expensive
-
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్..!ఒక మీటర్ ఏకంగా..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి విన్నారా..?. ఈ ఫ్యాబ్రిక్ ఒక మీటర్ ఖరీదే దాదాపు రూ. 4 లక్షలు పైనే పలుకుతుందట. ఇది మార్కెట్లో దొరకడం కూడా కష్టమే. ఖరీదు కూడా కళ్లు చెదిరే రేంజ్లో ఉంటుంది. ఏంటి ఈ ప్యాబ్రిక్ విశిష్టత..?. ఎందుకంత ఖరీదు అంటే..ఈ ఫ్యాబ్రిక్ ఉన్నిని దక్షిణ అమెరికాలోని ఆండిస్ పర్వతాల్లో ఉండే వికునా అనే ఒక విధమైన ఒంటె నుంచి సేకరిస్తారట. అందువల్లే ఈ ఫ్యాబ్రిక్‌ని వికునా అని పిలుస్తారు. దీనితో టానీ అనే కోటులు డిజైన్ చేస్తారట. ఏదో గొర్రెల మాదిరి పెంపుడు జంతువుగా ఈ ఒంటెలను పెంచడం సాధ్యం కాదట. అలాగే ఈ ఒంటె నుంచి ఉన్ని ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సేకరించగలరట.అలాగే ఇవి తక్కువ ఉన్నినే ఉత్పత్తి చేస్తాయట. ఆండియాన్ ఎత్తైన పర్వతాల్లో ఉండే చలి నుంచి రక్షణగా ఆ ఒంటెలపై ఈ మృదువైన ఉన్ని ఉంటుందట. ఇది గాలిని ఏ మాత్రం చొరబడనీయకుండా శరీరానికి హత్తుకుపోయేల వెచ్చగా ఉంచుతుందట. అలాగే వికునాల నుంచి ఉన్నిని సేకరించడానికి చాలా సమయం పడుతుందట కూడా. అత్యంత జాగ్రత్తలు తీసుకుని చాలా ఓపికతో ఆ జంతువు నుంచి ఉన్నిని సేకరించాలని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. ఎవరు ధరిస్తారంటే..రాయల్టీకి చిహ్నమైన ఈ ఫ్యాబ్రిక్‌ని ఎక్కువగా సెలబ్రిటీలు, ప్రముఖులు ధరిస్తారు. అయితే ప్రస్తుతం స్పానిష్ ఆక్రమణతో ఈ జంతువుల అంతరించిపోయే జంతువులు జాబితాలో చేరిపోయిందని చెబుతున్నారు ప్యాషన్ నిపుణులు. అదీగాక ఈ జంతువుల పెంపకం సాధ్యం కానీ పని అయితే వాటి నుంచి ఉన్నిని సేకరించడం అనేది కూడా అత్యంత క్లిష్టమైన పని అందువల్లే ఈ ఉన్ని ఒక మీటరు ముక్క ధర సుమారు రూ. 4 లక్షలు పైనే పలుకుతుందని చెబుతున్నారు ఫ్యాషన్ ఔత్సాహికులు.ఇప్పటి వరకు అత్యం లగ్జరియస్ ఫ్యాబ్రిక్‌లు అయిన మెరినో, కష్మెరె వంటి ఉన్ని దుస్తులు కంటే ఇదే అత్యంత ఖరీదైనది. అయితే మెరినో, కష్మెరె వంటివి అందుబాటులో ఉన్నంత ఈజీగా ఈ వికునా ఫ్యాబ్రిక్ ఉన్ని దొరకడం బహు కష్టం. ఈ ఉన్నితో చేసిన కోటు ధర రూ. 17 లక్షలకు పైనే ఉంటుందట. లోరో పియానా, బ్రియోని, కిటాన్తో సహా పలు ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ హౌస్‌ల్లో ఈ వికునా కలెక్షన్స్ ఉంటాయట.(చదవండి: మిసెస్ ఆసియాకు భారత్ తరపున మన హైదరాబాదీ..!) -
ఈ పీతను కొనాలంటే ఆస్తులుకు ఆస్తులే అమ్ముకోవాలి..!
పులస చేపకే పుస్తెలమ్ముకోవాలనుకునే మన జనాలు ఈ పీత ధర వింటే ఏకంగా ఆస్తులకు ఆస్తులే అమ్మేసుకోవాలనుకుంటారు. జపాన్‌లో దొరికే ఈ అరుదైన పీత ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పీత. సముద్రంలో మూడువందల మీటర్లకు పైగా లోతులో మాత్రమే ఇది దొరుకుతుంది. అంత లోతున వేటాడినా, అదృష్టం బాగున్న వేటగాళ్ల వలలకే ఇది చిక్కుతుంది. అందుకే దీనికి అంత ధర. దీనిని ‘మాత్సుబా క్రాబ్’ అని, ‘స్నో క్రాబ్’ అని అంటారు.ఈ పీత మాంసం చాలా రుచిగా ఉంటుందట! సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు ఈ పీతలు వలలో చిక్కినప్పుడు వాటిని వేలంలో అమ్ముతారు. గత ఏడాది నవంబర్‌లో ఒక మత్స్యకారుడి వలలో ఈ రకం పీత చిక్కింది. వేలంలో అమ్మితే, 1.2 కిలోల బరువు ఉన్న ఈ పీతకు ఏకంగా 10 మిలియన్ యెన్లు (రూ.58 లక్షలు) ధర పలికింది. జపాన్‌లోని రెస్టారెంట్లలో ఈ పీతలను సన్నగా తరిగి వేయించి ‘కనిసుకియాకి’, గంజిలో ఉడికించి ‘జోసుయి’, గ్రిల్డ్ క్రాబ్ వంటి వంటకాలను తయారు చేస్తారు. వీటిని ఆరగించేందుకు డబ్బున్న బడాబాబులు ఎగబడుతుంటారు. -
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దీవి.. కానీ ఇక్కడ ఒక్కరు కూడా..?
ప్రపంచంలోని చూడచక్కని దీవుల్లో ఇదొకటి. ఈ దీవి చుట్టూ అందమైన పగడపు దిబ్బలు కనువిందు చేస్తాయి. దీవి తీరం దాటి లోపలకు వెళితే, పచ్చని చెట్లు, రకరకాల అరుదైన పక్షులు ఆహ్లాదం కలిగిస్తాయి. ఇక్కడ ఎలాంటి కట్టడాలూ కనిపించవు. పసిఫిక్ సముద్రంలో ఉన్న ఈ దీవి పేరు ‘పామీరా’ దీవి.ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దీవి. అయితే, ఇది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో లేదు. ప్రస్తుతం ఇది అమెరికా అధీనంలో ఉంది. ఈ దీవి గురించి న్యాయపోరాటాలు కూడా జరిగాయి. చివరకు అమెరికా ప్రభుత్వం 2000 సంవత్సరంలో 27.26 మిలియన్ డాలర్లు (రూ.228.49 కోట్లు) చెల్లించి దీనిని సొంతం చేసుకుంది.ఈ దీవి అమెరికా ప్రభుత్వం అధీనంలోకి వచ్చినా, ఇక్కడ మనుషులెవరూ ఉండరు. దీనికి గల చీకటి చరిత్రే అందుకు కారణం. ఈ దీవి అందానికి ముగ్ధులైన కొందరు ఔత్సాహికులు ఇదివరకు అప్పుడప్పుడూ వచ్చేవారు. వారిలో కొందరు అంతుచిక్కని కారణాలతో మరణించారు. మరికొందరు ఎలాంటి ఆచూకీ లేకుండా గల్లంతైపోయారు. అందువల్ల ఈ దీవి ఎంత అందంగా ఉన్నా, ఇక్కడి వాతావరణం ఎంత ఆహ్లాదభరితంగా ఉన్నా ఇక్కడ అడుగుపెట్టాలంటేనే జనాలు భయంతో వణికిపోతారు. అయితే, అప్పుడప్పుడు కొందరు శాస్త్రవేత్తలు బృందాలుగా ఇక్కడకు వచ్చి, పరిశోధనలు జరిపి వెళుతుంటారు. వారు కూడా ఇక్కడ రాత్రివేళల్లో బస చేయరు.ఇది కిరీటం కాదు.. లైటర్!చూడటానికి కిరీటం పైభాగంలా కనిపిస్తోంది గాని, నిజానికి ఇది సిగార్ లైటర్. ఇందులో విశేషమేంటనేగా మీ అనుమానం? ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిగార్ లైటర్. మిగిలిన లైటర్ల మాదిరిగా ఇదేమీ తేలికపాటి లైటర్ కాదు. దీని బరువు దాదాపు అరకిలో ఉంటుంది. దీని తయారీకి 400 గ్రాముల మేలిమి బంగారం, 41 కేరట్ల బరువు గల 152 అరుదైన నీలాలను ఉపయోగించారు.ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ‘ఎస్.టి.డ్యూపాంట్’ ఈ సిగార్ లైటర్‌ను ‘లూయీ గీఐఐఐ ఫ్లర్ డి పార్మ్’ పేరుతో హాంకాంగ్ వ్యాపారవేత్త స్టీఫెన్ హంగ్ ఆర్డర్‌పై 2013లో ప్రత్యేకంగా తయారు చేసింది. దీని తయారీ కోసం ఎనబై మంది నిపుణులైన స్వర్ణకారులు ఆరునెలల పాటు అహర్నిశలు శ్రమించారు. దీని ధర 5 లక్షల డాలర్లు (సుమారు రూ.4.19 కోట్లు).అయితే, షోకేసులో అలంకరించుకోవడానికే తప్ప తేలికగా వాడుకోవడానికి అనువుగా లేకపోవడం దీని లోపం. అందుకే, ఇదే కంపెనీ వాడుకోవడానికి అనువుగా ఉండే పరిమాణంలో ఇదే నమూనాలో నీలాలు పొదిగిన బంగారంతో తయారు చేసిన చిన్న లైటర్లను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి 15,900 డాలర్లు (రూ.13.33 లక్షలు) -
రూ.34 లక్షల వాచ్.. కేవలం 49 మందికే (ఫోటోలు)
-
హాట్ టాపిక్‌గా అనంత్ అంబానీ పెళ్లి : అతి విలాసవంతమైన పెళ్లిళ్లు ఇవిగో!
అపర కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం కనీవినీ ఎరుగుని రీతిలో అత్యంత ఘనంగా జరిగింది. ఇంట్లో జరిగిన చివరి వివాహం కావడంతో దేశ విదేశీలకు ప్రముఖులతో అంత్యంత ఆడంబరంగా నిర్వహించింది అంబానీ ఫ్యామిలీ. దీంతో ఈ వివాహ వేడుక ప్రపంచంలో ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచింది.నిశ్చితార్థం మొదలు, రెండు ప్రీవెడ్డింగ్వేడుకలు, ముంబైలో మూడు రోజుల పాటు నిర్వహించిన గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకల్లో అతిథుల ఆహ్వానం దగ్గర్నించీ, ఆతిథ్యం, వారికి అందించిన బహుమతులు ప్రత్యేక ప్రదర్శనలు, విందు ఇలా ప్రతీదీ ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ పెళ్లి వేడుకల్లో కొత్తదంపతులతో సహా అంబానీ కుటుంబ మహిళలు ధరించిన కోట్లాది రూపాయల విలువ చేసే దుస్తులు, వజ్రాభరణాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. లైవ్‌మింట్, ది ఎకనామిక్ టైమ్స్ , ఔట్లుక్ అంచనా ప్రకారం ఈ వివాహ వేడుకల మొత్తం ఖర్చు 5వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అయి ఉంటుందని అంచనా.ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన వివాహాలలో చోటు దక్కించుకున్న బ్రిటీష్ యువరాణి డయానా ప్రిన్స్ చార్లెస్‌ల వంటి దిగ్గజ వివాహాల ఖర్చు రూ. 1,361 కోట్లను, షేక్ హింద్ బింత్ బిన్ మక్తూమ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌ల ఖర్చులను రూ. 1,144 కోట్లుగా అధిగమించినట్టే. 1981, జూలై 29న అప్పటి ప్రిన్స్ చార్లెస్ , లేడీ డయానా వివాహం లండన్‌లోని సెయింట్ పాల్స్ కేథడ్రల్‌లో రాయల్ వెడ్డింగ్ అత్యంత ఘనంగా జరిగింది. 3,500 మంది వ్యక్తులు ప్రత్యక్షంగా చూసారు, అయితే ప్రపంచవ్యాప్తంగా సుమారు 750 మిలియన్ల మంది ప్రజలు దీనిని టీవీలో వీక్షించారు. 10వేల, 25 అడుగుల పొడవుతో తయారు చేసిన అప్పటి యువరాణి డయానా వెడ్డింగ్ గౌన్ స్పెషల్ ఎట్రాక్షన్. 1979లో దుబాయ్ రాయల్ వెడ్డింగ్‌లో షేక్ మహ్మద్ తన కజిన్ షేఖా హింద్‌ను వివాహం చేసుకున్నాడు. వారం రోజుల పాటు అత్యంగ ఘనంగా ఈ వేడుకలు జరిగాయి.2004లో సహారా గ్రూప్‌కు చెందిన సుబ్రతో రాయ్ తన కుమారుల కోసం డబుల్ వెడ్డింగ్ సందర్భంగా లక్నోను విలాసవంతమైన ఏర్పాట్లతో ముంచెత్తారు. ఆరు రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్లో 11వేల మంది అతిథుల హాజరయ్యారు. వీరి పెళ్లి ఖర్చు రూ. 550 కోట్ల రూపాయలట.2023, నవంబర్‌లో మేడ్లైన్ బ్రాక్వే , జాకబ్ లాగ్రోన్ల వెడ్డింగ్ "శతాబ్దపు వివాహం"గా పేరొందింది. ఈ వివాహానికి దాదాపు 59 మిలియన్ల డాలర్లు అంటే రూ. 489 కోట్లు ఖర్చయ్యాయి. పారిస్‌లోని వెర్సైల్లెస్ ప్యాలెస్‌లో విలాసవంతంగా ఈ వివాహం జరిగింది.2011లో కేట్ మిడిల్టన్ , ప్రిన్స్ విలియం రాజ వివాహం ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వివాహాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ పెళ్లికి 43 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. 1,900 మంది అతిథులతో వెస్ట్మిన్స్టర్ అబ్బేలో జరిగిన ఈ ఈవెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా 160 మిలియన్ల మంది వీక్షకులు వీక్షించారు, కామన్వెల్త్ దేశాల్లో వేడుకలు జరిగాయి.2018లో, అమెరికన్ నటి మేఘన్ మార్క్లేతో ప్రిన్స్ హ్యారీ వివాహం బ్రిటీష్ రాయల్ వివాహం విండ్సర్లోని సెయింట్ జార్జ్ చాపెల్‌లో జరిగిన వేడుకకు అనేక మంది ప్రముఖులు మరియు రాయల్టీతో సహా 600 మంది అతిథులు హాజరయ్యారు. ఇండియాకు చెందిన ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన లక్ష్మీ మిట్టల్ కుమార్తె వనీషా మిట్టల్ వివాహం ఆ జాబితాలో మరొకటి. 2004లో వనీషా మిట్టల్- అమిత్ భాటియా నిశ్చితార్థ వేడుక పారిస్‌లోని వెర్సైల్లెస్ ప్యాలెస్‌లో జరగగా, వివాహం చాటౌ వెక్స్‌లో జరిగింది. ఈ వివాహానికి సుమారు 66 మిలియన్ డాలర్లు రూ. 547 కోట్లు ఖర్చయిందట.2018, డిసెంబరు 12న ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ -ఆనంద్ పిరమల్ వివాహ జరిగింది.ఈ వివాహానికి సుమారు 15 మిలియన్లు డాలర్లు అంటే రూ. 110 కోట్లు ఖర్చయ్యాయి. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి బాలీవుడ్, భారతీయ రాజకీయ వర్గాల ప్రముఖులు హాజరయ్యారు.2006, ఫిబ్రవరి 18 ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, మోడల్ ప్రియా సచ్దేవ్ వివాహం హోటల్ వ్యాపారి విక్రమ్ చత్వాల్‌తో మూడు నగరాల్లో 10 రోజుల పాటు వైభవంగా జరిగింది.26 దేశాల నుండి 600 మంది అతిథులు ఆహ్వానం, ప్రైవేట్‌గా చార్టర్డ్ విమానాలలో తరలించారు. అతిథి జాబితాలో బిల్ క్లింటన్, మోడల్ నవోమి క్యాంప్‌బెల్, అప్పటి భారత-పీఎం మన్మోహన్ సింగ్, లక్ష్మీ మిట్టల్ తదితరులు హాజరైనారు. 50,000 కిలోల పువ్వులు, 3వేల కొవ్వొత్తులు , ఇతర వస్తువులతో అలంకరించిన మొఘల్-కోర్ట్ శైలిలో ఈ వివాహం జరిగింది. పెళ్లికి 20 మిలియన్ల డాలర్లు ఖర్చయ్యాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ కుమార్తె చెల్సియా క్లింటన్ పెట్టుబడి బ్యాంకర్ మార్క్ మెజ్విన్స్కీని ల గ్రాండ్ వెడ్డింగ్ 2010లో ఆస్టర్ కోర్ట్స్‌లో జరిగింది. ఖర్చు 5 మిలియన్లు డాలర్లు. (దాదాపు రూ. 40 కోట్లు).ఇంకా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా తన ప్రతిభను చాటుకుంటున్న ప్రియాంక చోప్రా ,నిక్ జోనాస్ 2018,డిసెంబర్ 1 న వివాహం చేసుకున్నారు ఐదు రోజుల పాటు వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో జరిగింది. ఈ జంట కేవలం హోటల్స్కోసం రూ.3 కోట్లు ఖర్చు చేశారు. పెళ్లి తర్వాత ఢిల్లీలో గ్రాండ్ రిసెప్షన్ కూడా జరిగింది. -
రూ. 29వేల కోట్ల వజ్రం.. ఎవరిదగ్గరుంటే వారు చనిపోతారట!
బ్రిటీష్ వారితో సహా విదేశీ ఆక్రమణదారులు భారతదేశాన్ని దోచుకోకుండా ఉండి ఉంటే.. ప్రపంచంలోనే సుసంపన్నమైన దేశంగా భారత్ ఖ్యాతి గడించేది. ఎంతోమంది విదేశీయులు భారదేశంలోని రాజుల మీద, దేవాలయాల మీద దాడి చేసి ఎన్నో విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఇలా దోచుకెళ్లిన వాటిలో ఒకటి 'హోప్ డైమండ్' అని పిలువబడే వజ్రం.నిజానికి ఖరీదైన వజ్రం అంటే కోహినూర్ వజ్రమే గుర్తొస్తుంది, హోప్ డైమండ్ అనే మరో ఖరీదైన వజ్రం కూడా ఉందని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఇక్కడ చిత్రం ఏమిటంటే.. ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో.. వారంతా అకాల మరణం చెందుతారని ఓ నమ్మకం ఉంది. ఈ కారణంగానే దీన్ని శాపగ్రస్త వజ్రంగా పిలుస్తారు.గుంటూరులోని కొల్లూరు గనుల నుంచి ఈ వజ్రం వెలికితీసినట్లు కొంతమంది, ఇతర వజ్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని వజ్రకరూర్‌లోని కింబర్లైట్ ప్రాంతాల నుంచి తీసి ఉండొచ్చని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్‌లో దొరికినట్లు స్పష్టమవుతోంది.17వ శతాబ్దంలో ఈ వజ్రం బయటపడినప్పటి నుంచి చాలాసార్లు చేతులు మారినట్లు సమాచారం. మొదట్లో ఈ వజ్రాన్ని ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ ఓ ముడి పదార్థంగానే కొనుగోలు చేసారు. ఆ తరువాత రాజ కుటుంబాలు దాన్ని దక్కించుకున్నాయి. ఆ తరువాత ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ XIV, న్యూయార్క్ నగరానికి చెందిన హ్యారీ విన్స్టన్ దీన్ని సొంతం చేసుకున్నారు. ఈ తరువాత ఈ వజ్రాన్ని 1958లో వాషింగ్టన్‌లోని స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్కు విరాళంగా ఇచ్చేసారు.ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ దీన్ని భారతదేశంలోని ఓ హిందూ దేవాలయం నుంచి దొంగలించినట్లు ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. దేవాలయంలోని వజ్రం కనుక.. ఆ ఆలయంలో పూజారులు వజ్రం పోయిందని, ఆ వజ్రం తీసుకున్న వ్యక్తులను శపించారు. ఈ కారణంగానే ఇది ఎవరి దగ్గర ఉంటే వారు అకాలమరణం చెందుతున్నారని, చివరకు స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్కు విరాళంగా ఇచ్చేసారు.1839లో హెన్రీ ఫిలిప్ హోప్ అనే వ్యక్తి ఈ వజ్రాన్ని మొదట సేకరించడంతో.. దానికి అతనిపేరే పెట్టారు. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ వారి ప్రకారం.. ఈ వజ్రం 16 తెల్లని వజ్రాల మధ్యలో ఓ లాకెట్టు మాదిరిగా ఉంది. చికాగో డైమండ్ కొనుగోలుదారుల ప్రకారం.. హోప్ డైమండ్ విలువ 350 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ. 29,19,52,67,500. -
సచిన్, కోహ్లి కాదు.. అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న భారత క్రికెటర్! (ఫొటోలు)
-
సచిన్, కోహ్లి కాదు.. అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న భారత క్రికెటర్! (ఫొటోలు)
-
చూడటానికి పసందైనా.. ధరకి వామ్మో అనాల్సిందే..!
చూడటానికి ఎంతో పసందుగా ఉన్న ఈ మిఠాయి ఖరీదు తెలుసుకుంటే మాత్రం కళ్లు చెదురుతాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మిఠాయి. ఈ మిఠాయి పేరు ‘స్ట్రాబెర్రీస్ ఆర్నాడ్’. అమెరికాలోని న్యూ ఆర్లీన్‌లో ఉన్న ‘ఆర్నాడ్’ రెస్టారెంట్ ప్రత్యేకంగా రూపొందించిన మిఠాయి ఇది. సన్నగా తరిగిన స్ట్రాబెర్రీ ముక్కలు, నారింజ ముక్కలు, లవంగం, దాల్చినచెక్క, వెనీలా ఐస్‌క్రీమ్, బాగా గిలకొట్టిన పాలమీగడతో తయారు చేసిన ఈ మిఠాయిపైన ఆరురకాల ఖరీదైన షాంపేన్ చిలకరించి, దీనిపైన తాజా పుదీనా ఆకులను, మేలిమి బంగారు రేకులను అలంకరిస్తారు. దీని ఖరీదు 9.85 మిలియన్ డాలర్లు (రూ.81.50 కోట్లు). దీనికి ఇంత ఖరీదు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? దీనిని అలా ఊరకే కప్పులో పెట్టి వడ్డించి వదిలేయరు. దీంతో పాటే, కప్పు అడుగున ఉన్న సాసర్లో చక్కని పెట్టెలో 10.06 కేరట్ల వజ్రాలను పొదిగిన బంగారు ఉంగరాన్ని ఉంచి మరీ వడ్డిస్తారు. ఐస్‌క్రీమ్ తినేసి, వజ్రాల ఉంగరాన్ని తీసేసుకోవచ్చు. ఇవి చదవండి: ఈ పండుగ కొందరకి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’.. -
కుబేరుల బిడ్డలు : ఘనమైన బహుమతులు, వీటి విలువ తెలుసా?
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తన 4 నెలల మనవడు గ్రాహ్కు రూ. 240 కోట్ల విలువైన 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఏయే సెలబ్రీటీలు తమ వారసులకు ఏయే ఖరీదైన గిఫ్ట్‌లు వార్తల్లో నిలిచాయి. నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి , అపర్ణ కృష్ణన్‌ల కుమారుడైన ఏకగ్రాహ్కు సుధా,మూర్తి దంపతులకు మూడో మనవడు . యూకే ప్రధాని రిషి సునక్ భార్య అక్షతామూర్తి వీరి పెద్ద కుమార్తె. అక్షత, రిషీలకు కృష్ణ , అనౌష్క అనే ఇద్దరు పిల్లలున్నారు. అంబానీ పెద్ద కోడలి గిఫ్ట్ ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతాకు అంబానీ పెద్ద కోడలు కూడా ఖరీదైన బహుమతి దక్కించుకుని అప్పట్లో వార్తల్లో నిలిచారు. రూ. 451 కోట్ల విలువైన మౌవాద్ ఎల్' నెక్లెస్‌ను నీతా అంబానీ కోడిలికి పెళ్లి బహుమతిగా ఇచ్చారు. కుమారుడికి పుట్టినరోజుకి పూనావాలా గిఫ్ట్ ఏంటంటే.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా, DC కామిక్ పుస్తకాన్ని పోలిన బ్యాట్మొబైల్ను తన కుమారుడికి బహుమతిగా ఇచ్చారు. 2015లో తన కుమారుడి 6వ పుట్టినరోజు సందర్భంగా, అదార్ పూనావల్ల తన Mercedes-Benz S-క్లాస్‌ని బ్యాట్‌మొబైల్ మోడల్లో తీర్చిదిద్దేలా చేశారు.ఈ మార్పులు పూర్తి చేయడానికి ఆరు నెలలకు పైగా పట్టిందట. శివ నాడార్ కూడా ప్రముఖ టెక్ సంస్థ హెసీఎల్ ఫౌండర్ పౌండర్, ఛైర్మన్ శివ్ నాడార్ 2014లో తన ఏకైక కుమార్తె రోష్ని కోసం ఒక లగ్జరీ ఇంటిని కొనుగోలు చేశారు. తూర్పు ఢిల్లీలోని ఫ్రెండ్స్ కాలనీలోని ఈ బంగ్లా విలువ రూ. 115 కోట్లు. ఇషా అంబానీ ట్విన్స్ కోసం ఇషా అంబానీ వ్యాపారవేత్తగా సత్తా చాటుతున్న ఇషా అంబానీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ముఖేష్ అంబానీ , నీతా అంబానీ ఏకైక కుమార్తె, ఇషా అంబానీ 2018లో బిలియనీర్ ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుంది. ఈ పెళ్లి సందర్భంగానే అజయ్ పిరమల్ స్వాతి పిరమల్ దంపతులు ఇషా , ఆనంద్ పిరమల్లకు ముంబైలోని ‘గులిటా’ అనే ఒక విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు. దీని విలువ రూ.450 కోట్లు అని సమాచారం. అలాగే ఇషా, ఆనంద్ దంపతులు ట్విన్స్ పుట్టిన సందర్భంగా అంబానీ ప్రత్యేకంగా తయారు చేసిన అల్మారాను బహుమతిగా ఇచ్చారు. 2022లో పుట్టిన కృష్ణ-ఆదియాలకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వడం విశేషం. బిల్‌గేట్స్ ముద్దుల బిడ్డ కోసం మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు , బిలియనీర్ బిల్ గేట్స్ తన కుమార్తె జెన్నిఫర్ గేట్స్ నాసర్‌పై తనకున్న ప్రేమను ఘనంగా చాటుకున్నాడు. బిల్ గేట్స్ తన కూతురికి 277 కోట్ల రూపాయల విలువైన 124 ఎకరాలగుర్రపు ఫారమ్‌ను బహుమతిగా ఇచ్చాడు. అమెరికాలోని ఫ్లోరిడాలోని వెల్లింగ్టన్లో ఉన్న ఈ గుర్రపు ఫారమ్‌ను ఎవర్గేట్ స్టేబుల్స్ అంటారు.ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తరువాత తన కుమార్తె రైడింగ్ కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ గిఫ్ట్ ఇచ్చారట. -
రూ.209 కోట్ల 'రోల్స్ రాయిస్' కారు - వివరాలు
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే 'రోల్స్ రాయిస్' ఇప్పుడు మరో ఖరీదైన కారు 'ఆర్కాడియా డ్రాప్‌టైల్'ను వెల్లడించింది. ఈ కారు ధర సుమారు రూ. 209 కోట్లు. దీనిని కంపెనీ సింగపూర్‌లోని ఒక ప్రైవేట్ వేడుకలో వెల్లడించారు. రోల్స్ రాయిస్ ఆర్కాడియా అద్భుతమైన డిజైన్ కలిగి చాలా వరకు వైట్ పెయింట్ అల్యూమినియం, కార్బన్ ఫైబర్ టబ్, ముందు భాగంలో బ్లాక్ కలర్ వంటి వాటిని పొందుతుంది. ఇది ఇతర డ్రాప్టెయిల్ల మాదిరిగా కాకుండా చాలా ప్రత్యేకంగా ఉండటం గమనించవచ్చు. రెండు డోర్స్, రెండు సీట్లు కలిగిన ఈ కారులో శాంటాస్ స్ట్రెయిట్ గ్రెయిన్ రోజ్‌వుడ్ ఎక్కువగా ఉపయోగించినట్లు సమాచారం. ఈ కారు తయారీలో సుమారు 233 చెక్క ముక్కలను ఉపయోగించినట్లు, దీనిని రూపొందించడానికి 8000 గంటల కంటే ఎక్కువ సమయం పట్టినట్లు సమాచారం. డ్యాష్‌బోర్డ్‌లో రోల్స్ రాయిస్ క్లాక్ ఉంది. కేవలం దీనిని తయారు చేయడానికే.. రెండు సంవత్సరాల రీసర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కారులోని ట్విన్ టర్బోచార్జ్డ్ 6.75 లీటర్ వీ12 ఇంజిన్ కలిగి 601 హార్స్ పవర్ 841 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
‘ఆఫ్రికన్ బ్లాక్ ఉడ్’ ముందు ఎర్ర చందనం వెలవెల..
ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు అత్యుత్తమ ఫర్నిచర్‌ను సమకూర్చుకోవాలని అనుకుంటారు. ఖరీదైన కలప విషయానికొస్తే భారతదేశంలో ఎర్ర చందనం అత్యంత ఖరీదైనదిగా పరిగణిస్తారు. అయితే ప్రపంచంలో దీనికి మించిన ఖరీదైన కలప మరొకటుంది. అదే ఆఫ్రికన్ బ్లాక్ కలప. దీని ఖరీదెంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే. ఆఫ్రికన్ బ్లాక్ కలపను అత్యంత విలువైన వస్తువులలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది ప్రపంచంలో అతి అరుదుగా దొరుకుతుంది. ఆఫ్రికన్ బ్లాక్ కలప ప్రపంచంలోని 26 దేశాలలో మాత్రమే కనిపిస్తుంది. అలాగే ఆఫ్రికన్ బ్లాక్ చెట్టు పూర్తిగా అభివృద్ధి చెందడానికి 60 సంవత్సరాలు పడుతుంది. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ చెట్టు ఎక్కువగా ఆఫ్రికన్ ఖండంలోని మధ్య, దక్షిణ భాగాలలో పెరుగుతుంది. ఈ కలప ధర కిలో రూ.7 నుంచి 8 వేల వరకూ పలుకుతుంది. ఫర్నిచర్‌తో పాటు, షెహనాయ్, వేణువుతో సహా పలు సంగీత వాయిద్యాలను ఈ చెక్కతో తయారు చేస్తారు. అత్యంత ధనవంతులు తమ ఇంటిని ఆకర్షణీయంగా మార్చుకోవడానికి ఈ కలపను ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తుంటారు. ఈ కలపకున్న డిమాండ్, ధరను దృష్టిలో పెట్టుకుని స్మగ్లర్లు ఈ కలపను స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్‌ను రక్షించేందుకు కెన్యా. టాంజానియా తదితర దేశాలలోని ప్రభుత్వాలు సాయుధ బలగాలను వినియోగిస్తున్నాయి. -
అత్యంత ఖరీదైన కీటకం..ధర ఏకంగా రూ. 65 లక్షలు పైనే..
ఈ ప్రపంచంలో ఎన్నో జంతువులు, కీటకాలు ఉంటాయి. అందులో కొన్నింటిని మనం ఆహారంగా తీసుకుంటాం. కొన్ని మన ప్రాణాలకు ప్రమాదకరం. అయితే ఒక కీటకం ధర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలవడం విశేషం. దీని ధర ముందు బీఎండబ్ల్యూ, ఆడీ కార్లకు కూడా బలదూర్ అనిపించేలా ఉంది. అయినా ఒక కీటకం ఎందుకు అంత ధర పలుకుతుంది? దాని వల్ల ఉపయోగం ఏంటీ..? అంటే.. స్టాగ్ బీటిల్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం. ఇది కేవలం 2 నుంచి 3 అంగుళాల సైజులో ఉంటుంది. చెత్తలో ఉండే ఈ కీటకాన్ని జపనీస్ పెంపకందారుడు ఏకంగా 65 లక్షలుకు విక్రయించాడు. ఇప్పుడు అది ఏకంగా కోటి పైనే పలుకుతోందట. ప్రజలు కూడా ఈ అరుదైన కీటకాన్ని కొనుగోలు చేయడానికి కోట్లు వెచ్చిస్తుండటం విశేషం. స్టాగ్ బీటిల్స్ లుకానిడే కుటుంబానికి చెందినవి, ఇందులో దాదాపు 1,200 రకాల కీటకాలు ఉన్నాయి. ఈ భూమిపై ఉన్న అత్యంత వింతైన చిన్న కీటకం ఇది. చూడటానికి నల్లగా ఉండి తల నుంచి పొడుచుకు వచ్చిన కొమ్ముల ఉంటాయి. చెత్తలో ఉండే స్టాగ్ బీటిల్స్ కుళ్లిన కలపలోన ద్రవాలు, పండ్లరసం, చెట్ల రసం వంటి వాటినే ఆహారంగా తీసుకుంటాయి. ఇవి ఎక్కువగా ద్రవాల మీద ఆధారపడతాయి. ఎందుకంటే ఇవి తినలేవు. ఈ కీటకం సుమారు 7 సంవత్సరాలు జీవిస్తుందట. అయితే ఇది స్టాగ్ బీటిల్ అని వాటి తలపై ఉన్న కొమ్ముల ఆధారంగా గుర్తిస్తారట. అయితే వీటిని వివిధ రకాల మందుల తయారీలో వినియోగిస్తారు. అందువల్లే ఇది అంత ఖరీదు. వీటిలో మగ స్టాగ్ బీటిల్స్ పెద్ద దవడలు కలిగి ఉండగా, ఆడవారి దవడలు, మగవారి కంటే బలంగా ఉంటాయి. ఇక ఆడ స్టాగ్ బీటిల్స్ తరచుగా నేలపైనే కనిపిస్తాయి. ఎందుకంటే..? గుడ్డు పెట్టేందుకు ఎల్లప్పుడూ నేలపై సంచరిస్తుంటాయి. అయితే ఈ కీటకాలు పెద్దవి అయిపోయాక గట్టి చెక్కను తినలేవట. దాంతో లార్వా కాలంలో ఏర్పడిన కొవ్వు నిల్వలపై ఆధారపడతాయి. శీతల వాతావరణం స్టాగ్ బీటిల్స్‌కు తగినది కాదు, ఎందుకంటే..? ఇది లార్వా ప్రక్రియను పొడిగించగలదు. శీతాకాలంలో చాలా కీటకాలు చనిపోతాయి, కాబట్టి వెచ్చని ప్రదేశాలు వాటికి ఉత్తమమైనవి. దీన్ని ఎక్కువగా ప్రమాదకరమైన వ్యాధులకు మందులు తయారు చేయడంలో ఉపయోగిస్తారట. అందువల్లే బీఎండబ్ల్యూ, ఆడీ కార్లను తలదన్నేలా అత్యంత ధర పలుకుతోంది. అయితే ఈ జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉండటం బాధకరం. (చదవండి: చాక్లెట్, కెల్లాగ్స్ చాకోస్‌లో పురుగుల కలకలం! అలాంటివి వెంటనే తిరిగిచ్చేసి ఉచితంగా మరొకటి..) -
రూ.32 లక్షల సైకిల్ - ఎందుకింత రేటు?
ఒక సాధారణ సైకిల్ ధర ఎంత ఉంటుంది? మహా అయితే ఓ 20,000 రూపాయలు ఉండొచ్చు. కానీ ఇక్కడ కనిపించే సైకిల్ ధర మాత్రం ఏకంగా రూ. 32 లక్షలు. సైకిల్ ఏంటి? రూ. 32 లక్షలు ఏంటి? అని చాలామంది ఒక్కసారిగా షాకవొచ్చు! అయితే మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూసెయ్యండి. ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే 'బుగాటీ' (Bugatti) కంపెనీ 'పీజీ ఎక్స్' తయారు చేసింది. ఇది చూడటానికి సాధారణ సైకిల్ మాదిరిగా అనిపించినప్పటికీ ఇది చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది బుగాటీ చిరోన్ కారు నుంచి ప్రేరణ పొంది ఖరీదైన మెటీరియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్లను ఉపయోగించి తయారైంది. 2017 జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో కనిపించిన ఈ పీజీ ఎక్స్ బుగాటీ కేవలం 667 యూనిట్లకు మాత్రమే పరిమితం. దీని ధర రూ. 39000 డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 32 లక్షల కంటే ఎక్కువ). ఈ సైకిల్ తయారీలో అగ్రశ్రేణి స్పోర్ట్స్ ఆటోమొబైల్స్, నాసా, ఏరోనాటిక్ దిగ్గజాలలో ఉపయోగించే హై-ఎండ్ మెటీరియల్స్ ఉపయోగించారు. ఈ సైకిల్‌ను 95 శాతం అధిక శక్తి కలిగిన కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు, కాబట్టి ఇది ఐదు కిలోల కంటే తక్కువ బరువును కలిగి ఉంది. ఇదీ చదవండి: రూ. 700లకు థార్ అడిగిన బుడ్డోడు.. ఫ్యాక్టరీలో హల్చల్ చేశాడు - వీడియో ప్రపంచంలో అత్యంత ఖరీదైన, తక్కువ బరువున్న సైకిల్ బహుశా ఇదే అయి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఒక సీటు కలిగిన ఈ సైకిల్ సింగిల్ వీల్ బ్రేక్ మాత్రమే కలిగి ఉంటుంది. పీజీ బుగాటీ సైకిల్ కార్బన్ ఫ్రేమ్‌ను ఫార్ములా వన్ కార్లను తయారు చేసే అదే కార్మికులు తయారు చేశారు. ఈ కారణంగానే దీని ధర చాలా ఎక్కువ. -
అంబానీ కంటే ముందే 'లోటస్' కారు కొన్న హైదరాబాద్ మహిళ
భారతదేశంలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి కుబేరులు ఎప్పటికప్పుడు అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారన్న సంగతి తెలిసిందే.. అయితే ఇటీవల ఓ ఖరీదైన కారుని వారికంటే ముందే, హైదరాబాద్ మహిళ కొనుగోలు చేసింది. హైదరాబాద్ వాసి 'హర్షిక రావు' ఇటీవలే రూ. 2.55 కోట్ల లోటస్ ఎలెట్రే ఎలక్రిక్ కారును కొనుగోలు చేసి, ఈ కారు కొన్న మొట్ట మొదటి భారతీయురాలిగా రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లోటస్ ఎలెట్రే ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన లోటస్ ఎలెట్రే ఎలక్ట్రిక్ కారు మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎలెట్రే, ఎలెట్రే ఎస్, ఎలెట్రే ఆర్. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు ఆధునిక ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇదీ చదవండి: నీతా అంబానీ వాడే ఫోన్ ధర రూ.400 కోట్లా? అసలు నిజమేంటంటే? పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. Eletre అండ్ Eletre S మోడల్స్ 603 హార్స్ పవర్ అందించే డ్యూయల్-మోటార్ సిస్టమ్‌ను కలిగి 600 కిమీ రేంజ్ అందిస్తాయి. Eletre R మోడల్ 905 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 2.95 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ మోడల్ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 20 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. అంతే కాకుండా ఇది స్టాండర్డ్ 22 kWh AC ఛార్జర్ కూడా పొందుతుంది. View this post on Instagram A post shared by Car Crazy India® (@carcrazy.india) -
అత్యంత ఖరీదైన కాఫీ! సర్వ్ చేసే విధానం..!
ఎన్నో రకాల ఖరీదైన కాఫీల గురించి విని ఉంటారు. కానీ ఇలాంటి కాఫీని చూసి ఉండరు, విని ఉండరు. అవును దీన్ని ఎంత వెరైటీగా సర్వ్ చేస్తారంటే..అంతకుముంచి దాన్ని సిప్ చేయడం ఓ సవాలు. ఇదేంటి? అంత ఖర్చుపెట్టుకుని తింటే..మళ్లీ ఇదేం తిరకాసు అనుకుంటున్నారా!. అయితే ఆ కాఫీ కహానీ ఏంటో చూసేద్దాం!. కోల్డ్ కాఫీ, డార్క్ కాఫీ అంటూ మార్కెట్లో పలు రకాల కాఫీకేఫ్‌లు కస్టమర్లను ఊరిస్తున్నాయి. ఇప్పటి వరకు చూసిన కాఫీలు వందకు మించి ఖరీదు ఉండదు. మహా అయితే అది ఏ ఫైవ్ స్టార్ హోటల్ అయితే తప్ప కళ్లుబైర్లు కమ్మేలా అంతంత రేంజ్ ధరలు ఉండవు. అలాంటిది ఈ కాఫీ ధరలోనే కాదు దీన్ని సర్వ్ చేసే విధానం కూడా భలే విచిత్రంగా ఉంది. ఆ కాఫీని నేరుగా ఐస్‌క్రీం కోన్‌లో పోసి సర్వ్ చేస్తారు. పైగా ఓ అందమైన కళాకృతులతో ఈ కాఫీని అందిస్తారు ఫెన్స్టర్ అనే కేఫ్‌లో. ఈ కేఫ్ ఆస్ట్రియాలోని వియాన్నలో ఉంది. దీని ధర మన భారత కరెన్సీలో ఏకంగా రూ. 865/-. ఆ ఐస్‌క్రీం కోన్ కూడా నోరూరించేలా చాక్లెట్ లేయర్డ్ కోన్. దీనిలో మంచి రుచికరమైన కాఫీని అది కూడా ఓ మంచికళాకృతిలో సర్వ్ చేస్తారు. అయితే ఆ కాఫీ తాగడం ముగిసేలోపు ఆ కోన్ తినకుండా కంట్రోల్ చేసుకుంటూ తాగాలి ఓ పక్కన కోన్ నానకూడదు. లేదంటే అంత ఖర్చు చేసిన కాఫీ అంతా వేస్ట్ అయిపోతుంది కదా!. ఐడియా అదుర్స్ కదా!. అంతేకాదండోయ్ ఆ కాఫీ యజమానికి ఏడాదికి ఈ కాఫీకి సంబంధించి సుమారు ఒక లక్షకు పైనే ఆర్డర్లు వస్తాయట. అక్కడ ఈ పానీయాన్ని చాలామంది ఇష్టంగా తాగుతుంటారని సదరు కాఫీ యజమాని చెబుతున్నాడు. View this post on Instagram A post shared by Fenster Cafe (@fenstercafe) (చదవండి: నడిచే చెట్లను ఎప్పుడైనా చూశారా? చూస్తే షాకవ్వాల్సిందే!) -
అత్యంత ఖరీదైన పెట్ డాగ్స్ (ఫోటోలు)
-
అత్యంత ఖరీదైన మొక్కలు ధర మీకు తెలుసా..? (ఫోటోలు)
-
రూ.167 కోట్ల కారులో కనిపించిన 'శామ్ ఆల్ట్‌మన్' - వీడియో వైరల్
గత నెలలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచిన ఓపెన్ ఏఐ(OpenAI) సీఈఓ 'శామ్ ఆల్ట్‌మన్' ఇటీవల ఓ ఖరీదైన కారులో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇందులో కనిపించే ప్రత్యేకమైన సూపర్‌కార్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కథనంలో ఆ కారు గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. వెల్థినెక్స్జెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే వీడియోలో అత్యంత ఖరీదైన 'మెక్లారెన్ F1' సూపర్ కారును చూడవచ్చు. 1992లో ప్రారంభమైన ఈ కారు ధర భారతదేశంలో రూ. 167 కోట్ల కంటే ఎక్కువే. ఇది ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన సూపర్ కార్ల జాబితాలో ఒకటి కావడం గమనార్హం. శామ్ ఆల్ట్మాన్ తన మెక్లారెన్ ఎఫ్1 సూపర్‌కార్‌లో కాలిఫోర్నియాలోని ఫ్యూయెల్ స్టేషన్ వద్ద ఉంటడం వీడియోలో చూడవచ్చు. వెర్మిలియన్ రెడ్ కలర్లో కనిపించే ఈ కారు సిల్వర్ కలర్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఈ కారుని స్వయంగా ఆల్ట్మాన్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం గమనించవచ్చు. మెక్లారెన్ ఎఫ్1 నిజానికి కారు అనగానే అందులో కనీసం నలుగురు కూర్చోవడానికి సీట్లు ఉంటాయని తెలుసు. కానీ ఇక్కడ కనిపించే మెక్లారెన్ ఎఫ్1 మూడు సీట్ల కారు. మధ్యలో డ్రైవర్ సీటింగ్ పొజిషన్‌తో కేవలం ఒకే సీటు ఉంటుంది. వెనుకవైపు ఇద్దరు కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కారును 1992లో ప్రముఖ కార్ డిజైనర్ 'గోర్డాన్ ముర్రే' ప్రత్యేకంగా తయారుచేశారు. ఇవి కేవలం 106 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. మెక్లారెన్ ఎఫ్1 సూపర్ కారులో 6.1 లీటర్ వీ12 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 627 పీఎస్ పవర్, 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన ఈ కారు సుమారు కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు రూ. 386 కిమీ/గం కావడం గమనార్హం. ఇదీ చదవండి: నాలుగు అపార్ట్మెంట్లను అమ్మేసిన శ్రీదేవి ఫ్యామిలీ! మెక్లారెన్ ఎఫ్1 కారు ఇప్పటికే రోవాన్ అట్కిన్సన్ (మిస్టర్ బీన్), ఎలోన్ మస్క్ వద్ద కూడా ఉంది. అయితే రోవాన్ అట్కిన్సన్ కొన్ని రోజుల తరువాత ఈ కారుని విక్రయించినట్లు సమాచారం, మస్క్ మాత్రం ఈ కారును ఇప్పటికీ వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Motivation | Business | Wealth (@wealthynexgen) -
ఈ చెర్రీలు ఒక్కోక్కటే ఏకంగా..రూ. 25 వేలు!
మన దేశంలోని వివిధ నగరాల్లో సాధారణంగా చెర్రీలు కిలో రూ.400 నుంచి రూ.1200 వరకు పలుకుతాయి. జపాన్‌లో పండించే ఈ చెర్రీలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. వీటిని జూనో హార్ట్ చెర్రీలని, అవ్‌మోరీ చెర్రీలని అంటారు. మిగిలిన రకాల చెర్రీల కంటే ఇవి పరిమాణంలో పెద్దగాను, రుచిలో మరింత తీపిగాను ఉంటాయి. వీటి ఆకారం మిగిలిన చెర్రీల్లా గుండ్రంగా కాకుండా, హృదయాకారంలో ఉంటుంది. వీటిని కిలోల చొప్పున అమ్మరు. ఒక్కొక్క పండుకే ధరకట్టి ఆ లెక్కన అమ్ముతారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ చెర్రీలు ఒక్కొక్కటి 296 డాలర్ల (సుమారు 25 వేలు) వరకు ధర పలుకుతాయి. ఇవి 2.8 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వ్యాసంలో ఉంటాయి. సాధారణ చెర్రీల కంటే వీటిలో చక్కెర 20 శాతం ఎక్కువగా ఉంటుంది. (చదవండి: హెల్తీగా రాగి డోనట్స్ చేసుకోండిలా..!) -
ఈ కారు కొనే డబ్బుతో ఫ్లైటే కొనేయొచ్చు!
ప్రపంచంలో ఖరీదైన కారు అంటే చాలామంది చెప్పే సమాధానం రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన 'బోట్ టెయిల్'. కానీ ఇప్పుడు ఈ కారుకంటే రెట్టింపు ధరకు 1962 నాటి ఫెరారీ కారు అమ్ముడైంది. ఇంతకీ ఈ కారు ప్రత్యేకత ఏమిటి, ఎంతకు అమ్ముడైంది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. న్యూయార్క్‌లో జరిగిన వేలంలో 1962 నాటి 'ఫెరారీ 250 జీటీవో' (Ferrari 250 GTO) 51.7 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. దీనిని అనామక బిడ్డర్ ఆర్ఎమ్ సోథెబీస్ కొనుగోలు చేశారు. భారతీయ కరెన్సీ ప్రకారం ఈ కారు ధర సుమారు రూ. 430 కోట్లు కంటే ఎక్కువ. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యధిక ధరకు అమ్ముడైన కార్ల జాబితాలో ఇది స్థానం సంపాదించింది. ఫెరారీ 250 జీటీవో ప్రారంభంలో 4.0 లీటర్ ఇంజిన్ కలిగి 7500 ఆర్పీఎమ్ వద్ద 3910 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసేది, ఆ తరువాత 3.0-లీటర్ జీటీవో డెవలప్మెంటల్ ఇంజన్ అమర్చారు. అప్పట్లోనే ఈ కారుని రేసింగ్‌లో ఎక్కువగా ఉపయోగించేవారు. ఇది 1965 సిసిలియన్ హిల్‌క్లైంబ్ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్ స్థానాన్ని పొందింది. ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా? గతంలో ఫెరారీ క్లబ్ ఆఫ్ అమెరికా ఛైర్మన్ యాజమాన్యంలో ఉన్న ఈ కారు కావల్లినో క్లాసిక్‌లో FCS ప్లాటినం అవార్డు, కొప్పా బెల్లా మచినా అవార్డు గెలుచుకుంది. అయితే ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఎక్కువ ధరకు అమ్ముడైన కారు మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెన్‌హాట్ కూపే (Mercedes 300 SLR Uhlenhaut Coupe). ఇది జర్మనీలో జరిగిన వేలంలో రూ. 1202 కోట్లకు అమ్ముడైంది. -
విష్ణు విరానికాల గారాల పట్టి ధరించిన డ్రస్ ధర వింటే షాకవ్వుతారు!
మెరిసే కళ్ళు, సొట్ట బుగ్గలతో ముద్దొస్తున్న ఈ క్యూట్ గర్ల్ పేరు ఐరా! మంచు విష్ణు, విరానికాల చిన్న కూతురు. ఐరా.. బుజ్జి మోడల్‌గా .. అమ్మ విరానికా స్టార్ట్ చేసిన ఫ్యాషన్ బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తోంది. ఆ ఫ్యాషన్ బ్రాండ్ గురించి కొన్ని విషయాలు..అమ్మ విరానికా .. ఐరాను ప్రేమగా ‘చిన్న పుప్పిటా’ అని పిలిచుకుంటే .. నాన్న విష్ణు ‘బిగ్గెస్ట్ బ్లాక్‌మెయిలర్’ అంటూ ముద్దు చేస్తాడట. ఇల్లు.. పిల్లలు.. వ్యాపారం.. ఈ మల్టీటాస్క్ని తనకు ఫింగర్ టిప్‌తో సమానమని నిరూపిస్తోంది విరానికా మంచు. న్యూయార్క్‌లో పుట్టి, పెరిగిన ఆమె.. జెమాలజీ, జ్యూలరీ డిజైన్, ఫ్యాషన్ మార్కెటింగ్‌లో డిగ్రీ చేసింది. సినీ హీరో మంచు విష్ణుని పెళ్లి చేసుకున్నాక ఇండియా వచ్చేసింది. ఇంట్లో వాళ్లకి కావలసిన డ్రెస్‌లు, నగలను తనే డిజైన్ చేస్తుంది. ‘విరానికా’ అని తన పేరు మీదే ఒక బొటిక్నీ నడుపుతోంది. అయితే అమ్మ విరానికా కల మాత్రం లండన్‌లో ఫ్యాషన్ స్టోర్ పెట్టాలనే! దాని కోసం వర్క్ చేసింది.. చివరకు సాధించింది. తాజాగా చిన్న పిల్లల కోసం ‘మేసన్ అవా’ అనే బ్రాండ్‌ని క్రియేట్ చేసింది. దాని స్టోర్‌ని.. వరల్డ్ ఫేమస్ లగ్జరీ డిపార్మెంట్ స్టోర్ అయిన హారోడ్స్ (లండన్)లో ఓపెన్ చేసింది. ఇక్కడ 2–14 సంవత్సరాల పిల్లల కోసం సరికొత్త డిజైన్స్‌లో అన్ని రకాల దుస్తులు ఉంటాయి. చాలా వరకు హ్యాండ్ మేడ్ డ్రెసెసే ఉంటాయి. ఈ బ్రాండ్‌కి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు డిమాండ్ ఉంది. ఈ బ్రాండ్ డిజైన్ చేసిన గౌనును 2021లో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ల కూతురు ఆరాధ్య బచ్చన్.. తన పుట్టినరోజు నాడు వేసుకుంది. అమెరికన్ మోడల్ ప్యారిస్ హిల్టన్ సైతం ‘మేసన్ అవా’ డ్రెస్ వేసుకుంది. ధరలు హై రేంజ్‌లోనే ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇక విరానిక కూతురు ఐరా ధరించిన మేసన్ అవా డ్రస్ ధర ఏకంగా డ్రెస్ రూ. 99,520/- (చదవండి: దీపాలతోనే కాదు..సంప్రదాయ దుస్తులతో కూడా కాంతిని నింపొచ్చు!) -
ఇంతకంటే ఖరీదైన ప్యాలెస్ మరొకటి లేదు! ముఖేష్ అంబానీ యాంటిలియా దీని తరువాతే..
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఏదంటే, చాలామంది ముంబైలోని యాంటిలియా పేరు చెబుతారు. దీని కంటే ఖరీదైన ప్యాలెస్ మరొకటి ఉందంటే నమ్మడానికి కొంత సమయం పట్టొచ్చు, కానీ ఇది నిజం. ఈ ఖరీదైన ప్యాలెస్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బిలియనీర్ ముఖేష్ అంబానీ యాంటిలియా కంటే ఖరీదైన భవనం 'బకింగ్‌హామ్ ప్యాలెస్'. ఇది ప్రస్తుతం కింగ్ చార్లెస్ III నేతృత్వంలోని బ్రిటన్ రాజకుటుంబ నివాసం. 1703లో నిర్మించిన ఈ ప్యాలెస్ ప్రపంచంలో అత్యంత ఖరీదైనదిగా కీర్తి పొందుతోంది. 19వ శతాబ్దంలో క్వీన్ విక్టోరియా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రాజభవనాన్ని మళ్ళీ పునర్నిర్మించారు. ఆ తరువాత కూడా చాలా సంవత్సరాలు ఇది కొన్ని కొన్ని మార్పులు పొందుతూనే ఉంది. ప్రస్తుతం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో 775 గదులు ఉన్నాయి. ఇందులో 19 స్టేటురూమ్‌లు, రాయల్స్, అతిథుల కోసం 52 బెడ్రూమ్లు, సిబ్బందికి 188 బెడ్రూమ్లు, 92 ఆఫీసులు, 78 బాత్రూమ్లు ఉన్నాయి. ఇదీ చదవండి: సినిమాలకు దూరంగా హీరోయిన్.. అయినా కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొనేసింది! ఈ భవనం విక్రయిస్తే 4.9 బిలియన్ల కంటే ఎక్కువ డబ్బు రావొచ్చని అంచనా. ముఖేష్ అంబానీ విలాసవంతమైన యాంటిలియా ధర కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. బ్రిటీష్ వారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను పాలించినప్పటి నుంచి బకింగ్‌హామ్ ప్యాలెస్ అత్యంత విలువైన ఆభరణాలకు, సంపదకు నిలయంగా విరాజిల్లింది. ముఖేష్ అంబానీకి చెందిన యాంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెండవ ప్యాలెస్. దీని విలువ రూ. 15000 కోట్లు కంటే ఎక్కువ. 27 అంతస్తులు కలిగిన ఈ భవనంలో మొదటి ఆరు అంతస్తులలో అంబానీ కుటుంబంలోని వ్యక్తులు ఉన్నారు. మిగిలిన అంతస్తుల్లో ఎన్నెన్నో విలాసవంతమైన సదుపాయాలు ఉన్నట్లు సమాచారం. -
ఒక్క నెయిల్ పాలిష్ ఇన్ని కోట్లా..!! ఆ డబ్బుతో మూడు బెంజ్ కార్లు కొనేయొచ్చు!
ఇప్పటి వరకు గ్లోబల్ మార్కెట్లో అత్యంత ఖరీదైన బైక్ లేదా కారు గురించి విని ఉంటారు. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ గురించి బహుశా విని ఉండకపోవచ్చు. ఈ కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ప్రపంచంలో అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ 'అజాచూర్'. దీని ధర రూ. 1.5 కోట్లకంటే ఎక్కువ. దీని ధర ఎందుకింత ఎక్కువగా ఉందంటే.. కారణం ఈ నెయిల్ పాలిష్‌లో మొత్తం 1,118 వజ్రాలు ఉంటాయని తెలుస్తోంది. అంతే కాకుండా దీని క్యాప్ కూడా డైమండ్ కావడం ఇక్కడ విశేషం. దీనిని లాస్ ఏంజెల్స్‌కు చెందిన డిజైనర్ అజాచూర్ పోగోసియన్ రూపొందించారు. ఈ నెయిల్ పాలిష్ సీసా కూడా చాలా ప్రత్యేకంగా తయారు చేసి ఉంటారు. కావున సీసా కాలి అయిపోయిన తరువాత కూడా దాచుకోవచ్చు. ఈ ఒక్క నెయిల్ పాలిష్ కొనే డబ్బుతో ఏకంగా మూడు మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ కార్లను కొనుగోలు చేయొచ్చు. ఇదీ చదవండి: ఒక్క ఆలోచన రూ.200 కోట్ల సామ్రాజ్యంగా.. దంపతుల ఐడియా అదుర్స్! 2012లో తయారైన ఈ నెయిల్ పాలిష్‌ని ఇప్పటి వరకు 25 మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. సాధారణ ప్రజలు ఇలాంటి ఖరీదైన నెయిల్ పాలిష్ కొనుగోలు చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ డబ్బున్న సంపన్నులు అందరిలోకంటే ప్రత్యేకంగా కనిపించడానికి ఇలాంటి వాటిని కొనుగోలు చేస్తూ ఉంటాయి. -
బంగ్లా ఖరీదే వందల కోట్లు.. ఎవరీ రేణుకా తల్వార్!
దేశంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఎవరిది అంటే.. ముందుగా చాలామందికి ముఖేష్ అంబానీ లేదా గౌతమ్ ఆదానీ వంటి పారిశ్రామికవేత్తల పేర్లే గుర్తొస్తాయి. కానీ ఢిల్లీలో మాత్రం అత్యంత ఖరీదైన ఇల్లు ఒక మహిళకు చెందింది. ఇంతకీ ఆమె ఎవరు, ఆ ఇంటి ఖరీదు ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఢిల్లీలో ఖరీదైన ఇల్లు కలిగిన మహిళ పేరు 'రేణుకా తల్వార్'. ఈమె ప్రముఖ రియల్ ఎస్టేట్ 'కేపీ సింగ్' కుమార్తె. ఈమె కొనుగోలు చేసిన ఇల్లు పృథ్వీరాజ్ రోడ్లో ఉంది. టీడీఐ ఇన్ఫ్రా కార్పొరేషన్ డెవలపర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కమల్ తనేజా ఆమెకు ఈ బంగ్లాను విక్రయించినట్లు సమాచారం. 2016లో ఈ బంగ్లాను రూ. 435 కోట్లతో కొనుగోలు చేసింది. ప్రస్తుతం దీని ధర రూ. 510 కోట్లు వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఇది మన దేశంలో అత్యంత ఖరీదైన బంగ్లాలలో ఒకటిగా నిలిచింది. దీని విస్తీర్ణం దాదాపు 5000 చ.మీ కాగా ఇంటి నిర్మాణ ప్రాంతం రూ. 1189 చ.మీ. అంటే ఈ భారీ విలాసవంతమైన ఇల్లు చదరపు మీటరు ఖరీద్దు ఏకంగా రూ. 8.8 లక్షలు. ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి.. రేణుకా తల్వార్ కంటే ముందు, ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన పృథ్వీరాజ్ రోడ్లో షాహీ ఎక్స్‌పోర్ట్స్ హరీష్ అహుజా రూ. 173 కోట్లతో ఖరీదైన భవనం కొనుగోలు చేశారు. ఇది ప్రస్తుతం ఉన్న రేణుకా తల్వార్ బంగ్లా పరిమాణంలో సగం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె నికర సంపద విలువ ఏకంగా రూ. 2780 కోట్లు వరకు ఉంటుందని సమాచారం.