Mahindra company
-
దిగ్గజ ఆటో కంపెనీల మధ్య ఒప్పందం?
మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్) త్వరలో కీలక ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. త్వరలో ముంబయిలో ఈ రెండు సంస్థలకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లు సమావేశం కాబోతున్నట్లు చెప్పారు.ఈ సమావేశంలో ఇరు సంస్థల మధ్య భాగస్వామ్యం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కంపెనీల ఉత్పత్తులు, తయారీ యూనిట్ల వినియోగం, టెక్నాలజీ, వంటి అంశాలపై ఇరుపక్షాలు దృష్టి సారించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్ భారత్‌లో పుణె, ఔరంగబాద్‌లోని తయారీ యూనిట్లను కలిగి ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా మహారాష్ట్రలోని చకన్లో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని స్థల సేకరణలో నిమగ్నమైనట్టు సమాచారం. మొత్తంగా ఆటోమోటివ్ పరిశ్రమకు సమీపంలో ఉండాలన్నది కంపెనీ భావన. మల్టీ ఎనర్జీ ప్లాట్‌ఫామ్ అయిన న్యూ ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ (ఎన్ఎఫ్ఏ) ఆధారిత వాహనాలను ఇక్కడ తయారు చేయబోతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: చాట్‌జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..? -
1000 మందికి రూ.10 వేల చొప్పున స్కాలర్షిప్
ట్రక్ డ్రైవర్ల కుమార్తెల ఉన్నత చదువుల కోసం మహీంద్రా గ్రూప్ ఉపకారవేతనాలు అందిస్తుంది. మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (ఎంటీబీడీ) ఆధ్వర్యంలో డ్రైవర్స్ డే 2024ని పురస్కరించుకుని ‘మహీంద్రా సార్థి అభియాన్’ పేరుతో స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రకటించింది. 2025 సంవత్సరానికిగాను ప్రతిభావంతులైన 1000 మంది విద్యార్థినులకు పైచదువుల కోసం రూ.10 వేలు చొప్పున ఉపకారవేతనం ఇవ్వనున్నారు.మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు వినోద్ సహాయ్ మాట్లాడుతూ..‘మహీంద్రా సార్థి అభియాన్ ద్వారా ట్రక్ డ్రైవర్ల కుమార్తెల ఉన్నత చదువుల కోసం సాయం చేస్తున్నాం. మహిళాసాధికారతకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పదో తరగతి పూర్తయి పైచదువులు చదివాలనుకునే ప్రతి ట్రక్ డ్రైవర్ కుమార్తె ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000 ఇవ్వడంతోపాటు గుర్తింపు సర్టిఫికెట్ కూడా అందిస్తాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దుఈ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి కమర్షియల్ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా కావడం విశేషం అని అధికారులు తెలిపారు. 2014లో ఈ పథకాన్ని ప్రారంభించిన కంపెనీ ఇప్పటివరకు 10,029 మందికి ఉపకారవేతనాలు అందించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 75 ట్రాన్స్పోర్ట్ హబ్‌లను గుర్తించి ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి వరకు దరఖాస్తు గడువుగా నిర్ణయించారు. విద్యార్థినుల మెరిట్, కంపెనీ నిబంధనల ఆధారంగా స్క్రీనింగ్ చేసి స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు. ఇందుకోసం సంస్థ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తుంది. -
ఎక్స్‌యూవీ700 ఫీచర్స్.. ఫ్రీమియం హోసింగ్! ఇదే టార్గెట్
రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో 'మహీంద్రా లైఫ్‌స్పేస్' తనను తాను ప్రీమియం హౌసింగ్ కంపెనీగా రీబ్రాండ్ చేసుకోవాలని.. ముంబై, పూణె, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని యోచిస్తున్నట్లు.. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అమిత్ కుమార్ సిన్హా అన్నారు.అమిత్ కుమార్ సిన్హా.. మహీంద్రా కార్లను గురించి ప్రస్తావిస్తూ, అద్భుతమైన ఫీచర్స్ కలిగిన బ్రాండ్ (మహీంద్రా) కార్ల మాదిరిగానే గృహాలను కూడా ఫ్రీమియం సౌకర్యాలతో అందించడమే లక్ష్యమని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయాలని పేర్కొన్నారు.మహీంద్రా XUV700 కారును ఉపయోగించే వినియోగదారుడు ఎంత అనుభూతి పొందుతాడో.. తప్పకుండా మహీంద్రా లైఫ్‌స్పేస్ గృహాలు కూడా అంత అనుభూతిని అందించేలా రూపొందిస్తామని అమిత్ అన్నారు. మా ప్రాజెక్ట్ నిర్మించే గృహాలు.. ఉత్తమమైన స్థలంలో, పచ్చదనం, కావలసిన సౌకర్యాలను అందిస్తాయని అన్నారు.మహీంద్రా లైఫ్‌స్పేస్ ముంబై, పూణె, బెంగళూరులలో తన ఉనికిని మరింత విస్తరించడంపై దృష్టి పెట్టాయి. దీనికోసం కంపెనీ ఏకంగా రూ. 45000 కోట్లను వెచ్చిస్తోంది. అంతే కాకుండా 2028నాటికి రూ. 8000 కోట్ల నుంచి రూ. 10000 కోట్ల మధ్య ప్రీ-సేల్స్ సాధించడం కంపెనీ లక్ష్యం అని అమిత్ కుమార్ సిన్హా పేర్కొన్నారు. -
కార్ డిజైనర్ థార్ డిజైనర్!
మహింద్రా థార్‌ను చూసి భలే ఉందే అనుకున్నారా? దానిని డిజైన్ చేసింది ఒక స్త్రీ అని చాలామంది అనుకోరు. ఎందుకంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మగవారి ప్రాబల్యం ఎక్కువ. కాని క్రిపా అనంతన్ గొప్ప కార్ డిజైనర్‌గా ఈ రంగంలో తన ప్రభావం చూపుతోంది. మహింద్రాలో హిట్ అయిన అనేక ఎస్‌యువీలను ఆమే డిజైన్ చేసింది. ఇపుడు ఓలాకు డిజైన్ హెడ్‌గా పని చేస్తూ ఉంది. మహింద్రా సంస్థకు గొప్ప పేరు తెచ్చిన ‘థార్’ను క్రిపా అనంతన్ డిజైన్ చేసింది. ఆమె వయసు 53. పూర్తి పేరు రామ్క్రిపా అనంతన్ అయితే అందరూ క్రిపా అని పిలుస్తారు. ‘ఆటోమొబైల్ డిజైనర్ కూడా చిత్రకారుడే. కాకపోతే చిత్రకారుడు కాగితం మీద రంగులతో గీస్తే మేము లోహాలకు రూపం ఇస్తాం... శక్తి కూడా ఇచ్చి కదలిక తెస్తాం’ అంటుంది క్రిపా. బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన క్రిపా ఆ తర్వాత ఐ.ఐ.టి ముంబైలో ఇండస్ట్రియల్ డిజైన్ చదివి 1997లో మహింద్రాలో ఇంటీరియర్ డిజైనర్‌గా చేరింది. ఆ సమయంలో తయారైన వాహనాలు– బొలెరో, స్కార్పియోలకు ఇంటీరియర్ డిజైన్ పర్యవేక్షించింది. ఆమె ప్రతిభను గుర్తించిన సంస్థ కొత్త ఎస్‌యువిని తేదలిచి దాని డిజైనింగ్ బాధ్యతలు అప్పజెప్పింది. సాధారణంగా ప్రయాణాలంటే ఇష్టపడే క్రిపా తన టూ వీలర్– బజాజ్ అవెంజర్ మీద మనాలి నుంచి శ్రీనగర్ వరకూ ఒక్కతే ప్రయాణిస్తూ వాహనం ఎలా ఉండాలో ఆలోచించింది. అంతేకాదు దాదాపు 1500 మందిని సర్వే చేయించి ఎస్యువి ఎలా ఉంటే బాగుంటుందో సూచనలు తీసుకుంది. ‘మహింద్రా ఏ బండి తయారు చేసినా దాని రూపం ఘనంగా ఉండాలి. చిన్నబండి అయినా తన ముద్ర వేయాలి. నేను సాధారణంగా ప్రకృతి నుంచి అటవీ జంతువుల నుంచి వాహనాల డిజైన్లు చూసి ఇన్‌స్పయిర్ అవుతాను. చీటాను దృష్టిలో పెట్టుకుని నేను అనుకున్న డిజైన్ తయారు చేశాను’ అందామె. ఆ విధంగా ఆమె పూర్తిస్థాయి డిజైన్‌తో మహింద్రా ఎస్యువి 500 మార్కెట్లోకి వచ్చింది. పెద్ద హిట్ అయ్యింది. దాంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మహిళా డిజైనర్‌గా క్రిపా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇతర వాహనాల డిజైన్ల బాధ్యత కూడా ఆమెకే అప్పజెప్పారు. ‘ప్రతి మనిషికీ ఒక కథ ఉన్నట్టే ప్రతి వాహనానికీ ఒక కథ ఉండాలి. అప్పుడే జనానికి కనెక్ట్ అవుతుంది’ అంటుంది క్రిపా. ఆమె తయారు చేసిన ‘ఎస్యువి 300’ మరో మంచి డిజైన్‌గా ఆదరణ పొందింది. ఇక ‘థార్’ అయితే అందరూ ఆశపడే బండి అయ్యింది. ఇప్పుడు థార్ అమ్మకాలు భారీగా ఉన్నాయి. మహింద్రా సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఉపక్రమిస్తుండగా 2021లో తన సొంత ఆటోమొబైల్ డిజైన్ స్టూడియో ఏర్పాటు కోసం సంస్థ నుంచి బయటకు వచ్చింది క్రిపా. అయితే ఇప్పుడు ఓలా గ్రూప్‌కు డిజైన్హెడ్గా పని చేస్తోంది. అంటే ఇకపై ఓలా గ్రూప్ నుంచి వెలువడే వాహనాలు ఆమె రూపకల్పన చేసేవన్న మాట. ఇరవైమంది డిజైనర్లతో కొత్త ఆలోచనలకు పదును పెట్టే క్రిపా తన బృందంలో కనీసం 5గురు మహిళలు ఉండేలా చూసుకుంటుంది. మహిళల ప్రతిభకు ఎప్పుడూ చోటు కల్పించాలనేది ఆమె నియమం. క్రిపాకు ఏ మాత్రం సమయం దొరికినా పారిస్కో లండన్‌కో వెళ్లిపోతుంది. అక్కడ ఏదైనా కేఫ్‌లో కూచుని రోడ్డు మీద వెళ్లే స్పోర్ట్స్ కార్లను పరిశీలిస్తూ ఉండటం ఆమెకు సరదా. ‘2050 నాటికి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో ఊహించుకుంటూ ఇవాళ్టి నుంచి మన పనిని తీర్చిదిద్దుకోవాలి’ అంటుందామె.ఇంత దార్శనికత ఉన్న డిజైనర్ కనుక విజయం ఆమెకు డోర్ తెరిచి నిలబడుతోంది. (చదవండి: దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా! చివరికి సుప్రీం కోర్టు..) -
క్రికెట్ వరల్డ్ కప్ స్పాన్సర్‌గా మహీంద్రా
దేశీయ కార్పొరేట్ దిగ్గజం మహీంద్రా క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది. త్వరలో ప్రారంభంకానున్న క్రికెట్ వరల్డ్‌కప్-2023 కోసం స్టార్ స్పోర్ట్స్‌తో కలిసి అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు కో పవర్డ్ స్పాన్సర్‌గా పని చేయనుంది. క్రికెట్‌తో తమకున్న అనుబంధాన్ని విస్తరించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహీంద్రా సంస్థ వెల్లడించింది. కాగా, మహీంద్రా కంపెనీ ఆటోమొబైల్ మరియు ఫార్మింగ్ సెక్టార్లలో అగ్రగామిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్‌కప్-2023 ప్రారంభంకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, గత వరల్డ్‌కప్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో క్రికెట్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. అంతకుముందే భారత్.. చెన్నైలో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది (అక్టోబర్ 8న). ఆతర్వాత అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్, 19న బంగ్లాదేశ్, 22న న్యూజిలాండ్, 29న ఇంగ్లండ్, నవంబర్ 2న శ్రీలంక, నవంబర్ 5న సౌతాఫ్రికా, 12న నెదర్లాండ్స్‌తో తలపడనుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో వరల్డ్‌కప్ ముగియనుంది. -
మహీంద్రా నుంచి చిన్న ట్రాక్టర్లు: ఏఆర్ రెహమాన్ గీతం అదుర్స్
కేప్‌టౌన్ (దక్షిణాఫ్రికా): ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కొత్తగా మరిన్ని వాహనాలను ఆవిష్కరించింది. చిన్న ట్రాక్టర్లు, కార్లు వీటిలో ఉన్నాయి. చిన్న కమతాల రైతులు, వ్యక్తిగత ఫామ్హౌస్లున్న వారు మొదలైన వర్గాలకు ఉపయోగపడేలా తేలికపాటి, చిన్న ట్రాక్టర్లను ఫ్యూచర్‌స్కేప్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ ప్రవేశపెట్టింది. మహీంద్రా ఓజా పేరిట ఆవిష్కరించిన ఈ ట్రాక్టర్ల శ్రేణిలో ఏడు మోడల్స్ ఉంటాయి. వీటి ధర రూ. 5,64,500 నుంచి రూ. 7,35,000 వరకు (పుణె– ఎక్స్ షోరూమ్) ఉంటుంది. తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంటులో తయారు చేసే ఈ ట్రాక్టర్లను దేశీయంగా విక్రయించడంతో పాటు ఉత్తర అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, యూరప్ తదితర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు సంస్థ ఈడీ (ఆటో, ఫార్మ్ విభాగాలు) రాజేశ్ జెజూరికర్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో ట్రాక్టర్ల ఎగుమతులను రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో 18,000 పైచిలుకు ట్రాక్టర్లను ఎగుమతి చేసింది. ఓజా ప్లాట్‌ఫాంపై రూ. 1,200 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు జెజూరికర్ వివరించారు. మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ, మిత్సుబిషి మహీంద్రా అగ్రికల్చర్ మెషినరీ కలిసి దీన్ని తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. (2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్) థార్.ఈ, గ్లోబల్ పికప్ ఆవిష్కరణ.. ఫ్యూచర్‌స్కేప్ కార్యక్రమంలో భాగంగా ఎంఅండ్ఎం ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘థార్.ఈ’ని కూడా ఆవిష్కరించింది. వినూత్నమైన డిజైన్, ఇంటీరియర్స్‌తో పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు సంస్థ ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ వీజే నక్రా తెలిపారు. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్ల కోసం గ్లోబల్ పికప్ వాహనాన్ని సైతం సంస్థ ఆవిష్కరించింది. రోజువారీ ప్రయాణ అవసరాలతో పాటు సాహస ట్రిప్‌లకు కూడా అనువుగా ఇది ఉంటుందని నక్రా వివరించారు. అటు, విద్యుత్ వాహనాల శ్రేణి కోసం నెలకొల్పిన మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ (ఎంఈఏఎల్)కి కొత్త లోగోను కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన ‘లే ఛలాంగ్’ ప్రచార గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్వరపర్చారు. (టెకీలకు గుడ్ న్యూస్: ఇన్ఫోసిస్ మెగా డీల్) -
AP: 2 నెలల్లో 2వేల ఐటీ ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: ఐటీ దిగ్గజ కంపెనీలు తమ కార్యకలాపాలను విశాఖపట్నానికి విస్తరిస్తుండటంతో నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనున్న ఇన్ఫోసిస్‌తో పాటు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన కేంద్ర రక్షణ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్, అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్, రాండ్‌శాండ్, టెక్నోటాస్క్, భారీగా విస్తరిస్తున్న టెక్ మహీంద్రా, డబ్ల్యూఏఎన్ఎస్ వంటి కంపెనీలు పెద్ద ఎత్తున నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం ఎదురుచూస్తున్నాయి. విశాఖలో ఉన్న ఐటీ కంపెనీలకు వచ్చే రెండు నెలల్లో కనీసం రెండు వేల మంది ఐటీ నిపుణులు అవసరమవుతారని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఐటాప్) అంచనా వేసింది. విశాఖలోని ఐటీ కంపెనీలకు అవసరమైన మానవ వనరులను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (ఏపీఎస్ఎస్డీసీ) ద్వారా శిక్షణ ఇచ్చి, శిక్షణ పూర్తికాగానే ఉపాధి కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకోసం రెండు నెలల్లో కనీసం రెండు వేల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో పలు ఐటీ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకువచ్చాయని, ఈ పెట్టుబడులను తక్షణం వాస్తవ రూపంలోకి తీసుకురావడంతో పాటు ప్రస్తుత ఐటీ కంపెనీల అవసరాలను తీర్చడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అదానీ డేటా సెంటర్ పనులు ప్రారంభించగా, త్వరలో మిగిలిన కంపెనీలు కూడా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇది కూడా చదవండి: మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. ఏపీ ప్రభుత్వ హెల్ప్ లైన్ -
మహీంద్రా హాలిడేస్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ దిగ్గజం మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం మూడున్నర రెట్లు జంప్‌చేసి రూ. 56 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 16 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 543 కోట్ల నుంచి రూ. 712 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 551 కోట్ల నుంచి రూ. 658 కోట్లకు పెరిగాయి. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 67 శాతం దూసుకెళ్లి రూ. 114 కోట్లకు చేరింది. 2021–22లో రూ. 68 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. మొత్తం ఆదాయం రూ. 2,013 కోట్ల నుంచి రూ. 2,517 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం, నిర్వహణ లాభం తదితరాలలో కంపెనీ అత్యుత్తమ పనితీరు చూపినట్లు ఎండీ, సీఈవో కవీందర్ సింగ్ పేర్కొన్నారు. భౌగోళిక, రాజకీయ వివాదాల కారణంగా తలెత్తిన స్థూలఆర్థిక సవాళ్లలోనూ యూరోపియన్ కార్యకలాపాలలో టర్న్‌అరౌండ్‌ను సాధించినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో మహీంద్రా హాలిడేస్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 311 వద్ద ముగిసింది. చైర్మన్ పదవీ విరమణ మహీంద్రా గ్రూప్ నాయకత్వ శ్రేణిలో కీలక సభ్యుడు మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ చైర్మన్ అరుణ్ నందా పదవీ విరమణ చేయనున్నారు. 50 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకుంటున్న నందా 2023 జులై 25న నిర్వహించనున్న వాటాదారుల సాధారణ వార్షిక సమావేశంలో బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. నాన్‌ఎగ్జిక్యూటివ్ పదవుల విషయంలో వయసును పరిగణించి తిరిగి ఎంపిక చేయవద్దంటూ బోర్డుకు సూచించినట్లు నందా తెలియజేశారు. మహీంద్రా గ్రూప్‌లో నందా 1973లో అకౌంటెంట్‌గా కోల్‌కతాలో చేరారు. 1976లో సీఎఫ్‌వో, కంపెనీ సెక్రటరీ(మహీంద్రా సింటర్డ్ ప్రొడక్ట్స్‌గా పుణేలో బాధ్యతలు స్వీకరించారు. -
మంచు కొండల్లో మహీంద్రా కారు బీభత్సం.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్!
మహీంద్రా కార్లుకు భారతీయ మార్కెట్లో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కంపెనీ వాహనాలు లాంచ్ చేస్తే రికార్డ్ బుకింగ్స్ అవుతుండడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది సెప్టెంబర్ నెలలో మహీంద్రా తన XUV400 ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నెలలో ఈ కారు ధరలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఇంతలోనే ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సరికొత్త రికార్డ్ సృష్టించి అందరి కళ్లు తన వైపు తిప్పుకుంది. మహీంద్రా కారా మజాకా మార్కెట్లో ఇంకా అఫిషియల్‌గా లాంచ్ కాక ముందే అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలో 24 గంటల్లో 751 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనంగా పేరు సంపాదించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కైలాంగ్, లాహౌల్ స్పితి నుంచి డ్రైవ్ ప్రారంభించి 24 గంటల్లో 751 కి.మీ ప్రయాణించింది. సబ్-జీరో భూభాగంలోని నిటారుగా ఉన్న వాలులలో కూడా XUV400 సజావుగా దూసుకెళ్లింది. ఎత్తైన ప్రదేశాల్లోని వంపుల్లో కారు నడపడం కష్టతరం, అయినప్పటికీ XUV400 24 గంటల్లో 751 కిమీ ప్రయాణించి తన పనితీరుని నిరూపించుకుని ఈ అరుదైన రికార్డ్‌ను తన పేరిట నమోదు చేసుకుంది. ప్రత్యేకతలపై ఓ లుక్కేద్దాం XUV400 112 Ah కెపాసిటీ రేటింగ్‌తో 39.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. బ్యాటరీ ప్యాక్‌లో NMC (నికెల్, మాంగనీస్, కోబాల్ట్) ఎలక్ట్రో-కెమికల్ కూర్పు ఉంది. ఈ వాహనం బరువు 1,960 కిలోలు, ఇందులో బ్యాటరీ ప్యాక్ 309 కిలోల బరువు ఉంటుంది. అధికారికంగా, XUV400 8.3 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. ఇది లగ్జరీయేతర సెగ్మెంట్‌ను మినహాయించి దేశంలో తయారైన అత్యంత వేగవంతమైన ప్రయాణీకుల వాహనంగా నిలిచింది. ఈ కారు అత్యధికంగా 150 kmph స్పీడ్‌ను అందుకోగలదు. ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి, XUV400 తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా బ్యాటరీ తయారీలపై ఫోకస్ పెట్టింది. అందుకే మహీంద్రా సహకారంతో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ వీటిని తయారు చేస్తుంది. అయితే, బ్యాటరీ కంట్రోలర్, ఎలక్ట్రిక్ మోటార్ చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ కారు ధర సుమారు రూ. 17 లక్షలు లేదా అంతకంటే తక్కువ ధరకు ఉండచ్చని తెలుస్తోంది. మరో వైపు ప్రత్యేర్థి టాటా నెక్సన్ ఈవీ కంటే.. ఫీచర్లు, ప్రత్యేకతలు, బ్యాటరీ సామర్థ్యం మెరుగ్గా ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చివరికి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. చదవండి: రూ.61లకే కొత్త ప్లాన్‌తో వచ్చిన రిలయన్స్ జియో.. ఆ కస్టమర్లకు పండగే! -
మహీంద్రా హాలిడేస్ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ ఇండియా తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి సారించింది. వచ్చే మూడేళ్లలో రూ. 1,500 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. రిసార్ట్స్ కొనుగోలు, కొత్తగా మరిన్ని గదులు నిర్మించడం మొదలైన వాటిపై ఇన్వెస్ట్ చేయనుంది. కంపెనీ ఎండీ, సీఈవో కవీందర్ సింగ్ ఈ విషయాలు తెలిపారు. గత రెండున్నరేళ్లలో గదుల సంఖ్యను 1,000 పైగా పెంచుకున్నట్లు ఆయన చెప్పారు. (ఎన్డీటీవీ బోర్డు: అదానీ గ్రూప్‌నకు 2 సీట్లు ఆఫర్) ప్రస్తుతం మహీంద్రా హాలిడేస్‌కు దేశీయంగా 74, అంతర్జాతీయంగా 12 రిసార్టులు ఉండగా, 4,700 గదులు ఉన్నాయని వివరించారు. కొత్త ప్రాజెక్టుల కింద హిమాచల్ ప్రదేశ్‌లోని కందఘాట్ రిసార్ట్‌లో సుమారు రూ. 200 కోట్లతో 185 గదులు జోడిస్తున్నామని, అలాగే పుదుచ్చేరి రిసార్టులో రూ. 60–70 కోట్లతో 60 గదులు నిర్మిస్తున్నాని సింగ్ చెప్పారు. అలాగే గణపతిపులే ప్రాంతం (మహారాష్ట్ర)లో రూ. 250 కోట్లతో 240 గదుల రిసార్టును అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. (భారత్‌కు చమురు సరఫరాలో రష్యానే టాప్) -
వెహికల్ లోన్ కోసం చూస్తున్నారా.. ఈ గుడ్ న్యూస్ మీకోసమే!
ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ (Mahindra Finance) సర్వీస్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. తన కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌తో (IPPB) భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా ఇకపై మహీంద్రా కస్టమర్లకు లోన్లు ఈజీగా అందుబాటులో రానున్నాయి. వీరివురు భాగస్వామ్యంతో ఇకపై.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్యాసింజర్ వాహనాలు, త్రీ-వీలర్, ట్రాక్టర్ , వ్యాపార వాహనాల లోన్ కేటగిరీల కోసం మహీంద్రా ఫైనాన్స్‌కు లీడ్ రిఫరల్ సేవలను అందిస్తుంది. ఇప్పటికే ఉన్న మహీంద్రా ఫైనాన్స్ కస్టమర్లకు పోస్టాఫీసులలో నగదు ఈఎంఐ( EMI )డిపాజిట్ సౌకర్యాన్ని కూడా అందించనుంది. ప్రయోగాత్మకంగా ఈ సేవలను మొదటగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్‌లలో అందించనున్నారు. రాబోయే నాలుగు-ఆరు నెలల్లో ఇతర రాష్ట్రాలలో విస్తరించాలని భావిస్తున్నారు. దీంతో, పేమెంట్స్ బ్యాంక్ కూడా తన ఫైనాన్షియల్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో సర్వీసులను విస్తరించాలని భావిస్తోంది. చదవండి: జియో డబుల్ ఫెస్టివల్ బొనాంజా: ఆ ప్లాన్లతో రీచార్జ్, ఈ బెనిఫిట్స్ అన్నీ మీకే! -
ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!
భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా కంపెనీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇటీవల మహీంద్రా ఎక్స్యువి 700 లాంచ్ చేసిన నిమిషాల్లోనే రికార్డు బుకింగ్స్ సొంతం చేసుకోవడమే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం ట్రెండ్‌కి అనుగుణంగా మహీంద్రా ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకువస్తోంది. ఈ సంస్థ నుంచి మార్కెట్లోకి విడుదలయ్యే కార్ల క్రేజ్ గురించి కూడా చెప్పక్కర్లేదు. అందుకే అధిక కస్టమర్లు మహీంద్రా వాహనాల వైపే మొగ్గు చూపుతుంటారు. నేపథ్యంలో స్కార్పియో, XUV700 వంటి కొన్ని మోడళ్లపై 24 నెలలకు పైగా వేచి చూడాల్సిన పరిస్థతి ఏర్పడింది. అయినా వీటికి డిమాండ్ మాత్రం తగ్గడం లేదట. కాగా కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చిన కొత్త కొత్త మోడళ్లు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మహీంద్రా స్కార్పియో ఎన్ ఇటీవల విడుదల చేసిన మహీంద్రా స్కార్పియో N దాని ప్రీమియం, ఫీచర్-రిచ్ ప్యాకేజీతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. SUVలోని Z8, Z6 వేరియంట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఎంతలా అంటే కస్టమర్లు ఈ వాహనం కావాలంటే 24 నెలల వరకు వేచి చూడాల్సి వస్తోంది. మరోవైపు Z8L దాదాపు 20 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇతర వేరియంట్లు మార్కెట్లో తక్కువ వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉన్నాయి. మహీంద్రా XUV700 మహీంద్రా XUV700కి కూడా మార్కెట్లో డిమాండ్ నడుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ కారు అమ్మకాలలో దూసుకుపోతోంది. ఈ SUV మీద ప్రస్తుతం కస్టమర్లు ఎంచుకునే వేరియంట్‌పై ఆధారపడి 18 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ కలిగి ఉంది. అయితే పెట్రోల్ వెర్షన్లతో పోల్చినప్పుడు డీజిల్ మోడల్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. స్కార్పియో, ఎక్స్‌యూవీ 700 వంటి మోడళ్లకు ఏకంగా 2 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ రెండు కార్లు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది కేవలం ఎంపిక చేసిన వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుందని గుర్తించుకోవాలి. చదవండి: ఐఫోన్ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. భారీ డిస్కౌంట్లతో ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్! -
మహీంద్రా లాజిస్టిక్స్ చేతికి రివిగో ‘బీ2బీ’ వ్యాపారం
ముంబై: లాజిస్టిక్స్ సంస్థ రివిగో సర్వీసెస్‌కు చెందిన బీ2బీ ఎక్స్‌ప్రెస్ వ్యాపార విభాగాన్ని కొనుగోలు చేస్తున్నట్లు మహీంద్రా లాజిస్టిక్స్ (ఎంఎల్ఎల్) వెల్లడించింది. వ్యాపార బదిలీ ఒప్పందం (బీటీఏ) రూపంలో ఈ డీల్ ఉంటుందని పేర్కొంది. దీని ప్రకారం రివిగోలోని బీ2బీ ఎక్స్‌ప్రెస్ వ్యాపారం అసెట్స్, కస్టమర్లు, టీమ్, టెక్నాలజీ ఫ్లాట్‌ఫాం మొదలైనవి ఎంఎల్‌ఎల్‌కు దక్కుతాయి. ఎక్స్‌ప్రెస్ నెట్వర్క్ ప్రస్తుతం 250 ప్రాసెసింగ్ కేంద్రాలు, శాఖల ద్వారా దేశవ్యాప్తంగా 19,000 పిన్ కోడ్లకు సర్వీసులు అందిస్తోంది. తమ వ్యాపారా సామర్థ్యాలను మరింత పటిష్టపర్చుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని ఎంఎల్ఎల్ ఎండీ రామ్‌ప్రవీణ్ స్వామినాథన్ తెలిపారు. -
అమానుషం..ఫైనాన్స్ కంపెనీ దాష్టికం..గర్భిణిని ట్రాక్టర్‌తో తొక్కించి...
లోన్ రికవరి కోసం ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేసే ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు గురించి నిత్యం వింటూనే ఉన్నాం. అచ్చం అలానే ఒక ఫైనాన్స్ కంపెనీ లోన్ రికవరీ కోసం ఒక మహిళ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించింది. వివరాల్లోకెళ్తే...మహిద్ర ఫైనాన్స్ కంపెనీ అధికారులు లోన్ రికవరి కోసం దివ్యాంగుడైన ఒక రైతు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో రైతు, అతని కుమార్తె మాత్రమే ఉన్నారు. ఫైనాన్స్ అధికారులకు రైతుకి మధ్య ఫైనాన్స్ విషయమే చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. అంతే సదరు ఫైనాన్స్ అధికారులు ఏకంగా కోపంతో ట్రాక్టర్‌తో సదరు రైతు కూతురుని తొక్కించి.. హత్య చేశారు. బాధితురాలు మూడు నెలల గర్భిణి. ఈ ఘటన జార్ఖండ్‌లో హజారీబాగ్‌లో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్, మేనేజర్‌తో సహా నలుగురిపై హత్య కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ అధికారులు తమకు సమాచారం ఇవ్వకుండా ఇంటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ ఫైనాన్స్ రికవరీ కోసం బాధితుడి నివాసానికి వెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మేరకు మహీంద్రా గ్రూప్ మేజేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనీష్ షా మాట్లాడుతూ...కంపెనీ అన్ని కోణాల్లో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది. ఏజెన్సీలు లోన్‌రికవరీ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకుంటాం. కేసు దర్యాప్తు విషయమై పోలీసులకు అన్ని రకాలుగా సహకరిస్తాం అని హామీ ఇచ్చారు. (చదవండి: ప్రేమకు నిరాకరించిందన్న కక్ష్యతో నవ వధువు దారుణ హత్య) -
మహీంద్రా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ వెహికల్, విడుదల ఎప్పుడంటే!
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఎక్స్‌యూవీ 300 ఎస్యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. విద్యుత్ వాహనాలకు సంబంధించి ’బార్న్ ఎలక్ట్రిక్ విజన్’ పేరిట వ్యాపార వ్యూహాన్ని ఈ ఏడాది ఆగస్టులో బ్రిటన్‌లో ఆవిష్కరించనుంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజూరికర్ ఈ విషయాలు తెలిపారు. ఎక్స్‌యూవీ 300కి ఎలక్ట్రిక్ వెర్షన్ అయినప్పటికీ కొత్త వాహనం పొడవు 4 మీటర్ల లోపు కాకుండా 4.2 మీటర్ల స్థాయిలో ఉంటుందన్నారు. విద్యుత్ కార్ల తయారీలో ఉపయోగించే మాడ్యులర్ ఎలక్ట్రిక్ డ్రైవ్ మ్యాట్రిక్స్ (ఎంఈబీ) పరికరాల కోసం ఎంఅండ్ఎం ఇటీవలే ఫోక్స్వ్యాగన్తో జట్టు కట్టింది. చదవండి👉ఈ కార్ని ఇప్పుడు బుక్ చేసుకుంటే..డెలివరీ అయ్యేది రెండేళ్ల తర్వాతే! -
శుభవార్త..పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించిన మహీంద్రా...!
ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఏప్రిల్ నెలకుగాను పలు మోడళ్లపై కొత్త ఆఫర్లు, తగ్గింపు జాబితాను మహీంద్రా విడుదల చేసింది. ఎంపిక చేసిన కార్లపై ఈ నెలలో కస్టమర్లు గరిష్టంగా రూ. 81,500 వరకు ఆదా చేసుకోవచ్చును. అయితే ఆఫ్ రోడ్ కార్ థార్, బొలెరో నియో, ఎక్స్‌యూవీ700 వంటి కార్లపై ఎలాంటి తగ్గింపు లేదు. కాగా ఈ ప్రయోజనాలను కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ బోనస్, నగదు మార్పిడి బోనస్, కార్పొరేట్ బోనస్ రూపంలో ఉండనున్నాయి. పలు కార్లపై మహీంద్రా అందిస్తోన్న తగ్గింపులు ఇవే..! మహీంద్రా KUV100 NXT మహీంద్రా కాంపాక్ట్ ఎస్యూవీ KUV100 NXTపై రూ. 38,055 వరకు నగదు తగ్గింపును, రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు, ఎక్సేఛేంజ్ ఆఫర్ కింద రూ. 20,000 వరకు మొత్తంగా రూ. 61, 055 వరకు కొనుగోలుదారులు ఆదా చేసుకోవచ్చును. దీని ధర రూ.6.15 లక్షల నుంచి రూ.7.81 లక్షల వరకు ఉంది మహీంద్రా బొలెరో మహీంద్రా బొలెరో కారుపై కొనుగోలుదారులకు ఎక్సేఛేంజ్ బోనస్ కింద రూ. 15,000 వరకు, కార్పోరేట్ బోనస్ రూ. 3000, అదనంగా మరో రూ. 6 వేల వరకు నగదు ప్రయోజనాలను పొందవచ్చును. దీని ధరను రూ.8.99 లక్షల నుండి రూ.9.99 లక్షల వరకు ఉండనుంది. మహీంద్రా స్కార్పియో మహీంద్రా బొలెరో కారుపై కొనుగోలుదారులకు ఎక్సేఛేంజ్ బోనస్ కింద రూ. 15,000 వరకు, కార్పోరేట్ బోనస్ రూ. 4000, అదనంగా మరో రూ. 15 వేల వరకు, ఇలా మొత్తంగా రూ. 34 వేల వరకు నగదు ప్రయోజనాలను పొందవచ్చును. మహీంద్రా స్కార్పియోను రూ. 13.18 లక్షల నుంచి రూ. 18.14 లక్షల వరకు విక్రయిస్తోంది. మహీంద్రా XUV300 మహీంద్రా XUV300 కొనుగోలుపై రూ. 30,003 వరకు నగదు తగ్గింపు, ఎక్సేఛేంజ్ ఆఫర్ కింద రూ. 25,000 వరకు ప్రయోజనాలను మహీంద్రా కల్పించనుంది. దాంతో పాటుగా రూ. 4000 కార్పొరేట్ తగ్గింపుతో పాటు అదనంగా రూ. 10 వేల వరకు నగదు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ. 8.16 లక్షల నుంచి రూ. 13.67 లక్షల వరకు ఉంది. మహీంద్రా అల్టురాస్ మహీంద్రా Alturas G4 కారు కొనుగోలుపై కంపెనీ ఏకంగా రూ. 81,500 భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ కారు కొనుగోలుపై రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 11,500 అదనపు కార్పొరేట్ తగ్గింపును మహీంద్రా కల్పిస్తోంది. అంతేకాకుండా ఈ కారు కొనుగోలుపై రూ. 20,000 విలువైనఅదనపు తగ్గింపును కూడా అందిస్తోంది. మహీంద్రా తన పూర్తి-పరిమాణ SUVని రూ. 28.84 లక్షల నుంచి రూ. 31.84 లక్షల వరకు విక్రయిస్తోంది. మహీంద్రా మరాజ్జో మహీంద్రా మరాజో ఎస్యూవీ బేస్ M2 ట్రిమ్‌పై రూ. 20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,200 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. మహీంద్రా ఈ ఎమ్‌పివి ధరను రూ. 12.8 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు నిర్ణయించింది. చదవండి: గుడ్‌న్యూస్...పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించిన టాటా మోటార్స్...! -
హైదరాబాద్ స్టార్టప్ కంపెనీపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్..!
సామాజిక అంశాలపై ఎల్లప్పుడూ స్పందించే ఆనంద్ మహీంద్రా ఈసారి హైదరాబాద్ స్టార్టప్ కంపెనీపై స్పందించారు. హైదరాబాద్ నగరానికికు చెందిన బాస్క్ అసోసియేట్స్ తమ మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోను మొబైల్ కాఫీ షాపుగా మార్చినట్లు మహీంద్రా ఎలక్ట్రిక్ తన ట్విటర్ ఖాతా వేదికగా పోస్టు చేసింది. ఆ పోస్టులో "ఎంటర్ప్రైజింగ్! #Hyderabad, #BaskAssociatesకు చెందిన మా #Mahindra #TreoZor కస్టమర్ తమ 5 #ఎలక్ట్రిక్ వాహనలను మొబైల్ కాఫీ షాపులుగా మార్చారు. #ZeroPollution ఈవి, ప్లాస్టిక్ బయోడిగ్రేడబుల్ కాఫీ కప్పులలో ఆర్గానిక్ గా పెరిగిన మొక్కల నుంచి తయారు చేసిన కాఫీని సర్వ్ చేస్తున్నందుకు దన్యవాదలు" అని మహీంద్రా ఎలక్ట్రిక్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ట్రియో జోర్ అనేది మహీంద్రా గ్రూప్‌కు చెందిన కార్గో సెగ్మెంట్ కింద వచ్చిన ఎలక్ట్రిక్ ఆటో. మహీంద్రా ట్రియో జోర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.3.15 లక్షలు. ఇది 550 కిలోగ్రాముల వరకు పేలోడ్ మోసుకెళ్లగలదు. ఇందులో 48వీ బ్యాటరీ ప్యాక్, జిపిఎస్ మానిటరింగ్, ఎకానమీ & బూస్ట్ మోడ్ వంటి రెండు మోడ్స్ ఉన్నాయి. ఇది 8 కెడబ్ల్యు పీక్ పవర్, 42ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కొత్త మహీంద్రా ట్రెయో ఎలక్ట్రిక్ ఆటో భారతదేశంలో పూర్తిగా డిజైన్ చేసి అభివృద్ధి చేశారు. 55 కిలోమీటర్ల వేగంతో ఉత్తమ-ఇన్-క్లాస్ పనితీరును అందిస్తుంది. కేవలం 2.3 సెకన్లలో 0-20 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొత్త మహీంద్రా ట్రెయో సంవత్సరానికి 45,000 వరకు ఇంధన ఖర్చు ఆదా చేస్తుంది. 👍🏽👏🏽👏🏽👏🏽 https://t.co/JKdinZeuqQ — anand mahindra (@anandmahindra) February 9, 2022 (చదవండి: Gold Price: పసిడి పరుగో పరుగు.. తులం ఎంతంటే?) -
నా కల నెరవేర్చావు.. థ్యాంక్ యూ కేటీఆర్: ఆనంద్ మహీంద్రా
ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా తెలంగాణ ప్రభుత్వానికి.. ప్రత్యేకించి మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎందుకో తెలుసా?.. తన చిరకాల స్వప్నం నెరవేర్చినందుకు! అవును.. ప్రతిష్టాత్మక ‘ఫార్ములా ఈ’ వరల్డ్ ఛాంపియన్షిప్ రేసు కోసం హైదరాబాద్ నగరం వేదికగా ఇవాళ ఖరారైంది. ఈ తరుణంలో సొంత రేసింగ్ కార్లను(మహీంద్రా రేసింగ్ కంపెనీ) స్వదేశంలో పరుగులు పెట్టించబోతున్నందుకు కృతజ్ఞతగా ఆనంద్ మహీంద్రా కేటీఆర్‌కు థ్యాంక్స్ చెబుతూ ఒక ట్వీట్ చేశారు. సొంత గడ్డపై తమ రేసింగ్ కార్లను ఉరుకులు పెట్టబోతున్నాయి.. చిరకాల కల నెరవేరబోతోంది. ఈ కలను నెరవర్చేదిశగా అడుగు వేసిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. We were one of the founding teams in Formula E and a long held dream of @MahindraRacing has been to race our cars on home ground, cheered on by a home crowd. Thank you @KTRTRS for taking a huge step towards making that dream a reality! We can’t wait… https://t.co/HF9OoVDVXO — anand mahindra (@anandmahindra) January 17, 2022 ఫార్ములా E సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో- మంత్రి కేటీఆర్ సంయుక్తంగా ABB FIA ఫార్ములా E ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల నిర్వహణ గురించి సోమవారం ప్రకటించారు. పనిలో పనిగా మహీంద్రా రేసింగ్ మొదటి నుంచి అందిస్తున్న మద్దతును సైతం అల్బెర్టో లాంగో ప్రస్తావించారు. ఇదిలా ఉంటే ఫార్ములా వన్ తరహాలో ఇ-వన్ ఛాంపియ్‌షిప్ కూడా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నదే. ఈ రేసింగ్ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ప్రత్యేక రేసింగ్ ట్రాక్ అక్కర్లేని ఈ ‘ఇ వన్ ఫార్ములా’ ఛాంపియన్షిప్ పోటీలు 2014 నుంచి ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. వ్యవస్థాపక బృందంలో మహీంద్రా రేసింగ్ కంపెనీ కూడా భాగస్వామిగా ఉంది. In the presence of Minister @KTRTRS, the Govt. of Telangana and @FIAFormulaE entered into an agreement to make Hyderabad as host city. #HappeningHyderabad pic.twitter.com/E3HLJPV2Xm — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 17, 2022 ఇప్పటి వరకు లండన్, న్యూయార్క్, మెక్సికో, రోమ్, బెర్లిన్, రోమ్, సియోల్, వాంకోవర్ నగరాల్లో ఈ పోటీలు జరిగాయి. తాజాగా తొమ్మిదో సీజన్‌కి సంబంధించిన పోటీలకు సౌదీ అరేబియాలోని దిరియా నగరం వేదికగా నిలిచింది. ఆ తర్వాత నిర్వహించబోయే ఛాంపియన్‌షిప్‌కి హైదరాబాద్ నగరం ఆతిధ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సంబంధిత వార్త: ఫార్ములా ఇ- వన్ ఛాంపియన్షిప్.. ఇట్ హ్యాపెన్స్ -
కార్ల కొనుగోలు దారులకు భారీ షాక్!
ప్రముఖ దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా భారీ షాకిచ్చింది. ఎంపిక చేసిన మహీంద్రా కార్ల ధరల్ని భారీగా పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మహీంద్రా అండ్ మహీంద్రా గతేడాది అక్టోబర్‌లో ఎక్స్ యూవీ 700ని మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో విడుదలైన రెండు రోజుల్లో 50వేల బుకింగ్స్‌తో మహీంద్రా ఆటోమొబైల్ సంస్థ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. అయితే పెరిగిపోతున్న బుకింగ్‌ల నేపథ్యంలో కస్టమర్లకు ఈ కార్లను అందించేందుకు సమయం ఉంది.అదే సమయంలో మహీంద్రాతో కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. తయారీ (ముడి పదార్థాలు మొదలైనవి),రవాణా ఖర్చులు పెరగడంతో మహీంద్రా అండ్ మహీంద్రాతో పాటు ఇతర కార్ల సంస్థలు కార్ల ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మహీంద్రా ఎక్స్ యూవీ 700 వెహికల్ ధరని రూ.80వేల వరకు పెంచింది. ఎక్స్ యూవీ 700 వెహికల్స్ ఫీచర్లు మహీంద్రా న్యూ లోగోతో రిలీజ్ అవుతున్న మొదటి వెహికల్ ఎక్స్‌యూవీ700. ఇది పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో లభిస్తోంది. డీజిల్ వెర్షన్‌లోని 2.2-లీటర్ ఇంజన్ గరిష్ఠంగా 185 పీఎస్ శక్తిని, 450 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్ఠంగా 200 పీఎస్ శక్తిని, 380 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లేదా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా డ్రైవర్ లెస్ కారు తెస్తామంటూ టెస్లా అంటోంది. ఆ స్థాయిలో కాకపోయినా ఇండియా వరకు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌ను అధికంగా ఉపయోగిన్న ఆకారుగా మహీంద్రా ఎక్స్‌యూవీ 700ని పేర్కొనవచ్చు. ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్‌ని పొందు పరిచారు. దీనిలో ఫార్వర్డ్ కొల్యూజన్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేక్స్, లైన్ డిపాచర్ వార్నింగ్, లైన్ కీప్ అసిస్టెంట్, అడాప్టిక్ క్రూజ్ కంట్రోల్, ‘డ్రైవర్ డ్రౌజీనెస్ మానిటర్ సిస్టం, ట్రాఫిక్ సిగ్నల్ రికగ్నేషన్, హై బీమ్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి చదవండి: ఇదెక్కడి విచిత్రం..! అలవోకగా కారును నడిపేస్తోన్న చేప..! -
నిపుణుల వేటలో టాప్ 5 కంపెనీలు.. మొదటి 9 నెలల కాలంలో..
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల్లో కొలువుల సందడి నెలకొంది. కంపెనీలు భారీగా నియామకాలను చేపడుతున్నాయి. కరోనా తర్వాత ఐటీ, డీజిటల్ సేవలకు డిమాండ్ అధికమైంది. భారీగా కాంట్రాక్టులు వస్తుండడంతో వాటిని సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా కంపెనీలు నిపుణుల వేటలో పడ్డాయి. అగ్రగామి ఐదు ఐటీ కంపెనీలు.. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా 2021 మొదటి తొమ్మిది నెలల్లో (జనవరి–సెప్టెంబర్) 1.7 లక్షల మంది ఉద్యోగులను కొత్తగా తీసుకున్నాయి. ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) ఎక్కువగా ఉండడం కూడా కంపెనీలకు సౌకర్యంగా లేదు. అదే సమయంలో సేవలకు డిమాండ్ అద్భుతంగా ఉండడం .. ఈ రంగంలో ఉపాధి కల్పనకు దారితీస్తోంది. 2020 మొదటి తొమ్మిది నెలల కాలంలో టాప్–5 ఐటీ కంపెనీల ఉద్యోగుల సంఖ్య 1,125 మేర తగ్గడం గమనార్హం. గతేడాది మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున లాక్డౌన్లు అమలు కావడం తెలిసిందే. దీంతో కంపెనీలు కొత్త ఉద్యోగులను తీసుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. కానీ, గతేడాదికి పూర్తి భిన్నమైన వాతావారణం ఐటీ పరిశ్రమలో ప్రస్తుతం నెలకొందని చెప్పుకోవచ్చు. కరోనాకు ముందు సంవత్సరం 2019 మొదటి తొమ్మిది నెలల్లో అగ్రగామి ఐదు ఐటీ కంపెనీలు 77,000 మందిని నియమించుకోగా.. వీటితో పోల్చి చూసినా ఈ ఏడాది నియామకాలు రెట్టింపునకుపైగా పెరిగినట్టు స్పష్టమవుతోంది. డిమాండ్ ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకోగా.. అదే సమయంలో సరఫరా పరమైన సవాళ్లను కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. అట్టిపెట్టుకోవడం సవాలే పరిశ్రమ వ్యాప్తంగా ఉద్యోగుల వలసలు పెరిగిపోయాయి. ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అట్రిషన్ రేటు 20 శాతానికి పైనే ఉన్నట్టు ప్రకటించాయి. ఇదే స్థాయిలో వలసలు మరికొన్ని త్రైమాసికాల పాటు కొనసాగొచ్చని విప్రో చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్గోవిల్ ఫలితాల సందర్భంగా ప్రకటించడం గమనార్హం. మధ్యస్థాయి ఐటీ కంపెనీలు సైతం ఇదే సమస్యతో సతమతం అవుతున్నాయి. సరిపడా నిపుణులు అందుబాటులో లేకపోవడం కూడా అధిక వలసలకు కారణంగా ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ సీఈవో సంజయ్ జలోనా పేర్కొన్నారు. ‘‘మా క్లయింట్లు రెండంకెల అట్రిషన్‌ను ఎదుర్కొంటున్నారు. సరిపడా ఉద్యో గులు లభించని పరిస్థితుల్లో ఎన్నో కార్యకలాపాలను ఆటోమేషన్ చేస్తున్నారు’’ అని ఆయన చెప్పారు. ఈ సంస్థ 19.6% అట్రిషన్ రేటును ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికంలోనూ.. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలోనే టాప్–5 ఐటీ కంపెనీలు 70,000 మందికి నూతనంగా ఉపాధి కల్పించాయి. 2020 ఇదే కాలంలో 18,000 మందిని తీసుకోగా, 2019లో నియామకాలు 37,000గా ఉన్నాయి. కనీసం మరో రెండు త్రైమాసికాల పాటు అయినా ఈ స్థాయిలో డిమాండ్ కొనసాగుతుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 2021–22 సంవత్సరానికి కొత్తగా 40,000 మందిని తీసుకుంటామన్న టీసీఎస్.. దీన్ని కాస్తా 78,000కు పెంచింది. ఇన్ఫోసిస్ సైతం 26,000 మందికి తీసుకుంటామని, ఈ సంఖ్య ను 45,000కు సవరించింది. విప్రో కూడా 12,000 అంచనాను 26,000కు సవరించింది. -
బుకింగ్‌లో మహీంద్రా ఎక్స్యువి 700 ఎస్యూవి సరికొత్త రికార్డు
ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ మహీంద్రా తన ఎక్స్యువి700 ఎస్యూవి కారు బుకింగ్స్ తెరిచిన కేవలం గంట లోపు 25,000 మంది బుకింగ్ చేసినట్లు కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో ఇది ఒక సరికొత్త రికార్డు అని కంపెనీ పేర్కొంది. మహీంద్రా ఎక్స్యువి700 పరిచయ ఆఫర్ కింద తక్కువ ధరలతో లాంఛ్ చేశారు. మొదటి 25,000 బుకింగ్స్ కు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఇప్పుడు ఎంట్రీ వేరియంట్ ఎక్స్యువి700 ధరలు ₹12.49 లక్షల నుంచి ప్రారంభం కానున్నాయి. బేస్ వేరియంట్ ధరలను కంపెనీ ₹50,000 వరకు పెంచింది. బుకింగ్స్ మళ్లీ అక్టోబర్ 8న ఉదయం 10 నుంచి తిరిగి తెరవనున్నారు. కస్టమర్లు డీలర్ షిప్ లేదా డిజిటల్ ఫ్లాట్ ఫారాల ద్వారా ఎక్స్యువి 700ని బుక్ చేసుకోవచ్చు, మహీంద్రా ఈ రోజు మొదటిసారి బుకింగ్స్ ప్రారంభించింది. కంపెనీ 25,000 మంది కారు బుక్ చేసుకున్న తర్వాత ధరలను పెంచింది. అన్ని వేరియెంట్ల ధరలను పెంచలేదు. కొన్ని వేరియెంట్ల ధరలను మాత్రమే పెంచింది. ఇది పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో లభిస్తోంది. డీజిల్ వెర్షన్‌లోని 2.2-లీటర్ ఇంజన్ గరిష్ఠంగా 185 పీఎస్ శక్తిని, 450 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్ఠంగా 200 పీఎస్ శక్తిని, 380 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లేదా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.(చదవండి: ఫేస్బుక్ ద్వారా డబ్బుల్ని ఇలా సంపాదించండి) -
మహీంద్రా కార్లపై బంపర్ ఆఫర్స్.. రూ.2.58 లక్షల వరకు డిస్కౌంట్లు
మహీంద్రా అండ్ మహీంద్రా తన బెస్ట్ సెల్లింగ్ ఎస్యువి కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీ ఇటీవల ఎక్స్ యువి700ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇతర మహీంద్రా ఎక్స్యువి 500, సబ్ కాంపాక్ట్ ఎక్స్యువి 300, పాపులర్ స్కార్పియో కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ డిస్కౌంట్లకు సంబంధించిన వివరాలు కంపెనీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే వర్తిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి. (చదవండి: వారంలో రెండు రోజులు ఆఫీస్..!) మహీంద్రా ఎక్స్యువి 500 డిస్కౌంట్లు మహీంద్రా ఎక్స్యువి 500 డబ్ల్యు11, డబ్ల్యు11 ఆప్షన్ ఎటీ వేరియెంట్లపై కంపెనీ రూ.1,79,800 వరకు క్యాష్ డిస్కౌంట్ తో పాటుగా ₹6,500 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. అలాగే, ఎక్స్ఛేంజ్ కింద ₹50,000 వరకు అదనపు బోనస్ కూడా అందిస్తుంది. ఇంకా కంపెనీ ₹20,000 విలువైన యాక్సెసరీస్ కూడా ఇవ్వనుంది. ఇక డబ్ల్యు7, డబ్ల్యు9, డబ్ల్యు7 ఎటీ, డబ్ల్యు9 ఎటీ వేరియెంట్లపై మహీంద్రా ₹1,28,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే, ₹6,500 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, ₹50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ₹20,000 విలువైన యాక్సెసరీస్ ఇస్తుంది. డబ్ల్యు5, డబ్ల్యు7, డబ్ల్యు9, డబ్ల్యు11 ఆప్షన్, డబ్ల్యు7 ఎటీ, డబ్ల్యు9 ఎటీ, డబ్ల్యు11 ఆప్షన్ ఎటీ మోడల్స్ అన్నింటిపై, కంపెనీ ₹2,58,000 వరకు ప్రయోజనాలను కూడా ఇవ్వనుంది. మహీంద్రా ఎక్స్యువి 300 డిస్కౌంట్లు డబ్ల్యు8 ఆప్షన్ డ్యూయల్ టోన్ బీఎస్ఐవీ, డబ్ల్యు8 ఆప్షన్ డ్యూయల్ టోన్, డబ్ల్యు8, డబ్ల్యు8 ఆప్షన్ డ్యూయల్ టోన్, డబ్ల్యు8 ఆప్షన్ డీజిల్, డబ్ల్యు8 ఎఎమ్ టి ఐచ్ఛిక డీజిల్, డబ్ల్యు8 ఆప్షన్ డ్యూయల్ టోన్, డబ్ల్యు8 ఆప్షన్ ఎఎమ్ టి, డబ్ల్యు8 డీజిల్ సన్ రూఫ్, డబ్ల్యు8 ఎఎమ్ టి ఆప్షన్ డీజిల్ డ్యూయల్ టోన్, డబ్ల్యు8 ఎఎమ్ టి ఆప్షన్ డీజిల్ డ్యూయల్ టోన్ వంటి కార్లపై కంపెనీ ₹4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, ₹20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ₹15,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. ఇక కొనుగోలుదారులు యాక్ససరీలపై ₹5000 ఆఫర్ పొందవచ్చు. ఇక డబ్ల్యు4, డబ్ల్యు4 డీజిల్ కార్లపై కంపెనీ ₹4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, ₹20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తోంది. అలాగే యాక్ససరీలపై కంపెనీ ₹5,000 వరకు తగ్గింపును అందిస్తోంది. మహీంద్రా స్కార్పియోపై డిస్కౌంట్లు ఎస్3 ప్లస్ కొరకు, ఎస్3 ప్లస్ 9 సీటర్ కార్లపై మహీంద్రా ₹4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తోంది. కంపెనీ ₹5,000 వరకు ఉచిత యాక్ససరీలను కూడా అందిస్తోంది. ఎస్11, ఎస్9, ఎస్7 కార్లపై కంపెనీ కేవలం ₹4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తుంది. ఎస్5 వేరియంట్ కారుపై కంపెనీ ₹4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, ₹15,000 వరకు విలువైన ఉచిత యాక్ససరీస్ ఆఫర్ అందిస్తోంది. -
పికప్ వాహనాలకు మహీంద్రా ఫైనాన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది.ఇందులో భాగంగా కంపెనీ తయారీ పికప్, చిన్న వాణిజ్య వాహనాలను వినియోగదార్లు రూ.6,666 నెలవాయిదాతో కొనుగోలు చేయవచ్చు. ఇందులో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. ఇకపై కంపెనీ తయారీ పికప్, చిన్న వాణిజ్య వాహనాలను వినియోగదార్లు రూ.6,666 నెలవాయిదాతో కొనుగోలు చేయవచ్చు. వడ్డీ రేటు 11.5 శాతం నుంచి ప్రారంభం. రూ.10 లక్షల వరకు వాహనానికి (ఆన్ రోడ్) అయ్యే వ్యయంలో 85 శాతం దాకా రుణం ఇస్తారు. కాల పరిమితి ఆరేళ్లు. థర్డ్ పార్టీ గ్యారంటీ అవసరం లేదు. తొలిసారి వాహనాన్ని కొనుగోలు చేసేవారికి ఐటీఆర్ అక్కరలేదు. చదవండి : అదిరిపోయే లుక్, స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన వివో -
మహీంద్రా ఎక్స్‌యూవీ 700 డిజైన్ అదుర్స్
ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఎస్యూవీ సెగ్మెంట్లో పోటాపోటీగా వాటి కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. తాజాగా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా & మహీంద్రా తర్వాతి తరం ఎక్స్‌యూవీ 700 మోడల్ అడ్రెనోక్స్ 'ఇంటెలిజెంట్' వ్యవస్థను టీజ్ చేసింది. అయితే, ఈ వీడియోలో కొత్త ఎక్స్‌యూవీ 700 డిజైన్ తో సహా ఇంటీరియర్లు, ఫీచర్లు వంటి కొన్ని కీలక వివరాలను వెల్లడించింది. మహీంద్రా కొత్త ఎక్స్‌యూవీ డ్యాష్ బోర్డ్ చాలా విస్తారంగా ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 యాడ్రినోక్స్ అనే కొత్త 'ఇంటెలిజెంట్' సిస్టమ్ ని తీసుకొచ్చింది. ఇది 'తెలివైనది' అని కంపెనీ పేర్కొంది. ఈ ఎక్స్‌యూవీ 700 డిజైన్ చూడాటానికి టొయోటా ఫార్చునర్ లాగే ఉంది. ఇందులోని అడ్రెనోక్స్ 'ఇంటెలిజెంట్' సిస్టమ్ ద్వారా సన్ రూఫ్ తెరవడం, క్లోజ్ చేయడం వంటి ప్రాథమిక విధులను అలెక్సాతో ఇంటిగ్రేట్ చేయవచ్చు. స్క్రీన్లు (మిడ్, ఇన్ఫోటైన్ మెంట్) రెండూ ఒకే గ్లాస్ ప్యానెల్ లో ఉన్న విషయాన్ని కూడా టీజర్ ధృవీకరిస్తుంది. ఈ ఫీచర్ చాలా ఖరీదైన లగ్జరీ కార్లలో చూడవచ్చు. మధ్యలో ఉన్న సమాచారంతో పాటు రెండు చివరల్లో స్పీడోమీటర్, టాకోమీటర్ తో మిడ్ పూర్తిగా డిజిటల్ గా ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 సోనీకి చెందిన 3డీ సౌండ్ ద్వారా పనిచేయనున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియోలో ఫీచర్ల పరంగా కారుకు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేకులు, డ్రైవ్ సెలక్టర్, విభిన్న డ్రైవ్ మోడ్ లు లభిస్తాయని తెలుస్తుంది. దీనిలో 'జిప్', 'జాప్' 'జూమ్' మోడ్లు ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 700లో స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ కూడా రానున్నాయి. ఇలాంటివి టెస్లా కార్లతో పాటు కొన్ని లగ్జరీ బ్రాండ్లలో ఉంటాయి. -
సరికొత్తగా మహీంద్రా బొలెరో...ధర ఎంతంటే..
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా కొత్త లుక్‌తో మహీంద్రా బొలెరో నియోను మార్కెట్లోకి లాంఛ్ చేసింది. బొలెరో నియో సబ్‌కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ మహీంద్రా టీయూవీ 300ను పోలి ఉంది. ఈ కారు ఎన్4, ఎన్8, ఎన్10, ఎన్10(ఓ) నాలుగు రకాల వేరియంట్లలో లభించనుంది. బొలెరో నియో ఎక్స్‌షోరూమ్ ధర రూ. 8.48 లక్షల నుంచి ప్రారంభంకానుంది. సరికొత్త బొలెరో నియో రివైజ్డ్ డీఆర్ఎల్ హెడ్‌ల్యాంప్స్, కొత్త ఫ్రంట్ బంపర్, న్యూ ఫాగ్ ల్యాంప్స్‌తో రానుంది. కారు ఇంటీరియల్స్ విషయానికి వస్తే..టీయూవీ 300ను పోలీ ఉంటుంది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇనోఫో సిస్టమ్ విత్ బ్లూటూత్‌ను అమర్చారు. స్టీరియో మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్, బ్లూ సెన్స్యాప్తో బొలెరో నియో రానుంది. బొలెరో నియో ఇంజన్ విషయానికి వస్తే..1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో, గరిష్టంగా 100పీఎస్ పవర్, 260ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తోంది. టీయూవీ 300తో పోలిస్తే 20ఎన్ఎమ్ టార్క్‌ను తక్కువగా ఉత్పత్తి చేస్తోంది. బొలెరో నియో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. బొలెరో నియో బ్లాక్, మెజెస్టిక్ సిల్వర్, హైవే రెడ్, పెర్ల్ వైట్, డైమండ్ వైట్, రాకీ బీజ్ ఆరు రకాల కలర్ వేరియంట్లతో రానుంది.