Inside
-
కార్మికులు కనిపించారు
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగం కూలిన 10వ రోజైన మంగళవారం సానుకూల పరిణామం సంభవించింది. లోపల చిక్కుకున్న 41 మంది కార్మికులతో వారి కోసం బయట వేచి ఉన్న కుటుంబసభ్యులు మరింత సులువుగా, స్పష్టంగా మాట్లాడారు. అంతేకాకుండా, లోపలున్న వారికి సంబంధించిన విజువల్స్ మొట్టమొదటిసారిగా బయటకు వచ్చాయి. దీంతో, కూలిన సొరంగం శిథిలాల్లోంచి తవ్విన ఆరంగుళాల పైప్‌లైన్ ద్వారా ఎండోస్కోపిక్ కెమెరాను పంపించి, లోపలున్న వారి యోగ క్షేమాలను తెలుసుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విజయవంతమైనట్లయింది. ఈ పైపును 53 మీటర్ల మేర అడ్డుపడిన శిథిలాల గుండా సోమవారం లోపలికి ప్రవేశపెట్టారు. కెమెరాను సోమ వారం రాత్రి ఢిల్లీ నుంచి అక్కడికి పంపించారు. పసుపు, తెలుపు రంగుల హెల్మెట్లను ధరించిన కార్మికులు, పైపులైన్‌ద్వారా లోపలికి పంపించిన ఆహార పదార్థాలను ఒకరికొకరు అందించుకుంటూ, మాట్లాడుకుంటూ ఆ విజువల్స్‌లో కనిపించారు. బయటున్న అధికారులు పెద్ద స్క్రీన్‌పై వారిని చూస్తూ తగు సూచనలు ఇచ్చారు. కెమెరా లెన్స్ శుభ్రంగా ఉంచుతూ, తమను తాము పరిచయం చేసుకోవాలని కోరారు. పైప్‌లైన్ దగ్గరకు చేరుకుని లోపలికి పంపించిన వాకీటాకీలతో మాట్లాడాలని చెప్పారు. అనంతరం ఆ కెమెరాను వెనక్కి తీశారు. ఇప్పటికే కొందరి కుటుంబసభ్యులు నాలుగంగుళాల కంప్రెషర్ ట్యూబ్ ద్వారా లోపలున్న తమ వారితో మాట్లాడారు. ఆ ట్యూబ్ ద్వారానే డ్రైఫ్రూట్స్ వంటివి కూడా లోపలికి పంపించారు. అయితే, తాజాగా అందుబాటులోకి వచ్చిన పైప్‌లైన్ కార్మికుల పాలిటి లైఫ్‌లైన్‌గా మారింది. ఇంతకుముందు కంటే ఎక్కువ ఆహారాన్ని పంపొచ్చు. కుటుంబసభ్యులతో మరింత సులువుగా, స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. కొత్త పైపు ద్వారా లోపలున్న వారికి నారింజ, అరటి, యాపిల్ పండ్లు, బాటిళ్లలో కిచిడీ, సెల్ఫోన్లు, చార్జెర్లను సైతం పంపించారు. ఒక డాక్టర్ కూడా లోపలున్న కార్మికులతో మాట్లాడారు. వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కడుపులో మంట, మూత్ర విజర్జనలో సమస్య..తదితరాలను తెలపగా వారికి మల్టీవిటమిన్ ట్యాబెట్లు, ఎలక్ట్రోలైట్ పౌడర్, యాంటీ డిప్రెస్సెంట్లను పంపినట్లు డాక్టర్ పీఎస్ పొఖ్రియాల్ చెప్పారు. సొరంగంలో చిక్కుకుపోయిన ప్రదీప్ కిక్సు క్షేమంగానే ఉన్నట్లు ఆయన మరదలు తెలిపారు. -
లోకల్ ట్రైన్లో మహిళల సిగపట్లు.. పొట్టు పొట్టు కొట్టుకున్నారు..!
కలకత్తా: ట్రైన్లలో ప్రయాణికుల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. రైళ్లలో గొడవ పడుతూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ముంబయి లోకల్ ట్రైన్లో మహిళల ఫైటింగ్ వార్త మరవక ముందే కలకత్తా లోకల్ ట్రైన్లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళలు గుంపుగా ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. కలకత్తా లోకల్ ట్రైన్లో మహిళలు వీరంగం సృష్టించారు. ఒకరినొకరు జట్లు పట్టుకుని చెప్పులతో కొట్టుకున్నారు. బూతులు తిట్టుకుంటూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. లోకల్ ట్రైన్ మహిళా కంపార్ట్మెంట్లో జరిగిన ఈ ఘటనను ఓ యూజర్ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. కేవలం మూడు రోజుల్లో 6 వేల వ్యూస్ వచ్చాయి. Kolkata local🙂 pic.twitter.com/fZDjsJm93L — Ayushi (@Ayushihihaha) July 11, 2023 ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ట్రైన్లో ఉచితంగా డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్ చూడొచ్చు అంటూ ఓ యూజర్ ఫన్నీగా కామెంట్ చేశాడు. మహిళలకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉంది.. కానీ ఇలాంటి ఘటనలు కూడా చూడాల్సి వస్తోందంటూ మరో యూజర్ స్పందించాడు. క్లినిక్ ప్లస్ యాడ్‌లా ఉందంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇదీ చదవండి: సీబీఐ స్కెచ్.. వలలో చిక్కిన హెడ్ కానిస్టేబుల్.. వీడియో వైరల్.. -
ఫ్లైట్‌లో బీడీ పొగ..
Smoking Beedi inside Flight: విమానంలో బీడీ తాగిన ఓ వ్యక్తిని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఫ్లైట్‌లో బీడీ ఎందుకు తాగావని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. 56 ఏళ్ల ఎం.ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అహ్మదాబాద్ నుంచి ఆకాశ ఎయిర్ విమానంలో బెంగళూరు నగరానికి వస్తున్నాడు. వాష్‌రూమ్‌లో బీడీ తాగుతుండగా విమాన సిబ్బంది పట్టుకున్నారు. బెంగళూరులో దిగగానే ఎయిర్ ప్లేన్ డ్యూటీ మేనేజర్ విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ‘రైలులో తాగినట్లే విమానంలోనూ తాగాను’ తాను ఎక్కువగా రైలులో ప్రయాణిస్తానని, విమానంలో ప్రయాణించడం తనకు తొలిసారి అని పోలీసులకు నిందితుడు తెలిపాడు. రైలు టాయిలెట్ లో బీడీ తాగినట్లే విమానంలోనూ తాగానని అమాయకంగా చెప్పాడు. మార్వార్‌లో కార్మికుడిగా పనిచేస్తున్న కుమార్ మరో వ్యక్తితో కలిసి బెంగళూరులో బంధువు మరణానంతర కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడని పోలీసు అధికారులు తెలిపారు. ఇలా బీడీ తాగిన వ్యక్తిని అరెస్టు చేయడం బెంగుళూరు విమానాశ్రయంలో ఇదే తొలిసారి. గతంలో విమానంలో సిగరెట్ తాగిన ఇద్దరు వ్యక్తులపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: బంఫరాఫర్: వైజాగ్ నుంచి సింగపూర్ విమాన టికెట్ ఎంతో తెలుసా? -
వైరల్ వీడియో: బట్టల షాప్‌కు వెళ్లిన ఆవు
-
ఇస్తాంబుల్ దాడి సూత్రధారులు వారే..
టర్కీ పేలుళ్ళ సూత్రధారులను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఎయిర్ పోర్టులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డవారుగా భావిస్తున్నవారి ఫోటోలను స్థానిక మీడియా వెల్లడించింది. రైఫిళ్ళు చేత పట్టుకొని ముగ్గురు దుండగులు దాడులకు తెగబడినట్లుగా ఫోటోలనుబట్టి తెలుస్తోంది. పర్యాటక నగరం ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రక్తపాతం సృష్టించిన ఉగ్రవాదులను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. తుపాకులు, బాంబులతో మారణహోమానికి తెగబడి, 41 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. ఉన్మాదుల దాడిలో 230 మంది వరకూ తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఈ దాడులు ఇస్లామిక్ స్టేట్ పనేనని టర్కీ ప్రధాని బినాలీ ఇల్ డ్రిం అంటున్నారు. మృతుల్లో ఐదుగురు సౌదీకి చెందినవారు, ఇద్దరు ఇరాక్ దేశస్థులు, ఇంకా జోర్దాన్, టునీషియా, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, ఉక్రెయిన్ లకు చెందిన 13 మంది విదేశీయులున్నారు. ప్రస్తుతం విడుదలైన వీడియోలను బట్టి చూస్తే దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ముగ్గురు, కాల్పులు జరిపిన అనంతరం తమను తాము రైఫిళ్ళతో పేల్చేసుకున్నట్లు తెలుస్తోంది. గత మార్చిలో బ్రసెల్స్ లో కూడా ఇదే తరహాలో జరిగిన దాడుల్లో 32 మంది మరణించారు. అయితే ప్రస్తుత దాడుల్లో ఉగ్రవాదులెవరూ ఎయిర్ పోర్టు ప్రధాన ద్వారం నుంచీ ప్రవేశించలేదు. ముందుగా ఓ వ్యక్తి టర్మినల్ కు బయటే తనను తాను పేల్చేసుకోగా.. సందట్లో సడేమియాగా మిగిలిన ఇద్దరూ ఎయిర్ పోర్టు భవనంలోకి ప్రవేశించినట్లు తెలిసింది. బిల్డింగ్ దగ్గరకు నడుచుకుంటూ వెడుతున్నటెర్రరిస్టు, మరో ఫోటోలో నల్లని డ్రస్ ధరించి రైఫిల్ చేత పట్టుకొని కాల్పులు జరుపుతున్న దృశ్యాలు బయటపడటంతో పోలీసులు ఆ ఫుటేజీని విడుదల చేశారు. -
హింసను అరికట్టేందుకు ' స్పీక్ అప్'!
దుబాయ్ జుమైరా బీచ్ రెసిడెన్స్ ఆరెంజ్ కంటెయినర్ లో ' స్పీక్ అప్' పేరిట నిర్వహించిన కార్యక్రమం.. హాజరైన వారికి కన్నీళ్ళు తెప్పించింది. బాధిత మహిళల ఆవేదనను బహిర్గతం చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో వినిపించిన ఆ స్వరం... అక్కడివారి హృదయాలను కదిలించింది. ఓ తాగుబోతు భర్తనుంచి ఆమె ఎదుర్కొంటున్న వేధింపుల వివరాలతో... బాధిత మహిళ జీవిత గాధ ఆధారంగా రూపొందించిన ఆడియో కథనం అది. మనసులను కదిలించిన ఆ భావోద్వేక సౌండ్ ట్రాక్ మహిళాలోకాన్నే మేలుకొలిపేందుకు, అవగాహన కల్పించేందుకు నినాదమైంది. అరబ్బు దేశంలో మొదటిసారి మహిళలపై గృహ హింసకు వ్యతిరేకంగా 'దుబాయ్ ఫౌండేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఛిల్డ్రన్' ఏర్పాటు చేసిన మూడు రోజుల ఇంటరాక్ట్రివ్ కార్యక్రమం అది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు పునాదిగా మారింది. పదిమంది మహిళల్లో సుమారు ఏడుగురు తమ జీవిత కాలంలో హింసను ఎదుర్కొంటున్నట్లు యునైటెడ్ నేషన్స్ లెక్కల ప్రకారం తెలుస్తోందని కార్యక్రమం మేనేజర్ ఫాతిమా అస్ ఫలాసి తెలిపారు. బాధితులు నిశ్శబ్దంగా అనుభవిస్తున్న కష్టాలను ఈ వేదిక ద్వారా ప్రపంచానికి తెలియజెప్పాలన్నదే తమ ఆశయమని, గుండె లోతుల్లో దాచుకున్న వారి భావోద్వేగాలను తెలుసుకొని వారికి ఉపశమనం కలిగించేందుకు తమ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందని ఫాతిమా భావిస్తున్నారు. ఇటువంటి వేదికపై మహిళలు హింసపై మాట్లాడడం మంచి సంకేతమని, మరొకరికి సహాయంగా మారుతుందని ఫాతిమా అంటున్నారు. గత ఏడు సంవత్సరాల్లో దుబాయ్ ఫౌండేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఛైల్డ్ సుమారు 15 వందలకు పైగా గృహహింస కేసులను పరిష్కరించింది. బాధితుల్లో ఎక్కువశాతం 18 ఏళ్ళ వయసున్నవారు... ఇతర దేశాలనుంచి వచ్చి, దుబాయ్ లోని పురుషులు, కుటుంబ సభ్యులవల్ల శారీరకంగానూ, మానసికంగానూ గృహ హింసకు గురైన వారే ఉన్నారు. అయితే మహిళలపై హింసకు పాల్పడటంలో ఏ దేశం మినహాయింపు కాదని, సుమారు ఆరు వందల మిలియన్లకు పైగా గృహహింసకు గురౌతుంటే దాన్ని హింసగా గుర్తించడం లేదని ఫాతిమా అన్నారు. అయితే హింస ఎటువంటిదైనా సహాయం అందించడానికి తాము సిద్ధంగా ఉంటామని ఆమె తెలిపారు. అలాగే సమావేశం తర్వాత ఎందరో తమ అనుభవాలను, కన్నీటి గాధలను తమతో పంచుకున్నారని, సౌండ్ ట్రాక్ విన్నవారు స్పందించి, గృహ హింసకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు వస్తున్నారని చెప్తున్నారు. అల్ ఫలాసీ ఆరెంజ్ కంటైనర్ మరి కొద్ది నెలల్లో గృహహింస నిర్మూలకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుందని వెల్లడించారు. ఇటీవల జనంలో గృహహింసపై అవగాహన కల్పించేందుకు, జీవితాలను తీర్చిదిద్దేందుకు ఎన్నో టీవీ కార్యక్రమాలను సైతం రూపొందిస్తున్నారు. అయితేనేం రోజురోజుకూ బాధితులు పెరిగిపోతూనే ఉన్నారు. ఆరెంజ్ కంటైనర్ మరి ఏ మేరకు సేవలు అందించగల్గుతుందో వేచి చూడాలి. -
హాస్టల్ యువతుల పట్ల యజమాని అసభ్య ప్రవర్తన