పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీకి భారీ ఊరట లభించింది. గుజరాత్‌లోని రిలయన్స్ గ్రీన్స్‌లో చిన్నకుమారుడు అనంత్ వివాహాన్ని జరపడానికి వీల్లేందంటూ దాఖలైన పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కేవలం భయం ఆధారంగా స్వీకరించలేమంటూ ధర్మాసంన ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. రాహుల్ నరులా అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశాలించిన కోర్టు మేరకు తీర్పునిచ్చింది
ఈ ఏడాది జూన్‌లో వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు అన్ని ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు మెగా జూలో పెళ్లి అంటే ఇక్కడ జంతువులకు హాని కలిగిస్తుందనీ, ముఖేష్ అంబానీకి చెందిన మెగా జూ (గ్రీన్స్ జూలాజికల్, రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ GZRRC)పై చర్యలు తీసుకునేలా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది, జంతు ప్రేమికుడు రాహుల్ నరులా హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీన్ని పరిశీలించి న్యాయమూర్తులు సురేష్ కుమార్ కైట్, గిరీష్ కథ్‌పాలియాతో కూడిన ధర్మాసనం దీనిని స్వీకరించలేమని పేర్కొంది. జంతు సంస్థలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు త్రిపుర హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన హై-పవర్డ్ కమిటీ (HPC) ఈవెంట్‌ను పర్యవేక్షించేందుకు, జంతువులకు ఎలాంటి హానీ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
(టేస్టీగా..కూల్..కూల్‌గా, ఐస్ క్రీమ్స్ ఇలా చేస్తే పిల్లలు ఫిదా!)
ప్రైవేట్ ఈవెంట్‌లో జంతువులను ఉపయోగిస్తారనే ఆరోపణ నిరాధారమైందని సెంటర్ తరపు న్యాయవాది వాదించారు. కాగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతీ ఖావ్డి గ్రామంలో280 ఎకరాల విస్తీర్ణంలో ఈ జూపార్క్ ఉంది. అంతేకాదు దీన్ని అనంత్పె అంబానీ పెట్ ప్రాజెక్ట్‌గా, బ్రెయిన్ ఛైల్డ్ ప్రాజెక్ట్‌గా భావిస్తారు. అటు అనంత్ -రాధిక పెళ్లిపై అధికారికర ధృవీకరణ ఏదీ రానప్పటికీ, ఈ గ్రాండ్ వెడ్డింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వీరి పెళ్లి కార్డు ఒకటి ఇంటర్నెట్‌లో సందడి చేస్తోంది. (అంబానీ ఇంట పెళ్లి సందడి: అతిథులకు అదిరిపోయే గిఫ్ట్..?!)
Comments
Please login to add a commentAdd a comment