స్కోడా కొత్త రాపిడ్-8.34 లక్షలు | Another one in Mo-town! Skoda wheels in New Rapid at Rs 8.34 lakh | Sakshi
Sakshi News home page

స్కోడా కొత్త రాపిడ్-8.34 లక్షలు

Published Fri, Nov 4 2016 1:06 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

స్కోడా కొత్త రాపిడ్-8.34 లక్షలు

స్కోడా కొత్త రాపిడ్-8.34 లక్షలు

ముంబై: ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌కు చెందిన ‘స్కోడా ఆటో’ తాజాగా తన ప్రముఖ సెడాన్ ‘రాపిడ్’లో కొత్త వెర్షన్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.8.34-రూ.12.78 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఈ కొత్త వెర్షన్ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్‌‌సమిషన్ రకాల్లో 1.6 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది రాపిడ్ వాహన విక్రయాల్లో 30-40 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు స్కోడా ఇండియా చైర్మన్ సుధీర్ రావు తెలిపారు. రాపిడ్ అమ్మకాలు గతేడాది 11,000 యూనిట్లు కాగా... ఈ ఏడాది 15,000 యూనిట్లుగా, వచ్చే ఏడాది 20,000 యూనిట్లుగా లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారాయన. వచ్చే ఏడాది కొత్తగా ఐదు ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తామని, దీంతో మొత్తం ఔట్‌లెట్ల సంఖ్య 70కి చేరుతుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement