సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్(కోవిడ్-19) నివారణ చర్యలకు ఆయా ప్రభుత్వాలు పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు సైతం మూసివేశాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి ఎయిర్‌పోర్టులో దిగుతున్న ప్రయాణికులకు హోమ్ క్వారంటైన్(గృహ నిర్బంధం) ముద్ర వేస్తోంది. ప్రయాణికుల ఎడమ చేతి వెనకవైపు ఎన్నిరోజులు ఇంటి నుంచి బయటకు రాకూడదో తెలిపే తేదీని సిరాతో ముద్రిస్తున్నారు. తాజాగా ఇదే విధానాన్ని కర్ణాటక ప్రభుత్వం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. (‘హృదయ విదారకం.. కన్నీళ్లు ఆగడం లేదు’)
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు స్టాంప్‌లు వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానం వల్ల కరోనా అనుమానితులను గుర్తించడం సులభతరం అవుతుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ ప్రయాణికులు 14 రోజులపాటు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండేందుకు చేతిపై తేదీని సైతం ముద్రించనుంది. కాగా గురువారం ఉదయం నాటికి దేశంలో 170 కోవిడ్-19 కేసులు నమోదవగా ముగ్గురు మరణించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 47, కేరళలో 25, కర్ణాటకలో 14 కరోనా కేసులు నమోదయ్యాయి. (కరోనా అసలైన మాత్ర: ధైర్యం 500 ఎం.జి.)
Comments
Please login to add a commentAdd a comment