మూడో వేవ్ ఉధృతిలో కరోనా కేసులు పొటెత్తుతున్నాయి. ఒకవైపు కేసుల సంఖ్య తగ్గిపోతుండడంపై కేంద్రం అప్రమత్తం అయ్యింది. టెస్ట్‌లను పెంచాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలిస్తూ.. వ్యాప్తి విషయంలో అప్రమత్తం చేస్తోంది. మరోవైపు ఎన్నికల సంఘం కూడా ప్రచారం విషయంలో ఆంక్షలతో కట్టడికి ప్రయత్నిస్తోంది. అయితే..
కొందరు మాత్రం వైరస్ విషయంలో నిర్లక్క్ష్యం వహిస్తూనే ఉన్నారు. తాజాగా కరోనా ఆంక్షలను పట్టించుకోకుండా వేల మందితో ఓ నేత.. వివాహ వేడుక నిర్వహించిన ఘటన ఇప్పుడు గుజరాత్‌లో వెలుగు చూసింది. థాపి జిల్లాలో ఓ బీజేపీ నేత ఈ వేడుకను నిర్వహించాడు. రంగు రంగుల లైట్ల వెలుగుల్లో వేల మంది డీజే నృత్యాల్లో మునిగిపోయిన వీడియో ఒకటి అక్కడి వాట్సాప్ అకౌంట్‌లలో చక్కర్లు కొడుతోంది.
గుజరాత్ కొవిడ్ గైడ్ లైన్స్ ప్రకారం.. పెళ్లికి 150మందికి మించకూడదు. కానీ, డోవ్లాన్ బ్లాక్‌లో నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ నేత సునంద ఈ వేడుకను నిర్వహించాడు. వేల మంది హాజరై.. భౌతిక దూరం, మాస్క్‌లను మరిచి చిందులేశారు. మధ్యలో కానిస్టేబుల్స్ వచ్చి వారించినప్పటికీ.. వాళ్లను బెదిరించి పంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికార పక్ష నేత కావడంతో వైరల్ అయిన ఆ వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే.. గుజరాత్‌లో ప్రస్తుతం 70వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment