Skoda Auto
-
10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..
చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) ఇటీవలే మార్కెట్లో 'కైలాక్' పేరుతో ఓ కాంపాక్ట్ ఎస్యూవీ లాంచ్ చేసింది. అయితే 10 రోజుల ముందే దీని కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాగా ఇప్పటికి ఈ ఎస్యూవీ బుకింగ్స్ 10,000 దాటినట్లు సమాచారం. కాగా బుక్ చేసుకున్న కస్టమర్లకు 2025 జనవరి 27న డెలివరీలు ప్రారంభమవుతాయి.స్కోడా కైలాక్ అనేది MQB A0-IN ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మితమైన మొదటి కాంపాక్ట్ ఎస్యూవీ. ఇది ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న కుషాక్ కింద ఉంటుంది. క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, ప్రెస్టీజ్ అనే నాలుగు వేరియంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ధర రూ. 7.89 లక్షలు (ఎక్స్ షోరూమ్).మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ , మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న స్కోడా కైలాక్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 113 Bhp పవర్, 178 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.ఇదీ చదవండి: భారత్‌లోని బెస్ట్ 5 డీజిల్ కారు ఇవే!.. పూర్తి వివరాలుఫీచర్స్ విషయానికి వస్తే.. కైలాక్ 8 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో కూడిన 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, కాంటన్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. -
దిగ్గజ ఆటో కంపెనీల మధ్య ఒప్పందం?
మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్) త్వరలో కీలక ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. త్వరలో ముంబయిలో ఈ రెండు సంస్థలకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లు సమావేశం కాబోతున్నట్లు చెప్పారు.ఈ సమావేశంలో ఇరు సంస్థల మధ్య భాగస్వామ్యం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కంపెనీల ఉత్పత్తులు, తయారీ యూనిట్ల వినియోగం, టెక్నాలజీ, వంటి అంశాలపై ఇరుపక్షాలు దృష్టి సారించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్ భారత్‌లో పుణె, ఔరంగబాద్‌లోని తయారీ యూనిట్లను కలిగి ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా మహారాష్ట్రలోని చకన్లో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని స్థల సేకరణలో నిమగ్నమైనట్టు సమాచారం. మొత్తంగా ఆటోమోటివ్ పరిశ్రమకు సమీపంలో ఉండాలన్నది కంపెనీ భావన. మల్టీ ఎనర్జీ ప్లాట్‌ఫామ్ అయిన న్యూ ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ (ఎన్ఎఫ్ఏ) ఆధారిత వాహనాలను ఇక్కడ తయారు చేయబోతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: చాట్‌జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..? -
స్పోర్టీ డిజైన్‌తో స్కోడా ఎలక్ట్రిక్ ఎస్యూవీ: అదిరిపోయే ఫీచర్స్
సాక్షి,ముంబై: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఎన్యాక్ ఐవీ వీఆర్ఎస్' (Enyaq iV vRS) పేరుతో అంతర్జాతీయ మార్కెట్లో విడుదల లాంచ్ చేసింది. స్పోర్టీ-డిజైన్‌తో వస్తున్న ఈ కారు కేవలం 6.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందు కుంటుందని కంపెనీ తెలిపింది. గంటకు 278 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించనుంది. అంతేకాదు ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని స్కోడా ఆటో ప్రకటించింది. ఈ కారు ధర విషయానికి వస్తే మన దేశంలో సుమారు రూ. 48.6 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎన్యాక్ ఐవీ వీఆర్ఎస్ స్పెసిఫికేషన్స్ ఎకో, కంఫర్ట్, నార్మల్, స్పోర్ట్, ట్రాక్షన్ అనే ఐదు డ్రైవింగ్ మోడ్లతో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. తమ డ్రైవింగ్‌కి అనుగుణంగా వినియోగ దారులు ఈ వెహికల్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులోని 82 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 296 బీహెచ్పీ పవర్‌ని అందిస్తుంది. కేవలం 36 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే గ్లాసీ-బ్లాక్ ఫ్రంట్ ఏప్రాన్లు, డోర్ మిర్రర్లు, రియర్ డిఫ్యూజర్ తో పాటు మరిన్ని స్పోర్టీ ఫీచర్లను జోడించింది. ఇంటీరియర్‌గా ఫాక్స్ లెదర్ ఫినిషింగ్, డ్యాష్ బోర్డ్ ను కార్బన్ ఫైబర్‌తోనూ రూపొందించింది. 13 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 'క్రిస్టల్ ఫేస్' ఫ్రంట్ గ్రిల్, ముందువైపు ఎల్ఈడీ లైట్లు, క్రోమ్ గ్రిల్, ఆకర్షణీయమైన ఎల్లోయ్ వీల్స్, రూఫ్ రైల్స్ లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. -
స్కోడా కీలక నిర్ణయం..సెకండ్ హ్యండ్ కార్ల కొనుగోలు ఇప్పుడు మరింత సులువు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్కోడా ఆటో ఇండియా ప్రీ–ఓన్డ్ కార్ల వ్యాపారంలో విస్తరిస్తోంది. దేశంలో 100కుపైగా డీలర్‌షిప్స్‌ను ఏర్పాటు చేసినట్టు కంపెనీ బుధవారం ప్రకటించింది. పాత కారు కొనుగోలు, విక్రయం.. లేదా పాత కారును ఇచ్చి కొత్త కారును ఈ కేంద్రాల్లో మార్పిడి చేసుకోవచ్చు. సర్టిఫైడ్ ప్రీ–ఓన్డ్ నెట్వర్క్ ద్వారా ఇప్పటికే 2,500లకుపైగా కార్లను విక్రయించినట్టు స్కోడా వెల్లడించింది. 115 క్వాలిటీ చెక్ పాయింట్స్ ఆధారంగా కారును ధ్రువీకరిస్తున్నట్టు తెలిపింది. చదవండి: ఫిబ్రవరిలో పెరిగిన ఉపాధి కల్పన.. కొత్తగా 14.12 లక్షల మంది -
ఆ కారులో ఏముందబ్బా, విరగబడి కొంటున్నారట!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా..జూలై నెలలో మెరుగైన ప్రతిభ కనబరిచింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాల్లో 234 శాతం వృద్ధి నమోదు చేసింది. 2021 జూన్‌తో పోలిస్తే 320 శాతం వృద్ధి సాధించింది. గత నెలలో కంపెనీ దేశవ్యాప్తంగా 3,080 కార్లను విక్రయించింది. 2020 జూలైలో ఈ సంఖ్య 922 మాత్రమే. ఈ ఏడాది జూన్‌లో కొత్తగా 734 కార్లు మాత్రమే రోడ్డెక్కాయి. జూలై అమ్మకాల జోరుకు కుషాక్ మోడల్ కీలకమని కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ తెలిపారు. ఆవిష్కరించిన నెలరోజుల్లోనే సుమారు 6,000 బుకింగ్స్‌ను కుషాక్ సొంతం చేసుకుందని చెప్పారు. కొత్తగా డీలర్షిప్ కేంద్రాల ఏర్పాటుకు 200 పైచిలుకు దరఖాస్తులు వచ్చాయని వివరించారు. గత నెలలో నెట్వర్క్ 15 శాతం విస్తరించినట్టు పేర్కొన్నారు. కుషాక్ ఫీచర్స్ స్కోడా తన కొత్త మోడల్ కుషాక్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా తయారయ్యే తొలి ఉత్పత్తిగా కుషాక్ విడుదలై ఎస్యూవీ విభాగంలోని హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మోడళ్లకు సరికొత్త కుషాక్ పోటీ ఇచ్చింది. అందుకు కారణం ఆ కారు ఫీచర్లేనని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు మనం ఆ కారు ఫీచర్లు ఎలా ఉన్నయో తెలుసుకుందాం. రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్‌లో ఇది లభ్యం. బేస్ వేరియంట్లో 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను జత చేసింది. ఇక టాప్-ఆఫ్-లైన్ మోడల్ ఎస్‌యూవీలో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చింది.1.5-లీటర్ వేరియంట్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 147.5 బిహెచ్పి మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ను టార్క్ అందిస్తుంది. 1.0-లీటర్ ఇంజన్ వేరియంట్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 114 బిహెచ్పి పవర్, 1,750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. హనీ ఆరెంజ్, టోర్నడో రెడ్, కాండీ వైట్, రిఫ్లెక్స్ సిల్వర్, కార్బన్ స్టీల్ అనే ఐదు కలర్ వేరియంట్లలో లభ్యం. నాలుగు సంవత్సరాల / 1,00,000కిలోమీటర్ల వారంటీతో పూర్తి “పీస్ ఆఫ్ మైండ్” మీ సొంతం అంటోంది. దీన్ని ఆరు సంవత్సరాల వరకు లేదా, 1,50,000 కిమీ వరకు పొడిగించుకోవచ్చు. అంతేకాదు 2 సంవత్సరాల పార్ట్స్ వారంటీ, 2 సంవత్సరాల బ్యాటరీ వారంటీ, 3 సంవత్సరాల పెయింట్ వారంటీ, 6 సంవత్సరాల తుప్పు వారంటీ 9 సంవత్సరాల వరకు విస్తరించిన రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రాం కూడా అందిస్తుంది. -
స్కోడా ఎలక్ట్రిక్ కార్లు త్వరలోనే..!
ప్రముఖ దిగ్గజ కార్ల కంపెనీ స్కోడా రాబోయే దశాబ్దానికి తన సరికొత్త- స్కోడా ఆటో స్ట్రాటజీ 2030 ను ప్రకటించింది. ఈ వ్యూహంతో మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వాహనాలు త్వరగా రావడానికి కీలక పాత్ర పోషించనుంది. చెక్ కార్ల తయారీదారు స్కోడా 2030 నాటికి కనీసం మూడు ఎలక్ట్రిక్ కారు మోడళ్లను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ కార్లు స్కోడా ENYAQ iV సిరీస్‌కు తదనంతర కారు మోడళ్లగా నిలుస్తాయని కంపెనీ తెలిపింది. స్కోడా తన కంపెనీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు ENYAQ iVను గత సంవత్సరం సెప్టెంబర్‌లో కారు టీజర్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం స్కోడా ENYAQ iV కార్ల ఉత్పత్తి వేగంగా జరుగుతుంది. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని యూరోప్‌లో 50 నుంచి 70 శాతం మధ్య పూర్తి ఎలక్ట్రిక్ మోడళ్ల వాటాను స్కోడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎలక్ట్రిక్ కార్లు సుమారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 340కి.మీ. నుంచి 510 కి.మీ వచ్చేలా బ్యాటరీలను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నఅగ్రశ్రేణి ఎలక్ట్రిక్ కార్ల తయారీదారులకు పోటీగా ప్రజలకు సరసమైన ధరలకే అందించాలని స్కోడా భావిస్తోంది. అంతేకాకుండా స్కోడా ఎలక్ట్రిక్ కార్ల కోసం సొంత ఛార్జింగ్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఐరోపాలో 2030లోపు సుమారు 2,10,000 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. స్కోడా తొలుత ఎలక్ట్రిక్ కార్లను ఇండియాలో ప్రవేశ పెట్టకూడదని భావించినా, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌పై దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ కార్లను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆటోమోబైల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. చదవండి: మార్కెట్లోకి స్కోడా ఆక్టావియా ఫోర్త్ జనరేషన్ కారు -
స్కోడా ఆటో అతిపెద్ద వర్క్‌షాప్ ప్రారంభం
కోయంబత్తూర్: దేశంలోనే అతిపెద్ద వర్క్‌షాప్‌ను స్కోడా ఆటో ఇండియా తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఏర్పాటు చేసింది. ‘ఇండియా 2.0’ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎస్జీఏ కార్స్ ఇండియాతో కలిసి ఈ సర్వీస్ అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. ఏడాదికి 20,000 స్కోడా వాహనాలను సర్వీసింగ్ చేయగలిగే విధంగా 49,585 చదరపు అడుగుల్లో ఈ సెంటర్ రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా సంస్థ సేల్స్, సర్వీస్, అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ జాక్ హోల్లిస్ మాట్లాడుతూ.. ‘దక్షిణ భారతదేశంలో మార్కెట్ వాటా పెంచాలనే లక్ష్యంతో కార్పొరేట్ ప్రమాణాలతో వర్క్‌షాప్‌ను ప్రారంభించాం. కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే భావనతో అధునాతన సేవలను అందిస్తున్నాం’ అని అన్నారు. -
స్కోడా కొత్త రాపిడ్-8.34 లక్షలు
ముంబై: ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌కు చెందిన ‘స్కోడా ఆటో’ తాజాగా తన ప్రముఖ సెడాన్ ‘రాపిడ్’లో కొత్త వెర్షన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.8.34-రూ.12.78 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఈ కొత్త వెర్షన్ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్సమిషన్ రకాల్లో 1.6 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది రాపిడ్ వాహన విక్రయాల్లో 30-40 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు స్కోడా ఇండియా చైర్మన్ సుధీర్ రావు తెలిపారు. రాపిడ్ అమ్మకాలు గతేడాది 11,000 యూనిట్లు కాగా... ఈ ఏడాది 15,000 యూనిట్లుగా, వచ్చే ఏడాది 20,000 యూనిట్లుగా లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారాయన. వచ్చే ఏడాది కొత్తగా ఐదు ఔట్లెట్లను ఏర్పాటు చేస్తామని, దీంతో మొత్తం ఔట్లెట్ల సంఖ్య 70కి చేరుతుందని చెప్పారు. -
మళ్లీ ఆక్టేవియా
న్యూఢిల్లీ: స్కోడా ఆటో ఇండియా కంపెనీ తన ప్రీమియం సెడాన్, ఆక్టేవియాను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. మూడేళ్ల తర్వాత ఈ మోడల్‌ను మళ్లీ ఈ కంపెనీ అందిస్తోంది. ఈ ఆక్టేవియా కారు నాలుగు వేరియంట్ల( 2 లీటర్ డీజిల్(ఒకటి ఆటోమాటిక్, ఇంకొకటి మాన్యువల్), 1.4 లీటర్ పెట్రోల్, 1.8 లీటర్ పెట్రోల్)లలో లభిస్తుందని స్కోడా ఆటో ఇండియా ఎండీ, సుధీర్ రావు చెప్పారు. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.13.95 లక్షల నుంచి రూ.18.25 లక్షల రేంజ్లో, డీజిల్ వేరియంట్ ధరలు రూ.15.55 లక్షల నుచి రూ.19.45 లక్షల రేంజ్లో ఉన్నాయని వివరించారు. ఇప్పటివరకూ ఈ కొత్త ఆక్టేవియా కోసం 500 బుకింగ్స్ వచ్చాయని చెప్పారు. కొత్త ఆక్టేవియా రాకతో ప్రస్తుతమున్న ప్రీమియం సెడాన్ లౌరాను క్రమంగా మార్కెట్ నుంచి ఉపసంహరిస్తామని, అయితే ఆర్డర్లపై ఈ కార్లను అందించే అవకాశముందని వివరించారు. త్వరలోనే చిన్న కారును కూడా భారత మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు. ఆక్టేవియా కారును స్కోడా కంపెనీ 2001లో మార్కెట్లోకి తెచ్చింది. 2010 వరకూ 45 వేల కార్లను విక్రయించింది. ఆ తర్వాత అమ్మకాలు ఆపేసింది.