Stamp
-
రామాలయం పోస్టల్ స్టాంపు విడుదల
రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందుగా నేడు (గురువారం) శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీనితో పాటు రాముని చిత్రంతో కూడిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రధాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ 48 పేజీల పుస్తకంలో 20 దేశాల స్టాంపులు ఉన్నాయి. రామాలయ పోస్టల్ స్టాంపు విడుదల అనంతరం ప్రధాని మోదీ ఓ వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. ప్రధాని మోదీ మొత్తం 6 తపాలా స్టాంపులను విడుదల చేశారు. వీటిలో రామాలయం, గణేశుడు, హనుమంతుడు, జటాయువు, శబరి మొదలైనవి ఉన్నాయి. ఈ 48 పేజీల పుస్తకంలో అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియా, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు సహా 20కి మించిన దేశాలు విడుదల చేసిన పోస్టల్ స్టాంపులు ఉన్నాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇది కూడా చదవండి: పేరులో రాముడుంటే బంపర్ ఆఫర్! #WATCH | Prime Minister Narendra Modi releases Commemorative Postage Stamps on Shri Ram Janmbhoomi Mandir and a book of stamps issued on Lord Ram around the world. Components of the design include the Ram Mandir, Choupai 'Mangal Bhavan Amangal Hari', Sun, Sarayu River and… pic.twitter.com/X2eZXJzTKz — ANI (@ANI) January 18, 2024 -
అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవాన్ని..57 ఏళ్ల క్రితమే ఊహించారా?
ఈ నెల 22న జరగబోయే బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన కార్యక్రమాలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నేపాల్‌కు చెందిన 57 ఏళ్ల నాటి సీతారాముల స్టాంపు ఒకటి బయటపడింది. సరిగ్గా ఏప్రిల్ 18, 1967న శ్రీరామ నవమి (రాముడి పుట్టినరోజు) సందర్భంగా ఈ స్టాంపును విడుదల చేశారు. ఈ స్టాంప్‌పై నేపాల్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో అనుసరించే హిందూ క్యాలెండర్ అయిన విక్రమ్ సంవత్ 2024 సంవత్సరం ఉంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 1967లో విడుదలైన ఈ స్టాంప్‌పై ఈ ఏడాది రాసి ఉంది. అలాగే హిందువులు అనుసరించే విక్రమ్ సంవత్, గ్రెగోరిన్ క్యాలెండర్ కంటే 57 ఏళ్లు ముందుంటుంది. సరిగ్గా అయోధ్యలో ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు రసవత్తరంగా సాగుతున్న వేళ ఈ స్టాంప్ బయటపడటం రకరకాల ఊహాగానాలుకు తెరతీసింది. అంతేగాదు ఇప్పుడు అయోధ్యలో జరగనున్న రామాలయ ప్రారంభోత్సవాన్ని నేపాల్ 57 ఏళ్ల క్రితమే ఊహించిందా?.. అంటూ చర్చలకు దారితీసింది. అదికూడా సరిగ్గా ఈ టైంలో వెలుగులోకి వచ్చిన ఈ స్టాంప్‌పై ఉన్న సంవత్సరం ఈ ఏడాదిని పోలి ఉండటం అందర్నీ ఆలోచింపచేసేలా ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా ఈ స్టాంప్ విడుదలైన సంవత్సరం ఆలయ ప్రతిష్టాపన సంవత్సరంతో సరిపోలింది. 2024లో రాముడు తన జన్మభూమి అయిన అయోధ్యకి తిరిగి వస్తాడని 57 ఏళ్ల కిత్రం నేపాల్‌లో ఈ స్టాంప్ విడుదలైనప్పుడు ఎవరూ ఊహించి ఉండరు కదా!. ఇదిలా ఉండగా, ఈనెలలో జరగనున్న రామ ప్రాణప్రతిష్టాపన కోసం 56 అంగుళాల పొడవుతో సింహగర్జనతో కూడిన డ్రమ్ అయోధ్యకు పెద్ద ఊరేగింపుగా వచ్చింది. దీన్ని ఆలయంలో ఉంచుతారు. అలాగే ఎనిమిది లోహాలతో కూడిన శంఖం కూడా ప్రాణ ప్రతిష్టాపన సమయంలో బాల రాముడి పాదాల వద్ద ఉంటుంది. ఈ శంఖాన్ని అలీఘర్ నివాసి విరాళంగా ఇచ్చారు. కాగా, ఈ నెల 22న జరగనున్న భవ్య రామాలయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ వంటి ప్రముఖులు హాజరుకానున్నారు. దాదాపు ఏడు వేల మంది ప్రముఖ ఆహ్వానితులలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వారు ఉన్నారు. (చదవండి: రూ. 500 నోట్లపై శ్రీరాముడ ముఖచిత్రం..వైరల్) -
ప్రపంచంలోనే తొలి పోస్టల్ స్టాంప్ వేలానికి
సాక్షి, నేషనల్ డెస్క్... ప్రపంచంలోనే మొదటిదని భావిస్తున్న 180 ఏళ్ల నాటి పోస్టల్ స్టాంప్ వేలానికి వచ్చింది. ఒక పెన్నీ ముఖ విలువతో కూడిన దీనికి దాదాపు రూ.20 కోట్ల (25 లక్షల డాలర్ల) దాకా పలకవచ్చని భావిస్తున్నారు. 1850 మే 2 నాటి తేదీ ఉన్న ఈ నల్లరంగు స్టాంప్‌ను పెన్నీ బ్లాక్ స్టాంప్‌గా పిలుస్తారు. ఇంగ్లండ్‌లో బెడ్లింగ్టన్ పట్టణానికి చెందిన విలియం బ్లెంకిన్స్లోప్ అనే వ్యక్తికి అక్కడికి 300 మైళ్ల దూరంలోని లండన్ నుంచి పంపిన లెటర్‌పై దీన్ని అంటించారు. ఇలా స్టాంపులంటించడం ద్వారా పోస్టేజీ చార్జీలను ముందుగానే చెల్లించే పద్ధతి అప్పటిదాకా ఉండేది కాదు. లెటర్లను అందుకునే వాళ్లే పోస్ట్‌మాన్‌కు పోస్టేజ్ రుసుము చెల్లించేవాళ్లు. వాళ్లు గనక లెటర్లను తీసుకునేందుకు నిరాకరిస్తే పోస్టల్ శాఖకు నష్టమే మిగిలేది. దీనికి చెక్ పెట్టేందుకు సర్ రోలాండ్ హిల్ ఈ పెన్నీ బ్లాక్ పోస్టల్ స్టాంప్‌ను రూపొందించాడు. ప్రఖ్యాత వేలం సంస్థ సోత్బీ ఫిబ్రవరిలో దీన్ని వేలం వేయనుంది. ప్రపంచ సమాచార వ్యవస్థలోనే విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఈ పోస్టల్ స్టాంప్ వేలానికి రావడం ఎంతో ఎక్సైటింగ్‌గా ఉందని సోత్బీ గ్లోబల్ హెడ్ రిచర్డ్ ఆస్టిన్ అన్నారు. చదవండి: లండన్ మేయర్ ఎన్నికల బరిలో ఇద్దరు భారత సంతతి వ్యాపారవేత్తలు -
మనసైన మరో ప్రపంచంలోకి... ప్రకృతి అనేది మనిషికి అతి పెద్ద పాఠశాల.
జలపాతాల నుంచి పంటచేల వరకు ప్రతిదీ ఏదో ఒక పాఠం చెబుతూనే ఉంటుంది. అందుకే ప్రకృతి పిల్లలకు నచ్చిన ప్రపంచం. ‘చిల్ట్రన్–ఫ్రెండ్లీ వరల్డ్’ అంశంపై రిజు వేసిన పెయింటింగ్... పిల్లలకూ ప్రకృతి ప్రపంచానికి మధ్య ఉండే అనుబంధానికి అద్దం పడుతుంది. ఈ పెయింటింగ్ చిల్డ్రన్స్ డే స్పెషల్ స్టాంప్ కోసం ఎంపికైంది... కేరళ స్టేట్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక స్టాంప్‌ను విడుదల చేస్తుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అయిదు నుంచి పదకొండవ తరగతి విద్యార్థులు ఈ పోటీలో పాల్గొంటారు. ఈ స్టాంపుల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని పిల్లల సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తుంటారు. ఈ సంవత్సరం రిజు వేసిన పెయింటింగ్ చిల్డ్రన్స్ డే స్టాంప్ కోసం ఎంపికైంది. ‘చిల్డ్రన్–ఫ్రెండ్లీ వరల్డ్ థీమ్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. ప్రకృతి కూడా గురువులాంటిదే అనే ఐడియాతో ఈ బొమ్మ వేశాను. ప్రకృతి, విద్యాప్రపంచం రెండూ కలిసిపోయి కనిపించేలా బొమ్మ వేశాను’ అంటుంది కోచిలోని సెయింట్ థామస్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న రిజు. ‘రిజు పెయింటింగ్ అద్భుతమైన ఊహతో భావగర్భితంగా ఉంది’ అని జ్యూరీ ప్రశంసించింది. ‘నిజంగా చెప్పాలంటే బహుమతి వస్తుంది అనుకోలేదు. నేనే కాదు నా తల్లిదండ్రులు, టీచర్లు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ పోటీలో పాల్గొనడంలో భాగంగా రకరకాల స్కెచ్‌లు వేశాను. అయితే అవేమీ నాకు నచ్చలేదు. ఆలోచిస్తున్న కొద్దీ కొత్త కొత్త ఆలోచనలు వచ్చేవి. ఆలోచిస్తున్న క్రమంలో ప్రకృతి ప్రపంచాన్ని పుస్తకంగా అనుకున్నాను. ఆ పుస్తకం తెరుచుకున్నప్పుడు ఆ దారుల్లో పిల్లలు ఉత్సాహంగా పరుగులు తీస్తుంటారు. ఈ ఊహతో పెయింటింగ్ వేసినప్పుడు చాలా సంతృప్తిగా అనిపించింది. నేను వేసిన పెయింటింగ్ స్టాంప్‌గా ఎంపిక కావడం, స్టాంప్‌లు నాన్న వృత్తిలో భాగం కావడం ఆనందంగా ఉంది ’ అంటుంది రిజు. రిజు తండ్రి రాజేష్ పరక్కాడవు పోస్ట్ ఆఫీసులో పోస్ట్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. ‘రోజూ తప్పకుండా ఏదో ఒక పెయింటింగ్ వేస్తుంటుంది రిజు. చిత్రకళకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటుంది. తన పెయింటింగ్ స్టాంప్‌గా ఎంపిక కావడం రిజూకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. భవిష్యత్తు్తలో ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను’ అంటున్నారు రిజు తండ్రి రాజేష్. బాలల దినోత్సవం సందర్భంగా తిరువనంతపురంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ సమక్షంలో ‘చిల్డ్రన్–ఫ్రెండ్లీ వరల్డ్’ స్టాంప్‌ను అధికారికంగా విడుదల చేస్తారు. -
బ్రిటీష్ కాలం నాటిది, ప్రపంచంలోనే ఖరీధైన స్టాంపు.. ధర ఎంతంటే..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాంపు. నిజానికి దీనిని ముద్రించి, విడుదల చేసినప్పుడు దీని ఖరీదు ఒక సెంటు (నాలుగు పైసలు) మాత్రమే! ఇప్పుడు దీని ధర ఏకంగా 8.5 మిలియన్ డాలర్లు (రూ.70.33 కోట్లు). అవాక్కయ్యారా? దీని ప్రాచీనత కారణంగానే ఇప్పుడు దీనికి ఇంత రేటు పలుకుతోంది. బ్రిటిష్ గయానాకు చెందిన ఈ తపాలా స్టాంపు 1856 నాటిది. బరువు ప్రకారం చూసుకుంటే, ప్రస్తుతానికి ఇదే ప్రపంచంలోని అత్యంత విలువైన వస్తువు. ఈ స్టాంపు బరువు 40 మిల్లీగ్రాములు. ఇదే బరువు గల నాణ్యమైన వజ్రం ధర దాదాపు 700 డాలర్లు (రూ.58 వేలు). ఇదే బరువు గల ఖరీదైన మాదకద్రవ్యం ఎల్ఎస్డీ ధర దాదాపు 5000 డాలర్లు (రరూ.4.13 లక్షలు). ఈ లెక్కన బ్రిటిష్ గయానాకు చెందిన ఈ ఒక సెంటు తపాలా స్టాంపు ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అత్యంత విలువైన ఈ స్టాంపు ఇప్పటి వరకు తొమ్మిదిమంది యజమానుల చేతులు మారింది. ఇటీవల జరిగిన వేలంలో స్టేన్లీ గిబ్బన్స్ అనే కంపెనీ దీనిని సొంతం చేసుకుంది. (చదవండి: చైనాలోని రాచప్రాసాదం.. ఏకంగా 8వేలకు పైగా గదులు) -
చిరుధాన్యాలతో అద్భుతం.. చూడచక్కని ఐటీసీ పోస్టల్ స్టాంప్
న్యూఢిల్లీ: ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుతున్న నేపథ్యంలో వ్యాపార దిగ్గజం ఐటీసీ, తపాలా శాఖ కలిసి మిల్లెట్స్‌పై ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించాయి. ఐటీసీ హెడ్ (అగ్రి బిజినెస్) ఎస్ శివకుమార్, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాస్ చౌదరి, తపాలా శాఖ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ మంజు కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా చిరుధాన్యాలపై అవగాహన పెంచే లక్ష్యంతో ఈ స్టాంపును తీర్చిదిద్దారు. మిల్లెట్లను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నట్లు ఎస్ శివకుమార్ తెలిపారు. ‘శ్రీ అన్న’ను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను కైలాశ్ చౌదరీ ఈ సందర్భంగా వివరించారు. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాంపు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాంపు. నిజానికి దీనిని ముద్రించి, విడుదల చేసినప్పుడు దీని ఖరీదు ఒక సెంటు (నాలుగు పైసలు) మాత్రమే! ఇప్పుడు దీని ధర ఏకంగా 8.5 మిలియన్ డాలర్లు (రూ.70.33 కోట్లు). అవాక్కయ్యారా? దీని ప్రాచీనత కారణంగానే ఇప్పుడు దీనికి ఇంత రేటు పలుకుతోంది. బ్రిటిష్ గయానాకు చెందిన ఈ తపాలా స్టాంపు 1856 నాటిది. బరువు ప్రకారం చూసుకుంటే, ప్రస్తుతానికి ఇదే ప్రపంచంలోని అత్యంత విలువైన వస్తువు. ఈ స్టాంపు బరువు 40 మిల్లీగ్రాములు. ఇదే బరువు గల నాణ్యమైన వజ్రం ధర దాదాపు 700 డాలర్లు (రూ.58 వేలు). ఇదే బరువు గల ఖరీదైన మాదకద్రవ్యం ఎల్ఎస్డీ ధర దాదాపు 5000 డాలర్లు (రరూ.4.13 లక్షలు). ఈ లెక్కన బ్రిటిష్ గయానాకు చెందిన ఈ ఒక సెంటు తపాలా స్టాంపు ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అత్యంత విలువైన ఈ స్టాంపు ఇప్పటి వరకు తొమ్మిదిమంది యజమానుల చేతులు మారింది. ఇటీవల జరిగిన వేలంలో స్టేన్లీ గిబ్బన్స్ అనే కంపెనీ దీనిని సొంతం చేసుకుంది. -
ప్రపంచంలోనే చిన్న టీవీ వచ్చేసింది, ధర వింటే?
టీవీ అనగానే ఒకప్పుడు 21 అంగుళాలవే ఉండేవి.. ఇప్పుడు ఏకంగా 75 అంగుళాలు అంతకన్నా ఎక్కువ సైజుల్లోనూ లభిస్తున్నాయని తెలుసు.. కానీ ఈ భారీ సైజులకు పూర్తి వ్యతిరేకంగా ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్న టీవీలను అమెరికాకు చెందిన టైనీ సర్క్యూట్స్ అనే కంపెనీ తయారు చేసింది. చిన్న టీవీలు అనగానే ఏదో మన స్మార్ట్ఫోన్ల సైజులో ఉంటాయిలే.. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకోకండి.. ఎందుకంటే ఇవి అంతకన్నా చిన్నవి మరి!! అంటే ఒక పోస్టల్ స్టాంపు సైజులో కేవలం అర అంగుళం, అంగుళం సైజుల్లో తయారైనవి అన్నమాట!! మార్కెట్లో టీవీల సైజులు రోజురోజుకూ పెరుగుతుంటే ఈ కంపెనీ మాత్రం ఇలా వెరైటీగా బుజ్జిబుజ్జి టీవీలను తయారు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు నమూనా టీవీలను తాజాగా ఆవిష్కరించింది. 0.6 అంగుళాల తెరతో టీనీటీవీని, ఒక అంగుళం స్క్రీన్‌తో టైనీటీవీ–2ను తీసుకొచ్చింది. పాతకాలం టీవీల్లో చానళ్లు మార్చుకొనేందుకు, వాల్యూమ్ పెంచుకొనేందుకు వీలుగా ఉండే గుండ్రటి నాబ్లను వీటికి కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ టీవీల్లో సాధారణ చానళ్ల ప్రసారాలు మాత్రం రావు! మరి ఇంకేం వస్తాయంటారా? ఈ టీవీల్లో అమర్చిన 8 జీబీ మెమరీ కార్డుల ద్వారా 10 గంటల నుంచి 40 గంటల వరకు వీడియోలను ప్లే చేసుకోవచ్చు. అయితే వీటిలో కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ వీడియోలను కూడా కంపెనీ సిద్ధం చేసింది. ఈ బుజ్జి టీవీల్లో మరో ప్రత్యేకత ఏమిటంటే కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్‌లో ఉండే ఫేవరేట్ సినిమాలు, వ్యక్తిగత వీడియోల ఫైళ్లను కంపెనీ అందించే ఉచిత సాఫ్ట్వేర్ ద్వారా వేరే ఫార్మాట్లోకి మార్చుకొని ఇందులో వీక్షించొచ్చు. ఇంతకీ వీటి ధర ఎంతో తెలుసా సుమారు 4-5 వేల రూపాయలు. -
Punganur Cow: బుల్లి ఆవుకు అరుదైన గౌరవం
పుంగనూరు(చిత్తూరు జిల్లా): పుంగనూరు జాతి ఆవులను క్రీ.శ. 610 సంవత్సరంలో గుర్తించినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. బాణులు, నోళంబులు, వైదంబ చోళ ప్రభువులు పుంగనూరు ఆవును పోషించేవారు. పుంగనూరు నుంచి తిరుపతి వరకు గల అప్పటి అభయారణ్యంలో పుంగనూరు ఆవులు అభివృద్ధి చెందాయి. చదవండి: చుక్క గొరక.. సాగు ఎంచక్కా! ఆవుల విశిష్టత భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పుంగనూరు ఆవులు చిన్న అకారాన్ని కలిగి ఉంటాయి. మంచి ఔషధ గుణాలు, స్నేహపూర్వకంగా మెలుగుతాయి. ప్రపంచ దేశాల్లో ఈ ఆవు పాలకు మంచి గిరాకీ ఉంది. తెలుపు, నలుపు వర్ణాలతో ఉంటాయి. ఈ ఆవు పాలలో ఉన్న ఔషధ గుణాలు మరే పాలలోనూ లేదని బయోడైవర్సిటీ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ ఆవుల చరిత్ర, విశిష్టత గురించి మద్రాస్ ప్రభుత్వం అప్పట్లో గెజిట్‌ను విడుదల చేసింది. అలాగే కేఎస్ఎస్ శేషన్ అనే రచయిత తన పరిశోధనాత్మక పుస్తకం బ్రిటీష్ రోల్ ఇన్ రూరల్ ఎకానమీలో పుంగనూరు ప్రాంత ఆవుల గురించి జమీందారులు చేపట్టిన సంరక్షణ చర్యలను విశదీకరించారు. రూ.70 కోట్లతో పరిశోధన కేంద్రం ఈ జాతి ఆవులు అంతరించిపోతుండడంతో వీటిని అభివృద్ధి చేసేందుకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో రూ.70 కోట్లతో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్శా ఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి పుంగనూరు జాతి ఆవుకు తగిన గుర్తింపునకు చర్యలు తీసుకున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా పోస్టల్ స్టాంపు, కవర్ విడుదల చేయడంలో సఫలీకృతులయ్యారు. ఆవుకు జాతీయ గుర్తింపు రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకతలు ♦ఈ ఆవులు 70 నుంచి 90 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. ♦ఎద్దులు కూడా ఇదే పరిణామంలో ఉంటాయి. ♦పుంగనూరు ఆవులను దేవతా గోవులుగా పిలుస్తారు. ♦సాధారణ గోవు పాలలో 3 నుంచి 3.5 శాతం వరకు కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఈ జాతి ఆవు పాలలో 8 శాతం కొవ్వు పదార్థాలతో పాటు పూర్తిగా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ♦ఈ జాతి ఆవులు 115 నుంచి 200 కిలోల బరువు కలిగి ఉంటుంది. ♦ప్రతి రోజూ ఒక ఆవు 5 కిలోల పచ్చిగడ్డిని తింటుంది. ♦2 నుంచి 4 లీటర్ల వరకు పాల దిగుబడి ఇస్తుంది. ♦ఎంత కరువు పరిస్థితులు ఎదురైనా తట్టుకుని జీవించగలవు. ♦లేత చర్మం, చిన్న పొదుగు, చిన్న తోక, చిట్టికొమ్ములు కలిగి నలుపు, తెలుపు వర్ణంలో ఉంటాయి. ♦వీటి ధర రూ. లక్ష నుంచి రూ. 20 లక్షల వరకు ఉంటుంది. -
ఆ స్వీటుకు అంతర్జాతీయ గుర్తింపు, వందేళ్లకు పైగా చరిత్ర.. తాజాగా మరో గుర్తింపు!
సాక్షి, విశాఖపట్నం: మీకు తెలుసా కాకినాడ కాజాకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ కాజాను దక్షిణ భారతంలో ప్రసిద్ధి వంటకంగా పేరుంది. 1891లో తొలిసారిగా ఈ గొట్టం కాజా తయారీ జరిగింది. కోటయ్య అనే ఆయన తొలిసారి ఈ కాజాను తయారు చేశారు. 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కాజాకు జియోగ్రాఫిక్ ఇండికేషన్ సౌకర్యం కల్పించి అంతర్జాయంగా మరింత ప్రచారం కల్పించింది. ప్రత్యేక పోస్టల్ కవర్ విడుదల ద్వారా కాకినాడ గొట్టం కాజా చరిత్రను తపాలా శాఖ మరోసారి నేటి తరానికి అందించింది. దీంతో పాటు మాడుగుల హల్వా విశిష్టతను సైతం ప్రత్యేక పోస్టల్ కవర్ ద్వారా వెలుగులోకి తెచ్చింది. విశాఖ జిల్లా మాడుగుల వేదికగా 1890లో తొలిసారి తయారు చేసిన ఈ హల్వాకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. గోధుమపాలు, నెయ్యి, జీడిపప్పు, బాధం పప్పుS సమాహారంగా మాడుగుల వాసులు ఈ రుచికరమైన హల్వాను తయారు చేస్తున్నారు. ఈ హల్వా లైంగిక సామర్థ్యం పెంచే గుణం కూడా ఉన్నట్లు అంతర్జాతీయంగా ప్రచారం ఉంది. దీంతో పాటు ఆత్రేయపురం పూతరేకుల విశిష్టతపైనా తపాలా శాఖ ప్రత్యేక పోస్టల్ కవర్‌ను ముంద్రించి ఆ విశిష్టతలను ప్రస్తుత తరానికి అందించింది. చదవండి: కాళ్లకు తాడు కట్టుకుని బావిలో ఈత.. ఎలా సాధ్యం? -
అరుదైన గౌరవం..మురిసిపోతున్న అనసూయ
టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు అరుదైన గౌరవం లబించింది. ‘తెలంగాణ చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్’ ఆమెను తన సొంత పోస్టల్ స్టాంప్‌తో సత్కరించింది. అంతేగాక అనసూయ ఫోటోకి ఎర్రకోటని జోడించడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా అనసూయ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా అనసూయ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చిత్రపురికి కృతజ్ఞతలు తెలియజేశారు. స్టాంప్ అందుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘జీవితంలో అంతకు మించిన గౌరవం ఏం ఉంటుంది. నా సొంత పోస్టల్ స్టాంపులు. ఇందుకు అర్హురాలు అయ్యేందుకు నేనేం చేశానో నాకు తెలీదు. చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ !! ఈ విలాసానికి ముందే నేను మీ గురించి గర్వపడుతున్నాను. ప్రోత్సహించడానికి మీరు చేస్తున్న గొప్ప ప్రయత్నమిది. మీరు చేస్తున్న గొప్ప పనుల కోసం నేను చేయగలిగినదంతా చేస్తానని మాటిస్తున్నాను’ అని ఉద్వేగానికి లోనయ్యారు అనసూయ. కాగా చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ ఈ సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా స్పూర్తిని నింపే ఎంతో మంది మహిళల ఘనతకు సంబంధించిన కథలను వెల్లడించనుంది. అంతగా ఏం సాధించానో తెలియదని అనసూయ అనడం తన నిరాడంబరతను వ్యక్తం చేస్తోంది. అయితే ఓ సక్సెస్ఫుల్ వుమెన్‌గా అనసూయకు ఈ గౌరవం లభించడం సరైనదేనని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: నోరుపారేసుకున్న నెటిజన్.. అనసూయ గట్టి కౌంటర్ స్పెషల్ సాంగ్ కోసం అనసూయ భారీ రెమ్యునరేషన్ -
రైలు దిగగానే.. స్టాంప్ వేసేశారు!
రాయ్‌పూర్: రైళ్ల పునరుద్ధణ నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీ నుంచి బయలుదేరిన రాజధాని ప్రత్యేక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం మధ్యాహ్నం చత్తీస్గడ్ చేరుకుంది. రైలు దిగిన ప్రయాణికులతో రాయ్‌పూర్ రైల్వేస్టేషన్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రయాణికులను రైల్వేస్టేషన్ నుంచి క్వారెంటైన్‌ను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. చెరగని సిరాతో ప్రయాణికుల అరచేతిపై క్వారంటైన్ ముద్ర వేస్తున్నారు. స్పష్టంగా కనిపించేలా పెద్ద స్టాంప్‌తో కుడి చేతిపై ముద్రిస్తున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత స్వస్థలానికి రావడం పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. రైలులో ఏర్పాట్లు బాగున్నాయని కితాబిచ్చారు. ‘ప్రయాణం బాగుంది. సరైన ఏర్పాట్లు చేశారు. భౌతిక దూరం పాటించామ’ని ప్రయాణికులు చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మంగళవారం బయలుదేరిన 8 ప్రత్యేక రైళ్లు గమ్యానికి చేరుకున్నాయి. (ఆ రైళ్లను ఎక్కువ చోట్ల ఆపండి.. ) చత్తీస్‌గఢ్‌లో కరోనా వ్యాప్తి తక్కువగానే ఉంది. కేంద్ర వైద్యారోగ్య తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు చత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 54 మంది కోలుకున్నారు. కోవిడ్-19 కారణంగా రాష్ట్రంలో ఒక్క మరణం కూడా సంభవించలేదు. (ప్రధాని మోదీ ప్రసంగం.. అర్థం ఏంటో!) -
ప్రయాణికులకు హోమ్ క్వారంటైన్ ముద్ర
సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్(కోవిడ్-19) నివారణ చర్యలకు ఆయా ప్రభుత్వాలు పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు సైతం మూసివేశాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి ఎయిర్‌పోర్టులో దిగుతున్న ప్రయాణికులకు హోమ్ క్వారంటైన్(గృహ నిర్బంధం) ముద్ర వేస్తోంది. ప్రయాణికుల ఎడమ చేతి వెనకవైపు ఎన్నిరోజులు ఇంటి నుంచి బయటకు రాకూడదో తెలిపే తేదీని సిరాతో ముద్రిస్తున్నారు. తాజాగా ఇదే విధానాన్ని కర్ణాటక ప్రభుత్వం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. (‘హృదయ విదారకం.. కన్నీళ్లు ఆగడం లేదు’) బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు స్టాంప్‌లు వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానం వల్ల కరోనా అనుమానితులను గుర్తించడం సులభతరం అవుతుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ ప్రయాణికులు 14 రోజులపాటు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండేందుకు చేతిపై తేదీని సైతం ముద్రించనుంది. కాగా గురువారం ఉదయం నాటికి దేశంలో 170 కోవిడ్-19 కేసులు నమోదవగా ముగ్గురు మరణించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 47, కేరళలో 25, కర్ణాటకలో 14 కరోనా కేసులు నమోదయ్యాయి. (కరోనా అసలైన మాత్ర: ధైర్యం 500 ఎం.జి.) చదవండి: కరోనా.. భారత్ గట్టెక్కాలంటే వీటిని పాటించాల్సిందే! -
కరోనా అనుమానితుల చేతిపై స్టాంపులు
ముంబై : భారత్‌లో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లలోనే క్వారంటైన్ చేయబడిన కరోనా అనుమానితుల ఎడమ చేతిపై సిరాతో స్టాంపులను వేస్తోంది. ఆ స్టాంప్‌లో ‘ముంబై ప్రజలను రక్షిస్తున్నందుకు గర్వపడుతున్నాను’ అని రాసి ఉంచారు. అలాగే వారి ఎప్పటివరకు క్వారంటైన్లో ఉండాలో కూడా పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా కరోనా అనుమానితులను గుర్తించడం సులభతరం అవుతుందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. ఎన్నికల సమయంలో ఓటర్ల వేలిపై ఎలానైతే సిరా చుక్క అంటించిన విధంగానే కరోనా అనుమానితుల చేతిపై చెరగని సిరాతో స్టాంప్ వేస్తున్నామని చెప్పారు. కరోనా అనుమానితులు ఒకవేళ స్వీయ నిర్బంధాన్ని ఉల్లంఘిస్తే ఇతరులు వారిని గుర్తించేందుకు తోడ్పడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నుట్ట చెప్పారు. కాగా, గతంలో కొందరకు కరోనా అనుమానితులు ఆస్పత్రుల నుంచి పారిపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 126 మందికి కరోనా సోకిందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు మంగళవారం మృతిచెందడంతో.. భారత్‌లో కరోనా మృతుల సంఖ్య మూడుకి చేరింది. చదవండి : కరోనా: వివాదం రేపిన ట్రంప్ ట్వీట్ -
బాపూ నీ బాటలో..
ఐక్యరాజ్యసమితి: మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఐక్యరాజ్యసమితి ప్రత్యేకంగా రూపొందించిన గాంధీ స్టాంపుని ప్రపంచదేశాల అధినేతల సమక్షంలో బుధవారం విడుదల చేశారు. ఇదే సందర్భంగా ‘‘నాయకత్వ లక్షణాలు సమకాలీన ప్రపంచంలో గాంధీ సిద్ధాంతాల ఔచిత్యం’’అనే అంశంపై మోదీ మాట్లాడారు. సమష్టి పోరాటం, సంయుక్త లక్ష్యాలు, నైతిక ప్రమాణాలు, ప్రజా ఉద్యమాలు, వ్యక్తిగత బాధ్యత వంటి అంశాలపై గాంధీజీకి ఎనలేని విశ్వాసం ఉందని సమకాలీన ప్రపంచానికి కూడా అవి వర్తిస్తాయని అన్నారు.హింసాత్మక ఘర్షణలు, ఆర్థిక అసమానతలు, సామాజిక ఆర్థిక అణచివేత, వాతావరణంలో అనూహ్య మార్పులు వంటివి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రభావితం చూపిస్తున్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటిని ఎదుర్కోవడానికి నాయకత్వ లక్షణాలే అత్యంత ముఖ్యమని గాంధీ విలువలు, పాటించిన సిద్ధాంతాలే నాయకత్వ లక్షణాల్ని పెంపొందిస్తాయని అన్నారు. ‘‘గాంధీజీ భారతీయుడే. కానీ కేవలం ఆయన భారత్‌కు మాత్రమే పరిమితం కాదు. ఎందరో ప్రపంచ అధినేతలపై గాంధీజీ ప్రభావం ఉంది. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా వంటి నేతలు గాంధీ సిద్ధాంతాలు, ఆశయాలతో స్ఫూర్తి పొందారు. గాంధీతో వ్యక్తిగత పరిచయం లేని వారు కూడా ఆయనకు ఆకర్షితులయ్యారంటే ఆయన ఔన్నత్యం ఎలాంటితో అర్థమవుతుంది’’అని మోదీ అన్నారు. అందరినీ ఎలా ఆకట్టుకోవాలో అన్న ప్రపంచంలో మనం ఇప్పుడు బతికేస్తున్నాం కానీ గాంధీజీ అందరిలోనూ ఎలా స్ఫూర్తి నింపాలో అన్న ఆశయంతో జీవించారు అని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతకాలంలో ప్రజాస్వామ్యానికి అర్థం కుచించుకుపోతోంది. ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, ప్రభుత్వం వారి ఆకాంక్షల మేరకు పనిచేయాలి. కానీ గాంధీ మాత్రం ప్రజలు ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వావలంబన సాధించాలని కోరుకున్నారని మోదీ గుర్తు చేశారు. ఇదే కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ మాట్లాడుతూ అంటరాని వారు అంటూ సమాజం హేళన చేసిన వర్గాల్ని హరిజనులు, దేవుని పిల్లలంటూ గాంధీజీ అక్కున చేర్చుకున్న విధానం అందరిలోనూ స్ఫూర్తిని రగిలిస్తుందని అన్నారు. నిమ్న వర్గాల దృష్టి కోణం నుంచే సమాజాన్ని చూసి గొప్ప నాయకుడిగా అవతరించారని, ఆయన ఆదర్శాలు ప్రపంచానికే పాఠాలు నేర్పుతాయని అంటోనియో గుటరెస్ అన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఐక్యరాజ్యసమితికి భారత్ కానుకగా ఇచ్చిన సోలార్ పార్క్‌ను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. ఖాదీ కర్చీఫ్ కానుక ఇదే సందర్భంలో గాంధీ ఇచ్చే కానుకల గురించి మోదీ గుర్తు చేసుకున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం బ్రిటన్ రాణి ఎలిజబెత్‌ను మోదీ కలిసినప్పుడు ఆమె ఖాదీతో చేసిన చిన్న రుమాలుని చూపించారట. రాణి వివాహ సమయంలో గాంధీ స్వయంగా ఆ ఖాదీ కర్చీఫ్ ఆమెకి కానుకగా ఇచ్చారని రాణి చెప్పారట. ఈ విషయాన్ని చెబుతూ రాణి ఎలిజబెత్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారని మోదీ వెల్లడించారు. ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మక పురస్కారం న్యూయార్క్: మహాత్మాగాంధీ 150 జయంత్యుత్సవాలను జరుపుకుంటున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అరుదైన గౌరవం దక్కింది. బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రతీ ఏడాది ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు మోదీకి దక్కింది. భారత్‌ను పరిశుభ్రంగా ఉంచడానికి మోదీ సర్కార్ చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ ఐక్యరాజ్య సమితి విధించిన లక్ష్యాలను చేరుకోవడంతో ఈ అవార్డు ఇస్తున్నట్టు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. మంగళవారం రాత్రి న్యూయార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు. ‘మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఈ అవార్డు రావడం వ్యక్తిగతంగా నాకెంతో ప్రత్యేకం’ అని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
స్టాంపు కుంభకోణం కేసులో 8మంది సస్పెండ్
సాక్షి, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్‌లోని రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎనిమిది మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. 2014వ సంవత్సరంలో స్టాంపుల క్రయవిక్రయాలకు సంబంధించిన కుంభకోణంలో పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో కేసు నమోదునమోదై విచారణ జరుగుతుంది. స్టాంపుల కుంభకోణంలో భాగంగా మంగళవారం రోజు ఎనిమిది మందిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో నలుగురు సబ్ రిజిస్టార్లతోపాటు నలుగురు ఉద్యోగులు ఉన్నారు. అప్పట్లో జరిగిన ఈ కుంభకోణంలో 70 లక్షల రూపాయల మేర క్రయవిక్రయాల్లో భారీ అవినీతి జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పలు కోణాల్లో విచారణ జరిపిన అధికారులు వారిని సస్పెండ్ చేశారు. -
గోమతి చిత్రంతో తపాలా బిళ్ల
తిరువొత్తియూరు: దోహాలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ పోటీలో బంగారం పతకం సాధించిన గోమతి పేరుతో తపాళా బిళ్లను బుధవారం విడుదల చేశారు. తిరుచ్చి ముడి కన్నడం గ్రామానికి చెందిన గోమతి ఖతర్‌లోని దోహాలో జరిగిన అథ్లెటిక్స్ పోటీలో 800 మీటర్ల పరుగు పందెం విభాగంలో బంగారు పతకం సాధించారు. ఈ పోటీలో భారతదేశానికి దక్కిన మొదటి బంగారు పతకం ఇదే కావడం విశేషం. భారతదేశానికి కీర్తిని తెచ్చిపెట్టిన క్రీడాకారిణి గోమతికి ప్రోత్సాహకాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో గోమతి విజయానికి చిహ్నంగా ఆమె ఫొటోతో కూడిన రూ.5 విలువ గల తపాలా బిళ్లను విడుదల చేశారు. ఆ తపాలా బిళ్లలో బంగారం పతకం చూపిస్తున్న గోమతి, పక్కన ఎర్రకోట ముద్రింపబడి ఉంది. ఆ తపాలా బిళ్లను తిరుచ్చి తపాలా ప్రధాన కేంద్రం అధికారులు క్రీడాకారిణి గోమతికి అందచేశారు. -
మైస్టాంప్స్‌లోనే గ్రీటింగ్‌కు అవకాశం
- తపాలా వినియోగదారులకు నూతన సంవత్సర కానుక - పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు వెల్లడి కర్నూలు (ఓల్డ్‌సిటీ): తపాలా వినియోగదారులకు ఆ శాఖ అధికారులు నూతన సంవత్సర కానుకగా 'మైస్టాంప్'లో సొంత ఫొటోతో పాటు గ్రీటింగ్స్ చెప్పుకునే సదుపాయం కూడా కల్పించారు. పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు శుక్రవారం తన ఛాంబరులో మొదటి ఇద్దరు వినియోగదారులకు వారి ఫొటోలతో ఉన్న గ్రీటింగ్ మైస్టాంప్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాలకే పరిమితమైన పోస్టల్ శాఖ కాలానుగుణంగా నిత్యనూతన సేవలను అందిస్తోందన్నారు. కొత్త సంవత్సరంలో బంధు మిత్రులకు గ్రీటింగ్స్ పంపించుకుంటారని, అయితే ఆ గ్రీటింగ్ కవర్‌పై అతికించిన స్టాంపులు సైతం సొంత ఫొటోతో ఉండటం, ఆపై అందులో 'హ్యాపీ న్యూఇయర్' అంటూ గ్రీటింగ్స్ కూడా ముద్రించి ఉండటం వినియోగదారులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందన్నారు. వినియోగదారులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
కార్యాలయాలు కిటకిట
రేపటి నుంచి విలువల పెంపు కక్షిదారుల ఉరుకులు పరుగులు హడావుడిగా రిజిస్ట్రేషన్లు విజయవాడ : జిల్లాలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం భూములు, స్థలాల రిజిస్ట్రేషన్, మార్కెట్ విలువలు పెంచనుంది. ఈ క్రమంలో విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని 28 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గత కొద్దిరోజులుగా రిజిస్ట్రేషన్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గతంలో విక్రయాలు జరుపుకొని అగ్రిమెంట్ల మీద ఉన్న ఆస్తులను హడావుడిగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. మార్కెట్ విలువలు 20 నుంచి 30 శాతం పెరగనుండటంతో, స్టాంప్ డ్యూటీ భారం కొనుగోలుదారులపై పడుతుందని కక్షిదారులు పెండింగులో ఉన్న లావాదేవీలను అత్యవసరంగా పూర్తి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గత నెలకంటే జూలైలో అన్ని రిజిస్ట్రేషన్లు అధికంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా జూన్‌లో 15 వేల 81 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగగా, జూలైలో 20 వేల 764 అంటే దాదాపు ఐదు వేల రిజిస్ట్రేషన్లు అధికంగా జరిగాయి. జిల్లాలో మూడు డీఆర్ కార్యాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో గత రెండు మాసాలుగా లభించిన ఆదాయం వివరాలిలా ఉన్నాయి. జూన్‌లో విజయవాడ వెస్ట్ డీఆర్ కార్యాలయం పరిధిలో రూ.25.44 కోట్లు లక్ష్యం కాగా, రూ.16.41 కోట్ల ఆదాయం లభించింది. విజయవాడ తూర్పు డీఆర్ కార్యాలయం పరిధిలో రూ.22.48 కోట్లు లక్ష్యం నిర్ణయించగా, రూ.12.43 లక్షల ఆదాయం వచ్చింది. మచిలీపట్నం డీఆర్ కార్యాలయం పరిధిలో రూ.11.52 లక్ష్యం కాగా, రూ.8.27 కోట్ల మేర ఆదాయం లభించింది. జూలైలో విజయవాడ వెస్ట్ డీఆర్ కార్యాలయం పరిధిలో రూ.34.98 కోట్లు టార్గెట్ కాగా, రూ.23.81 కోట్ల మేరకు ఆదాయం లభించింది. విజయవాడ తూర్పు డీఆర్ పరిధిలో రూ.30.91 కోట్ల లక్ష్యం కాగా, రూ.19.73 కోట్ల ఆదాయం వచ్చింది. మచిలీపట్నం డీఆర్ కార్యాలయ పరిధిలో రూ.15.84 కోట్ల లక్ష్యంకాగా, రూ.12.20 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
స్టాంపుల్లో మోనాలిసా..!
న్యూయార్క్: స్టాంపుల ప్రపంచంలో ‘మోనాలిసా’గా అభివర్ణించే ఒక సెంటు విలువ(సుమారు 60 పైసలు) అయిన ఈ బ్రిటిష్ గయానా పోస్టల్ స్టాంపు.. వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయి ప్రపంచంలోనే అతి ఖరీదైన స్టాంప్‌గా రికార్డు సృష్టించింది. 1856 నాటి ఈ స్టాంపును న్యూయార్క్‌లో సోత్‌బైస్ సంస్థ వేలం వేయగా.. రూ.59 కోట్ల ధర పలికింది. అలాగే సైజు పరంగా ప్రపంచంలోనే అతివిలువైన వస్తువుగా కూడా ఇది రికార్డు సృష్టించింది. అన్నట్టూ.. దీని అసలు ముఖ విలువతో పోలిస్తే.. ఇది అమ్ముడుపోయిన ధర ఎన్ని రెట్లు ఎక్కువో తెలుసా..? జస్ట్ వంద కోట్ల రెట్లు మాత్రమే! -
స్టాంపుల్లో మోనాలిసా..!
న్యూయార్క్: స్టాంపుల ప్రపంచంలో ‘మోనాలిసా’గా అభివర్ణించే ఒక సెంటు విలువ(సుమారు 60 పైసలు) అయిన ఈ బ్రిటిష్ గయానా పోస్టల్ స్టాంపు.. వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయి ప్రపంచంలోనే అతి ఖరీదైన స్టాంప్‌గా రికార్డు సృష్టిం చింది. 1856 నాటి ఈ స్టాం పును మంగళవారం న్యూయార్క్‌లో సోత్‌బైస్ సంస్థ వేలం వేయగా.. రూ.59 కోట్ల ధర పలికింది. అలాగే సైజు పరంగా ప్రపంచంలోనే అతివిలువైన వస్తువుగా కూడా ఇది రికార్డు సృష్టించింది. అన్నట్టూ.. దీని అసలు ముఖ విలువతో పోలిస్తే.. ఇది అమ్ముడుపోయిన ధర ఎన్ని రెట్లు ఎక్కువో తెలుసా..? జస్ట్ వంద కోట్ల రెట్లు మాత్రమే!