ఇస్తాంబుల్ దాడి సూత్రధారులు వారే.. | CCTV captures moment bomb detonates inside Istanbul airport | Sakshi
Sakshi News home page

ఇస్తాంబుల్ దాడి సూత్రధారులు వారే..

Published Thu, Jun 30 2016 8:31 PM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

ఇస్తాంబుల్ దాడి సూత్రధారులు వారే..

ఇస్తాంబుల్ దాడి సూత్రధారులు వారే..

టర్కీ పేలుళ్ళ సూత్రధారులను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఎయిర్ పోర్టులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డవారుగా భావిస్తున్నవారి ఫోటోలను స్థానిక మీడియా వెల్లడించింది. రైఫిళ్ళు చేత పట్టుకొని ముగ్గురు దుండగులు దాడులకు తెగబడినట్లుగా  ఫోటోలనుబట్టి తెలుస్తోంది.

పర్యాటక నగరం ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రక్తపాతం సృష్టించిన ఉగ్రవాదులను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. తుపాకులు, బాంబులతో మారణహోమానికి తెగబడి, 41 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. ఉన్మాదుల దాడిలో  230 మంది వరకూ తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఈ దాడులు ఇస్లామిక్ స్టేట్ పనేనని టర్కీ ప్రధాని బినాలీ ఇల్ డ్రిం అంటున్నారు. మృతుల్లో  ఐదుగురు సౌదీకి చెందినవారు, ఇద్దరు ఇరాక్ దేశస్థులు, ఇంకా జోర్దాన్, టునీషియా, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, ఉక్రెయిన్ లకు చెందిన 13 మంది విదేశీయులున్నారు.

ప్రస్తుతం విడుదలైన వీడియోలను బట్టి చూస్తే దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ముగ్గురు, కాల్పులు జరిపిన అనంతరం  తమను తాము రైఫిళ్ళతో పేల్చేసుకున్నట్లు తెలుస్తోంది.  గత మార్చిలో బ్రసెల్స్ లో కూడా ఇదే తరహాలో జరిగిన దాడుల్లో 32 మంది మరణించారు. అయితే ప్రస్తుత దాడుల్లో ఉగ్రవాదులెవరూ ఎయిర్ పోర్టు ప్రధాన ద్వారం నుంచీ ప్రవేశించలేదు. ముందుగా ఓ వ్యక్తి టర్మినల్ కు బయటే తనను తాను పేల్చేసుకోగా.. సందట్లో సడేమియాగా మిగిలిన ఇద్దరూ ఎయిర్ పోర్టు భవనంలోకి ప్రవేశించినట్లు తెలిసింది. బిల్డింగ్ దగ్గరకు నడుచుకుంటూ వెడుతున్నటెర్రరిస్టు, మరో ఫోటోలో నల్లని డ్రస్ ధరించి రైఫిల్ చేత పట్టుకొని కాల్పులు జరుపుతున్న దృశ్యాలు బయటపడటంతో పోలీసులు ఆ ఫుటేజీని విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement