టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల రంగంలోకి ప్రవేశించింది. ఎక్స్‌పోలో భాగంగా కింగ్ ఈవీ మ్యాక్స్‌ను పరిచయం చేసింది. ఇది భారత్‌లో బ్లూటూత్‌తో అనుసంధానించిన తొలి ఎలక్ట్రిక్ త్రీ–వీలర్. స్థిర సాంకేతికతతో పట్టణ మొబిలిటీని పెంచే లక్ష్యంతో దీనిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. టీవీఎస్ స్మార్ట్‌కనెక్ట్‌తో తయారైంది. ఇది స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ ద్వారా రియల్ టైమ్ నావిగేషన్, అలర్ట్స్, వాహన స్థితిగతులను తెలియజేస్తుంది. ఒకసారి చార్జింగ్‌తో 179 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని టీవీఎస్ తెలిపింది. 3 గంటల 30 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ పూర్తి అవుతుంది. 51.2 వోల్ట్ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ పొందుపరిచారు. గంటకు గరిష్ట వేగం 60 కిలోమీటర్లు. ఎక్స్ షోరూం ధర రూ.2.95 లక్షలు.
ఇదీ చదవండి: టిక్‌టాక్ పునరుద్ధరణ.. ట్రంప్ పుణ్యమే..!
మళ్లీ స్కోడా డీజిల్ కార్లు
వాహన తయారీలో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ కంపెనీ స్కోడా అయిదేళ్ల తర్వాత భారత్‌లో డీజిల్ ఇంజన్స్‌ను మళ్లీ ప్రవేశపెడుతోంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో వేదికగా సూపర్బ్ డీజిల్ కారును ప్రదర్శించింది. కొడియాక్ డీజిల్ సైతం త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారతీయ కస్టమర్లు ఇప్పటికీ డీజిల్ కార్లను డిమాండ్ చేస్తున్నారని స్కోడా ఇండియా హెడ్ పీటర్ యానిబా తెలిపారు. ‘స్కోడా కార్ల విక్రయాల్లో గతంలో 80 శాతం యూనిట్లు డీజిల్ విభాగం కైవసం చేసుకుంది. హ్యుందాయ్, కియా, టాటా, మహీంద్రా అమ్మకాల్లో గణనీయ భాగం డీజిల్ వాహనాలు సమకూరుస్తున్నాయి. లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్, బీఎండబ్ల్యూలకు కూడా అంతే. కాబట్టి లగ్జరీ, ఎగ్జిక్యూటివ్ సెగ్మెంట్ల మధ్యలో ఉన్న స్కోడా ఈ మార్పు నుండి గణనీయంగా ప్రయోజనం పొందుతుంది. మేము కచి్చతంగా డిమాండ్‌ను నెరవేర్చడానికి చూస్తున్నాం’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment