ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాంపు. నిజానికి దీనిని ముద్రించి, విడుదల చేసినప్పుడు దీని ఖరీదు ఒక సెంటు (నాలుగు పైసలు) మాత్రమే! ఇప్పుడు దీని ధర ఏకంగా 8.5 మిలియన్ డాలర్లు (రూ.70.33 కోట్లు). అవాక్కయ్యారా? దీని ప్రాచీనత కారణంగానే ఇప్పుడు దీనికి ఇంత రేటు పలుకుతోంది. బ్రిటిష్ గయానాకు చెందిన ఈ తపాలా స్టాంపు 1856 నాటిది. బరువు ప్రకారం చూసుకుంటే, ప్రస్తుతానికి ఇదే ప్రపంచంలోని అత్యంత విలువైన వస్తువు. ఈ స్టాంపు బరువు 40 మిల్లీగ్రాములు.
ఇదే బరువు గల నాణ్యమైన వజ్రం ధర దాదాపు 700 డాలర్లు (రూ.58 వేలు). ఇదే బరువు గల ఖరీదైన మాదకద్రవ్యం ఎల్‌ఎస్‌డీ ధర దాదాపు 5000 డాలర్లు (రరూ.4.13 లక్షలు). ఈ లెక్కన బ్రిటిష్ గయానాకు చెందిన ఈ ఒక సెంటు తపాలా స్టాంపు ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అత్యంత విలువైన ఈ స్టాంపు ఇప్పటి వరకు తొమ్మిదిమంది యజమానుల చేతులు మారింది. ఇటీవల జరిగిన వేలంలో స్టేన్లీ గిబ్బన్స్ అనే కంపెనీ దీనిని సొంతం చేసుకుంది.
(చదవండి: చైనాలోని రాచప్రాసాదం.. ఏకంగా 8వేలకు పైగా గదులు)
Comments
Please login to add a commentAdd a comment