మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (ఎస్‌ఏవీడబ్ల్యూఐపీఎల్) త్వరలో కీలక ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. త్వరలో ముంబయిలో ఈ రెండు సంస్థలకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లు సమావేశం కాబోతున్నట్లు చెప్పారు.
ఈ సమావేశంలో ఇరు సంస్థల మధ్య భాగస్వామ్యం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కంపెనీల ఉత్పత్తులు, తయారీ యూనిట్ల వినియోగం, టెక్నాలజీ, వంటి అంశాలపై ఇరుపక్షాలు దృష్టి సారించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎస్‌ఏవీడబ్ల్యూఐపీఎల్ భారత్‌లో పుణె, ఔరంగబాద్‌లోని తయారీ యూనిట్లను కలిగి ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా మహారాష్ట్రలోని చకన్‌లో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని స్థల సేకరణలో నిమగ్నమైనట్టు సమాచారం. మొత్తంగా ఆటోమోటివ్ పరిశ్రమకు సమీపంలో ఉండాలన్నది కంపెనీ భావన. మల్టీ ఎనర్జీ ప్లాట్‌ఫామ్ అయిన న్యూ ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ (ఎన్‌ఎఫ్‌ఏ) ఆధారిత వాహనాలను ఇక్కడ తయారు చేయబోతున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: చాట్‌జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..?
Comments
Please login to add a commentAdd a comment