ప్రభుత్వ ఆధ్వర్యంలోని డెరైక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ హెల్త్ అండ్ సేఫ్టీ (డీఐఎస్‌హెచ్) టాటా ఎలక్ట్రానిక్స్‌కు షోకాజ్ నోటీసు అందజేసింది. గత నెల 28న తమిళనాడులోని టాటా యూనిట్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదానికి సంబంధించి వివరణ ఇవ్వాలని డీఐఎస్‌హెచ్ నోటీసుల్లో పేర్కొంది. దీనిపై కంపెనీ ప్రతినిధులు వారంలోపు స్పందించాలని తెలిపింది.
ఫ్యాక్టరీల చట్టం ప్రకారం..ఫ్యాక్టరీ వ్యవహారాలపై అంతిమ అధికారం కలిగి ఉన్న వ్యక్తి కార్మికుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమం కోసం బాధ్యత వహించాల్సి ఉంటుంది. చట్టప్రకారం ఆ వ్యక్తిని ‘ఆక్యుపైయర్’గా పరిగణిస్తారు. కంపెనీ డైరెక్టర్లు లేదా సంస్థ ప్రతిపాదించిన వ్యక్తి ఈ హోదాలో ఉండవచ్చు. కార్మికుల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆక్యుపైయర్ తెలియజేయాల్సి ఉంటుంది. ప్రమాదానికిగల కారణాలు చెప్పాలి. ఎక్కడ తప్పు జరిగిందో వివరించడానికి కంపెనీకి ఒక అవకాశం కల్పించడం కోసం ఇలా ఈ షోకాజు నోటీసు జారీ చేసినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: బంగారం స్వచ్ఛత తెలుసుకోండిలా..
ఇప్పటికే డీఐఎస్‌ఎహెచ్ ప్రమాదానికిగల కారణాలను అంచనా వేసిందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. తమిళనాడు హోసూర్‌లోని టాటా ఎలక్ట్రానిక్స్‌కు చెందిన యానోడైజింగ్ ప్లాంట్‌లో థర్మోస్టాట్ నియంత్రణ వైఫల్యం కారణంగా మంటలు చెలరేగాయని కంపెనీ అధికారులు చెప్పారు. ఈ యూనిట్‌లో యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఉత్పత్తుల తయారీని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు కంపెనీ ఇదివరకే ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment