అమెరికాలోని ఓ విమానాశ్రయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే దాని టైర్ ఊడిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
వివరాలు.. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుంచి జపాన్‌కు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరింది. విమానంలో 235 ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. అయితే టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే విమానం ఎడమవైపు ఉన్న ఓ టైర్ ఊడిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
విమానం నుంచి టైర్ ఊడిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే విమానంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఘటనపై ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా స్పందించింది. ఇలాంటి సందర్భాల్లో సురక్షితంగా ల్యాండయ్యేలా విమానాన్ని డిజైన్ చేసినట్లు వెల్లడించింది. అయితే ఊడిన విమానం టైర్ శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలోని ఎంప్లాయిస్ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న కార్లపై పడింది. దీంతో పలు కార్లు ధ్వంసమయ్యాయి.
🚨 #BREAKING: A United Airlines Boeing 777 has lost a wheel while taking off San Francisco
— Nick Sortor (@nicksortor) March 7, 2024
Several cars have been CRUSHED by the falling wheel
WHAT’S GOING ON WITH BOEING AND THE AIRLINES? pic.twitter.com/zu7s5YJixg
Comments
Please login to add a commentAdd a comment