయాలు చేపట్టాలంటే తప్పకుండా DoT నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలని, అప్పుడు మాత్రం అధీకృత డీలర్లు విక్రయించుకోవచ్చని, విక్రయించే ముందు తప్పకుండా పాస్‌పోర్ట్ కాపీ లేదా వీసా వంటి ఐడెంటిటీ ప్రూఫ్‌ను కస్టమర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది వెల్లడించింది. విక్రేత కూడా గ్లోబల్ సిమ్ల వివరాలను భద్రతా ఏజెన్సీలకు తప్పకుండా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది. ఈసిమ్ విషయాన్ని పక్కన పెడితే.. సింగపూర్‌కు చెందిన ఎయిర్‌లో, స్పెయిన్‌కు చెందిన హోలాఫ్లై రెండు యాప్‌లను పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇవి ఇండియాలో పూర్తిగా నిషిద్ధమని స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న యాపిల్ విజన్ ప్రో - ధర రూ.2.90 లక్షలు నిజానికి ఈసిమ్ అనేది ఫిజికల్ సిమ్ మాదిరిగా ఉండదు, దీనిని నెట్వర్క్ ప్రొవైడర్ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్ యూజర్లు మాత్రం ఈసిమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఈసిమ్ వంటి వాటిని నిషేధించడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. సైబర్ మోసాలకు పాల్పడేవారు ఎక్కువగా ఇంటర్నేషనల్ నంబర్లను ఉపయోగిస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, సైబర్ మోసాల సంఖ్యను తగ్గించడానికి DoT ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
సంద్రంలో ‘విండ్ పవర్’
సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే సహజ ఇంధన వనరులను వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడంతోపాటు, వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలనేది వాటన్నిటి లక్ష్యం. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత పెరుగుతోంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సముద్రంలో ఏర్పాటు చేసే పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ లీజ్ రూల్స్–2023ను తాజాగా ప్రకటించింది. సముద్రంలో విండ్ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉండే చోటు కోసం జరిగే సర్వేకు మూడేళ్లు ఉన్న గడువును ఐదేళ్లకు పెంచింది. అలాగే ప్రాజెక్టుల లీజు వ్యవధి 35 ఏళ్లుగా నిర్ణయించింది. ప్రాజెక్టు నిర్వాహకులు మెగావాట్‌కు రూ.1లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలని చెప్పింది. అయితే ఇది రిఫండబుల్ అని స్పష్టం చేసింది. థర్మల్ కంటే ఖర్చు తక్కువ పవన శక్తి సామర్థ్యం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ప్రపంచ పవన విద్యుత్ పరిశ్రమ సామర్థ్యం 837 గిగావాట్లకి చేరింది. ఇది ఏటా 1.2 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను తగ్గించడంలో సహాయపడుతోంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్ల్యూసీ) విశ్లేషణ ప్రకారం.. విండ్ పవర్ వృద్ధి రేటు వచ్చే దశాబ్దంలో 15 శాతానికి పెరగాలి. ఇందుకోసం పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపన పెరగాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో దేశంలోని సముద్రంలో 2026 నాటికి దాదాపు 20 గిగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లను స్థాపించే ప్రయత్నం జరుగుతోంది. భూమి మీద కంటే సముద్రంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆఫ్‌షోర్ విండ్ పవర్ ప్లాంట్లతో అధికంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అయ్యే ఖర్చు కంటే తక్కువకే పవన విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పవచ్చు. ఈ విద్యుత్ విక్రయానికి ఓపెన్ యాక్సెస్, ఇంటర్–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఛార్జీల మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. రాష్ట్రంలో సముద్రం అనుకూలం రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 8,998.323 మెగావాట్లకు చేరుకుంది. ఇందులో పవన విద్యుత్ 4,083.37 మెగావాట్లుగా ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా 8 శాతం పవన విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం పెరిగితే మన రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయిలో వృద్ధి కంటే 1.8 శాతం ఎక్కువగా ఏపీలో పవన విద్యుత్ ఉత్పత్తి పెరుగుదలను నమోదు చేసుకుంది. ప్రభుత్వ చర్యలకు వాతావరణంలో వస్తున్న మార్పులు తోడవ్వడంతో ఏపీలో పవన విద్యుత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయొరాలజీ (పుణె)కి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. అంతేకాదు రాష్ట్రంలోని సముద్ర ప్రాంతాల్లో గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్ (సీఎంఐపీ) ప్రయోగాల్లో తేలింది. -
మరోసారి గెలుచుకునేదానిపైనా జీఎస్టీ ఉంటుందా? ఆర్థిక మంత్రి క్లారిటీ..
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్‌లో ప్రారంభ పందేలపై 28% జీఎస్టీ విధింపునకు సంబంధించి విలువ ఆధారిత నిబంధనలు ప్రభావవంతంగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ‘‘ఇందుకు సంబంధించి వివరణ జారీ అయింది. 28% పన్ను రేటు అమలవుతుంది. ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎవరిపై భారం పడుతుందన్నది వివరంగా పేర్కొనడం జరిగింది. విలువకు సంబంధించి నిబంధనలు విజయాలను మినహాయిస్తున్నాయి. కనుక దీనిపై ఎలాంటి గందరగోళం ఉండదని భావిస్తున్నాను’’అని మంత్రి వివరించారు. దీని ప్రకారం.. ఆన్లైన్ గేమింగ్‌లో గెలుచు కున్న నగదుతో తిరిగి బెట్టింగ్‌లు వేసినప్పుడు వా టిపై 28% జీఎస్టీ అమలు కాదు. స్పష్టంగా చెప్పాలంటే మొదటిసారి బెట్టింగ్‌కు పెట్టే మొత్తంపై 28% జీఎస్టీ చెల్లించాలి. దానిపై గెలుచుకున్న మొత్తాన్ని తిరిగి వెచ్చించినప్పుడు జీఎస్టీ పడదు. లోక్ సభలో జీఎస్టీ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీతారామన్ మాట్లాడారు. అప్పిలేట్ ట్రిబ్యునల్ ప్రెసిడెంట్, సభ్యుల వయో పరిమితిని ఈ బిల్లులో సవరించారు. ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రి ఓ ఉదాహరణను కూడా వినిపించారు. ‘‘ఒక వ్యక్తి రూ.1,000 బెట్ చేసి, దానిపై రూ.300 గెలుచుకుని.. ఆ తర్వాత రూ.1,300తో మరోసారి గెలుచుకునే మొత్తంపై జీఎస్టీ పడదు’’అని వివరించారు. -
రష్మిక ఫేక్ వీడియో : సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం మరోసారి రెడ్ సిగ్నల్
న్యూఢిల్లీ: తప్పుడు సమాచార వ్యాప్తికి సంబంధించి నటి రష్మిక మందన్నకు చెందినడీప్‌ఫేక్ వీడియో వైరల్ కావడంతో కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 66డీ ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్ష, జరిమానా తప్పదంటూ రిమైండర్ జారీ చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో డీప్‌ఫేక్‌లకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను, ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాలను తాజా సర్క్యులేషన్లో మరోసారి గుర్తు చేసింది. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66డీ ప్రకారం కంప్యూటర్ వనరులను ఉపయోగించి ఎవరైనా వ్యక్తుల పట్ల మోసపూరితంగా వ్యవహరించినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా నేరం రుజువైతే మూడేళ్ల దాకా జైలు శిక్ష, లక్ష రూపాయల దాకా జరిమానా ఉంటుంది. ప్రభుత్వం, లేదా బాధిత వ్యక్తులు కోరిన వెంటనే సోషల్ మీడియా వెబ్ సైట్లు ఆయా కంటెంట్ వివరాలను 36 గంటల్లోగా తొలగించాల్సి ఉంటుంది. IT మధ్యవర్తి నియమాల ప్రకారం, సోషల్ మీడియా సంస్థలు 10 రకాల కంటెంట్‌కి సంబంధించిన పోస్టులను తప్పక తొలగించాలి. ముఖ్యంగా దేశ సమగ్రత, శాంతి భద్రతలు, సార్వభౌమత్వం, విదేశాలతో సంబంధాలు, ఇతర దేశాలను అవమానించడం, నేరాలకు పాల్పడేందుకు ప్రోత్సహించే చర్యలు, ఒక వ్యక్తి లేదా ప్రభుత్వాన్ని కించపర్చేలా మాట్లాడడం నేరంగా పరిగణిస్తారు. అలాగే అసభ్యకరమైన కంటెంట్, లింగ విద్వేషం రెచ్చగొట్టే పోస్టులు, ఇతరుల ప్రైవసీని దెబ్బ తీసే కంటెంట్, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడేలా ప్రోత్సహించడం, జాతి, మతం, రంగును అవమానించడం, భారతీయ చట్టాలలో నేరంగా వెల్లడించిన పనులను ప్రోత్సహించే కంటెంట్ వంటివి ఎవరైనా పోస్ట్ చేస్తే వాటిని వెంటనే తొలగించాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ ప్రభుత్వం కోరితే ఆ సమాచారాన్ని ముందుగా పోస్ట్ చేసిన వ్యక్తి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. కాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో స్పందించిన కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఫేక్ న్యూస్, డీప్‌ఫేక్ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయులకు భద్రత, విశ్వాసం కల్పించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇవ్వడం తోపాటు ఇలాంటి ఫేక్ వీడియోపై సోషల్ మీడియా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
రోగం పేరుతో డ్రామా కోర్టు నిబంధనలు ఉల్లంఘన
-
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు.. కలెక్టర్..
ఆదిలాబాద్: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన క్రమంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్‌రాజ్ అ న్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల కోడ్ వివరాలు వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమి షన్ సోమవారం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వి డుదల చేసిందని తెలిపారు. దీంతో నియమావళి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుందని, 10 వరకు నామినేషన్ల గడువు, 13న పరిశీలన, 15న ఉపసంహరణ, 30న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుందని వివరించారు. ఓటర్లు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఓటరు లిస్టుతో తమ పేర్లు ఉన్నయో లేవో పరిశీలించుకోవాలన్నారు. ఎవరైనా పేర్లు లేకపోతే నామినేషన్లకు పది రోజుల ముందు వరకు ఫారం–6 ద్వారా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థులకు నిబంధనలతో కూడిన బుక్లెట్ అందజేస్తామన్నారు. నియమావళిని పరిశీలించేందుకు ఫ్లయింగ్‌స్క్వాడ్ నియమించినట్లు తెలిపారు. అలాగే అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్కడ నిరంతరం సీసీ నిఘా, వీడియో చిత్రీకరణ ఉంటుందన్నారు. వీటిని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు అనుసంధానం చేశామన్నారు. ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తామన్నారు. అలాగే సర్వేలైన్ అధి కారుల ద్వారా పరిస్థితులను సమీక్షిస్తామన్నారు. ఒకవ్యక్తి రూ.50వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లరాదని, అంతకు మించి తీసుకెళితే సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే డబ్బును సీజ్ చేస్తామన్నారు. అలాగే ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని, సభలు, సమావేశాలు నిర్వహించే ముందు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ప్రజలు స్వేచ్ఛాయూత వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొ ని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా రు.ఎన్నికల నిర్వహణ కోసం అన్నిఏర్పాట్లు చేస్తా మన్నారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పె డుతామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సంక్షే మ పథకాలు సూచించే ఫ్లెక్సీలు తొలగించామన్నారు. ఇందులో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఐటీడీఏ పీవో చాహత్‌బాజ్‌పాయ్ పాల్గొన్నారు. -
అక్రమ ధనార్జన నిరోధక నిబంధనలు మరింత పటిష్టం!
న్యూఢిల్లీ: అక్రమ ధనార్జన నిరోధక నియమ నిబంధనలను ఆర్థిక మంత్రిత్వశాఖ మరింత కఠినతరం చేసింది. ముఖ్యంగా భాగస్వామ్య సంస్థల్లో ‘లాభదాయక యజమానుల’ నిర్వచనం కింద గతంలో 15 శాతంగా ఉన్న వాటాను (ఒక సంస్థలో) తాజాగా 10 శాతానికి తగ్గించింది. ఇది లాభదాయకమైన యజమానులను కఠినమైన పర్యవేక్షణలోకి తీసుకువస్తుంది. బినామీ, షెల్ కంపెనీల కార్యకలాపాల నిరోధానికి దోహదపడుతుంది. అంతేకాకుండా, లాభదాయకమైన యజమానిని ‘‘ఇతర మార్గాల ద్వారా నియంత్రించే’’ వ్యక్తిగా కూడా పరిగణించడం జరుగుతుంది. ఇక్కడ ‘‘నియంత్రణ’’ అనేది నిర్వహణ లేదా విధాన నిర్ణయాన్ని నియంత్రించే హక్కును సంబంధించినదని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ పేర్కొంది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారాన్ని అందించడానికి బాధ్యత వహించే ’ప్రిన్సిపల్ ఆఫీసర్’ స్థాయిని.. మేనేజ్మెంట్ స్థాయి వ్యక్తికి కూడా కల్పిస్తూ అక్రమ ధనార్జన నిరోధక చట్టం, 2005 నిబంధనలను (మెయిటినెన్స్ ఆఫ్ రికార్డ్స్) కఠినతరం చేసినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ట్రస్ట్ విషయంలో రిపోర్టింగ్ సంస్థ, ఖాతా ఆధారిత సంబంధాన్ని ప్రారంభించే సమయంలో లేదా పేర్కొన్న లావాదేవీలను నిర్వహిస్తున్నప్పుడు ధర్మకర్తలు తమ స్థితిని వెల్లడించేలా చూసుకోవాలని కూడా సవరణ పేర్కొంది. టెర్రర్ ఫైనాన్సింగ్, మనీలాండరింగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) నవంబర్‌లో కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవలి నెలల్లో వివిధ మనీలాండరింగ్ నిరోధక నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. -
అక్కాచెల్లెళ్లకు క్యాష్ గిఫ్ట్ ఇస్తున్నారా.. ఐటీ రూల్స్ ఏంటో తెలుసా?
తోబుట్టువుల మధ్య అపురూపమైన బంధానికి అపూర్వ ప్రతిక రక్షా బంధన్. సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ తమ బంధం జన్మ జన్మలకూ కొనసాగాలని కోరుతూ అక్కాచెల్లెళ్లు రాఖీలు కడతారు. ఇక తమ సోదరీమణులకు ఐశ్వర్యం, సౌభాగ్యాలు కలగాలంటూ అన్నాతమ్ముళ్లు తమ శక్తిమేరకు బహుమతులు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఇదీ చదవండి: ఈపీఎఫ్‌వో అలర్ట్: వివరాల అప్డేషన్కు కొత్త మార్గదర్శకాలు బహుమతులు లేకుండా రాఖీ పండుగ అసంపూర్ణంగా ఉంటుంది. అయితే కాలంతో పాటు ట్రెండ్స్ మారుతున్నాయి. కానీ స్థిరంగా ఉన్న ఒక విషయం కొనసాగుతోంది. అదే సోదరులు తమ సోదరీమణులకు బహుమతిగా డబ్బు ఇవ్వడం. కాబట్టి ఈ రక్షా బంధన్ సందర్భంగా సోదరికి ఎంత డబ్బు బహుమతిగా ఇవ్వవచ్చు.. దీనిపై ట్యాక్స్ ఉంటుందా.. ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు ఎలా ఉన్నాయి.. నిపుణులు ఏం చెబుతున్నారు...? తెలుసుకుందాం. రూ.2 లక్షలకు మించితే.. ఆదాయపు పన్ను చట్టాలు లేదా మరేవైనా ఇతర చట్టాల ప్రకారం ఒక వ్యక్తి మరొక వ్యక్తికి బహుమతి ఇవ్వడానికి ఎటువంటి పరిమితి లేదు . అది నగదు బహుమతికైనా సరే ఎలాంటి పరిమితి ఉండదు. అయితే రూ. 2 లక్షలకు మించి నగదు ఇచ్చిపుచ్చుకోవడానికి వీలు లేదు. కాబట్టి రూ.2లక్షలకు మించి బహుమతి ఇచ్చేవారు నగదు రూపంలో కాకుండా బ్యాంకింగ్ మార్గాల ద్వారా ఇవ్వవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ట్యాక్స్ ఉంటుందా? ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 56(2)(x) ప్రకారం బహుమతులు గ్రహీతల చేతిలోకి వెళ్లాక పన్ను ఉంటుంది. అయితే కొంతమంది నిర్దిష్ట బంధువుల నుంచి వచ్చే బహుమతులకు మాత్రం ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుంది. ఇక షేర్ల విషయానికి వస్తే పన్నుల ప్రభావం లేకుండా షేర్లను సోదరికి బదిలీ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం.. అక్కాచెల్లెళ్లకు క్యాష్ గిఫ్ట్ ఇస్తే.. ఇచ్చేవారికి కానీ, తీసుకునేవారికి కానీ ఎలాంటి ట్యాక్స్ పడదు అని పేర్కొంటున్నారు. -
ఉద్యోగులకు గుడ్‌న్యూస్: ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు.. భారీగా పన్ను ఆదా!
ప్రైవేటు ఉద్యోగులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (CBDT) శుభవార్త అందించింది. కొన్ని ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగుల్లో కొందరికి అద్దె రహిత వసతి కల్పిస్తుంటాయి. అలాంటి అద్దె రహిత ఇళ్లకు విధించే పన్నుకు సంబంధించి విలువను నిర్ణయించే నిబంధనలను సీబీడీటీ సవరించింది. దీంతో ఉద్యోగులకు మరింత ఎక్కువ పన్ను ఆదా అవుతుంది. టేక్-హోమ్ జీతం పెరుగుంది. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఆదాయపు పన్ను నిబంధనలకు సవరణలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నోటిఫై చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా ఇతర ఉద్యోగులకు యాజమాన్యాలు కల్పించే అన్ఫర్నిష్డ్ గృహాలకు సంబంధించిన వ్యాల్యుయేషన్ నిబంధనలు మారాయి. తగ్గిన పన్నులు 2011 జనాభా లెక్కల ప్రకారం 40 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో నివసించే ఉద్యోగులకు వసతిపై పన్ను వారి జీతంలో 10 శాతం ఉంటుంది. ఇది ఇంతకు మందు 15 శాతంగా ఉండేది. ఇక 15 లక్షలకు మించి 40 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో ఇది జీతంలో 7.5 శాతం ఉంటుంది. గతంలో 10 శాతంగా ఉండేది. వసతి వ్యాల్యుయేషన్ నిబంధనలను సీబీడీటీ మార్చడం వల్ల అధిక జీతం పొందుతూ యాజమాన్యాలు కల్పించే వసతిలో నివాసముంటున్న ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుకుందని, పెద్ద పన్ను ఆదాతోపాటు వారు పొందే టేక్ హోమ్ జీతం పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి: లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నారా? మెచ్యూరిటీ సొమ్ముపై పన్ను తప్పదు! -
మణిపూర్ అంశంపై తెరమీదకు రూల్ నెం.176 Vs 267.. అసలేంటివి?
ఢిల్లీ: మణిపూర్ అంశంపై నేడు పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. ఈ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా కేంద్రం కూడా అందుకు సమ్మతించింది. కానీ రూల్ నెంబర్ 267 కింద మణిపూర్ అంశాన్ని చర్చించాలని ప్రతిపక్షాలు కోరగా.. కేంద్రం మాత్రం రూల్ నెంబర్ 176 కింద చర్చిస్తామని స్పష్టం చేసింది. మణిపూర్ అంశంపై అరగంట చర్చ సరిపోదని, రూల్ 267 కింద చర్చ జరపాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. కేంద్రం ఇందుకు అంగీకరించడం లేదని ఆరోపించారు. అయితే.. ప్రతిపక్షాలు పదే పదే తమ నిర్ణయాన్ని మారుస్తున్నాయని కేంద్రం మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. కేవలం ప్రధాని మోదీ వచ్చి ప్రకటన ఇవ్వాలని కోరుతున్నాయని చెప్పారు. మణిపూర్ అంశంపై చర్చించే ఆసక్తి ప్రతిపక్షాలకు లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. అసలు ఈ రూల్ నెంబర్ 176, 267 రెండు నిబంధనల మధ్య ఉన్న తేడా ఏంటీ? #WATCH | Defence Minister Rajnath Singh on the Manipur violence says, "I feel the opposition is not serious about the discussion on the Manipur issue. The government wants to discuss the Manipur issue. PM Modi himself said that the country is ashamed of whatever has happened in… pic.twitter.com/GlTZ3sj9uM — ANI (@ANI) July 21, 2023 ఇదీ చదవండి: మణిపూర్ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటిని తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు రూల్ 267 ప్రకారం.. రాజ్య సభ నిబంధనల ప్రకారం రూల్ 267కు ప్రత్యేక వెసులుబాటు ఉంటుంది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మీద ప్రత్యేకంగా చర్చ జరపాలని సభ్యులు కోరవచ్చు. ఇందుకు ఆ రోజు సభలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ఇతర సభ్యులు ఇచ్చిన నోటీసులు తాత్కాలికంగా రద్దు చేయాలని కోరుబడతాయి. ప్రత్యేక చర్చకు సభ్యుడు నోటీసు ఇస్తే.. స్పీకర్ అనుమతించాల్సి ఉంటుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానాన్ని రాతపూర్వకంగా కానీ, ఓరల్గానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చర్చలో సభ్యులు ఏ అంశంపైనైనా అడగవచ్చు. 1990 నుంచి 2016 వరకు కేవలం 11 సార్లు మాత్రమే ఈ రూల్ కింద చర్చ జరిగింది. రూల్ 176 ప్రకారం.. ఈ రూల్ ప్రకారం చర్చ అరగంట నుంచి రెండున్నర గంటలపాటు మాత్రమే ఉంటుంది. సభలోని ప్రతి సభ్యుడు ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశంపై చర్చించేందుకు నోటీసు ఇస్తున్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాయాల్సి ఉంటుంది. ఆ నోటీసుకు మద్దతుగా ఇద్దరు సభ్యులు సంతకాలు చేయాలి. ఈ నోటీసు ఇచ్చిన కొద్ది గంటల వ్యవధిలో లేదా మరుసటి రోజు స్పీకర్ పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇదీ చదవండి: సుప్రీంలో రాహుల్ గాంధీ పిటిషన్.. పలువురికి నోటీసులు.. బెంచ్ ఆసక్తికర వ్యాఖ్యలు -
విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య చదవాలనుకునే తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజీల అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రీఆర్గనైజషన్ ఆక్ట్, ఆర్టికల్ 371D నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేసింది. దీని ప్రకారం 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అంతకు ముందు 85శాతం మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15శాతం అన్ రిజర్వుడుగా ఉండేది. ఇందులో తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. ఎంబిబిఎస్ సీట్లు పొందేవారు. తాజా నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయి. తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువ చేయడంతో పాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేర్చించింది తెలంగాణ ప్రభుత్వం. నాడు తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే, ఇప్పుడు 8340 సీట్లకు పెరిగింది. చదవండి: సీఎం కేసీఆర్ టూర్.. ఎస్సై గంగన్నతో మామూలుగా ఉండదు మరి! తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న 20 మెడికల్ కాలేజీల్లోని 2,850 సీట్లలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 1,895 సీట్లు ఉండేవి. ఇందులో 15శాతం అన్ రిజర్వుడు కోటాగా 280 సీట్లు కేటాయించాల్సి వచ్చేది. ఇందులో తెలంగాణ విద్యార్థులతో పాటు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అవకాశం పొందేవారు. దీంతో తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సి వచ్చేది. ఇదే విధానం కొనసాగితే, పెరిగిన మెడికల్ కాలేజీల్లో కూడా 15శాతం అన్ రిజర్వుడు కోటా అమలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మరిన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుంది. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, అన్ రిజర్వుడు కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలకు సవరణ చేసింది. కొత్తగా వచ్చిన 36 మెడికల్ కాలేజీలకు ఆ నిబంధన వర్తించకుండా తాజా సవరణ చేసింది. దీంతో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు అదనంగా లభిస్తున్నాయి. ఇప్పటికే ఎంబీబీఎస్ బి కేటగిరి సీట్లలో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందేలా లోకల్ రిజర్వ్ చేసుకోవడం వల్ల తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1300 ఎంబీబీఎస్ సీట్లు విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్ల మొత్తం 1820 సీట్లు ప్రతి ఏటా దక్కనున్నాయి. 1820 సీట్లు అదనంగా అంటే దాదాపు 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు తో సమానం. ప్రతి ఏటా కాలేజీలు పెరిగినా కొద్ది ఈ సీట్ల మరింత పెరగనుంది. కొత్త మెడికల్ కాలేజీలలో అల్ ఇండియా కోట 15% సీట్లు యధాతదం గా ఉంటాయి. దీనిలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలో ఎక్కడివారైనా మెరిట్ ప్రకారం అడ్మిషన్ పొందవచ్చు. తెలంగాణ విద్యార్థుల డాక్టర్ కల సాకారం దిశగా.. తెలంగాణ విద్యార్థులు స్థానికంగా ఉంటూనే డాక్టర్ కల సాకారం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఏండ్ల కాలం నుంచి వైద్య విద్యకు దూరమైన తెలంగాణ బిడ్డలు సీఎం కేసీఆర్ ఆలోచనతో అమలు చేస్తున్న నిర్ణయాలు దగ్గర చేస్తున్నాయి. తెలంగాణ సోయితో ఆలోచించిన ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1820 మెడికల్ సీట్లు వచ్చేలా చేసింది. డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకోవాలి. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ వైద్యారోగ్య రంగం గణనీయమైన వృద్ది సాధించింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఒకవైపు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూనే, ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ విద్యార్థులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
‘లివ్ ఇన్’లో ఉండాలంటే.. ఆ యువతి కండీషన్లకు నెటిజన్లు గగ్గోలు!
ఒక యువతి తన పార్ట్నర్తో లివ్ ఇన్‌లో ఉండేందుకు అతని ముందు ఉంచిన షరతుల లిస్టు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వీటినన్నింటినీ నెరవేరుస్తానని హామీ ఇస్తేనే లివ్ ఇన్‌లో ఉంటానని, లేని పక్షంలో బైబై టాటా చేప్పేస్తానని బెదిరించింది. ఎవరైనా మరొకరికితో కలసి ఉండాలంటే కాస్తయినా సద్దుకుపోవాల్సి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. స్కూలులో స్నేహితులతో, కాలేజీలో రూమ్ మేట్స్‌తో సద్దుకుపోతూ కలసిమెలసి ఉండటం అనేది అందరికీ అనుభవమే. అయితే ఇప్పుడు కాలం మారింది. పెళ్లికి ముందు లేదా పెళ్లి ఊసే లేకుండా లివ్ ఇన్ రిలేషన్లో యువతీయువకులు ఉంటున్నారు. ఇలా ఉంటున్నవారిలో చాలామంది పరస్పరం అడ్జెస్ట్ కాలేక విడిపోతున్నారు. వివాహం అయినవారు ఒకరి ఇష్టాఇష్టాలు, అభిరుచులు ఎలా ఉన్నా ఒకరితో మరొకరు అడ్జెస్ట్ అవుతున్నారు. అలాగే భాగస్వామి కోసం తమ ఇష్టాఇష్టాలను మార్చుకుంటున్నారు. అయితే ఇప్పటి యువత భాగస్వామితో అస్సలు అడ్జెస్ అయ్యేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు. తాజాగా ఒక లివ్ ఇన్ జంటకు సంబంధించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లివ్ ఇన్‌లో ఉండేందుకు.. ‘ది మిర్రర్’ రిపోర్టును అనుసరించి ఒక యువతి తన పార్ట్నర్తో పాటు లివ్ ఇన్‌లో ఉండేందుకు కొన్ని షరతులు విధించింది. ఈ షరతులకు అంగీకరించకపోతే బ్రేకప్ చెప్పేస్తానని బెదిరించింది. ఆ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు లివ్ ఇన్ కోసం ఉంచిన షరతులను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాను విధించిన నియమాలను తాను కూడా పాటిస్తానని, అదేవిధంగా తన బాయ్ ఫ్రెండ్ కూడా పాటించాలని స్పష్టం చేసింది. యువతి పెట్టిన నిబంధనలివే.. ఆ యువతి విధించిన కండీషన్లలో మొదటిది తన బాయ్ ఫ్రెండ్ అతని సామాన్లతో సహా విడిగా వేరే గదిలో ఉండాలి. రెండవ నియమం.. డైనింగ్ టేబుల్ మొదలుకొని ఇంటిలో ఎక్కడా చెత్తపోయకూడదు. అపరిశుభ్రంగా మార్చకూడదు. మూడవ నియమం.. ఇంటిలోని న్యూస్ పేపర్లు, ఇతర కాగితాలు సరిగా సద్దుకొని అతని గదిలోనే ఉంచుకోవాలి. ఈ షరతులను చూసి నెటిజన్లు కామెంట్ల వెల్లువ కురిపిస్తున్నారు. ఒక యూజర్.. లివ్ ఇన్‌లో ఉండేందుకు ఎటువంటి షరతులు ఉండకూడదని రాయగా,మరో యూజర్ లివ్ ఇన్‌లో ఇలాంటి తీరు అస్సలు పనికిరాదని రాశారు. ఇంకో యూజర్ సరైన జీవితం గడిపేందుకు ఆ యువతి పెట్టిన కండీషన్లలో తప్పేముందని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ‘మత్స్య కన్య’గా మారిన ఇంగ్లీష్ టీచర్.. చూసేందుకు జనం పరుగులు! -
ఇక రాత్రిళ్లు బాదుడే.. విద్యుత్ వినియోగదారులకు కేంద్రం షాక్
ఢిల్లీ: విద్యుత్ వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. విద్యుత్ ఛార్జీల నిబంధనల్లో కేంద్రం భారీ మార్పులు చేసింది. పగలు, రాత్రి వేళ్లలో వేర్వేరు విద్యుత్ ఛార్జీల వసూలుకు ఆర్డినెన్స్ జారీ చేసింది. రాత్రి వేళల్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటే 20 శాతం ఛార్జీలు, పగటివేళల్లో తక్కువ ఛార్జీలు వసూలు చేయనుంది. కొత్తగా టైమ్ ఆఫ్ డే టారిఫ్ వ్యవస్థ పేరుతో పగటి వేళ వాడే కరెంట్‌పై వినియోగదారులకు 20 శాతం మేర భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో డిమాండ్ అధికంగా ఉండే రాత్రి వేళ వాడే కరెంట్ ఛార్జీల భారం ఇప్పటికంటే 10-20 శాతం ఎక్కువగా ఉంటుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. కొత్త నిబంధన 10 కిలో వాట్ లేదా అంతకంటే ఎక్కువ వినియోగం ఉన్న వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. వ్యవసాయ వినియోగదారులను మినహాయించి ఇతర వినియోగదారులకు 2025, ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉదయం వేళ సోలార్ పవర్ అందుబాటులో ఉండటంతో దాని ధర తక్కువగా ఉంటుందని, అందుకే ఉదయం వేళలను సోలార్ అవర్స్‌గా పేర్కొంటూ.. ఆ సమయంలో వినియోగదారులకు లబ్ధి చేకూర్చేలా విద్యుత్ ఛార్జీలు తక్కువ చేశామని మంత్రి అన్నారు. చదవండి: ఒడిషా రైలు ప్రమాదం.. రైల్వే బోర్డు సంచలన నిర్ణయం -
2023 మిస్ వరల్డ్ పోటీలు.. పాల్గొనాలనుందా? అయితే ఇలా చేయండి!
Miss World 2023: ప్రతిభావంతులైన ఫ్యాషన్ ప్రియులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మిస్ వరల్డ్ పోటీలు ఈ సారి ఇండియాలో జరగనున్న సంగతి తెలిసిందే. 27 సంవత్సరాల తరువాత మళ్లీ భారత్ ఈ అందాల పోటీలను నిర్వహిస్తుండడం విశేషం. 71వ మిస్ వరల్డ్ పోటీలు ఈ ఏడాది నవంబర్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 1996 తరువాత మిస్ వరల్డ్ పోటీలు భారతదేశంలో జరగడం ఇదే మొదటి సారి. ఈ పోటీలను గురించి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ సీఈవో 'జూలియా మోర్లే' (Julia Morley) వెల్లడించారు. భారతదేశంలో జరగనున్న ఈ పోటీలలో మన దేశం తరపున మిస్ వరల్డ్ 'సినీ శెట్టి' (Sini Shetty) ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇందులో మొత్తం 130 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోటీలలో భాగంగా పాల్గొనే అందగత్తెల ప్రతిభ, సేవా దృక్పథం, క్రీడలలో వారికున్న ప్రతిభను ఆధారంగా చేసుకుని రౌండ్స్ నిర్వహిస్తారు. అన్ని రౌండ్స్‌లో ముందున్న వారు మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంటారు. భారతదేశం ఇప్పటి వరకు ఆరు సార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. 1966లో మొదటి సారి ఇండియాకి చెందిన 'రీటా ఫరియా' మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది. ఆ తరువాత 1994లో ఐశ్వర్యారాయ్ బచ్చన్, 1997లో డయానా హైడెన్, 1999 యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ విశ్వసుందరి కిరీటాలను సొంతం చేసుకున్నారు. ఇక ఈ సారి జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో కిరీటాన్ని దక్కించుకునే విశ్వ సుందరి ఎవరో తెలియాల్సి ఉంది. భారతదేశం ఆథిత్యమివ్వనున్న మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నియమాలు ఏంటి? రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.. నిజానికి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాలనుకునే వారు స్థానిక లేదా జాతీయ అందాల పోటీలలో పాల్గొని ఉండాలి. ఈ పోటీకి సన్నద్ధం కావడానికి ఒక కోచ్‌ని ఎంచుకోవాలి. మిస్ వరల్డ్‌లో ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారనేది ముందుగానే అప్లై చేసుకోవాలి. ఆ తరువాత ప్రిలిమినరీ ఇంటర్వ్యూలో అర్హత సాధించాలి. (ఇదీ చదవండి: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్మెంట్లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..) నియమాలు మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనాలనుకునే వారు అవివాహితులై ఉండాలి. వయసు 17 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాంటి వారు ఈ పోటీలకు అప్లై చేసుకోవచ్చు. అయితే దేశాన్ని బట్టి మారే కట్-ఆఫ్ తేదీలను ఖచ్చితంగా ద్రువీకరించాలి. పోటీలు జరిగే నాటికి మీకు నిర్దేశించిన వయసు తప్పకుండా ఉండాలి. జరిగే పోటీలు 'మిస్' అని ఉంటాయి కావున వివాహితులు పోటీ చేయడానికి అనర్హులు. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనే వ్యక్తికి గతంలో ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు. ఏ దేశం నుంచి పోటీ చేస్తున్నారో ఆ దేశం పౌరసత్వం ఖచ్చితంగా ఉండాలి. 'బ్యూటీ విత్ ఏ పర్సన్' అనే దాన్ని బట్టి బాహ్య సౌందర్యమే కాదు, అంతః సౌందర్యం కూడా చాలా ప్రధానం. కావున ప్రపంచ సుందరి పోటీలో పాల్గొనే మహిళలు ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన వ్యక్తుల కోసం డబ్బు లేదా అవగాహన పెంచడానికి ప్రాజెక్ట్‌లను నిర్వహించి ఉండాలి. డ్యాన్స్ మీద కూడా మంచి పట్టు ఉండాలి. మోడలింగ్ పోటీలలో పాల్గొనే వారు వస్త్ర ధారణ, ర్యాంప్ వాక్ వంటివి ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. ఫిజికల్ ఫిట్నెస్ చాలా ముఖ్యమని మర్చిపోకూడదు. అన్ని అంశాలలోనే ఉత్తమ ప్రతిభను కనపరచిన వారిని విజేతగా న్యాయ నిర్ణేతలు ప్రకటిస్తారు. (ఇదీ చదవండి: పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో - 19 ఏళ్లకే కోట్లు విలువైన కంపెనీ) రిజిస్ట్రేషన్ ప్రక్రియ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం క్లోజ్ అప్, మిడ్ లెంత్, ఫుల్ లెంత్ & మేకప్ లేకుండా ఉండే నాలుగు పోటోలను సిద్ధంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత రుజువు కోసం పాస్‌పోర్ట్ ప్రధానం. లేకుంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఉండాలి. మీ ఎత్తుకి సంబంధించిన ఖచ్చితమైన కొలతల కోసం VLCC కేంద్రాన్ని సందర్శించాలి. మీ ఇమెయిల్ ID లేదా మొబైల్ నంబర్‌తో సైన్ ఇన్ చేయాలి సైన్ ఇన్ చేసుకున్న తరువాత 2 వేర్వేరు ఆడిషన్ టాస్క్ వీడియోలను అప్లోడ్ చేయండి (పరిచయానికి సంబంధించిన వీడియో & రాంప్‌వాక్ వీడియో). వీడియో పరిమితి 60 సెకన్లు వరకు మాత్రమే ఉండాలి. మొదటి మూడు దశలలో మీ ఫోటోలను, కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అప్లై చేసుకోవడానికి రూ. 2999 + ట్యాక్స్ వంటివి చెల్లించాలి. ఆతరువాత మీరు రిజిస్టర్ చేసుకున్న ఈ మెయిల్ అందుకున్న కోడ్ ఎంటర్ చేసుకోవాలి. అన్ని వివరాలను ఫిల్ చేసిన తరువాత T&Cలను అంగీకరించి సబ్మిట్ చేయాలి. ఇవన్నీ పూర్తయిన తరువాత మీకు ఒక ఈ మెయిల్ వస్తుంది. అప్లై చేసుకోవంలో ఎలాంటి సందేహం ఉన్నా ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల మధ్య +91 9619937295 / +91 7039464909 నెంబర్‌కి కాల్ చేయవచ్చు, లేదా missindiaorg@timesgroup.comని సంప్రదించాలి. -
ఐవోబీకి ఆర్బీఐ షాక్! భారీ జరిమానా
ముంబై: ఆదాయ గుర్తింపు, అసెట్ వర్గీకరణ నిబంధనల అమల్లో లోపాల కారణంగా ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ)కి రిజర్వ్ బ్యాంక్ రూ. 2.20 కోట్ల జరిమానా విధించింది. 2021 మార్చి 31న నాటికి బ్యాంకు పరిస్థితి సమీక్షించిన మీదట ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో నెక్సన్ ఈవీ మ్యాక్స్: ధర ఎంతో తెలుసా? ఆర్బీఐ నిర్వహించిన తనిఖీల సందర్భంగా ఐవోబీ 2020–21 ఆర్థిక సంవత్సరంలో ప్రకటించిన లాభాల్లో 25 శాతం మొత్తాన్ని రిజర్వ్ ఫండ్‌కు బదిలీ చేయడంలో బ్యాంకు విఫలమైంది. అలాగే, మొండిబాకీలకు సంబంధించి బ్యాంకు రిపోర్టు చేసిన వాటికి, వాస్తవ ఎన్పీఏలకు మధ్య వ్య త్యాసం ఉండటం తదితర లోపాలు తనిఖీల్లో బైటపడ్డాయి. రెజ్లర్ల ఆందోళన: ఐకానిక్ క్రికెటర్స్ స్పందించకపోతే ఎలా? పారిశ్రామికవేత్త ట్వీట్ వైరల్ డోంట్ మిస్ టు క్లిక్: సాక్షిబిజినెస్ -
తిరుమల ఘాట్ రోడ్డులో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
సాక్షి, తిరుపతి: తిరుమల ఘాట్ రోడ్డులో నిబంధనలు అతిక్రమిస్తే ఆ వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా, తిరుమలకు ఆ వాహనాలను నిషేధిస్తామని తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య తెలిపారు. మంగళవారం తిరుమలలోని ట్రాఫిక్ పోలీసు స్టేషనులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ మునిరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల ఘాట్ రోడ్డులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు టీటీడీ చర్యలు ప్రారంభించిందని చెప్పారు. తిరుమల ట్రాఫిక్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారుల నేతృత్వంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసిందన్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో డ్రైవింగ్ పై వాహనదారులకు అవగాహన లేకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, సెల్ ఫోన్ డ్రైవింగ్, అతివేగం కారణాల వద్ద స్వల్ప రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అంతే కాకుండా సెల్ఫీలు తీసుకోవడం కోసం రోడ్డు పక్కన వాహనాలు ఆపడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఘాట్ రోడ్డులో అవగాహన కలిగిన డ్రైవర్లు మాత్రమే వాహనాలు నడపాలని, డ్రైవర్లకు అవగాహన కల్పించే విధంగా తిరుమల ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాలలో సూచనలు, సలహాలు ఇచ్చే విదంగా చర్యలు చేపట్టామన్నారు. ఇక ఘాట్ రోడ్డులో స్పీడ్ లిమిట్ ను తిరిగి ప్రారంభిస్తామని, ఘాట్ రోడ్డులో పోలీసుల నిబంధనలను అతిక్రమిస్తే, ఆ వాహనాలను పూర్తిగా తిరుమలకు నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ మునిరామయ్య అన్నారు. చదవండి: కర్నూలులో దారుణం.. ఇంట్లో అట్టపెట్టెలతో భర్త మృతదేహాన్ని తగలబెట్టింది! -
సెలెబ్రిటీలపై ఫిర్యాదుల వెల్లువ.. లిస్ట్‌లో ఎంఎస్ ధోనీ టాప్!
ముంబై: వాణిజ్య ప్రకటనల్లో నటించేటప్పుడు ఆయా ఉత్పత్తుల మంచీ, చెడుల గురించి మదింపు చేయడంలో చాలా మటుకు సెలబ్రిటీలు విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని అడ్వర్టైజింగ్ పరిశ్రమ స్వీయ నియంత్రణ సంస్థ ఏఎస్సీఐ తెలిపింది. ఇదీ చదవండి: ChatGPT false: క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్.. చాట్‌జీపీటీ చేసిన ఘనకార్యం ఇది! 2022 ఆర్థిక సంవత్సరంలో 55 ప్రకటనలకు సంబంధించి సెలబ్రిటీలపై ఫిర్యాదులు రాగా గత ఆర్థిక సంవత్సరం ఇది ఏకంగా 803 శాతం పెరిగి 503 యాడ్లకు చేరింది. వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం ప్రకారం సెలబ్రిటీలు తాము నటించే యాడ్ల గురించి ముందస్తుగా మదింపు చేయాలి. కానీ ఏఎస్సీఐ పరిశీలించిన 97 శాతం కేసుల్లో సెలబ్రిటీలు ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు. ఎంఎస్ ధోనీ టాప్ పది ఉల్లంఘనలతో క్రికెటర్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) సెలబ్రిటీల లిస్టులో అగ్రస్థానంలో ఉండగా, ఏడు ఉల్లంఘనలతో యాక్టర్ కమెడియన్ భువన్ బామ్ రెండో స్థానంలో ఉన్నారు. గేమింగ్, క్లాసికల్ విద్య, హెల్త్‌కేర్, వ్యక్తిగత సంరక్షణ విభాగాల్లో అత్యధికంగా నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. గత ఆర్థిక సంవత్సరం వివిధ మీడియా ఫార్మాట్లలో ఏఎస్‌సీఐకి 8,951 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 7,928 కంప్లైంట్లను సమీక్షించింది. ఇదీ చదవండి: Mahila Samman Scheme: గుడ్‌న్యూస్.. మహిళా సమ్మాన్ డిపాజిట్‌పై కీలక ప్రకటన -
కఠిన నిబంధనలతో ఇబ్బందిపడ్డ విద్యార్థులు.. తల్లితండ్రుల అసహనం
-
ఐఏఎస్ హత్య కేసు నిందితుడి విడుదల దుమారం..బిహార్ సీఎంపై విమర్శలు
బిహార్‌లోని జైలు మాన్యువల్‌ను సవరించిన కొద్ది రోజుల్లోనే ఐఏఎస్‌ను హతమార్చిన వ్యక్తి కూడా విడుదలైందుకు దారితీసింది . దీంతో నితీష్‌కుమార్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నెల ప్రారంభంలోనే నితీష్ ప్రభుత్వం విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని హత్య చేసిన దోషులకు శిక్షను తగ్గించడాన్ని నిషేధించిన నిబంధనను తొలగించింది. ఈ మేరకు ఏప్రిల్ 20న బిహార్ రాష్ట్ర శిక్షా ఉపశమన మండలి సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని 14 లేదా 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్న సుమారు 27 మంది ఖైదీలను విడుదల చేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది బిహార్ ప్రభుత్వం. ఐతే ఆ ఖైదీలలో 1994లో అప్పటి బ్యూరోక్రాట్ జీ కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ కూడా ఉన్నారు. నిబంధనల మార్పుతో ఆనంద్ మోహన్ సింగ్‌ను విడుదల చేయడం పెను దుమారానికి దారితీసింది. ఆ ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య ఆంధప్రదేశ్‌లోని మెహబూబ్ నగర్‌కు చెందని నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి. అతన్ని అత్యంత దారుణంగా హత్య చేసిని మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్‌ను విడుదల చేసేందుకు నితీష్ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీంతో బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయవతి ట్విట్టర్లో ఆ నిబంధనల మార్పును దళిత వ్యతిరేకంగా పేర్కొంది. ఆ నిందితుడి విడుదల దళిత సమాజానికి కోపం తెప్పిస్తుందని, ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు మాయవతి. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయా కూడా ఈ విషయమై నితీష్ కుమార్‌పై విరుచుకుపడ్డారు. కాగా జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్ ఒక ట్వీట్లో.. నియమాలలో మార్పు సామాన్యులు, ప్రత్యేక ఖైదీలను ఏకరీతి ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఉద్దేశించిందేనని సమర్థించుకునే యత్నం చేశారు. మరోవైపు రెండేళ్లుగా రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందని పలువురు రాజకీయ నాయకులు సింగ్‌ను త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదీగాక బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తన మాజీ సహోద్యోగికి అండగా ఉటానని పలు సందర్భాలలో వ్యాఖ్యానించడం గమనార్హం. श्री आनंद मोहन जी की रिहाई पर अब भाजपा खुलकर आई है। पहले तो यू पी की अपनी बी टीम से विरोध करवा रही थी। बीजेपी को यह पता होना चाहिए कि श्री नीतीश कुमार जी के सुशासन में आम व्यक्ति और खास व्यक्ति में कोई अंतर नही किया जाता है। श्री आनंद मोहन जी ने पूरी सजा काट ली और जो छूट किसी… pic.twitter.com/t58DkvoK3r — Rajiv Ranjan (Lalan) Singh (@LalanSingh_1) April 25, 2023 (చదవండి: ట్రక్కు అదుపుతప్పడంతో నుజ్జునుజ్జు అయిన పెట్రోల్ పంపు) -
యూఏఈలో విజిట్ వీసా నిబంధనలు కఠినతరం
మోర్తాడ్(బాల్కొండ): వీసా నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. విజిట్ వీసాలపై యూఏఈకి వచ్చినవారు గడువు ముగిసిన తర్వాత ఒక్కరోజు కూడా ఎక్కువగా ఉండడానికి వీలు లేకుండా చర్యలు చేపట్టింది. సాధారణంగా యూఏఈ 30, 60 రోజుల విజిట్ వీసాలను జారీ చేస్తుంటుంది. ఈ వీసాలపై యూఏఈకి వచ్చినవారు గడువు ముగిసిపోకముందే వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇకపై తమ దేశంలో ఒక్కరోజు ఎక్కువగా ఉన్నా నిషేధిత జాబితాలో చేరుస్తామని అక్కడి సర్కారు ప్రకటించింది. దీనివల్ల వీసా నిబంధనలు ఉల్లంఘించినవారు యూఏఈతో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లో ప్రవేశానికి అనర్హులు అవుతారు. విజిట్ వీసాలపై వచ్చి యూఏఈలో చట్టవిరుద్ధంగా ఉంటున్నవారి సంఖ్యను తగ్గించుకోవడంతో పాటు ఎవరైనా చట్టబద్ధంగానే తమ దేశంలో ఉండే విధంగా యూఏఈ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. యూఏఈలో ఉపాధి చూపిస్తామని.. తొలుత విజిట్ వీసాపై వెళ్లాక, తర్వాత వర్క్ వీసా ఇప్పిస్తామని చెప్పే ఏజెంట్ల మాటలను నిరుద్యోగులు నమ్మవద్దని గల్ఫ్ వలస కారి్మక సంఘాల ప్రతినిధులు సూచిస్తున్నారు. -
రైలులో ప్రయాణించే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి!
దేశంలో రైల్వే శాఖ ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాక్కర్లేదు. భారతీయ రైల్వేలు 7,000 స్టేషన్లతో అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా పేరు సంపాదించింది. ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. అయితే రైల్వే శాఖ ప్రయాణికులు పాటించాల్సిన కొన్ని నిబంధనలను రూపొందించింది. వీటిని ట్రైన్లో ప్రయాణించే ప్రతి ఒక్క ప్యాసింజర్ తప్పక పాటించాల్సి ఉంటుంది. ఈ నియమాల ఉల్లంఘనకు పాల్పడితే ఒక్కోసారి చట్టపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి ప్రయాణీకుడు తప్పనిసరిగా తెలుసుకోవలసిన 7 ప్రధాన భారతీయ రైల్వే నియమాలు ఇవే: ► టిక్కెట్ బుకింగ్: రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణీకులందరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే టిక్కెట్‌ను కలిగి ఉండాలి. టిక్కెట్లను ఆన్లైన్లో, రైల్వే స్టేషన్లలో లేదా అధీకృత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. చెల్లుబాటు అయ్యే టికెట్ లేకుండా ప్రయాణించడం జరిమానాకు దారితీస్తుంది. ఈ విషయాన్ని ప్యాసింజర్లు గుర్తుపెట్టుకోవాలి. ► లగేజ్: ప్రయాణీకులు రైళ్లలో ప్రయాణించేటప్పుడు తమతో లగేజ్ తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. అయితే దీనికి ఓ పరిమితి ఉంది. ఫస్ట్ ఏసీ, 2వ ఏసీకి 40 కేజీలు, 3వ ఏసీ, చైర్ కార్కు 35 కేజీలు, స్లీపర్ క్లాస్‌కు 15 కేజీలు లగేజీని తీసుకెళ్లేందుకు పరిమితి ఉంటుంది. ప్రయాణికులు ఏ రకమైన మండే లేదా ప్రమాదకరమైన వస్తువులను ట్రైన్లో తీసుకెళ్లడం నిషేధం ► ధూమపానం: రైళ్లు, ప్లాట్‌ఫారమ్‌లు, స్టేషన్ ఆవరణలో ధూమపానం నిషేధం. ► ఆహారం: ప్రయాణీకులు తమ సొంత ఆహారాన్ని తీసుకెళ్లవచ్చు లేదా ప్లాట్‌ఫారమ్‌లోని ప్యాంట్రీ కార్ లేదా ఫుడ్ స్టాల్స్ నుండి ఆహారాన్ని కొనుగోలు చేయవచ్చు. ► మద్యం: రైళ్లు, రైల్వే ప్రాంగణాల్లో మద్యం సేవించడం నిషేధం. ► టికెట్ క్యాన్సిల్, రీఫండ్: ప్యాసింజర్ వారి టిక్కెట్‌ను రద్దు చేయాలనుకుంటే, రైలు బయలుదేరే సమయానికి ముందే అలా చేయాల్సి ఉంటుంది. తద్వారా భారతీయ రైల్వే క్యాన్సిలేషన్ విధానం ప్రకారం రీఫండ్ (వాపసు) లభిస్తుంది. ► భద్రత: ప్రయాణీకులు తమ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ప్రయాణించేటప్పుడు ప్యాసింజర్లు వారి విలువైన వస్తువులను తీసుకెళ్లకుండా ఉండడం ఉత్తమం. ట్రైన్లో తోటి ప్రయాణీకులతో వాదనలు లేదా తగాదాలకు కూడా దూరంగా ఉండాలి. చదవండి: వాహనదారులకు షాక్! హైవే ఎక్కితే బాదుడే.. పెరగనున్న టోల్ చార్జీలు! -
ప్లాన్ మార్చిన మాస్ మహారాజ్ రవితేజ
-
New IT Rules: కేంద్రం కొత్త రూల్స్.. డిజిటల్ మీడియాలో ఇకపై అలాంటివి కుదరవు!
డిజిటల్ మీడియాలో చోటుచేసుకుంటున్న ఆగడాలపై కేంద్రం కొరడా ఝళిపించబోతోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం(ఐటీ యాక్ట్) ద్వారా ఆంక్షల కత్తికి మరింత పదును పెట్టింది. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 28న జారీ చేసింది. ► ఐటీ యాక్ట్‌ను 2020లో ఆమోదించగా.. 2021 ఫిబ్రవరిలో రూల్స్(నిబంధనల)ను అమలులోకి తెచ్చారు. రానురాను డిజిటల్ మీడియాలో అనేక పోకడలు ఇబ్బందికరంగా మారడంతో తాజాగా మరోసారి ‘ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) సవరణ నియమాలు–2022 నోటిఫికేషన్‌ను కేంద్రం జారీ చేసింది. ► దీంతో సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్లు, ఆన్లైన్ ప్రచార మాధ్యమాలు తదితర డిజిటల్ పాల్ట్ఫామ్లపై మరిన్ని ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ► అసత్యాలు, అర్థసత్యాలు, అశ్లీలం, మోసాలు, హింసను ప్రేరేపించడం, కించపరిచే చర్యలతో అడ్డూ అదుపులేకుండా రెచ్చిపోయే కొందరు డిజిటల్ మీడియా నిర్వాహకులపై ఐటీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తప్పవు. ► ప్రధానంగా లోన్ యాప్స్ మోసాల నేపథ్యంలో లోన్ యాప్స్‌ను డిజిటల్ మీడియాలో ప్రోత్సహించినా, వాటికి అనుకూలంగా ప్రచారం చేసినా ఐటీ యాక్ట్ పరిధిలోకి తెచ్చి చర్యలు తీసుకుంటారు. ► డిజిటల్ మీడియా ఖాతా కోసం ఒక వ్యక్తి ఇచ్చే వ్యక్తిగత సమాచారంపై మరొక వ్యక్తికి ఎలాంటి హక్కు ఉండదు. దీన్ని ఉల్లంఘించి వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం కలిగించేలా వేరొకరు వ్యవహరించకూడదు. ► డిజిటల్ మీడియాలో తమ ఖాతాల ఏర్పాటుకు ప్రైవసీ పాలసీలో భాగంగా వినియోగదారులు ఇంగ్లిష్, తనకు నచ్చిన భాషలో ఇచ్చే వ్యక్తిగత సమాచారాన్ని నిర్వాహకులు, వేరొకరు ప్రచారం చేయడం, మార్పులు(మార్ఫింగ్) చేయడం, అప్లోడ్ చేయడం వంటివి నేరంగానే పరిగణిస్తారు. ► అశ్లీల పోస్టింగ్‌లు, అశ్లీల చిత్రాలు, శారీరక అవయవాల గోప్యతకు భంగం కలిగించడం, లింగ వివక్షతో కూడిన వేధింపులు, మహిళలు, చిన్నారులను కించపరచడం, వేధించడం, హాని కల్గించడం చేస్తే కఠిన చర్యలు తప్పవు. ► లోన్ యాప్‌లు, మనీ లాండరింగ్, ఆన్లైన్ జూదం వంటి వాటిని డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రోత్సహిస్తే ఐటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటారు. ► ఏదైనా పేటెంట్, ట్రేడ్‌మార్క్, కాపీరైట్ తదితర యాజమాన్య హక్కులను ఉల్లంఘించేలా డిజిటల్ మీడియాను వాడుకుంటే ఐటీ యాక్ట్ పరిధిలో చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ► కులం, మతం, జాతిపరంగా వివాదాలు సృష్టించడం, హింసను ప్రేరేపించడం నేరమే. ► తప్పుడు సమాచారం ఇవ్వడం, ఉద్దేశపూర్వకంగా వదంతులు, కట్టుకథలు, తప్పుడు సమాచారంతో సమాజాన్ని తప్పుదారి పట్టించడం, అసత్యాలను ప్రచారం చేయడం, మోసగించడం, ఒక వ్యక్తి మరొక వ్యక్తిలా మభ్యపెట్టేందుకు ప్రయత్నించడం నేరం. ► భారతదేశం ఐక్యత, సమగ్రత, రక్షణ, భద్రత, సార్వభౌమాధికారం, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసేలా డిజిటిల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు. ► కంప్యూటర్ సాఫ్ట్వేర్, కోడ్, ఫైల్, ప్రోగ్రామ్ తదితర వాటిని నాశనం చేయడానికి, దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తే ఐటీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. చదవండి: వస్తున్నాయ్.. పెట్రోల్, డీజల్,గ్యాస్ కాదు ఇవి కొత్త తరం కార్లు! -
ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్!
ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉపయోగిస్తున్నారా లేదా వాడుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు గమనించాలి లేదంటే ఇబ్బందులు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. బ్యాంక్ ఖాతా అంటే నగదును దాచుకోవడం , అవసరం ఉన్నప్పుడు నగదు విత్‌డ్రా చేసి వాడుకోవడం, మరి కొందరు ఫిక్స్డ్ డిపాట్లలో వచ్చే వడ్డీ కోసం ఉపయోగిస్తుంటారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ బ్యాంకింగ్ సంస్థలు తమ సేవల పరిధిని పెంచుకుంటూ పోయాయి. ఈ నేపథ్యంలో కొన్ని సేవలకు ఛార్జీలు కూడా విధిస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో కస్టమర్లు అనుకోకుండా ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉన్నారు. ఇలా ఎక్కువ ఖాతాలను నిర్వహించడం వల్ల ముఖ్యంగా సామాన్య ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో ఓ లుక్కేద్దాం.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక బ్యాంక్ అకౌంట్‌ను నిర్వహించడం సులభం పైగా మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేస్తున్నప్పుడు, మీ బ్యాంకింగ్ వివరాలు ఒకే బ్యాంకు ఖాతాలో అందుబాటులో ఉన్నందున మీ పని సులభం అవుతుంది. అయితే తప్పక అధిక బ్యాంక్ ఖాతాలు ఉపయోగించాల్సి వస్తే.. బ్యాంక్ సేవలు, ఛార్జీలు తెలుసుకునే కొత్త అకౌంట్లు ఓపెన్ చేస్తే మంచిదని సూచిస్తున్నారు. సిబిల్(CIBIL) రేటింగ్‌కు ప్రమాదం ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను ఉపయోగించడం వల్ల మీ బ్యాంక్ ఖాతాను సరైన మినిమం బ్యాలెన్స్‌తో నిర్వహించడంలో ఒక్కో సారి కుదరకపోవచ్చు. అటువంటి సందర్భాలలో దాని ప్రభావం మీ సిబిల్( CIBIL ) రేటింగ్‌పై చూపుతుంది. సర్వీస్ ఛార్జీలు అధికం బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతీ ఒక్క కస్టమర్ కూడా బ్యాంకులు విధించే ఎస్ఎంఎస్ అలర్ట్ సర్వీస్ ఛార్జ్, డెబిట్ కార్డ్ ఏంఎంసీ మొదలైన వివిధ సేవా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉపయోగిస్తుంటే వారు ఖచ్చితంగా మిగిలిన ఖాతాల ఛార్జీలను కూడా భరించాల్సిందే. అంతే కాకుండా ఎక్కువ కాలం అకౌంట్ వాడకుంటే వివిధ ఛార్జీలు పడతాయి. మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిందే బ్యాంక్ సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండాలంటే మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించడం తప్పనిసరి. మీకు ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లయితే, మీ ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసి ఉంచాల్సి వస్తుంది. ప్రస్తుత రోజుల్లో బ్యాంకులు కస్టమర్ల ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే బాదుడు మొదలుపెడుతున్నాయి. అలాంటిది వేర్వేరు బ్యాంకుల్లో కనీస మొత్తంలో నగదుని నిల్వను నిర్వహించాలంటే సామాన్యుడికి ఇది భారమే తప్ప ఉపయోగకరం కాదని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఎన్ని ఖాతాలు మనం ఉపయోగిస్తుంటే బ్యాంకులు విధించే ఛార్జీలు కూడా అదే స్థాయిలో ఉంటాయనే విషయాన్ని గమనించాలి. చదవండి:Chennai: నగరజీవికి మోయలేని భారం.. తప్పక కట్టాల్సిందే గురూ! -
సీఎస్ఆర్ నిబంధనలకు సవరణ.. నిధులను పూర్తిగా ఖర్చు చేయకపోతే
న్యూఢిల్లీ: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ఖాతాల్లో ఖర్చు చేయకుండా నిధులు మిగిలిపోతే వాటి వినియోగానికి సంబంధించి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయాలని కంపెనీలకు ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు నిబంధనలను సవరించింది. సాధారణంగా నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు తాము సీఎస్ఆర్ కింద చేపట్టిన ప్రాజెక్టు పనులు పూర్తి కాని సందర్భంలో, దానికి కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయకపోతే ఆ మొత్తాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తాజా సవరణ ప్రకారం ఆయా నిధులు సదరు ఖాతాల్లో ఉన్నంత వరకూ వాటి పర్యవేక్షణ కోసం కంపెనీలు సీఎస్ఆర్ కమిటీని ఏర్పాటు చేయాలి. అలాగే బోర్డు నివేదికలో పొందుపర్చాల్సిన సీఎస్ఆర్ కార్యకలాపాల వార్షిక రిపోర్టు ఫార్మాట్‌నూ ప్రభుత్వం సవరించింది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
గుడ్ న్యూస్! ఈపీఎఫ్ఓ కొత్త ప్రతిపాదనలు..మారనున్న నిబంధనలు!
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల్ని సవరించనుంది. కొత్త నిబంధనల్ని అమలు చేయనుంది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ ఈ కొత్త ప్రతిపాదనల్ని తన స్టేక్ హోల్డర్స్‌తో పాటు, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉంచినట్లు సమాచారం. ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో చేరాలంటే ఒక సంస్థలో 20మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ..వారి శాలరీ రూ.15వేలకు పైగా ఉండాలి. అలా ఉంటనే వారు చందాదారులుగా చేరే సౌకర్యం ఉంది. అయితే ఈ తరుణంలో ఈపీఎఫ్ఓ సంస్థ మిసిలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952లోని పరిమితుల్ని ఉపసంహరించుకోనుంది. తద్వారా ఈపీఎఫ్ఓ తన పథకాలను బిజినెస్ చేసుకునే వారికి సైతం అందించే సౌలభ్యాన్ని కల్పించనుంది. దీంతో పాటు ఈపీఎఫ్ఓలో చేరేందుకు ఇప్పటి వరకు విధించిన హెడ్ కౌంట్ (20మంది ఉద్యోగులు) ఉండాలని నిబంధనల్ని తొలగించేలా ప్రతిపాదనలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ ఎలా పనిచేస్తుంది కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇందులో ప్రస్తుతం ఈపీఎఫ్ఓ తన ఖాతాదారులకు ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. మార్చి,2022 నాటి లెక్కల ప్రకారం.. ఉద్యోగి బేసిక్ శాలరీలో నుంచి 12 శాతం వారి ఈపీఎఫ్ ఖాతాలోకి వెళుతుంది. సంస్థ మరో 12శాతం ఉద్యోగి తరుపు జమ చేస్తుంది. ఈ జమ చేసిన మొత్తాన్ని ఉద్యోగి అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. లేదంటే ఆ మొత్తాన్ని ఉద్యోగి రిటైరైన తర్వాత ఈపీఎఫ్ఓ నెలకు పెన్షన్ రూపంలో అందిస్తుంది. చదవండి👉 ఈపీఎఫ్ఓలో ఫోటో ఎలా అప్లోడ్ చేయాలో తెలుసా? లేదంటే డబ్బులు రావు! -
81 మంది చైనా పౌరులకు నోటీసులు 117 మందికి బహిష్కరణ
న్యూఢిల్లీ: భారత్‌లో వీసా నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా ఉంటున్న విదేశీయులపై భారత ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రావు ఎంతమంది విదేశీయులపై చర్యలు తీసుకున్నారో వివరించారు. ఆయన మాట్లడుతూ...2019 నుంచి 2021 మధ్య కాలంలో భారత్‌లో వీసా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఉంటున్న సుమారు 81 మంది చైనా పౌరులకు భారత్‌ని వదిల వెళ్లేలా నోటీసుల, అలాగే మరో 117 మందిని మూడేళ్ల పాటు బహిష్కరించినట్లు వెల్లడించారు పైగా సుమారు 726 మంది చైనీయులను వీసా నిబంధనలను ఉల్లంఘంచిన ప్రతికూల జాబితాలో ఉన్నారని చెప్పారు. విదేశాల నుంచి భారత్‌కి వచ్చే వారి రికార్డును ప్రభుత్వం ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుందన్నారు. కొంతమంది విదేశీయులు నిర్లక్ష్యంతోనో లేక చికిత్స నిమిత్తంగానో లేక మరేదైనా వ్యక్తిగత కారణాలతో వీసా గడువు ముగిసిపోయినా ఉండిపోతున్నారని చెప్పారు. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో అనుకోకుండా నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ కాలం ఇక్కడ ఉండిపోతే జరిమాన విధించి వీసాను క్రమబద్ధీకరించడం లేదా గడువు పొడిగించడం జరుగుతుందన్నారు. అలా కాకుండా కావాలనే వీసా నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ కాలం ఉండిపోతే విదేశీయుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా భారత్‌ని వదిలి వెళ్లేలా నోటీసులు జారీ చేసి జరిమాన విధించడం జరుగుతుందని తెలిపారు. (చదవండి: ఢిల్లీలో మరో కేసు... ఎనిమిదికి చేరిన కేసులు) -
ఆగస్ట్ ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..!
ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంపై ప్రభావం చూపేలా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఆగస్ట్ 1 నుంచి మారబోయే అంశాలేంటో తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా : ఆగస్ట్ 1నుంచి ఆర్బీఐ సూచనల మేరకు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెక్కుల కోసం 'పాజిటివ్ పే సిస్టమ్'ని అమలు చేస్తుంది. తద్వారా చెక్కు ఇచ్చి డబ్బులు తీసుకున్న ఖాతాదారుడి వివరాలు, సంబంధిత వ్యక్తికి చెక్కు ఇచ్చిన సంస్థ లేదంటే వ్యక్తుల వివరాల్ని ధృవీకరించాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ కేవైసీ : రైతుల సౌలభ్యం కోసం, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎంకేఎస్‌ఎన్‌వై) కోసం ఈ-కేవైసీ గడువు మే 31 నుండి జూలై 31 వరకు పొడిగించింది. రేపటి నుండి కేవైసీ అప్డేట్ చేసుకునే సౌకర్యం లేదు. పీఎంఎఫ్‌బీవై రిజిస్ట్రేషన్: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)కి సంబంధించిన రిజిస్ట్రేషన్లు జులై 31తో ముగుస్తాయి. రిజిస్ట్రేషన్లను కోల్పోయిన వారు ఈ స్కీంలో లబ్ధి పొందలేరు. కాగా ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్లైన్లోనైనా చేసుకోనే సదుపాయం కేంద్రం కల్పించింది. ఎల్పీజీ గ్యాస్ రేట్లు: ప్రతి నెల మొదటి తేదీన, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ధరలు సవరించబడతాయి. ఏప్రిల్ నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గగా, డొమెస్టిక్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఐటీఆర్ రిటర్న్ ఫైలింగ్: 2021-22 ఆర్థిక సంవత్సరం, 2022-23 విద్యా సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పించడానికి జూలై 31 చివరి తేదీ. గడువు తేదీని ప్రభుత్వం పొడిగిస్తే తప్ప, ఐటీఆర్‌లను ఆలస్యంగా దాఖలు చేసినందుకు ఆగస్టు 1 నుంచి జరిమానా, ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. -
విదేశాల్లో బంధువులున్నారా? మీకో గుడ్‌న్యూస్: నిబంధనలు మారాయ్!
సాక్షి,న్యూఢిల్లీ: విదేశీ విరాళాల స్వీకరణ నియంత్రణ (ఎఫ్సీఆర్ఏ) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించింది. ఈ మేరకు విదేశాలలో నివసిస్తున్న భారతీయులు, వారి బంధువులకు శుభవార్త అందించింది. తాజా సవరణతో ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం అందించాల్సిన అవసరం లేకుండానే పది లక్షల రూపాయల వరకు భారతీయ బంధువులకు, కుటుంబీకులకు విదేశాల్లో ఉంటున్న వారు పంపించుకోవచ్చు. ఇప్పటివరకు ఈ పరిమితి కేవలం లక్ష రూపాయలు మాత్రమే. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాదు సవరించిన నిబంధనల ప్రకారం, లబ్ధిదారులు ఏడాదిలో రూ.10 లక్షలకు మించి నిధులు అందిన 90 రోజుల్లోగా ప్రభుత్వానికి అధికారికంగా వెల్లడించేలా నిబంధనలు మార్చింది. ఇప్పటివరకు ఈ వ్యవధి 30 రోజులు మాత్రమే. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఎ)కి సంబంధించిన కొన్ని నిబంధనలను మంత్రిత్వ శాఖ సవరించింది. దీనికి సంబంధించిన ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) సవరణ నిబంధనలు, 2022 గెజిట్ నోటిఫికేషన్‌ను హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. కాగా విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం 2011లో, రూల్ 6 ప్రకారంలో ఏ వ్యక్తి అయినా తన బంధువుల నుండి ఒక ఆర్థిక సంవత్సరంలో లక్ష కంటే ఎక్కువ లేదా దానికి సమానమైన విదేశీ విరాళాన్ని స్వీకరిస్తే, అటువంటి సహకారం అందిన 30 రోజులలోపు కేంద్రానికి వివరాలు తెలియజేయాల్సి ఉండింది. ప్రస్తుత నిబంధన ప్రకారం 10 లక్షలకు మించి విదేశీ నిధులను స్వీకరిస్తే 90 రోజులలోపు సమాచారాన్ని కేంద్రానికి అందించాలి. అదేవిధంగా, ఎఫ్సీఆర్ఏ నిధులను స్వీకరించడానికి 'రిజిస్ట్రేషన్' లేదా 'ముందస్తు అనుమతి' పొందే నిబంధన 9కి కూడా మార్పులు చేసింది. సంబంధిత వ్యక్తులు, సంస్థలు లేదా ఎన్జీవోలు తమకు అందిన నిధులు, బ్యాంకు ఖాతా సమాచారాన్ని హోంమంత్రిత్వ శాఖకు అందించే గడువు 45 రోజులకు పెంచింది. ఇప్పటివరకు ఇది 30 రోజులు మాత్రమే. ఎన్జీవోలు లేదా సంస్థలు, వ్యక్తులు విదేశీ నిధులను స్వీకరణకు సంబంధించి తన అధికారిక వెబ్సైట్లో ప్రతీ త్రైమాసికంలో వివరాలను అందించాలనే మరో నిబంధనను కూడా తొలగించింది. ఒక వేళ బ్యాంకు ఖాతా, పేరు, చిరునామా లేదా విదేశీ నిధులు మారిన పక్షంలో, ఆ సమాచారాన్ని మునుపటిలా 15 రోజుల ముందు కాకుండా 45 రోజులలోపు అందించాలి. అలాగే ఆయా నిధుల వినియోగంపై ఆడిటెడ్ స్టేట్మెంట్ అందించడానికి ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటి నుంచి 9 నెలల సమయం ఉంటుంది. -
'భారత్ పై చర్యలు తీసుకోండి'... బైడెన్‌కి లేఖ...
Dangerous trade-distorting practices: అమెరికా కాంగ్రెస్ చట్టసభ సభ్యులు భారత్ వ్యవసాయ రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ వ్యవసాయ రంగంలో సరైన నియమాలు లేవని ఇవి ప్రమాదకరమైన వాణిజ్యాన్ని వక్రీకరించే పద్ధతులు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై భారత్‌తో సంప్రదింపుల కోసం అధికారిక అభ్యర్థనను ధాఖాలు చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని కోరారు. ఈ మేరకు 12 మంది కాంగ్రెస్ సభ్యులు బైడెన్‌కి లేఖ రాశారు. "ఆ లేఖలో...ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నియమాల ప్రకారం ఆయా దేశాల ప్రభుత్వాలు వస్తువుల ఉత్పత్తి విలువలో 10% వరకు సబ్సిడీ ఇవ్వడానికి అనుమతిస్తాయి. కానీ భారత ప్రభుత్వం బియ్యం, గోధుమలతో సహా అనేక వస్తువులకు ఉత్పత్తి విలువలో సగానికి పైగా సబ్సిడీని కొనసాగిస్తోంది. బైడెన్ పాలన నియమాలకు విరుద్ధంగా భారత్ ధరలను తగ్గించడం, బియ్యం, గోధుమ వంటి వాటి ఉత్పత్తిని తగ్గించడం వంటివి చేస్తోందని ఆరోపించారు. ఇది అమెరికా ఉత్పత్తిదారులకు ప్రతికూలంగా ఉండటమే కాకుండా ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిని, వాణిజ్యాన్ని కూడా పూర్తిగా మార్చేసిందన్నారు. భారత్ వ్యవసాయ రంగ విధానాలు ప్రపంచ స్థాయిలో ప్రమాదకరమైన వాణిజ్య వక్రీకరణ అని ఆరోపణలు చేశారు. భారత్ అనుసరిస్తున్న విధానాలు అమెరికాలోని రైతులపై ప్రభావం చూపుతోంది." అని ఆ లేఖలో పేర్కొన్నారు. అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లోని ఇతర సభ్యుల మద్దతు తీసుకుని భారత్‌తో అధికారిక సంప్రదింపులు జరపాలని కోరారు. ఏకాభిప్రాయం కోసం అమెరికా భారత్‌కి వంతపాడోద్దని, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆహార కొరతను దృష్టిలో ఉంచుకుని పరిష్కార దిశగా అమెరికా తగు చర్యలు తీసుకోవాలంటూ బైడెన్‌ని చట్ట సభ సభ్యులు డిమాండ్ చేశారు. అంతేకాదు అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత కోసం స్థితిస్థాపక పరిస్థితులను నిర్మించడంలో అమెరికా వ్యవసాయం దోహదపడుతుందన్నారు. కానీ భారత్ మాత్రం డబ్ల్యూటీఓలో తాము అనుసరిస్తున్న విధానం సరైనదేనని నొక్కి చెబుతోంది. తమ రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో భాగంగా భారత్ ఇలాంటి విధానాలను అనుసరిస్తోందని , దీన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, సంస్థలు ప్రశంసించాయని చెప్పడం విశేషం. (చదవండి: రూ. 300 కోట్ల మోసానికి పాల్పడ్డ భారత సంతతి వ్యక్తి అరెస్ట్) -
మాస్కు మస్ట్...ఆలస్యమైన అనుమతించరు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్ష కేంద్రాల్లో క్లీన్ అండ్ గ్రీన్‌తోపాటు శానిటైజేషన్ కార్యక్రమాలు పరీక్షలు పూర్తయ్యే వరకు కొనసాగే విధంగా చర్యలు చేపట్టింది. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సిట్టింగ్ ఏర్పాట్లు చేసింది. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రం ఆవరణలో, బయట నీడ లేకుంటే ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంది. విద్యుత్, తాగునీటి సౌకర్యంతోపాటు అత్యవసర వైద్య సేవల కోసం ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. డీహైడ్రేషన్ నుంచి విద్యార్థులను రక్షించేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. పరీక్ష కేంద్రంలో వాటర్ బాటిల్ మాత్రమే అనుమతిస్తారు. సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోనికి అనుమతించరు. ఒక్క నిమిషం నిబంధన అమలు ఇంటర్మీడియట్ పరీక్షలకు ఈసారీ కూడా ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించకూడదనే నిబంధన విధించారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి. ఉదయం 8 నుంచే పరిశీలించి కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ట్రాఫిక్ సమస్య, పరీక్ష కేంద్రం గుర్తింపు సమస్యలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. టీఎస్‌బీఐఈ ఎగ్జామ్ సెంటర్ లోకేటర్ అనే మొబైల్ యాప్ ద్వారా పరీక్ష కేంద్రాన్ని సులువుగా గుర్తించవచ్చు. 3.76 లక్షల మంది విద్యార్థులు.. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో సుమారు 3.76 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందు కోసం సుమారు 517 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి గదిలో 25 మంది విద్యార్థులకు ఒకరి చొప్పున 15,048 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ కోసం కేంద్రానికి ఒక్కొక్కరి చొప్పున డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెట్లను కేటాయించారు. ప్రైవేటు పరీక్ష కేంద్రంలో అదనంగా అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెట్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా తనిఖీల కోసం సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో ఉండనున్నాయి. మాస్ కాపీయింగ్, అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. (చదవండి: సర్కారు వారి పాట) -
తెలంగాణ గ్రూప్-1 పోస్టులకు అప్లై చేస్తున్నారా? బబ్లింగ్‌తో భద్రం!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షలకు సంబంధించిన నిబంధనలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మరింత కఠినతరం చేసింది. దరఖాస్తుల నుంచి ఓఎంఆర్ జవాబుపత్రం దాకా.. వివ రాల నమోదు, సమాధానాల గుర్తింపుపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బబ్లింగ్‌లో ఎలాంటి తప్పిదాలు జరిగినా.. డబుల్ బబ్లింగ్ చేసినా.. ఆ అభ్యర్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయబోమని ప్ర కటించింది. దరఖాస్తు చేసే సమయం నుం చే అప్రమత్తంగా ఉండాలని.. ప్రతి అంశాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూ సుకుని నమో దు చేయాలని సూచించింది. దరఖాస్తుల ప్రక్రియ షురూ..: గ్రూప్–1 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభమవుతోంది. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఓటీఆర్ (వన్ టైమ్ రిజిస్ట్రేషన్) చేసుకున్న అభ్యర్థులు మాత్రమే గ్రూప్–1కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఓటీఆర్ నమోదు చేసుకోనివారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 31వ తేదీ వరకు గ్రూప్–1 దరఖా స్తులను స్వీకరిస్తారు. ఆన్లైన్లో గ్రూప్–1 దరఖాస్తును సమర్పించే అభ్యర్థులు.. వివ రాలన్నీ నింపాక కచ్చితంగా ఒకసారి ప్రి వ్యూ చూసుకుని.. క్షుణ్నంగా పరిశీలించాకే సబ్మిట్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలని టీఎస్పీ ఎస్సీ సూచించింది. డబుల్ బబ్లింగ్‌తో ట్రబుల్!: సాధార ణంగా ఓఎంఆర్ షీట్లో హాల్ టికెట్ నంబ ర్, ఇతర వివరాలను పూరించడానికి, సమా ధానాలను గుర్తించడానికి.. అంకెలు, అక్షరా లను వినియోగించరు. బదులుగా నిర్దేశిం చిన అంకెలున్న వృత్తాలను బాల్ పాయిం ట్ పెన్‌తో నింపాల్సి ఉంటుంది. అది కూడా ఒక్కో వృత్తాన్ని మాత్రమే పూరించాలి. తప్పుగా వృత్తాలను పూరించిన వారు మళ్లీ అసలు వృత్తాన్ని కూడా నింపితే డబుల్ బబ్లింగ్ అంటారు. గతంలో గ్రూప్– 2 నియామకాల సమయంలో డబుల్ బబ్లింగ్ తీవ్ర వివాదం రేకెత్తించింది. కొందరు అభ్య ర్థులు ఓఎంఆర్ షీట్‌పై డబుల్ బబ్లింగ్ చేయడం, వైట్నర్ వినియోగించడం, ఈ వ్యవహారంపై కొందరు కోర్టుకు వెళ్లడంతో నియామకాల ప్రక్రియ దాదాపు నాలుగేళ్లు నిలిచిపోయింది. దీంతో ఈసారి టీఎస్ పీఎస్సీ ముందుజాగ్రత్తగా కఠిన చర్యలను ప్రకటించింది. అభ్యర్థి డబుల్ బబ్లింగ్ చేస్తే.. సదరు జవాబు పత్రాన్ని మూల్యాం కనం చేయబోమని స్పష్టం చేసింది. సాఫ్ ్టవేర్లో మార్పులు చేశామని, డబుల్ బబ్లింగ్ ఉన్న ఓఎంఆర్ షీట్లు తిరస్కరణకు గురవు తాయని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. సమస్యల పరిష్కారానికి హెల్ప్ డెస్క్ గ్రూప్–1 దరఖాస్తుల సమయంలో ఏవై నా సాంకేతిక సమస్యలు తలెత్తితే పరిష్క రించేందుకు టీఎస్పీఎస్సీ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. అభ్యర్థులు ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య.. 040– 23542185, 040–2354 2187 నంబర్ల కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసు కోవచ్చు. లేదా help@tspsc.gov.in ’కు ఈ–మెయిల్ చేయవచ్చు. -
టాక్స్ పేయర్లకు అలర్ట్..! ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..!
మరికొద్ది రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం(2022-23) రాబోతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను నిబంధనలలో అనేక మార్పులు రానున్నాయి. ఆదాయపు పన్నులపై కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1, 2022న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పలు మార్పులు సూచించింది. డిజిటల్, క్రిప్టో ఆస్తులపై ఆదాయపు పన్ను, అప్డేట్ చేయబడిన రిటర్న్‌ల దాఖలు, ఈపీఎఫ్ వడ్డీపై కొత్త పన్ను నియమాలు, కోవిడ్-19 చికిత్సపై పన్ను ఉపశమనం వంటి వాటిపై ఏప్రిల్1 , 2022 నుంచి కొన్ని మార్పులు రానున్నాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి రానున్న ప్రధాన ఏడు మార్పులు ఇవే..! 1) క్రిప్టో పన్ను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో క్రిప్టోకరెన్సీలపై పన్ను విధానం క్రమంగా అమలులోకి రానుంది. క్రిప్టో ఆస్తులపై సుమారు 30 శాతం పన్ను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రానుంది. అయితే 1 శాతం టీడీఎస్ మాత్రం జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి. క్రిప్టో ఆస్తులపై ఆదాయపు పన్ను విధింపుకు సంబంధించి 2022-23 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2) లాభాలు, నష్టాలతో సంబంధం లేదు..! క్రిప్టోకరెన్సీ, డిజిటల్ ఆస్తుల విషయలో కేంద్రం కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. క్రిప్టో హోల్డింగ్ మరొక వెర్షన్ నుంచి వచ్చే ఆదాయానికి వ్యతిరేకంగా నిర్దిష్ట డిజిటల్ ఆస్తిలో వచ్చే నష్టాలను అనుమతించకుండా చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. క్రిప్టో కరెన్సీపై కేంద్రం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. క్రిప్టో ఆస్తులను మైనింగ్ చేస్తున్నప్పుడు ఏర్పడే అవస్థాపన ఖర్చులపై ప్రభుత్వం పన్ను మినహాయింపులను అనుమతించదు. ఎందుకంటే వాటిని సముపార్జన ఖర్చుగా పరిగణించబడదు. సింపుల్‌గా చెప్పలాంటే ఒక వ్యక్తి బిట్‌కాయిన్‌పై రూ. 1000 లాభం, మరోక క్రిప్టోకరెన్సీ ఈథిరియం రూ. 700 నష్టాన్ని పొందినట్లయితే, సదరు వ్యక్తి రూ.1000పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ సదరు వ్యక్తి పొందిన నికర లాభం రూ. 300 పన్ను ఉండదు. అదేవిధంగా, స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా రియల్ ఎస్టేట్ వంటి ఇతర ఆస్తులలో లాభ, నష్టాలకు వ్యతిరేకంగా క్రిప్టోకరెన్సీపై లాభ, నష్టాలను సెట్ చేయలేరు. 3) ఐటీ రిటర్న్ ఫైలింగ్ ఆదాయపు పన్ను రిటర్న్‌లలో చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు గాను కొత్త నిబంధన అమలులోకి రానుంది. పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన రెండు సంవత్సరాలలోపు అప్డేటేడ్ రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. 4) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పీఎస్ మినహాయింపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు సెక్షన్ 80CCD(2) కింద తమ బేసిక్ జీతం, డియర్నెస్ అలవెన్స్‌లో 14 శాతం వరకు ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్ కోసం ఎంప్లాయర్ ద్వారా డిడక్షన్‌ను క్లెయిమ్ చేసుకోగలరు. గతంలో ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండేది. 5) పీఎఫ్ ఖాతాపై పన్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను (25వ సవరణ) రూల్-2021 ను అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ రూ. 2.5 లక్షలు దాటితే పన్ను విధించబడుతోంది. దీనికి మించి కంట్రిబ్యూషన్ చేస్తే, వడ్డీ ఆదాయంపై పన్ను విధించబడుతుంది. 6) కోవిడ్-19 చికిత్స ఖర్చులపై పన్ను మినహాయింపు జూన్ 2021 కేంద్ర ప్రకటన ప్రకారం...కోవిడ్ వైద్య చికిత్స కోసం డబ్బు పొందిన వ్యక్తులకు పన్ను మినహాయింపు అందించబడింది. అదేవిధంగా, కోవిడ్ కారణంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు కుటుంబ సభ్యులు స్వీకరించే రూ. 10 లక్షల డబ్బుపై టాక్స్ మినహాయింపు ఉంటుంది. సదరు వ్యక్తి మరణించిన తేదీ నుంచి 12 నెలలలోపు డబ్బు అందినట్లయితే ఎలాంటి టాక్స్ ఉండదు. 7) వైకల్యం ఉన్న వ్యక్తులకు పన్ను మినహాయింపు వికలాంగుల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వైకల్యం కల్గిన వ్యక్తికి బీమా పథకాన్ని తీసుకోవచ్చు. దీనిపై పన్ను మినహాయింపు ఉంటుంది. చదవండి: ఈపీఎఫ్ చందాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్! -
అక్కడ ఒమిక్రాన్ కలకలం.. కోవిడ్ రూల్స్‌పై కేంద్రం కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కనిష్ట స్థాయిలో రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలను సడలించాయి. కాగా, కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో భద్రతా చర్యల కోసం కేంద్రం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేంద్రం కొవిడ్ రూల్స్ విధించిందిన విషయం తెలిసిందే. అయితే, దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31వ తేదీ నుంచి అన్ని నిబంధనలను తొలగిస్తున్నట్టు బుధవారం కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. కానీ, బహిరంగ ప్రదేశాల్లో మాత్రం మాస్క్ ధరించాల్సి ఉంటుందని హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. కాగా, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కేంద్రం తీసుకున్న కోవిడ్ రూల్స్ మార్చి 31తో ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. యూరప్, చైనా, దక్షిణ కొరియా, వియత్నాం, ఫ్రాన్స్, జర్మనీలలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 23, బుధవారం నాటికి 1,81,89,15,234 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. దేశంలో ప్రస్తుతం 12 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికీ కేంద్రం టీకాలు అందిస్తోంది. ఇక, కోవిషీల్డ్ టీకాల మధ్య గ్యాప్‌ను కూడా కేంద్రం 8-16 వారాలకు తగ్గించిన విషయం తెలిసిందే. కోవాగ్జిన్ టీకాల మధ్య గ్యాప్ 28 రోజులుగా ఉంది. ఇది చదవండి: బయటపడ్డ మాజీ ఎమ్మెల్యే సమాధి.. అధికారులు పట్టించుకోకపోవడంతో.. -
విదేశాల్లో ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు అలెర్ట్ !
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో వైద్య విద్య అభ్యసనకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో వైద్య విద్యకు నీట్ పరీక్ష అర్హత ఆధారంగా అడ్మిషన్లు కేటాయించడం.. ఎన్ఎంసీ నిర్దేశించిన విధానంలో పరీక్షల నిర్వహణతో ముగుస్తుంది. అయితే విదేశాల్లో ఎలాంటి నిబంధనలు లేకుండా ఫీజు ఆధారంగా సీట్లు పొంది కోర్సు పూర్తి చేస్తున్నారు. తాజాగా ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న వేల మంది భారతీయ విద్యార్థులు యుద్ధం కారణంగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. అయితే భారత్‌లో కంటే అత్యంత సులువైన పద్ధతితో విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతో విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసే వారికి కొన్ని నిబంధనలు తీసుకొచ్చేందుకు జాతీయ వైద్య మండలి ప్రత్యేక కసరత్తు చేస్తోంది. 54 నెలలు మస్ట్ ఇప్పటికే కొన్ని రకాల నిబంధనలు ఉన్నా వాటిని మరింత లోతుగా అధ్యయనం చేస్తూ కొత్తగా మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించింది. ఎంబీబీఎస్ కోర్సును కనీసం 54 నెలలు పూర్తి చేయాలనే నిబంధనను కఠినతరం చేస్తోంది. అలాగే కాలేజీలో అడ్మిషన్ పొందేముందు అక్కడి మౌలిక వసతులు, అత్యాధునిక పద్ధతుల తీరును పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తోంది. ఆన్‌లైన్‌కి నో వైద్య విద్యలో ఆన్లైన్ పద్ధతిలో కొనసాగే తరగతులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవద్దని ఎన్ఎంసీ భావిస్తోంది. పూర్తిగా మాన్యువల్‌లో, ప్రయోగ విధానంలో తరగతులు నిర్వహించడమే మేలని అంచనాకు వచ్చింది. విదేశాల్లో వైద్య కోర్సు పూర్తి చేసిన తర్వాత ఇంటర్న్‌షిప్ నిర్వహించినా.. తిరిగి ఇక్కడ ఎన్ఎంసీ పరీక్షలో అర్హత సాధించడంతో పాటు ఇంటర్న్‌షిప్ మనోమారు చేయాల్సిన అంశాలను కఠినంగా అమలు చేయనుంది. ఇప్పటికే ఎన్ఎంసీ మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ తాజా పరిణామాలతో వీటిని రివైజ్ చేసే అవకాశం ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చదవండి: అమెరికా వీసా దరఖాస్తుదారులకు తీపి కబురు.. -
డీజే కొట్టు డీజే.. కరోనా లేదు గిరోనా లేదు!
మూడో వేవ్ ఉధృతిలో కరోనా కేసులు పొటెత్తుతున్నాయి. ఒకవైపు కేసుల సంఖ్య తగ్గిపోతుండడంపై కేంద్రం అప్రమత్తం అయ్యింది. టెస్ట్‌లను పెంచాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలిస్తూ.. వ్యాప్తి విషయంలో అప్రమత్తం చేస్తోంది. మరోవైపు ఎన్నికల సంఘం కూడా ప్రచారం విషయంలో ఆంక్షలతో కట్టడికి ప్రయత్నిస్తోంది. అయితే.. కొందరు మాత్రం వైరస్ విషయంలో నిర్లక్క్ష్యం వహిస్తూనే ఉన్నారు. తాజాగా కరోనా ఆంక్షలను పట్టించుకోకుండా వేల మందితో ఓ నేత.. వివాహ వేడుక నిర్వహించిన ఘటన ఇప్పుడు గుజరాత్లో వెలుగు చూసింది. థాపి జిల్లాలో ఓ బీజేపీ నేత ఈ వేడుకను నిర్వహించాడు. రంగు రంగుల లైట్ల వెలుగుల్లో వేల మంది డీజే నృత్యాల్లో మునిగిపోయిన వీడియో ఒకటి అక్కడి వాట్సాప్ అకౌంట్లలో చక్కర్లు కొడుతోంది. గుజరాత్ కొవిడ్ గైడ్ లైన్స్ ప్రకారం.. పెళ్లికి 150మందికి మించకూడదు. కానీ, డోవ్లాన్ బ్లాక్‌లో నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ నేత సునంద ఈ వేడుకను నిర్వహించాడు. వేల మంది హాజరై.. భౌతిక దూరం, మాస్క్‌లను మరిచి చిందులేశారు. మధ్యలో కానిస్టేబుల్స్ వచ్చి వారించినప్పటికీ.. వాళ్లను బెదిరించి పంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికార పక్ష నేత కావడంతో వైరల్ అయిన ఆ వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే.. గుజరాత్లో ప్రస్తుతం 70వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. చదవండి: పగలంతా బొమ్మ.. రాత్రి కాగానే దెయ్యం! -
ఐపీవో నిధుల వినియోగంపై పరిమితులు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల వినియోగంపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిమితులు విధించింది. ఇందుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేసింది. వెరసి గత నెలలో బోర్డు ప్రతిపాదించిన పలు సవరణలు, నిబంధనల అమలుకు సన్నాహాలు ప్రారంభించింది. తద్వారా ఐపీవో నిబంధనలను కఠినతరం చేసింది. ఆంక్షలు ఇలా తాజా నోటిఫికేషన్ ప్రకారం అప్పటికి గుర్తించని భవిష్యత్ కొనుగోళ్లకు వెచ్చించే నిధులపై పరిమితులు విధించింది. ఇదే విధంగా ప్రధాన వాటాదారులకు షేర్ల జారీపైనా ఆంక్షలకు తెరతీసింది. యాంకర్ ఇన్వెస్టర్ల లాకిన్ గడువును 90 రోజులకు పొడిగించింది. ఇకనుంచీ సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించే నిధులను క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు పర్యవేక్షించనున్నాయి. సంపన్న వర్గాల(ఎన్ఐఐలు)కు కేటాయించే ఈక్విటీ నిబంధనలపైనా దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా పలు ఐసీడీఆర్ నిబంధనలను సవరించింది. ఇటీవల ఆధునిక టెక్నాలజీ ఆధారిత కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణకు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. 35 శాతమే.. తాజా నిబంధనల ప్రకారం భవిష్యత్‌లో ఇతర కంపెనీల(అప్పటికి గుర్తించని) కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం మొత్తం ఐపీవో నిధుల్లో 35 శాతానికే అనుమతి ఉంటుంది. ఇలాకాకుండా భవిష్యత్ కొనుగోళ్లకు చెందిన ఇతర కంపెనీలు, తదిర వివరాలను ఆఫర్ డాక్యుమెంట్లో పొందుపరిస్తే ఈ పరిమితులు వర్తించవు. ఏదైనా కంపెనీలో 20 శాతానికి మించి వాటా కలిగిన వాటాదారుడు ఐపీవోలో 50 శాతం వరకూ తమ వాటాను ఆఫర్ చేసేందుకు అనుమతిస్తారు. 20 శాతంకంటే తక్కువ వాటాగల వాటాదారులు 10 శాతం వాటాను మాత్రమే విక్రయించేందుకు వీలుంటుంది. ఇక యాంకర్ ఇన్వెస్టర్లకు జారీ చేసే ఈక్విటీలో 50 శాతం వాటాను ప్రస్తుత 30 రోజుల తదుపరి విక్రయించేందుకు అవకాశముంటుంది. మిగిలిన 50 శాతాన్ని 90 రోజుల తదుపరి మాత్రమే అమ్ముకునేందుకు నిబంధనలు అనుమతిస్తాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి నిబంధనలు అమలుకానున్నాయి. చదవండి: రూ. 8.56 లక్షల కోట్లు.. 2,220 లావాదేవీలు.. -
అమెరికా వెళ్తున్నారా? ఈ రూల్స్ పాటించాల్సిందే ! బైడెన్ సర్కార్ కొత్త ఆదేశాలు
ఒమిక్రాన్ వేరియంట్ భయాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం నిబంధనలు కఠినం చేసింది. విదేశాల నుంచి అమెరికా చేరుకునే ఆ దేశ పౌరులు, విదేశీయులు తప్పనిసరిగా కొన్ని నిబందనలు పాటించాలంటూ జో బైడెన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. గత బుధవారం కాలిఫోర్నియాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసు వెలుగు చూసింది. దీంతో అప్రమత్తమైన అమెరికా ఆరోగ్య , వైద్య విభాగం వెంటనే ప్రభుత్వానికి కొన్ని సూచనలు జారీ చేసింది. వీటి ప్రకారం విదేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించారు. - విదేశాల నుంచి అమెరికాకు చేరుకునే వారు తమతో పాటు 24 గంటల ముందు జారీ చేసిన కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. గతంలో 72 గంటలుగా ఉన్న నిబంధనను ఒక రోజుకి కుదించారు. - గడిచిన పద్నాలుగు రోజులుగా దక్షిణాఫ్రికాతో పాటు ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రయాణించిన వారికి అమెరికాలోకి ఎంట్రీ లేదు. అయితే అమెరికన్ సిటిజన్లకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. - విమానాశ్రయాల్లో కోవిడ్ టెస్టులకు తప్పనిసరిగా హాజరు కావాలి - విమానంతో పాటు బస్సు, రైలు, క్యాబ్‌లలో సైతం మాస్కు ధరించాలనే నిబంధన అమల్లోకి తెచ్చారు. మార్చి 18 వరకు ఈ రూల్ కొనసాగుతుంది. చదవండి: ముంబై మీదుగా వచ్చే ఎన్నారైలకు అలెర్ట్ ! మహా సర్కారు కొత్త నిబంధనలు -
కరోనా కేసులు: రికార్డు బ్రేక్ చేస్తున్న జర్మనీ
బెర్లిన్: గత ఏడు రోజులుగా దేశంలో ప్రతి లక్ష మంది జనాలకు కరోనా సంభవించే రేటు 201.1గా ఉందని జర్మనీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. పైగా గతేడాది జర్మనీకి చెందిన రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ (ఆర్‌కేఐ) ప్రచురించిన గణాంకాల ప్రకారం డిసెంబర్ 22, 2020 నాటికి కరోనా కేసులు 197.6కి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జర్మనీలో 70 శాతం మంది ఇంకా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదన్నారు. (చదవండి: నీ దొంగ బుద్ధి తగలెయ్య!...మరీ ఆ వస్తువా! ఎక్స్పీరియన్స్ లేనట్టుందే....) రానున్న నెలల్లో త్వరితగతిన వ్యాక్సిన్ తీసుకోనట్లయితే వారంతా కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించారు. తూర్పు రాష్ట్రమైన సాక్సోనీలో కరోనా సంభవంచే రేటు జాతీయ సగటు 491.3 కంటే రెండింతలు ఎక్కువగా ఉందిని తెలిపారు. ఏది ఏమైనా వ్యాక్సిన్ తీసుకోనివారు మరిన్ని పరిమితులకు లోబడి ఉండాల్సిందేనని ఆంక్షలు జారీ చేశారు. గతనెలలో జరిగిని సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే ఈ కేసులు అధిగమైనట్లు చెబుతున్నారు. రానున్న రోజుల్లో సంకీర్ణ పార్టీలు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ లోపు కనీసం వ్యాక్సిన్ తీసుకోని వారికి లాక్డౌన్ ఆంక్షలను విధించేలా చర్యలు తీసుకోవలని జర్మనీ అధికారులు స్పష్టం చేశారు. (చదవండి: పువ్వుల్లొ దాగొన్న ఇల్లు... కానీ అవి మొక్కలకు పూయని పూలు!) -
ఉపఎన్నికల ప్రచారంలో ర్యాలీలు రోడ్ షో లపై నిషేధం
-
గర్ల్‌ఫ్రెండ్‌కు 11 రూల్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజనులు
వాషింగ్టన్: స్నేహం, ప్రేమ, వివాహం.. ఇలా ఏం బంధమైన సరే కలకాలం నిలవాలంటే.. నమ్మకం అనే బలమైన పునాది అవసరం. అనుమానం ఉంటే ఆ బంధం త్వరగా ముగిసిపోతుంది. మరీ ముఖ్యంగా ప్రేమలో అనుమానం ఉంటే.. అది మధ్యలోనే తెగిపోతుంది. ఏ రిలేషన్ అయినా సరే ఎదుటివారికి తగిన స్పేస్ ఇవ్వడం వల్ల ఆ బంధం మరింత బలపడుతుంది. లేదంటే అర్థాంతరంగా ముగుస్తుంది. ఇదే అనుభవం ఎదురయ్యింది అమెరికా యూనివర్శిటీకి చెందిన విద్యార్థిని కరోలిన్కి. ఆమె బాయ్‌ఫ్రెండ్ తమ రిలేషన్ కొనసాగాలంటే.. కరోలిన్ 11 నియమాలను తప్పకుండా పాటించాలని తెలిపాడట. (చదవండి: ప్రియుడి మోసం.. వెరైటీగా పగ తీర్చుకున్న గర్ల్‌ఫ్రెండ్) తన బాయ్‌ఫ్రెండ్ ఇచ్చిన నియమాల నోట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది కరోలిన్. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ కాలంలో కూడా ఇలాంటి వారు ఉన్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కరోలిన్ బాయ్‌ఫ్రెండ్ 'కంట్రోలింగ్' స్వభావం గురించి సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. కరోలిన్ బాయ్‌ఫ్రెండ్ విధించిన నిబంధనల ప్రకారం ఆమె బయట తినడం, తాగడం, బిగుతు దుస్తులు ధరించడం నిషేధం. వీటితో పాటు ఆమె ఆల్కహాల్ కూడా తీసుకోకూడదు. (చదవండి: ఒక్కడి కోసం ఇద్దరు యువతుల ఫైట్.. జుట్టు పట్టుకొని!) ఇవేకాక కరోలిన్ బాయ్‌ఫ్రెండ్ ఆమెను అబ్బాయిలతో కలవకుండా నిషేధించాడు. అతను ఇచ్చిన ఉంగరాన్ని ఆమె ఎప్పటికీ తీసివేయకూడదని తెలిపాడు. అంతేకాక కరోలిన్ రాత్రి 9 గంటలకు తన హాస్టల్ గదికి తిరిగి రావాలని సూచించాడు. అలానే క్రాప్ టాప్, టైట్ డ్రెస్ ధరించడం.. పార్టీలకు హాజరు కావడానికి కూడా ఆమెకు అనుమతి లేదు. కరోలిన్ బాయ్‌ఫ్రెండ్ చేసిన నియమాలను రోజూ ఆమె పాటించాల్సి ఉంటుంది. ఈ స్క్రీన్‌షాట్ షేర్ చేసిన కరోలిన్.. అతడితో బంధాన్ని ముగించాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఆమె నిర్ణయంపై నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: 8 ఏళ్లుగా డేటింగ్, పెళ్లి కావాలంటూ కోర్టుకు.. -
చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ నిబంధనల సవరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ల మంజూరు నిబంధనలను ప్రభుత్వం సవరించింది. జీఎస్టీకి మినహాయింపునిస్తూ ఇతర నిబంధనలను పరిగణనలోకి తీసుకుని చిన్న పత్రికలకు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ల మంజూరు నిబంధనలు సవరించడం హర్షణీయమని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ వెన్ను శనివారం పేర్కొన్నారు. చదవండి: పెదకాకానిలో అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఐడీ విచారణ -
ఈ పెళ్లికి వెళ్లాలంటే 5వేల గిఫ్ట్ ఇవ్వాలంట, ఇంకా బోలెడు రూల్స్..
సాధారణంగా పెళ్లంటే అతిథులు, బంధువులు, స్నేహితులు ఇలా సపరివారాన్ని పిలవడం ఆనవాయితీ. ఇక పెళ్లి రోజు అతిథులు వచ్చి నాలుగు అక్షింతలు వేసి వధూవరులను ఆశీర్వదించి, భోజనం తిని వెళ్లాలని కోరుకుంటాం. ఈ తతంగమంతా కామన్. అయితే రొటీన్‌కు భిన్నంగా కావాలనుకున్నాడో ఏమో తెలీదు గానీ ఓ పెళ్లి ఇన్విటేషన్ మాత్రం విచిత్రంగా ప్లాన్ చేశారు. అందులో వివాహానికి వచ్చే అతిథులు ఏం చేయాలి, ఏం చేయకూడదనే రూల్స్ కూడా పెట్టారు. ఆ రూల్స్ కూడా మామూలుగా లేవు. ప్రస్తుతం ఈ ఆహ్వానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వెడ్డింగ్ ప్లానర్ వివాహానికి వచ్చే అతిథుల సంఖ్యను నిర్ధారించుకోవడానికి ఓ మెయిల్ పంపించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ అందులో పెళ్లికి హాజరయ్యే వాళ్లు పాటించాల్సిన నియమాలను కూడా జత చేసి పంపాడు. తాజాగా ఈ మెయిల్‌ను రెడిట్‌లో షేర్ చేయగా.. ఆహ్వానం వింతగా ఉండడంతో అది కాస్తా వైరల్‌గా మారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆ మెయిల్లో...గుడ్ మార్నింగ్.. వివాహానికి ఎంత మంది అతిథులు వస్తారో తెలుసుకోవడానికి ఈ మొయిల్ చేస్తున్నాను. ఇందులో పెళ్లిలో పాటించాల్సిన రూల్స్ ఉన్నాయి. ముందుగా మీతో పాటు ఎవరైనా వస్తున్నారా అనేది కూడా తెలపగలరు.. అని ఉంది. ఇవే ఆ వెరైటీ రూల్స్: ►పెళ్లికి కనీసం 15 నుంచి 30 నిమిషాల ముందు రావాల్సిందిగా తెలిపాడు. ►తెలుపు, గోధుమ రంగు దుస్తులు వేసుకోకూడదు. ►బేసిక్ బాబ్ స్టైల్, పోనీటెయిల్ తప్ప రకరకాల జడలు వేసుకుని రాకూడదంట. ►ముఖానికి పుల్గా మేకప్ వేసుకోకూడదు. ►వివాహ తతంగాన్ని ఎవరూ రికార్డు చేయకూడదు. ►పెళ్లి కూతురుతో అసలు మాట్లాడొద్దు. ►చివరిగా.. వచ్చే ప్రతి ఒక్కరూ కనీసం 75 డాలర్లు ( సుమారు రూ.5000), అంతకన్నా ఎక్కువ మొత్తం ధర ఉన్న గిఫ్ట్ తీసుకొని వస్తేనే పెళ్లికి అనుమతి ఉంటుంది.... ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే సంప్రదించగలరని కూడా తెలిపాడు. ఈ రూల్స్ చూసి నెటిజన్లు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇలాంటి పెళ్లిని బాయ్‌కాట్ చేయాలని కామెంట్ చేస్తున్నారు. -
దిగొచ్చిన ట్విటర్.. ఢిల్లీ హైకోర్టు వార్నింగ్‌కు రిప్లై
కొత్త ఐటీ చట్టాల ప్రకారం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, నెటిజన్ల పోస్టుల విషయంలో మరింత బాధ్యతయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉన్నతాధికారులను సైతం నియమించుకోవాల్సి ఉంటుందని కొత్త రూల్స్ స్పష్టం చేస్తున్నాయి. అయితే గ్రీవెన్స్ రెడ్రెస్సల్ ఆఫీసర్(తాత్కాలిక ఫిర్యాదుల స్వీకరణ అధికారి)ను ట్విటర్ నియమించుకోకపోవడంపై ఢిల్లీ హైకోర్టు గరం అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం ట్విటర్ కోర్టుకి బదులిచ్చింది. న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు వార్నింగ్‌తో ఎట్టకేలకు ట్విటర్ దిగొచ్చింది. ఎనిమిది వారాల గడువు ఇస్తే.. గ్రీవెన్స్ రెడ్రస్సల్ ఆఫీసర్‌ను నియమిస్తామని విన్నవించింది. అంతేకాదు ఇంటీరియమ్ చీఫ్ కాంప్లియెన్స్ ఆఫీసర్‌ను ఇదివరకే(రెండు రోజుల క్రితమే) నియమించామని, మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్‌ను కూడా నిర్ణీత కాలవ్యవధిలో.. అది కూడా కొత్త ఐటీ రూల్స్‌కు లోబడే నియమిస్తామని కోర్టుకు వెల్లడిస్తూ.. ఎనిమిది వారాల గడువు కోరింది. కాగా, ‘మీ ఇష్టం ఉన్నప్పుడు గ్రీవెన్స్ అధికారిని నియమిస్తామంటే ఊరుకునేది లేదు’ అంటూ హైకోర్టు రెండు రోజుల క్రితం జరిగిన వాదనల్లో ట్విటర్‌పై మండిపడింది. ఈ నేపథ్యంలో ట్విటర్ సమాధానం ఇచ్చింది. ఇక ఈ మూడు పొజిషన్లకు కోసం జాబ్ ఓపెనింగ్స్ ప్రకటనలు ఇచ్చినట్లు ట్విటర్ వెల్లడించింది. ఇదిలా ఉంటే ట్విటర్ ఆ మధ్య నియమించిన తాత్కాలిక గ్రీవెన్స్ ఆఫీసర్ ధర్మేంద్ర చాతుర్.. అనూహ్యంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ పొజిషన్లో భారత్‌కు చెందిన వాళ్లనే నియమించాలనే నిబంధన కూడా ఉంది. ఇదిలా ఉంటే ట్విటర్‌కు ప్రభుత్వానికి, పోలీసులకు మధ్య నోటీసులు, కేసులతో ఘర్షణ వాతావరణం కనిపిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్నివారాల్లో ట్విటర్ మీద కేసులు కూడా నమోదు అవుతున్నాయి. అందులో చైల్డ్ పోర్నోగ్రఫీతో పాటు మ్యాప్‌లు తప్పుగా చూపించడం కూడా ఉన్నాయి. -
Digital Rules: ట్విటర్‌కు ఫైనల్ వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: మైక్రో బ్లాకింగ్ సైట్ ట్విటర్‌కు కేంద్రం మరో అల్టిమేటం జారీచేసింది. సంస్థ ఎగ్జిక్యూటివ్‌ల నియామకంలో కొత్త ఐటీ నిబంధనలను పాటించాలని మరోసారి గట్టిగా ఆదేశించింది. ఇదే అవకాశమని, లేదంటే తదనంతర పరిణామాలను సిద్ధంగా ఉండాలని కేంద్రం శనివారం హెచ్చరించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విటర్ ఖాతాకు బ్లూటిక్ తొలగింపు వివాదం తరువాత తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో కేంద్రం, ట్విటర్ వార్ మరింత ముదురుతోంది. దేశ ఐటీ నిబంధనలను తక్షణమే పాటించేలా ట్విటర్‌కు నోటీసులిచ్చామని కేంద్రం ప్రకటించింది. ఐటీ నిబంధనల ప్రకారం దేశీయంగా అధికారులను నియమించేందుకు ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. నిబంధనల ప్రకారం ట్విట్టర్ ఇప్పటివరకు చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ వివరాలను అందించలేదని ట్విటర్‌కు ఇచ్చిన నోటీసులో కేంద్రంపేర్కొంది. నామినేట్ చేసిన రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ అండ్ నోడల్ కాంటాక్ట్ పర్సన్ ట్విటర్ ఉద్యోగి కాదని కూడా హైలైట్ చేసింది. అలాగే ట్విటర్ చిరునామా నిబంధనల ప్రకారం కూడా లేదని వ్యాఖ్యానించింది. సరైన సమాచారం అందించలేదని మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిబంధనల అమలు విషయంలో విఫలమైతే ఐటీ చట్టం 2000, సెక్షన్ 79 ప్రకారం లభించే మినహాయింపులను ఉపసంహరించుకుంటామని తెలిపింది. దీని ప్రకారం సంబంధిత పరిణామాలు, జరిమానా చర్యలకు ట్విటర్ బాధ్యత వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. Government of India gives final notice to Twitter for compliance with new IT rules. pic.twitter.com/98S0Pq8g2U — ANI (@ANI) June 5, 2021 చదవండి: Twitter దుందుడుకు చర్య: ఉపరాష్ట్రపతికి బ్లూటిక్ తొలగింపు Twitter ban: అధ్యక్షుడి ట్వీట్ తొలగింపు, నిరవధిక నిషేధం -
vaccine: మినహాయింపులపై సీరం కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: డిసెంబర్ చివరి నాటికి అందరికీ కరోనా వ్యాక్సిన్లు వేయాలన్న లక్ష్యంలో భాగంగా విదేశీ వ్యాక్సిన్లపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కోవిషీల్డ్ టీకా తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)స్పందించింది. వ్యాక్సిన్ తయారీదారులందరికీ ఒకే సూత్రాలు వర్తింప చేయాలని అదర్ పూనావాలా కేంద్రాన్ని కోరారు. నష్టపరిహారం విషయంలో విదేశీ సంస్థలు రక్షణ పొందితే సీరం మాత్రమే కాదు, అన్ని దేశీయ టీకా కంపెనీలకు దీనిని వర్తింపజేయాలఅని సీరం వర్గాలు పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇండెమ్నిటీ బాండ్ ఇండెమ్నిటీ బాండ్ అనేది సెక్యూరిటీ బాండ్ లాంటిదే. వ్యాక్సిన్ ట్రయల్స్ సందర్భంగా ఏదైనా జరిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని, న్యాయపరమైన సమస్యలు రాకుండా చూసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ హామీతో ఇండెమ్నిటీ బాండ్ ఇవ్వాలని మోడెర్నా, ఫైజర్ వంటి విదేశీ టీకా సంస్థలు కోరుతున్నాయి. కాగా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే విదేశాల్లో ఇప్పటికే అనుమతి పొందిన వ్యాక్సిన్లను మన దేశంలో వాడేందుకు బ్రిడ్జి ట్రయల్స్ అక్కర లేదంటూ విదేశీ టీకాలకు లైన్ క్లియర్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇండెమ్నిటీ బాండ్, పరిహారాన్ని కూడా తామే చెల్లించే అవకాశాలను కూడా ప్రకటించింది. చదవండి: Vaccination: ఊరట, త్వరలో మరో స్వదేశీ వ్యాక్సిన్ Vaccination : గుడ్‌న్యూస్ చెప్పిన డీసీజీఐ -
అత్యవసరమైతే తప్ప ప్రయాణాలొద్దు: గౌతమ్ సవాంగ్
సాక్షి, విజయవాడ: ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా కేసుల దృష్ట్యా ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనా వ్యాప్తి కట్టడికి పోలీసు శాఖకు సహకరించాలని.. కోవిడ్ నిబంధనలు పాటించకపోతే భారీగా జరిమానాలు విధించక తప్పదన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్ధన్నారు. ఫంక్షన్స్, పార్టీలు వీలైతే వాయిదా వేసుకోవాలని సూచించారు.మాస్క్, భౌతికదూరం, శానిటైజర్ వాడటం అలవాటుగా మార్చుకోవాలన్నారు. స్కూల్స్, కాలేజీల్లో భౌతికదూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ సూచించారు. చదవండి: మహిళలే టార్గెట్: పరిచయాలు పెంచుకుని.. మగవాళ్లు ఆడవాళ్లుగా.. హోలీ సంబరాల్లో వింత ఆచారం -
సర్పంచ్ పదవికి పోటీ పడాలంటే!
శ్రీకాకుళం రూరల్/ఎల్.ఎన్.పేట/లావేరు/నరసన్నపేట: సర్పంచ్ పదవికి పోటీపడాలంటే కొన్ని అర్హతలుండాలి. ఏమాత్రం తేడా వచ్చినా అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం ప్రకటించిన అర్హతలు, అనర్హతలు వివరాలు ఓసారి పరిశీలిస్తే... వీరు అర్హులు.. పోటీ చేయాలనుకున్న వ్యక్తి గ్రామ పంచాయతీలో స్థానికుడై ఉండాలి. పంచాయతీ ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉండాలి. వయస్సు నామినేషన్ దాఖలు చేసే తేదీనాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరి అభ్యర్థులు జనరల్ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. మహిళలకు రిజర్వు చేసిన స్థానాలతో పాటు అదే కేటగిరిలోని జనరల్ స్థానాల్లోనూ పోటీ చేయవచ్చు. వీరు అనర్హులు.. గ్రామ సేవకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు పోటీకి అనర్హులు. చట్టం ద్వారా ఏర్పడిన ఏదైనా ఒక సంస్థకు చెందిన పాలక మండలి సభ్యులు. నేరానికి పాల్పడి శిక్ష పడిన వారు. శిక్ష పూర్తిగా అనుభవించిన తర్వాత ఐదేళ్లు పూర్తికాని వారు. పౌరహక్కుల పరిరక్షణచట్టం–1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు . మతి స్థిమితం లేనివారు. బధిరులు, మూగవారు. దివాలాదారుగా న్యాయ నిర్ణయం కోసం దరఖాస్తు చేసుకున్నవారు. రుణ విమోచన పొందని దివాలదారు. గ్రామ పంచాయతీకి వ్యక్తిగతంగా బకాయిపడిన వ్యక్తి, బకాయి చెల్లింపునకు నోటీసు ఇచ్చినా గడువులోగా బకాయి చెల్లించనివారు. ఇద్దరుకన్నా ఎక్కవ మంది పిల్లలు కలిగి ఉన్నవారు. (1994 ఆంధ్రప్రదేశ్ పంచా యతీరాజ్ చట్టం అమలు తేదీ నుంచి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏదైనా స్థానిక సంస్థల కార్యాలయంలో పనిచేసిన వ్యక్తి అవినీతి లేదా విశ్వాస ఘాతక నేరంపై తొలగించబడితే ఆ తేదీ నుంచి ఐదేళ్లు ముగిసే వరకు అనర్హులు. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్నా పోటీకి అనర్హులు నామినేషన్ల దాఖలుకు నిబంధనలివే.. అరసవల్లి/శ్రీకాకుళం రూరల్: నామినేషన్ దాఖలు చేసే అభ్యర్ధి కచ్చితంగా పోటీ చేసేందుకు సంసిద్ధతను తెలియజేస్తూ డిక్లరేషన్‌పై సంతకం చేయాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మాత్రమే కేటాయించిన స్థానాల్లో అదే సామాజిక వర్గ అభ్యర్థులు పోటీ చేయాల్సి ఉంటుంది. చట్టప్రకారం కులాల వారీగా ప్రకటించిన విధంగా డిపాజిట్లు చెల్లించాలి. సర్పంచ్‌కు జనరల్ అభ్యర్థులైతే రూ.3000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే రూ.1500, వార్డు సభ్యుని స్థానానికైతే జనరల్ అభ్యర్థి రూ.1000, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.500 డిపోజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. నామినేషన్‌ను దాఖలు చేయడానికి సకాలంలోనే పూర్తి చేసి ఆర్వోకు అందజేసి, రశీదు పొందాలి. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. విజయనగరం మినహా 12 జిల్లాల్లో తొలిదశలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉ.10.30 గంటల నుంచి సా.5 గంటల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. సర్పంచ్ పదవితో పాటు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో నిర్ధారించిన వార్డు సభ్యుల పదవులకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. -
గోల్డ్ లోన్ కంపెనీలకు ఆర్బీఐ ఝలక్
సాక్షి, ముంబై: గోల్డ్ లోన్ కంపెనీలు మణప్పురమ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్‌కు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఝలక్ ఇచ్చింది. నిర్దేశిత నిబంధనలను అతిక్రమించారంటూ ఇరు కంపెనీలకు భారీ జరిమానా విధించింది. ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం ఫైనాన్స్‌లకు వరుసగా రూ .10 లక్షలు, రూ .5 లక్షలు జరిమానా విధించినట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ర్నాకులంలోని ముత్తూట్ ఫైనాన్స్ విభాగం మార్చి 31, 2018 మరియు మార్చి 31, 2019 కాలంలో గోల్డ్ లోన్లకు సంబంధించి లోన్ టు వ్యాల్యూ రేషియో మార్గదర్శకాలను ముత్తూట్ ఫైనాన్స్ అనుసరించలేదని రిజర్వు బ్యాంక్ పేర్కొంది. నిబంధనలను అతిక్రమించిన కారణంగా రూ.10 లక్షల జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా సంస్థ రూ.5 లక్షలకు పైన బంగారు రుణాలు జారీ చేసేటప్పుడు రుణ గ్రహీతల నుంచి పాన్ కార్డు తీసుకోవడమనే రూల్స్‌ను అనుసరించలేదని, అందుకే ఫైన్ వేశామని వివరణ ఇచ్చింది. దీంతోపాటు గోల్డ్ జువెలరీ ఓనర్షిప్ వెరిఫికేషన్ రూల్స్‌ను అనుసరించకపోవడంతో త్రిసూర్‌లోని మణపురం ఫైనాన్స్‌పై ఆర్బీఐ చర్య తీసుకుంది. రూ.5 లక్షల జరిమానా విధించింది. 2019 మార్చి 31 నాటికి సంస్థ ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తే, ఆర్బీఐ ఆదేశాలను పాటించలేదని తేలిందని చెప్పింది. -
హెచ్1బీ కొత్త విధానంతో అమెరికాకే నష్టం
వాషింగ్టన్: హెచ్1బీ నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం అమెరికా ఆర్థిక వ్యవస్థకి కీడు చేస్తుందని అక్కడి పలు సంస్థలు అభిప్రాయపడ్డాయి. కొత్త వీసా విధానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మాన్యుఫాక్చర్స్‌తో సహా 17 వరకు సంస్థలు న్యాయస్థానంలో ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉత్తర కొలంబియా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ కొత్త విధానం వల్ల నైపుణ్యం కలిగిన వారు దేశానికి రారని, అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టడానికి ఈ వీసా విధానం అవరోధంగా మారుతోందని వారు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. (ఎడతెగని దగ్గు, శ్రీమతికి గోల్డెన్ చాన్స్ మిస్) అమెరికా ఫస్ట్ అన్న నినాదాన్ని ముందుకు తీసుకువెళుతున్న ట్రంప్ ఈ నెల మొదట్లో హెచ్1బీ వీసా కార్యక్రమంలో నిబంధనల్ని మరింత కఠినతరం చేసిన విషయం తెలిసిందే. అమెరికన్ వర్కర్లకి అధికంగా ఉద్యోగాలు లభించేలా, అత్యధిక స్కిల్ ఉన్న విదేశీ నిపుణులకి మాత్రమే ఉద్యోగ అవకాశాలు లభించేలా ఈ వీసా విధానంలో మార్పులు చేశారు. దీనిని సవాల్ చేసిన వారిలో ఆర్థిక, వాణిజ్య సంస్థలు ఉన్నాయి. కొత్త వీసా విధానం అమెరికాలోని ప్రతీ రంగంపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.