San Francisco
-
నాన్సీపై సైకత్ పోటీ
వాషింగ్టన్: అమెరికా హౌస్ మాజీ స్పీకర్, 21వసారి కాంగ్రెస్‌కు పోటీ పడుతున్న నాన్సీ పెలోసీ(85)కి భారత సంతతికి చెందిన యువ రాజకీయ నేత నుంచి అనూహ్యంగా గట్టి పోటీ ఎదురవనుంది. శాన్ఫ్రాన్సిస్కో కంగ్రెషనల్ స్థానానికి డెమోక్రాటిక్ పార్టీ తరఫున పెలోసీపై పోటీ చేయనున్నట్లు సైకత్ చక్రవర్తి ప్రకటించారు. పురుషాధిక్యత కలిగిన అమెరికా రాజకీయాల్లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని నాయకురాలిగా పెలోసీ కొనసాగుతున్నారు. 2026 నవంబర్‌లో జరిగే ఎన్నికకు మళ్లీ ఎన్నికయ్యేందుకు ఆమె ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఆమె ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. ప్రతినిధుల సభలో సభ్యురాలిగా 2027 జనవరి వరకు పెలోసీ కొనసాగుతారు. ఈ పదవికి 2026 నవంబర్‌లో ఎన్నిక జరగనుంది. అదే సమయంలో డెమోక్రాటిక్ ప్రైమరీకి 2026 ఆరంభంలో ఎన్నిక నిర్వహిస్తారు.శాన్ఫ్రాన్సిస్కో డెమోక్రాట్లకు కంచుకోట వంటిది. ప్రైమరీలో గెలుపొందిన వారే భవిష్యత్తులో ప్రతినిధుల సభకు ఎన్నికయ్యే అవకాశాలెక్కువ. ‘నాన్సీ పెలోసీ మరోసారి పోటీ చేయనున్నారని తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోవడం ఖాయం. కానీ, ఇది ఆమెకు 21వ సారి. 45 ఏళ్ల క్రితం ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి అమెరికాకు ఇప్పటికి ఎంతో తేడా ఉంది. డెమోక్రాటిక్ పార్టీ కొత్త నాయకత్వాన్ని కోరుకుంటోందన్నది సుస్పష్టం. అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ ల పాలన చూసి ప్రజలు ప్రత్నామ్నాయం కోరుకుంటున్నారు. అందుకే నాన్సీ పెలోసీపై ఈసారి బరిలోకి దిగాలనుకుంటున్నా’అని సైకత్ గురువారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పెద్దపెద్ద దాతలిచ్చే విరాళాల కంటే ఓటర్లతో మమేకం అయ్యేందుకు కృషి చేస్తానన్నారు. ఎవరీ సైకత్ చక్రవర్తి? 1986లో టెక్సాస్‌లో బెంగాలీ కుటుంబంలో జని్మంచిన సైకత్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి 2007లో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేశారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా సిలికాన్ వ్యాలీలో కొంతకాలం పనిచేశారు. 2015లో సెనేటర్ బెర్నీ శాండర్స్ అధ్యక్ష ప్రచార కమిటీలో సేవలందించారు. దీంతోపాటు రాజకీయ సలహాదారుగా డెమోక్రాటిక్ పారీ్టకి చెందిన అలెగ్జాండ్రియా ఒకాసియో– కార్టెజ్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా గతంలో వ్యవహరించారు. 2018లో కాంగ్రెస్‌కు పిన్న వయస్సులోనే గెలిచిన మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఆమె గెలుపులో సైకత్ కీలకంగా ఉన్నారు. శాన్ఫ్రాన్సిస్కో నుంచి నాలుగు దశాబ్దాలుగా ప్రాతినిథ్యం వహిస్తున్న నాన్సీ వయోభారంతోపాటు ఆరోగ్య సమస్యలు వెన్నాడుతున్నాయి. ఈ నేపథ్యంలో యువ రాజకీయ కెరటం సైకత్ రంగ ప్రవేశం నాన్సీ పెలోసీపై ఒత్తిడి పెంచనుంది.అమెరికా చరిత్రలోనే హౌస్ స్పీకర్‌గా ఎన్నికైన తొలి మహిళ నాన్సీ పెలోసీ. కాంగ్రెస్ ప్రతినిధిగా సుదీర్ఘకాలంలో ఎందరో అధ్యక్షులు తీసుకువచి్చన చట్టాలకు మద్దతివ్వడం లేదా తిరస్కరించడంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షుల తర్వాత మూడో శక్తివంతమైన పదవి హౌస్ స్పీకర్. -
30 నిమిషాల్లో.. ఢిల్లీ నుంచి అమెరికాకు: సాధ్యమే అంటున్న మస్క్
టెక్ బిలియనీర్ 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఇందులో భాగంగానే స్టార్‌షిప్ రాకెట్ రూపొందించారు. దీని ద్వారా ప్రపంచంలోని ప్రధాన నగరాలకు చేరుకోవడానికి గంట కంటే తక్కువ సమయం పడుతుందని పేర్కొన్నారు.నవంబర్ 6న ఎక్స్ యూజర్ అలెక్స్ పోస్ట్ చేసిన వీడియోలో గమనిస్తే.. స్టార్‌షిప్ రాకెట్ ప్రయాణించడం చూడవచ్చు. ఇందులో భూమిపైనా ఎక్కడికైనా కేవలం గంటలోపే.. కొన్ని సంవత్సరాల్లోనే ఇది అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ.. ఇది సాధ్యమవుతుందని మస్క్ ట్వీట్ చేశారు.సాధారణంగా ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ చేరుకోవడానికి సుమారు 16 గంటల సమయం పడుతుంది. అయితే స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ ద్వారా ఈ గమ్యాన్ని కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చని వీడియోలో వెల్లడైంది.ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే ఇది రాబోయే రోజుల్లో వినియోగంలోకి కూడా వచ్చేస్తుంది.ఇదీ చదవండి: మీటింగ్‌కు రాలేదని 90 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓస్పేస్ఎక్స్ రూపొందిస్తున్న స్టార్‌షిప్ రాకెట్ సాధారణ విమానం మాదిరిగా కాకుండా.. రాకెట్ మాదిరిగా ఉంటుంది. ఇందులో ఒక్కసారికి 1,000 మంది ప్రయాణించవచ్చని చెబుతున్నాయి. ఇది పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారై ఉంటుంది. అయితే డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తరువాత ఈ ప్రాజెక్టుకు కావలసిన అన్ని అనుమతులను మంజూరు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది వినియోగంలోకి వచ్చిన తరువాత విమానయాన సంస్థలు గట్టి పోటీ ఎదుర్కోవాలి ఉంటుంది.This is now possible— Elon Musk (@elonmusk) November 6, 2024 -
ఆర్సీబీ ఆటగాడి విధ్వంసం.. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
మేజర్ లీగ్ క్రికెట్-2024 టోర్నీలో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఆదివారం డల్లాస్ వేదికగా సీటెల్ ఓర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఫ్లే ఆఫ్స్‌కు శాన్ ఫ్రాన్సిస్కో అర్హత సాధించింది.ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓర్కాస్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్(33 బంతుల్లో 8, 3 సిక్స్‌లతో 62 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జయసూర్య(31) పరుగులతో పర్వాలేదన్పించాడు. శాన్ఫ్రాన్సిస్కో బౌలర్లలో స్పిన్నర్ హసన్ ఖాన్ 3 వికెట్ల పడగొట్టగా.. రౌక్స్ రెండు, కౌచ్, ఆండర్సన్ తలా వికెట్ సాధించారు.ఫిన్ అలెన్ విధ్వంసం..అనంతరం 153 పరుగుల లక్ష్యాన్ని శాన్ ఫ్రాన్సిస్కో కేవలం 4 వికెట్ల మాత్రమే కోల్పోయి 14.2 ఓవర్లలో ఊదిపడేసింది. శాన్ ఫ్రాన్సిస్కో బ్యాటర్లలో ఫిన్ అలెన్(న్యూజిలాండ్) విధ్వంసం సృష్టించాడు. లక్ష్య చేధనలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది మేజర్ లీగ్ క్రికెట్లో సెకెండ్ ఫాస్టెస్ట్ హాప్ సెంచూరియన్‌గా అలెన్ నిలిచాడు. అంతకుముందు ఆసీస్ స్టార్, వాషింగ్టన్ ఫ్రీడమ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కేవలం 20 బంతుల్లోనే ఆర్ధశతకం నమోదు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 30 బంతులు ఎదుర్కొన్న అలెన్.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు జోష్ ఇంగ్లీష్(24నాటౌట్) రాణించాడు. కాగా అలెన్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. -
ఊడిపడిన జపాన్ కు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం టైరు
-
విమానం టేకాఫ్ అయిన క్షణాలకే ఊడిపోయిన టైర్.. వీడియో వైరల్
అమెరికాలోని ఓ విమానాశ్రయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే దాని టైర్ ఊడిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. వివరాలు.. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుంచి జపాన్‌కు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరింది. విమానంలో 235 ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. అయితే టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే విమానం ఎడమవైపు ఉన్న ఓ టైర్ ఊడిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. విమానం నుంచి టైర్ ఊడిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే విమానంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఘటనపై ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా స్పందించింది. ఇలాంటి సందర్భాల్లో సురక్షితంగా ల్యాండయ్యేలా విమానాన్ని డిజైన్ చేసినట్లు వెల్లడించింది. అయితే ఊడిన విమానం టైర్ శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలోని ఎంప్లాయిస్ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న కార్లపై పడింది. దీంతో పలు కార్లు ధ్వంసమయ్యాయి. 🚨 #BREAKING: A United Airlines Boeing 777 has lost a wheel while taking off San Francisco Several cars have been CRUSHED by the falling wheel WHAT’S GOING ON WITH BOEING AND THE AIRLINES? pic.twitter.com/zu7s5YJixg — Nick Sortor (@nicksortor) March 7, 2024 -
అమ్మకానికి అందమైన ఐలాండ్ - ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సాధారణంగా వ్యవసాయ భూములు, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, విల్లా వంటివి వాటిని అమ్మడం లేదా కొనటం అనేది జరగటం సర్వసాధారణం. అయితే చాలా అరుదుగా ఐలాండ్ (ద్వీపాలు) అమ్మకానికి వస్తాయి. బాగా డబ్బున్న వారు, ఏకాంతంగా.. ప్రశాంతంగా బతకాలనుకునే వారు మాత్రమే ఇలాంటి ఐల్యాండ్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి బేరమే ఒకటి ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. శాన్ ఫ్రాన్సిస్కో బేలో ప్రైవేట్ యాజమాన్యంలోని ద్వీపం ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. దీనిని కొనాలంటే 25 మిలియన్ డాలర్లు చెల్లించాల్సిందే. భారతీయ కరెన్సీ ప్రకారం ఈ ద్వీపాన్ని కొనాలంటే సుమారు రూ. 200 కోట్లకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. సుమారు 5.8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అందమైన 'రెడ్ రాక్ ఐలాండ్' సొంతం చేసుకోవడానికి ఇదో మంచి అవకాశం. 2015లో ఓ సారి ఈ ఐలాండ్‌ను విక్రయించడానికి ప్రయత్నించారు, అప్పుడు దీని కేవలం 5 మిలియన్ డాలర్లు మాత్రమే. ఆ తరువాత దీని ఓనర్ 2011లో మరోసారి విక్రయించడానికి పూనుకున్నాడు. ఆ సమయంలో దీని ధర రూ. 22 మిలియన్ డాలర్లు. ఇదీ చదవండి: కలిసొచ్చిన చంద్రయాన్ 3 సక్సెస్ - బిలియనీర్ల జాబితాలోకి కొత్త వ్యక్తి ఎర్ర రాళ్లతో, మట్టితో ఉండటం వల్ల దీనిని రెడ్ రాక్ ఐలాండ్ అని పిలుస్తారు. దీని ఓనర్ 'బ్రాక్ డర్నింగ్' ప్రస్తుతం అలాస్కాలో నివసిస్తున్నట్లు సమాచారం. ఇది తన తండ్రి నుంచి వారసత్వంగా లభించింది. కానీ అతడు గత 22 సంవత్సరాలుగా అక్కడికి రాకపోవడం గమనార్హం. బ్రాక్ తల్లి వృద్ధురాలు కావడంతో.. ఆమె సంరక్షణకు కావలసిన సంరక్షణ కోసం దీనిని అమ్మటానికి సిద్దమైనట్లు సమాచారం. -
బే ఏరియాలో డాక్టర్ శ్రీకర్ రెడ్డి దంపతులకు ఘన సన్మానం
-
శాన్ ఫ్రాన్సిస్కోలో " స్వదేశ్" పేరుతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ ఏఐఏ ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. శాన్ ఫ్రాన్సిస్కో, బే ఏరియాలో స్వదేశ్ పేరుతో వేడుకలను నిర్వహించారు. పలువురు ప్రముఖులు హాజరై.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వదేశ్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రచారం చేయడమేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. భారీ భారతీయ జెండా.. పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రవాసులు మువ్వన్నెల జెండాను చేతబూని వందేమాతరం, భారతమాతకి జై అంటూ నినాదాలు చేశారు. (చదవండి: న్యూజెర్సీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు! పాల్గొన్న మిల్కీ బ్యూటీ తమన్నా!) -
ట్విటర్ కొత్త లోగో తొలగింపు - షాక్‌లో ఎలాన్ మస్క్.. కారణం ఇదే
Elon Musk: అపర కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ఇటీవల ట్విటర్‌ను 'ఎక్స్'గా మార్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కంపెనీ ప్రధాన కార్యాలయంపై కొత్త లోగో ఏర్పాటు చేశారు. అయితే దీనిని శాన్ఫ్రాన్సిస్కో అధికారులు తొలగించి సీఈఓకి పెద్ద షాక్ ఇచ్చారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, శాన్ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం మీద ఏర్పాటు చేసిన ఎక్స్ (X) లోగో నుంచి వచ్చే లైట్ల కాంతి రాత్రి సమయంలో తమ ఇళ్లలో పడుతుందని, ఇది వారి నిద్రకు భంగం కలిగిస్తుందని 24 మంది స్థానికులు అక్కడి అధికారులకు పిర్యాదు చేశారని, ఈ కారణంగా లోగో తొలగించినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి! అనుమతి లేకుండా లోగో ఏర్పాటు చేయడమే కాకుండా, దాని వల్ల ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతోందని అక్కడి అధికారులు చెబుతున్నారు. సంస్థ ముందుగా లోగో మార్చాలనుకుంటే డిజైన్, భద్రత వంటి వాటి కోసం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది, కానీ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కంపెనీ లోగో రుపాటు చేసిందని ఆరోపణ. దీనితో పాటు స్థానికులు పిర్యాదు కూడా తోడవడంతో లోగో తొలగించారు. -
మస్క్ వీడియో సంచలనం: మేజికల్ అంటున్న నెటిజన్లు
Twitter new logo 'X' ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయంపై తన కొత్త లోగో ‘X’ ఆవిష్కారానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. జెంబోలోగో ఏరియల్ వ్యూ విజువల్స్ వీడియోను మస్క్ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు కమెంట్లు వెల్లువెత్తాయి. అలా పోస్ట్ చేశారో లేదో, ఈ వీడియో 5 వేలకు కామెంట్లు, 9 వేల 7వందలకు పైగా రీట్వీట్లు 4.3 మిలియన్ వ్యూస్‌తో ఇది వైరల్‌గా మారింది. దీంతో కారు లోపల నుండి రికార్డ్ చేసిన మరొక వీడియోను కూడా షేర్ చేశారు మస్క్. "ఈ రాత్రి శాన్ ఫ్రాన్సిస్కోలో మా ప్రధాన కార్యాలయం." మస్క్ ఒక వీడియోను పోస్ట్ చేశారుమస్క్. అయితే శాన్ ఫ్రాన్సిస్కో నగరం డౌన్‌టౌన్ భవనంపై అమర్చినఅక్షరం లోగోపై దర్యాప్తు ప్రారంభించిన సమయంలో ఈ వీడియోను షేర్ చేయడం గమనార్హం. నగర అధికారుల ప్రకారం, ఏదైనా సైన్ బోర్డు లేదా లోగోను మార్చడానికి ముందు ఒక వ్యక్తి (లేదా కంపెనీ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. ఏరియల్ వ్యూ వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన సంచలనం సృష్టించింది. కొంతమంది వినియోగదారులు దీనిని సూపర్ హీరో చిత్రం బ్యాట్మ్యాన్తో పోల్చారు. ఏరియల్ వ్యూ వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన సంచలనం సృష్టిస్తోంటి. చాలామంది ది వినియోగదారులు దీనిని సూపర్ హీరో చిత్రం బ్యాట్మ్యాన్తో పోల్చారు. మరికొంతమి మాజికల్ అంటూ కమెంట్ చేశారు. pic.twitter.com/Io9Mk7PYUH — Elon Musk (@elonmusk) July 29, 2023 Our HQ in San Francisco tonight pic.twitter.com/VQO2NoX9Tz — Elon Musk (@elonmusk) July 29, 2023 -
ట్విటర్ కొత్త లోగో: ఉద్యోగులు అరెస్ట్, వీడియో వైరల్
Twitter "X": టాప్ బిలియనీర్, ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ తాజా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపింది. ఉన్నట్టుండి ట్విటర్ లోగోను పిట్టను కాస్తా "X" పేరతో రీబ్రాండ్ చేయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ట్విటర్ లోగో మారిన నేపథ్యంలో తమ భవనం నుంచి పాత లోగోను తొలగించేందుకు ప్రయత్నిస్తున్న ట్విటర్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రీబ్రాండింగ్ ప్రక్రియలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో 1355 మార్కెట్ స్ట్రీట్, కార్యాలయంలోని కొంతమంది ఉద్యోగులు క్రేన్ సాయంతో ట్విటర్ కొత్త లోగో రీప్లేస్ చేస్తున్నారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు జోక్యం చేసుకుని, లోగో మారిన విషయాన్ని గమనించక, ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. (బెదిరింపులు: అంబానీ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు, ప్రత్యేకత తెలిస్తే..! ఈ సందర్బంగా కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలగింపు ప్రక్రియలో ఉపయోగించిన క్రేన్‌కు మస్క్ అనుమతిని పొందలేదని, ఇది పోలీసుల ప్రతిస్పందనను ప్రేరేపించిందని ట్వీట్ చేశారు. కానీ అసలు విషయం తెలిసిన పోలీసులు నాలిక్కరుచుకున్నారు. పరిస్థితిని పరిశీలించిన తరువాత, వారు ఎటువంటి నేరం చేయలేదని , సంఘటన తమ పరిధిలో లేదని ప్రకటించారు. (ఐఆర్సీటీసీ డౌన్, యూజర్లు గగ్గోలు!) కాగా ఐకానిక్ లోగోను కాదని, మస్క్ తన వ్యక్తిగత ప్రాధాన్యతకు అనుకూలంగా బ్రాండ్ పేరును మార్చిన సంగతి తెలిసిందే. దీంతో మస్క్ సంపద 4- 20 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయిందని విశ్లేషకులు, బ్రాండ్ ఏజెన్సీల అంచనా. Welp, @twitter name so coming off the building right now but @elonmusk didn’t get permit for the equipment on the street so @SFPD is shutting it down. pic.twitter.com/CFpggWwhhf — Wayne Sutton (@waynesutton) July 24, 2023 Our headquarters tonight pic.twitter.com/GO6yY8R7fO — Elon Musk (@elonmusk) July 24, 2023 -
మాథ్యూ వేడ్ వీరవిహారం.. రసెల్, నరైన్ మెరుపులు వృధా
మేజర్ లీగ్ క్రికెట్-2023 సీజన్లో భాగంగా లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్‌తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యునికార్న్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ మాథ్యూ వేడ్ (41 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం చేయగా.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ 2 సిక్సర్లు, బౌండరీతో 20 పరుగులు, స్టోయినిస్ 37 (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోరె ఆండర్సన్ 39 పరుగులు (20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశారు. కెప్టెన్ ఫించ్ 12 పరుగులతో (10 బంతుల్లో 2 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లు పడగొట్టగా.. అలీ ఖాన్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. ఆరంభంలో జేసన్ రాయ్ (21 బంతుల్లో 45; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), నితీశ్ కుమార్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్).. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (26 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సునీల్ నరైన్ (17 బంతుల్లో 28 నాటౌట్; 3 సిక్సర్లు) రాణించినప్పటికీ నైట్‌రైడర్స్ విజయతీరాలకు చేరలేకపోయింది. నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌లో రిలీ రొస్సో (8) నిరాశపరిచాడు. యునికార్న్స్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రౌఫ్, బిష్ణోయ్, ఆండర్సన్ తలో వికెట్ చేజిక్కించుకున్నారు. ఈ ఓటమితో నైట్‌రైడర్స్ లీగ్‌లో హ్యాట్రిక్ ఓటములను నమోదు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ మేజర్ లీగ్ క్రికెట్ సీజన్ 2023లో ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది. -
అమెరికాలో భారత దౌత్య కార్యాలయంపై దాడి..
శాన్ ఫ్రాన్సిస్కోలో ఇండియన్ కాన్సులేట్‌పై దాడి జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో దుండగులు దౌత్య కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఖలిస్థానీ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. గత ఐదు నెలల్లో భారత దౌత్య కార్యాలయంపై దాడి జరగడం ఇది రెండోసారి. గత మార్చి నెలలోనే ఇండియన్ కాన్సులేట్‌పై దుండగులు దాడి చేశారు. దౌత్య కార్యాలయంలో మంటలు చెలరేగగా అగ్ని మాపక సిబ్బంది అప్రమత్తమైంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో గాయపడినవారి సమాచారం ఇప్పటికీ అందుబాటులో లేదు. అమెరికా అధికార ప్రతినిధి ఈ దాడిని ఖండించారు. ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ARSON ATTEMPT AT SF INDIAN CONSULATE: #DiyaTV has verified with @CGISFO @NagenTV that a fire was set early Sunday morning between 1:30-2:30 am in the San Francisco Indian Consulate. The fire was suppressed quickly by the San Francisco Department, damage was limited and no… pic.twitter.com/bHXNPmqSVm — Diya TV - 24/7 * Free * Local (@DiyaTV) July 3, 2023 మార్చి లోనే.. మార్చి నెలలో భారత్‌లో ఖలిస్థానీ మద్దతుదారుడు అమృత్ పాల్ సింగ్ కోసం గాలింపు చేపట్టింది ప్రభుత్వం. ఆ సమయంలో ఖలిస్థానీ మద్దతుదారులు శాన్ఫ్రాన్సిస్కోలో దౌత్య కార్యాలన్ని కూల్చివేసే ప్రయత్నం చేశారు. అమృత్‌పాల్ సింగ్‌ను వదిలేయండి అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు నిర్వహించారు. The U.S. strongly condemns the reported vandalism and attempted arson against the Indian Consulate in San Francisco on Saturday. Vandalism or violence against diplomatic facilities or foreign diplomats in the U.S. is a criminal offense. — Matthew Miller (@StateDeptSpox) July 3, 2023 ఇదీ చదవండి: రగులుతోన్న ఫ్రాన్స్.. దొంగలకు దొరికిందే ఛాన్స్.. -
క్యాట్ థెరపీ: లవ్యూ అంటూ ముచ్చటపడుతున్న నెటిజన్లు
ఎన్నిసార్లు రైల్లో ప్రయాణం చేసినా,రిజర్వేషన్ ఉన్నాకూడా ట్రాఫిక్ మహా సముద్రాన్ని ఈది స్టేషన్‌కు చేరి, ట్రైన్ ఎక్కి మన సీట్లో మనం కూర్చునేదాకా మహా గొప్ప టెన్షన్.. అలాగే ఎంత అనుభవం ఉన్నా.. ఎన్నిసార్లు గాల్లో విహరించినా ఎక్కిన ఫ్లైట్ దిగేదాకా విమాన ప్రయాణం అంటే అదో అలజడి. ఎలాంటి వారికైనా కొద్దో.. గొప్పో..ఈ ఒత్తిడి తప్పదు కదా. బహుశా అందుకేనేమో శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం అధికారులు వినూత్నంగా ఆలోచించారు. USA టుడే ప్రకారం బ్లాక్ అండ్ వైట్ రెస్క్యూ క్యాట్ ఇటీవలే విమానాశ్రయంలోని వాగ్ బ్రిగేడ్‌లో చేరింది. విమాన ప్రయాణీకుల ఒత్తిడిని, ఆందోళనను తగ్గించేందుకు ఈ అందమైన పిల్లి సిద్ధంగా ఉంటుంది. ఈ తరహా థెరపీని అందిస్తున్న మొదటి పిల్లి డ్యూక్ ఎల్లింగ్టన్ మోరిస్. 14 ఏళ్ల థెరపీ క్యాట్ శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో సరికొత్త ఉద్యోగి. మా డ్యూక్ అసలు ఎవర్నీ నిరాశపర్చదు. ఒక్క క్షణం డ్యూక్‌ని పలకరిస్తే ప్రయాణ టెన్షన్ మొత్తం ఎగిరిపోతుందని, ఎలాంటి భయం, బెరుకూ లేకుండా ప్రయాణం పూర్తిచేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రయాణీకులతో ఎలా మెలాగాలో, వారిలో ఒత్తిడిని పొగొట్టి, నవ్వులు ఎలా పూయించాలో కూడా ఈ పిల్లికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారట. యానిమల్ థెరపిస్ట్‌గా సర్టిఫికేట్ కూడా పొందిందట. ఎయిర్‌పోర్ట్‌లో ఊపుకుంటూ తిరుగుతూ, పలకరిస్తూ, నవ్వులు పూయిస్తున్న డ్యూక్‌ని చూసిన ప్రయాణికులు, అందులోనూ క్యాట్ లవర్స్ తెగ మురిసిపోతున్నారట. దీంతో డ్యూక్‌ని కలవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నామంటూ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో యానిమల్ కేర్ అండ్ కంట్రోల్ 2010లో ఆకిలితో ఉన్న ఈ పిల్లిని గుర్తించడంతో ఒక కుటుంబం దీన్ని దత్తత తీసుకుంది శాన్ ఫ్రాన్సిస్కో సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ ద్వారా డ్యూక్ థెరపీ యానిమల్ శిక్షణ పొందింది. కాగా శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం ఈ కార్యక్రమాన్ని 2013లో ప్రారంభించింది. సర్టిఫైడ్ థెరపీ జంతువులను టెర్మినల్స్‌లో ఉంచుతుంది. తద్వారా ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా మార్చడమే లక్ష్యమని విమానాశ్రయ అధికారుల మాట. -
నేడు అమెరికాకు రాహుల్
న్యూఢిల్లీ: కోర్టు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం సాధారణ పాస్‌పోర్టును అందుకున్నారు. పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన రాహుల్ ఇటీవల తన దౌత్యహోదా పాస్‌పోర్టును అధికారులకు తిరిగి ఇచ్చేశారు. ఆయనకు సాధారణ పాస్‌పోర్టును జారీ చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదంటూ శనివారం ఢిల్లీ కోర్టు తెలిపింది. ఈ మేరకు అధికారులు రాహుల్‌కు ఆదివారం ఉదయం పాస్‌పోర్టును పంపించారు. సోమవారం రాహుల్ శాన్ఫ్రాన్సిస్కోకు బయలుదేరి వెళ్తారు. అక్కడ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు, ఇతర ముఖ్యులను కలుసుకుంటారు. -
ఇండియన్ కాన్సులేట్‌పై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి
న్యూఢిల్లీ: ఖలీస్తాన్ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. అమృత్‌పాల్ సింగ్ అరెస్టును వ్యతిరేకిస్తూ.. విదేశాల్లో భారత సంబంధిత దౌత్యపరమైన కార్యాలయాలపై వరుస దాడులకు తెగబడుతున్నారు. లండన్‌లో భారత హైకమిషన్ భవనం వద్ద భారతీయ జెండాను కిందకు లాగి అవమానపరిచే యత్నం మరిచిపోకముందే.. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్‌పై దాడికి పాల్పడ్డారు. పంజాబ్‌లో ఖలీస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌ను.. సినీ ఫక్కీ ఛేజ్ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం అంతర్జాతీయంగా ప్రభావం చూపెడుతోంది. ఖలిస్తాన్ మద్దతుదారులు భారత దౌతకార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆదివారం లండన్‌లోని భారతీయ హైకమిషన్ భవనం వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భారతీయ జెండాను కిందకు దించి.. ఖలీస్తానీ జెండాను ఎగరేసే యత్నం చేశారు. అయితే.. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ.. ఆ దేశపు దౌత్యవేత్తలకు వివరణ కోరుతూ సమన్లు సైతం జారీ చేసింది. అయితే.. తాజాగా శాన్ ఫ్రొన్సిస్కో(యూఎస్ స్టేట్ కాలిఫోర్నియా)లోని ఇండియన్ కాన్సులేట్ భవనంపై దాడి జరిగింది. గుంపుగా వచ్చిన కొందరు దాడికి పాల్పడడంతో పాటు అక్కడి గోడలపై ఫ్రీ అమృత్‌పాల్(అమృత్‌పాల్‌ను విడుదల చేయాలి) అంటూ రాతలు రాశారు. ఆ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో పంజాబీ సంగీతం భారీ శబ్ధంతో వినిపిస్తోంది. దాడికి పాల్పడిన దుండగుల్లోనే కొందరు వీడియోలు తీయడం విశేషం ఇక్కడ. ఈ పరిణామంపై అదనపు సమాచారం అందాల్సి ఉంది. After London, now San Francisco - Indian consulate in San Francisco is attacked by Khalistan supporters. For Modi’s security, Rs 584 crores spent every year, but India’s diplomatic missions are left unsecured. pic.twitter.com/scJ9rKcazW — Ashok Swain (@ashoswai) March 20, 2023 ఇదీ చదవండి: త్రివర్ణ పతాకాన్ని అవమానం నుంచి కాపాడారు! -
అద్భుతమైన ఏడుగురం కలిశాం: గూగుల్ మాజీ ఉద్యోగి స్టోరీ వైరల్
న్యూఢిల్లీ: ఉద్యోగం పోయిందని విచారిస్తూ కూచుంటే ఫలితం ఉండదు. ముందు కాస్త బాధపడినా త్వరగానే కోలుకొని మళ్లీ కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సిందే. కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిందే. సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ తొలగించిన ఏడుగురు ఉద్యోగులు అదే చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి కొత్త స్టార్టప్ కంపెనీ ఆవిష్కారానికి నాందిపలికారు. ఇంకా పేరు ఖరారు చేయని వారి సంస్థ, ఇతర "స్టార్టప్‌లు వృద్ధి చెందడానికి , నిధులు పొందేందుకు" సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. లింక్డ్ ఇన్‌లో షేర్ చేసిన వీరి స్టోరీ వైరల్‌గా మారింది. గూగుల్ గత నెలలో సుమారు 12 వేలమందిని తొలగించిన సంగతి తెలిసిందే. ఖర్చు తగ్గింపు చర్యలో భాగంగా తొలగించినవారిలో గూగుల్ సీనియర్ మేనేజర్ హెన్రీ కిర్క్ కూడా ఒకరు. తన స్నేహితులతో ఇపుడు కొత్త కంపెనీని మొదలు పెడుతున్నామని కిర్క్ తెలిపారు. సహ ఉద్యోగులతో కలిసి న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలో డిజైన్ డెవలప్మెంట్ స్టూడియోను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం తన బృందానికి ఆరు వారాల సమయం ఇచ్చినట్లు లింక్డ్ఇన్లో కిర్క్ పేర్కొన్నాడు. ఉద్యోగుల తొలగింపు నోటిఫికేషన్ 60 రోజుల గడువు మార్చిలో ముగిసేలోపు కంపెనీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నా. ఇంకా 52 రోజులు మిగిలి ఉన్నాయి. మీ సహాయం కావాలి....కష్టపడితే , ఫలితాలు మిమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకువెళతాయని ఎపుడూ నమ్ముతా. కానీ ఈ సంఘటన ఆ నమ్మకంపై సందేహాన్ని కలిగించింది. కానీ జీవిత సవాళ్లు అద్వితీయమైన అవకాశాలను అందిస్తాయి.. అందుకే విషాదాన్ని.. గొప్ప అవకాశంగా మల్చుకుంటున్నాం అంటూ కిర్క్ గత వారం లింక్డ్ఇన్ పోస్ట్‌లో చెప్పాడు. తనతో మరో ఆరుగురు గూగుల్ మాజీఉద్యోగులు తన వెంచర్లో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషాదాన్ని ఒక అవకాశంగా మార్చుకుని కొత్త డిజైన్ & డెవలప్మెంట్ స్టూడియోను ప్రారంభిస్తున్నాం. స్టార్టప్‌లకు, ఇతర కంపెనీల యాప్‌లు, వెబ్సైట్ల కోసం డిజైన్ పరిశోధన సాధనాలను అందించాలనుకుంటున్నాం. ఉద్వాసనకు గురైన అత్యుత్తమ మాజీ-గూగ్లర్లు ఏడుగురం ప్రతిష్టాత్మక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్‌ల పరిశోధన, రూపకల్పన, అభివృద్ధికి, స్టార్టప్‌లు ఎదిగేలా సాయం చేస్తాం. తమలో ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి భిన్నంగా ఉన్నంది. కొంతమందికి కుటుంబాన్ని చూసుకోవడానికి ఒక కుటుంబం ఉంటుంది, కొంతమందికి లేదు, కొందరు ఆర్థికంగా బలంగా ఉన్నారు, మరికొందరు గత కొన్నేళ్లుగా ఎంతో కొంత పొదుపు చేసుకున్నారు. కొందరికీ అదీ లేదు. ఈ నేపథ్యంలో ముందుగా, కొన్ని ప్రాజెక్ట్‌లను పొందడం తక్షణ కర్తవ్యం. తద్వారా బిల్లులను చెల్లించడం ప్రారంభించవచ్చు. తమకు మద్దతివ్వాలంటూ పోస్ట్ చేశారు. దీంతో పలువురు అభినందనలు తెలిపారు. -
అందంగా కన్పించాలని ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ.. ఆ తర్వాత గంటల్లోనే..
శాన్ ఫ్రాన్సిస్కో: అందంగా కన్పించాలని ముక్కుకు సర్జరీ చేయించుకున్న ఓ యువతి 24 గంటలు కూడా తిరగకుండానే ప్రాణాలు కోల్పోయింది. ముక్కు ఆకృతి మార్చుకునేందుకు ఆరున్నర గంటల పాటు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఈమె.. ఇంటికెళ్లిన కాసేపటికే సృహ కోల్పోయి కుప్పకూలింది. కుటుంబసభ్యులు వెంటనే ఆసత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి చూసిన వైద్యులు షాక్ అయ్యారు. యువతి ఊపిరితిత్తులు మొత్తం రక్తంతో నిండిపోయాయి. శ్వాసకూడా తీసుకోలేని పరిస్థితి. ఆమెను కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. ఆరుసార్లు కార్డియోరెస్పిరేటరీ అరెస్టులతో(శ్వాసవ్యవస్థ దెబ్బతినడం) ఆమె కన్నుమూసింది. ముక్కుకు సర్జరీ చేయించుకుని చనిపోయిన ఈ యువతి పేరు కారెన్ జులియెత్ కార్డెనాస్ యురిబె. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తోంది. వయసు 21 ఏళ్లు. సైకాలజీ కోర్సు చివరి సెమిస్టర్ చదువుతోంది. తాను మరింత అందంగా కన్పించేందుకు ముక్కు ఆకృతి మార్చుకోవాలనుకుంది. జనవరి 29న ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేందుకు క్లినిక్‌కు వెళ్లింది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. ఇంటికెళ్లిన కాసేపటికే.. సర్జరీ అనంతరం ఇంటికెళ్లిన జులియెత్ కాసేపటికే సృహతప్పి పడిపోయింది. దీంతో తీవ్ర ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమెను తిరిగి స్పృహలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కాసేపయ్యాక తేరుకున్న యువతి మళ్లీ కుప్పకూలింది. దీంతో సర్జరీ చేసిన వైద్యుడుకి ఫోన్ చేశారు కుటుంబసభ్యులు. ఆమెను మళ్లీ తన ఆస్పత్రికి తీసుకురావాలని అతను సూచించాడు. అయితే యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ఇంటికి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు యువతి పరిస్థితి చూసి షాక్ అయ్యారు. ఆమెను సృహలోకి తీసుకొచ్చేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆమె లేచినా మళ్లీ వెంటనే స్పృహ కోల్పోతోంది. దీంతో ఆమెను స్కానింగ్ చేసిన వైద్యులు అవాక్కయ్యారు. ఆమె ఊపిరితిత్తుల నిండా రక్తం నిండిపోయింది. శ్వాస తీసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీంతో ఆమెకు పైపుల ద్వారా శ్వాస అందించేందుకు వైద్యులు ప్రయత్నించారు. కానీ ప్రయత్నాలు ఫలించలేదు. ఆరు సార్లు కార్డియెక్ రెస్పిరేటరీ అరెస్టులతో యువతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో సర్జరీ చేసిన వైద్యుడి పొరపాటు చేయడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అతనిపై కేసు పెడతామని చెప్పారు. అక్కడ సర్జరీలు కామన్.. కాగా.. అమెరికాలో ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం 2020 నుంచి బాగా పాపులర్ అయ్యింది. అందంగా కన్పించేందుకు ఏ మాత్రం ఆలోచించకుండా సర్జరీలు చేయించుకుంటున్నారు. మొత్తం 3,52,555 మంది ఈ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చదవండి: 18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు.. ఆ డబ్బుతో ఏం చేసిందంటే..? -
Tesla Tweet: ఎలన్ మస్క్‌కు భారీ ఊరట
శాన్ ఫ్రాన్సిస్కో: దాదాపు నాలుగేళ్ల క్రిందట.. టెస్లా విషయంలో ఆ కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ చేసిన ఆ ఒక్క ట్వీట్ ఆ కంపెనీ పెట్టుబడిదారులను బెంబేలెత్తించింది. నిర్లక్ష్యంగా ఆయన చేసిన ఆ ట్వీట్.. కంపెనీ షేర్లను ఘోరంగా పతనం చేసింది. వెరసి.. సొంత కంపెనీ, సొంత ఇన్వెస్టర్లు, సొంత సీఈవో పైనే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అదీ బిలియన్ల డాలర్ల పరిహారం కోరుతూ!. కానీ, ఎలన్ మస్క్ దూకుడుకు కళ్లెం వేసేందుకు కోర్టు కూడా ఆసక్తి చూపలేదు. ఆయనకు భారీ ఊరటే ఇచ్చింది. శుక్రవారం శాన్ఫ్రాన్సిస్కో(కాలిఫోర్నియా స్టేట్) కోర్టు.. ఎలన్ మస్క్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తన ట్వీట్ ద్వారా ఎలన్ మస్క్ ఎలాంటి మోసానికి పాల్పడలేదని స్పష్టం చేసింది. తద్వారా వాటాదారులకు ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. 2018లో టెస్లా ప్రైవేట్ ఫండింగ్‌కు వెళ్తోందంటూ ఓ ట్వీట్ చేశాడు ఎలన్ మస్క్. అయితే.. కంపెనీకి వ్యతిరేకంగా పందెం వేసిన పెట్టుబడిదారులను అణిచివేసే ప్రయత్నమే అయినా.. సదరు వ్యాపారవేత్త నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తద్వారా టెస్లా షేర్లు దారుణంగా పడిపోయాయని టెస్లా ఇన్వెస్టర్లు మస్క్‌పై శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దావా వేశారు. కానీ, మస్క్ చేసిన ‘‘ఫండింగ్ సెక్యూర్డ్’’ ట్వీట్ సాంకేతికంగా సరికాదని మాత్రమే కోర్టు చెప్పింది తప్ప.. ఎలన్ మస్క్ ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తద్వారా ఇన్వెస్టర్లకు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే.. ఎలన్ మస్క్ తన ట్వీట్లతో నెటిజన్స్‌లో ‘హీరో’గా పేరు సంపాదించుకుంటున్నప్పటికీ .. టెస్లాను మాత్రం నిండా ముంచుతూ పోతున్నాడు. టెస్లాలో తన పేరిట ఉన్న అధిక వాటాలను ఇదివరకే మస్క్ అమ్మేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా తీర్పుతో ఎలన్ మస్క్ ఇంకా చెలరేగిపోయే ఆస్కారం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు దావాల్లోనూ మస్క్‌కి అనుకూలంగానే తీర్పులు వెలువడుతుండడం చూస్తున్నాం. ఇక నుంచి తనకు ఏది అనిపిస్తే దానిని సోషల్ మీడియా వేదికగా ఎలన్ మస్క్ ప్రకటించే అవకాశం ఉందని, అది భావ స్వేచ్ఛ ప్రకటనగా పరిగణించడం ఎంతమాత్రం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను చేజిక్కించుకున్న ఎలన్ మస్క్.. ఆ మైక్రోబ్లాగింగ్ కంపెనీ వ్యవస్థను అతలాకుతలం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. -
Kudrat Dutta Chaudhary: హక్కుల గొంతుక
దేశం కాని దేశం వెళ్లిన వారికి రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి సమస్యల్లో ఉన్న వారికి తక్షణ సహాయం చేసే బలమైన వ్యక్తి అవసరం. అలాంటి వ్యక్తి... కుద్రత్ చౌదరి. ఇమిగ్రెంట్ రైట్స్ కమిషనర్‌గా శాన్ఫ్రాన్సిస్కోలో నివసించే వలసదారులకు అండగా ఉండనుంది... శాన్ఫ్రాన్సిస్కో (యూఎస్) ఇమిగ్రెంట్ రైట్స్ కమిషనర్(ఐఆర్సీ)గా బాధ్యతలు చేపట్టిన కుద్రత్ దత్తా చౌదరి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఈ పదవికి ఎంపికైన భారతసంతతి(ఇమిగ్రెంట్)కి చెందిన తొలివ్యక్తిగా గుర్తింపు పొందింది. శాన్ఫ్రాన్సిస్కోలో నివసించే వలసదారుల సమస్యలు, విధానాలకు సంబంధించిన విషయాలపై మేయర్, బోర్డ్ ఆఫ్ సూపర్వైజర్స్కు ‘ఐఆర్సీ’ సలహాలు ఇస్తుంది. ‘కొత్త బాధ్యత నాలో ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని నింపింది. నా వాళ్ల గురించి పనిచేసే అవకాశం లభించింది’ అంటుంది కుద్రత్. చండీగఢ్‌లో జన్మించిన కుద్రత్ ‘పంజాబ్ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా’లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించింది. లండన్ కింగ్స్ కాలేజీలో క్రిమినాలజీ, క్రిమినల్ జస్టిస్ చదువుకుంది. హార్వర్డ్ లా స్కూల్లో స్త్రీవాదం, పితృస్వామిక హింస, లైంగిక దోపిడికి సంబంధించిన అంశాలను లోతుగా అధ్యయనం చేసింది. హక్కుల ఉద్యమాలపై మంచి అవగాహన ఉన్న కుద్రత్ సమస్యల పరిష్కారంలో ‘ట్రబుల్ షూటర్’గా పేరు తెచ్చుకుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా తనదైన శైలిలో పరిష్కరించేది. కుద్రత్ మంచి రచయిత్రి కూడా. 2015 భూకంపం (నేపాల్) తరువాత మానవసంబంధాల్లో వచ్చిన మార్పులు, మనుషుల అక్రమరవాణా, లైంగిక దోపిడిపై ‘లైజా: సమ్ టైమ్స్ ది ఎండ్ ఈజ్ ఓన్లీ ఏ బిగినింగ్’ అనే పుస్తకం రాసింది. కుద్రత్ రాసిన ‘లైజా’ పుస్తకం నేపాల్‌లో ఒక వేసవిలో వచ్చిన భూకంపం తాలూకు భయానక భౌతిక విలయ విధ్వంసాన్ని మాత్రమే కాదు మనిషిలోని విధ్వంసాన్ని కూడా కళ్లకు కడుతుంది. 19 సంవత్సరాల లైజా భూకంపంలో తల్లిదండ్రులను కోల్పోతుంది. ఏ దిక్కూ లేని పరిస్థితులలో తమ్ముడిని తీసుకొని కట్మాండూలోని మామయ్య ఇంటికి వెళుతుంది. నా అనుకున్నవారే మోసం చేయడంతో, ఇండియాలోని ఒక చీకటిప్రపంచంలోకి నెట్టబడుతుంది లైజా. ఇలాంటి విషాదాలెన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. -
‘అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్‌పై దృష్టి పెట్టాలి’
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద కాలంలో భారత ఏవియేషన్ మార్కెట్ రెండంకెల స్థాయిలో వృద్ధి చెందనున్న నేపథ్యంలో దేశీ ఎయిర్‌లైన్స్ సుదీర్ఘ ప్రయాణాల విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సూచించారు. ఇందుకోసం మరిన్ని పెద్ద విమానాలను (వైడ్–బాడీ) సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. ముంబై నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు గురువారం ఎయిరిండియా డైరెక్ట్ ఫ్లయిట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘దాదాపు 86 అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ .. భారత్‌కు విమానాలు నడిపిస్తున్నాయి. కానీ మన దగ్గర్నుంచి కేవలం అయిదు సంస్థలకే అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు ఉన్నాయి. అయితే, ఈ అయిదింటికీ 36 శాతం మార్కెట్ వాటా ఉంది. మనం అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్‌పై దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగానే సుదీర్ఘ రూట్ల మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మరిన్ని వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకోవాలని మన ఎయిర్‌లైన్స్‌ను కోరుతున్నాను‘ అని మంత్రి చెప్పారు. టాటా గ్రూప్‌లో భాగంగా ఉన్న ఎయిరిండియా.. సుదీర్ఘ రూట్లలో మరింతగా విస్తరించగలదని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2023 తొలినాళ్లలో ఎయిరిండియా.. ముంబై నుంచి న్యూయార్క్, ప్యారిస్, ఫ్రాంక్‌ఫర్ట్‌కు కూడా ఫ్లయిట్స్ ప్రారంభించనుంది. మరోవైపు, 2013–14లో 6.3 కోట్లుగా ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2019–20లో 14.4 కోట్లకు చేరిందని ఆయన తెలిపారు. గడిచిన ఎనిమిదేళ్లలో ఎయిర్‌పోర్టులు, హెలిపోర్టులు, వాటర్‌డ్రోమ్‌ల సంఖ్య 145కి పెరిగిందని చెప్పారు. -
గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ పైనుంచి దూకి భారత సంతతి బాలుడు మృతి
వాషింగ్టన్: శాన్ఫ్రాన్సిస్కోలోని ప్రఖ్యాత గోల్డెన్ గేట్ వంతెనపై నుంచి దూకి 16 ఏళ్ల భారతీయ అమెరికన్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వంతెన వద్ద బాలుడి సైకిల్, మొబైల్ ఫోన్, బ్యాగు కనిపించినట్లు తల్లిదండ్రులు, అమెరికా కోస్టల్ గార్డ్ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం 4.58 నిమిషాలకు గోల్డెన్ గేట్ వంతెనపై నుంచి నదిలోకి ఎవరో దూకినట్లు అందిన సమాచారం మేరకు కోస్టల్ గార్డ్స్ సుమారు రెండున్నర గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవటంతో బాలుడు ప్రాణాలతో ఉండే అవకాశం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం బాలుడు 12వ తరగతి చదువుతున్నట్లు కోస్టల్ గార్డ్ అధికారులు తెలిపారు. ఆత్మహత్య చేసుకునేందుకు భారతీయ అమెరికన్ కమ్యూనిటీకి చెందిన వారు గోల్డెన్ గేట్ పైనుంచి దూకటం ఇది నాలుగో సంఘటనగా తెలిపారు కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ భుటోరియా. బ్రిడ్జ్ రైల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వద్ద ఆత్మహత్యలను నిరోధించే విషయంలో పని చేస్తోంది. గతేడాది ఇక్కడ 25 మంది ఆత్మహత్య చేసుకున్నారని, 1937లో వంతెన ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 2,000 ఆత్మహత్య ఘటనలు జరిగినట్లు వెల్లడించింది. మరోవైపు.. బ్రిడ్జ్‌పై ఆత్మహత్యలను నిరోధించేందుకు ఇరువైపులా 20 అడుగుల ఎత్తులో ఇనుప కంచెను కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే, ఈ ఏడాది జనవరిలోనే పూర్తికావాల్సి ఉన్నప్పటికీ, నిర్మాణ వ్యయం పెరగడంతో జాప్యం జరిగింది. ఇదీ చదవండి: బ్రిటన్ కోర్టులో నీరవ్ మోదీకి షాక్.. ఇక అన్ని దారులు మూసుకుపోయినట్లే! -
భారత్ ఎప్పుడూ నాతోనే ఉంటుంది: సుందర్ పిచాయ్
శాన్ ఫ్రాన్సిస్కో: గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్.. భారత అత్యున్నత పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. శుక్రవారం కాలిఫోర్నియా నగరం శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు ఈ గౌరవం పిచాయ్‌కు అందించారు. మధురైలో పుట్టిన సుందర్ పిచాయ్‌కు.. భారత ప్రభుత్వం 2022 ఏడాదికిగానూ పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల నడుమ పిచాయ్ ఈ పురస్కారం అందుకున్నారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా టీవీ నాగేంద్ర ప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశం నాలో ఒక భాగం. ఎప్పుడూ నాతోనే ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్లినా దానిని నా వెంట తీసుకువెళతాను అని ఈ సందర్భంగా పిచాయ్ పేర్కొన్నారు. భారత మూడో అత్యున్నత పురస్కార గౌరవం అందుకున్నందుకు గర్వంగా, సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు గాఢంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారాయన. ఈ సందర్భంగా తన మూలాల్ని, తన తల్లిదండ్రుల త్యాగాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారాయన. Delighted to hand over Padma Bhushan to CEO @Google & Alphabet @sundarpichai in San Francisco. Sundar’s inspirational journey from #Madurai to Mountain View, strengthening 🇮🇳🇺🇸economic & tech. ties, reaffirms Indian talent’s contribution to global innovation pic.twitter.com/cDRL1aXiW6 — Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) December 2, 2022 -
ట్విటర్ ఉద్యోగి కీలక చర్య: ఎలాన్ మస్క్‌కు మరో షాక్!
న్యూఢిల్లీ: ట్విటర్ కొత్త బాస్, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో షాక్ తగిలింది. తనను అన్యాయంగా విధుల్లోంచి తొలగించారని ఆరోపిస్తూ ట్విటర్‌కు చెందిన దివ్యాంగ ఉద్యోగి ఒకరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారంలో కోర్టులో మూడు కేసులు నమోదైనాయి. కాలిఫోర్నియాకు చెందిన ఇంజినీరింగ్ మేనేజర్ డిమిత్రి బోరోడెంకో బుధవారం శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో దావా వేశారు. వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న తనను ఆఫీసుకు తిరిగి రావాలని ఆదేశించారని అయితే దీనికి నిరాకరించడంతో ట్విటర్ తనను తొలగించిందని పేర్కొన్నారు. ఇది ఫెడరల్ అమెరికన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ ఉల్లంఘన అని బోరోడెంకో చెప్పారు. తన వైకల్యం కారణంగా కోవిడ్ బారిన పడితే కష్టమని ఆయన వాదించారు. అలాగే డిమాండ్ పనితీరు,ఉత్పాదకత ప్రమాణాలను అందుకోలేక పోవడంతో వైకల్యం ఉన్నఅనేక మంది ట్విటర్ ఉద్యోగులు బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందని మరో దావాలో పేర్కొన్నారు. ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్, 2020లో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం యజమానికి భారం కానంతవరకు వర్క్ ఫ్రం హోం పని విధానం సహేతుకమైందే. అలాగే రిమోట్ పనివిధానాన్ని రద్దు చేసిన మస్క్ నేతృత్వంలోని ట్విటర్ యాజమాన్యం చట్టం ప్రకారం 60 రోజుల నోటీసు ఇవ్వకుండా వేలాదిమంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించిందని ఆరోపిస్తూ అదే కోర్టులో మరో ఫిర్యాదు దాఖలైంది. ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్న మస్క్ ఇంత తక్కువ సమయంలో ఉద్యోగులను చాలా ఆవేదనకు, బాధకు గురిచేశాడని వారిని అనిశ్చితిలో పడవేశాడని ట్విటర్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఈ మూడు కేసులను వాదిస్తున్న న్యాయవాది షానన్ లిస్-రియోర్డాన్ వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలపై ట్విటర్ అధికారికంగా స్పందించలేదు. ట్విటర్ మస్క్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపు 3,700 మంది ఉద్యోగులను లేదా కంపెనీలోని సగం మంది ఉద్యోగులను ఆకస్మికంగా తొలగించడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించిందని శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టు ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. (మునుగుతున్న ట్విటర్ 2.0? ఉద్యోగుల సంఖ్య తెలిస్తే షాకవుతారు!) కాగా ఎక్కువ పనిగంటలు పనిచేస్తూ, ట్విటర్ అభివృద్ధికి తోడ్పడతారో, లేదా సంస్థను వీడతారో తేల్చుకోమని ట్విటర్ ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేయడం కలకలం రేపింది. దీంతో వందలాది ఉద్యోగులు కంపెనీకి గుడ్‌బై చెప్పడం మరింత ఆందోళన రేగింది. ఫలితంగా నవంబరు 21, సోమవారం వరకు ట్విటర్ ఆఫీసులను మూసివేస్తున్నట్టు ట్విటర్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు పనితీరు, ప్రతిభ ఆధారంగా వారికి ప్రాధాన్యత ఉంటుందని తెగేసి చెప్పింది. అలాగే రిమోట్‌గా పనిచేసే ఉద్యోగుల పనితీరును ఎక్కువ చేసి చూపిస్తూ ఆయా మేనేజర్లు తప్పుడు రిపోర్ట్ చేస్తే వారిపై చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించడం గమనార్హం. (ఉద్యోగుల ఝలక్, ఆఫీసుల మూత: మస్క్ షాకింగ్ రియాక్షన్) -
విడాకులు తీసుకునేందుకు ప్లాన్ చేస్తోందని...కోడలిని హతమార్చిన మామ
శాన్ ఫ్రాన్సిస్కో: 74 ఏళ్ల భారత సంతతి వ్యక్తి తన కోడలిని తుపాకితో కాల్చి చంపాడు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. సదరు వ్యక్తి సితాల్ సింగ్ దోసాంజ్గా పోలీసులు గుర్తించారు. సౌత్శాన్ జోస్పార్కింగ్లోని వాల్‌మార్ట్ వద్ద ఆమె శవమై కనిపించిందని తెలిపారు. బాధితురాలు గురుప్రీత్ కౌర్ దోసంజ్గా గుర్తించినట్లు తెలిపారు. నిందితుడు సితాల్ సింగ్ విచారణలో ఆమె తన కొడుకు నుంచి విడాకులు తీసుకునేందుకు ప్లాన్ చేస్తుండటంతో కోపంతో షూట్ చేసి చంపేశానని చెప్పాడు. అంతేగాదు భాధితురాలు ఫోన్లో తన మామా తనను చంపడం కోసం వెతుకుతున్నాడంటూ భయపడినట్లు ఆమె మేనమామ పోలీసులకు చెప్పాడు. ఆమె తన ఆఫీస్‌లో విరామ సమయంలో బయటకు వచ్చి తనకు కాల్ చేసిందని, అదే సమయంలో తన మామా తన కారు వద్దకు వస్తున్నాడంటూ భయపడుతూ చెప్పిందని తెలిపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కాల్ డిస్ కనక్డ్ అయ్యిందని వివరించాడు. సుమారు ఐదు గంటల తర్వాత బాధితురాలి సహోద్యోగురాలు ఆమె తన కారులోనే చనిపోయి ఉన్నట్లు గుర్తించిందని తెలిపాడు. గురుప్రీత్ ఆమె భర్త, మామ గారితో కలిసి ఫ్రెస్నోలో ఉంటోందని బాధితురాలి మేనమామ చెప్పాడు. ఐతే ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు కూడా చెప్పాడు. ఈ మేరకు నిందితుడు సితాల్ సింగ్‌ని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన ఇంటి నుంచి క్యాలిబర్ బెరెట్టా పిస్టల్‌ను కూడా స్వాధీనం చేసకున్నట్లు పేర్కొన్నారు. అలాగే బాధితురాలిని చివరిసారిగా ఆమె డ్రైవ్ చేస్తుంటే కలిసింది సితాల్ సింగ్ అని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని శాన్‌జోస్ జైలుకి తరలించినట్లు తెలిపారు. అతనిని నవంబర్14న కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు పోలీసులు. (చదవండి: రావణుడి తలలు దహనం కాలేదని షోకాజ్ నోటీసులు, గుమస్తాపై వేటు) -
Zoya Agarwal: అబ్బురపరిచే సాహసికి... అరుదైన గౌరవం
మ్యూజియం అంటే వస్తు,చిత్ర సమ్మేళనం కాదు. అదొక ఉజ్వల వెలుగు. అనేక రకాలుగా స్ఫూర్తిని ఇచ్చే శక్తి. అలాంటి ఒక మ్యూజియంలో కెప్టెన్ జోయా అగర్వాల్ సాహసాలకు చోటు దక్కింది... శాన్ఫ్రాన్సిస్కో(యూఎస్)లోని ఏవియేషయన్ మ్యూజియం వైమానికరంగ అద్భుతాలకు వేదిక. అక్కడ ప్రతి వస్తువు, ప్రతి చిత్రం, పుస్తకం...ప్రపంచ వైమానికరంగ వైభవానికి సంబంధించి ఎన్నో విషయాలను చెబుతుంది. అలాంటి మ్యూజియంలో ఇప్పుడు మన దేశానికి చెందిన జోయా అగర్వాల్ సాహస చరిత్రకు చోటుదక్కింది. ఈ ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియంలో చోటు సంపాదించిన తొలి భారతీయ మహిళా పైలట్‌గా చరిత్ర సృష్టించింది జోయా. ఇప్పుడు ఆమె అద్భుత సాహసాన్ని చిత్రాల నుంచి వస్తువుల వరకు రకరకాల మాధ్యమాల ద్వారా తెలుసుకోవచ్చు. స్ఫూర్తి పొందవచ్చు. దిల్లీలో జన్మించిన జోయాకు చిన్నప్పటి నుంచి సాహసాలు అంటే ఇష్టం. పైలట్ కావాలనేది ఆమె కల. అయితే తల్లిదండ్రులు భయపడ్డారు. ‘పైలట్ కావడానికి చాలా డబ్బులు కావాలి. అంత స్తోమత మనకు ఎక్కడ ఉంది తల్లీ’ అని కూడా అన్నారు. అయితే అవేమీ తన మనసును మార్చలేకపోయాయి.ఏవియేషన్ కోర్స్ పూర్తయినరోజు తన ఆనందం ఎంతని చెప్పాలి! మొదటి అడుగు పడింది. ఒక అడుగు అంటూ పడాలేగానీ దారి కనిపించడం ఎంతసేపని! తొలిసారిగా దుబాయ్‌కి విమానాన్ని నడిపినప్పుడు జోయా సంతోషం ఆకాశాన్ని అంటింది. పైలట్ కావాలనుకొని అయింది. ఆ తరువాత కెప్టెన్ కూడా అయింది....ఇక చాలు అని జోయా అక్కడితో ఆగిపోయి ఉంటే ప్రపంచ వైమానికరంగ చరిత్రలో ఆమెకు అంటూ ఒక పుట ఉండేది కాదు. కోవిడ్ కోరలు చాచిన కల్లోల సమయంలో ‘వందే భారత్ మిషన్’లో భాగంగా విమానం ద్వారా విదేశాల్లో ఉన్న ఎంతోమంది భారతీయులను స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చి ‘శభాష్’ అనిపించుకుంది. ఇక అతిపెద్ద సాహసం గత సంవత్సరం చేసింది. నలుగురు మహిళా పైలట్లను కూర్చోబెట్టుకొని ఉత్తరధ్రువం మీదుగా 17 గంటల పాటు విమానం నడిపి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని జోయాను ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధిగా నియమించడం అరుదైన గౌరవం. ‘అంకితభావం మూర్తీభవించిన సాహసి కెప్టెన్ జోయా అగర్వాల్. ఆమె విజయాలు, సాహసాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తాయి. వారి కలను నెరవేర్చుకునేలా చేస్తాయి. మ్యూజియంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చరిత్ర, విజయాలు ఈ తరానికే కాదు, భవిష్యత్తరాలకు కూడా ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి’ అంటున్నారు శాన్ఫ్రాన్సిస్కో ఎవియేషన్ మ్యూజియం అధికార ప్రతినిధి. ‘ఇది కలా నిజమా! అనిపిస్తుంది. ఈ గుర్తింపు నా దేశానికి, నాకు గర్వకారణం’ అంటుంది జోయా. జోయా అగర్వాల్ ప్రతిభ, సాహసం కలగలిసిన పైలట్ మాత్రమే కాదు యువతరాన్ని కదిలించే మంచి వక్త కూడా. ‘రాత్రివేళ ఆరుబయట కూర్చొని ఆకాశాన్ని చూస్తున్న ఎనిమిది సంవత్సరాల బాలికను అడిగేతే, తాను కచ్చితంగా పైలట్ కావాలనుకుంటుంది’ అంటుంది జోయా అగర్వాల్. అయితే అలాంటి బాలికలు తమ కలను నెరవేర్చుకోవడానికి జోయాలాంటి పైలట్ల సాహసాలు ఉపకరిస్తాయి. తిరుగులేని శక్తి ఇస్తాయి. -
ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం.. హుటాహుటిన ఖాళీ చేయించిన అధికారులు
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో బాంబు ఉందని బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. సమాచారం అందిన వెంటనే ఇంటర్నేషనల్ టర్మినల్‌ను ఖాళీ చేయించారు అధికారులు. అనుమానాస్పద ప్యాకేజీని గుర్తించినట్లు వెల్లడించారు. పోలీసులు, సిబ్బంది విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. తాము చెప్పే వరకు ఇంటర్నేషనల్ టర్మినల్ వైపు ఎవరూ రావొద్దని అధికారులు సూచించారు. అక్కడ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు వెల్లడించారు. 2020లో శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయాన్ని 30 లక్షల మందికిపైగా ప్రయాణికులు వినియోగించారు. పికప్, డ్రాప్ ఆఫ్ సేవలు తమ దేశీయ టర్మినల్స్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. చదవండి: ట్రంప్ మొదటి భార్య మృతిపై అనుమానాలు! వైద్యులు ఏం చెప్పారంటే? -
దిక్కుమాలిన టిక్‌టాక్ బ్లాకౌట్ ఛాలెంజ్! ఏడుగురు చిన్నారులు బలి
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచ వ్యాప్తంగా తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది చైనాకు చెందిన షార్ట్ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్. కొద్ది రోజుల్లోనే మిలియన్ల మంది దానిని వినియోగించటం ప్రారంభించారు. అయితే.. దానికి ఎక్కువగా యువకులు, చిన్నారులు బానిసలవుతున్నారు. అందులోని ఛాలెంజ్‌లను అనుసరించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. టిక్‌టాక్ తీసుకొచ్చిన 'బ్లాకౌట్ ఛాలెంజ్' కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారంతా 15 ఏళ్ల వయసులోపు వారే కావటం గమనార్హం. ఏమిటీ బ్లాకౌట్ ఛాలెంజ్? యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చె టిక్‌టాక్.. బ్లాకౌట్ ఛాలెంజ్‌ను తీసుకొచ్చింది. ఈ ఛాలెంజ్.. ఆక్సిజన్ అందకుండా చేసుకుని అపస్మారక స్థితికి చేరుకునేలా ప్రోత్సహిస్తుంది. బెల్టులు, చిన్న చిన్న బ్యాగులకు కట్టే దారాలతో తమను తాము ఊపిరి ఆడకుండా చేసుకోవాలి. బ్లాకౌట్ ఛాలెంజ్ ద్వారా తమ పిల్లలు ఊపిరాడకుండా చేసుకుని చనిపోయినట్లు టిక్‌టాక్‌పై పలువురు తల్లిదండ్రులు కేసులు పెట్టినట్లు ది వెర్జ్ న్యూస్ గురువారం వెల్లడించింది. ఇటీవలే శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన లాలాని వాల్టన్(8), అరియాని అరోయో(9)ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. గతంలో 2021, జనవరిలో ఇటలీలో పదేళ్ల చిన్నారి, మార్చిలో అమెరికాలోని కొలొరాడోలో 12 ఏళ్ల బాలుడు, జూన్‌లో ఆస్ట్రేలియాలో 14 ఏళ్ల బాలుడు, జులైలో ఓక్లాహోమాలో 12 ఏళ్ల చిన్నారి, డిసెంబర్లో పెన్సిల్వేనియాలో 10 ఏళ్ల బాలిక మృతి చెందారు. టిక్‌టాక్ ప్రమాదకరమైన ఛాలెంజ్‌లతో చిన్నారులను ప్రమాదంలోకి నెడుతోందని ఆరోపించారు పెన్సిల్వేనియా చిన్నారి నైలాహ్ అండర్సన్ తల్లి తవైన అండర్సన్. తన మొదటి పేజీలోనే ఈ ఛాలెంజ్‌ను ఉంచటం వల్ల పిల్లలు ఎక్కువగా చూస్తున్నారని ఆరోపించారు. వినియోగదారుల భద్రతకే కట్టుబడి ఉన్నాం.. టిక్‌టాక్ బ్లాకౌట్ ఛాలెంజ్ వల్ల చిన్నారులు చనిపోతున్నట్లు కేసులు నమోదవుతున్న క్రమంలో సంస్థ ప్రతినిధి సమాధానమిచ్చారు. వినియోగదారుల భద్రతకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రమాదకర కంటెంట్ కనిపిస్తే వెంటనే తొలగిస్తామని తెలిపారు. చిన్నారులను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. చదవండి: మాల్ పార్కింగ్‌లో శవమై కనిపించిన టిక్‌టాక్ స్టార్ -
అగ్రరాజ్యాన అంగరంగ వైభవంగా అచ్యుతుడి కల్యాణం
తిరుమల: అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో టీటీడీ ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీతో కలిసి ఆదివారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కల్యాణోత్సవ క్రతువులో భాగంగా తొలుత అన్ని వస్తువులను, ప్రాంగణాలను శుభ్రపరచడానికి నిర్వహించే పవిత్ర కర్మ అయిన పుణ్యాహవాచనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారి సర్వసైన్యాధిపతి అయిన విశ్వక్సేనుడి ఆరాధనను చేపట్టారు. తరువాత కలశంలోని శుద్ధి చేసిన నీటిని హోమగుండం, మంటపంలోని అన్ని వస్తువులపై చల్లారు. అనంతరం వైదిక క్రతువు అయిన అంకురార్పణలో భాగంగా అష్ట దిక్పాలకులను ఆవాహన చేసి పూజించారు. వేద మంత్రాల నడుమ ప్రతిష్టా బంధన నిర్వహించారు. ప్రాయశ్చిత హోమం నిర్వహించి దేవతామూర్తలకు నూతన పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం కన్యాదానం, మాంగల్యధారణ, వారణమాయిరం చేపట్టారు. చివరిగా శ్రీదేవిని కుడి వైపున, భూదే విని ఎడమ వైపున కూర్చోబెట్టి స్వామివారికి కర్పూర హారతి, నక్షత్ర హారతి, మహా హారతి ఇవ్వడంతో కల్యాణోత్సవం ముగిసింది. ఈ ఘట్టాలను తిలకించి భక్తులు భక్తిపారవశ్యంతో పులకించారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ప్రవాసాంధ్రుల సమితి చైర్మన్ మేడపాటి వెంకట్, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రత్నాకర్, నాటా అధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంతటి సాహాసయాత్ర! 83 ఏళ్ల వయసులో ఒంటరిగా మహా సముద్రాన్ని...
Japanese Man solo, non-stop trip across the Pacific: భూమి పై గల మహాసముద్రాలన్నిటిలోకి పసిఫిక్ మహాసముద్రం పెద్దది. అలాంటి పసిఫిక్ మహాసముద్రాన్ని 83 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా చుట్టోచ్చేశాడు. ఒంటరిగా సమద్రయానం చేసిన తొలి వృద్ధుడిగా నిలిచాడు. ఇంతకి అతను ఎవరు? ఎలా అంత పెద్ద సాహసయాత్రను చేయగలిగాడో అనే కదా! వివరాల్లోకెళ్తే... జపాన్‌కి చెందిన 83 ఏళ్ల కెనిచి హోరీ పసిఫిక్ మహాసమ్రుదం మీదుగా ఒంటరిగా సముద్రయానం చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. సముద్ర సాహసికుడు. చిన్నతనం నుంచి ఇలాంటి సముద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలు చేయడమంటే అతని అత్యంత ఆసక్తి. అతను 1962లో 23 ఏళ్ల వయసులోనే జపాన్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణించి, పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన ప్రపంచలోనే తొలి వ్యక్తిగా పేరుగాంచాడు. అయితే ఆసమయంలో పాస్‌పోర్ట్ లేకుండా అమెరికాలో ప్రయాణిస్తున్నప్పుడూ చాలా ఒత్తిడికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. ఇలా సమద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలను వరుసగా 1974, 1978, 1982, 2008 వరకు చేశాడు. తదనంతరం మళ్లీ ఇప్పుడూ హోరీ మార్చిలో శాన్ ఫ్రాన్సిస్కోలోని యాచ్ హార్బర్ నుంచి తన తొలి సాహాసయాత్రను ప్రారంభించాడు. ఈ సాహసయాత్రను విజయవంతంగా ముగించుకుని శనివారం తెల్లవారుజామున జపాన్‌లోని కియ్ జలసంధికి చేరుకోవడంతో ముగిసింది. ఈ అరుదైన సాహాసయాత్రతో పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన తొలి అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచాడు. (చదవండి: భారత యువసైంటిస్ట్ మేధస్సుకు ఐన్‌స్టీన్ ఫిదా! ప్చ్.. నోబెల్ మాత్రం దక్కలేదు!) -
హాని చేస్తే ఎవరినీ వదలం
వాషింగ్టన్: భారత్‌కు హాని తలపెట్టాలని చూస్తే, ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టబోమని చైనాకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరోక్ష హెచ్చరికలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్, శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయం ఇచ్చిన విందులో పాలొన్నారు. ఈ సందర్భంగా భారతీయ అమెరికన్లతో ఆయన మాట్లాడారు. 2020 మేలో చైనాతో లద్దాఖ్ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో భారత సైనికులు ప్రదర్శించిన ధైర్యసాహసాలను ఆయన కొనియాడారు. ‘భారత సైనికులు సరిహద్దుల్లో ఎలా వీరోచితంగా పోరాడారు, ప్రభుత్వం ఆ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనే విషయాలను బహిరంగంగా చెప్పలేను. ఒక్క విషయం మాత్రం చెప్పగలను. హాని చేయాలని చూస్తే ఎంతటి వారినయినా సరే భారత్ వదిలిపెట్టదనే సందేశాన్ని మాత్రం పంపించగలిగాం’అని అన్నారు. అదే విధంగా, అమెరికా వైఖరిపైనా రాజ్‌నాథ్ పరోక్షంగా కుండబద్దలు కొట్టారు. ఒక దేశంతో కొనసాగించే సంబంధాలు మరో దేశానికి నష్టం కలిగించకూడదనేదే భారత్ విధానమన్నారు. ఒక్కరికి మాత్రమే లాభం కలిగించే దౌత్య విధానాలపై తమకు నమ్మకం లేదని చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ వైఖరిపై ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒక దేశంతో సత్సంబంధాలను కలిగి ఉండటం అంటే..మరో దేశంతో తెగదెంపులు చేసుకోవడం కాదన్నారు. ఇరుపక్షాలకు లాభదాయకమైన ద్వైపాక్షిక సంబంధాలనే భారత్ కోరుకుంటుందన్నారు. భారత్ బలహీనం కాదు, శక్తివంతమైన దేశమనే విషయం ఇప్పుడు ప్రపంచదేశాలకు తెలిసిందన్నారు. భారత్–అమెరికా సంబంధాలు మరింత బలీయంగా కావడం వెనుక భారతీయ అమెరికన్ల కృషి ఎంతో ఉందని ప్రశంసించారు. సంస్కృతీ సంప్రదాయాలను మరవొద్దని కోరారు. గుటెరస్‌తో జై శంకర్ భేటీ విదేశాంగమంత్రి జై శంకర్ గురువారం ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రస్‌తో సమావేశమయ్యారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అఫ్గానిస్తాన్, మయన్మార్‌లలో పరిస్థితులపై కూలంకషంగా చర్చించినట్లు జై శంకర్ ట్విటర్ ద్వారా తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభం.. ముఖ్యంగా ఇంధన, ఆహార భద్రత. అభివృద్ధి చెందుతున్న దేశాలపై పడుతున్న ప్రభావం వంటివాటిపై గుటెర్రస్‌తో అభిప్రాయాలను పంచుకున్నట్లు ఆయన వివరించారు. సమకాలీన సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌తో కలిసి పనిచేసేందుకు గుటెర్రస్ ఆసక్తి చూపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత్–అమెరికా మధ్య జరిగిన 2+2 మంత్రుల స్థాయి సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రులు రాజ్‌నాథ్, జై శంకర్ ప్రస్తుతం ఆ దేశంలో పర్యటిస్తున్నారు. -
దరిద్రపుగొట్టు ఇల్లు.. ఏకంగా రూ. 14 కోట్లకు అమ్ముడుపోయింది
అది పోష్ ఏరియా. ఎటు చూసినా విలాసవంతమైన బంగ్లాలు.. ఖరీదైన కార్లు. కానీ, ఆ మధ్యలో దిష్టి చుక్కలాంటి ఓ చిన్న కొంప కనిపిస్తుంది. పైగా ఆ ఇంట్లో ఉండేవాళ్లకు దరిద్రం చుట్టుకుంటుందని, నష్టాలు-జబ్బులు జీవితాంతం వెంటాడుతాయనే ప్రచారం ఉంది. దీంతో ఆ ఇంటి వైపు భయపడిపోయేవాళ్లు ఇంతకాలం. అలాంటి కొంప ఇప్పుడు ఏకంగా మన కరెన్సీలో రూ.14 కోట్లకుపైగా అమ్ముడుపోయి.. స్థానికులను నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని(కాలిఫోర్నియా) నోయి వ్యాలీలో ఉంది రెండు వేల చదరపు ఫీట్ల విస్తీర్ణంలోని ఈ పాడుబడిన కొంప. దీనికి ఓనర్ ఎవరనేదానిపై క్లారిటీ లేదు. పైకి డొక్కు బిల్డింగ్‌లా.. లోపల మంచి ఫర్నీషింగ్, మోడ్రన్ సెటప్‌తో ఆశ్చర్యపరుస్తుంది. 122 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఇంట్లో.. రెండో ప్రపంచ యుద్ధ సమయం నుంచి కొందరు నివసించేవాళ్లట. బెడ్రూం లేకుండా ఒక బాత్రూం(అందులో బాత్‌టబ్), కిచెన్, చిన్న లివింగ్ రూం మాత్రమే ఉన్నాయి ఆ ఇంట్లో. మొత్తం చెక్కతో నిర్మించిన ఈ ఇంటిలో ఎవరైనా నివసిస్తే.. వాళ్లను దురదృష్టం వెంటాడేదని నమ్ముతుంటారు. అలా చాలాకాలం పాటు ఆ ఇల్లు ఖాళీగా ఉండిపోయింది. అంతెందుకు ఆ చుట్టుపక్కల కాస్ట్లీ ఇళ్లులు వెలిసినప్పటికీ.. ఆ ఇంటిని కూల్చే ధైర్యం మాత్రం ఎవరూ చేయలేకపోయారట. చివరికి ఓ పెద్దాయన ధైర్యం చేసి చాలాకాలం పాటు ఈ ఇంట్లో నివసించాడు. ఆయన నుంచి కన్జర్వేటర్‌షిప్ కింద టాడ్ వెలీ అనే వ్యక్తి ఈ ఇల్లును చేజిక్కించుకుని.. వేలం పాట నిర్వహించాడు. కంపాస్ అనే బ్రోకరేజ్ వెబ్సైట్ నుంచి జనవరి 7వ తేదీన.. ఆరు లక్షల డాలర్లపై చిలుకు విలువతో వేలం మొదలైంది. పాత కాలం నాటి ఇల్లు కావడం, పైగా దాని వెనుక ‘దరిద్రపుగొట్టు’ ప్రచారం ఈ పాత ఇంటికి మంచి డిమాండ్ తెచ్చిపెట్టింది. రెండువేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఆ పాత ఇంటిని ఏకంగా 1.97 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో 14 కోట్ల రూపాయలకు పైనే) అమ్ముడుపోయింది. ‘పార్కింగ్ ప్లేస్ అంత లేదు.. అంత పెట్టి ఎవరు దక్కించుకున్నారు?’ అనే అనుమానాలు చాలా మందికి కలిగాయి. కానీ, గోప్యత కారణాలతో వేలంలో దక్కించుకున్న వ్యక్తి పేరు చెప్పడం లేదు టాడ్ వెలీ. అన్నట్లు ఆ ఇంటిని కూలగొట్టే ఉద్దేశంగానీ, రిన్నొవేషన్ చేసే ఉద్దేశంగానీ వేలంలో దక్కించుకున్న వ్యక్తికి లేవట!. మరి ఏం చేస్తాడో?. చదవండి: 5జీతో విమానాలకు ప్రమాదం పొంచి ఉందా? -
50 లక్షల మంది బలి
వాషింగ్టన్: ప్రపంచంలో తొలిసారిగా వెలుగు చూసిన నాటి నుంచి కేవలం రెండేళ్లలోపే కరోనా మహమ్మారి తన కరాళ నృత్య విశ్వరూపాన్ని చూపించింది. కరోనా రక్కసి కోరలకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 50లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య అమెరికాలోనే శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిలెస్ నగరాల మొత్తం జనాభా కంటే ఎక్కువ. 1950 ఏడాది నుంచి ప్రపంచంలో వేర్వేరు చోట్ల పలు దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో కారణంగా నమోదైన మరణాల కంటే కూడా కోవిడ్ మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని ఓస్లోలోని శాంతి అధ్యయన సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భూమండలంపై హృద్రోగం, గుండెపోటుతర్వాత కోవిడ్ ఊహకందని స్థాయిలో ప్రాణాలను హరిస్తూ మూడో అతిపెద్ద ప్రాణాంతక వ్యాధిగా అవతరించిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి. నిజానికి ఈ అరకోటి మరణాల సంఖ్య అనేది చాలా తక్కువ అని ఒక వాస్తవిక వాదన ప్రపంచమంతటా వినిపిస్తోంది. అత్యల్ప స్థాయిలో జరుగుతున్న వ్యాధి నిర్ధారణ పరీక్షలు, కోవిడ్ తొలినాళ్లలో సమాజం వెలివేస్తుందనే భయంతో ఇంట్లో కరోనాకు సొంత వైద్యం ప్రయత్నిస్తూ ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులు లక్షల్లో ఉంటారనే అభిప్రాయం జనాల్లో ఉంది. ప్రజారోగ్య వ్యవస్థ అధ్వాన్నంగా ఉండే పేద దేశాలనే కాదు పౌరుల ఆరోగ్యంపై లక్షల కోట్లు ఖర్చుచేసే సంపన్న దేశాలనూ కోవిడ్ కుదిపేసింది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ వంటి సంపన్న దేశాలు కరోనా కోరల్లో చిక్కి విలవిలలాడాయి. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఒక్క అమెరికాలోనే 7.40లక్షలకు పైగా కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ‘ మన జీవన మార్గాన్ని నిర్ణయించే కాలమిది. 50లక్షల మంది బలైపోయారనేది ఇకపై గతం. మరో అరకోటి మందిని కోవిడ్‌కు బలికాకుండా ఎలా ఆపాలి? అనేదే మన ముందున్న అసలు సవాలు’ అని అమెరికాలో యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆల్బర్ట్ కో హెచ్చరించారు. కోవిడ్‌పై అపోహలు, అపనమ్మకాలు, తప్పుడు సమాచారం సమాజంలో రాజ్యమేలుతుండటంతో కొన్ని దేశాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతోంది. -
డిప్రెషన్‌ను మాయం చేసే డివైజ్!
మానసికంగా/శారీరకంగా గాయపరిచే ఘటనలు, జన్యు సంబంధిత కారణాలు, ఒత్తిడి.. ఇలా మనిషి కుంగుబాటుకు రకరకాల కారణాలు ఉండొచ్చు. ఒక్కోసారి మెదడులో కెమికల్ ఇంబ్యాలెన్స్తోనూ డిప్రెషన్లోకి వెళ్లొచ్చు. డిప్రెషన్.. ఎంతకాలంలో క్యూర్ అవుతుందనేది.. మనిషి మానసిక స్థితిని బట్టి, చుట్టూ నెలకొనే పరిస్థితులను బట్టి ఉంటుంది. అయితే అత్యాధునిక టెక్నాలజీ సాయంతో డిప్రెషన్‌ను దూరం చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఊహకందని ఈ ఆలోచనను.. ఆచరణలో పెట్టి విజయం సాధించారు రీసెర్చర్లు. ఓ డివైజ్‌ను ఉపయోగించి డిప్రెషన్‌ను దూరం చేయొచ్చని శాన్ ఫ్రాన్సిస్కో రీసెర్చర్లు నిరూపించారు. కాలిఫోర్నియాకు చెందిన సారా అనే 36 ఏళ్ల మహిళ ఐదేళ్లుగా నిరాశనిస్పృహ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఆమెకు ఈ టూల్‌ను బ్రెయిన్లో ప్రవేశపెట్టడం ద్వారా సత్ఫలితం రాబట్టారు. మూర్ఛ వ్యాధిలో ఉపయోగించే డివైజ్ అది. సారా బ్రెయిన్ సర్క్యూట్లలో బయోమార్కర్లను గుర్తించి.. ఆ స్పాట్‌లలోకి ఎలక్ట్రోడులను పంపించి చికిత్స(Deep brain stimulation) అందించారు. కేవలం ఆరు సెకండ్లపాటు సాగే ట్రీట్మెంట్ను.. పన్నెండు రోజుల్లోనే ఫలితం వచ్చిందని పేర్కొన్నారు. సారాకి సంబంధించిన వివరాలను ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు. అక్టోబర్ 4న ‘నేచర్ మెడిసిన్’ జర్నల్‌లో ఇందుకు సంబంధించిన ఓ కథనం కూడా పబ్లిష్ అయ్యింది. చదవండి: సోషల్ మీడియాలో ‘దమ్ మారో దమ్’కి చెక్ -
తాలిబన్ల వెబ్సైట్లు బంద్ !
బోస్టన్: తాలిబన్ల అధికారిక నిర్ణయాలను ప్రపంచానికి ఐదు భాషల్లో అందిస్తున్న వెబ్ సైట్లు శుక్రవారం హఠాత్తుగా ‘ఆఫ్‌లైన్’లోకి వెళ్లిపోయాయి. తాలిబన్లను ఆన్లైన్ వేదికపై అడ్డుకునేందుకే ఇలా వెబ్సైట్లను క్రియాశీలక స్థితి నుంచి పక్కకు నెట్టారని వార్తలొస్తు న్నాయి. తాలిబన్ల సందేశాలను ఈ వెబ్సైట్లు పష్తో, ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్, దారీ భాషల్లో ప్రపంచానికి అందిస్తున్నాయి. ఈ వెబ్సైట్లకు శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన కంటెంట్ డెలివరీ నెట్వర్క్, ప్రొటెక్షన్ ప్రొవైడర్ సేవలను ‘క్లౌడ్‌ఫ్లేర్’ సంస్థ అందిస్తోంది. వెబ్సైట్ల తాజా స్థితిపై ఆరా తీసేందుకు ‘ది వాషింగ్టన్ పోస్ట్’ వార్తా సంస్థ.. ‘క్లౌడ్‌ఫ్లేర్’ను సంప్రదించినా ఆ సంస్థ స్పందించలేదు. పలు ‘తాలిబాన్ గ్రూప్’లను వాట్సాప్ తొలగించిందని ఎస్ఐటీఈ నిఘా సంస్థ డైరెక్టర్ రీటా కట్జ్ వెల్లడించారు. ఆన్లైన్ వేదికలపై తాలిబన్ల దూకుడు నుంచి అల్‌ఖాయిదా, ఇతర ఇస్లామిక్ ఉగ్రసంస్థలు స్ఫూర్తి పొందకుండా కట్టడి చేయాలని టెక్ దిగ్గజాలను ఆమె కోరారు. ఫేస్బుక్, ట్విట్టర్లు కూడా పలు తాలిబన్ల ఖాతాలను తొలగించాయి. తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌కు ట్విట్టర్లో ఏకంగా 3లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. -
'వైజాగ్'.. ది ఇండియన్ శాన్ఫ్రాన్సిస్కో!
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి కాన్వాస్ పై రమణీయ అందాలు..అడుగడుగునా మదిదోచే మనోహర దృశ్యాలు.. చక్కిలిగింతలు పెట్టే సహజ సిద్ధ సోయగాలు.. ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఎన్నో ఊసులు చెప్పే సాగరతీర ప్రాంతాలు.. ఇలా..విశాఖ సోయగాల్ని వర్ణించాలంటే అక్షరాలు సరిపోవు.. అందుకే సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ అందరూ విశాఖ అందాలకు ఫిదా అంటున్నారు. వచ్చిన ప్రతిసారీ సరికొత్తగా పరిచయమవుతున్న విశాఖ నగరాన్ని చూసి ‘ఐ లవ్ యూ వైజాగ్’ అంటూ మురిసిపోతున్నారు. తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన వియత్నాం అంబాసిడర్ షాన్‌చౌ ఫామ్ విశాఖ సిటీ సోయగాలకు ముగ్ధుడయ్యారు. నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించిన ఆయన వైజాగ్‌ను ఇండియన్ శాన్‌ఫ్రాన్సిస్కోగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. విశాఖను అమెరికాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శాన్‌ఫ్రాన్సిస్కోతో పోల్చిన ఆయన ట్వీట్‌కు భారీగా రీట్వీట్లు, లైక్‌లు, కామెంట్లు వస్తున్నాయి. -
సైకిల్‌పై వచ్చి చోరీ.. వీడియో తీస్తూ నిలబడిన కస్టమర్లు..
కాలిఫోర్నియా: అరవై నాలుగు కళలలో ‘చోరకళ’ కూడా ఒకటి. అయితే, చోరీకి పాల్పడే క్రమంలో కొంత మంది ఎక్కడ దొరికి పోతామో అని టెన్షన్ పడితే.. మరికొంతమంది మాత్రం ఎలాంటి ఆందోళన లేకుండా వచ్చిన పనిని తేలికగా ముగించుకుని కూల్‌గా వెళ్లిపోతుంటారు. ఇప్పటికే దొంగతనానికి సంబంధించిన ఎన్నో వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా కాలిఫోర్నియాలో ఒక వ్యక్తి షాపులో ప్రవేశించి కూల్‌గా దొంగతనం ముగించుకుని స్టైల్‌గా జారుకున్నాడు. నల్లని జాకెట్, ముఖానికి నలుపు రంగుబట్ట చుట్టుకుని శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న వాల్గ్రీన్స్లోని ఒక షాపులో సైకిల్ మీద ప్రవేశించాడు. అంతటితో ఆగకుండా ఒక నల్లని కవర్‌ను తీశాడు. వెంటనే అక్కడ ఉన్న వస్తువులన్నీ తన కవర్లో వేసుకున్నాడు. ఆ షాపులో ఉన్న కస్టమర్లు అతడిని అనుమానంగా చూశారు. కానీ ఎవరు కూడా అతగాడి దగ్గరకు వెళ్లి ఆపే సాహసం చేయలేదు. ఇక్కడ విడ్డూరమేంటంటే ఆ షాపు సెక్యూరిటీ కూడా దూరం నుంచి ఈ తతంగాన్ని వీడియో తీస్తూ ఉండిపోయాడు. ఆ దొంగ పని ముగించుకొని సైకిల్‌పై వెళ్లిపోయే క్రమంలో.. సెక్యూరిటీ అతడిని ఆపటానికి ప్రయత్నించాడు. కానీ, దొంగ ఎంతో చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకొని దర్జాగా వెళ్లిపోయాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ పుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. ఈ దొంగతనం జరిగే సమయంలో లియాన్నే మెలెండెజ్ అనే జర్నలిస్టు అక్కడే ఉంది. 'నేను ఆ చోరీని అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. మా నగరంలో ఇలాంటివి తరచుగా జరుగుతుంటాయి. ఈ షాపులోనే కాదూ... ఇళ్లలోని వస్తువులను, కార్లను కూడా దొంగతనం చేస్తారు' అని ఆమె చెప్పుకొచ్చింది.. అయితే, శాన్ఫ్రాన్సిస్కోలో కొన్ని వివాదస్పద చట్టాలు ఉన్నాయి. దీని ప్రకారం, తక్కువ ధర ఉన్న వస్తువులను చోరీ చేస్తే విధించే శిక్షలను, జరిమానాలను తగ్గించారు. దీంతో కొంత మంది చిల్లర దొంగలు రెచ్చిపోయి చోరీలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘నీ చోరకళ భలే ఉంది బాసు..’, ‘ఏమైనా నీ ధైర్యానికి హ్యాట్సాఫ్..’, ‘ఇంత జరుగుతున్న కొంత మంది కస్టమర్లున్నారే.. వారిని..’, ‘పాపం.. ఒక్కటే కష్టపడుతున్నాడు.. కాస్త సహాయం చేయొచ్చుగా..’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. This just happened at the @Walgreens on Gough & Fell Streets in San Francisco. #NoConsequences @chesaboudin pic.twitter.com/uSbnTQQk4J — Lyanne Melendez (@LyanneMelendez) June 14, 2021 చదవండి: నీటిలో గాలి బుడగలు ఊదుతున్న శునకం.. ఫన్నీ వీడియో.. -
గగనంలో ఘన చరిత్ర
సాక్షి బెంగళూరు: పూర్తిగా మహిళా పైలట్ల సారథ్యంలోనే అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం సుదీర్ఘ ప్రయాణం తర్వాత బెంగళూరుకు చేరుకుంది. తద్వారా వారు సరికొత్త చరిత్ర లిఖించారు. కెప్టెన్ జోయా అగర్వాల్, కెప్టెన్ పాపగారి తన్మయి, కెప్టెన్ ఆకాంక్ష సోనావరే, కెప్టెన్ శివానీ మన్హాస్ అనే నలుగురు పైలట్లు ఈ విమానాన్ని విజయవంతంగా నడిపించారు. సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చారు. పాపగారి తన్మయి తెలుగు యువతి కావడం విశేషం. విమానం శాన్ఫ్రాన్సిస్కోలో స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8.30 గంటలకు బయలుదేరింది. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా అత్యంత క్లిష్టమైన ఉత్తర ధ్రువం గుండా ఎక్కడా ఆగకుండా(నాన్‌స్టాప్) ప్రయాణించి బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3.45 గంటలకు ల్యాండయ్యింది. మొత్తం 13,993 కిలోమీటర్ల దూరాన్ని 17 గంటల్లో అధిగమించింది. మహిళలకు సాధ్యం కానిది ఏదీ లేదు పూర్తిగా మహిళా పైలట్లతోనే ఉత్తర ధ్రువం మీదుగా విమానం నడిపి చరిత్ర సృష్టించామని పైలట్ జోయా అగర్వాల్ అన్నారు. ఈ మార్గంలో ప్రయాణం ద్వారా 10 టన్నుల ఇంధనాన్ని ఆదా చేసినట్లు పేర్కొన్నారు. మహిళలకు సాధ్యం కానిది ఏదీ లేదని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శాన్ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు చేరుకున్న విమానం -
16 వేల కిమీ.. 17 గంటలు.. అంతా మహిళలే
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా మహిళా సిబ్బంది రికార్డు సృష్టించబోతున్నారు. లాంగెస్ట్ కమర్షియల్ ఫ్లైట్ జర్నీ చేయబోతున్నారు. సుమారు 17 గంటల పాటు.. 16 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు. బోయింగ్ 777-200 ఎల్ఆర్ విమానంలో ఈ ప్రయాణం చేయబోతున్నారు. సాన్ ఫ్రాన్సిస్కో నుంచి బెంగుళూరు వరకు ఈ ప్రయాణం కొనసాగనుంది. ఈ సందర్భంగా ఏఐ 176 విమానంలో ప్రధాన పైలట్, కెప్టెన్ జోయా అగర్వాల్ మాట్లాడుతూ.. ‘సుమారు 16 వేల కిలోమీటర్ల దూరం పూర్తిగా మహిళా సిబ్బందితోనే ఈ సుదీర్ఘ ప్రయాణం కొనసాగబోతుంది. మేం ఉత్తర ధృవం మీదుగా అత్యంత సుదూర విమానయానం చేయనున్నాం.. అయితే ఇది ఇది సౌర వికిరణాలు, అల్లకల్లోలం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉండనుంది. ఉత్తర ధృవం మీదుగా విమానాన్ని నడపడం ఎంతో సవాలుతో కూడుకున్న విషయం. కానీ మేం దీన్ని పూర్తి చేయాలని బలంగా నిర్ణయించకున్నాం. చరిత్రని తిరగరాస్తమనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ విమానం ఈ రోజు రాత్రి 8:30 గంటలకు (స్థానిక సమయం) సాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరి 2021 జనవరి 11 న తెల్లవారుజామున 3.45 గంటలకు (స్థానిక సమయం) బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. (చదవండి: ఆమె పేరుతో ‘ఎయిర్ ఇండియా’లో రికార్డు) ఆర్కిటిక్ మీదుగా ప్రయాణించడం వలన రెండు సాంకేతిక కేంద్రాలైన బెంగళూరు, సాన్ ఫ్రాన్సిస్కోల మధ్య దూరం తగ్గుతుంది. ఈ రెండు ప్రాంతాలు సుమారు 13,993 కిలోమీటర్ల దూరంలో.. ప్రపంచం వ్యతిరేక చివరలలో 13.5 గంటల టైమ్ జోన్ లాగ్‌తో ఉంటాయి. ఈ మార్గంలో సాన్ ఫ్రాన్సిస్కో-సీటెల్-వాంకోవర్ ఉంటాయి. ‘మేము ఉత్తరాన 82 డిగ్రీల వరకు వెళ్తాము. సాంకేతికంగా చెప్పాలంటే మేం ధృవం మీద ప్రయాణం చేయం.. దాని పక్కనే ఉంటాము. ఆపై మేము దక్షిణాన, చాలావరకు రష్యా మీదుగా.. దక్షిణాన ఇంకా కిందుగా బెంగళూరుకు వస్తాము" అని విమానంలో ఉన్న నలుగురు పైలట్లలో ఒకరు, కెప్టెన్ పాపగారి తన్మై వెల్లడించారు. ఫ్లైట్ సేఫ్టీ ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కెప్టెన్ నివేదా భాసిన్ కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్లు ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: ఎయిరిండియాపై టాటా గురి..) ఇది ప్రయాణం అమెరికా వెస్ట్ కోస్ట్, దక్షిణ భారతదేశం మధ్య మొట్టమొదటి నాన్-స్టాప్ రూట్ అని ఎయిర్‌లైన్ తెలిపింది. ఇదిలా ఉండగా ఎయిర్ ఇండియా తన మొదటి నాన్-స్టాప్ సర్వీసును హైదరాబాద్-చికాగో మధ్య జనవరి 15 నుంచి ప్రారంభించాలని యోచిస్తోంది. -
నార్త్‌పోల్ మీదుగా..!
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు చెందిన మహిళా పైలట్ల బృందం చరిత్ర సృష్టించనుంది. బోయింగ్ 777 విమానంలో సాన్ ఫ్రాన్సిస్కో నుంచి ప్రారంభమై ఉత్తర ధృవం మీదుగా అత్యంత సుదూర వైమానిక మార్గంలో ప్రయాణించి నేడు(జనవరి 9)న బెంగళూరు చేరుకోనుంది. ఈ ప్రయాణంలో మొత్తం 16 వేల కిలోమీటర్లు ఈ బృందం పయనిస్తుంది. ఉత్తర ధృవం మీదుగా విమానాన్ని నడపడం ఎంతో సవాలుతో కూడుకున్న విషయం. ఈ మార్గంలో వైమానిక సంస్థలు సహజంగా ఎంతో అనుభవం ఉన్న, అత్యుత్తమ పైలట్లనే పంపుతారు. ఈ సారి ఎయిర్ఇండియా ఈ బాధ్యతను ఒక మహిళా పైలట్‌కు అప్పగించింది. ఈ విమానాన్ని ఎయిర్ ఇండియా మహిళా కెప్టెన్ జోయా అగర్వాల్ నాయకత్వంలోని మహిళా పైలట్ల బృందం నడుపుతోంది. ‘పౌర విమానయాన శాఖ, ఎయిర్ ఇండియా నాపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఉత్తర ధృవం మీదుగా అత్యంత సుదూర మార్గంలో బోయింగ్ 777 విమానాన్ని నడిపే అద్భుత అవకాశం నాకు లభించింది’అని జోయా అగర్వాల్ పేర్కొన్నారు. తన్మయి పాపగిరి, ఆకాంక్ష సోనావానే, శివానీ మన్హాస్ వంటి అత్యంత అనుభవజ్ఞులైన మహిళా పైలట్ల బృందం తనకు సహకరిస్తోందని తెలిపారు. -
20 వేల మంది అమెజాన్ ఉద్యోగులకు కరోనా!
శాన్ ఫ్రాన్సిస్కో: కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు తమ సంస్థలో పనిచేసే దాదాపు 20 వేల మంది ఉద్యోగులు కరోనా బారిన పడినట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది. 1.37 మిలియన్ల ఫ్రంట్‌లైన్ కార్మికుల డేటాతో పాటు యునైటెడ్ స్టేట్స్‌లోని హోల్ ఫుడ్స్ మార్కెట్, కిరాణా దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులతో కలిపి కరోనా పాజిటివ్‌ల రేటు ఊహించిన దానికంటే తక్కువ రేటును చూపించిందని అమెజాన్ తన ప్రకటనలో పేర్కొంది. దాదాపు 650 సైట్ల ద్వారా అమెజాన్ రోజుకు 50,000 పరీక్షలను నిర్వహించిందని సీటెల్ ఆధారిత సంస్థ తెలిపింది. (చదవండి: అమెజాన్‌లో 10 లక్షల ఉద్యోగాలు) మహమ్మారి పట్ల ఉద్యోగులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి అమెజాన్ చాలా కష్టపడిందని చెప్పింది. కరోనా సంక్షోభం ప్రారంభం నుంచి ప్రతి బ్రాంచ్‌లో పనిచేసే ఉద్యోగులకు వారి భవనంలో నమోదైన ప్రతి కొత్త కేసు గురించిన సమాచారం ప్రతి ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు బ్లాగ్ ద్వారా పంచుకునేదని తెలిపింది. హోల్ ఫుడ్స్ విభాగంలో పనిచేసే ఉద్యోగుల రేటు అమెరికా జనాభాకు సమానంగా ఉంటే, ఇందులో పాజిటివ్ కేసుల సంఖ్య 33 వేలుగా ఉండే అవకాశముందని వివరించింది. కోవిడ్ బారిన పడకుండా ఉద్యోగులను సంరక్షించేందుకు తమ సంస్థ తీసుకున్న భద్రత చర్యలపై లాజిస్టిక్స్ కేంద్రాల్లో పనిచేసే కొంత మంది ఉద్యోగులు విమర్శించడమే కాకుండా, కరోనా సోకిన తమ సహ ఉద్యోగుల గురించిన సమాచారాన్ని పంచుకోవటానికి కూడా ఇష్టపడలేదని అమెజాన్ పేర్కొంది. (చదవండి: కరోనా : అమెజాన్‌లో వారికి భారీ ఊరట) -
తెలుగు రాష్ట్రాల నుంచి 120 మంది అమెరికాకు..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు చెందిన 120 మంది అమెరికాకు పయనమయ్యారు. గురువారం ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా శాన్ఫ్రాన్సిస్కోకు బయలుదేరారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొస్తోంది. అదే సమయంలో అత్యవసర పనుల మీద భారత్‌కు వచ్చి.. లాక్డౌన్ కారణంగా ఇక్కడే ఉండిపోయిన వారిని ఆయా దేశాలకు తరలిస్తోంది. ఈ క్రమంలోనే బెంగళూరు నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న కనెక్టెడ్ ఫ్లైట్.. అమెరికాకు వెళ్లాల్సిన ప్రయాణికులతో ఢిల్లీకి చేరుకుంది. అక్కడి నుంచి శుక్రవారం తెల్లవారుజామున శాన్ఫ్రాన్సిస్కోకు బయలుదేరనుంది. ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన ఆ విమానంలో భౌతిక దూరంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఫేస్ మాస్క్, గ్లోవ్స్, శానిటైజర్‌ను అందజేసినట్లు అమెరికాకు బయలుదేరిన ప్రయాణికుడు ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. కాగా, ఈ నెల 23న ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు మరో విమానం వెళ్లనుంది. -
నేడు అమెరికా నుంచి..
శంషాబాద్: వందేభారత్ మిషన్‌లో భాగంగా మరో రెండు విమానాలు సోమవారం రానున్నాయి. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి ఓ విమానం వస్తోంది. ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన తెలుగు ప్రయాణికులను తీసుకురావడానికి శంషాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరి ఉదయం 6.45కు అక్కడికి చేరుకోనుంది. అదే విమానంలో ప్రయాణికులు ఉదయం 10.15కి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అబుదా బి నుంచి వచ్చే మరో ఎయిర్ ఇండియా విమానం రాత్రి 8 గంటలకు నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరు కో నుంది. నిర్ధారించిన సమయాల్లో మార్పులు జరిగే అ వకాశాలు కూడా ఉన్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలి పాయి. భౌతిక దూరం నిబంధనలకు అనుగుణంగా ఒక్కో విమానంలో 150–200లోపు ప్రయాణికులను అనుమతించే అవకాశాలున్నాయి. ఈ ప్రయాణికులను థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలతో పాటు కస్టమ్స్ తనిఖీలు చేప ట్టిన తర్వాత పెయిడ్ క్వారంటైన్‌కు తరలిస్తారు. -
‘గ్రాండ్ ప్రిన్సెస్’లో చిక్కుకున్న భారతీయులు!
వాషింగ్టన్: మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్) ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కరోనా వైరస్ కారణంగా 100 మంది భారతీయులు గ్రాండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్లో చిక్కుకుపోయారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు... కొన్నిరోజుల క్రితం గ్రాండ్ ప్రిన్సెస్ 3500 మంది ప్రయాణీకులతో ఓక్లాండ్ తీరం నుంచి బయల్దేరింది. ఈ క్రమంలో అందులో ఉన్న 21 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో శాన్ ఫ్రాన్సిస్కో బే వద్ద నిలిపివేశారు. అనంతరం 2900(2400 మంది ప్రయాణీకులు, 500 మంది సిబ్బంది) మందిని శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువెళ్లి స్వస్థలాలకు తరలించారు. ఈ క్రమంలో తమ వద్ద కరోనా నెగటివ్ రిపోర్టులు లేవనే కారణంతో.. ఇండియన్ ఎంబసీ అధికారులు తమను షిప్పులోనే ఉండాల్సిందిగా సూచించారని దాదాపు 100 మంది ప్రయాణీకులు ఆరోపించారు. అదే విధంగా అమెరికా అధికారులు తమకు కరోనా టెస్టులు నిర్వహించేందుకు అంగీకరించడం లేదని పేర్కొన్నారు. తమకు ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కాపాడాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన భారత విదేశాంగ శాఖ... అమెరికాలో ఉన్న భారతీయుల ఆరోగ్యం, భద్రతకై భారత ఎంబసీ అధికారులు వాషింగ్టన్‌తో కలిసి పనిచేస్తున్నారని.. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కుంటామని పేర్కొంది. కాగా కరోనా ఆనవాళ్లు బయటపడిన తొలినాళ్లలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జపాన్ తీరంలో డైమండ్ ప్రిన్సెస్ అనే నౌకను నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఆపిల్ సీఈవోకు వేధింపులు, ఫిర్యాదు
శాన్ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌పై భారతీయ సంతతికి చెందిన ఒక వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. పాలో ఆల్టోలోని కుక్ అధికారిక నివాసంలోకి రెండు సార్లు అక్రమంగా చొరబడి అనుచితంగా ప్రవర్తించడంతో పాటు, ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై ఆపిల్ ఫిర్యాదు చేయడంతో కాలిఫోర్నియా కోర్టు అతనిపై తాత్కాలిక నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. సిలికాన్ వ్యాలీలోని కుక్ నివాసం, ఆయన సెక్యూరిటీ గార్డులు ముగ్గురు, ఆపిల్ పార్క్ ప్రధాన కార్యాలయానికిదూరంగా ఉండాలని కూడా ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 3వ తేదీ దాకా ఈ ఉత్తర్వులు అమల్లో వుంటాయని కోర్టు తెలిపింది. ఆపిల్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ విలియం బర్న్స్ ప్రకారం శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన రాకేశ్ శర్మ అలియాస్ "రాకీ" (41) రెండుసార్లు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డాడు. 25 సెప్టెంబర్ 2019న వాయిస్ మెయిల్‌తో శర్మ వేధింపులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 4 న షాంపైన్ బాటిల్, పువ్వులు తీసుకొని అనుమతిలేకుండా నేరుగా కుక్ ఇంటికి వచ్చాడు. ఒక వారం తరువాత మరో అవాంఛనీయ కాల్ చేసిన బెదిరింపులకు పాల్పడ్డాడు. కొంతకాలం తర్వాత, శర్మ తన ట్విటర్ ఖాతాలో ఆపిల్ ఎగ్జిక్యూటివ్‌ను ట్యాగ్ చేస్తూ కొన్నిఅభ్యంతరకరమైన వ్యాఖ్యలు, ఫోటోలు షేర్ చేశాడు. అలాగే జనవరి 15 న మరోసారి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతుండగా భద్రతాసిబ్బంది అడ్డుకున్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని హెచ్చరిస్తూ ఆపిల్ న్యాయవాదులు రాకీకి ఒక లేఖ పంపారు. అయినా ఏ మాత్రం బెదరని రాకీ ఈసారి ఆపిల్ టెక్నికల్ టీంకు కాల్ చేశాడు. కంపెనీ తనను చంపడానికి చూస్తోందని ఆరోపించాడు. మళ్లీ ఒక నెల తరువాత తిరిగి వచ్చిన అతగాడు ఏకంగా టిమ్ కుక్ నివాసంలోని గేటులోకి ప్రవేశించి డోర్ బెల్ మోగించాడని కంపెనీ తన ఫైలింగ్‌లో పేర్కొంది. మరోవైపు కుక్ నివాసం వద్ద పదపదే నిబంధనలను ఉల్లంఘించడం, తుపాకీ గురించి మాట్లాటడం చేశాడని, శారీరకంగా తనకు హాని చేస్తాడని గట్టిగా నమ్ముతున్నానని కుక్ సెక్యూరిటీ బృందంలోని ఒక సభ్యుడు ఆరోపించారు. -
ఆ కుక్క ఆచూకీ చెబితే 5 లక్షల రివార్డ్
కాలిఫోర్నియా : చాలామంది పెంపుడు జంతువులను ప్రేమగా చూసుకుంటారు. కొందరు అయితే వాటిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఎక్కడికి వెళ్లినా తోడు- నీడలా వెంట తీసుకెళ్తారు. అలాంటి వాటికి ఏమైనా జరిగితే వారు విలవిల్లాడిపోతారు. సరిగ్గా అలాంటి ఘటనే తాజాగా కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. సాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఎమిలీ టాలెర్మో అనే మహిళ ఆస్ట్రేలియన్ షెఫర్డ్ డాగ్‌ను పెంచుకుంటోంది. దాని పేరు జాక్సన్. గత వారం కిరాణ దుకాణం నుంచి వస్తుండగా ఆ కుక్క కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి ఎమిలీ తన స్నేహితులతో కలిసి కుక్కను వెతికినా.. ఎంతకీ దాని ఆచూకీ లభించకపోవడంతో కావాలనే ఎవరో దాన్ని అపహరించి ఉంటారని భావించిన మహిళ దాన్ని వెతకడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించింది. కుక్కను వెతికి ఇచ్చిన వారికి రూ. 5 లక్షల నజరానాను ప్రకటించింది. అంతేగాక కుక్కను వెతకడానికి సహాయంగా ఓ విమానాన్ని సైతం అద్దెకు తీసుకుంది. విమాన ఖర్చులకు అదనంగా 1200 డాలర్లను కేటాయించింది. జాన్సన్‌ను వెతికి పట్టుకోడానికి కావాల్సిన ఆర్థిక సహాయం కోసం ఎమిలీ ఒక గోఫండ్‌మేను ప్రారంభించింది. అందుకు ఆమెకు 7వేల డాలర్ల కంటే ఎక్కువగానే సేకరించడంతో అదనంగా వచ్చిన డబ్బును డాగ్ రెస్క్యూకి విరాళంగా ఇవ్వాలని యోచిస్తోంది. ఇక ఈ విషయంపై కుక్క యాజమాని ఎమిలీ మాట్లాడుతూ.. ‘జాన్సన్ ఎప్పుడూ నాతోనే ఉండేది. మాది నిజమైన ప్రేమ. నేను నా అయిదేళ్ల జాక్సన్‌ను వెతకడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాను. దాన్ని కనుగొనడానికి నాకు సహాయం కావాల’ని ఆవేదనతో కోరుకుంది. -
ఆ యాప్ ద్వారా రెండు కోట్ల పెళ్లిళ్లు జరిగాయి!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో యువతీ యువకులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇప్పటికీ పది శాతానికి మించడం లేదు. మిగతా 90 శాతం పెళ్లిళ్లు పెద్దలు నిశ్చియించన ‘అరేంజ్డ్ మ్యారేజెస్’ లేదా ‘సెమీ అరెంజ్డ్ మ్యారేజెస్’ జరుగుతున్నాయి. అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే ముఖ పరిచయం కూడా లేకుండా పెద్దలు, మధ్యవర్తులు కుదుర్చిన పెళ్లిళ్లు కాగా, మిత్రుల ద్వారానో, పెద్దల ద్వారానో పరిచయమై ఒకరికొకరు కొంత అర్థం చేసుకుని చేసుకొనే పెళ్ళిళ్లను సెమీ అరేంజ్డ్ మ్యారేజెస్గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ఇదివరకు పెళ్లిళ్లు కుదుర్చే ఏజెన్సీలు, సంస్థలు ప్రధాన పాత్ర వహించగా, నేటి ఆధునిక టెలికామ్ కాలంలో డేటింగ్ యాప్‌లు, వెబ్సైట్లు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. భారత్, ఇతర దక్షిణాసియా దేశాల యువతీ యువకుల కోసం శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఏర్పాటయిన ‘దిల్ మిల్’ యూప్ యమ స్పీడ్‌గా దూసుకుపోతోంది. అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాల్లో కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇప్పటికే ఈ యాప్ ద్వారా రెండు కోట్లకు పైగా పెళ్లిళ్లు జరిగాయట. రోజుకు కనీసం ఒక్క పెళ్లి చేయడం తమ విజయానికి ప్రధాన కారణమని ‘దిల్ మిల్’ వ్యవస్థాపకులు, సీఈవో కేజే దలివాల్ ఇటీవల ఓ మీడియాతో వ్యాఖ్యానించారు. నామ మాత్రపు పెట్టుబడితో మొదలైన ఈ యాప్ ఇప్పుడు భారతీయ కరెన్సీలో 357 కోట్ల రూపాయలకు చేరుకుంది. తమ యాప్ విజయానికి ‘డేటింగ్ డాట్ కామ్, డేట్మైఏజ్, లవింగ్ఏ, టుబిట్, అనస్థేసియా డేట్, చైనాలవ్...’ తదితర డేటింగ్ వెబ్సైట్లు ఎంతో కారణమని కూడా దలివాల్ పేర్కొన్నారు. అమెరికా, కెనడాలతోపాటు బ్రిటన్, ఇతర యూరప్ దేశాల్లో నివసిస్తున్న దక్షిణాసియా దేశాలకు చెందిన యువతీ, యువకుల కోసమే ఈ ‘దిల్ మిల్’ యాప్‌ను అభివృద్ధి చేశారు. దక్షిణాసియా దేశాలకు చెందిన యువతీ యువకుల్లో 80 శాతం మంది దక్షిణాసియా దేశాలకు చెందిన వారిని పెళ్లి చేసుకోవడానికే ఇష్ట పడుతున్నారట. ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్లకుపైగా భారతీయులు స్థిరపడ్డారని, ఇప్పుడు వారిని తమ యాప్ ప్రధానంగా ఆకర్షిస్తోందని దలివాల్ తెలిపారు. 2040 సంవత్సరం నాటికి ప్రతి పది మందిలో ఏడుగురు ఈ యాప్ ద్వారా కలసుకుంటారని దిల్ మిల్ అంచనా వేస్తోంది. ఈ యాప్‌ను 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ప్రాయం వారు ఉపయోగిస్తున్నప్పటికీ వారిలో 25 ఏళ్ల వారే ఎక్కువగా ఉన్నారు. అమెరికాలో స్థిరపడిన దక్షిణాసియాకు చెందిన తొలి, రెండో తరంలో ఈ యాప్‌కు ఎక్కువ మార్కెట్ ఉంది. మహిళల కేంద్రంగా ఏర్పడిన ‘బంబుల్’ తరహాలోనే ఈ దిల్ మిల్‌ను ఏర్పాటు చేసినప్పటికీ ఈ యాప్ ద్వారా మహిళలు కేవలం ఎన్ఆర్ఐలనే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా సొంత సామాజిక వర్గాలను చెందిన వారిని ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ యాప్‌కు మరో ప్రత్యేకత ఉంది. ఒకరితో షేర్ చేసుకునే సమాచారం, ఫొటోలు వారిద్దరు మినహా మరొకరు చూసే అవకాశం, షేర్ చేసుకునే ఆస్కారం అసలు ఉండదు. యువతీ యువకులు ముఖాముఖి కలుసుకుని ముచ్చటించుకునేందుకు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా యాప్ యాజమాన్యం నిర్వహిస్తోంది. ఇటీవల న్యూయార్క్ సిటీలో అలాంటి ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. సంగీతం పట్ల యువతీ, యువకులకు ఆసక్తి కలిగించడంతోపాటు నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో కూడా బాలీవుడ్ నటి శిల్పాశెట్టితో ఓ వీడియాను, ప్రేమంటే ఏమిటో చెప్పడానికి ‘లవ్ ఈజ్’ పేరుతో మరో వీడియోను విడుదల చేసింది. -
గూగుల్ కార్యాలయం ఎదుట ఉద్యోగుల ఆందోళన
శాన్ ఫ్రాన్సిస్కొ : శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ ప్రధాన కార్యాలయం ముందు ఆ సంస్థకు చెందిన ఉద్యోగులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఏ కారణం లేకుండానే ఇద్దరు ఉద్యోగులను సెలవుపై పంపడమేంటని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని దాదాపు 200 మందికి పైగా ఉద్యోగులు శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా సెలవుపై పంపిన ఇద్దరిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 'సంస్థలో గత కొంతకాలంగా జరుగుతున్న లైంగిక వేధింపులపై చర్యలు తీసుకోవాలని నేను, నా తోటి ఉద్యోగులతో కలిసి సంస్థకు వివరించాం. అదే సమయంలో పని వేళల విషయంలోనూ కొన్ని సంస్కరణలు చేయాలని అడిగాం. కానీ మా విన్నపాలను ఏవీ పట్టించుకోకపోగా నోరు మూసుకొని ఉండాలని బెదిరిస్తున్నారు. అంతటితో గాక తమకు ఎదురు తిరిగిన వారిని సెలవుల పేరుతో ఉద్యోగం నుంచి తీసేస్తున్నారని' సంస్థలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న జాక్ జొరాతంగ్ వాపోయారు. వెంటనే సెలవుపై పంపిన ఇద్దరు ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ నెల మొదట్లో ఇద్దరు ఉద్యోగులు కంపెనీలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు వారిని సెలవుపై పంపినట్లు గూగుల్ సంస్థ ప్రతినిధి మీడియాకు తెలిపారు. -
రాజకీయాలపై చర్చలొద్దు: గూగుల్
ప్రపంచంలో ఎవరికి ఏ సందేహం వచ్చినా టక్కున గుర్తొచ్చేది గూగుల్. మానవ జీవితంలో అంతగా పెనవేసుకున్న ఈ ఇంటర్నెట్ దిగ్గజం అందులో పనిచేసే ఉద్యోగులకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. గూగుల్‌లో ముఖ్యభాగమైన ఇంటర్నెట్ విభాగంలో రాజకీయాల గురించి చర్చించే బదులుగా పనిపై దృష్టి పెట్టాలని శుక్రవారం ఉద్యోగులకు సూచించింది. చాలా కాలంగా ప్రజల మనస్సులను చూరగొన్న సంస్థ అదే ఉత్సాహాన్ని కొనసాగించాలనుకుంటుంది. అందులో భాగంగానే మార్గదర్శకాలను నవీకరించారు. సహోద్యోగులతో నిత్యం కొత్త ఆలోచనలు, సమన్వయంతో, అంతర్గత బోర్డు సమావేశాలు ద్వారా ఆలోచనలకు పదును పెట్టాలని గూగుల్ పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం తాజా రాజకీయాల గురించి చర్చించి సమయం వృధా చేసుకోవద్దని, సమాజానికి ఉపయోగపడే ఆలోచనలకు పదును పెట్టాలని కంపెనీ సూచించింది. చర్చలు, వాదోపవాదాలకు దూరంగా ఉండాలని కేటాయించిన పనిని సక్రమంగా నిర్వర్తించాలని కోరింది. కంపెనీ ప్రాథమిక బాధ్యత మెరుగైన సేవలను అందించడమే, అందుకోసం నిబద్ధతతో పనిచేయాలని కంపెనీ తెలియజేసింది. కంపెనీ కార్యకలాపాలను ప్రశ్నించడానికి, చర్చించడానికి అందరికి స్వేచ్ఛ ఉందని నూతన మార్గదర్శకాలలో పొందుపర్చారు. అయితే, కంపెనీ ఉత్పత్తులను, నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారం చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంపెనీపై చేసిన నిరాదారమైన ఆరోపణలను గూగుల్ ఖండించింది. ఎన్నికల్లో తనకు, తన మద్దతుదారులకు గూగుల్ వ్యతిరేకంగా పనిచేసిందని ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే. మాజీ ఉద్యోగి కంపెనీ పై చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని పేర్కొంది. గతంలో పనివేళల్లో లైంగిక వేధింపులు, యుఎస్ రక్షణ, ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీలతో కాంట్రాక్ట్ ఒప్పందాలపై గూగుల్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
ముస్లింలుగా భావించినందువల్లే...దుశ్చర్య
వాషింగ్టన్ : కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి జాత్యహంకార చర్యకు పాల్పడ్డాడు. ముస్లిం వర్గానికి చెందిన వారిగా భావించి ఓ కుటుంబం మొత్తాన్ని కారుతో ఢీకొట్టాడు. మంగళవారం శాన్ ఫ్రాన్సిస్కోలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇసయ్యా పీపుల్స్ (34) శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా తన ముందు ఉన్న గుంపుపైకి కారు ఎక్కించాడు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. కాగా బాధితులను ముస్లింలుగా భావించిన కారణంగానే ఇసయ్య ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని సన్నీవేల్ పబ్లిక్ సెక్యూరిటి విభాగం తన ప్రకటనలో పేర్కొంది. వారిని చంపడమే లక్ష్యంగా అతడు ఈవిధంగా ప్రవర్తించాడనడానికి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నట్లు తెలిపింది. అయితే బాధితుల కమ్యూనిటీ, జాతీయతకు సంబంధించిన విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ విషయం గురించి ఇసయ్య లాయర్ మాట్లాడుతూ.. గతంలో మిలిటరీ ఆఫీసరుగా పనిచేసిన ఇసయ్య ప్రస్తుతం మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఓ సైక్రియార్టిస్ట్ దగ్గర చికిత్స కూడా తీసుకుంటున్నాడని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడితోనే ఈ విధంగా ప్రవర్తించాడని తెలిపారు. -
గూగుల్ హ్యాంగౌట్స్ యూజర్లకు షాకింగ్ వార్త
శాన్ఫ్రాన్సిస్కో: గూగుల్ హ్యాంగౌట్స్ మెసేజింగ్ యాప్‌కు 2020కల్లా సేవలు నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించుకున్నట్లు నైన్టుఫైవ్ గూగుల్ అనే వెబ్సైట్ వెల్లడించింది. జిచాట్కు ప్రత్యామ్నయంగా 2013లో గూగుల్ సంస్థ హ్యాంగౌట్స్ను తీసుకొచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో నెటిజన్లు దీనిని ఆదరించలేదు. దానికి తోడు హ్యాంగౌట్స్‌లో బగ్స్ ఎక్కువగా ఉండేవి. గత కొద్ది కాలంగా గూగుల్ కూడా ఈ యాప్‌పై తన దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించలేదు. ఈ యాప్‌కు బదులుగా గూగుల్ మెసేజింగ్ యాప్‌ను అధునాతన ఫీచర్లతో తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. గత ఏప్రిల్‌లోనే ఆర్సీఎస్ ఫీచర్లను మెసేజింగ్‌కు జోడిస్తున్నామని తెలుపుతూనే హ్యాంగౌట్స్ సేవలు నిలిపివేస్తామని చెప్పకనే చెప్పింది. హ్యాంగౌట్స్‌కు గూగుల్ తన సేవలను నిలిపివేయడానికి ఇంకా ఒక సంవత్సరం ఉంది కాబట్టి అది వాడే వారు మరొక ప్లాట్‌ఫాంను ఎన్నుకోవడానికి సమయం ఉంది. -
బీమర్‌తో ఆరోగ్య సమస్యలకు చెక్
శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే ఏం కావాలి? కణాలన్నింటికీ శక్తి కోసం ఆక్సిజన్ కావాలి. పోషకాలు అందాలి. పేరుకుపోతున్న వ్యర్థాలు సక్రమంగా బయటకు వెళ్లిపోతుండాలి. ఈ మూడింటిలో ఏది సక్రమంగా జరక్కపోయినా శరీరంలోని కణాలు నిస్తేజమవుతాయి. ఇది కాస్తా వాపు/మంటలకు దారితీస్తుంది. ఆ తర్వాత జబ్బులు చుట్టుముడతాయి! ఇదీ వైద్య శాస్త్రం మనకు చెప్పే విషయం. పోషకాల సంగతి కాసేపు పక్కన పెడదాం. సాధారణ పరిస్థితుల్లో కణాలకు లభించే ఆక్సిజన్ కంటే 30 శాతం ఎక్కువ లభిస్తే ఏమవుతుంది? అవన్నీ చురుగ్గా ఉంటాయి. అవయవాలూ సక్రమంగా పనిచేస్తాయి.. బీమర్ అచ్చు ఇలాగే చేస్తుందంటున్నారు బీమర్ కంపెనీ సీఈవో చిత్వన్ మాలిక్. విద్యుదయస్కాంత క్షేత్రాలను సృష్టించడం ద్వారా శరీరంలోని సూక్ష్మస్థాయి రక్తనాళాల్లోనూ రక్తప్రసరణ సాఫీగా జరిగేందుకు బీమర్ ఉపయోగపడుతుందని.. ఫలితంగా కణాలు పోషకాలను సమర్థంగా వాడుకోవడంతో పాటు వ్యర్థాలను కూడా ఎప్పటిక ప్పుడు విసర్జించగలవని ఆమె శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. బీమర్లోని పరికరాలు 3.5 మైక్రో టెస్లా తీవ్రతతో విద్యుదయస్కాంత తరంగాలను వెలువరి స్తుంటాయని వివరించారు. అన్ని రకాల సమస్యలకు చెక్! జుట్టు రాలడం వంటి చిన్న సమస్య మొదలుకొని.. కేన్సర్ వంటి వ్యాధుల వరకు దాదాపు అన్నింటి విషయంలో బీమర్ సానుకూల ఫలితాలు చూపుతోందని.. ఇందుకు సంబంధించి ఇప్పటికే పదుల సంఖ్యలో పరిశోధన వ్యాసాలు ప్రచురితమయ్యాయని చిత్వన్ వివరించారు. 11 ఏళ్ల కింద తనకు బీమర్ గురించి తెలిసిందని.. ఆ తర్వాత ఈ అద్భుతమైన పరికరాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో బీమర్ పేరుతోనే ఓ కంపెనీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీమర్‌ను ప్రస్తుతం అత్యున్నత స్థాయి రాజకీయ నేతలు, ఆధ్యాత్మిక గురు వులు, క్రీడాకారులు ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) బీమర్ యంత్రాన్ని రెండేళ్లపాటు అధ్యయనం చేసిందని, వ్యోమగాములు ధరించే స్పేస్ సూట్లో వీటిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోందని వివరించారు. ఏముంటాయి దీంట్లో? విద్యుదయస్కాంత క్షేత్రాలను సృష్టించగల 6 పరికరాలు బీమర్ పరుపులో ఉంటాయి. వేర్వేరు సెట్టింగ్‌లతో కూడిన ఒక పరికరం.. శరీరంలోని వేర్వేరు భాగాలకు బిగించుకోగల పట్టీ, చర్మ సంబంధి త సమస్యల కోసం ఎల్ఈడీ బల్బులతో కూడిన యంత్రం ఒకటి. విద్యుదయస్కాంత తరంగాల పరిశీలనకు స్కానర్ ఉంటాయి. కంప్యూటర్‌లాంటి పరికరాన్ని పరుపునకు అనుసంధానించుకుని 1–10 వరకు ఉండే సెట్టింగ్‌ల్లో ఒకదాన్ని ఎంచుకుని కాసేపు పడుకోవాలి. వ్యాధిని బట్టి కొన్ని వారాల పాటు చేస్తే మెరుగుదల కనిపిస్తుందని చిత్వన్ చెప్పారు. బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న పిల్లలకు బీమర్‌తో ప్రయోజనం చేకూరినట్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే స్పష్టమైందని, హైదరాబాద్‌లోని కొన్ని కేంద్రాలు కూడా దీన్ని విజయవం తంగా వాడుతున్నాయని చెప్పారు. మూడు, నాలుగో దశ కేన్సర్లతో బాధపడుతున్న వారికి బీమర్ ద్వారా చికిత్స కల్పించినట్లు అమెరికా, థాయ్‌లాండ్‌లలో పనిచేస్తున్న వైద్యుడు థామస్ లోడీ తెలిపారు. దేశంలోని పిల్ల లందరి బుద్ధి కుశలతను పెంచేందు కు బీమర్‌ను అందుబాటులోకి తేవాలని హైదరాబాద్‌లోని అపోలో లైఫ్ సెంటర్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ హెచ్.ఎస్.ఆర్.అరోరా సూచించారు. బీమర్ టెక్నాలజీ వైద్యరంగాన్ని కొత్తపుంతలు తొక్కించే సామర్థ్యముందని ముంబైలోని భక్తివేదాంత ఆసుపత్రి వైద్యుడు ధవళ్ దలాల్ అన్నారు. – సాక్షి హైదరాబాద్ -
కిస్మస్ నాడు కాటు వేద్దామనుకున్నాడు
శాన్ ఫ్రాన్సిస్కో : ఐసిస్‌తో చేతులు కలిపి క్రిస్మస్ పర్వదినం నాడు మారణహోమం సృష్టిద్దామనకున్న వ్యక్తిని ఎఫ్‌బీఐ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఎవరిట్ జేమ్సన్ గతంలో అమెరికన్ మెరెన్స్లో పని చేసినట్లు గుర్తించారు. ఐసిస్ నాయకత్వంతో సంబంధాలు కలిగిన వ్యక్తిగా నటించిన ఓ అమెరికన్ ఇంటిలిజెన్స్ ఏజెంట్.. ఎవరిట్ను ఎఫ్‌బీఐకు పట్టించడంలో కీలకపాత్ర పోషించారు. క్రిస్మస్ పండుగ రోజున శాన్ ఫ్రాన్సిస్కోలో అతిరద్దీగా ఉండే పియర్ 39లో దాడికి పాల్పడాలని నిందితుడు భావించినట్లు ఎఫ్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దాడి అనంతరం చనిపోవాలని కూడా ఎవరిట్ నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. గతంలో అమెరికాలో జరిగిన ఉగ్రదాడులను సమర్థిస్తూ నిందితుడు సోషల్‌మీడియాలో పలు పోస్టులు చేసినట్లు గుర్తించామని చెప్పింది. ప్రస్తుతం ట్రక్కును నడుపుతూ జీవనం సాగిస్తున్న ఎవరిట్.. ట్రక్కుతో దాడికి పాల్పడతానని ఐసిస్‌తో చర్చించినట్లు వివరించింది. ఎవరిట్ ఇంట్లో చేసిన రైడింగ్‌లో సూసైడ్ నోట్, బాణసంచా, రెండు తుపాకులు, ఒక హ్యాండ్ గన్ లభ్యమైనట్లు చెప్పింది. రెండేళ్ల క్రితం జేమ్సన్ ఇస్లాం మతాన్ని స్వీకరించాడని, అప్పటి నుంచి ఉగ్రదాడికి పాల్పడేందుకు ఐసిస్ సాయం తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిపింది. -
ఐ ఫోన్ ఎక్స్‌ల భారీ చోరీ
శాన్ఫ్రాన్సిస్కో: ఆపిల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఐ ఫోన్ ఎక్స్‌పైతాజా మరో షాకింగ్న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అతిఖరీదైన హైఎండ్ స్మార్ట్‌ఫోన్ ఐ ఫోన్ ఎక్స్ భారీగా చోరీకి గురికావడం కలకలం రేపింది. శాన్ఫ్రాన్సిస్కోలోని ఆపిల్ స్టోర్‌లో ఈ దొంగతనం జరిగింది. సుమారు మూడు వందలకుపైగా ఆపిల్ హాట్ ఫోన్ ఐ ఫోన్ ఎక్స్ డివైస్‌లను చోరులు అపహరించుకుపోయారు. పోలీసులు అందించిన నివేదిక ప్రకారం 313 డివైస్‌లు చోరీకి గురయ్యాయి. ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు ఆపిల్ స్టోర్ముందు పార్కింగ్ చేసిన యూపీఎస్ ట్రక్‌ను అటకాయించి వీటిని ఎత్తుకెళ్ళారు. వీటి విలువ 370, 000 డాలర్లకంటే ఎక్కువ ఉంటుందని అంచనా. అనుమానితులను ఇంకా గుర్తించాల్సి ఉంది. ఈ ఘటనపై అటు యూపీఎస్సంస్థ, ఇటు ఆపిల్ విచారణ చేపట్టింది. దొంగిలించిన ఐఫోన్ల వ్యాపారం దీర్ఘకాలంగా లాభసాటిగా ఉంది. మరోవైపు ‘ఫైండ్ మై ఐపోన్’, రిమోట్ లాకౌట్ పేరుతో కొత్త ఫీచర్‌ను ఆపిల్‌ను అందుబాటులోకి తేవడంతో ఐ ఫోన్ల దొంగతనాలు బాగా తగ్గాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి విక్రయానికి ముందే రాకముందే భారీ ఎత్తుర ఐ ఫోన్లు చోరీకి గురి కావడం గమనార్హం. కాగా భారత మార్కెట్లో నవంబర్ 3 సాయంత్రం. 6గంటలనుంచి ఐ ఫోన్ ఎక్స్ రూ.89వేల ప్రారంభ ధరనుంచి విక్రయానికి అందుబాటులోకి వచ్చాయి. నవంబర్ 3 ముందు అక్టోబర్ 27 ప్రీ ఆర్డర్ ప్రారంభించినప్పుడు నిమిషాల్లో ఐ ఫోన్ ఎక్స్ ఫోన్లు ఔట్ ఆఫ్స్టాక్గా నిలిచిన సంగతి తెలిసిందే. -
కూతురు చేసిన పనికి.. పాపం ఆ తండ్రి..!
శాన్ఫ్రాన్సిస్కో: యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్‌కు మంచి డిమాండ్ ఉంది. తన కూతురు తీసిన వీడియో కారణంగా యాపిల్ సంస్థలో ఓ ఇంజనీర్ ఉద్యోగం ఊడింది. వివరాలివి.. బ్రూక్ అమెలియా పీటర్సన్ తన తండ్రి ఇంజనీర్‌గా పనిచేస్తున్న యాపిల్క్యాంపస్కు ఈవారం మొదట్లో వెళ్లింది. అక్కడ ఆ సమయంలో ఆమె డాక్యుమెంట్ తీసింది. అందులో ప్రత్యేక సిబ్బంది వద్ద క్యూఆర్ కోడ్స్‌తో ఉండే ఇంకా విడుదల కానీ ఐఫోన్-10 గురించి సమాచారం ఉంది. ఇంకా ఆ ఫోన్ పైనున్న కోడ్, ఆ ఫోన్ హోమ్ స్ర్కీన్, కవర్ షీట్ నోటిఫికేషన్ కూడా కనిపించాయి. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అయింది. దీంతో ఆ సంస్థ పీటర్సన్ తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ ఘటనతో తనపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారని ఆమె చెప్పింది. అంతేకాక వీడియో తీయడం యాపిల్ కంపెనీ నిబంధనలకు విరుద్ధమని అన్నారని పీటర్సన్ తెలిపింది. ఆ వీడియోను తొలగించాల్సిందిగా యాపిల్ కంపెనీ ఆమెను కోరింది. అయితే అప్పటికే ఆలస్యమై అది వైరల్ అయింది. -
విమానంలో 140మంది.. తప్పిన ప్రమాదం
వాషింగ్టన్: అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్ట్‌లో పెద్ద ప్రమాదం తప్పింది. 150మందితో ప్రయాణిస్తున్న ఓ విమానం నేరుగా రన్‌వేపై కాకుండా ట్యాక్సీవేపై దిగబోయింది. దానికి అతి సమీపంలోనే నాలుగు విమానాలు టేకాఫ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది ఏమాత్రం ఏమరుపాటుతో ఉన్న భారీ నష్టం జరిగి ఉండేది. సకాలంలో స్పందించడంతో ప్రమాదాన్ని తప్పించారు. ఎయిర్ పోర్ట్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కెనడాకు చెందిన ఎయిర్‌బస్ ఏ320 విమానం శాన్ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయానికి అర్ధరాత్రి వచ్చింది. ఆ విమానం రన్‌వే-28 మార్క్ వద్ద దిగేందుకు అనుమతించారు. అయితే, దీనిని అజాగ్రత్తతో తప్పుగా అర్ధం చేసుకున్న పైలెట్ కాస్త విమానాన్ని ట్యాక్సీ వే సీ మార్గంలో దింపే ప్రయత్నం చేశాడు. అయితే, పైలట్‌కు డేంజర్ అలర్ట్స్ పంపించడంతో మరోసారి విమానాన్ని చక్కర్లు కొట్టించి చివరకు సురక్షితంగా దింపేశారు. -
అమెరికా కంపెనీలో ఉద్యోగులపై కాల్పులు
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికాలో మరోసారి కాల్పులు సంభవించాయి. ఓ పార్సిల్ కంపెనీ ప్యాకేజ్ సెక్షన్ వద్ద ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో అతడితో సహా నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని రెండు స్థానిక టీవీ చానెళ్లు ధ్రువీకరించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శాన్ఫ్రాన్సిస్కోలోని యునైటెడ్ పార్సిల్ సర్వీస్ అనే సంస్థకు చెందిన ఓ ఉద్యోగి కంపెనీ ప్యాకింగ్ హబ్ వద్దకు వెళ్లి అక్కడ తనతోపాటు పనిచేస్తున్న సహచర ఉద్యోగులపై కాల్పులు ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుంటుండగానే అదే తుపాకీతో తనకు గురిపెట్టుకొని కాల్చుకున్నాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. మొత్తం 350మంది ఉద్యోగులు పనిచేసే ఈ కంపెనీ వద్దకు ఈ ఘటనతో భారీ మొత్తంలో పోలీసులు చేరుకున్నారు. అతడు ఎందుకు ఈ కాల్పులు జరిపాడనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం కాల్పులు జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపట్ల కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మరోపక్క, మొత్తం నలుగురు చనిపోవడంతోపాటు మరికొందరు గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. -
విమానంలో ప్రయాణికురాలిపై సిబ్బంది దాడి
వాషింగ్టన్: అమెరికాలో విమానంలో ఓ ప్రయాణికురాలిని సిబ్బంది ఆమె పాప కుర్చీతోనే కొట్టిన సంఘటన వెలుగుచూసింది. దీంతో ఆ ఉద్యోగిని సదరు విమాన సంస్థ సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. శుక్రవారం శాన్ఫ్రాన్సిస్కో నుంచి డల్లాస్ వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్(ఏఏ) విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమాన సంస్థ ఉద్యోగి ఒకరు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియోలో ప్రయాణికురాలితో నిందితుడు గొడవ పడుతున్నట్లు కనిపించింది. బాధితురాలిని కాపాడటానికి ఓ వ్యక్తి జోక్యం చేసుకోవడంతో కేబిన్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని న్యూయార్క్ డైలీ న్యూస్ పేర్కొంది. ఆ వ్యక్తికి, నిందితుడికి మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో బాధితురాలు తన పాపతో పక్కకు నిల్చొని ఏడుస్తూ ఉందని తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. -
దర్శకుడికి డ్యాన్స్ నేర్పించిన షారూక్
-
49మందిపై వేటు..యూనివర్శిటీ నిర్ణయం
శాన్ ఫ్రాన్సిస్కో: ట్రంప్ సంస్కరణల నేపథ్యంలో శాన్ ఫ్రాన్సిస్కో యూనివర్శిటీ తీసుకున్న నిర్ణయం దుమారం రేపింది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా కొంతమంది ఔట్సోర్సింగ్ ఐటీ ఉద్యోగులను తొలగించింది. ఔట్ సోర్సింగ్ ఐటీ సేవలందిస్తున్న 49మంది ఉద్యోగులను తొలగించింది. మరోవైపు ఈ పనిని ఇండియా ఆధారిత ఔట్సోర్సింగ్ కంపెనీకి అప్పగించడం విమర్శలకు దారి తీసింది. పెరుగుతున్న టెక్నాలజీ ఖర్చుల కారణంగా ఈ తొలగింపు అనివార్యమైందని విశ్వ విద్యాలయం ప్రతినిది ఒకరు తెలిపారు. 49 మంది సిబ్బంది తొలగింపుతోపాటు, ఖాళీగా ఉన్న లేదా కాంట్రాక్టర్లద్వారా నియమితులైన మరో 48 మందినికూడా తొలగిస్తున్నట్టు చెప్పారు. యూనివర్శిటీ నిర్ణయంతో సాఫీగా, సెక్యూర్డ్‌గా సాగిపోతున్న కంప్యూటర్ నెట్ వర్క్‌లకు అంతరాయం కలుగుతుందని తొలగించిన యూనివర్శిటీ సిస్టం అడ్మినిస్ట్రేటర్ కుర్ట్ హో(58) వ్యాఖ్యానించారు. బే ఏరియాలో పాతికేళ్లుగా తాను ఐటీ సేవల్లో ఉన్నట్టు తెలిపారు. ఐటి సేవల్లో పెరుగుతున్న అవుట్సోర్సింగ్ ధోరణి ఆందోళన కలిగిస్తుందన్నారు. అమెరికా ప్రస్తుత రాజకీయ వాతావరణంలో గ్లోబలైజేషన్ అండ్ ఔట్సోర్సింగ్ హాట్ టాపిక్ మారాయి. దీంతో యజమానులు ఖర్చులు తగ్గించుకునేందుకు, ప్రపంచంలోని దూర ప్రాంతాల్లో ఉండే తక్కువ వేతనానికి పనిచేసే ఉద్యోగులకోసం ప్రయత్నిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. మరోవైపు ఆరోగ్య సంరక్షణ, పరిశోధన పై దృష్టిపై పనిచేస్తున్న కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఖర్చులు తగ్గించుకోవడానికి, ఆదాయా వనరులను పెంచుకోవడానికి అష్టకష్టాలుపడుతోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది జులైలో భారతదేశం ఆధారిత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ తో ఐదేళ్లకు గాను 50 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే రాబోయే ఐదేళ్లలో 30మిలియన్ డాలర్లను పొదుపు చేసే ఆలోచనలోఉన్నట్టు ప్రకటించింది. అలాగే దేశీయ ఉద్యోగాలు ఔట్ సోర్సింగ్ కు పోకుండా బాధ్యత తీసుకున్నట్టు యూనివర్శిటీ సెనేటర్ డయానే గత ఏడాది ప్రకటించారు. ఈ మేరకు సంస్కరణలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నట్టు వెల్లడించారు. -
నేడు హైదరాబాద్‌కు వంశీ మృతదేహం
హైదరాబాద్: విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు అక్కడ దురాగతాలకు గురై ప్రాణాలు కోల్పోతుండటం బాధ కలిగిస్తోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 10న అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఓ దుండగుడి కాల్పుల్లో తెలుగు విద్యార్థి మామడాల వంశీ మృత్యువాత పడటం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. వంశీ మృత దేహాన్ని స్వస్థలం చేర్చడానికి సంబంధిత అధికారులతో సంప్రదింపులు చేసినట్లు పేర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం వంశీ మృతదేహం గురువారం ఉదయం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి తరలించారని శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటుందని చెప్పారు. అక్కడి నుంచి వరంగల్ జిల్లాలోని వంశీ స్వస్థలానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అడిగిన వెంటనే స్పందించి వంశీ మృతదేహాన్ని తరలించేందుకు సహకరించిన విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. జాతి విద్వేష కోణం లేదు: విదేశాంగ శాఖ న్యూఢిల్లీ: వంశీ హత్య వెనక జాతి విద్వేష కోణమేమీ లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. వంశీ మృతదేహాన్ని భారత్‌కు తెచ్చి తల్లిదం డ్రులకు అప్పగించేందుకయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తోందని ఆయన చెప్పారు. -
2017లో టేకాఫ్... 2016లో ల్యాండింగ్!!
యునైటెడ్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులు న్యూ ఇయర్ రోజు వినూత్న అనుభూతిని పొందారు. తాము ప్రయాణించిన విమానం 2017లో బయలుదేరి చేరుకోవాల్సిన ప్రదేశాన్ని 2016లో చేరింది. ఇక వారి అనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. న్యూ ఇయర్ రోజు అది చేద్దాం.. ఇప్పటి నుంచి ఇలా ఉందాం అని కొందరు అనుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఆ రోజు తమకు ఎదురైన మంచి అనుభూతిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. కొత్త ఏడాది బయలుదేరి పాత ఏడాదిలో అడుగుపెట్టడం విమాన ప్రయాణికులలో ఉత్సాహాన్ని నింపింది. ఈ విమాన జర్నీకి సంబంధించి ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఆ వివరాల ప్రకారం.. యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం యూఏ890 (బోయింగ్ 787-909) విమానం 2017 జనవరి 1వ తేదీన వేకువజామున చైనాలోని షాంఘైలో బయలుదేరింది. ఆ బోయింగ్ విమానం 2016 డిసెంబర్ 31న రాత్రి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకుంది. ఇది ఎలా సాధ్యమంటే.. ఈ రెండు ప్రాంతాల మధ్య టైమ్ వ్యత్యాసం దాదాపు 16 గంటలు. శాంఘై నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లడానికి దాదాపు 11 గంటల 5 నిమిషాలు పడుతుంది. టైమ్ వ్యత్యాసం గమనించినట్లయితే ఇది సాధ్యపడుతుందని చెప్పవచ్చు. ఎలా అంటే ఉదాహరణకు షాంఘైలో 2017 జనవరి 1న టైమ్ మధ్యాహ్నం 12 గంటలు అనుకుంటే.. సరిగ్గా అదే సమయంలో శాన్ ఫ్రాన్సిస్కోలో టైమ్ 2016 డిసెంబర్ 31 రాత్రి 8 గంటలు ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారి విపరీతంగా షేర్ అవుతోంది. ఏ సమయానికి షాంఘై నుంచి బయలుదేరి శాన్ ఫ్రాన్సిస్కో చేరుకుందన్న వివరాలు ఆ పోస్ట్ లో పేర్కొనలేదు. -
పైన పంటలు.. లోన వంటలు
ఫొటోలో ఉన్నదేంటో ’యామీస్’ అన్న పేరు చూడగానే తెలిసిపోయి ఉంటుంది. కానీ విషయం హోటల్‌కు మాత్రమే సంబంధించిన విషయంకాదు. శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా)కు గంట ప్రయాణ దూరంలో ఉండే ఈ హోటల్ పైకప్పు చూశారా? అదీ సంగతి! ఈ డ్రైవ్ థ్రూ హోటల్లో శుద్ధ శాకాహార వంటకాలను మాత్రమే వడ్డిస్తారు. పైగా వాటిల్లో అత్యధికం పైకప్పుపై పండినవే అయి ఉంటాయి. ఎక్కడెక్కడి పంటలన్నీ కొని తీసుకొచ్చి తింటే ఖర్చు ఎక్కువ కావడంతోపాటు జన్యుమార్పిడి పంటల కారణంగా లేనిపోని అనారోగ్యాలు వస్తాయేమో అన్న ఆలోచన యామీస్ కిచెన్ యాజమాన్యాన్ని ఈ ప్రయోగానికి పురికొల్పింది. ట్రాటెన్‌బర్గ్ ఆర్కిటెక్ట్స్ డిజైన్ చేసిన ఈ హోటల్ పైకప్పుపై అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలను పండిస్తున్నారు. మొక్కలు పెంచేందుకు అవసరమైన మట్టి, దాని అడుగున అవసరానికి మించిన నీటిని తోడివేసేందుకు ఏర్పాట్లు, దాని దిగువన నీళ్లు కారకుండా ప్రత్యేకమైన కవచం.. ఇలా ఉన్నాయి. పక్కనే వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు ఓ ట్యాంక్, డ్రిప్ ఇరిగేషన్ మోటార్లను పనిచేయించేందుకు అవసరమైన సోలార్ ప్యానెల్స్, వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేందుకు బయోఛార్ (బొగ్గు) వంటివాటినీ ఏర్పాటు చేశారు. వీటితోపాటు పర్యావరణానికి చేతనైనంత సాయం చేయాలన్న ఉద్దేశంతో యామీస్ కిచెన్ యాజమాన్యం ఇక్కడ 15 కిలోవాట్ల సామర్థ్యమున్న సోలార్ ప్యానెల్స్ అదనంగా ఏర్పాటు చేసింది. వీటి అడుగునే కార్లను నిలిపి, ఆర్డర్ చేసిన ఆహారాన్ని పట్టుకెళ్లవచ్చు. ఈ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఎలక్ట్రిక్ కార్లకు చార్జ్ చేసేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. మొత్తమ్మీద యామీస్ కిచెన్‌కు ఒక్కసారి వెళ్లామంటే... పెట్రోలు, డీజిల్‌లను విచ్చలవిడిగా మండిస్తూ వాతావరణ మార్పులకు కారణమవుతున్న వారు తమ కార్బన్ పాపాలను కొంచెమైనా కడిగేసుకోవచ్చన్నమాట! -
దొంగలకు ఫేవరెట్‌గా మారిన ఆపిల్ స్టోర్లు
-
దొంగలకు ఫేవరెట్‌గా మారిన ఆపిల్ స్టోర్లు
దొంగలకు అమెరికాలోని ఆపిల్ స్టోర్స్ చాలా ఫేవరెట్‌గా మారిపోతున్నాయి. వరుస దొంగతనాలకు పాల్పడుతూ స్టోర్లను లూఠీ చేస్తున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో ఉన్న ఆపిల్ స్టోర్‌లో దొంగలు చోరికి పాల్పడ్డారు. అయితే ఒక్కసారి కాదు.. కేవలం నాలుగు రోజుల్లో వరుసగా రెండు సార్లు దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు.. స్టోర్ స్టాఫ్‌ను అయోమయంలో పడేసి, చేతికి దొరికిన ఫోన్లన్నంటిన్నీ వారు ఎత్తుకుని పోతున్నారు. ఈ హఠాత్తు పరిణామానికి ఆపిల్ స్టోర్ ఉద్యోగులు కూడా ఏమీ చేయలేక అయోమయంలో బిత్తరపోతున్నారు. మొదటి దాడి నవంబర్ 25న ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు శాన్ఫ్రాన్సిస్కోలోని చెస్ట్నట్ వీధిలో ఆపిల్ స్టోర్‌లో చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను శాన్ఫ్రాన్సిస్కో పోలీసు డిపార్ట్మెంట్ విడుదల చేసింది. సాధారణ వ్యక్తులాగానే వేగంగా స్టోర్‌లోకి ప్రవేశించి, కొన్ని క్షణాల్లోనే ఫోన్లను ఎత్తుకుని పారిపోతున్నారు. నవంబర్ 29న అదేస్టోర్లో నలుగురు వ్యక్తులుగా వచ్చి ఇదే మాదిరి దొంగతనానికి పాల్పడినట్టు మరో వీడియోలో వెల్లడైంది. ఈ సమయంలో స్టాఫ్ వారిని అడ్డుకోవడానికి కొంచెం యాక్టివ్‌గా ప్రయత్నించినా.. ఎలాంటి ఉపయోగం లేకుండా వారు మొబైళ్లను తీసుకుని వేగంగా పారిపోయారు. అయితే ఆపిల్ స్టోర్లలో దొంగలు పడటం ఇదేమీ కొత్త కాదని, వ్యాపార సమయాల్లో ఆపిల్ స్టోర్‌లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలుస్తోంది. వినియోగదారులు స్టోర్‌లో ఉండగానే దొంగలు అదే అదునుగా భావించి ఈ చోరీలకు పాల్పడుతున్నారు. బెర్కెలీలోని స్టోర్‌లో కూడా తొమ్మిది రోజుల్లో మూడు సార్లు దొంగలు పడ్డారు. అయితే ఈ విషయంపై ఉద్యోగులు ఆపిల్ దగ్గర ఫిర్యాదు చేసినా.. కంపెనీ పట్టించుకోన్నట్టే వ్యవహరిస్తుందని తెలుస్తోంది. అయితే దొంగతనానికి గురైన ఫోన్లు పనిచేయనవని వెల్లడవుతోంది. ఆ డివైజ్‌లు పనిచేస్తాయనే భ్రమలో వారు దొంగతనం చేసి, అమ్మడానికి తీసుకెళ్తున్నారు. -
అమెరికాలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కవిత
రాయికల్: అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో సోమవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అమెరికా వంటి అగ్రదేశాల్లో సైతం బతుకమ్మ పండగ నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. అమెరికాలోని వివిధ స్టేట్స్కు చెందిన సుమారు రెండు వేల మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని కవితతో కలిసి కోలాటాలు ఆడారు. కార్యక్రమంలో భారత రాయబార కౌన్సిల్ జనరల్ వెంకటేశం, అశోక్, తెలంగాణ జాగృతి అమెరికా అధ్యక్షుడు బండారి శ్రీధర్, సభ్యులు సతీశ్, మురళి, సత్యపాల్, నరేశ్, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు విజయ్, భాస్కర్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
గూగుల్ ఫోన్ల గ్రాండ్ లాంచింగ్!
శాన్ఫ్రాన్సిస్కో : ఆండ్రాయిడ్ వెర్షన్లో తనదైన ముద్ర వేసుకున్న గూగుల్, స్మార్ట్ఫోన్ల మార్కెట్లోనూ తన క్రేజ్‌ను మరింత పెంచడానికి వచ్చేస్తోంది. సొంత బ్రాండుతో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు ముహుర్తం ఖరారు చేసుకుందట. అక్టోబర్ 4న గ్రాండ్ ఈవెంట్‌గా సొంత బ్రాండెడ్ ఫోన్లను ప్రపంచానికి పరిచయం చేయబోతుందని టెక్ విశ్లేషకులు టాక్. అక్టోబర్ 4న ఉదయం 9గంటలకు నిర్వహించబోయే ఈ ప్రత్యేక ఈవెంట్‌కు గూగుల్ ఆహ్వానాలు సైతం పంపించేసిందట. ఈ ఈవెంట్ టీజర్ వీడియోను గూగుల్, యూట్యూబ్‌లో కూడా పెట్టింది. అయితే కంపెనీ పిక్సెల్ ఫోన్ల విడుదలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే సొంత బ్రాండుతో స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి పెడతామన్న గూగుల్, ఈ ఈవెంట్లోనే వీటి లాంచింగ్ చేపడుతుందని అంచనాలు భారీగా పెరిగాయి. కొత్త ఫోన్లపై ప్రకటన మాత్రమే కాకుండా ఇతర గూగుల్ ఉత్పత్తుల గురించి వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది. దీంతో ఈ ఈవెంట్‌పై వినియోగదారుల్లో, టెక్ వర్గాల్లో ఫుల్ ఆసక్తి ఏర్పడింది. సెయిల్ ఫిష్, మార్జిన్ కోడ్ పేర్లతో రాబోతున్న ఈ ఫోన్లు 5, 5.5 అంగుళాల డిస్ప్లే ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ సాప్ట్‌వేర్‌లో ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన వెర్షన్ నోగట్తో ఈ ఫోన్లను లాంచ్ చేస్తుందని సమాచారం. నెక్షస్ పేరుతో ఇంతకాలం భాగస్వామ్య కంపెనీల సహకారంతో గూగుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి ప్రవేశించనప్పటికీ.. ఎక్కడా గూగుల్ బ్రాండు కనిపించదు. దీంతో నెక్షస్ బ్రాండుతో కాకుండా తనకంటూ ఓ సొంత బ్రాండు, పిక్సెల్ పేరు మీద గూగుల్ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టేందుకు అన్ని సెట్ చేసుకుంది. యాపిల్‌కు ధీటుగా హై ఎండ్ టెక్నాలజీతో తన ఫోన్లను గూగుల్ తీసుకొస్తోందని మార్కెట్ వర్గాల టాక్. దీంతో ఇన్ని రోజులు శాంసంగ్ నుంచి ఎదుర్కొన్న పోటీ ప్రస్తుతం యాపిల్‌కు, గూగుల్ నుంచి కూడా ఎదురుకాబోతుంది. కాగ ఇటీవలే టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ 7 మోడల్స్ రెండింటిని శాన్ఫ్రాన్సిస్కోలోని బిల్ గ్రాహం సివిక్ వేదికగా గ్రాండ్‌గా ప్రవేశపెట్టింది. -
అదరగొట్టే ఐఫోన్7 ఫీచర్లు ఇవేనట!
న్యూయార్క్ : యాపిల్ ఐఫోన్‌కు ఎంత క్రేజ్ అంటే... ఈ ఫోన్ కొనుకోవడమే ఓ ఫ్యాషన్‌గా భావిస్తుంటారు నేటి యువత. అలాంటి ఐఫోన్ తన కొత్త మోడల్‌తో నేడు వినియోగదారుల ముందుకు రాబోతుందట. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కస్టమర్లను అలరించడానికి శానిఫ్రాన్సిస్కోలోని బిల్ గ్రాహమ్ సివిక్ ఆడిటోరియం వేదికగా ఐఫోన్7 లాంచ్ కాబోతుంది. నేడు నిర్వహించబోయే ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఐఫోన్ 7 లాంచింగ్ ఉంటుందని యాపిల్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, నేడే ఈ ఫోన్‌ను యాపిల్ ఆవిష్కరిస్తుందని టెక్ వర్గాలు చెప్పేశాయి. అయితే ఇంత క్రేజ్ సృష్టిస్తున్న ఐఫోన్7 ఎలా ఉండబోతుందో ఓ సారి తెలుసుకుందాం... 4.7 అంగుళాల, 5.5 అంగుళాల డిస్ప్లేలతో ఐఫోన్ రెండు మోడళ్లను ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ పేర్లతో వినియోగదారుల ముందుకు యాపిల్ తీసుకు రాబోతుందట. ఐఫోన్6, ఐఫోన్ 6 ప్లస్ మోడల్స్ కంటే ఇవి చాలా స్లిమ్‌గా కస్టమర్లను అలరించబోతున్నాయట. ముందస్తు ఫోన్లతో పోలిస్తే వీటిల్లో కెమెరా క్వాలిటీ పెరుగుతుందట. డ్యూయల్ కెమెరా సిస్టమ్ కలిగి ఉండబోతున్న ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్లతో రెండు వేర్వేరు ఎక్స్పోజ్యూర్లో ఫోటోలు తీసుకోవచ్చని తెలుస్తోంది. కొత్త ఐఫోన్7 ప్లస్‌కు రెండు కెమెరాలు 12 ఎంపీ సెన్సార్సే ఉండబోతున్నాయట. ఐఫోన్7 కు ఒకటే 12 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుందని సమాచారం. రెండు కొత్త కలర్స్‌లో యాపిల్ ఈ సారి ఐఫోన్లను తీసుకురానుంది. అవి డీప్ బ్లూ, స్పేస్ బ్లాక్ వేరియంట్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సరికొత్త త్రీడీ టెక్నాలజీ టచ్‌తో యూజర్ ఎక్స్‌పీరియెన్స్ కొత్తగా ఉండబోతోందట.. ప్రెషర్ సెన్సిటివ్ హోమ్ బటన్ దీన్ని ప్రత్యేకత. 32 జీబీ నుంచి 256 జీబీ వరకు స్టోరేజ్ సామర్థ్యంతో, వేగవంతమైన ఏ10 ప్రాసెసర్‌తో ఈ కొత్త మోడల్స్ వినియోగదారుల మందుకు వస్తున్నాయి. ఫోన్లకు, ఇతర ప్రొడక్ట్‌లకు డేటా, పవర్ ట్రాన్సఫర్ చేసుకునే విధంగా స్మార్ట్ కనెక్టర్‌ను ఈ ఫోన్లు కలిగి ఉంటాయని తెలుస్తోంది. సెప్టెంబర్ 16 నుంచి ఈ మోడల్స్ మార్కెట్లోకి ప్రవేశిస్తాయని, ఒక వారం నుంచి ప్రీ-ఆర్డర్లను యాపిల్ ప్రారంభిస్తుందని మార్కెట్ వర్గాల చెబుతున్నాయి వాటర్ రెసిస్టెంట్ డిజైన్, మెరుగైన స్టీరియో స్పీకర్స్, అత్యధిక బ్యాటరీ కెపాసిటీ, బ్లూటూత్ సపోర్టెడ్ హెడ్ ఫోన్స్, డ్యుయల్ స్పీకర్స్, టైప్-సీ ఇంటర్ ఫేస్‌లు ఇవన్నీ కొత్త ఐఫోన్7లో ఉండబోతున్నాయని టాక్. స్క్రీన్కు కింద ఉన్న ఫిజికల్ టచ్ ఐడీ బటన్‌ను తొలగించి, నేరుగా బయోమేట్రిక్ కార్యాచరణతో ఇంటిగ్రేట్ చేయాలని యాపిల్ ప్లాన్ చేసిందట. మరి ధర అనుకుంటున్నారా..? అంతర్జాతీయంగా ఆపిల్-7 బేస్ మోడల్ (32జీబీ) ధరను 749 డాలర్లుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. భారత్ లో దీని ధర సుమారు రూ. 63వేలు ఉండే అవకాశముంది. ఈ ఫీచర్లన్నీ ఐఫోన్7లో చూడబోతున్నామో తెలుసుకోవాలంటే ఈ రాత్రి వరకు వేచిచూడాల్సిందే. -
అమెరికాకు త్వరగా వెళ్లాలంటే..
న్యూఢిల్లీ: ఇండియా నుంచి అమెరికాకు విమానయానంలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ప్రస్తుత ప్రయాణ సమయం కంటే మూడు గంటలు త్వరగా వెళ్లొచ్చు. ఎలాగంటే..భారత రాజధాని ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి వెళ్లే ఎయిర్ఇండియా విమానాలు త్వరలోనే కొత్తదారిలో ప్రయాణించనున్నాయి. ఢిల్లీ నుంచి తూర్పుదిశగా ఎగరనున్న విమానాలు ఫసిఫిక్ మహాసముద్రం మీద నుంచి అగ్రరాజ్యానికి చేరుకోనున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లే అన్ని ఎయిర్ ఇండియా విమానాలు టేకాఫ్ అయిన తర్వాత పశ్చిమదిశగా అట్లాంటిక్ మహాసముద్రం మీదనుంచి వెళుతున్నాయి. ఇంధనం ఆదాపై దృష్టి సారించిన ఏఐ ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నుంచి కూడా ఆమోదం లభించింది. విమానాలు ఢిల్లీ నుంచి తూర్పుదిశకు (పసిఫిక్ వైపుకు) వెళ్లడం వల్ల అమెరికాకు దూరం 1,400 కి.మీ పెరుగుతుంది. అయితే పసిఫిక్ ప్రాంతంలో ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా ఇంధనం, ప్రయాణ సమయం కలిసివస్తాయని అధికారులు చెబుతున్నారు. విమానాలు ఢిల్లీ నుంచి పశ్చిమ దిశలో (అట్లాంటిక్ మీదుగా) ప్రయాణించినప్పుడు.. ఎదురుగాలి బలంగా వీస్తుందని, కొన్నిసార్లు గంటకు 24 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. అంటే విమాన వేగం గంటకు 800 కిలోమీటర్లు అనుకుంటే వాస్తవేగం మాత్రం 776 కిలోమీటర్లే ఉంటుందని, ఈ కారణంగా ఇంధన వినియోగం అధికంగా ఉంటుందని.. మొత్తంగా ఎక్కువ ఖర్చవుతుందని అధికారులు చెప్పారు. అదే తూర్పుదిశగా( పసిఫిక్ మీదుగా) వెళ్లేటప్పుడు.. గాలులు విమానం ప్రయాణించే దిశలోనే గంటకు 138 కి.మీ వేగంతో వీస్తాయని, విమానం గంటలకు 800 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందనుకుంటే వాస్తవవేగం గంటకు 938 కి.మీ ఉంటుంది’ అని సీనియర్ పైలట్ ఒకరు చెప్పారు. పాత మార్గంతో పోలిస్తే కొత్త దారిలో గమ్యాన్ని త్వరగా చేరుకోవచ్చని, వేసవిలో అయితే ఒక గంట ముందు, శీతాకాలంలో అయితే మూడు గంటల ముందుగానే శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకోవచ్చుని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో మధ్య నడపడానికి బోయింగ్ 777-200 ఎల్ఆర్ విమానాన్ని ఎయిర్ ఇండియా వాడుతోంది. ఈ విమానం గాలిలో ఎగరడానికి గంటకు 9,600 లీటర్ల ఇంధనం అవసరం. పసిఫిక్ మీదుగా వెళ్తామన్న ఎయిర్ ఇండియా ప్రతిపాదనకు డీజీసీఏ (డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఆగస్టులోనే ఆమోదం తెలిపింది. నవంబరు నుంచి విమానాలు కొత్త మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. ఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో మార్గంలో ఎయిర్ఇండియా ప్రస్తుతం మూడు విమానాలు నడుపుతుండగా, నవంబరు నుంచి ఈ సంఖ్యను ఆరుకు పెంచనుంది. -
మందు ‘వాసన’ పట్టేస్తుంది!
ఫొటోలో కనిపిస్తున్నది ఏదైనా స్మార్ట్ వాచ్ అనుకుంటున్నారా? ఊహూ కానేకాదు. ఇదో వినూత్నమైన పరికరం. ఒళ్లు తెలియకుండా మద్యం తాగేవారికి, దాని పర్యవసానాలు తెలిసినా అలవాటు వదులుకోలేక పోతున్న వారికీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పరికరం పేరు ‘స్కిన్’. దీన్ని చేతికి తొడుక్కుంటే చాలు.. మీరు ఎప్పుడు మద్యం తాగినా రక్తంలో ఎంత ఆల్కహాల్ ఉన్నది ఇట్టే చెప్పేయడమే దీని ప్రత్యేకత. మితంగా తాగాలనుకున్న వారికి... డ్రంకన్ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడి అభాసు పాలు కాకూడదనుకున్న వారికి ఇది బాగా పనికొస్తుందన్న మాట. తాగిన మద్యంలో కొంతభాగం ఇథనాల్ రూపంలో చెమట ద్వారా విడుదల అవుతుంది. ‘స్కిన్’లో ఉండే సెన్సర్ ఈ ఇథనాల్‌ను పసిగట్టి రక్తంలో ఉన్న ఆల్కహాల్ మోతాదును లెక్కిస్తుందన్న మాట. అసలు చిక్కేంటంటే మద్యం సేవించాక కనీసం 45 నిమిషాల తర్వాత గానీ ఇది గుర్తించదు. ఎందుకంటే అప్పుడు కానీ ఇథనాల్ చెమటలోకి చేరదు. చెమటలోకి చేరితే కాని ఇది పనిచేయదు. శాన్ఫ్రాన్సిస్కోలోని బ్యాక్‌ట్రాక్ అనే కంపెనీ అభివృద్ధి చేసిన ఈ గాడ్జెట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. -
మహిళతో సహా పదిమందిని పొడిచేశారు
శాన్ ప్రాన్సిస్కో: కాలిఫోర్నియాలో దారుణం చోటుచేసుకుంది. నిరసన వ్యక్తం చేస్తున్నవారిలోకి చొరబడి అవతలి వర్గంవారు పదిమందిని దారుణంగా పొడిచారు. చేతికి దొరికినవారిని దొరికినట్లు కొట్టారు. కత్తిపోట్లకు గురైనవారిలో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కాలిఫోర్నియా ప్యాట్రోల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రెడిషనలిస్ట్ వర్కర్స్ పార్టీకి చెందిన 30 మంది ఆదివారం మధ్యాహ్నం ర్యాలీకోసం సాక్రమెంటోలోని ఓ క్యాపిటల్ బిల్డింగ్ వద్దకు చేరగా అదే సమయంలో 400 మంది అవతలివర్గం వారు తారసపడ్డారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంతమంది యువకులు ముఖానికి ముసుగులు ధరించి రాళ్లు విసరడంతోపాటు కర్రలు పట్టుకొని హల్ చల్ చేశారు. ఇంకొందరు కత్తులతో పొడిచారు. కత్తిపోట్లకు గురైన వారిలో ఒక మహిళ కూడా ఉంది. వీరంతా 19 నుంచి 58 ఏళ్ల మధ్యవారు ఉన్నారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో పరిమితులు విధించారు. పోలీసులు నిందితుల అరెస్టు కోసం వీడియో ఫుటేజీ పరిశీలిస్తున్నారు. -
అమెరికాలో భార'టీ'యత
గరమ్ గరమ్ శాన్ఫ్రాన్సిస్కోలోని ఒక పెద్ద కంపెనీలో ఇంజనీరింగ్ మేనేజర్‌గా పనిచేస్తూ, ప్రస్తుతం ఉద్యోగం నుంచి కొద్దిగా విరామం తీసుకున్న గౌరవ్ చావ్లాకు తరచూ టీ తాగాలని నాలుక పీకేస్తూ ఉంటుంది. అందులోనూ సరైన ఐడియా కోసం బుర్ర బద్దలు కొట్టుకుంటున్నప్పుడు తేనీరు సేవించాలని అనిపిస్తుంటుంది. ఇంట్లో చేసుకొనే టీ లాంటి టీ కోసం తహతహలాడతాడు. గమ్మత్తేమిటంటే, గౌరవ్ లాంటి టీ ప్రియులు ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇదే సమస్య. అల్లం, ఏలకులు వేసి, వేడివేడి పాలతో కమ్మటి టీ పెట్టుకొని తాగడానికి అలవాటు పడ్డ ప్రాణానికి టీ లేకుండా కష్టమే! ఈ ఇబ్బందులకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గౌరవ్చావ్లా, ఆయన మిత్రుడైన సమీప్ భావ్‌సర్‌లు ఒక పరిష్కారం కనుక్కున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలోని ఈ ఇద్దరు భారతీయ అమెరికన్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కార్పొరేషన్లకూ, గృహాలకూ భారతీయ టీ సంస్కృతిని పరిచయం చేయదలిచారు. రైస్ కుక్కర్ తీసుకొని, దానికి మార్పులు చేర్పులు చేశారు. దాన్ని ఛాయ్ పెట్టుకొనే యంత్రంగా మార్చారు. అలా పెట్టుకొన్నది ఇంట్లో చేసుకున్న కమ్మటి తేనీటి రుచితో ఉండడంతో ఎగిరి గంతేశారు. ఇలా చేసిన మిషన్‌కు మరికొన్ని నకళ్ళు సిద్ధం చేశారు. ఆ నమూనా టీ మిషన్లను గూగుల్ ఆఫీసుల్లో, అలాగే శబ్ద సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన ‘డాల్బీ’ సంస్థలో ప్రయోగాత్మక పరీక్షలకు పెట్టారు. అక్కడ నుంచి మంచి స్పందన వచ్చింది. అంతే! ఈ టీ మిషన్ల తయారీకి రంగం సిద్ధమైంది. ‘బ్రూచైమ్ డాట్‌కామ్’ అనే సంస్థ దీన్ని ముందుకు తీసుకువెళుతోంది. వచ్చే ఏడాది మార్చికల్లా ఈ టీ తయారీ మిషన్లు అమ్మకానికి అందుబాటులో ఉంటాయట! ప్రస్తుతానికి ఈ మిషన్‌ను 249 డాలర్ల తగ్గింపు ధరకు అమ్మాలని నిర్ణయించారు. అమెరికా వీధుల్లో టీ బండ్లు ‘బ్రూచైమ్’ సహ వ్యవస్థాపకురాలు కూడా మన ఇండియనే! పావన్ కొఠారీ. డిజైన్ ఇంజనీర్ అయిన ఆమె వంటింటి వస్తువుల రూపకల్పనలో పేరున్న ఓ సంస్థలో ప్రోడక్ట్ డెవలప్మెంట్లో పనిచేశారు. ఫ్రాన్స్‌లోని బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. చివరకు, 2009లో ఛాయ్ అమ్మకాలకు సంబంధించి ఒక స్టార్టప్ ప్రారంభించారు. శాన్ఫ్రాన్సిస్కో వీధుల్లో ఛాయ్ అమ్మే సైకిల్ బండ్లను మొదలుపెట్టారు. ఇంట్లో చేసే టీ తాలూకు రుచిని అందరికీ అందించాలని శ్రమించారు. టీ మిషన్ ఎలా పనిచేస్తుందంటే... గౌరవ్ చావ్లా, సమీప్ల సమష్టి కృషి అయిన ఈ ‘ఛైమ్’ మిషన్‌తో ఏకకాలంలో ఒక కప్పు ఛాయ్ మాత్రమే తయారు చేసుకోవచ్చు. టీ పొడి, మసాలా దినుసుల్ని ముందుగానే మిక్స్ చేసి మిషన్‌లో ఉంచుతారు. వాటితో బ్లాక్ టీ సిద్ధమవుతుంది. దానికి పాలు కలుపుకొని, మళ్ళీ మరగబెట్టాలి. అప్పుడు టీ తయారవుతుంది. కేవలం మూడే మూడు నిమిషాల్లో ఎవరికి కావాల్సిన పద్ధతిలో వారు కమ్మటి తేనీరు సిద్ధం చేసుకోవచ్చు. -
గూగుల్ కి భారీ ఊరట..
శాన్ ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం గూగుల్ కు పెద్ద ఊరట లభించింది. మల్టీ బిలియన్ డాలర్ల దావా కేసులో కోర్టు గూగుల్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీgతో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాపీ రైట్ వివాదంలో రెండు టెక్నాలజీ దిగ్గజాల మధ్య సాగిన హోరా హోరీ యుద్ధానికి ప్రస్తుతానికి తెరపడింది. ఈ తీర్పును పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఒరాకిల్ మళ్లీ పోరుకు రడీ అవుతోంది. ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్ విజయానికి ఈ తీర్పు నిదర్శనమని గూగుల్ వ్యాఖ్యానించింది. జావా ప్రోగ్రామింగ్ క్యమూనిటీ కాపీ రేట్స్ విషయంలో, సాప్ట్ వేర్ అభివృధ్దిలో నూతన ఆవిష్కరణలకు నాంది అవుతుందని ఒక ప్రకటనలో తెలిపింది. సాఫ్ట్ వేర్ డెవలపర్లకు ఇదిముఖ్యమైన విజయమని, సృజనాత్మకతకు ప్రోత్సాహాన్నందిస్తుందని కంప్యూటర్ కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్ బ్లాక్ చెప్పారు. ఇది ఇలా ఉంటే ఈతీర్పును వ్యతిరేకించిన ఒరాకిల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ను గూగుల్ చట్టవిరుద్ధంగా వాడుతోందని గట్టిగా నమ్మువుతున్నామని వాదించింది. మరోసారి అప్పీలు కు వెళ్లనున్నట్టు స్పష్టం చేసింది. కాగా జావా ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ లో గూగుల్ ఆండ్రాయిడ్ కాపీ రైట్ ను ఉల్లంఘించిందని ఒరాకిల్ ఆరోపించింది. దీనికి గాను తమకు గూగుల్ ఆ కంపెనీకి 8.8 బిలియన్ డాలర్లు(880 కోట్ల డాలర్లు) చెల్లించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే కాపీ రైట్ చట్టం ప్రకారం న్యాయంగానే జావా లాంగ్వేజ్ ను వాడుకుంటున్నామని, దానికి ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదంటూ ఒరాకిల్ ఆరోపణలను గూగుల్ ఖండించింది. ఈ రెండు కంపెనీల మధ్య వాదనలు 2012లో మొదలైన సంగతి తెలిసిందే.. -
న్యూ లుక్ తో అదరగొట్టనున్న యాపిల్ స్టోర్లు
శాన్ ఫ్రాన్సిస్కో : ఐ ఫోన్ ప్రేమికులను ఆకట్టుకునే దిశగా యాపిల్ తన స్టోర్ల కోసం ఒక కొత్త స్టైలిష్ ప్రొడక్ట్ ను పరిచయం చేస్తోంది. తన విక్రయ సంస్థలకు కొత్త రూపును అందించడానికి ఈ స్టైలిస్ ప్రొడక్ట్ ను తీసుకొచ్చినట్టు చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 480 స్టోర్లు ఉన్న ఐఫోన్ తయారీదారి యాపిల్, శాన్ ప్రాన్సిస్కో నగరంలోని స్టోర్ ను న్యూ లుక్ అద్దడం కోసమే ఈ స్టైలిస్ తో రీడిజైన్ చేసిందట. ఈ రీ డిజైన్ స్టోర్ ను శనివారం నుంచి ప్రజలకు అందుబాటులో తేనున్నట్టు కంపెనీ వెల్లడించింది. మొత్తం గాజు, మెటల్, చెక్కతో అందంగా దీన్ని రీ డిజైన్ చేశారట.ఈ ప్రత్యేకతలతోనే భవిష్యత్తులో ప్రారంభించబోయే తమ కొత్త స్టోర్లు కూడా ఉంటాయని యాపిల్ ప్రతినిధులు శాన్ ప్రాన్సిస్కో ఈవెంట్ చెప్పారు. కాగా యాపిల్ మొదటిసారి ఐఫోన్ అమ్మకాలను, రెవెన్యూలను కోల్పోయింది. ఈ నేపథ్యంలో తన కొత్తదనంతో మళ్లీ మార్కెట్లను ఆకట్టుకోవాలని యాపిల్ ప్రయత్నిస్తోంది. సిలికాన్ వ్యాలీలో వచ్చే ఏడాది యాపిల్ ప్రారంభించబోయే కొత్త ప్రధాన కార్యాలయాన్ని ఈ ఫీచర్లతోనే రూపొందించనున్నట్టు తెలుస్తోంది. -
ఈ నెలాఖరుకు రాబిన్ స్మార్ట్ ఫోన్ వస్తుందోచ్
శాన్ ఫ్రాన్సిస్కో: భారత మొబైల్ రంగంలోకి మరో స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టనుంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మొబైల్ తయారీ సంస్థ నెక్స్ట్ బిట్ తన నుంచి రాబిన్ అనే కొత్త ఫోన్‌ను ఈ ఏప్రిల్ చివరి నుంచి భారతీయ మార్కెట్లో అమ్మకాలు ప్రారంభించనుంది. దీని ధర రూ.27 వేలు(399డాలర్లు) ఉండనుంది. నెక్స్ట్ బిట్ రాబిన్ ఫోన్ లో పరిమితి లేకుండా క్లౌడ్ స్టోరేజీ చేసుకునే అవకాశం ఉండనుంది. ఇప్పటికే ఈ ఫోన్ అమెరికా మార్కెట్లో 2015లోనే అడుగుపెట్టింది. వినియోగ దారుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ ఫోన్ అమ్మకాలను విస్తృతం చేయాలని నిర్ణయించినట్లు తయారీ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో మొబైల్ రంగానికి అమిత ఆధరణ ఉన్న నేపథ్యంలో ఈ నెలాఖరున ప్రారంభించనున్నారు. ఫోన్ ప్రత్యేకతలు 100 జీబీ వరకు ఫ్రీ క్లౌడ్ స్పేస్ ఫర్ స్టోరేజ్ 5.2 అంగుళాల పూర్తి స్థాయి హెచ్ డీ ఎల్సీడీ తెర(దీనికి రక్షణగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్) 32 జీబీ ఇంటర్నల్ మెమోరీ ఫింగర్ ప్రింట్ ఐడీ స్కానర్ 13 మెగాపిక్సల్ రీర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా -
ఈ బైక్‌కు కిందపడే అలవాటే లేదు!
శాన్ఫ్రాన్సిస్కో: అమ్మానాన్న ఊరెళ్తూ.. ఇంట్లో బైక్ తాళాలు మర్చిపోయారో కుర్రకారుకు ఇక పండగే. అమాయక చక్రవర్తుల్లా వారితో బస్టాప్ దాకా నడుచుకుంటూనే వెళ్తారు. వారలా బస్సెక్కగానే ఇక విశ్వరూపం చూపించేస్తారు. బైకును బయటకు తీసి.. రయ్ రయ్‌మంటూ వీధులన్నీ తిరిగేస్తారు. ఇలాంటి వారు మూలమలుపుల దగ్గరకు వచ్చేసరికి అదుపుతప్పి మోకాలి చిప్పలు పగలగొట్టుకుంటుంటారు. కుర్రకారుకే కాదు.. పెద్దోళ్లకు కూడా ఇది అనుభవమే. టర్నింగుల దగ్గర బైక్ కంట్రోల్ కాకపోవడంతో కిందపడడం సాధారణమే. అయితే ఇక్కడ కనిపిస్తున్న బైక్‌కు మాత్రం కిందపడే అలవాటే లేదట. ఎవరు తయారు చేశారంటే.. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన లిట్ మోటార్స్ సంస్థ ఈ బైక్‌ను తయారు చేసింది. దీనికి ‘సీ-1’ అనే పేరు కూడా పెట్టింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది దానికదే బ్యాలెన్స్ చేసుకుంటుంది. దీనిని నడిపేవారు కారులో కూర్చున్నట్లుగా లోపలే కూర్చుంటారు. ట్రాఫిక్ నిలిచిపోయినా, ఏదైనా అడ్డువచ్చినా ఈ బైక్‌ను మనం ప్రత్యేకంగా బ్యాలెన్స్ చేయాల్సిన పనిలేదు. కాస్త వంగితే చాలు దానిలో దాగున్న స్టాండ్ బయటకు వచ్చేస్తుంది. ఇక లోపల మాత్రం కారులో ఉండే సదుపాయాలన్నీ ఈ బైక్‌లో ఉన్నాయట. ఎన్నెన్నో ప్రత్యేకతలు ఇది 100 శాతం విద్యుత్‌తో నడుస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. ఒకసారి చార్జింగ్ చేస్తే దాదాపు 200 మైళ్లు ఆగకుండా సాగిపోవచ్చు. కేవలం అరగంట చార్చింగ్ చేస్తే చాలు. కేవలం 6 సెకన్లలో 0 నుంచి 60 ఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది. ట్రాఫిక్‌లో రయ్‌మంటూ దూసుకుపోయేలా నాజూగ్గా రూపొందించారు. పైగా దీనిని బైక్‌ను పార్కింగ్ చేసినంత స్థలంలోనే పార్క చేయవచ్చు. -
హైదరాబాద్-శాన్ఫ్రాన్సిస్కో విమాన సర్వీసు
వచ్చే నెల 2 నుంచి ప్రారంభం హైదరాబాద్: ఎయిర్ ఇండియా సంస్థ హైదారాబాద్ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు వచ్చే నెల 2 నుంచి విమాన సర్వీసును ప్రారంభించనున్నది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా శాన్ఫ్రాన్సిస్కోకు నాన్ స్టాప్‌గా ఈ విమాన సర్వీసులను వారానికి మూడుసార్లు నడుపుతామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లే విమాన ప్రయాణికుల కస్టమ్, ఇమ్మిగ్రేషన్ ఫార్మాలిటీలన్నీ హైదారాబాద్ విమానాశ్రయంలోనే జరుగుతాయని ఎయిర్ ఇండియా స్టేషన్ మేనేజర్(హైదరాబాద్) ఏ. రాంబాబు చెప్పారు. ప్రతి మంగళ, గురు,శనివారాల్లో హైదరాబాద్ నుంచి రాత్రి 9.05కు బయల్దేరిన విమానం న్యూఢిల్లీకి రాత్రి 11.15కు చేరుతుందని వివరించారు. ఢిల్లీ నుంచి ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో తెల్లవారుజాము 2.35కు బయల్దేరి అదే రోజు తెల్లవారుజాము 6 గంటలకు శాన్ఫ్రాన్సిస్కోకు చేరుతుందని పేర్కొన్నారు. ఇది ఎయిర్ ఇండియా అందిస్తున్న నాలుగో డెరైక్ట్ సర్వీసని ఇంతకు ముందు న్యూయార్క్, నెవార్క్, చికాగో నగరాలకు డెరైక్ట్ విమాన సర్వీసులను నిర్వహించామని ఆయన చెప్పారు. -
ఆకట్టుకుంటున్న బిగ్ గాల్.. యోగా..
ఊబకాయం కొందరిని ఆత్మ న్యూనతకు గురి చేస్తుంది. మరి కొందరిని అనారోగ్యాల పాలు చేస్తుంది. అయితే ఊబకాయంతో ఉన్నశాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన వాలెరీ సగన్ ను మాత్రం... ఎందరికో మార్గదర్శకం చేస్తోంది. ఇరవై ఏడేళ్ళ వయసులో తన భారీకాయంతో అతి క్లిష్టమైన యోగా భంగిమలను సునాయాసంగా చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆమె వెబ్ సైట్ ఎనభైవేల మంది ఫాలోయర్స్ తో దిన దిన ప్రవర్థమానమౌతోంది. ఇన్ స్టా గ్రామ్ పేజీలో బిగ్ గాల్ యోగా పేరున కొనసాగుతున్న వాలెరీ సగన్... ఇప్పుడు ఊబకాయుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచే మహిళగా గుర్తింపు పొందింది. కృషి ఉంటే మనుషులు రుషులౌతారు అన్నట్లు.. ఎంతో కృషితో క్లిష్టమైన యోగాభ్యాసాన్ని చేసి అనుకున్నది సాధించింది. బరువుతో సంబంధం లేకుండా.. ఇంధ్ర ధనుస్సులా వంగే ఆమె శరీరం.. ఎందరో ఊబకాయుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతోంది. ఆమె వేసే యోగాసనాలు చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. ఆమె శరీరం ప్రజల్లోకి అనుకూల ప్రచారాన్ని తీసుకు వెడుతోంది. ''మొదట్లో నేను అందరిలా భయపడ్డాను. యోగా నేర్చుకోవడం ఊబకాయులకు సాధ్యం కాదనే బెదిరింపులకు లోను కాలేదు. వయసుతో సంబంధం లేదు... అనారోగ్యాలకు భయపడాల్సిన అవసరం లేదు... నన్ను చూడండి.. ఎటువంటివారైనా యోగా నేర్చుకోవచ్చు'' అంటూ.. అనుకూల ప్రచారాన్ని తన వైబ్ సైట్ బ్లాగులో పోస్ట్ చేస్తోంది. అంతేకాదు వివిధ యోగా భంగిమల్లోని ఫొటోలతో ఆకట్టుకుంటోంది. తమ సైజును బట్టి యోగాకు దూరం కావాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని అందరికీ తెలియజెప్పడమే వాలెరీ లక్ష్యం. అందరికీ ఏదో ఒకరకమైన శారీరక సమస్యలు ఉంటాయి. కానీ ఎవరి బెదిరింపులకు భయపడకుండా.. అసత్య ప్రచారాన్ని వినకుండా మీ శరీరం పై మీరు ధ్యాస ఉంచండి. మీకు.. మీరు కాస్త సమయాన్ని కేటాయించుకోండి. అంతేకాదు అందరిలాగే రకరకాల, రంగు రంగుల దుస్తులూ ధరిస్తూ మీకు కావలసిన విధంగా ఉండేందుకు ప్రయత్నించండి అంటూ ఊబకాయులకు సూచిస్తోంది. వివిధ భంగిమల్లో శరీరాన్ని రబ్బర్ లా వంచుతూ స్లిమ్ గా ఉండే వారికి కూడ ఆమె ఛాలెంజ్ విసురుతోంది. ఒక్కోసారి నేను చేసే యోగాసనాలు నా చేతులను ఇబ్బందికి గురిచేస్తాయి. ఎందుకంటే నా శరీర బరువు అటువంటిది కనుక. అయినా నేను భయపడను. అంతేకాదు నాకు ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ వంటివి కూడ తింటూనే ఉంటాను అంటుంది వాలెరీ. జనం మాట్లాడేదాన్ని నేను కేర్ చెయ్యను. నాది ఎంతో గ్రేట్ బాడీ అని కూడ అనుకుంటానంటూ తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తుంది. మూడేళ్ళక్రితం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించడం మొదలు పెట్టిన వాలెరీ.. యూనివర్శిటీ ఫైనార్స్ట్ లో పట్టా పుచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ఎక్కడకు వెళ్ళినా.. తనతోపాటు తన యోగా మ్యాట్ ను తీసుకొని వెడుతుంది. బీచ్ లు, పార్కులు, ఏ ప్లేస్ లో అయినా తాను చేసే ఫీట్లను ఫోటోల్లో, వీడియోల్లో బంధించి పోస్ట్ చేస్తుంటుంది. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పెర్ ఫెక్ట్ అన్న చందంగా తీవ్ర కృషితో తాను అనుకున్నది సాధించిన వాలెరీ.. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. అంతేకాదు త్వరలో తనకంటే కూడ ప్లస్ సైజ్ లో ఉన్నవారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచేందుకు... యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ... ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కూడ సిద్ధం అవుతున్నట్లు ప్రకటించింది. -
కూలిన విమానం : ముగ్గురి మృతి
శాన్ఫ్రాన్సిస్కో : అలస్కాలో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారని ఎయిర్ నేషనల్ గార్డు సార్జంట్ ఎడ్వర్డ్ ఈగర్టన్ బుధవారం వెల్లడించారు. విమానం టేకాఫ్ అయిన కొంత సేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపింది. ఎయిర్‌ఫీల్డ్‌కి కేవలం 270 మీటర్ల దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 10 మంది ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. మృతులు ముగ్గురు స్థానికులు కాదని చెప్పారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియలేదన్నారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. -
సూసైడ్ స్పాట్‌కు వెళ్లిన సోనాక్షి
అయ్యో పాపం... సోనాక్షీ సిన్హాకు ఏమైంది...? ఆమె ఎందుకు సూసైడ్ పాయింట్‌కు వె ళ్లింది? చక్కగా సినిమాలు చేసుకుంటోంది కదా! ఏమంత కష్టమొచ్చింది? అని ఈ హెడ్ లైన్ చదివినవాళ్లు అనుకోకుండా ఉండలేరు. సోనాక్షీ సూసైడ్ పాయింట్‌కి వెళ్లిన మాట నిజమే కానీ.. ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రం వెళ్లలేదు. సరదాగా వెళ్లారన్నమాట. ఇంతకీ ఆ పాయింట్ ఎక్కడ ఉందో తెలుసా? విదేశాల్లో. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వంతెన ల్లో శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ ఒకటి. బంగారంలాంటి జీవితాన్ని కాదనుకుని, చాలామంది ఈ గేట్ ద్వారా పరలోక ప్రయాణం చేసేస్తుంటారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడే ప్రాంతంగా ఇది రెండో స్థానంలో ఉంది. దీని మీద నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన వారిలో కేవలం రెండు శాతం మాత్రమే బతికారంటే ఎంత ప్రమాదమో ఊహించుకోవచ్చు. ఈ నగరానికి వచ్చిన వాళ్లు ఈ గోల్డెన్ గేట్‌ని చూడకుండా మాత్రం వెళ్లరు. ఏదో పనిమీద శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లిన సోనాక్షి కూడా ఈ బ్రిడ్జ్‌ను సందర్శించారు. దీని గొప్పతనం గురించి తెలుసు కానీ, సూసైడ్ హిస్టరీ గురించి మాత్రం ఆమెకు తెలియదట. ఈ బ్రిడ్జ్ నుంచి కిందకు చూడటానికే సోనాక్షీకి గుండె ఆగినంత పనయిందట. సూసైడ్ హిస్టరీ విని ఆమెకు మరింత భయం వేసిందట. పక్కనున్న వాళ్లు ఓసారి దూకుతారా? అని సరదాగా అడిగితే ‘‘చచ్చినా ఆ పని చేయను’’ అని బదులిచ్చారట.