bengaluru airport
-
'ఫేస్ స్కాన్ చేసి.. టైమ్ సేవ్ చేస్తుంది': బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో కొత్త టెక్నాలజీ
కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (KIA)ను నిర్వహిస్తున్న.. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (BIAL) దేశంలోనే మొట్ట మొదటి బయోమెట్రిక్-ఎనేబుల్డ్ సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ సదుపాయాన్ని పరిచయం చేసింది. ఇంతకీ ఈ 'బయోమెట్రిక్-ఎనేబుల్డ్ సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్' సర్వీస్ అంటే ఏమిటి? ఇదెలా పనిచేస్తుంది? అనే వివరాలు వివరంగా ఈ కథనంలో..గతంలో కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో సెల్ఫ్ చెక్ ఇన్ కియోస్క్‌ల వద్ద బోర్డింగ్ పాస్‌ను ప్రింట్ చేసి, బ్యాగ్ డ్రాప్ ప్రక్రియను ప్రారంభించడానికి దానిని స్కాన్ చేయాల్సి ఉండేది. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఈ ప్రక్రియకు స్వస్తి చెప్పింది.ఇప్పుడు ఫేస్ స్కాన్ బయోమెట్రిక్ టెక్నాలజీ ద్వారా ప్రయాణికులు ఎక్కువసేపు అక్కడ వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇటువంటి టెక్నాలజీ ప్రస్తుతం కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పా ఇంకెక్కడా లేకపోవడం గమనార్హం. ఇలాంటి కొత్త టెక్నాలజీలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకురావడంతో.. బెంగుళూరు విమానాశ్రయానికి సాంకేతిక అభివృద్ధిలో అగ్రగామి అని పేరు వచ్చింది.ఇదెలా పనిచేస్తుందంటే?ప్రయాణికులు సెల్ఫ్ సర్వీస్ బ్యాగ్ డ్రాఫ్ట్ మెషన్‌లో బ్యాగేజ్ డ్రాఫ్ట్ కోసం స్కాన్ ఫేస్ బయోమెట్రిక్ ఎంచుకోవాలి.ఫేస్ బయోమెట్రిక్ ఎంచుకుని కొనసాగించడానికి డిజియాత్ర ఐకాన్ ఎంచుకోవాలి. తరువాత ప్రయాణీకులను వారి బయోమెట్రిక్ ఫోటో క్యాప్చర్ చేస్తున్నప్పుడు నేరుగా కెమెరాలోకి చూడమని నిర్దేశిస్తుంది.ఇది పూర్తయిన తరువాత మెషన్ ఫ్లైట్ వివరాలను చూపిస్తుంది. ఏదైనా ప్రమాదకరమైన వస్తువులను తీసుకువెళుతున్నారో లేదో ప్రకటించమని వారిని ప్రాంప్ట్ చేస్తుంది. ప్రయాణికులు ప్రకటించిన తర్వాత.. మెషన్ ప్రయాణికుడికి బ్యాగ్‌ను కన్వేయర్‌పై ఉంచమని నిర్దేశిస్తుంది. ఇది బ్యాగేజ్ ట్యాగ్‌ను జత చేయమని వారిని అడుగుతుంది.బ్యాక్ వెయిట్ వేయడం కూడా పూర్తి చేసి మెషన్ స్కాన్ చేస్తుంది. బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా ఫీడ్ అవుతుంది. ఆ తరువాత బ్యాగేజీ సంబందించిన రసీదు కూడా అందిస్తుంది.నిర్దేశించిన లగేజ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు.. చెల్లింపును పూర్తి చేయడానికి ప్రయాణికులు కౌంటర్ దగ్గరకు వెళ్ళాలి. బయోమెట్రిక్‌లను ఎంచుకోకూడదనుకునే వారు తమ బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేయడం కొనసాగించవచ్చు, సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ ప్రక్రియను ఎంచుకోవచ్చు.బెంగుళూరు విమానాశ్రయంలో ఆటోమేటెడ్ 'సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్' సిస్టమ్ 2018లోనే అమలులోకి వచ్చింది. ఆ తరువాత ప్రయాణికులకు మరింత అనుకూలంగా ఉండటానికి 2019లో డిజియాత్ర ప్రారంభించారు. ఇప్పుడు ఏకంగా బయోమెట్రిక్-ఎనేబుల్డ్ సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ సదుపాయాన్ని తీసుకువచ్చారు.🚨 Bengaluru airport launches India's first biometric-enabled self-bag drop facility. pic.twitter.com/qm1qhzJc1E— Indian Tech & Infra (@IndianTechGuide) June 6, 2024 -
కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం(కేఐఏ)లో పికప్ లేన్ల ప్రవేశ రుసుమును రద్దుచేస్తూ బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(బీఐఏఎల్) ప్రకటన విడుదల చేసింది. విమానాశ్రయ పరిధిలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు స్పీడ్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పింది.అవసరం ఉన్నా, లేకపోయినా కేఐఏ పికప్‌లేన్ పరిధిలోకి పెద్దసంఖ్యలో వాహనాలు వస్తూండడం బీఐఏఎల్ దృష్టికి వెళ్లింది. దాంతోపాటు ఎయిర్పోర్ట్ పరిసరాల్లో భారీగా వాహనాలు చేరుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గమనించింది. వాటిని నివారించాలంటే కొన్ని మార్పులు తీసుకురావాలని భావించింది. బీఐఏఎల్ టెర్మినల్ 1, 2లో అరైవల్ పికప్ లేన్లను చేరడానికి ఎంట్రీ ఫీజును ప్రవేశ పెట్టింది. రిజిస్ట్రేషన్ ప్లేట్ల ఆధారంగా వాహనాలపై ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పింది. అయితే ఈ నిర్ణయం వెలువడిన కొన్ని గంటల్లోనే ట్యాక్సీడ్రైవర్లు, ఇతర కమ్యునిటీల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో ప్రవేశ రుసుమును రద్దుచేస్తున్నట్లు బీఏఐఎల్ తిరిగి ప్రకటన విడుదల చేసింది.బీఐఏఎల్ ముందుగా చేసిన ప్రకటన ప్రకారం..ప్రైవేట్ వాహనాలు పికప్ లేన్లలోకి ప్రవేశించిన ఏడు నుంచి 14 నిమిషాల సమయానికి రూ.150 రుసుము చెల్లించాలి. వాణిజ్య వాహనదారులు మొదటి ఏడు నిమిషాలకు రూ.150, తర్వాతి ఏడు నిమిషాలకు రూ.300 చెల్లించాలి. బస్సు ప్రయాణికులు ఏడు నిమిషాలకు రూ.600, ట్రావెలర్స్ రూ.300 చెల్లించాలని నిర్ణయించారు. ఒకవేళ టికెట్‌పోతే రూ.600 నిర్ణీత రుసుము చెల్లించాలి. పికప్ ఏరియాలో 15 నిమిషాలకు మించి ఉంటే ఆ వాహనాలను యజమాని ఖర్చుతో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలి.వైట్ రిజిస్ట్రేషన్ ప్లేట్ కలిగి ఉండే వాహనాలను ప్రైవేట్ వాహనాలుగా, ట్రావెల్స్, ఆన్లైన్ బుకింగ్ వెహికిల్స్, పసుపు రిజిస్ట్రేషన్ ప్లేట్‌తోపాటు కొన్ని ఈవీలను వాణిజ్య వాహనాలుగా వర్గీకరించారు. కర్ణాటక రాష్ట్ర ట్రావెల్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకృష్ణ హోల్లా మాట్లాడుతూ..‘ఎయిర్పోర్ట్ రావాలనుకునే ప్రయాణికులు ఇప్పటికే సాదహళ్లి టోల్గేట్ వద్ద ఛార్జీ చెల్లిస్తున్నారు. మళ్లీ అరైవల్-పికప్ ఏరియాలో రుసుము చెల్లించాలనే నిర్ణయం సరికాదు’ అన్నారు.కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిధిలో ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) స్పీడ్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలు నిబంధనల కంటే వేగంగా వెళ్లే వారిని గుర్తించి జరిమానాలను విధిస్తాయి. -
ఉబర్ ఛార్జ్ చూసి ఖంగుతున్న ప్యాసింజర్.. 40 కిమీ దూరానికి..
టెక్నాలజీ పెరగడంతో ఎక్కడికి వెళ్లాలన్నా.. ఉబర్, ఓలా యాప్‌లలో వెహికల్స్ బుక్ చేసుకుని గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో క్యాబ్ చార్జీలు చూసి వినియోగదాదారులు తప్పకుండా ఖంగుతింటారు. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలుగా వైరల్ అయినప్పటికీ.. తాజాగా ఇలాంటి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. రాజేష్ భట్టాడ్ అనే వ్యక్తి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హెచ్ఎస్ఆర్ లేఔట్ వెళ్లాలనుకున్నారు. ఆ సమయంలో ఉబర్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే దాదాపు రూ.2000 చూపించింది. ఇది చూసిన రాజేష్ ఒక్కసారిగా షాకయ్యారు. దీనిని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చివరకు రాజేష్ భట్టాడ్ బస్సులో కేవలం రూ. 265లతో గమ్యస్థానం చేరుకుని BMTCకి కృతజ్ఞతలు చెప్పారు. 40 కిలోమీటర్ల దూరానికి రూ. 2000 చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. దీనిపైన పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. విమానాశ్రయం దగ్గర చార్జీలు ఎక్కువగా ఉంటాయని, బస్సులో వెళితే చార్జీలు బాగా తగ్గుతాయని కామెంట్స్ చేశారు. గత ఏడాది కూడా బెంగళూరు విమానాశ్రయం నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి ఉబెర్ క్యాబ్ ఎక్కువ ఛార్జీలను వసూలు చేసిన స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 50 కిలోమీటర్ల రైడ్‌కు రూ. 4,000 వరకు వసూలు చేసినట్లు ఇందులో తెలిసింది. స్క్రీన్‌షాట్ వైరల్ కావడంతో, క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీకు నగర రవాణా శాఖ నోటీసులు అందించింది. The Uber pricing past midnight from Bengaluru Airport to HSR🥲 Thank you BMTC🙏 pic.twitter.com/gWAHgXbtpD — 📊 Rajesh Bhattad | theRevOpsGuy (@theRevOpsGuy) February 28, 2024 -
మాధవన్ పోస్టుకు ప్రధాని మోదీ స్పందన
బెంగళూరు: హీరో మాధవన్ పోస్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కర్ణాటకలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంపై మాధవన్ ప్రశంసలు కురిపించారు. ఇటీవలే అక్కడ ప్రారంభమైన రెండవ టెర్మినల్ పనులను ప్రస్తావించారు. అద్భుతంగా ఉన్నాయంటూ ట్విట్టర్ వేదికగా ఎయిర్‌పోర్టు దృశ్యాలను అభిమానులతో పంచుకున్నారు. 'దేశంలో మౌలిక సదుపాయాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. కెంపెగౌడ అయిర్పోర్టులో ఉన్నాను. నమ్మశక్యం కావడం లేదు. ప్రపంచంలోనే అద్భుతమైన మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయి. ఇందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది' అని మాధవన్ అన్నారు. View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు నాలుగు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఈ పోస్టుపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. 'భారత్ అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు' అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కెంపెగౌడ ఎయిర్‌పోర్టు ఎంతో అద్భుతమైనదని మోదీ అన్నారు. ప్రపంచ దేశాల విమానాశ్రయాలకు పోటీగా నిలుస్తుందని అన్నారు. ఇదీ చదవండి: మీడియా ముందు నోరు జాగ్రత్త.. నేతలకు సోనియా హితవు -
భారత్‌లో ఆఫీస్‌ను అమ్మేస్తున్న ఇంటెల్.. వేలాది మంది ఉద్యోగుల్ని..
మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దిగ్గజ టెక్ కంపెనీల నుంచి చిన్న చిన్న స్టార్టప్స్ వరకు లేఆఫ్స్ ప్రకటించాయి. ఈ కంపెనీలకు భిన్నంగా టెక్ దిగ్గజ సంస్థ ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆర్థిక మాంద్యం రాబోతుందన్న అంచనాల నేపథ్యంలో కంపెనీపై ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులకు అందించే జీత భత్యాల్లో ఇంటెల్ కోత విధించింది. తాజాగా, భారత్‌లోని బెంగళూరు ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 250,000 స్కైర్ ఫీట్ కార్యాలయాన్ని ఇంటెల్ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. రూ.450 కోట్ల విలువైన ఆఫీస్ బిల్డింగ్‌ను అమ్మేందుకు కొనుగోలు దారుల్ని బిడ్డింగ్ ఆహ్వానించింది. ఈ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు పాల్గొన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మూడేళ్ల లీజ్‌కు అయితే, అమ్మకం పూర్తయిన త్వరాత అదే ఆఫీస్ కార్యాలయాన్ని మూడేళ్ల పాటు ఇంటెల్ లీజుకు తీసుకోనుంది. ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అమలు చేయనుంది. నిజమే.. అమ్ముతున్నాం బెంగళూరు ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులో ఉన్న ఆఫీస్‌ను అమ్ముతున్నారనే నివేదికపై ఇంటెల్ ప్రతినిధులు స్పందించారు. అమ్మకం నిజమేనని, హైబ్రిడ్ ఫస్ట్ కంపెనీగా, మా ఉద్యోగులు ఆన్ సైట్లో పనిచేస్తున్నప్పుడు వారి కోసం వర్క్‌స్పేస్‌లను రూపొందించేలా స్పేస్ వినియోగాన్ని అంచనా వేస్తున్నాం. అదే సమయంలో ఖర్చుల్ని తగ్గించుకుంటున్నామని చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. 14,000 మంది ఉద్యోగులు బెంగళూరు ఇంటెల్ కార్యాలయంలో 14,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. డిజైన్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన వారు ఉన్నారు. కంపెనీ చరిత్రలోనే భారీ నష్టం కోవిడ్-19 కారణంగా మహమ్మారి సంక్షోభ సమయంలో చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసిన విషయం తెలిసిందే. దీంతో పర్సనల్ కంప్యూటర్లకు గిరాకీ అమాంతం పెరిగింది. కంపెనీలు తిరిగి తెరుచుకుంటుండడంతో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పీసీలకు గిరాకీ పడిపోయింది. వెరసీ ఆ ప్రభావం ఇంటెల్ క్యూ1 ఫలితాల పడింది. ఇంటెల్ ప్రతి షేర్ ఆదాయంలో 133 శాతం వార్షిక తగ్గింపు నమోదు కాగా, ఆదాయం సంవత్సరానికి దాదాపు 36 శాతం పడిపోయి 11.7 బిలియన్లకు పడిపోయిందని సీఎన్‌బీసీ నివేదిక తెలిపింది. ఈ పరిణామాలతో ఇంటెల్ ఎంత వీలైతే అంతే ఖర్చును తగ్గించుకుంటుంది. బెంగళూరు కేంద్రంగా ఉన్న సొంత ఆఫీస్ బిల్డింగ్‌ను అమ్మేసి.. లీజుకు తీసుకుంటుందని సమాచారం. చదవండి👉 29 ఏళ్ల తర్వాత.. ఇంటెల్ ఇండియా హెడ్ నివృతి రాయ్ రాజీనామా! -
ఫ్లైట్‌లో బీడీ పొగ..
Smoking Beedi inside Flight: విమానంలో బీడీ తాగిన ఓ వ్యక్తిని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఫ్లైట్‌లో బీడీ ఎందుకు తాగావని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. 56 ఏళ్ల ఎం.ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అహ్మదాబాద్ నుంచి ఆకాశ ఎయిర్ విమానంలో బెంగళూరు నగరానికి వస్తున్నాడు. వాష్‌రూమ్‌లో బీడీ తాగుతుండగా విమాన సిబ్బంది పట్టుకున్నారు. బెంగళూరులో దిగగానే ఎయిర్ ప్లేన్ డ్యూటీ మేనేజర్ విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ‘రైలులో తాగినట్లే విమానంలోనూ తాగాను’ తాను ఎక్కువగా రైలులో ప్రయాణిస్తానని, విమానంలో ప్రయాణించడం తనకు తొలిసారి అని పోలీసులకు నిందితుడు తెలిపాడు. రైలు టాయిలెట్ లో బీడీ తాగినట్లే విమానంలోనూ తాగానని అమాయకంగా చెప్పాడు. మార్వార్‌లో కార్మికుడిగా పనిచేస్తున్న కుమార్ మరో వ్యక్తితో కలిసి బెంగళూరులో బంధువు మరణానంతర కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడని పోలీసు అధికారులు తెలిపారు. ఇలా బీడీ తాగిన వ్యక్తిని అరెస్టు చేయడం బెంగుళూరు విమానాశ్రయంలో ఇదే తొలిసారి. గతంలో విమానంలో సిగరెట్ తాగిన ఇద్దరు వ్యక్తులపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: బంఫరాఫర్: వైజాగ్ నుంచి సింగపూర్ విమాన టికెట్ ఎంతో తెలుసా? -
ఎయిర్‌పోర్ట్‌లో అడుక్కుంటున్న యువకుడు.. చివరికి ఏం జరిగిందంటే!
బెంగళూరు: సాధారణంగా మనం రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో భిక్షాటన చేసేవాళ్లను చూస్తుంటాం. కానీ ఓ యువకుడు ఏకంగా ఎయిర్ పోర్టులోని ప్రయాణికుల వద్ద భిక్షాటన చేస్తు కనిపించాడు. ఇది గమనించిన విమానాశ్రయ సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విఘ్నేశ్ అనే 27 ఏళ్ల యువకుడు ఎయిర్ పోర్టులో ప్రవేశించేందుకు చెన్నై వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. విమానాశ్రయంలోకి వెళ్లి అక్కడ ఉన్న ప్రయాణికుల వద్ద.. తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, తక్షణ వైద్యం అందించాలని తప్పుడు కథనాన్ని సృష్టించాడు. ఈ విధంగా చెబుతూ ప్యాసింజర్ల నుంచి రూ. 7వేలు, పదివేలు కావాలంటూ అభ్యర్థించడం మొదలుపెట్టాడు. అతని ప్రవర్తన చూసిన కొందరు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అతడ్ని అరెస్ట్ చేసి 420 సెక్షన్ కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆ యువకుడిని నుంచి 26 క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకోగా.. అందులో 24 క్రెడిట్ కార్డులు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదంతా ఓ ముఠా పని అయ్యిండచ్చని.. విఘ్నేశ్ కూడా ఆ గ్యాంగ్‌లో ఒక్కడే అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో ఈ తరహా కార్యకలాపాలు జరగడం చాలా అరుదు. రెండేళ్ల క్రితం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి ఘటనే జరగగా.. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో ఇటువంటి ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఆకార్ పటేల్ అడ్డగింత
బెంగళూరు: ప్రముఖ పాత్రికేయుడు, చరిత్రకారుడు, ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా మాజీ అధ్యక్షుడు ఆకార్ పటేల్‌కు బుధవారం బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికా పయనమైన ఆయనను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. విదేశాలకు వెళుతున్న తనను అడ్డుకోవడంపై ట్విటర్లో ఆకార్ పటేల్ స్పందించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాపై మోదీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసు కారణంగా తాను లుక్ అవుట్ సర్క్యులర్‌లో ఉన్నట్టు సీబీఐ అధికారి ఫోన్ చేసి చెప్పారని వెల్లడించారు. అమెరికా పర్యటన కోసం గుజరాత్ కోర్టు నుంచి అనుమతి పొందానని, కోర్టు ఆర్డర్‌తో తన పాస్‌పోర్ట్‌ను కూడా తిరిగి తీసుకున్నానని తెలిపారు. అయితే ఆకార్ పటేల్‌పై లుక్అవుట్ నోటీసు ఉందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. రూ. 36 కోట్ల విదేశీ నిధులకు సంబంధించి.. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) నిబంధనలు ఉల్లంఘించారన్న నేపథ్యంలో ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా, ఇతరులపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే లుక్అవుట్ నోటీసు జారీ అయింది. అయితే గతేడాది గుజరాత్ పోలీసులు నమోదు చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆకార్ పటేల్.. అమెరికా వెళ్లేందుకు సూరత్ కోర్టు అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశాయి. తాజా పరిణామాల నేపథ్యంలో తనపై జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని సీబీఐ కోర్టును ఆకార్ పటేల్ ఆశ్రయించారు. దీనిపై స్పందన తెలియజేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఆకార్ పటేల్ పిటిషన్‌పై గురువారం ఉదయం విచారణ జరిగే అవకాశముంది. -
బెంగళూరు ఎయిర్‌పోర్టులో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
బెంగళూరు: బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో సుమారు రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులోని కార్గో సెక్షన్ వద్ద బెడ్షీట్లు, మిషన్ విడిభాగాల్లో దాచి ఉంచిన ఎక్స్టసీ మాత్రలు, హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నైజిరియన్ వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితులపై దర్యాప్తు చేపటినట్లు పేర్కొన్నారు. సరుకుల రూపంలో డ్రగ్స్‌ను జాంబీయా, బెల్జియం నుంచి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న కిలో హెరాయిన్ సుమారు రూ.7కోట్లు, 4.551 కిలోల ఎక్స్టసీ మాత్రలు దాదాపు రూ.3కోట్ల విలువ ఉంటుందని అంచనా. -
బయట నెగెటివ్.. ఎయిర్‌పోర్టులో పాజిటివ్.. మళ్లీ చేస్తే నెగెటివ్.. రచ్చ రచ్చ
దొడ్డబళ్లాపురం (బెంగళూరు): కోవిడ్ థర్డ్‌వేవ్ నేపథ్యంలో బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లాలన్నా, రావాలన్నా అక్కడి ల్యాబ్‌లో ర్యాపిడ్ ఆర్టీ పీసీఆర్ టెస్టులు తప్పనిసరి. అయితే ఈ టెస్టులు చేసే సిబ్బంది ఇష్టానుసారం రిపోర్టులు ఇస్తున్నారని మొదటి నుంచీ ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటిదే మరో సంఘటన గత గత గురువారం జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌కి వెళ్లాల్సిన ఒక యువకుడు కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని నివేదిక ఇచ్చారు. అంతకుముందే అతడు బయట టెస్టు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. మళ్లీ బయట టెస్టు చేస్తే నెగెటివ్‌గా తేలింది. దీంతో ఆ యువకుడు తన కుటుంబ సభ్యులతో ఎయిర్‌పోర్టుకు వచ్చి తనకు టెస్టు చేసిన సిబ్బందిని నిలదీశాడు. ఆ సమయంలో సిబ్బంది మద్యం మత్తులో ఉండడంతో గొడవ పెరిగింది. తప్పుడు నివేదిక వల్ల దుబాయ్‌కి వెళ్లలేకపోయానని, ఆ నష్టాన్ని ఎవరు తీరుస్తారని బాధిత యువకుడు వాపోయాడు. ఈ గొడవ వీడియోలు వైరల్ అయ్యాయి. కాగా, అడిగినంత డబ్బులను ముట్టజెబితే ల్యాబ్ సిబ్బంది ఎలా కావాలంటే అలా నివేదిక ఇస్తారని ఆరోపణలు ఉన్నాయి. చదవండి: (అర్ధరాత్రి పార్టీ.. మద్యం మత్తులో చిందులు.. నటులపై కేసు) -
తప్పిన ఘోర ప్రమాదం! ఆలస్యంగా వెలుగులోకి..
బెంగళూరు: బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు ఇండిగో విమానాలు గాల్లో ఉండగా.. కాస్తలో ఒకదాంతో మరొకటి ఢీ కొట్టే ప్రమాదం తప్పింది. జనవరి 7వ తేదీనే ఈ ఘటన జరిగిందని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ సీనియర్ అధికారులు బుధవారం వెల్లడించారు. ఇండిగో విమానం 6ఈ455 (బెంగళూరు నుండి కోల్‌కతా), 6ఈ246 (బెంగళూరు నుండి భువనేశ్వర్) ఉదయం పూట వెళ్తున్న సమయంలో సుమారు 5 నిమిషాల వ్యవధిలో కెంపగౌడ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ రెండు విమానాలు గాల్లో అత్యంత దగ్గరా సమీపిస్తుండగా రాడార్లు హెచ్చరించాయి. దీంతో రెండు విమానాల పైలట్లు వెంటనే అప్రమత్తమై దూరంగా మళ్లించండంతో ఢీకొట్టే ముప్పు తప్పిందని తెలిపారు. ఘటన జరిగినప్పుడు రెండు విమానాలు 3,000 అడుగుల ఎత్తులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బెంగళూరు-కోల్‌కతా విమానంలో 176 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది. బెంగళూరు-భువనేశ్వర్ విమానంలో 238 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మొత్తం 426 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. రెండు విమానాలు గాల్లో ప్రమాదకరంగా అత్యంత సమీపంగా కదులుతున్న సమయంలో అప్రోచ్ రాడార్ కంట్రోలర్ లోకేంద్ర సింగ్ గమనించి.. వెంటనే రెండు విమానాలకు సిగ్నల్ ద్వారా హెచ్చరికలు పంపారు. దీంతో రెండు విమానాలు గాల్లో ఢీకొనకుండా నివారించారని డీజీసీఏ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎక్కడా నివేదించలేదని తెలిపారు. దీనిపై డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ స్పందిస్తూ.. ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటరీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. దీనికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు విమానాలు బెంగళూరు విమానాశ్రయం టేకాఫ్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు పేర్కొన్నారు. -
'ఆ స్టార్ హీరోను తన్నిన వారికి నగదు బహుమతి'..సంచలన ప్రకటన
Hindu Makkal Katchi Announces Cash Prize For Anyone Who Kicks Sethupathi: తమిళ సూపర్‌స్టార్ విజయ్ సేతుపతిపై బెంగుళూరుఎయిర్పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే. గాంధీ అనే వ్యక్తి సేతుపతిపై దాడికి యత్నించగా ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇటీవలె ఈ ఘటనపై స్పందించిన సేతుపతి..ఇది చిన్న గొడవ అని, వీడియోలు వైరల్ కావడంతో జనాలు దీన్ని పెద్ద సమస్యగా చూస్తున్నారంటూ కొట్టిపారేశారు. తాజాగా హిందూ మక్కల్ కట్చి అనే ఒక హిందూ సంస్థ తమిళ సూపర్‌స్టార్ సేతుపతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.చదవండి: ఎయిర్‌పోర్టులో దాడి: అసలేం జరిగిందో వివరించిన సేతుపతి విజయ్ సేతుపతిని తన్నిన వారికి ఒక్క కిక్కు రూ. 1000రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది. దీనిపై సంస్థ చీఫ్ అర్జున్ సంపత్ స్పందిస్తూ..స్వాతంత్ర్య సమరయోధుడు దైవతిరు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ అయ్యను, దేశాన్ని సేతపతి అవమానించాడని..ఆయన క్షమాపణ చెప్పేవరకు ఎక్కడ కనిపించినా కొట్టాలని కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. చదవండి: కొత్త ఇంట్లోకి బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ గృహప్రవేశం భర్త అరెస్ట్.. హాస్పిటల్లో నటి పూనమ్ పాండే -
ట్రెండింగ్‌లో నాలుగేళ్ల చిన్నారి.. ఏం చేశాడంటే
కర్ణాటక: ఉదయం లేచిన దగ్గర నుంచి మన పనులన్నింటిని సవ్యంగా పూర్తి చేసుకుని.. రాత్రి ఇంటికి చేరుకుని.. ఏ భయం లేకుండా గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్ర పోతున్నామంటే అందుకు ప్రధాన కారణం భద్రతా సిబ్బంది. వారు కుటుంబాలకు దూరంగా, నిద్రాహారాలు మాని.. మన కోసం పని చేస్తున్నారు కాబట్టే.. మనం సురక్షితంగా ఉండగల్గుతున్నాం. అలాంటి వారి పట్ల మనం గౌరవమర్యాదలు కలిగి ఉండటం వారికిచ్చే అసలైన ప్రశంస. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నాలుగేళ్ల కుర్రాడు.. రక్షణ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని చూసి.. వారికి సెల్యూట్ చేస్తాడు. ప్రతిగా వారు చిన్నారికి అభివాదం చేస్తారు. ఈ వీడియో చూసిన నెటిజనులు చిన్నారి దేశభక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు.. (చదవండి: చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ) ఈ సంఘటన కర్ణాటక, బెంగళూరు విమానాశ్రయంలో చోటు చేసుకుంది. దీనిలో నాలుగెళ్ల చిన్నారి వీర్ అర్జున్ తండ్రి చేయి పట్టుకుని నడుచుకుంటూ విమానాశ్రయం లోపలకి వెళ్తుంటాడు. ఆ సమయంలో వీర్‌కు ఎదురుగా సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) జవాన్లు తన విధులకు హాజరయ్యేందుకు వాహనంలో వస్తుంటారు. వారిని గమనించిన వీర్.. తండ్రి చేయి వదిలిపెట్టి.. సీఐఎస్ఎఫ్ వాహనానికి ఎదురుగా నిలబడి.. వారికి సెల్యూట్ చేస్తాడు. వీర్ని గమనించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రతిగా సెల్యూట్ చేస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోని వీర్ తండ్రి తొలుత ట్విటర్లో షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజనులు వీర్‌పై ప్రశంసలు కురిపించసాగారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ వీడియోని రీ పోస్ట్ చేస్తూ.. ‘‘గౌరవం, దేశభక్తి వంటి అంశాలను బాల్యంలోనే నేర్పించాలి’’ అంటూ వీర్‌పై ప్రశంసలు కురిపించడంతో ఇది మరోసారి వైరలయ్యింది. ఇప్పటికే ఈ వీడియో ని 4 లక్షల మందికిపైగా లైక్ చేశారు. (చదవండి: డ్రైవర్ నిర్లక్ష్యంతో.. సంధ్య వాలింది) ఈ వీడియో చూసిన నెటిజనులు.. ‘‘ఈ చిన్నారి దేశభక్తిని చూసి ఫిదా అయ్యాను. చిన్నారిని అతడి తల్లిదండ్రులు సరైన మార్గంలో పెంచుతున్నారు.. ఇలాంటి మంచి లక్షణాలను బాల్యం నుంచే అలవాటు చేస్తున్నారు. బాలుడికి సెల్యూట్ చేసిన సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అభినందనలు’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: ‘ఏడవకురా.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’ At #Bengaluru airport - a young Indian snaps off a salute to our men in uniform. Respect n Patriotism is learnt young. #Respect #JaHind 🇮🇳🙏🏻👏🏻 Video courtesy @MihirkJha 🙏🏻 pic.twitter.com/IeEkTZCnIH — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) October 24, 2021 -
లవ్యూ దాదా.. గంగూలీ సెల్ఫీకి యమ క్రేజ్!
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంటే ఆయన అభిమానులు పడిచస్తారు. క్రికెట్ నుంచి తప్పుకున్నా.. ఇప్పటికీ గంగూలీ క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న గంగూలీ బుధవారం బెంగళూరు వెళ్లారు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో చెకిన్ వద్ద ఆయనను చూసి అభిమానులు చుట్టుముట్టారు. తన పట్ల ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమకు ముగ్ధుమైన గంగూలీ వారితో కలిసి ఒక గ్రూప్ సెల్పీ దిగారు. ఈ సెల్ఫీలో గంగూలీ ఫ్యాన్సే కాదు.. వెనుక ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా నవ్వులు చిందించడం చూడొచ్చు. ‘ఇది బెంగళూరు ఎయిర్‌పోర్టులో చెకిన్ వద్ద.. ప్రజల అభిమానానికి ఎంతో కృతజ్ఞుడిని’ అంటూ గంగూలీ ఈ సెల్ఫీ ట్వీట్ చేశారు. అది ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఇప్పటికే దాదాపు 82వేలమంది ఈ సెల్ఫీని లైక్ చేశారు. 4800లకుపైగా రీట్వీట్ చేశారు. లవ్యూ దాదా.. నిన్ను చూసి మేం గర్విస్తున్నాం. క్రికెట్లో నువ్వెప్పుడూ బాస్‌వే అంటూ అభిమానులు ఈ సెల్ఫీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. At the check in airport of bangalore .. love of people makes u feel so grateful pic.twitter.com/FDP2fwzg6W — Sourav Ganguly (@SGanguly99) October 30, 2019 -
స్వచ్ఛ భారత్ అంటే ఇదేనా..!
బెంగళూరు: భారత మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమారావుకు చేదు అనుభవం ఎదురైంది. బెంగుళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని లాంజ్‌లో అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్ వల్ల ఆమె తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఈ క్రమంలో అపరిశుభ్ర టాయిలెట్ ఫోటోలు తీసి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీటిని బెంగుళూరు విమానాశ్రయ అధికారిక ట్విటర్ ఖాతాకు నిరుపమ ట్యాగ్ చేశారు. దీంతోపాటు ‘విరిగిన పోయిన టాయిలెట్ టబ్, నిండినపోయిన చెత్త క్యాన్లు ఉన్నాయి. ఇదేనా ‘స్వచ్ఛ భారత్’ అంటే.. ‘స్వచ్ఛ భారత్’ ఎక్కడ ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఇలా ఉండటం బాధాకరం’ అంటూ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో నిరుపమ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ ఘటనపై స్పందించిన బెంగళూరు ఎయిర్ పోర్టు అధికారులు నిరుపమకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సత్వరమే టాయిలెట్‌ను బాగు చేసి మళ్లీ తమ ట్విటర్లో ఆ ఫోటోలను పోస్ట్ చేశారు. ఎయిర్‌పోర్టు ఆధికారులు స్పదించిన తీరుకు నిరుపమ సంతోషించారు. ఈ క్రమంలో త్వరగా స్పందించి.. ఎయిర్ పోర్టు అధికారులు నిరుపమ మనసును గెలుచుకున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
లంచ్‌బాక్స్ కడగమనడంతో.. గంటసేపు ఆలస్యం
ఓ పైలట్ తన లంచ్‌బాక్స్‌ను కడగమని జూనియర్ సిబ్బందిని ఆదేశించడంతో పైలట్- సిబ్బంది మధ్య తీవ్ర వాదనకు తెర లేపింది. దీంతో బెంగళూరు ఎయిర్ ఇండియా విమానం ఏఐ772 సోమవారం గంటకు పైగా ఆలస్యం అయింది. ఈ సంఘటన బెంగళూరు విమానాశ్రయంలో చోటు చేసుకుంది. పైలట్ మరియు సిబ్బంది ప్రయాణికుల ముందే గోడవకు దిగారు. ఫలితంగా బెంగళూరు-కోల్‌కతా విమానం 77 నిమిషాలు ఆలస్యం అయింది. ఈ ఘటనపై వైమానిక సంస్థ వెంటనే చర్యలు తీసుకుంది. ఎయిర్ ఇండియా ప్రతినిధి ఈ సంఘటనను 'ధృవీకరించి, ఈ విషయం దర్యాప్తులో ఉంది' అన్నారు. ‘కెప్టెన్లు తరచూ క్యాబిన్ సిబ్బందిని మెనియల్ ఉద్యోగాలు చేయమని నెట్టివేస్తారు. కెప్టెన్ మీ యజమాని అయినప్పుడు ఏమి చెప్పగలము. వారిపై ఫిర్యాదులు ఎటువంటి ప్రభావం చూపవు‘ అని క్యాబిన్ సిబ్బంది అన్నారు. -
పారాలింపియన్ కు అవమానం
బెంగళూరు: పారాలింపియన్ ఆదిత్యా మెహతాకు అవమానం జరిగింది. ఈ నెల 11వ తేదీన బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం(కేఐఏ)కు నుంచి హైదరాబాద్ బయల్దేరిన తనతో అధికారులు తప్పుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ఆసియన్ పారా-సైక్లింగ్ చాంపియన్ షిప్-2013లో ఆదిత్యా మెహతా రెండు వెండి పతకాలు సాధించారు. తన కృత్రిమ కాలును భద్రతా కారణాల రీత్యా పరిశీలించాలని చెప్పిన సీఐఎస్ఎఫ్ అధికారులు ఆ తర్వాత బలవంతంగా బట్టలు తీయించి తనను చూసి నవ్వుకున్నారని చెప్పారు. ఆ తర్వాత ప్రయాణానికి అనుమతించినట్లు తెలిపారు. తనను ట్రీట్ చేస్తున్న విధానంపై అధికారులను ప్రశ్నించగా వారు అవేమీ పట్టించుకోలేదని అన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఓ సీఐఎస్ఎఫ్ అధికారి పేరును చెబుతూ ఆయన తీవ్రంగా స్పందించారు. దివ్యాంగులను చెక్ చేసేందుకు డీజీసీఏ ఫుల్ బాడీ స్కానర్లను ఏర్పాటు చేయాలని లేఖ రాసినట్లు చెప్పారు. రెండు నెలల క్రితం కూడా ఓ ఎయిర్ పోర్టులో ఆదిత్యా మెహతా కృత్రిమ కాలును పరిశీలించారు. కాగా, కృత్రిమ అవయవాలను పరిశీలించడం చెకింగ్ లో భాగమని హైదరాబాద్ లోని డీజీసీఏ కార్యాలయం తెలిపింది.