Bomb Threat To San Francisco Officials Found Suspicious Package - Sakshi
Sakshi News home page

San Francisco International Airport: విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. అనుమానాస్పద ప్యాకేజీ చూసి హడల్‌

Published Sat, Jul 16 2022 1:24 PM | Last Updated on Sat, Jul 16 2022 1:46 PM

Bomb Threat To San Francisco Officials Found Suspicious Package - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో బాంబు ఉందని బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. సమాచారం అందిన వెంటనే ఇంటర్నేషనల్ టర్మినల్‌ను ఖాళీ చేయించారు అధికారులు. అనుమానాస్పద ప్యాకేజీని గుర్తించినట్లు వెల్లడించారు. పోలీసులు, సిబ్బంది విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. తాము చెప్పే వరకు ఇంటర్నేషనల్ టర్మినల్ వైపు ఎవరూ రావొద్దని అధికారులు సూచించారు. అక్కడ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు వెల్లడించారు.

2020లో శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయాన్ని 30 లక్షల మందికిపైగా ప్రయాణికులు వినియోగించారు. పికప్‌, డ్రాప్ ఆఫ్ సేవలు తమ దేశీయ టర్మినల్స్‌లో  మాత్రమే అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.

చదవండి: ట్రంప్ మొదటి భార్య మృతిపై అనుమానాలు! వైద్యులు ఏం చెప్పారంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement