నెలకు 5,000 వాహన అమ్మకాలు లక్ష్యం | Mahindra set an ambitious target to sell 5,000 units monthly of its new electric models | Sakshi
Sakshi News home page

నెలకు 5,000 వాహన అమ్మకాలు లక్ష్యం

Published Wed, Jan 8 2025 2:54 PM | Last Updated on Wed, Jan 8 2025 3:17 PM

Mahindra set an ambitious target to sell 5,000 units monthly of its new electric models

వాహన తయారీ దిగ్గజం మహీంద్రా(Mahindra) అండ్‌ మహీంద్రా బీఈ–6, ఎక్స్‌ఈవీ 9ఈ టాప్‌ వేరియంట్ల ధరలను ప్రకటించింది. రెండు మోడళ్లూ మూడు వేరియంట్లలో లభిస్తాయి. ఎక్స్‌షోరూంలో టాప్‌ వేరియంట్స్‌ అయిన బీఈ–6 ప్యాక్‌–3 ధర రూ.26.90 లక్షలు కాగా ఎక్స్‌ఈవీ 9ఈ ప్యాక్‌–3 రూ.30.5 లక్షలు ఉంది. 2024 నవంబర్‌లో కంపెనీ రెండు మోడళ్లను ఆవిష్కరించి ఎలక్ట్రిక్‌ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈవీల ప్రారంభ ధర రూ.18.9 లక్షలు ఉంటుందని వెల్లడించింది. 

వేరియంట్‌నుబట్టి బీఈ–6 గరిష్టంగా ఒకసారి చార్జింగ్‌ చేస్తే 682 కిలోమీటర్లు, ఎక్స్‌ఈవీ 9ఈ 656 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కాగా, నెలకు 5,000 యూనిట్లు విక్రయించాలని మహీంద్రా లక్ష్యంగా చేసుకుంది. చకన్‌ ప్లాంటు సామర్థ్యాన్ని నెలకు 90,000 స్థాయికి తీర్చిదిద్దుతోంది. దీనిని 1.2 లక్షల యూనిట్లకు పెంచే అవకాశమూ ఉంది. 2021–27 మధ్య ఎలక్ట్రిక్‌ వాహనాల వ్యాపారం కోసం రూ.16,000 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు మహీంద్రా ఇప్పటికే వెల్లడించింది.  

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు ఒకే ప్లాట్‌ఫామ్‌

ఒకే ప్లాట్‌ఫామ్‌ ద్వారా రిటైల్‌(Retail) ఇన్వెస్టర్లు వివిధ బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీలలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు(FD) చేసేందుకు టాటా డిజిటల్‌ తెరతీసింది. సూపర్‌యాప్‌ ‘టాటా న్యూ’ ద్వారా ఇందుకు వీలు కల్పిస్తోంది. కస్టమర్లు పొదుపు ఖాతా లేకుండానే తమ సొమ్మును వివిధ ఫైనాన్షియల్‌ సంస్థలలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు మళ్లించుకోవచ్చునని టాటా డిజిటల్‌ తెలియజేసింది. గరిష్టంగా 9.1 శాతం వరకూ వడ్డీని ఫైనాన్షియల్‌ సంస్థలు ఆఫర్‌ చేస్తున్నట్లు పేర్కొంది. పోటీతత్వంతో కూడిన వడ్డీ రేట్లతో సులభంగా, భద్రంగా సొమ్మును ఎంపిక చేసుకున్న ఫైనాన్షియల్‌ సంస్థలలో దాచుకునేందుకు తమ ప్లాట్‌ఫామ్‌ ఉపయోగపడుతుందని వివరించింది. రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని, బ్యాంకులో పెట్టుబడులకు డీఐసీజీసీ(DICGC) ద్వారా రూ. 5 లక్షల వరకూ డిపాజిట్‌ బీమా ఉంటుందని తెలియజేసింది. ఎన్‌బీఎఫ్‌సీలలో బజాజ్‌ ఫైనాన్స్, శ్రీరామ్‌ ఫైనాన్స్‌ తదితరాలున్నట్లు పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement