tyre
-
విమానం టేకాఫ్ అయిన క్షణాలకే ఊడిపోయిన టైర్.. వీడియో వైరల్
అమెరికాలోని ఓ విమానాశ్రయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే దాని టైర్ ఊడిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. వివరాలు.. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుంచి జపాన్‌కు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరింది. విమానంలో 235 ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. అయితే టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే విమానం ఎడమవైపు ఉన్న ఓ టైర్ ఊడిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. విమానం నుంచి టైర్ ఊడిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే విమానంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఘటనపై ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా స్పందించింది. ఇలాంటి సందర్భాల్లో సురక్షితంగా ల్యాండయ్యేలా విమానాన్ని డిజైన్ చేసినట్లు వెల్లడించింది. అయితే ఊడిన విమానం టైర్ శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలోని ఎంప్లాయిస్ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న కార్లపై పడింది. దీంతో పలు కార్లు ధ్వంసమయ్యాయి. 🚨 #BREAKING: A United Airlines Boeing 777 has lost a wheel while taking off San Francisco Several cars have been CRUSHED by the falling wheel WHAT’S GOING ON WITH BOEING AND THE AIRLINES? pic.twitter.com/zu7s5YJixg — Nick Sortor (@nicksortor) March 7, 2024 -
ఎటూకాని తోవలో బండి చక్రాల్లో గాలి అయిపోతే?
చిన్నవైనా, పెద్దవైనా వాహనాలకు చక్రాలు, వాటికి టైర్లు ఉంటాయి. టైర్లలో గాలి నింపడం పెద్ద పని. సైకిల్ టైర్లలోకి గాలి కొట్టడం కొద్దిపాటి శ్రమతో కూడుకున్న పని అయితే, భారీ వాహనాల టైర్లకు గాలి కొట్టడం అంత తేలిక పనికాదు. వాటిలో గాలి నింపుకోవడానికి పెట్రోల్ బంకులకో, మెకానిక్ షెడ్‌లకో వెళ్లక తప్పదు. ఎటూకాని తోవలో బండి చక్రాల్లో గాలి అయిపోతే ఎదురయ్యే తిప్పలు వర్ణనాతీతం. అలాంటి తిప్పలను తప్పించడానికే అమెరికన్ కంపెనీ ‘థామస్ పంప్స్’ ఇంచక్కా చేతిలో ఇమిడిపోయే ‘మినీ పంప్’ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని చక్కగా జేబులో వేసి తీసుకుపోవచ్చు. దీని బరువు 115 గ్రాములు మాత్రమే! ఎలాంటి తోవలోనైనా వాహనం చక్రాల్లోని గాలి అయిపోతే, అక్కడికక్కడే దీంతో క్షణాల్లో గాలి నింపుకోవచ్చు. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీని బ్యాటరీ 25 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. దీని సాయంతో సైకిల్ టైర్లలో 70 సెకన్లలోనే గాలి నింపుకోవచ్చు. మోటార్ సైకిళ్లు మొదలుకొని భారీ వాహనాలకు కూడా దీనిని ఉపయోగించవచ్చు. కాకుంటే, టైరు పరిమాణాన్ని బట్టి కొంత ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ బంతుల్లో కూడా క్షణాల్లో గాలి నింపుకోవచ్చు. దీని ధర 119 డాలర్లు (రూ.9898). -
ద్విచక్ర వాహనదారులకు ఊరట?..టూవీలర్లపై జీఎస్టీ తగ్గనుందా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహనాలపై జీఎస్టీని ప్రస్తుతం ఉన్న 28 నుంచి 18 శాతానికి తగ్గించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) ప్రభుత్వానికి విన్నవించింది. లక్షలాది మందికి అవసరమైన ఈ విభాగాన్ని లగ్జరీ వస్తువుగా వర్గీకరించకూడదని పేర్కొంది. ఆర్థిక మంత్రి, జీఎస్టీ కౌన్సిల్ ఛైర్మన్ నిర్మలా సీతారామన్, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు, ఆటోమొబైల్ రంగాన్ని పర్యవేక్షిస్తున్న భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖకు ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు ఫెడరేషన్ తెలిపింది. ‘ఈ సమయానుకూల, నిర్ణయాత్మక జోక్యం వల్ల ద్విచక్ర వాహనాలను మరింత సరసమైనవిగా చేయడంలో, డిమాండ్‌ను పునరుద్ధరించడంలో తోడ్పడుతుంది. గత కొన్నేళ్లుగా విక్రయాలలో గణనీయమైన తిరోగమనాన్ని చవిచూసిన పరిశ్రమను గాడిలో పెట్టేందుకు సాయపడుతుంది’ అని వివరించింది. తక్కువ ఖర్చుతో రవాణా.. ‘ద్విచక్ర వాహన పరిశ్రమ క్లిష్ట దశలో ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కఠిన ఉద్గార నిబంధనలు, కోవిడ్–19 అనంతర ప్రభావాలు వంటి సవాళ్లతో పోరాడుతోంది. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేటును తగ్గించి సామాన్యులకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు జీఎస్టీ కౌన్సిల్‌కు ఇది సరైన తరుణం. పన్ను తగ్గింపు పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఉపాధి అవకాశాలను సృష్టించడంలో, దేశ మొత్తం ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అధిక జనాభాకు తక్కువ ఖర్చుతో ప్రయాణాలు చేసే విషయంలో ద్విచక్ర వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ప్రజా రవాణా తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఇవి విస్తరించాల్సి ఉంది. కొన్నేళ్లుగా వివిధ ద్విచక్ర వాహనాల ధరలు గణనీయంగా పెరిగాయి. వినియోగదారులకు కొనుగోలు శక్తిపై ప్రభావం చూపుతోంది. ముడి పదార్థాల ధరలు పెరగడం, కఠినమైన ఉద్గార నిబంధనలు, అధిక పన్నులు, రుసుములతో సహా అనేక కారణాలు ఈ పెరుగుదలకు కారణం’ అని ఎఫ్ఏడీఏ తెలిపింది. తగ్గిన టూవీర్ల వాటా.. హోండా యాక్టివా ధర 2016లో రూ.52,000లు పలి కింది. 2023లో రూ.88,000లకు చేరింది. బజాజ్ పల్సర్ ధర 2016లో రూ.72,000 ఉంటే ఇప్పు డది రూ.1.5 లక్షలకు ఎగసింది. ద్విచక్ర వాహనాల ధరలలో నిరంతర పెరుగుదల తత్ఫలితంగా అమ్మకాల క్షీణతకు దారితీసింది. పరిశ్రమ వృద్ధి పథాన్ని పునరుద్ధరించడానికి జోక్యం అవసరం. జీఎస్టీ రేటు తగ్గింపు అత్యవసర అవసరాన్ని గు ర్తు చేస్తోంది. 2016లో భారత్‌లో జరిగిన మొత్తం ఆటోమొబైల్ విక్రయాలలో ద్విచక్ర వాహనాల వాటా ఏకంగా 78% ఉంది. 2020 నుండి నిరంతర ధరల పెరుగుదల కారణంగా టూవీలర్ల వాటా 2022–23లో 72%కి పడిపోయింది. ఇది ధరల పెరుగుదల ప్రభావాన్ని నొక్కి చెబుతోంది. జీఎస్టీ రేటును తగ్గించడం వల్ల ఇతర రవాణా విధానాల తో పోలిస్తే ద్విచక్ర వాహనాల పోటీతత్వం పెరుగుతుంది. తద్వారా పరిశ్రమకు అమ్మకాలతోపాటు ఆదాయం అధికం అవుతుంది’ అని ఫెడరేషన్ ప్రెసి డెంట్ మనీష్ రాజ్ సింఘానియా వివరించారు. -
డబ్బా చక్రాల సైకిల్.. ఈజీగానే తొక్కొచ్చు!
సైకిల్ అంటే ఎలా ఉంటుంది? రెండు పెద్ద చక్రాలు.. వాటిని అటాచ్ చేస్తూ ఫ్రేమ్, చైన్ అంతేకదా! సైకిల్ అనే కాదు.. ఏ వాహనానికైనా ఉండేది గుండ్రని టైర్లు, చక్రాలే. అలా కాకుండా సైకిల్‌కు చతురస్రాకారంలో టైర్లు ఉంటే? అలా సింపుల్‌గా తొక్కేసుకుంటూ వెళ్లిపోగలిగితే? అదెలా సాధ్యమనిపిస్తోంది కదా! రష్యాకు చెందిన ‘ది క్యూ’సంస్థ ఇంజనీర్ సెర్గీ గోర్డీవ్ మాత్రం దీనిని చేసి చూపించాడు. చతురస్రాకారంలో టైర్లను రూపొందించి.. సాధారణ సైకిల్ ఫ్రేమ్‌కు అమర్చి నడిపించాడు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది కూడా. ‘స్క్వేర్’టైర్లతో నడిచేదెలా? యుద్ధ ట్యాంకుల చక్రాల్లో వాడే టెక్నాలజీని ‘స్క్వేర్ టైర్’సైకిల్లో వినియోగించారు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఇందులో చక్రాలు మొత్తానికి మొత్తంగా తిరగవు. జస్ట్ వాటి అంచున ఏర్పాటు చేసే ప్రత్యేకమైన బెల్ట్ మాత్రమే కదులుతుంది. అలాగే ‘స్క్వేర్ వీల్’సైకిల్లో చతురస్రాకారపు వీల్స్ కదలకుండా అలాగే ఉంటాయి. సెర్గీ గోర్డీవ్ ప్రత్యేకమైన బెల్ట్‌ను తయారు చేసి వాటి అంచులో అమర్చాడు. పెడల్స్ తొక్కినప్పుడు ఆ బెల్ట్ కదిలేలా.. గేర్లను, చైన్లను అమర్చి అనుసంధానించాడు. పెడల్‌ను తొక్కినప్పుడు.. బెల్ట్ కదులుతూ సైకిల్ ముందుకు వెళుతుంది. ఇదో వినూత్న ఆలోచన, చాలా బాగుందని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తుంటే.. అంతా బాగానే ఉందిగానీ.. స్పీడ్ బ్రేకర్లు, గుంతలు వస్తే పరిస్థితి ఏమిటన్న కామెంట్లూ వస్తున్నాయి. -
ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపిస్తున్న ప్రముఖ కంపెనీల షేర్లు.. కారణం అదేనా?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి అర్ధభాగంలో అటూఇటుగా పనితీరు చూపిన టైర్ల తయారీ కంపెనీలు ఇకపై పుంజుకోనున్నాయి. ఇందుకు ప్రధానంగా ముడివ్యయాలు తగ్గుతుండటం, డిమాండు ఊపందుకోనుండటం దోహదపడనుంది. వెరసి టైర్ల కంపెనీల షేర్లు ఇకపై జోరందుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. ఇటీవలే ముగిసిన ఈ ఏడాది రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో టైర్ల తయారీ కంపెనీలు మిశ్రమ ఫలితాలు సాధించాయి. అయితే భవిష్యత్‌లో అమ్మకాలు బలపడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వాహన తయారీ దిగ్గజాల(ఓఈఎం) నుంచి ఆర్డర్లు పెరగడంతోపాటు.. సెకండరీ(రీప్లేస్మెంట్) మార్కెట్ నుంచి టైర్లకు డిమాండు మెరుగుపడుతోంది. ఇది విక్రయాలకు ఊపునివ్వనుంది. ఇవికాకుండా మరోవైపు ముడిచమురు ధరలు దిగిరావడంతో సంబంధిత ముడిసరుకుల వ్యయాలు తగ్గుతున్నాయి. దీనికి నేచురల్ రబ్బర్ ధరలు నీరసించడం జత కలుస్తోంది. అమ్మకాలతో పోలిస్తే టైర్ల తయారీలో ఈ రెండింటి సంబంధ ముడివ్యయాలే 60 శాతాన్ని ఆక్రమిస్తుంటాయి. దీంతో లాభదాయకత మెరుగుపడేందుకు వీలుంటుంది. ముడివ్యయాల ఎఫెక్ట్ త్రైమాసికవారీగా చూస్తే క్యూ2లో సియట్ స్థూల మార్జిన్లను 0.82 శాతం, అపోలో టైర్స్ 0.1 శాతం చొప్పున మెరుగుపరచుకున్నాయి. అయితే మరో దిగ్గజం ఎంఆర్ఎఫ్ మార్జిన్లు మాత్రం 1.8 శాతం నీరసించాయి. భారీగా పెరిగిన ముడివ్యయాల ధరలను కస్టమర్లకు పూర్తిస్థాయిలో బదిలీ చేయకపోవడం ప్రభావం చూపింది. ఎగుమతులపై అధికంగా ఆధారపడే ఆఫ్‌రోడ్ టైర్ల దిగ్గజం బాలకృష్ణ ఇండస్ట్రీస్ స్థూల మార్జిన్లు త్రైమాసికవారీగా 2.2 శాతం క్షీణించాయి. ప్రధానంగా ముడిసరుకులు, రవాణా వ్యయాలు పెరగడంతో టైర్ల పరిశ్రమ వరుసగా నాలుగు త్రైమాసికాలపాటు మార్జిన్ ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు రేటింగ్ దిగ్గజం ఇక్రా తెలియజేసింది. అయితే చమురు డెరివేటివ్స్, రబ్బర్ ధరలు వెనకడుగు వేస్తుండటంతో ఈ ఏడాది ద్వితీయార్థం(అక్టోబర్–మార్చి)లో మార్జిన్లు బలపడవచ్చని అంచనా వేసింది. జులై నుంచి దిగివస్తున్న ముడిచమురు ధరలు మార్చిలో నమోదైన చరిత్రాత్మక గరిష్టం నుంచి 35 శాతం క్షీణించాయి. మరోపక్క ప్రపంచ ఆర్థిక మాంద్య ఆందోళనలతో రబ్బర్ ధరలు సైతం కొన్నేళ్ల కనిష్టాలను తాకుతున్నాయి. కోవిడ్–19 ప్రభావంతో చైనా నుంచి టైర్లకు డిమాండు తగ్గడం ప్రభావం చూపుతోంది. మార్జిన్లకు బలిమి మోతీలాల్ ఓస్వాల్ రీసెర్చ్ అంచనా ప్రకారం నేచురల్, సింథటిక్ రబ్బర్, కార్బన్ బ్లాక్ ధరలు 10 శాతం తగ్గితే.. నిర్వహణ లాభ మార్జిన్లు 1.6 శాతం, 0.8 శాతం, 1 శాతం చొప్పున బలపడతాయి. కాగా.. యూరోపియన్ మార్కెట్లలో అనిశ్చితుల కారణంగా బాలకృష్ణ ఇండస్ట్రీస్ షేరు ఇటీవల నీర సించగా.. మార్జిన్ల ప్రభావంతో నెల రోజులుగా ఎంఆర్ఎఫ్ స్టాక్ హెచ్చుతగ్గుల మధ్య అక్కడక్కడే అన్నట్లుగా కదులుతోంది. ఇదే కాలంలో అపోలో టైర్స్, జేకే టైర్స్ సైతం ఒడిదొడుకులు ఎదుర్కోగా గత ఆరు నెలల కాలంలో ఈ రెండు స్టాక్స్ 17–47 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే గత మూడు నెలల్లో సియట్ షేరు 27 శాతం లాభపడటం గమనార్హం! -
గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్
రోమ్: అట్లాస్ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 747 విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే దాని ల్యాండింగ్ గేర్ టైర్ ఊడిపోయింది. ఈ సంఘటన ఇటలీలోని టరంటో విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికే జరిగింది. ఈ భారీ విమానాన్ని ప్రధానంగా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ పరికరాలను రవాణా చేసేందుకు ఉపయోగిస్తుంటారు. ఇటలీలోని టరంటో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి అమెరికాలోని చార్లెస్టన్కు చేరుకోవాల్సి ఉంది. విమానం టైర్ ఊడిపోయిన దృశ్యాలు కెమెరాలో నమోదయ్యాయి. భారీ రవాణా విమానం రన్‌వేపై వేగంగా వెళ్తూ గాల్లోకి ఎగిరింది. అయితే, ఆ కాసేపటికే ల్యాండింగ్ గేర్ టైర్ ఊడిపోయింది. రన్‌వేపై పడి కొంత దూరం దొర్లుతూ వెళ్లింది. చక్రం ఊడిపోయిన క్రమంలో నల్లటి పొగ సైతం వచ్చినట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. అయితే, ఎలాంటి ప్రమాదం జరగలేదు. టైర్ ఊడిపోయినప్పటికీ అలాగే అమెరికా చేరిన విమానం.. చార్లెస్టన్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. టైర్ టరంటో ఎయిర్పోర్ట్ రన్‌వే చివరిలో గుర్తించారు. బోయింగ్ 747 డ్రీమ్‌లిఫ్టర్ రవాణా విమానం. బోయింగ్ 747-400 ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఆధునికీకరించి రవాణా విమానంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం విమాన పరకరాలను రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్నారు. సెప్టెంబర్, 2006లో తొలిసారి గాల్లోకి ఎగిరింది. అయితే, వస్తు రవాణాకు మాత్రమే అనుమతి ఉంది. కేవలం విమాన సిబ్బంది మినహా మానవ రవాణాకు దీనిని ఉపోయోగించేందుకు అనుమతి లేదు. Un Boeing 747 Dreamlifter operat de Atlas Air (N718BA) care a decolat marți dimineață (11OCT22) din Taranto (IT) spre Charleston (SUA) a pierdut o roată a trenului principal de aterizare în timpul decolării. Avionul operează zborul #5Y4231 și transportă componente de Dreamliner. pic.twitter.com/R95UHkLD7V — BoardingPass (@BoardingPassRO) October 11, 2022 ఇదీ చదవండి: Work From Pub Trend: యూకేలో నయా ట్రెండ్ ‘వర్క్ ఫ్రమ్ పబ్’.. ఆడుతూ పాడుతూ పని! -
ఆడు మగాడ్రా బుజ్జి.. ఆరేళ్ల తర్వాత ఎట్టకేలకు విముక్తి
మూగ జీవాలకు సాయం చేయడం.. అది వైరల్ కావడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ, మనుషుల్ని చంపి పీక్కుతినే జీవికి సాయం చేయడం.. అదీ మూడురోజులు ఓపికగా ఎదురు చూడడమే ఇక్కడి ఘటనలో విశేషం. స్థానికులంతతా ముద్దుగా ‘మువాయ కలంగ్ బన్’.. అని పిలుచుకునే ఆ మొసలికి ఆరేళ్ల తర్వాత ఎట్టకేలకు విముక్తి కలిగింది. ఆ మూగ జీవికి నరకం లాంటి బాధ నుంచి విముక్తి కలిగించిన టిల్లి అనే వ్యక్తి సాహసానికి, మంచి మనసుకి సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇండోనేషియా ఐల్యాండ్ సులావేసిలో పాలూ దగ్గర 2016లో ఒక మొసలి కనిపించింది. ఈ ఉప్పు నీటి మొసలి అప్పుడప్పుడు పశువులు, మనుషుల మీద దాడి చేస్తుండేది. అయితే ఎలా వచ్చి పడిందో తెలియదుగానీ.. దాని మెడకు ఓ టైర్ బిగుసుకుపోయింది. తీద్దామని అనుకున్నా.. దాడి చేస్తుందనే భయంతో దాని దగ్గరగా వెళ్లేందుకు అంతా భయపడ్డారు. బహుశా దానిని చంపేందుకో లేదంటే పెంచుకునేందుకో ఆ టైర్‌ను మెడకు ఉచ్చులా వేసి ఉంటారని భావించారు. ఈలోపు రెండేళ్లు గడిచాయి. 2018లో ఈ మొసలి వీడియో ప్రపంచం దృష్టితో పాటు జంతు సంరక్షకుల దృష్టిని ఆకర్షించింది. టైరు క్రమక్రమంగా దాని మెడకు బిగుసుకుపోతుండడంతో.. దానిని సంరక్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి. 2020లో ఆస్ట్రేలియా నుంచి మ్యాట్ రైట్ అనే పాపులర్ సంరక్షకుడు సైతం దానిని రక్షించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ క్రమంలో దానికి టైర్ తొలగించినవాళ్లకు మనీ ప్రైజ్ ఆఫర్ చేశారు అధికారులు. అయితే టిల్లి మాత్రం రివార్డు కోసం ముందుకు రాలేదు. మూగజీవాలు ఆపదలో ఉన్నాయంటే.. అక్కడ వాలిపోతుంటాడు ఈ 33 ఏళ్ల వ్యక్తి. గతంలో పాముల నుంచి ఎన్నింటినో చాలా ఓపికగా రక్షించాడు కూడా. అందుకే మూడు రోజులు ఎదురుచూసి.. ఓ కోడిని ఎరగా వేసి మొత్తానికి ఆ మొసలిని పట్టేసుకున్నాడు. స్దానికుల సాయంతో దాని మెడకు పట్టిన టైరును తొలగించి.. పదమూడు అడుగులకు పైన ఉన్న ఆ రాకాసి మొసలిని తిరిగి నీళ్లలోకి వదిలేశాడు. ఇంతకీ మువాయ కలంగ్ బన్ అంటే.. మెడలో టైరు హారంగా ఉన్న మొసలి అని మీనింగ్ (crocodile with a tyre necklace). ఇచ్చిన ప్రకటన ప్రకారం రివార్డు ఇద్దామని అధికారులు అనుకుంటున్నప్పటికీ.. టిల్లి మాత్రం ఆ డబ్బును శాంక్చురీ కోసం విరాళంగా ప్రకటించేసి తన పెద్ద మనసును చాటుకున్నాడు. -
Lucknow: విమానం టైరును ఎత్తుకెళ్లిన దుండగులు!
లక్నో: కాస్త ఏమరుపాటుగా ఉంటే దొంగలు తమచేతి వాటం చూపిస్తారు. సాధారణంగా నగానట్రో, రోడ్డుపై ఉన్న వాహనాలనో మూడోకంటికి తెలీకుండా పనికానిచ్చేస్తారు. ఐతే ఓ దొంగల ముఠా ఏ కంగా విమానం టైర్‌ను ఎత్తుకెళ్లింది! లక్నోలోని బక్షి-కా-తలాబ్ ఎయిర్‌బేస్ నుండి జోధ్‌పూర్ వైమానిక స్థావరానికి సైనిక వస్తువులను తీసుకెళ్తున్న ట్రక్కులో మిరాజ్ ఫైటర్ జెట్ విమానం టైర్‌ను గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. నవంబర్ 27 అర్ధరాత్రి లక్నోలోని షాహీద్ పాత్లో జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌కు వెళ్తున్న సమయంలో దొంగతనం జరిగింది. వివరాల్లోకెళ్తే.. షాహీద్ పాత్ మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో స్కార్పియో వాహనంలో వెళ్తున్న దుండగులు టైరుకు కట్టేందుకు ఉపయోగించే పట్టీని పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. లారీ డ్రైవర్ పోలీసులకు విషయం తెలియజేసే సమయానికి దొంగలు పరారయ్యారు. అతను పోలీసులకు ఫోన్ చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కాగా షాహీద్ మార్గంలో జామ్ కావడంతో ట్రక్కు నెమ్మదిగా కదులుతున్న సమయంలో దొంగలు అర్ధరాత్రి 12 గంటల 30 నిముషాల నుంచి 1 గంటల మధ్య చోరీకి పాల్పడ్డారని ట్రక్ డ్రైవర్ హేమ్ సింగ్ రావత్ తెలిపారు. బక్షి-కా-తలాబ్ వైమానిక స్థావరం నుండి సైనిక వస్తువుల సరుకును తీసుకువెళుతున్నట్లు పోలీసులు ధృవీకరించారు. మిరాజ్ 2000 ఫైటర్ జెట్ విమానానికి చెందిన ఐదు టైర్లు లక్నో ఎయిర్‌బేస్ నుండి అజ్మీర్‌కు ట్రక్కులో రవాణా అవుతున్నాయి. అందులో ఒక టైరును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నవంబర్ 27న చోటుచేసుకోగా.. డిసెంబర్ 1న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని డీసీపీ ఈస్ట్ అమిత్ కుమార్ తెలిపారు. చదవండి: ఫేస్బుక్లో పరిచయం.. మత్తిచ్చి అత్యాచారం.. ఫోర్న్‌వీడియో తీసి 10 లక్షలు డిమాండ్! -
కేశోరామ్ నుంచి విడిగా టైర్ల విభాగం
కోల్‌కతా: బీకే బిర్లా గ్రూప్‌నకు చెందిన కేశోరామ్ ఇండస్ట్రీస్ కంపెనీ నష్టాలొస్తున్న తన టైర్ల విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా (బిర్లా టైర్స్) విడగొట్టనుంది. ఫలితంగా కంపెనీ విలువ మరింత పెరగగలదని, మూలధన నిధులు సమీకరణ మరింత సులభమవుతుందని సంస్థ భావిస్తోంది. ఈ కంపెనీ చేపట్టిన రెండో భారీ పునర్వ్యస్థీకరణ ఇది. డీమెర్జర్‌లో భాగంగా ఒక్కో కేశోరామ్ ఇండస్ట్రీస్ షేర్‌కు రూ.10 ముఖ విలువ గల ఒక్కో బిర్లా టైర్స్ షేర్ లభిస్తుంది. టైర్ల వ్యాపారానికే అంకితమైన మేనేజ్మెంట్ కారణంగా వేగంగా వృద్ధి చెందుతున్న ఆ వ్యాపారంలో మంచి వృద్ధిని సాధించగలమన్న ఆశాభావాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. ఈ డీ మెర్జర్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం పొందాల్సి ఉంది. డీమెర్జర్ అనంతరం సిమెంట్వ్యాపారం కేశోరామ్ ఇండస్ట్రీస్ కింద కొనసాగుతుంది. రూ. 1,000 కోట్ల రుణం బదిలీ... కేశోరామ్ ఇండస్ట్రీస్‌కు ప్రస్తుతం ఉన్న రూ.1,000 కోట్ల రుణాన్ని బిర్లా టైర్స్ కంపెనీకి బదిలీ చేసే అవకాశాలున్నాయని కేశోరామ్ ఇండస్ట్రీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) రాధాకృష్ణన్ చెప్పారు. టైర్ల వ్యాపారంలో కొనసాగుతామని, ఈ వ్యాపారంలో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వ్యూహాత్మక భాగస్వామి సహకారంతో అధిక మార్జిన్లు వచ్చే ఆటోమోటివ్ రేడియల్ టైర్ల విభాగంలోకి బిర్లా టైర్స్ ప్రవేశించే అవకాశాలున్నాయి. రెండేళ్ల క్రితం కేశోరామ్ ఇండస్ట్రీస్ కంపెనీ హరిద్వార్ సమీపంలోని లక్సర్ టైర్ ప్లాంట్‌ను జేకే టైర్స్‌కు రూ.2,000 కోట్లకు విక్రయించింది. ఈ విక్రయం కారణంగా కేశోరామ్ కంపెనీ రుణ భారం భారీగా తగ్గింది. కాగా ప్రత్యేక కంపెనీగా విడిపోయిన బిర్లా టైర్స్ టర్నోవర్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,453 కోట్లుగా ఉంది. ఇది మొత్తం కేశోరామ్ ఇండస్ట్రీస్ కంపెనీ ఆదాయంలో 39 శాతానికి సమానం. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.67 కోట్లుగా ఉన్న టైర్ల విభాగం నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెట్టింపై రూ.129 కోట్లకు పెరిగాయి. -
చిచ్చరపిడుగు స్టంట్.. వైరల్
పట్టుమని పదేళ్లు కూడా నిండని ఓ బుడ్డొడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సరదాగా వీధుల్లో ఆడుకుంటున్న ఓ కుర్రాడు.. బైక్ టైర్‌తో భలే విన్యాసాలు చేశాడు. టైర్ మధ్యలో దూరిపోయి ఎంచక్కా వీధుల్లో చక్కర్లు కొట్టేశాడు. పళ్లం వైపు పర్లాంగు దూరం వెళ్లాక తిరిగి.. రివర్స్‌లో కాళ్లతో తోసుకుంటూ దూసుకురావటమే ఇక్కడ అసలు కొసమెరుపు. ఎక్కడ జరిగిందో? ఎప్పుడు జరిగిందో? స్పష్టత లేదు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫీట్‌ను చూసిన వారంతా నోళ్లు వెళ్లబెడుతున్నారు. అయితే ఈ చిచ్చరపిడుగు స్టంట్‌ను సరదాకి కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించకండని, అది చాలా ప్రమాదకరమని పిల్లలకు సూచిస్తూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. -
బైక్ టైర్‌తో బుడ్డొడి విన్యాసం..వీడియో వైరల్
-
ఇదేంటో గుర్తుపట్టారా ?.. తప్పిన భారీ ప్రమాదం
సాక్షి, చెన్నై : పైన ఫోటోలో ఏముందో గుర్తుపట్టారా ? ల్యాండ్ అయిన తర్వాత స్పైస్ జెట్ విమాన టైర్లు పేలడంతో రన్వేతే రాపిడి జరిగి ఫోటోలో ఉన్న ఆకారానికి వచ్చాయి. 199 మంది ప్రయాణికులతో గురువారం చెన్నై నుంచి ఢిల్లీ వెలుతున్న విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. టైర్లను లిఫ్ట్ చేసే హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్య ఏర్పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్ వే నుంచి టేకాఫ్ అవుతుండగా విమానం టైరు పేలినట్టు సిబ్బంది గుర్తించారు. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సురక్షితంగా తిరిగి చెన్నై విమానాశ్రయంలో దించారు. విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించి, తిరిగి టెర్మినల్ బిల్డింగ్‌లోకి తీసుకెళ్లారు. టైర్ పేలిన ఘటనతో మెయిన్ రన్ వే పాడయ్యింది. దీంతోమూడు గంటలపాటూ మెయిన్ రన్‌వేను మూసివేశారు. సంబంధిత వార్త : టేకాఫ్ అవుతుండగా పేలిన టైర్ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
బనగానపల్లె రూరల్: బనగానపల్లె - నంద్యాల రహదారిలో కైప సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. బనగానపల్లె నుంచి నంద్యాలకు వెళ్తున్న ఆటో టైరు పేలడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో టంగుటూరులో ఉన్న కుమార్తెను చూసి వెళ్తున్న వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన మారంరెడ్డి రామసుబ్బారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. బనగానపల్లెలో బంధువులను కలసి వెళ్తున్న వెలుగోడుకు చెందిన అబ్దుల్ హఫీజ్ తీవ్రంగా గాయపడటంతో 108లో బనగానపల్లెకు తరలించారు. సమాచారం అందుకున్న నందివరఽ్గం ఎస్ఐ నరేంద్ర కుమార్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని బనగానపల్లె ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి నేత్రాలు దానం: రామసుబ్బారెడ్డి నేత్రాలు దానం చేయాలని ఆయన కుమార్తెలు భవాని, శివవెంకటసుబ్బమ్మ, పావనమ్మను ఎస్ఐ కోరడంతో అంగీకరించారు. నంద్యాల శాంతిరామ్ మెడికల్ వైద్యశాల వైద్యాధికారులకు ఎస్ఐ సమాచారం ఇవ్వడంతో బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని మృతుడి నేత్రాలను సేకరించారు. నేత్రదానానికి సహకారం అందించిన హెచ్ఎల్సీ చైర్మన్ శ్రీనివాసరెడ్డితోపాటు మృతుని కుటుంబ సభ్యులను ఎస్ఐ అభినందించారు. -
ఈ షేరు ధర రూ.50 వేలు
ముంబై: దేశీయ టైర్ల ఉత్పత్తి సంస్థ మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ (ఎంఆర్ఎఫ్) షేర్ ధర బుధవారం నాటి మార్కెట్లో రికార్డ్ స్థాయిలో దూసుకుపోయింది. ముడిచమురు ధరలు క్షీణించడంతో ఇటీవల కొద్ది రోజులుగా జోరుమీదున్న టైర్ల ధరలు ఈ రోజు భారీ లాభాల బాటలో సాగాయి. ముఖ్యంగా టైర్ల తయారీ దిగ్గజం ఎంఆర్ఎఫ్ బీఎస్ఈలో 7 శాతం ఎగసి కంపెనీ చరిత్రలో మొట్టమొదటిసారిగా రూ. 50,000 స్థాయిని తాకింది. చెన్నైకు చెందిన ఈ కంపెనీ షేరు సుమారు 3వేలకు పైగా ఎగిసి మదుపర్లు ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇదే బాటలో మిగిలిన టైర్ల షేర్లుకూడా పయనించాయి. ముఖ్యంగా జేకే టైర్ 8 శాతానికి పైగా, అపోలో టైర్స్ ,సియట్ టైర్స్ 5 శాతానికి పైగా లాభపడ్డాయి. కాగా కంపెనీల ముడిసరుకు వ్యయాల్లో నేచురల్ రబ్బర్ వాటా 40 శాతం కావడమే దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. సహజ రబ్బర్ ధరలు నేలచూపులు చూస్తుండటంతో ఇటీవల టైర్ల తయారీ షేర్లకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. దీనికితోడు రుతుపవన ప్రభావంతో రబ్బర్ ఉత్పత్తి పుంజుకోనుంది. ఈ సానుకూల అంశాలు టైర్ పరిశ్రమ లాభాలకు దోహదపడ్డాయని నిపుణులు పేర్కొన్నారు. -
ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం
-
విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
భోపాల్: భోపాల్‌లో ఎయిర్ ఇండియా విమానానం భారీ ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. బుధవారం ల్యాండింగ్ సమయంలో విమానం టైరు పేలింది. అయితే పైలెట్ సమయ స్పూర్తితో వ్యవహరించి పెను ప్రమాదం నుంచి తప్పించాడు. దీంతో విమానంలో ఉన్న 95 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. -
టూరిస్టు బస్సు బోల్తా.. 8 మందికి గాయాలు
గీసుకొండ(వరంగల్): వరంగల్-నర్సంపేట రహదారిపై గంగదేవిపల్లి గ్రామ సమీపంలో బుధవారం బెంగళూరు వాసులు ప్రయాణిస్తున్న మినీ టూరిస్ట్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గీసుకొండ ఎస్ఐ అంజన్‌రావు కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన 16 మంది టూరిస్ట్ బస్సులో భద్రాచలం వెళ్లి వస్తున్నారు. గంగదేవిపల్లి సమీపంలోకి రాగానే వెనుక టైర్ పగిలి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బెంగుళూరు యాలంక ప్రాంతానికి చెందిన వెరుముడి తులశమ్మ, జానకమ్మ, మమత, రష్మి, సుబ్రహ్మణి, డ్రైవర్ జాఫర్ అలీతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితులను 108లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గీసుకొండ ఎస్ఐలు అంజన్‌రావు, నవీన్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రన్‌వేపై పేలిన విమానం టైరు
చెన్నై(టీనగర్): చెన్నై విమానాశ్రయంలో సోమవారం అండమాన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం వెనుక టైర్ పేలడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చెన్నై నుంచి అండమాన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం సోమవారం ఉదయం 11.10 గంటలకు డొమెస్టిక్ టెర్మినల్ నుంచి బయలుదేరింది. విమానంలో 77 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. రన్‌వేపై వెళుతుండగా హఠాత్తుగా విమానం వెనుక టైరు భారీ శబ్దంతో పేలిపోయింది. భీతిల్లిన ప్రయాణికులు బిగ్గరగా కేకలు వేశారు. పెలైట్ చాకచక్యంగా అదుపులోకి తీసుకుని రన్‌వేపై నిలిపివేశారు. వెంటనే భద్రతా అధికారులు, విమానాశ్రయ ఉన్నతాధికారులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రయాణికులను వరుసగా కిందికి దింపారు. ఎవరికీ ఏమీ కాలేదు. విమానాశ్రయంలో వారికి బస కల్పించారు. విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది విచారణ చేస్తున్నారు. -
పార్లమెంటు వద్ద పరుగులు పెట్టించిన టైరు
సోమవారం ఉదయం.. పార్లమెంటు సమావేశాలు అప్పటికే ప్రారంభమయ్యాయి.. ఈలోపు పార్లమెంటు ఆవరణకు సమీపంలోని విజయ్ ఘాట్ వద్ద ఉన్నట్టుండి పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. దాంతో భద్రతా దళాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అసలే పంజాబ్ గురుదాస్‌పూర్ కాల్పుల ఘటనతో తీవ్రం ఆందోళనలో పడిపోయిన సెక్యూరిటీ వర్గాలు ఈ పేలుడుతో పరుగులు పెట్టాయి. మరో టెర్రర్ ఎటాక్ జరిగిందేమోనని కంగారు పడ్డాయి. తీరా చూస్తే.. పేలింది ఒక బస్సు టైరు అని తెలిసి ఊపిరి పీల్చుకున్నాయి. పార్లమెంటు ఆవరణకు సమీపంలో విజయ్ ఘాట్ దగ్గర ఈ పేలుడు సంభవించిందని పోలీస్ వర్గాలు ప్రకటించాయి. ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నాయి. మరోవైపు ఉగ్రవాదులు పోలీసు దుస్తుల్లో పంజాబ్‌లోని దీనానగర్ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి కాల్పులకు తెగబడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. దీనికి సంధించిన, కేంద్ర హోం శాఖ, ఢిల్లీ కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెంటనే స్పందించాయి. పంజాబ్, హర్యానా, జమ్ము కశ్మీర్ వైపు నుంచి రాజధాని నగరంలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పోలీసు అధికారులను కూడా వదలకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. న్యూఢిల్లీలోని దాదాపు 180 పోలీస్ స్టేషన్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. చాలాప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. అగ్నిమాపక దళాలు, ఆస్పత్రులను అప్రమత్తం చేశారు. -
ఎయిర్ ఇండియాకు తప్పిన ముప్పు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఎయిర్ ఇండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. శ్రీనగర్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో రన్ వే పై విమానం టైరు ఒక్కసారిగా పేలడంతో భయాందోళన నెలకొంది. ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలోని ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. రన్ వే ను క్లియర్ చేయడానికి కనీసం గంట సమయం పడుతుందని, దీని మూలంగా మిగిలిన విమానాలకు ఆలస్యమయ్యే అవకాశం వుందని పేర్కొన్నాయి. అందుకే కొన్ని విమానాలను చండీగడ్ విమానాశ్రాయానికి మళ్లిస్తున్నామని తెలిపారు. ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో సిబ్బంది సరఫరా చేసిన ఫుడ్ ప్లేట్లో బల్లి దర్శనమివ్వడంతో కలకలం రేగింది. ఈ వివాదం సద్దుమణగకముందే ఈ సంఘటనతో ప్రయాణీకులు భయభ్రాంతులకు లోనయ్యారు. -
ఈ టైర్ ఎప్పుడూ పంక్చర్ కాదు!
మేకులపై నడిచినా.. గాజుముక్కలు దిగినా ఈ సైకిల్ టైరు ఎప్పుడూ పంక్చర్ కాదు! దీనిలో గాలి కూడా ఉండదు. రబ్బరుకు బదులుగా అతితేలికగా, దృఢంగా ఉండే నానోఫోమ్ అనే పాలిమర్‌తో లండన్‌కు చెందిన టానస్ కంపెనీ దీనిని తయారు చేసింది. బరువు అంతే. సుమారు 430 గ్రాములు ఉంటుంది. మేకులు, ఇతర వస్తువులు గుచ్చుకున్నప్పుడు ఒత్తిడిని తట్టుకోవడం వల్ల పంక్చర్ కాకుండా ఇది ఎప్పుడూ స్థిరంగా ఉంటుందట. ైటె రుకు గుచ్చుకున్న మేకులను అప్పుడప్పుడూ పీకిపారేస్తే సరి.. సుమారు 10 వేల కి.మీ. ప్రయాణం వరకూ చెక్కుచెదరదట. ఒక జత టైర్లకు రూ.8,800. వీటిని పెద్ద ఎత్తున తయారుచేసి మార్కెట్లోకి తెచ్చేందుకు టానస్ సన్నాహాలు చేస్తోంది.