రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం | person died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

Published Thu, Oct 13 2016 7:42 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం - Sakshi

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

బనగానపల్లె రూరల్‌: బనగానపల్లె - నంద్యాల రహదారిలో కైప సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. బనగానపల్లె నుంచి నంద్యాలకు వెళ్తున్న ఆటో టైరు పేలడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో టంగుటూరులో ఉన్న కుమార్తెను చూసి వెళ్తున్న వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన మారంరెడ్డి రామసుబ్బారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. బనగానపల్లెలో బంధువులను కలసి వెళ్తున్న వెలుగోడుకు చెందిన అబ్దుల్‌ హఫీజ్‌ తీవ్రంగా గాయపడటంతో 108లో బనగానపల్లెకు తరలించారు. సమాచారం అందుకున్న నందివరఽ​‍్గం ఎస్‌ఐ నరేంద్ర కుమార్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని బనగానపల్లె ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.     
మృతుడి నేత్రాలు దానం:
రామసుబ్బారెడ్డి నేత్రాలు దానం చేయాలని ఆయన కుమార్తెలు భవాని, శివవెంకటసుబ్బమ్మ, పావనమ్మను ఎస్‌ఐ కోరడంతో అంగీకరించారు. నంద్యాల శాంతిరామ్‌ మెడికల్‌ వైద్యశాల వైద్యాధికారులకు ఎస్‌ఐ సమాచారం ఇవ్వడంతో బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని మృతుడి నేత్రాలను సేకరించారు. నేత్రదానానికి సహకారం అందించిన హెచ్‌ఎల్‌సీ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డితోపాటు మృతుని కుటుంబ సభ్యులను ఎస్‌ఐ అభినందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement