హాట్‌ టాపిక్‌గా అనంత్‌ అంబానీ పెళ్లి : అతి విలాసవంతమైన పెళ్లిళ్లు ఇవిగో! | Anant AmbaniRadhika Merchant Grand wedding most expensive weddings in history | Sakshi
Sakshi News home page

హాట్‌ టాపిక్‌గా అనంత్‌ అంబానీ పెళ్లి : అతి విలాసవంతమైన పెళ్లిళ్లు ఇవిగో!

Published Mon, Jul 15 2024 3:03 PM | Last Updated on Mon, Jul 15 2024 3:32 PM

Anant AmbaniRadhika Merchant  Grand wedding most expensive weddings in history

అపర కుబేరుడు  రిలయన్స్‌ అధినేత  ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం కనీవినీ ఎరుగుని రీతిలో అత్యంత ఘనంగా జరిగింది. ఇంట్లో జరిగిన చివరి వివాహం కావడంతో దేశ విదేశీలకు ప్రముఖులతో అంత్యంత  ఆడంబరంగా నిర్వహించింది అంబానీ ఫ్యామిలీ.   దీంతో ఈ వివాహ వేడుక ప్రపంచంలో ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచింది.

నిశ్చితార్థం మొదలు, రెండు ప్రీవెడ్డింగ్‌వేడుకలు, ముంబైలో మూడు రోజుల పాటు  నిర్వహించిన  గ్రాండ్‌ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌సోషల్‌ మీడియాలో  హాట్‌ టాపిక్‌గా మారాయి.  అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకల్లో అతిథుల ఆహ్వానం దగ్గర్నించీ, ఆతిథ్యం, వారికి అందించిన బహుమతులు ప్రత్యేక ప్రదర్శనలు, విందు ఇలా ప్రతీదీ ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ పెళ్లి వేడుకల్లో కొత్తదంపతులతో సహా అంబానీ కుటుంబ మహిళలు ధరించిన కోట్లాది రూపాయల విలువ చేసే దుస్తులు, వజ్రాభరణాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. లైవ్‌మింట్, ది ఎకనామిక్ టైమ్స్ , ఔట్‌లుక్  అంచనా ప్రకారం  ఈ వివాహ వేడుకల మొత్తం ఖర్చు 5వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అయి ఉంటుందని అంచనా.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన వివాహాలలో  చోటు దక్కించుకున్న బ్రిటీష్‌ యువరాణి డయానా  ప్రిన్స్ చార్లెస్‌ల వంటి దిగ్గజ వివాహాల ఖర్చు రూ. 1,361 కోట్లను,  షేక్ హింద్ బింత్‌ బిన్ మక్తూమ్  షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌ల ఖర్చులను రూ. 1,144 కోట్లుగా అధిగమించినట్టే. 

1981, జూలై 29న అప్పటి   ప్రిన్స్ చార్లెస్ , లేడీ డయానా  వివాహం లండన్‌లోని సెయింట్ పాల్స్ కేథడ్రల్‌లో రాయల్ వెడ్డింగ్  అత్యంత ఘనంగా జరిగింది.  3,500 మంది వ్యక్తులు ప్రత్యక్షంగా చూసారు, అయితే ప్రపంచవ్యాప్తంగా సుమారు 750 మిలియన్ల మంది ప్రజలు దీనిని టీవీలో వీక్షించారు. 10వేల, 25 అడుగుల పొడవుతో తయారు చేసిన అప్పటి యువరాణి డయానా  వెడ్డింగ్‌ గౌన్‌  స్పెషల్‌ ఎట్రాక్షన్‌.  

1979లో  దుబాయ్‌ రాయల్ వెడ్డింగ్‌లో షేక్ మహ్మద్ తన కజిన్ షేఖా హింద్‌ను వివాహం చేసుకున్నాడు. వారం రోజుల పాటు   అత్యంగ ఘనంగా ఈ వేడుకలు జరిగాయి.


2004లో సహారా గ్రూప్‌కు చెందిన సుబ్రతో రాయ్ తన కుమారుల కోసం డబుల్ వెడ్డింగ్‌ సందర్భంగా లక్నోను విలాసవంతమైన ఏర్పాట్లతో  ముంచెత్తారు. ఆరు రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్‌లో 11వేల మంది అతిథుల హాజరయ్యారు. వీరి పెళ్లి ఖర్చు రూ. 550 కోట్ల రూపాయలట.

2023, నవంబర్‌లో  మేడ్‌లైన్ బ్రాక్‌వే , జాకబ్ లాగ్రోన్‌ల   వెడ్డింగ్‌  "శతాబ్దపు వివాహం"గా  పేరొందింది. ఈ   వివాహానికి దాదాపు 59 మిలియన్ల డాలర్లు అంటే రూ. 489 కోట్లు ఖర్చయ్యాయి. పారిస్‌లోని వెర్సైల్లెస్ ప్యాలెస్‌లో  విలాసవంతంగా ఈ వివాహం జరిగింది.

2011లో కేట్ మిడిల్టన్ , ప్రిన్స్ విలియం  రాజ వివాహం ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వివాహాలలో ఒకటిగా  పేరుగాంచింది. ఈ పెళ్లికి  43 మిలియన్‌ డాలర్లు ఖర్చయ్యాయి.  1,900 మంది అతిథులతో వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో జరిగిన ఈ ఈవెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా 160 మిలియన్ల మంది వీక్షకులు వీక్షించారు, కామన్‌వెల్త్ దేశాల్లో వేడుకలు జరిగాయి.

2018లో, అమెరికన్ నటి మేఘన్ మార్క్లేతో ప్రిన్స్ హ్యారీ వివాహం బ్రిటీష్ రాయల్‌ వివాహం  విండ్సర్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌లో జరిగిన వేడుకకు అనేక మంది ప్రముఖులు మరియు రాయల్టీతో సహా 600 మంది అతిథులు హాజరయ్యారు. ఇండియాకు చెందిన ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన లక్ష్మీ మిట్టల్ కుమార్తె వనీషా మిట్టల్ వివాహం ఆ జాబితాలో మరొకటి.   2004లో వనీషా మిట్టల్- అమిత్ భాటియా నిశ్చితార్థ వేడుక పారిస్‌లోని వెర్సైల్లెస్ ప్యాలెస్‌లో జరగగా, వివాహం చాటౌ వెక్స్‌లో జరిగింది. ఈ వివాహానికి సుమారు 66 మిలియన్‌ డాలర్లు రూ. 547 కోట్లు ఖర్చయిందట.


2018, డిసెంబరు 12న ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ -ఆనంద్ పిరమల్‌ వివాహ జరిగింది.ఈ వివాహానికి సుమారు 15 మిలియన్లు  డాలర్లు అంటే  రూ. 110 కోట్లు ఖర్చయ్యాయి. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి బాలీవుడ్, భారతీయ రాజకీయ వర్గాల ప్రముఖులు హాజరయ్యారు.

2006, ఫిబ్రవరి 18 ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, మోడల్ ప్రియా సచ్‌దేవ్ వివాహం హోటల్ వ్యాపారి విక్రమ్ చత్వాల్‌తో మూడు నగరాల్లో 10 రోజుల పాటు వైభవంగా జరిగింది.26 దేశాల నుండి 600 మంది అతిథులు ఆహ్వానం, ప్రైవేట్‌గా చార్టర్డ్ విమానాలలో  తరలించారు. అతిథి జాబితాలో బిల్ క్లింటన్, మోడల్ నవోమి క్యాంప్‌బెల్, అప్పటి భారత-పీఎం మన్మోహన్ సింగ్, లక్ష్మీ మిట్టల్ తదితరులు హాజరైనారు. 50,000 కిలోల పువ్వులు, 3వేల కొవ్వొత్తులు , ఇతర వస్తువులతో అలంకరించిన  మొఘల్-కోర్ట్ శైలిలో ఈ వివాహం జరిగింది. పెళ్లికి 20 మిలియన్ల డాలర్లు ఖర్చయ్యాయి.  


అమెరికా మాజీ  అధ్యక్షుడు  బిల్‌ క్లింటన్‌,  హిల్లరీ క్లింటన్ కుమార్తె చెల్సియా క్లింటన్  పెట్టుబడి బ్యాంకర్ మార్క్ మెజ్విన్స్కీని ల గ్రాండ్ వెడ్డింగ్‌ 2010లో ఆస్టర్ కోర్ట్స్‌లో జరిగింది. ఖర్చు 5 మిలియన్లు డాలర్లు. (దాదాపు రూ.  40 కోట్లు).

ఇంకా బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ దాకా తన ప్రతిభను చాటుకుంటున్న ప్రియాంక చోప్రా ,నిక్ జోనాస్‌ 2018,డిసెంబర్ 1 న వివాహం చేసుకున్నారు ఐదు రోజుల పాటు  వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో జరిగింది. ఈ జంట కేవలం హోటల్స్‌కోసం రూ.3 కోట్లు ఖర్చు చేశారు. పెళ్లి తర్వాత ఢిల్లీలో గ్రాండ్ రిసెప్షన్ కూడా జరిగింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement