బిలియనీర్ ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలో ప్రసంగించారు. అనంత్, రాధికలకు స్వర్గంలోని వారి తాత ముత్తాతల ఆశీర్వాదం ఉంటుందని, వారి శ్రేయస్సు కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని భావోద్వేగంతో పేర్కొన్నారు.
వేడుకలకు విచ్చేసిన అతిథులను ఉద్దేశించి ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. "అనంత్, రాధికలకు స్వర్గంలో ఉన్న వారి తాత ముత్తాతల ఆశీర్వాదం ఉంటుంది. అనంత్, రాధికల జీవితం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అన్నారు.
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ సెంటర్ వేదిక వద్ద అనంత్ అంబానీ, తన చిరకాల స్నేహితురాలు రాధిక మర్చంట్‌ను పెళ్లాడారు. గ్లోబల్ సెలబ్రిటీలు, బిజినెస్ టైకూన్‌లు, ఇతర ప్రముఖుల సమక్షంలో వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment