ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఎక్స్‌యూవీ 300 ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది.
విద్యుత్ వాహనాలకు సంబంధించి ’బార్న్ ఎలక్ట్రిక్ విజన్’ పేరిట వ్యాపార వ్యూహాన్ని ఈ ఏడాది ఆగస్టులో బ్రిటన్‌లో ఆవిష్కరించనుంది.
కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజూరికర్ ఈ విషయాలు తెలిపారు. ఎక్స్‌యూవీ 300కి ఎలక్ట్రిక్ వెర్షన్ అయినప్పటికీ కొత్త వాహనం పొడవు 4 మీటర్ల లోపు కాకుండా 4.2 మీటర్ల స్థాయిలో ఉంటుందన్నారు.
విద్యుత్ కార్ల తయారీలో ఉపయోగించే మాడ్యులర్ ఎలక్ట్రిక్ డ్రైవ్ మ్యాట్రిక్స్ (ఎంఈబీ) పరికరాల కోసం ఎంఅండ్‌ఎం ఇటీవలే ఫోక్స్‌వ్యాగన్‌తో జట్టు కట్టింది.
చదవండి👉ఈ కార్‌ని ఇప్పుడు బుక్ చేసుకుంటే..డెలివరీ అయ్యేది రెండేళ్ల తర్వాతే!
Comments
Please login to add a commentAdd a comment