Smoking Beedi inside Flight: విమానంలో బీడీ తాగిన ఓ వ్యక్తిని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఫ్లైట్‌లో బీడీ ఎందుకు తాగావని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి.
ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్‌టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ!
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. 56 ఏళ్ల ఎం.ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అహ్మదాబాద్ నుంచి ఆకాశ ఎయిర్ విమానంలో బెంగళూరు నగరానికి వస్తున్నాడు. వాష్‌రూమ్‌లో బీడీ తాగుతుండగా విమాన సిబ్బంది పట్టుకున్నారు. బెంగళూరులో దిగగానే ఎయిర్ ప్లేన్ డ్యూటీ మేనేజర్ విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
‘రైలులో తాగినట్లే విమానంలోనూ తాగాను’
తాను ఎక్కువగా రైలులో ప్రయాణిస్తానని, విమానంలో ప్రయాణించడం తనకు తొలిసారి అని పోలీసులకు నిందితుడు తెలిపాడు. రైలు టాయిలెట్ లో బీడీ తాగినట్లే విమానంలోనూ తాగానని అమాయకంగా చెప్పాడు. మార్వార్‌లో కార్మికుడిగా పనిచేస్తున్న కుమార్ మరో వ్యక్తితో కలిసి బెంగళూరులో బంధువు మరణానంతర కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడని పోలీసు అధికారులు తెలిపారు. ఇలా బీడీ తాగిన వ్యక్తిని అరెస్టు చేయడం బెంగుళూరు విమానాశ్రయంలో ఇదే తొలిసారి. గతంలో విమానంలో సిగరెట్ తాగిన ఇద్దరు వ్యక్తులపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: బంఫరాఫర్: వైజాగ్ నుంచి సింగపూర్ విమాన టికెట్ ఎంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment