కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KIA)ను నిర్వహిస్తున్న.. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (BIAL) దేశంలోనే మొట్ట మొదటి బయోమెట్రిక్-ఎనేబుల్డ్ సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ సదుపాయాన్ని పరిచయం చేసింది. ఇంతకీ ఈ 'బయోమెట్రిక్-ఎనేబుల్డ్ సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్' సర్వీస్ అంటే ఏమిటి? ఇదెలా పనిచేస్తుంది? అనే వివరాలు వివరంగా ఈ కథనంలో..
గతంలో కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో సెల్ఫ్ చెక్ ఇన్ కియోస్క్‌ల వద్ద బోర్డింగ్ పాస్‌ను ప్రింట్ చేసి, బ్యాగ్ డ్రాప్ ప్రక్రియను ప్రారంభించడానికి దానిని స్కాన్ చేయాల్సి ఉండేది. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఈ ప్రక్రియకు స్వస్తి చెప్పింది.
ఇప్పుడు ఫేస్ స్కాన్ బయోమెట్రిక్ టెక్నాలజీ ద్వారా ప్రయాణికులు ఎక్కువసేపు అక్కడ వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇటువంటి టెక్నాలజీ ప్రస్తుతం కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పా ఇంకెక్కడా లేకపోవడం గమనార్హం. ఇలాంటి కొత్త టెక్నాలజీలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకురావడంతో.. బెంగుళూరు విమానాశ్రయానికి సాంకేతిక అభివృద్ధిలో అగ్రగామి అని పేరు వచ్చింది.
ఇదెలా పనిచేస్తుందంటే?
ప్రయాణికులు సెల్ఫ్ సర్వీస్ బ్యాగ్ డ్రాఫ్ట్ మెషన్‌లో బ్యాగేజ్ డ్రాఫ్ట్ కోసం స్కాన్ ఫేస్ బయోమెట్రిక్ ఎంచుకోవాలి.
ఫేస్ బయోమెట్రిక్ ఎంచుకుని కొనసాగించడానికి డిజియాత్ర ఐకాన్ ఎంచుకోవాలి. తరువాత ప్రయాణీకులను వారి బయోమెట్రిక్ ఫోటో క్యాప్చర్ చేస్తున్నప్పుడు నేరుగా కెమెరాలోకి చూడమని నిర్దేశిస్తుంది.
ఇది పూర్తయిన తరువాత మెషన్ ఫ్లైట్ వివరాలను చూపిస్తుంది. ఏదైనా ప్రమాదకరమైన వస్తువులను తీసుకువెళుతున్నారో లేదో ప్రకటించమని వారిని ప్రాంప్ట్ చేస్తుంది.
ప్రయాణికులు ప్రకటించిన తర్వాత.. మెషన్ ప్రయాణికుడికి బ్యాగ్‌ను కన్వేయర్‌పై ఉంచమని నిర్దేశిస్తుంది. ఇది బ్యాగేజ్ ట్యాగ్‌ను జత చేయమని వారిని అడుగుతుంది.
బ్యాక్ వెయిట్ వేయడం కూడా పూర్తి చేసి మెషన్ స్కాన్ చేస్తుంది. బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా ఫీడ్ అవుతుంది. ఆ తరువాత బ్యాగేజీ సంబందించిన రసీదు కూడా అందిస్తుంది.
నిర్దేశించిన లగేజ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు.. చెల్లింపును పూర్తి చేయడానికి ప్రయాణికులు కౌంటర్ దగ్గరకు వెళ్ళాలి. బయోమెట్రిక్‌లను ఎంచుకోకూడదనుకునే వారు తమ బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేయడం కొనసాగించవచ్చు, సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ ప్రక్రియను ఎంచుకోవచ్చు.
బెంగుళూరు విమానాశ్రయంలో ఆటోమేటెడ్ 'సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్' సిస్టమ్ 2018లోనే అమలులోకి వచ్చింది. ఆ తరువాత ప్రయాణికులకు మరింత అనుకూలంగా ఉండటానికి 2019లో డిజియాత్ర ప్రారంభించారు. ఇప్పుడు ఏకంగా బయోమెట్రిక్-ఎనేబుల్డ్ సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ సదుపాయాన్ని తీసుకువచ్చారు.
🚨 Bengaluru airport launches India's first biometric-enabled self-bag drop facility. pic.twitter.com/qm1qhzJc1E
— Indian Tech & Infra (@IndianTechGuide) June 6, 2024
Comments
Please login to add a commentAdd a comment