Kempegowda International Airport
-
'ఫేస్ స్కాన్ చేసి.. టైమ్ సేవ్ చేస్తుంది': బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో కొత్త టెక్నాలజీ
కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (KIA)ను నిర్వహిస్తున్న.. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (BIAL) దేశంలోనే మొట్ట మొదటి బయోమెట్రిక్-ఎనేబుల్డ్ సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ సదుపాయాన్ని పరిచయం చేసింది. ఇంతకీ ఈ 'బయోమెట్రిక్-ఎనేబుల్డ్ సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్' సర్వీస్ అంటే ఏమిటి? ఇదెలా పనిచేస్తుంది? అనే వివరాలు వివరంగా ఈ కథనంలో..గతంలో కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో సెల్ఫ్ చెక్ ఇన్ కియోస్క్‌ల వద్ద బోర్డింగ్ పాస్‌ను ప్రింట్ చేసి, బ్యాగ్ డ్రాప్ ప్రక్రియను ప్రారంభించడానికి దానిని స్కాన్ చేయాల్సి ఉండేది. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఈ ప్రక్రియకు స్వస్తి చెప్పింది.ఇప్పుడు ఫేస్ స్కాన్ బయోమెట్రిక్ టెక్నాలజీ ద్వారా ప్రయాణికులు ఎక్కువసేపు అక్కడ వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇటువంటి టెక్నాలజీ ప్రస్తుతం కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పా ఇంకెక్కడా లేకపోవడం గమనార్హం. ఇలాంటి కొత్త టెక్నాలజీలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకురావడంతో.. బెంగుళూరు విమానాశ్రయానికి సాంకేతిక అభివృద్ధిలో అగ్రగామి అని పేరు వచ్చింది.ఇదెలా పనిచేస్తుందంటే?ప్రయాణికులు సెల్ఫ్ సర్వీస్ బ్యాగ్ డ్రాఫ్ట్ మెషన్‌లో బ్యాగేజ్ డ్రాఫ్ట్ కోసం స్కాన్ ఫేస్ బయోమెట్రిక్ ఎంచుకోవాలి.ఫేస్ బయోమెట్రిక్ ఎంచుకుని కొనసాగించడానికి డిజియాత్ర ఐకాన్ ఎంచుకోవాలి. తరువాత ప్రయాణీకులను వారి బయోమెట్రిక్ ఫోటో క్యాప్చర్ చేస్తున్నప్పుడు నేరుగా కెమెరాలోకి చూడమని నిర్దేశిస్తుంది.ఇది పూర్తయిన తరువాత మెషన్ ఫ్లైట్ వివరాలను చూపిస్తుంది. ఏదైనా ప్రమాదకరమైన వస్తువులను తీసుకువెళుతున్నారో లేదో ప్రకటించమని వారిని ప్రాంప్ట్ చేస్తుంది. ప్రయాణికులు ప్రకటించిన తర్వాత.. మెషన్ ప్రయాణికుడికి బ్యాగ్‌ను కన్వేయర్‌పై ఉంచమని నిర్దేశిస్తుంది. ఇది బ్యాగేజ్ ట్యాగ్‌ను జత చేయమని వారిని అడుగుతుంది.బ్యాక్ వెయిట్ వేయడం కూడా పూర్తి చేసి మెషన్ స్కాన్ చేస్తుంది. బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా ఫీడ్ అవుతుంది. ఆ తరువాత బ్యాగేజీ సంబందించిన రసీదు కూడా అందిస్తుంది.నిర్దేశించిన లగేజ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు.. చెల్లింపును పూర్తి చేయడానికి ప్రయాణికులు కౌంటర్ దగ్గరకు వెళ్ళాలి. బయోమెట్రిక్‌లను ఎంచుకోకూడదనుకునే వారు తమ బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేయడం కొనసాగించవచ్చు, సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ ప్రక్రియను ఎంచుకోవచ్చు.బెంగుళూరు విమానాశ్రయంలో ఆటోమేటెడ్ 'సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్' సిస్టమ్ 2018లోనే అమలులోకి వచ్చింది. ఆ తరువాత ప్రయాణికులకు మరింత అనుకూలంగా ఉండటానికి 2019లో డిజియాత్ర ప్రారంభించారు. ఇప్పుడు ఏకంగా బయోమెట్రిక్-ఎనేబుల్డ్ సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ సదుపాయాన్ని తీసుకువచ్చారు.🚨 Bengaluru airport launches India's first biometric-enabled self-bag drop facility. pic.twitter.com/qm1qhzJc1E— Indian Tech & Infra (@IndianTechGuide) June 6, 2024 -
అంతా రెడీ చేసుకుని ఫ్లైట్ దగ్గరకెళ్తే షాకిచ్చిన పైలట్, 12 రోజుల ప్లాన్ ఫెయిల్
బెంగళూరు: పెంపుడు కుక్క పిల్లతో కలిసి కుటుంబసమేతంగా ఉత్తర భారతదేశ యాత్ర చేద్దామనుకున్న కుటుంబానికి విమాన పైలట్ షాకిచ్చాడు. నా విమానంలో కుక్క పిల్లను ఎక్కనిచ్చేది లేదని అతడు భీష్మించడంతో ఆ కుటుంబం బాధపడి టూర్‌నే రద్దు చేసుకుంది. ఈ ఘటన బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన సచిన్ శెణై భార్య ఉమా, కుమారుడు ఆర్య, పెంపుడు కుక్కపిల్ల ప్లఫియాతో కలిసి 12 రోజుల పాటు ఢిల్లీ, పంజాబ్ విహార యాత్రకు ప్లాన్ చేశాడు. గత శనివారం కెంపేగౌడ విమానాశ్రయం నుంచి ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఏ1 503 విమానంలో ఢిల్లీకి బయలుదేరాలి. కుక్కపిల్లతో ప్రయాణానికి ఎయిర్‌పోర్టు సిబ్బంది అనుమతించారు. బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చారు. కానీ కుక్కపిల్ల ప్రయాణానికి సదరు విమాన పైలట్ చోప్రా నిరాకరించారు. కుక్క పిల్లను వదిలేసి టూర్‌కి వెళ్లాలని సహచర ప్రయాణికులు సలహా ఇచ్చారు. కొంతసేపు చర్చలు జరిగినప్పటికీ ఫలించలేదు. బుజ్జి కుక్కకు అనుమతి ఇవ్వకపోవడంతో సచిన్ ఆవేదన చెంది టూర్‌నే రద్దు చేసుకున్నాడు. ఆయన ఎయిర్‌పోర్టులో జరిగిన తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. నిబంధనల ప్రకారం 5 కేజీల లోపు ఉన్న కుక్కను ప్రయాణికులు విమానంలో తీసుకెళ్లవచ్చు. ఈ వ్యవహారంపై ఇండియన్ ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ సచిన్ ఢిల్లీ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశాం, కానీ కుక్కపిల్ల విషయంలో విమాన పైలట్లదే అంతిమ నిర్ణయం అని తెలిపింది. చదవండి: (మెస్సీ లేరా.. సోషల్ మీడియాలో కాంతారా మీమ్ వైరల్..) -
అసోం దంపతులు మహా కిలాడీలు.. మాయమాటలతో లక్షల మోసం
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): నా భర్త కస్టమ్స్ అధికారి అని, బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని ఇప్పిస్తామని, అక్కడ అధికారులు సీజ్ చేసిన వస్తువులను తక్కువ ధరకు ఇప్పిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్న జంట కటకటాల పాలైంది. దర్బిన్‌దాస్ అలియాస్ మోహన్‌దాస్, అతని భార్య ధనుష్యను కొడిగేనహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 34 లక్షల నగదు, 106 గ్రాములు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ అనూప్‌శెట్టి తెలిపారు. వివరాలు... ఇందిరానగరలో ఓ అకాడమీని నడుపుతున్న స్నేహ భగవత్ వద్ద ధనుష్య శిక్షణకు చేరింది. తన భర్త విమానాశ్రయంలో కస్టమ్స్‌లో పని చేస్తున్నట్లు చెప్పింది. జప్తు చేసిన బంగారు నగలను తక్కువ ధరకు ఇప్పిస్తామని నమ్మించింది. అలా స్నేహ నుంచి పలు విడతలుగా రూ. 68 లక్షలను నగదును వసూలు చేసింది. అంతేకాక అకాడమీలో పని చేస్తున్న సిబ్బంది నుంచి కూడా డబ్బులు వసూలు చేసింది. కొన్నిరోజుల తరువాత ధనుష్య మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేసుకుని పరారైంది. దీంతో బాధితులు కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ జంట కోసం గాలింపు చేపట్టారు. చదవండి: (మోసకారి దంపతులు దర్బిన్‌దాస్, ధనుష్య) పలువురి నుంచి వసూళ్లు దేవనహళ్లి తాలూకాలో కూడా ఇదే తరహా మోసం కేసు వీరిపై నమోదై ఉంది. ధనుష్య పిల్లలు చదువుతున్న స్కూల్ ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులకు కూడా ఇదే మాదిరి మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు గుంజుకుందని పోలీసుల విచారణలో బయట పడింది. తక్కువ ధరలకు ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లను లభిస్తాయని చెప్పుకొని నివాసం ఉండే అపార్ట్మెంట్లోని వారి నుంచి లక్షల రూపాయలను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో తీసుకుంది. వస్తువులన్నీ ఇప్పించండి, లేదా డబ్బయినా తిరిగి ఇవ్వాలని కొందరు ఒత్తిడి చేయడంతో ధనుష్య, ఆమె భర్త మంగళూరుకు పారిపోయారు. కొడిగేనహళ్లి పోలీసులు మంగళూరుకు వెళ్లి ఈ జంటను పట్టుకుంది. వారి ఇంట్లో రూ. 34 లక్షలు నగదు, 106 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. బెంగళూరుకు తరలించి విచారణ చేపట్టారు. -
Bengaluru: లోదుస్తుల్లో బంగారం తరలింపు
సాక్షి, బెంగళూరు: లోదుస్తుల్లో దాచి అక్రమంగా బంగారం తరలిస్తున్న మహిళను కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసారు. దుబాయి నుంచి కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు వచ్చిన మహిళ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించడంతో చెక్ చేయగా లోదుస్తుల్లో బంగారం పేస్ట్ రూపంలో దాచి తరలిస్తున్న సంగతి తెలిసింది. ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు రూ.17 లక్షల విలువైన బంగారు పేస్ట్‌ను సీజ్ చేసారు. -
బెంగళూరు ఎయిర్‌పోర్టులో పేలుడు
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో టెర్మినల్ రోడ్డు మార్కింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు గాయపడ్డారు. ఎయిర్‌పోర్టులోని కార్గో కాంప్లెక్స్ ముందు భాగంలో రెండవ టెర్మినల్ కోసం రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున కార్మికులు రోడ్డుకు ఇరువైపులా యంత్రం సహాయంతో తెల్లరంగు మార్కింగ్‌లు, జీబ్రా లైన్లు పూస్తున్నారు. తెల్లరంగు తయారీ కోసం సిలిండర్‌లో రసాయనాలు వేసి వేడి చేస్తుండగా సిలిండర్ పేలింది. ఆ మంటలు పక్కనే నిల్వ ఉంచిన రంగుడబ్బాలకు అంటుకున్నాయి. ఈ ఘటనలో అవినాశ్, సిరాజ్, ప్రశాంత్, గౌతమ్, అజయ్‌కుమార్, నాగేశ్రావ్ అనే ఆరుగురు కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై విమానాశ్రయ వర్గాలు ఎలాంటి ప్రకటన చేయలేదు. (చదవండి: దారుణం: భార్యా.. పిల్లలను బావిలో నెట్టివేసి భర్త.. ఆపై రాళ్ల దాడి) -
బెంగళూరు ఎయిర్‌పోర్టులో 206 ఐఫోన్లు సీజ్
సాక్షి, దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.2.8 కోట్ల విలువైన ఆపిల్ కంపెనీ ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అమెరికా పాస్‌పోర్టు కలిగిన భారతీయ దంపతుల నుంచి వీటిని సీజ్ చేశారు. ఫిబ్రవరి 13న ముంబై నుంచి ఫ్రాన్స్ వెళ్లిన దంపతులు ఆదివారం రాత్రి ప్యారిస్ నుంచి విమానంలో బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. అధికారులు వారి లగేజీని సోదా చేయగా రూ.2.8 కోట్ల విలువ చేసే 206 ఐఫోన్ 12ప్రొ మాక్స్ ఫోన్లు బయటపడ్డాయి. బిల్లులు చూపకపోవడంతో ఫోన్లను స్వాధీనం చేసుకుని, ఆ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: (పెట్రోలు బాంబు మంటల్లో హీరోకు గాయాలు) -
ప్రయాణికులకు హోమ్ క్వారంటైన్ ముద్ర
సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్(కోవిడ్-19) నివారణ చర్యలకు ఆయా ప్రభుత్వాలు పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు సైతం మూసివేశాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి ఎయిర్‌పోర్టులో దిగుతున్న ప్రయాణికులకు హోమ్ క్వారంటైన్(గృహ నిర్బంధం) ముద్ర వేస్తోంది. ప్రయాణికుల ఎడమ చేతి వెనకవైపు ఎన్నిరోజులు ఇంటి నుంచి బయటకు రాకూడదో తెలిపే తేదీని సిరాతో ముద్రిస్తున్నారు. తాజాగా ఇదే విధానాన్ని కర్ణాటక ప్రభుత్వం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. (‘హృదయ విదారకం.. కన్నీళ్లు ఆగడం లేదు’) బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు స్టాంప్‌లు వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానం వల్ల కరోనా అనుమానితులను గుర్తించడం సులభతరం అవుతుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ ప్రయాణికులు 14 రోజులపాటు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండేందుకు చేతిపై తేదీని సైతం ముద్రించనుంది. కాగా గురువారం ఉదయం నాటికి దేశంలో 170 కోవిడ్-19 కేసులు నమోదవగా ముగ్గురు మరణించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 47, కేరళలో 25, కర్ణాటకలో 14 కరోనా కేసులు నమోదయ్యాయి. (కరోనా అసలైన మాత్ర: ధైర్యం 500 ఎం.జి.) చదవండి: కరోనా.. భారత్ గట్టెక్కాలంటే వీటిని పాటించాల్సిందే! -
దారి మళ్లిన ఓలా, తప్పించుకున్న మహిళ!
సాక్షి, బెంగుళూరు: సురక్షిత ప్రయాణానికి హామీ అంటూ ఊదరగొట్టే ప్రయివేటు క్యాబ్ సర్వీసులు ప్రయాణీకుల భద్రత విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మహిళల పట్ల క్యాబ్ డ్రైవర్ల అకృత్యాలకు అడ్డులేకుండా పోతోంది. తాజాగా.. ఓలా క్యాబ్‌లో ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన ఓ మహళపై క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యం చేయాలని చూశాడు. పోలీసుల తెలిపిన వివరాలు.. బనాస్వాడిలో నివాసముండే ఓ మహిళ గురువారం ఉదయం ఓలా క్యాబ్‌లో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రాయానికి బయలుదేరారు. వాహనం ఎయిర్‌పోర్టును సమీపించగానే ఒక్కసారిగా డ్రైవర్ వాహనాన్ని మరో మార్గంలోకి మళ్లించాడు. వాహనం హైదరాబాద్ వైపుగా దూసుకుపోతుండడంతో మహిళ డ్రైవర్ని ప్రశ్నించింది. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్, నోరు తెరిస్తే చంపేస్తానని బెదిరించాడని పోలీసులు తెలిపారు. అయితే, వాహనం ఓ టోల్ ప్లాజాను దాటి వెళ్తున్న సమయంలో మహిళ గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న టోల్ ప్లాజా సిబ్బంది అప్రమత్తమయ్యారు. క్యాబ్‌ను అడ్డగింగి ఆమెను కాపాడారని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ ఫూటుగా తాగి ఉన్నాడని.. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని చిక్కజలా ఎస్సై తెలిపారు. ఈ వ్యవహారంపై ఓలా సంస్థ స్పందిచింది. డ్రైవర్‌ను ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. -
తనిఖీల విషయంలో చూసి చూడనట్టుగా..
బెంగళూరు: విదేశాల నుంచి బంగారం బెంగళూరు మీదుగా వివిధ ప్రాంతాలకు తరులుతోంది. వివిధ దేశాల నుంచి నేరుగా బెంగళూరుకు విమానాలు అందుబాటులో ఉండటంతో పాటు ఇక్కడ తనిఖీల విషయంలో కొంత చూసి... చూడనట్లు వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణమని సమాచారం. మూడు రోజుల ముందు అక్రమ మార్గంలో తరలించడానికి సిద్ధంగా ఉన్న 12 కిలోల బంగారు బిస్కెట్లు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు గుర్తించడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇలాంటివి అడపా దడపా గుర్తించినా అధికారుల కన్నుగప్పి వందల కిలోల బంగారం భారత దేశంలోకి దిగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకాక్ నుండి థాయ్ ఎయిర్ ఎయిర్ ఏషియా విమానంలో వచ్చిన ఓ వ్యక్తి అక్రమంగా బంగారు, వజ్రాభరణాలను ఎయిర్‌పోర్టులోని శౌచాలయంలో దాచినట్లు కస్టమ్స్ అధికారులకు సమాచారమందింది. దీంతో విమానాశ్రయంలోని శౌచాలయంలో తనిఖీలు నిర్వహించిన అధికారులకు శౌచాలయంలో పిల్లల డైపర్డిస్పెన్సరీని స్వాధీనం చేసుకున్నారు. ఈ యంత్రాన్ని స్కానర్ల సహాయంతో స్కానింగ్ చేయగా అందులో కార్బన్, ప్లాస్టిక్ కవర్లలో చుట్టిన ప్యాకెట్లను గుర్తించారు. డిస్పెన్సరీని తెరచి చూడగా అందులో బంగారు బిస్కెట్లు, ఇతర బంగారు, వజ్రాభరణాల లభించాయి. యంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఆచూకీ కోసం ఎయిర్‌పోర్టులోని సీసీకెమెరా ఫుటేజ్‌లను పరిశీలించిన అధికారులు డిస్పెన్సరీ యంత్రంతో శౌచాలయంలోకి వెళుతున్న వ్యక్తిని గమనించిన అధికారులు ఎయిర్‌పోర్టును సిబ్బందిని అప్రమత్తం చేసారు. ఎయిర్‌పోర్టు నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వ్యక్తిని తమిళనాడుకు చెందిన మహమద్ మోహిద్దిన్గా గుర్తించారు. తమిళనాడులో చిన్న పిల్లల ఆట వస్తువులు విక్రయించే వ్యాపారాన్ని నిర్వహించే మహమద్ మోహిద్దిన్ డబ్బులకు ఆశపడే బంగారు ఆభరణాలను అక్రమంగా తరలించాడినికి అంగీకరించినట్లు తమ విచారణలో తెలిసిందని అధికారులు తెలిపారు. అయితే బంగారు ఆభరణాల అక్రమ రవాణకు ఎయిర్‌పోర్టుకు చెందిన సిబ్బంది కూడా మహమద్ మోహిద్దిన్కు సహకరించినట్లు సంబంధిత అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంగారు బిస్కెట్లు విదేశాల నుంచి అక్రమంగా బంగారు, వజ్రాభరణాలను తరలిస్తున్న ఓ వ్యక్తిని బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ విభాగానికి చెందిన ఎయిర్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఏఐయూ)అధికారులు అరెస్ట్ చేసారు. ఈ ఘటనలో రూ.2.60కోట్ల విలువ చేసే 6.65కేజీల బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో... ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న ఎయిర్ ఇండియాకు చెందిన వీమానంలోని శౌచాలయంలో దాదాపు 6 కిలోల బరువున్న 12 బంగారు బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.1.5 కోట్లు. ఈ విషయమై ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం. -
నిశ్చితార్థం పెట్టుకొని ఏం పని చేశారంటే..
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ఓ వైపు నిశ్చితార్థం పెట్టుకొని మరో వైపు విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపులకు పాల్పడింది ఓ యువ జంట. వివరాలు..బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఒక విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు ఫోన్‌కాల్ కలకలం రేపింది. వెంటనే అధికారులు విమానాన్ని ఆపేసి హుటాహుటిన అణువణువూ తనిఖీ చేశారు, చివరకు ఏమీ లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 8.45గంటలకు బెంగళూరు నుంచి కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్టుకు బయలుదేరాల్సిన విమానంలో బాంబు ఉందని ఎయిర్‌పోర్టుకు కాల్ వచ్చింది. దీంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది, పోలీసులు ప్రయాణికులను దించివేసి బాంబ్ స్క్వాడ్‌తో క్షుణ్నంగా తనిఖీ చేయించారు. ఎటువంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. 160 మంది ప్రయాణికులతో ఈ ఎయిర్ ఏషియా విమానం చివరకు గురువారం తెల్లవారుజామున 3.10గంటలకు టేకాఫ్ అయ్యింది. బెదిరింపు కాల్‌కు సంబంధించి కేరళలోని అలెప్పీ పట్టణానికి చెందిన అర్జున్, నేహా గోపీనాథ్ అనే యువ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలెప్పీలో ఒక పబ్లిక్ బూత్ నుంచి కాల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ జంటకు గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే ఎందుకు ఫోన్ కాల్ చేశారనేది దర్యాప్తు చేస్తున్నారు. -
బెంగళూరు విమానాశ్రయంలో సీబీఐ దాడులు
బెంగళూరు : బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం సీబీఐ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్తువులకు సుంకం విధించలేదన్న ఆరోపణలపై కస్టమ్స్ అధికారులు నరసింహస్వామి, సుందరం, విశ్వేశ్వరభట్, ప్రేమ్‌కుమార్, సోమసుందర్, వీరికి సహకరిస్తున్న మరో ముగ్గురు విమానాశ్రయ సిబ్బందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువులతో పాటు రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ ఇండియా కార్గో కాంప్లెక్స్, ఎయిర్ కార్గో కాంప్లెక్స్‌ల ద్వారా దిగుమతి అయిన వస్తువులను దిగుమతి సుంకం నుంచి తప్పించి బయటకు పంపేవారన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. -
‘విమానాల్లో బాంబు’ కలకలం
సాక్షి, బెంగళూరు: స్థానిక కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని మూడు విమానాల్లో బాంబులు పెట్టినట్లు సమాచారం అందడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. చివరికి అది నిజం కాదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. బెంగళూరు హెచ్.ఎస్.ఆర్ లేవుట్‌కు చెందిన వ్యక్తి తాను బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలు దేరే మూడు విమానాల్లో బాంబులు పెట్టినట్లు వాట్స్అప్లో మెసేజ్ పంపారు. అంతేకాకుండా ఓ బ్యాంకు అకౌంట్ నంబర్ ఇచ్చి అందులో కోటి రూపాయలు వేస్తే ఎక్కడ పెట్టినది చెబుతానని పేర్కొన్నారు. దీంతో అధికారులు హుటాహుటిన అన్ని విమానాల్లో కూడా వెదికి ఎక్కడా కూడా బాంబు ఆనవాళ్లు కనబడలేదు. చివరికి శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు బయలు దేరాల్సిన విమానాలు దాదాపు 6 గంటలు ఆలస్యంగా బయలు దేరాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం బాంబు పెట్టినట్లు వాట్స్అప్ మెసేజ్ పంపిన వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకుని మడివాళపోలీస్ స్టేషన్లో విచారిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.