దేశీయ కార్పొరేట్ దిగ్గజం మహీంద్రా క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది. త్వరలో ప్రారంభంకానున్న క్రికెట్ వరల్డ్‌కప్-2023 కోసం స్టార్ స్పోర్ట్స్‌తో కలిసి అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు కో పవర్డ్ స్పాన్సర్‌గా పని చేయనుంది. క్రికెట్‌తో తమకున్న అనుబంధాన్ని విస్తరించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహీంద్రా సంస్థ వెల్లడించింది. కాగా, మహీంద్రా కంపెనీ ఆటోమొబైల్ మరియు ఫార్మింగ్ సెక్టార్లలో అగ్రగామిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్‌కప్-2023 ప్రారంభంకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, గత వరల్డ్‌కప్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో క్రికెట్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. అంతకుముందే భారత్.. చెన్నైలో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది (అక్టోబర్ 8న). ఆతర్వాత అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్, 19న బంగ్లాదేశ్, 22న న్యూజిలాండ్, 29న ఇంగ్లండ్, నవంబర్ 2న శ్రీలంక, నవంబర్ 5న సౌతాఫ్రికా, 12న నెదర్లాండ్స్‌తో తలపడనుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో వరల్డ్‌కప్ ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment