Showcause Notice
-
కాలాహరిధాన్ ట్రెండ్జ్‌పై సెబీ కొరడా
న్యూఢిల్లీ: ఇటీవలే ఎన్ఎస్ఈ ఎస్ఎంఈ(NSE SME) ప్లాట్‌ఫాం ఎమర్జ్‌లో లిస్టయిన కాలాహరిధాన్ ట్రెండ్జ్‌పై (KTL) నిబంధనల ఉల్లంఘనకుగాను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనరాదంటూ కంపెనీతో పాటు ప్రమోటర్లు నిరంజన్ డి అగర్వాల్, ఆదిత్య ఎన్ అగర్వాల్, సునీత నిరంజన్ అగర్వాల్‌ను ఆదేశించింది. అలాగే వారిని పూర్తిగా నిషేధిస్తూ ఎందుకు ఉత్తర్వులు ఇవ్వరాదో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది.క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించడంలో విఫలమైందంటూ కేటీఎల్పై హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి ఫిర్యాదు రావడంతో సెబీ ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. 2024 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ 15 వరకు సాగిన విచారణలో.. ఈ డిఫాల్ట్ వివరాలను కంపెనీ వెల్లడించకుండా డిస్క్లోజర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించింది. పైగా బంగ్లాదేశ్‌లోని ఒక కల్పిత సంస్థ నుంచి భారీ ఆర్డరు వచ్చిందని, పెద్ద ఎత్తున కార్యకలాపాలు విస్తరిస్తున్నామని తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసిందని మధ్యంతర ఉత్తర్వుల్లో సెబీ పేర్కొంది. దీన్ని కప్పి పుచ్చేందుకు ఈమెయిల్స్ సృష్టించినట్లు వివరించింది.ఇదీ చదవండి: మార్కెట్లోకి కొత్త ఐపీవోలుమొత్తం మీద కంపెనీపై సానుకూల అభిప్రాయాన్ని ఏర్పరచి షేర్లలో ట్రేడ్ చేసేలా ఇన్వెస్టర్లను పురిగొల్పి, షేర్లను అమ్ముకుని లబ్ధి పొందేందుకే కేటీఎల్ నిర్దిష్ట కార్పొరేట్ ప్రకటనలను చేసినట్లు సెబీ పేర్కొంది. పైపెచ్చు రైట్స్ ఇష్యూ ద్వారా మరో విడత నిధుల సమీకరణ కూడా కంపెనీ తలపెట్టింది. ఈ నేపథ్యంలోనే సెబీ తాజా ఆదేశాలు జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరి 23న ఇష్యూ ధర రూ.45తో పోలిస్తే రూ.47.15 వద్ద లిస్టయిన కేటీఎల్ షేరు ప్రస్తుతం రూ.20 స్థాయిలో ఉంది. -
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షో కాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ నెల 12లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కుల గణాంక నివేదికను కాల్చివేయడంపై పార్టీ కార్యకర్తలు, ఓబీసీ సంఘాల నుండి అనేక ఫిర్యాదులు, అభ్యంతరాలు అందాయి. మీరు కుల గణన సర్వేపై అభ్యంతరకర భాషను ఉపయోగించారు. కులగణన సర్వే రాహుల్ గాంధీ ఆలోచన. తెలంగాణ రాష్ట్రం కేవలం 50 రోజుల్లో కుల గణాంకాన్ని పూర్తిచేసి చరిత్రలో నిలిచింది. ఈ గణాంకాలు 56 శాతం జనాభా వెనుకబడిన వర్గాలకు చెందినవారిగా, అందులో 10 శాతం ముస్లిం మైనారిటీలుగా నిర్ధారించాయి.రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ ఈ కుల గణాంకాలను 50 రోజుల్లో పూర్తి చేయడాన్ని, ఎస్సీలను మూడు వర్గాలుగా వర్గీకరించడాన్ని ప్రశంసించారు. కానీ మీరు పార్టీ ప్రయోజనాలను పక్కనపెట్టి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీగా పార్టీ నిబంధనలు, మార్గదర్శకాలను ఉల్లంఘించారు. గౌరవించాల్సిన నియమాలను విస్మరించారు. ఇది పార్టీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. మీకు ఈ షోకాజ్ నోటీసు అందిన తేదీ నుండి ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలి. లేదంటే మీపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లకు పంపిన షోకాజు నోటీసుల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హెచ్చరించింది. -
గురుకుల టీచర్లకు సర్కార్ బెదిరింపులు
సాక్షి, అమరావతి: న్యాయమైన తమ డిమాండ్లు తీర్చాలని శాంతియుతంగా సమ్మె చేస్తున్న గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల పొట్ట కొట్టేందుకు కూటమి ప్రభుత్వం షోకాజ్ నోటీసు పేరుతో మరో అస్త్రాన్ని ప్రయోగించింది. డీఎస్సీ నుంచి గురుకుల టీచర్ల పోస్టులు మినహాయించాలని, కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్లు (సీఆర్టీ)గా గుర్తించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే తదితర ప్రధాన డిమాండ్లతో గత నెల 16 వ తేదీ నుంచి రాష్ట్రంలోని 1,656 మంది గురుకుల టీచర్లు సమ్మె బాట పట్టారు. రాష్ట్రంలోని విజయవాడ ధర్నా చౌక్‌తోపాటు సీతంపేట, పార్వతీపురం, పాడేరు గిరిజన సమీకృత అభివృద్ధి (ఐటీడీఏ) కార్యాలయాల వద్ద శాంతియుత ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే వారి డిమాండ్లను పరిశీలిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రితో సహా ఉన్నతాధికారులు రెండు దఫాలుగా ఇచ్చిన హామీలు బుట్టదాఖలు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 371 ఆశ్రమ పాఠశాలల నుంచి 550 మంది ఉపాధ్యాయులను గురుకులాల్లో బోధనకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. గురుకుల ఔట్ సోర్సింగ్ టీచర్లు గతంలో ఉన్న షరతులకు లోబడి మూడు రోజుల్లో విధుల్లో చేరాలని, లేదంటే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు పరిగణించి తదుపరి చర్యలు తీసుకుంటామని తాజాగా గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ బెదిరింపులకు దిగారు. ఆయా గురుకుల కాలేజీల ప్రిన్సిపాళ్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ సంస్థలో పనిచేసే ఔట్ సోర్సింగ్ టీచర్లకు నోటీసులు అందిస్తున్నారు. కాగా, గిరిజన గురుకులాల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న జేఎల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ, ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లు 11 నుంచి 20 రోజులుగా అనుమతి లేకుండా సమ్మె చేస్తున్నారని ఆ షోకాజ్ నోటీసులో పేర్కొనడం గమనార్హం. -
టాటా కంపెనీకి షోకాజ్ నోటీసులు
ప్రభుత్వ ఆధ్వర్యంలోని డెరైక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ హెల్త్ అండ్ సేఫ్టీ (డీఐఎస్‌హెచ్) టాటా ఎలక్ట్రానిక్స్‌కు షోకాజ్ నోటీసు అందజేసింది. గత నెల 28న తమిళనాడులోని టాటా యూనిట్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదానికి సంబంధించి వివరణ ఇవ్వాలని డీఐఎస్‌హెచ్ నోటీసుల్లో పేర్కొంది. దీనిపై కంపెనీ ప్రతినిధులు వారంలోపు స్పందించాలని తెలిపింది.ఫ్యాక్టరీల చట్టం ప్రకారం..ఫ్యాక్టరీ వ్యవహారాలపై అంతిమ అధికారం కలిగి ఉన్న వ్యక్తి కార్మికుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమం కోసం బాధ్యత వహించాల్సి ఉంటుంది. చట్టప్రకారం ఆ వ్యక్తిని ‘ఆక్యుపైయర్’గా పరిగణిస్తారు. కంపెనీ డైరెక్టర్లు లేదా సంస్థ ప్రతిపాదించిన వ్యక్తి ఈ హోదాలో ఉండవచ్చు. కార్మికుల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆక్యుపైయర్ తెలియజేయాల్సి ఉంటుంది. ప్రమాదానికిగల కారణాలు చెప్పాలి. ఎక్కడ తప్పు జరిగిందో వివరించడానికి కంపెనీకి ఒక అవకాశం కల్పించడం కోసం ఇలా ఈ షోకాజు నోటీసు జారీ చేసినట్లు తెలిసింది.ఇదీ చదవండి: బంగారం స్వచ్ఛత తెలుసుకోండిలా..ఇప్పటికే డీఐఎస్ఎహెచ్ ప్రమాదానికిగల కారణాలను అంచనా వేసిందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. తమిళనాడు హోసూర్‌లోని టాటా ఎలక్ట్రానిక్స్‌కు చెందిన యానోడైజింగ్ ప్లాంట్‌లో థర్మోస్టాట్ నియంత్రణ వైఫల్యం కారణంగా మంటలు చెలరేగాయని కంపెనీ అధికారులు చెప్పారు. ఈ యూనిట్లో యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఉత్పత్తుల తయారీని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు కంపెనీ ఇదివరకే ప్రకటించింది. -
ఎర్ర మట్టి దిబ్బల తవ్వకాలు.. గనుల శాఖ షోకాజ్ నోటీసులు
సాక్షి, విశాఖపట్నం: ఎర్ర మట్టి దిబ్బల తవ్వకాలపై మైనింగ్ శాఖ స్పందించింది. తవ్వకాలపై గనులు శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 280 ఎకరాల ఎర్ర మట్టి దిబ్బల్లో అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. తవ్వకాలపై పర్యావరణ వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రమట్టి దిబ్బల అక్రమ లే ఔట్ కోసం 39,454 క్యూబిక్ మీటర్ల కంకర ఉపయోగించారని మైనింగ్ అధికారులు తేల్చారు.ఏపీ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్-1966ను ఉల్లంఘించినట్లు గుర్తించిన గనుల శాఖ.. పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీస్ జారీ చేసింది. వివరణ ఇవ్వకపోతే మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ మైనింగ్ శాఖ నోటీసులో పేర్కొంది.ఇది చదవండి: మట్టి దిబ్బలు మటాష్ -
Lok Sabha Election 2024: అభిజిత్ గంగోపాధ్యాయ్‌కు ఈసీ నోటీసులు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హైకోర్టు మాజీ జడ్జి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ్‌కు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీచేసింది. ‘మమతా బెనర్జీ మీరు ఎంతకు అమ్ముడుపోయారు? మీ రేటు 10 లక్షలు, ఎందుకంటే మీరు కేయా సేథ్తో మేకప్ చేయించుకుంటున్నారు. మమత అసలు మహిళేనా? అని నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోతుంటా’ అని అభిజిత్ ఇటీవల ప్రచారసభలో వ్యాఖ్యానించారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రియాన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. న్యాయవ్యవస్థలో ఉన్నత పదవిని నిర్వహించిన వ్యక్తి మహిళల గౌరవానికి భంగం కలించేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. దీనిపై స్పందించిన ఈసీ ఈనెల 20వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా వివరణ ఇవ్వాలని అభిజిత్ గంగోపాధ్యాయ్‌కు నోటీసులు జారీచేసింది. -
‘రాహుల్ కంటే మోదీ పాపులర్’ వ్యాఖ్యలు.. చిక్కుల్లో కార్తీ చిదంబరం
చెన్ననై: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరానికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మద్దతుగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ క్రమశిక్షణా కమిటీ తరపున మాజీ ఎమ్మెల్యే కేఆర్ రామసామి ఈ నోటీసులు జారీ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. కాగా ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న కార్తీ.. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించారు. రాహుల్ కంటే ప్రధాని మోదీకి ఎక్కువ పాపులారిటీ ఉందని వ్యాఖ్యానించారు. మోదీతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సరిపోతారా అనే ప్రశ్నకు చిదంబరం స్పందిస్తూ.. బీజేపీ ప్రచార యంత్రాంగానికి ఎవరూ సరిపోరని అన్నారు. ప్రధాని మోదీకి ప్రజాదరణ అధికంగా ఉందని.. ఆయన్ను మరొకరితో పోల్చమని అడిగితే.. తాను వెంటనే ఎవరి పేరు చెప్పలేనని అన్నారు అదే విధంగా కాంగ్రెస్ వ్యతిరేకివస్తున్న ఈవీఎంల మిషన్ల వాడకం గురించి కార్తీ మద్దతుగా మాట్లాడారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఇటీవల ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈవీఎమ్‌లపై విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే పార్లమెంటరీ సభ్యుడికి నోటీసులు జారీ చేసే అధికారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి మాత్రమే ఉందని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. తమిళనాడులో ఆయనను ముఖ్యనేతగా ఎదగనివ్వకుండా చేసేందుకే జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే షోకాజ్ నోటీసులు జారీ చేశారని ఆరోపించాయి. చదవండి: జనవరి 22న ఉత్తర ప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సెలవు -
ప్రియాంక గాంధీకి ఈసీ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాకు గురువారం కేంద్రం ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకుగానూ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి.. ప్రియాంక గాంధీ తప్పుడు ప్రకటనలు చేశారని అక్టోబర్ 21వ తేదీన ఈసీఐకి ఫిర్యాదు వెళ్లింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. తన ప్రసంగం ద్వారా రెచ్చగొట్టేలా ఆమె మాట్లాడరని ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. ఈ నేపథ్యంలో షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఈసీ.. అక్టోబర్ 30 సాయంత్రలోపు నోటీసులకు స్పందించాలని ఆమెను కోరింది. నవంబర్ 25వ తేదీన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అక్టోబర్ 20వ తేదీన దౌసా బహిరంగ సభలో ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగించారు. ‘‘మోదీ ఓ ఆలయానికి ఇచ్చిన విరాళం కవర్‌ను తెరిస్తే.. అందులో కేవలం 21రూ. మాత్రమే ఉన్నాయి. టీవీలో ఆ వార్త చూశా. అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ, బీజేపీ ప్రజలకు ఇచ్చే హామీలు కూడా ఆ ఎన్వెలప్ లాంటివే. అందులో ఏమీ ఉండవు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రియాంక ప్రసంగానికి సంబంధించిన వీడియోను సైతం ఫిర్యాదుకు జత పరిచింది బీజేపీ. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆమెకు ఈసీ నోటీసులు జారీ చేసింది. వైరల్‌గా వీడియో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది ప్రారంభంలో రాజస్థాన్ భిల్వారా దేవ్ నారాయణ ఆలయాన్ని సందర్శించారు. దేవ్ నారాయణ జయంతి సందర్భంగా జనవరి 28న ఆలయాన్ని సందర్శించిన మోదీ అక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అలాగే హుండీలో విరాళాలు కూడా సమర్పించారు. అయితే ఈ ఆలయం హుండీ ప్రత్యేక సందర్భాల్లోనే తెరుస్తారు. భాద్రపద మాసం (హిందూ క్యాలెండర్ ప్రకారం) ఛత్ తిథి కావడంతో సెప్టెంబర్ 25వ తేదీన హుండీ తెరిచి.. విరాళాలు లెక్కించారు. అయితే అందులో ప్రధాని మోదీ పేరుతో ఉన్న కవరు కనిపించింది. ఆలయ పూజారి హేమ్రాజ్ పోస్వాల్ స్వయంగా కవర్‌ను తెరచి చూడగా ఇందులో కేవలం రూ. 21 రూపాయలు మాత్రమే కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
NCLAT సభ్యులకు కోర్టు ధిక్కార నోటీసులు
ఢిల్లీ: దేశసర్వోన్నత న్యాయస్థానంలో బుధవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ సభ్యులిద్దరికి సుప్రీం కోర్టు కోర్టు ధిక్కారం కింద షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 30వ తేదీన వాళ్లిద్దరిని తమ ఎదుట హాజరు కావాలని సీజేఐ ధర్మాసనం ఆ నోటీసుల్లో ఆదేశించింది. ఫినోలెక్స్ కేబుల్స్ వార్షిక సమావేశానికి సంబంధించిన వ్యవహారంలో అక్టోబర్ 13వ తేదీన ‘స్టేటస్ కో’(యధాతథ స్థితి) ఆదేశాలు ఇచ్చింది సుప్రీం కోర్టు. అయితే ఆ ఆదేశాలతో సంబంధం లేకుండా.. ఎన్సీఎల్ఏటీ జ్యూడీషియల్ సభ్యుడు రాకేశ్ కుమార్, టెక్నికల్ మెంబర్ డాక్టర్ అలోక్ శ్రీవాస్తవలు ఈ వ్యవహారంపై దాఖలైన అప్పీల్‌పై తీర్పు ఇచ్చారు. ఈ విషయాన్ని సంబంధిత లాయర్లు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఈ విషయంపై దర్యాప్తు జరపాలని ఎన్సీఎల్ఏటీ చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు స్టేటస్ కో ఆదేశాల గురించి తమకు తెలియదని ఆ ఇద్దరు సభ్యులు చైర్పర్సన్ ముందు వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని దర్యాప్తు నివేదికలో పొందుపరిచారు చైర్పర్సన్. అయితే దర్యాప్తు నివేదిక ఇవాళ సుప్రీం కోర్టుకు చేరింది. దానిని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. అయితే.. సుప్రీం కోర్టు ఆదేశాలు తెలిసి కూడా ఎన్సీఎల్ఏటీ తీర్పు వెల్లడించినట్లు ప్రాథమికంగా ధర్మాసనం గుర్తించింది. ఆ ఇద్దరు సభ్యులను అక్టోబర్ 30వ తేదీన తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. అంతేకాదు సుప్రీం స్టేటస్ కో ఆదేశాల్ని ఉల్లంఘిస్తూ ఎన్సీఎల్ఏటీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సైతం పక్కనపెట్టేసిన సుప్రీం ధర్మాసనం.. ఈ అంశాన్ని చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్ ముందుకు బదిలీ చేసింది. -
‘చంద్రబాబు రాజకీయమంతా చీకటి చరిత్ర’
సాక్షి, విశాఖపట్నం: ఐటీ నోటీసులపై చంద్రబాబు నాయుడు సంబంధం లేని సమాధానాలు దాటవేస్తున్నారని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. రెండు రోజులుగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ షో కాజ్ నోటీసుల గురించి జాతీయ మీడియా కథనాలు ఇస్తున్నాయి. అయినా ఆయన తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వడం లేదు. పైగా పొంతన లేని సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నారు. రూ.118 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఐటీ నోటీసుల ద్వారా స్పష్టమవుతోంది. అలాంటప్పుడు ఐటీ నోటీసులకు ఎందుకు సమాధానం ఇవ్వరు. ప్రజలకు నీతులు చెప్పే చంద్రబాబు.. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానాలు చెప్పాలి కదా అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయమంతా చీకటి చరిత్ర. ఆయన ఎదుగుదల.. ముందు వెనుక ఆస్తుల గురించి జనానికి తెలుసు. బాబు రాజకీయం అంతా కుట్రలు.. కుతంత్రాలే. చంద్రబాబు నేరుగా నాయకుడిగా ఎదగలేదు. వెన్నుపోటు ద్వారానే రాజకీయంగా ఎదిగారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకునిపై ఇన్ని కుంభ కోణాలు లేవు. నారా వారి పల్లి నుంచి జూబ్లీ హిల్స్ వరకు ఆయనదో అవినీతి సామ్రాజ్యం. వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరు. అన్నాహజారే వారసుడినంటూ చెప్పుకునే చంద్ర బాబు.. ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించరు. బాబు మీరు దొరికి పోయారని మీకు తెలుసు. ఇప్పటి వరకు బయటకు వచ్చింది తీగ.. ఇంక డొంక కదలాలి. ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టిన విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి అంటూ మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. స్కిల్డ్ క్రిమినల్.. అన్ స్కిల్డ్ పొలిటీషియన్ 2020 నుంచి జూన్ వరకు నాలుగు నోటీసులు ఇచ్చారు...సంబంధం లేని వివరణ ఇస్తారు. 46 పేజీల షోకాజ్ నోటీసు ఇస్తే తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదునేను మీ జూరిడిక్షన్ లో లేను అంటారు. ఎంవిపి అనే వ్యక్తి కంపెనీ ల నుంచి అవినీతి సొమ్ము వసూలుకు మీడియేటర్ గా పని చేసినట్టు తేలింది. 2019లో చంద్రబాబుని ఎంవీపిని కలవడం ఆయన పీఏ శ్రీనివాస్ ప్రకారం పని చేయమని చెప్పడం జరిగింది. మొత్తం 118 కోట్లు చంద్రబాబు అందినట్టు నోటీసుల్లో వుంది. మీ పీఏ శ్రీనివాస్ మీ అక్రమాల గురించి చెబితే నా పేరు లేదంటారు. మీ కొడుకు పేరు కూడా నోటీసులో వుంది. చంద్ర బాబు స్కిల్డ్ క్రిమినల్ .అన్ స్కిల్డ్ పొలిటీషియన్ ఆధాయ పన్నుశాఖ దర్యాప్తులో విషయం బయట పడింది. సీమెన్స్ అనే సంస్థలో ఓ వ్యక్తి ద్వారా రూ. 3,356 కోట్లు పెట్టుబడి పెడుతుందని చెప్పి ప్రభుత్వ వాటా రూ. 350 కోట్లు మళ్లించారు. యూరో లాటరీ మాదిరిగా సీమెన్స్ పేరిట మోసం చేశారు. ఈ 350 కోట్లు అత్యవసర క్యాబినెట్ ద్వారా మళ్లించారు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ పేరిట ..అమరావతి పేరిట ఎన్నో అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు ప్రజా కోర్టులో సమాధానం చెప్పాలి.. అవినీతి బాబు కథ విచారణకు ఈడీ జోక్యం చేసుకోవాలి అని మంత్రి అమర్నాథ్ కోరారు. -
చంద్రబాబుకు ఐటీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆదాయ పన్నుల శాఖ(ఐటీ) నోటీసులు జారీ చేసింది. టీడీపీ హయాంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందాయనే అభియోగాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ కేసు దర్యాప్తు ఎన్నికల సమయంలో వేగవంతంగా జరుగుతున్న తరుణంలో రాజకీయాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. టీడీపీ ప్రభుత్వంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందినట్లు ఐటీ శాఖ గర్తించింది. టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా ముడుపులు పొందినట్లు ఐటీశాఖకు ఖచ్చితమైన సమాచారం అందింది. ఇందుకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రాథమిక ఆధారాలను సైతం సేకరించినట్లు తెలుస్తోంది. 2016లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్ ద్వారా షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని సబ్ కాంట్రాక్టర్‌గా అవతారం ఎత్తారని ఐటీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం మనోజ్ వాసుదేవ్‌ను విచారించారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా ముడుపులు చేతులు మారినట్లు షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ అంగీకరించినట్లు ఐటీ తెలిపింది. మనోజ్ వాసుదేవ్ స్వయంగా 2016 నుంచి 2019 వరకు ఎన్ని కాంట్రాక్ట్‌లు పొందారు..అందుకు ఎలా డబ్బు సమకూర్చారు.. ముడుపులు ఎలా చేతులు మారాయనే అంశాలకు సంబంధించి ఐటీ శాఖకు మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చారని ఐటీ స్పష్టం చేసింది. షాపూర్ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి, ఎల్‌అండ్‌టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు అందినట్లు ఐటీశాఖకు మనోజ్ వాసుదేవ్ తెలియజేసినట్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లించారని ఆరోపణలు సైతం వినిపించాయి. చంద్రబాబు సమాధానంపై ఐటీ అభ్యంతరాలు షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు చేసే సమయంలో కీలకమైన సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. వాట్సాప్ ద్వారా కొన్ని మెసేజ్‌లు, చాట్లు,ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎక్స్ఎల్ షీట్లను కూడా ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా నిధులు మళ్లించి వాటిని చంద్రబాబుకు అందేలా చేశారని ఐటీ తన అభియోగంలో వెల్లడించింది. మరోవైపు 2016లో ఆగష్టులో చంద్రబాబు సెక్రటరీ శ్రీనివాస్ తనను కలిసి పార్టీకి ఫండ్ ఇవ్వాల్సిందిగా చెప్పినట్లు మనోజ్ వాసు దేవ్ ఐటీకి స్టేట్మెంట్ సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఆగస్ట్ 4న హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం నుంచి సెక్షన్ 153సీ కింద మరోసారి నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. The Income Tax department has issued a show-cause notice to TDP chief #ChandrababuNaidu, asking why an amount of ₹118 crore, allegedly received by him, should not be treated as “undisclosed income”. (Reports @utkarsh_aanand)https://t.co/IeAQiZnlU2 — Hindustan Times (@htTweets) September 1, 2023 -
గాలిపై దాడి ‘రాజిరెడ్డికి’ నోటీసులు?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : గ్రూపు విభేదాలు, అంతర్గత కుమ్ములాటలతో నిత్యం వార్తలతో ఉండే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కమిటీల కిరికిరి కొనసాగుతోంది. ఆ పార్టీ మండల, పట్టణ అధ్యక్షుల నియామకంపై తారాస్థాయిలో రచ్చ జరుగుతోంది. పలు మండల, పట్టణ కమిటీలను ఏకపక్షంగా ప్రకటించారంటూ హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ను ముట్టడించగా, ఏకంగా పరస్పరం దాడులకు దిగు తున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. కాంగ్రెస్‌లో ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్యనేతల మ ధ్య ఉన్న విభేదాలు ఇప్పటి వరకు జిల్లా స్థాయిలోనే బట్టబయలు కాగా, ఇప్పుడు గాంధీభవన్ స్థాయిలో రచ్చ జరగడం చర్చనీయాంశంగా మారింది. మెదక్ కమిటీలు నియామకం ఏకపక్షమంటూ.. మెదక్ నియోజకవర్గంలోని, మండల, పట్టణ అధ్యక్ష పదవుల నియామకం రచ్చకు దారితీసింది. ఈ కమిటీలను ఏకపక్షంగా నియమించారని ఆరోపిస్తూ టీపీసీసీ సభ్యుడు సుప్రభాత్రావు వర్గం ఏకంగా గాంధీభవన్‌ను ముట్టడించింది. కంఠారెడ్డి తిరుపతిరెడ్డిని డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ తెరపైకి తెచ్చారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం ఐదు సంవత్సరాలు ఒకే పదవిలో కొనసాగుతున్న వారిని తొలగించాలని మరో పీసీసీ నేత మ్యాడం బాలకృష్ణ వర్గం పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ‘ఆవుల’కు టీపీసీసీ షోకాజ్ నోటీసులు? నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం విషయంలో ఏకంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్‌పై దాడి జరగ్గా, ఆలస్యంగా వెలుగు చూసింది. టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఆవుల రాజిరెడ్డి వర్గానికి చెందిన నాయకులు పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి నివాసం వద్ద ఏకంగా గాలిపై దాడి చేయడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సీరియస్‌గా తీసుకుంది. ఇందుకు బాధ్యులైన వెల్దుర్తి మండల పార్టీ మాజీ అధ్యక్షుడితో పాటు, మరో ముగ్గురుపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనలో ఆవుల రాజిరెడ్డికి కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. తెల్లాపూర్ కమిటీ విషయంలో కాటాకు షాక్.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పట్టణ అధ్యక్ష పదవి విషయంలోనూ వివాదం రాజుకుంది. ఈ కమిటీ విషయంలో నియోజకవర్గ ముఖ్య నాయకుడు కాటా శ్రీనివాస్‌గౌడ్ షాక్ తగిలింది. ముందుగా కాటా శ్రీనివాస్‌గౌడ్ అనుచరుడు రవీందర్‌ను తెల్లాపూర్ పట్టణ అధ్యక్షుడిగా నియమించినట్లు ప్రకటించారు. కానీ ఈ పదవికి చిలుకమర్రి ప్రభాకర్‌రెడ్డిని నియమిస్తున్నట్లు టీపీసీసీ నుంచి ఉత్తర్వులు రావడం పార్టీ వర్గాల్లో రచ్చకు దారితీసింది. సిద్దిపేట డీసీసీపైనా తిరుగుబాటు బావుటా.. మండల, పట్టణ కమిటీల నియామకాల విషయంలో సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డిపైనా ఆయన వ్యతిరేక వర్గం తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. మండల, పట్టణ కమిటీల నియామకంలో ఏకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత జశ్వంత్‌రెడ్డి వర్గం నాయకులు ఇటీవల గాంధీభవన్ ముట్టడించారు. నర్సాపూర్ బీఆర్ఎస్ పార్టీకి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని జశ్వంత్‌రెడ్డి వర్గం ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. -
ఆహారం వికటించి విద్యార్థినులకు అస్వస్థత
ఆత్మకూర్/అమరచింత/వనపర్తి: ఆహారం విషతు ల్యమై.. 60 మంది విద్యా ర్థినులు అనారోగ్యానికి గురికాగా.. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వనపర్తి జిల్లా అమరచింతలోని కేజీబీవీలో గురువారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగితే.. శుక్రవా రం ఉదయం వరకు బాధిత విద్యా ర్థినులకు కనీ సం వైద్యం అందించలేకపోయారు. అమరచింతలోని కేజీబీవీలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం 340 మంది విద్యా ర్థినులు చదువుకుంటున్నారు. గురువారం హాజరైన 270 మంది విద్యా ర్థినులు రాత్రి 7.30 గంటలకు అన్నం, పప్పు, సాంబార్, వంకాయకూర, మజ్జిగతో భోజనాలు చేశారు. అయితే అర్ధరాత్రి 2 గంటల నుంచి విద్యార్థినులకు కడుపునొప్పి రావడంతో వెంటనే అందుబాటులో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. ఏఎన్ఎం, ఇతర సిబ్బంది లేకపోవడంతో.. కోలుకుంటారని ఉదయం వరకు నిరీక్షించారు. కానీ, ఉదయం విద్యా ర్థినులు హాహాకారాలు చేయడంతో అంబులెన్స్‌లో ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మొదట 10 మందితో మొదలైన బాధితుల తరలింపు 50 మందికి చేరుకుంది. అమరచింతలోని డీఎంఆర్ ఆస్పత్రిలో మరో 10 మంది విద్యా ర్థినులను చేరి్పంచారు. ఇందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యానికి వనపర్తి జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఎస్వో తొలగింపు.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్ అమరచింత కేజీబీవీలో విద్యా ర్థినులు అస్వస్థతకు గురైన సంఘటనను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తీవ్రంగా పరిగణించారు. కేజీబీవీ ఎస్వో స్వప్నరాణిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ, ఇన్చార్జ్ డీఈవో గోవిందరాజులు, జీసీడీవో సుబ్బలక్ష్మికి శుక్రవారం రాత్రి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వంట ఏజెన్సీని తక్షణమే మార్చాలని ఆదేశించారు. కొన్ని రోజులుగా సాయంత్రం విధులకు హాజరు కాకపోవడం.. పరిశీలనకు వెళ్లిన కలెక్టర్‌కు మద్యం తాగి విధులు నిర్వహిస్తున్నట్లు కనిపించిన ఏఎస్‌డబ్ల్యూవో సేవ్యానాయక్‌ను.. రూరల్ ఎస్ఐ నాగన్నతో డ్రంకెన్ టెస్ట్ నిర్వహించి సస్పెండ్ చేశారు. కొన్నిరోజులుగా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న కొత్తకోట ఎస్సీ హాస్టల్ వార్డెన్ సంతో‹Ùను కూడా సస్పెండ్ చేశారు. -
షోకాజ్ అందుకున్న మర్నాడే బీజేపీలోకి ఏలేటి
సాక్షి, న్యూఢిల్లీ/నిర్మల్: ‘నేనేమైనా ఉగ్రవాదినా? ఏమైనా తప్పు చేశానా? కారణం ఏమిటో చెప్పకుండా నాకు షోకాజ్ నోటీసు ఇవ్వడం.. గంటలోగా వివరణ కోరడం ఏమిటి? 15 ఏళ్లుగా అవినీతి మచ్చ లేకుండా పనిచేస్తున్న నన్ను ఎలాంటి ఆధారాల్లేకుండా, అభాండాలు వేసి బయటకు వెళ్లేలా చేశారు. కాంగ్రెస్ పార్టీలో అవమానాల నుంచి విముక్తి కోసమే బీజేపీలో చేరా’అని తెలంగాణ సీనియర్ నేత, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా ఉన్న మహేశ్వర్‌రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలో బీజేపీలో చేరారు. గురువారం ఉదయమే ఢిల్లీ చేరుకున్న ఆయన తొలుత బీజేపీ చేరికల కమిటీ కన్వీ నర్ ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యారు. అనంతరం వారిద్దరూ కలసి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ నివాసంలో ఛుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ప్రత్యేకంగా సమావేశమ య్యారు. ఆ తరువాత ఆయన్ను తరుణ్ ఛుగ్, బండి సంజయ్, ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సంగప్ప బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ మహేశ్వర్‌రెడ్డికి జేపీ నడ్డా పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం జేపీ నడ్డా నివాసం వద్ద తెలంగాణ బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడారు. బీజేపీ, మోదీతోనే అరాచక పాలనకు తెర రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను అంతమొందించడం కేవలం బీజేపీ, ప్రధాని మోదీ వల్లే సాధ్యమవుతుందని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. అందువల్లే తాను బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు కలసి అడుగులేసే దిశగా నడుస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతిపై పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీ ఏమీ పట్టనట్లుగా పార్లమెంటులో వారితో కలసి తిరుగుతోందని విమర్శించారు. బీఆర్ఎస్తో పొత్తు విషయంలో కాంగ్రెస్ నాయకులు రోజుకో విధంగా మాట్లాడుతూ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారని... దీంతో రాష్ట్రంలో పార్టీ దయనీయమైన పరిస్థితికి చేరుకుందని, ఎటుచూసినా అయోమయం నెలకొందని మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్కు కోవర్టులుగా ఉన్నారనే నిందలను పలువురు కాంగ్రెస్ నేతలపై మోపుతున్నారని... అసలు ఎవరు ఎవరి కోవర్టులో తెలుసుకోలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు. 15 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఎలాంటి వివాదాలు లేకుండా పనిచేస్తున్న తనపై కావాలనే కొందరు సోషల్ మీడియాలో నిందలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. కొంతకాలంగా కాంగ్రెస్‌లో ఒక నాయకుడు పథకం ప్రకారమే సీనియర్లను బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అందరం కలసికట్టుగా...: సంజయ్ రాష్ట్రంలో అహంకారపూరిత నియంత పాలనను అంతమొందించడానికి ప్రతి ఒక్కరం కలసికట్టుగా పనిచేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. మహేశ్వర్‌రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు బీజేపీలో చేరడం సంతోషకరమన్నారు. కేవలం నిర్మల్ జిల్లానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లో బీజేపీ బలపడేందుకు మహేశ్వర్‌రెడ్డి లాంటి నాయకులు ఉపయోగపడతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలన్న ఏౖకైక లక్ష్యంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో మహేశ్వర్‌రెడ్డి చేరడం సంతోషకరమని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ తెలిపారు. రానున్న రోజుల్లో నిర్మల్ నుంచి పెద్ద ఎత్తున చేరికలుంటాయన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణను అందరికీ అందించేలా బీజేపీనే చర్యలు చేపడుతుందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. బీజేపీలో మహేశ్వర్‌రెడ్డి చేరికకు కారణాలివే సాక్షి, హైదరాబాద్: సొంత పార్టీలో విభేదాలు... నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ పరి ణామాలు... వెరసి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బీజేపీ కండువా కప్పుకోవడానికి కారణమయ్యాయి. కొంతకాలంగా మహేశ్వర్‌రెడ్డి పార్టీ మార్పు ప్రచారం జరుగుతున్నప్పటికీ నిర్మల్‌లో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌లోనే ఆయన కొనసాగు తారని భావించారు. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్‌తో ముదిరిన విభేదాలు, తాజాగా ఇచ్చిన షోకాజ్ నోటీసుతో ఏలేటి అహం దెబ్బతింది. అదే సమయంలో నియోజకవర్గంలో అధికార పార్టీ అసంతృప్త నేతలు బీజేపీలో చేరడానికి చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఏలేటి తన రాజకీయ వ్యూహాన్ని మార్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలసి ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కమలదళంలో చేరారు. మైనారిటీల ప్రభావం అధికంగా ఉండే నిర్మల్‌లో ఆయన నిర్ణయం ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందోననే అంశాలపై రాజకీయ పరిశీలకులు వేచి చూస్తున్నారు. -
Amara Raja: చట్ట ప్రకారమే ముందుకెళ్లండి: సుప్రీం
సాక్షి, ఢిల్లీ: అమర్ రాజా బ్యాటరీస్ కాలుష్యం వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోమవారం విచారణ సందర్భంగా.. షోకాజ్ నోటీస్ పై పబ్లిక్ హియరింగ్ నిర్వహించి.. చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే.. పీసీబీ ఆదేశాలపై అభ్యంతరాలు ఉంటే హైకోర్టుకు వెళ్లాలని అమర్ రాజాకు సూచించింది న్యాయస్థానం. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసిన సంగతి తెలిసిందే. అయితే.. 34 సార్లు నోటీసులు ఇచ్చి రాజకీయ కారణాలతో తమను వేధిస్తున్నారని అమర్ రాజా తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదించారు. ఈ తరుణంలో న్యాయస్థానం.. రాజకీయ కారణాలు ఏవైనప్పటికీ చట్టప్రకారం ముందుకు పోవాల్సిందే అని స్పష్టం చేసింది. అమర్ రాజా బ్యాటరీస్ తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని, పరిసర ప్రాంతాల జలాల్లో లెడ్ కంటెంట్ పెరిగిందని గతంలో నోటీసులు ఇచ్చింది ఏపీ కాలుష్య నియంత్రణ మండలి. జల, వాయు కాలుష్యాలను వెదజల్లుతూ కార్మికులు సహా చుట్టుపక్కల ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్న అమర్‌రాజా ఫ్యాక్టరీ యాజమాన్యంపై.. గతంలో అధికారుల విధులను అడ్డుకున్నందుకు పోలీసు కేసు నమోదైంది. -
షోకాజ్ నోటీసు ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవద్దు
సాక్షి, అమరావతి: సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను అవమానకరంగా మాట్లాడినందుకు సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో వివరించాలంటూ జారీ చేసిన షోకాజ్ నోటీసు ఆధారంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విషయంలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ఉత్తర్వులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేవీ సూర్యనారాయణ దాఖలు చేసిన వ్యాజ్యంలో మంగళవారం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటివరకు తుది నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. షోకాజ్ నోటీసుపై అధికరణ 226 కింద దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణార్హత లేదని చెప్పారు. ఈ మేరకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను చదివి వినిపించారు. సంఘం అధ్యక్షుడి సమాధానం ఆధారంగా తుది చర్యలుంటాయన్నారు. ఉద్యోగ సంఘం వారి సమస్యలపై పోరాటం చేయడం, సంఘం ప్రతినిధులు గవర్నర్‌ను కలవడంలో తప్పులేదన్నారు. ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను కించపరుస్తూ మాట్లాడటం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంతర్గత, సున్నిత, కీలక సమాచారాన్ని మీడియా ముఖంగా బహిర్గతం చేశారని, దీనిపైనే తమకు అభ్యంతరమని చెప్పారు. ఇది సర్వీసు నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. పిటిషనర్ సంఘం ప్రతినిధులకు భావ ప్రకటన స్వేచ్ఛ వర్తించదా అని ప్రశ్నించారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు ఏది పడితే అది మాట్లాడటానికి వీలు లేదన్నారు. వారికి నియమావళి ఉంటుందని, దానికి లోబడే పని చేయాలని చెప్పారు. అంతకు ముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వై.వి.రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. గవర్నర్‌ను కలిశారన్న కోపంతోనే ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసిందన్నారు. సంఘం గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందన్నారు. నోటీసు నామమాత్రపు చర్యేనని తెలిపారు. -
‘ఇప్పటం’ పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత వ్యవహారం కీలక మలుపు తిరిగింది. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లు కూల్చేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన యజమానులు చివరకు వాస్తవాన్ని హైకోర్టుకు నివేదించారు. అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారని ఇళ్ల యజమానుల తరఫు న్యాయవాది హైకోర్టు ముందు అంగీకరించారు. దీంతో వారిపై హైకోర్టు మండిపడింది. షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ, ఇవ్వలేదంటూ కోర్టుకొచ్చి, కూల్చివేతలపై స్టే పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని అసహనం వ్యక్తం చేసింది. క్రిమినల్ కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరించాలని పిటిషనర్లను ఆదేశించింది. పిటిషనర్లు స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అంతేకాక కూల్చివేతల విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలొద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాడేపల్లి మునిసిపల్ అధికారులు రోడ్డు విస్తరణ చేపట్టేందుకు రోడ్డును ఆక్రమించుకున్న ఇప్పటంలోని ఇళ్ల యజమానులకు మే 21న నోటీసులు జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ బెల్లంకొండ వెంకట నారాయణ, మరో 13 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా నేరుగా కూల్చివేత నోటీసులు ఇచ్చారని వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ తిల్హారీ కూల్చివేత నోటీసుల ఆధారంగా పిటిషనర్ల ఇళ్ల విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఈ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా మునిసిపల్ కార్పొరేషన్ తరఫు న్యాయవాదులు మలసాని మనోహర్‌రెడ్డి, జి.నరేష్ కుమార్‌లు వాదనలు వినిపించారు. పిటిషనర్లకు కొందరికి పోస్టు ద్వారా, మరికొందరికి వ్యక్తిగతంగా గతంలోనే నోటీసులు అందజేశామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నింటినీ అఫిడవిట్ రూపంలో కోర్టు ముందుంచారు. దీనిపై ఏమంటారని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో పిటిషనర్లు వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు. అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారంటూ పిటిషనర్ల న్యాయవాది టి.సాయిసూర్య అంగీకరించారు. ఆ విషయాన్ని పిటిషన్లో ఎందుకు ప్రస్తావించలేదని న్యాయమూర్తి నిలదీశారు. ఉదయం కూల్చివేతలు మొదలుపెట్టడం, దానిపై హడావుడిగా లంచ్‌మోషన్ పిటిషన్ వేయడం, పిటిషనర్లు నిరక్షరాస్యులు కావడం తదితర కారణాలతో షోకాజ్ నోటీసుల విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించలేదని సాయిసూర్య చెప్పారు. ఈ వివరణతో న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. పిటిషనర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టారని చెప్పడంవల్లే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశామని గుర్తు చేశారు. కోర్టు ముందు వాస్తవాలను తొక్కిపెట్టినందుకు క్రిమినల్ కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలని పిటిషనర్లను ఆదేశించారు. పిటిషనర్లు కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలని వారి తరఫు న్యాయవాదికి స్పష్టం చేశారు. -
టీపీసీసీ సీరియస్.. మీటింగ్‌కు ఎందుకు రాలేదు?
సాక్షి, హైదరాబాద్: మీటింగ్‌కు హాజరు కాని 11 మంది అధికార ప్రతినిధులకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాలని టీపీసీసీ కోరింది. నిన్న(శనివారం) టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి నేతృత్వంలో గాంధీభవన్‌లో కీలక భేటీ జరిగింది. సమావేశానికి హాజరుకావాల్సిందిగా పలువురు నేతలకు సమాచారం ఇచ్చారు. ఈ మీటింగ్‌కు 11 మంది ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గైర్హాజరయ్యారు. దీంతో క్రమశిక్షణ కమిటీ సీరియస్ అయ్యింది. వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలుంటాయని కమిటీ హెచ్చరించింది. చదవండి: రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం: చిరంజీవి -
ఆయనకు మనమిచ్చిన షోకాజ్.. సార్!
ఆయనకు మనమిచ్చిన షోకాజ్.. సార్! -
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి హైకమాండ్ షోకాజ్ నోటీస్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ కాల్ రికార్డ్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ అయ్యింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వెంకట్‌రెడ్డి ఆడియో లీక్‌పై క్రమశిక్షణ కమిటీ వివరణ కోరింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. మాణిక్యం ఠాగూర్ ఫిర్యాదుతో వెంకట్‌రెడ్డికి ఏఐసీసీ డిసిప్లినరీ కమిటీ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల క్రితం మునుగోడు ఓటర్‌తో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరిన వెంకట్‌రెడ్డి ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. చదవండి: మునుగోడులో పోస్టర్ వార్ కాగా, మునుగోడు ఉప ఎన్నిక వేళ.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆడియో లీక్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్ ఓడితే.. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్ అవుతానంటూ వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హైకమాండ్ షోకాజ్ నోటీసులు
-
వివాదాస్పద మైడెన్కు భారీ షాక్:అక్టోబరు 14 వరకు గడువు
సాక్షి,ముంబై: వివాదాస్పద దేశీయ ఫార్మ కంపెనీ మైడెన్ ఫార్మాకు మరో భారీ షాక్ తగిలింది. కంపెనీ ఉత్పత్తి చేసే దగ్గు మందులు ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ హరియాణా ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోనెపట్‌లోని దాని తయారీ ప్లాంట్‌లో తనిఖీల అనంతరం హరియాణా స్టేట్ డ్రగ్స్ కంట్రోలర్, లైసెన్సింగ్ అథారిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌తో సంయుక్త తనిఖీ తర్వాత హర్యానా డ్రగ్ అధికారులు మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు ఈ నోటీసులిచ్చింది. సంస్థ డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ ప్రొపైలిన్ గ్లైకాల్ నాణ్యత పరీక్షను నిర్వహించలేదని, సంబంధిత పత్రాలు కూడా సక్రమంగా లేవంటూ ఫార్మా కంపెనీ అక్టోబర్ 14 లోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలి, లేని పక్షంలో దానిపై చర్య తీసుకుంటామని అక్టోబరు 7న జారీ చేసిన నోటీసుల్లో తెలిపింది. (చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు) డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, హర్యానా, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 రూల్స్, 1945 రూల్ 85(2) ప్రకారం న్యూ ఢిల్లీలోని మైడెన్ ఫార్మాకు నోటీసులిచ్చింది. తమ తనిఖీల్లో అనేక ఉల్లంఘనలను గుర్తించిన నేపథ్యంలో కంపెనీ తయారీ లైసెన్స్‌ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపాలని కోరుతూ నోటీసు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తన నివేదికను సమర్పించిన రాష్ట్ర ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసు అందిన 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని మైడెన్ ఫార్మాను ఆదేశించింది. రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ కమ్ లైసెన్సింగ్ అథారిటీ, హరియాణా ఎఫ్‌డీఏ మన్మోహన్ తనేజా తెలిపారు.ప్రొపైలిన్ గ్లైకాల్ (బ్యాచ్ నంబర్ E009844) తయారీ తేదీ సెప్టెంబర్ 2021, గడువు తేదీ సెప్టెంబరు 2023ని ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్‌ల తయారీలో ఉపయోగించినట్టు కనుగొంది. అలాగే నవంబర్ 2024 నాటికి, ఉత్పత్తి షెల్ఫ్-లైఫ్ ముడి పదార్థం కంటే ఎక్కువ అని తేలింది. కాగా ఇటీవల గాంబియాలో 66 మంది చిన్నారుల మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మైడెన్ దగ్గు సిరప్‌లపై హెచ్చరికలు జారీ చేసింది. మైడెన్ ఫార్మా ఉత్పత్తులు ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ సిరప్స్లోని నాణ్యత లేని, కలుషితమైన పదార్థాలే పిల్లల మరణాలకు కారణమని పేర్కొన్న సంగతి తెలిసిందే. (ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్: ఐఫోన్13పై కళ్లు చెదిరే ఆఫర్) -
బీజేపీ షోకాజ్ నోటీసుకు రాజాసింగ్ సమాధానం.. ఏమన్నారంటే!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఇచ్చిన షోకాజు నోటీసుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. రాజసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆగస్ట్ 23న బీజేపీ అధిష్టానం షోకాజు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే జైల్లో ఉండటంతో సమాధానం ఇచ్చేందుకు గడువు కావాలని రాజాసింగ్ సతీమణి ఉషాబాయి అప్పట్లో కోరారు. ఈ క్రమంలో బీజేపీ షోకాజు నోటీసుకు రాజాసింగ్ సోమవారం సమాధానం ఇచ్చారు. బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉంటానని జాతీయ నాయకత్వానికి రాజసింగ్ లేఖ రాశారు. పార్టీ ఉల్లంఘన కార్యకలాపాలకు తానెప్పుడూ పాల్పడలేదని. పార్టీ లైన్ దాటి ఎప్పుడూ ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. ప్రజలకు, హిందువులకు సేవ చేయటానికి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. హిందూ ధర్మం కోసం పోరాడుతున్నందునే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎంఐఎం, టీఆర్ఎస్లు కుట్రపూరితంగా తనపై 100 కేసులు పెట్టాయని తెలిపారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంఐఎం మత రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. చదవండి: రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కాంట్రాక్టరే: బండి సంజయ్ ‘పాతబస్తీలో ఎంఐఎం ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ.. హిందువులను ఇబ్బంది పెడుతున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం దురాగతాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నాను. హిందులను రెచ్చగొట్టేందుకే మునావర్ ఫారుకీ షోను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. మునావర్ ఫారుకీ హిందూ దేవుళ్లను కించపరిచిన విషయాన్నే నేను ప్రస్తావించాను. ఏ మతాన్ని.. ఇతర దేవుళ్ళను కించపరచలేదు.’ అని బీజేపీకి రాసిన లేఖలో రాజాసింగ్ ప్రస్తావించారు. చదవండి: విధుల నుంచి మాజీ సీఐ నాగేశ్వరరావు తొలగింపు -
రావణుడి తలలు దహనం కాలేదని షోకాజ్ నోటీసులు, గుమస్తాపై వేటు
చత్తీస్‌గఢ్: దసరా వేడుకల్లో చివరి రోజైన విజయదశమి నాడు రావణ దహనం నిర్వహించడం సర్వసాధారణం. అయితే, చత్తీస్‌గఢ్‌లోని ధామ్తరిలో మాత్రం రావణ దహనం కార్యక్రమం వైరల్‌గా మారింది. ఎందుకంటే రావణుడి పదితలలు కాలలేదు. కేవలం దిష్టిబొమ్మ కింద భాగం అంత బూడిదైపోయింది. దీంతో ఈ ఘటనపై ధామ్‌తరీ పౌర సంఘం సీరియస్ అయ్యి ఒక గుమస్తాని సస్పెండ్ చేసి కొంతమంది అధికారులకు షోకాజ్‌నోటీసులు కూడా జారీ చేసింది. ఈ మేరకు అక్టోబర్5న ధామ్తరిలో రామ్‌లీలా మైదాన్‌లో రాక్షసరాజు రావణుడి దహనం చేస్తున్నప్పుడూ ఈ వింత ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ వేడుకల్లో రావణ దిష్టిబొమ్మ దహనాన్ని పర్యవేక్షిస్తోంది స్థానిక పౌరసంఘం. అంతేగాదు ధామ్తరి మున్సిపల్ కార్పొరేషన్ (డీఎంసీ) గుమస్తా రాజేంద్ర యాదవ్ రావణ దిష్టిబొమ్మ రూపొందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సీరియస్ అయ్యి విధుల నుంచి బహిష్కరించింది. పైగా యాదవ్ రావణ దిష్టి బొమ్మను తయారుచేయడంలో మున్సిపల్ కార్పోరేషన్ ప్రతిష్టను కించపరిచేలా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మండిపడింది. అంతేగాదు ఆయన స్థానంలో సమర్థ రాణాసింగ్ అనే వ్యక్తిని నియమించినట్లు డీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్ పద్మవర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు అధికారులు అసిస్టెంట్ ఇంజనీర్ విజయ్ మెహ్రా, సబ్ ఇంజనీర్లు లోమస్ దేవాంగన్, కమలేష్ ఠాకూర్, కమతా నాగేంద్రలపై డీఎంసీ షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. దిష్టి బొమ్మను తయారు చేసే బాధ్యతలను అప్పగించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని, వారి వేతనాల చెల్లింపులు కూడా నిలిపేస్తున్నామని ధామ్తరి మేయర్ విజయ దేవగన్ అన్నారు. (చదవండి: గేదెలు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్ రైలు.. 24 గంటల్లోనే రిపేర్) -
నోరు జారా.. క్షమించండి: అద్దంకి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్పాడు. అభ్యంతరకరవ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనోభావాలు దెబ్బతిన్నందుకు ఆయనకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్తున్నట్లు ప్రకటించారు అద్దంకి దయాకర్. శుక్రవారం చండూరు సభలో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై విమర్శలు గుప్పించాడు. ఈ క్రమంలో వెంకటరెడ్డిని సైతం ఉద్దేశిస్తూ.. పార్టీలో ఉంటే ఉండూ లేకుంటే.. అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలే చేశాడాయన. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో అద్దంకి దయాకర్‌పై విమర్శలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నేతలు పలువురు అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా సీనియర్ల సమక్షంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఎవరూ నిలువరించకపోవడంపై ఏఐసీసీ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. అద్దంకి దయాకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది తెలంగాణ కాంగ్రెస్. దీంతో.. వెంకటరెడ్డి, ఆయన అభిమానులకు క్షమాపణలు చెప్తున్నా. ఏదో ఆవేశంలో నోరు జారాను. క్షమించండి. పార్టీకి నష్టం చేయాలని ఎప్పుడూ నేను భావించను. నా వ్యాఖ్యలపై అధిష్టానానికి వివరణ ఇవ్వాలని అనుకున్నా. ఈ లోపే షోకాజ్ నోటీసు ఇచ్చారు. మరోసారి ఇలా తప్పు జరగకుండా చూసుకుంటా అని అద్దంకి దయాకర్ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. సీనియర్ నేత మల్లు రవి సైతం అద్దంకి క్షమాపణలపై స్పందించారు. కాంగ్రెస్ సోషల్ జస్టిస్ సమావేశంలో అద్దంకి దయాకర్ చేసిన వాఖ్యల పై చర్చ జరిగింది. అద్దంకి చేసిన వాఖ్యలు ప్రజల్లో తప్పుడు చర్చకు దారి తీశాయి. వెంకటరెడ్డికి అద్దంకి దయాకర్ క్షమాపణ చెప్పాలని నిర్ణయించాం. షోకాజ్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వివరణ ఇవ్వడానికి అద్దంకి సిద్దంగా ఉన్నారు అని మల్లు రవి తెలిపారు. ఇదీ చదవండి: టార్గెట్ రేవంత్.. మరోసారి తెరపైకి మాజీ ఎంపీ కుమారుడి టాపిక్! -
సీఎంకు చల్లటి చాయ్.. అధికారికి నోటీసులు
భోపాల్: ముఖ్యమంత్రి, రాజకీయ ప్రముఖులకు చల్లని చాయ్ అందించిన వ్యవహారంలో.. ఓ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రొటోకాల్ ఉల్లంఘన పేరిట జారీ అయిన ఆ నోటీసుకు సరైన వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఉన్నతాధికారులు. ముఖ్యమంత్రికి అందించిన టీ బాగోలేదని, పైగా చల్లగా ఉందంటూ మధ్యప్రదేశ్‌లో ఓ కిందిస్థాయి అధికారిపై చర్యలకు ఉపక్రమించారు. జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్ కాన్హౌ ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఉన్నతాధికారుల ఆరోపణ. ఈ మేరకు ఛాతర్పూర్ జిల్లా రాజ్‌నగర్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్(ఎస్డీఎం) డీపీ ద్వివేది.. రాకేశ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. సోమవారం ఖజురహో ఎయిర్‌పోర్ట్‌లో కాసేపు ఆగారు. ఆ సమయంలో ఎయిర్పోర్ట్ వీఐపీ లాంజ్‌లో సీఎంతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వాళ్లకు టిఫిన్‌తో పాటు టీ అందించారు అధికారులు. అయితే టీ చల్లారిపోయి ఉండడంతో వాళ్లంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు.. ఆ కార్యక్రమ వ్యవహారాలను చూసుకున్న జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్‌కు నోటీసులు పంపించారు. నాసికరం, పైగా చల్లారిన టీ అందించినందుకు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకపోతే ఏకపక్షంగా చర్యలు కఠినంగానే తీసుకుంటామని ఎస్డీఎం ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. -
ట్రాఫిక్ ఏసీపీ మార్నింగ్ వాక్! మండిపోయిన జనం ఏం చేశారంటే..
కొచ్చి: అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరించాలనుకుంటే.. సోషల్ మీడియా ఊరుకోవట్లేదు. సామాజిక మాధ్యమాల సాయంతో జనాలు ఆ విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం వెనువెంటనే జరిగిపోతున్నాయి. తాజాగా కేరళలో ఓ ట్రాఫిక్ పోలీస్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది. మార్నింగ్ వాక్ కోసం ఏకంగా ఓ రోడ్డునే బ్లాక్ చేయించాడు ట్రాఫిక్ విభాగంలోని ఉన్నతాధికారి. కొచ్చి అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ (వెస్ట్) వినోద్ పిళ్లై.. క్వీన్స్‌వాక్‌వేలోని రోడ్డును మూయించేసి మరీ మార్నింగ్ వాక్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో నిరసనలు మొదలయ్యాయి. వాస్తవానికి ఆ రోడ్డు ఆదివారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య పిల్లల సైక్లింగ్, స్కేటింగ్ కోసం మూసేయాలి. అయితే మిగతా రోజుల్లోనూ ఉదయం పూట ఆ రోడ్డును మూయించి.. మార్నింగ్ వాక్ చేయడం మొదలుపెట్టాడు ట్రాఫిక్ ఏసీపీ వినోద్ పిళ్లై. అంతేకాదు ఆయన వాకింగ్ చేస్తున్నంత సేపు సిబ్బంది ట్రాఫిక్ డైవర్షన్ బాధ్యతలు చూసుకునేవాళ్లు. ఈయన దెబ్బకు పిల్లల్ని స్కూల్ బస్సులు ఎక్కించడానికి.. రోడ్డుకు మరోవైపు దాదాపు అర కిలోమీటర్ దూరం దాకా వెళ్లాల్సి వచ్చింది పేరెంట్స్. మూడు రోజుల పాటు ఈ సమస్యను ఎదుర్కొన్న స్థానికులు.. చిర్రెత్తుకొచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వరుసగా పోస్టులతో నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో విషయం పైఅధికారుల దృష్టికి చేరింది. దీంతో వినోద్ పిళ్లైకి షో కాజ్ నోటీసు జారీ చేసింది పోలీస్ శాఖ. ఇదిలా ఉంటే.. కుక్క ఈవెనింగ్ వాక్ కోసమని కోసమని స్టేడియాన్ని ఖాళీ చేయించిన ఘటనపై.. ఢిల్లీలో ఓ ఐఏఎస్ కపుల్‌ను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేసింది కేంద్రం. చదవండి: ట్రెండింగ్‌లో ‘కుక్క’! కారణం ఏంటంటే.. -
ఆర్డర్ చేసిన ఫుడ్‌లో పాము చర్మం...షాక్‌లో కస్టమర్
Snake skin found in food: ఇటీవల కోవిడ్ -19 తర్వాత ప్రజలు నేరుగా రెస్టారెంట్‌కి వెళ్లి తినడాని కంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని తినడానికే ఇష్టపడుతున్నారు. అదీగాక జోమాటో, స్వీగ్గీ వంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ యూప్‌లు ప్రజలకు వెసులుబాటు కలిగించేలా మంచి డిస్కోంట్లు ఇచ్చి మరీ సేవలందింస్తుంది. వీకెండ్ సమయాల్లో మరింత ఆకర్షీణీయమైన పుడ్ ఆఫర్లతో భోజనప్రియులకు మరింత చేరువవుతోంది. దీంతో ప్రజలు కూడా ఆన్లైన్లో ఫుడ్‌ని ఆర్డర్ చేసుకుని తినడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే వారికి ఊహించని భయంకరమైన చేదు అనుభవం ఎదురైంది. అంతేకాదు ఆ ఘటన మళ్లీ ఇంకెప్పుడు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసి తినడానికి జంకేలా చేసింది. వివరాల్లోకెళ్తే...కేరళలోని తిరువనంతపురంలో ప్రియా అనే ఒక మహిళ నెడుమంగడు ప్రాంతంలోని ఒక రెస్టారెంట్ నుంచి రెండు పరోటాలను ఆర్డర్ చేసింది. పైగా ఆర్డర్ కూడా సకాలంలోనే డెలివరీ అయింది. ఐతే ఆమె మొదటగా తమ కుమార్తెకు పరోటా పెట్టింది. కానీ ఆ తర్వాత ఆ పరోటా పార్మిల్ని ఫ్యాకింగ్ చేసిన కవర్ మీద సుమారు అరవేలు పొడవు అంతా పాము చర్శం చూసి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. దీంతో ఆమె ఆగ్రహం చెంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐతే సదరు రెస్టారెంట్ ఆహారాన్ని ప్యాకింగ్ చేసిన పేపర్ పై పాము చర్మం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఫుడ్ సేఫ్టీ అధికారి అర్షిత బషీర్ తెలిపారు. అంతేకాదు వంటగదిలో తగినంత వెలుతురు కూడా లేదని సరైన పరిశుభ్రత పాటించకుండా ఆహారం తయారు చేసున్నారని అన్నారు. సదరు రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేయడం తోపాటు ఆ రెస్టారెంట్ యజమానికి షాకాజ్ నోటీసులు కూడా పంపించినట్లు వెల్లడించారు. (చదవండి: నిమ్మకాయలతో మామూలుగా ఉండదు.. జైలు అధికారి సస్పెండ్!) -
కోహ్లికి షోకాజ్ నోటీసు ఇవ్వాలనుకున్న గంగూలీ!
సౌతాఫ్రికా టూర్లో టీమిండియా టెస్టు సిరీస్ కోల్పోయిన తర్వాత విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ఒక సీనియర్ ప్లేయర్‌గా జట్టుకు అందుబాటులో ఉంటానని.. ఇన్ని రోజులు తనకు కెప్టెన్సీ అవకాశమిచ్చిన బీసీసీఐకి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్విటర్లో పెద్ద సందేశాన్ని రాసుకొచ్చాడు. ఇప్పుడంటే కోహ్లి అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకున్నాడు కాబట్టి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. చదవండి: Kohli VS Bavuma: కోహ్లితో బవుమా గొడవ.. ఏం జరిగింది? కానీ ఇదే కోహ్లి.. సౌతాఫ్రికా టూర్ బయలుదేరడానికి ముందు మీడియా ముందుకు వచ్చి బీసీసీఐతో పాటు గంగూలీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి కారణం వన్డే కెప్టెన్సీ తొలగింపు వివాదమే. ఈ వివాదం ఎంత రచ్చగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వన్డే కెప్టెన్సీ విషయంలో తనను అడగకుండానే బీసీసీఐ నిర్ణయం తీసుకుందని... కెప్టెన్‌గా తప్పుకోవద్దంటూ గంగూలీ తనను అడగలేదంటూ కోహ్లి కుండబద్దలు కొట్టాడు. దీంతో బీసీసీఐకి, కోహ్లికి.. పరోక్షంగా గంగూలీతో వివాదం తారాస్థాయికి చేరిందంటూ వార్తలు వచ్చాయి. దీంతో భారత మాజీ క్రికెటర్లు జోక్యం చేసుకొని .. కోహ్లి ఆటపై దృష్టి పెట్టాలని పేర్కొనడంతో వివాదం సద్దుమణిగింది. చదవండి: Virat Kohli-Sourav Ganguly: కోహ్లిపై మాట దాటేసిన దాదా.. కారణం అదేనా? తాజాగా దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు కోహ్లి తనపై చేసిన వ్యాఖ్యలకు బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో సౌరవ్ గంగూలీ షోకాజ్ నోటీసు ఇవ్వబోయాడని కొందరు క్రీడా పండితులు పేర్కొన్నారు. అయితే బీసీసీఐ బోర్డులో ఒక సభ్యుడి ఒత్తిడితో గంగూలీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఇండియా హెడ్న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం గంగూలీ.. కోహ్లికి షోకాజ్ నోటీసు ఇవ్వడానికి డ్రాఫ్ట్ లెటర్ కూడా తయారు చేశాడని.. కానీ బోర్డు సభ్యుడు ఒకరు అడ్డుపడడంతో గంగూలీ ఆ ఆలోచనను మానుకున్నట్లు తెలిసింది. దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు కోహ్లి చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమని రిపోర్టులో పేర్కొన్నారు. ఒకవేళ ఈ వార్తలు నిజమై.. గంగూలీ కోహ్లికి షోకాజ్ నోటీసు ఇచ్చి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉండేవని క్రీడా పండితులు పేర్కొన్నారు. చదవండి: వన్డే కెప్టెన్సీపై కోహ్లి వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన బీసీసీఐ..! -
9 నెలలు.. 40 మందికి ‘షోకాజ్’లు..
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని, వాటిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేర్చడంతోపాటు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంలో కీలక పాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శులు మాత్రం పనిభారంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జగిత్యాల జిల్లాలో 380 గ్రామ పంచాయతీలకు గాను 380 మంది పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. వీరు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గ్రామాల్లోనే ఉంటూ పరిశుభ్రత, పాలనలో తమదైన పాత్ర పోషిస్తున్నారు. కానీ చిన్నపాటి తప్పిదాలకే షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గత 9 నెలల కాలంలో 40 మందికి జారీ చేశారు. దీంతో కార్యదర్శులు విధులు నిర్వహించేందుకు జంకుతున్నారు. జీపీ కార్యదర్శులు చేసే పనులివే.. జీపీ కార్యదర్శులు నిత్యం గ్రామాల్లో ఉంటూ శానిటేషన్‌తోపాటు హరితహారం, పల్లెప్రగతి, ఉపాధిహామీ, ఇంకుడు గుంతలు, వర్మికంపోస్ట్‌ల షెడ్లు, రైతు కల్లాల నిర్మాణం తదితర పనులు చేయిస్తున్నారు. గ్రామాల్లో చేపట్టిన ప్రతీ పనిని ఫొటో తీసి, పీఎస్ యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఫలితంగా తీవ్రంగా మానసికఒత్తిడికి గురవుతున్నామని వాపోతున్నారు. రికార్డుల కస్టోడియన్‌తో తలనొప్పి.. గ్రామాల్లో రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత పనులు సక్రమంగా నిర్వహించడం లేదని ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో వారు ఆ నోటీసులకు సమాధానాలు ఇస్తూ రికార్డుల కస్టోడియన్ వంటి పనుల్లో తలమునకలవుతున్నారు. జీపీ కార్యదర్శులకు చెక్‌పవర్ లేకున్నా నిధుల దుర్వినియోగంలో రికార్డులు కస్టోడియన్ బాధ్యత ఉండటంతో వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ముగ్గురి సస్పెన్షన్.. గతంలో జాబితాపూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా పని చేసిన శ్రీవాణి ఎంబీ రికార్డులు లేకుండానే నిధులు డ్రా చేసేలా అవకాశం ఇచ్చారని ఆమెను సస్పెండ్ చేశారు. అలాగే ధర్మపురిలో పనిచేసిన చంద్రశేఖర్ 2018లో ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణం చేసుకుంటే ఇంటి నంబరు ఇచ్చారని, నెల రోజుల క్రితం సస్పెండ్ చేశారు. ధర్మపురి మండలం జైన పంచాయతీ నిధుల దుర్వినియోగంలో కార్యదర్శి మహబూబ్ పాషా, సర్పంచ్, ఉపసర్పంచ్ సస్పెండ్ అయ్యారు. చదవండి: తెలుగు అకాడమీలో రూ.64 కోట్ల గోల్మాల్.. -
'మా' ఎన్నికల వివాదంలో మరో ట్విస్ట్
-
'మా' ఎన్నికల్లో మరో ట్విస్ట్..నటి హేమకు నోటీసులు
MAA Elections 2021: 'మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్' ఎన్నికల వివాదంలో మరో ట్విస్ట్ ఎదురైంది. నటి హేమకు 'మా' క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. 'మా' ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌పై చేసిన ఆరోపణలకు వివరణ కోరుతూ హేమకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాగా మా ఎన్నికలు జరకుండా చేసి, అధ్యక్షుడిగా కొనసాగాలని నరేష్ పావులు కదుపుతున్నారంటూ నటి హేమ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుత ప్యానల్ ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా, ఉన్నదంతా ఖర్చు పెడుతూ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఆడియో టేప్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. 'మా' ఎన్నికలు జరపాలంటూ హేమ సంతకాల సేకరణ ప్రారంభించారు. ఇక ఈసారి మా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమలతో పాటు సీవీఎల్ నరసింహారావు ఉన్నారు. -
HCA: అజారుద్దీన్ సభ్యత్వం రద్దు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్‌పై అపెక్స్ కౌన్సిల్ వేటు వేసింది. ఈ సందర్భంగా అపెక్స్ కౌన్సిల్ అజారుద్దీన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హెచ్‌సీఏకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని అపెక్స్ కౌన్సిల్ తప్పు పట్టింది. కాగా అజార్‌పై ఉన్న కేసులు పెండింగ్‌లో ఉండడంతో హెచ్‌సీఏ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. చదవండి: క్రౌడ్ ఫండింగ్... సేవా ట్రెండింగ్ -
WazirX: ఇండియా అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్‌కి ఈడీ నోటీసులు!
న్యూఢిల్లీ: భారతదేశపు అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ఏజెన్సీ వాజిర్‌ఎక్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్(ఫెమా) ఉల్లంఘనకు పాల్పడిందన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సుమారు 2,790 కోట్ల రూపాయల ట్రాన్జాక్షన్స్పై ఉల్లంఘనలకు పాల్పడిందని వాజిర్‌ఎక్స్‌పై ఆరోపణలు ఉన్నాయి. వాజిర్ఎక్స్ కంపెనీ జెన్మయి ల్యాబ్స్ ప్రైవేట్ ల్యాబ్స్ లిమిటెడ్ పేరు మీద రిజిస్ట్రర్ అయ్యి ఉంది. డొమెస్టిక్ క్రిప్టోకరెన్సీ స్టార్టప్‌గా 2017లో దీనికి అనుమతులు లభించాయి. దీంతో ఈ కంపెనీ డైరెక్టర్ల పేరు మీదే ఈడీ నోటీసులు పంపింది. చైనాకు చెందిన ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్ల మీద అన్ని కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీ ట్రాన్జాక్షన్స్ జరిగినట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు చైనా నుంచి 57 కోట్ల రూపాయల విలువైన డబ్బు మన కరెన్సీలోకి మార్చేశారని, ఆతర్వాత బినాన్స్ వాలెట్లలోకి పంపించారని తేలింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ జరపనుంది. అంతేకాదు వజీర్ఎక్స్ సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించకుండానే.. లావాదేవీలు జరిపిందని, ఫెమా మార్గదర్శకాల్ని ఉల్లంఘించిందని ఈడీ పేర్కొంది. అభివృద్ధిలో భాగంగా క్రిప్టోకరెన్సీని ప్రొత్సహించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్న వేళ ఇలాంటి స్కామ్‌లు వెలుగుచూడడం మంచిది కాదని టెక్ నిపుణులు అంటున్నారు. అయితే ఈడీ నుంచి ఇంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదని వాజిర్ఎక్స్ సీఈవో నిశ్చల్‌శెట్టి ఒక ట్వీట్ చేశాడు. చదవండి: పోర్న్ క్రిప్టోకరెన్సీ తెలుసా? -
ఎస్ఈసీ నోటీసు: వివరణ ఇచ్చిన కొడాలి నాని
సాక్షి, విజయవాడ: ఎస్ఈసీ షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చారు మంత్రి కొడాలి నాని. ఆయన తరఫున తన న్యాయవాది తానికొండ చిరంజీవి శుక్రవారం ఎస్ఈసీ కార్యాలయంలో కమీషన్ కార్యదర్శి కన్నబాబుని కలిసి షోకాజ్ నోటీసుపై మంత్రి కొడాలి నాని వివరణను అందించారు. అనంతరం న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘ప్రెస్మీట్లో ఎన్నికల కమీషనర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం 5 లోపు సమాధానం ఇవ్వాలని తెలిపింది. ఎస్ఈసీ షోకాజ్ నోటీస్‌కి సమాధానం ఇచ్చాం’’ అన్నారు. ‘‘కొడాలి నాని ఎస్ఈసీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మంత్రికి చెడు కలిగించాలని ఈ నోటీసు ఇచ్చారు. నిమ్మగడ్డ, చంద్రబాబుల మధ్య ఉన్న బంధంపై ప్రజలు అనుకున్నదే మాట్లాడారు. ఒక పార్టీకి ఎస్ఈసీ కొమ్ము కాయడం వ్యక్తిగతమే. షోకాజ్ నోటీస్ వెనక్కి తీసుకోవాలని రిప్లై ఇచ్చాం. మంత్రి మొదటి విడత ఎన్నికల ఫలితాల గురించి మాత్రమే ప్రేస్‌మీట్‌లో మాట్లాడారు. ఒకవేళ ఎస్ఈసీ వాటిని అసంబద్ధమైన, దురదృష్టకరమైన వ్యాఖ్యలుగా భావిస్తే మేం లీగల్‌గా ఎదుర్కొంటాం. అందుకు తగిన సమయం ఇవ్వాలని కోరాం’’ అని తెలిపారు. ఎస్ఈసీ అంటే నాకు గౌరవం ఉంది: కొడాలి నాని రాజ్యాంగ సంస్థలు, ఎన్నికల కమిషన్‌పై నాకు గౌరవం ఉంది అన్నారు మంత్రి కొడాలి నాని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎస్ఈసీ షోకాజ్ నోటీస్‌పై వివరణ ఇచ్చాను. ఎన్నికల కమిషన్ మా పట్ల ఒక రకంగా, టీడీపీ పట్ల మరో రకంగా వ్యవహరిస్తున్నారన్న భావన ఉంది. తప్పు చేయని మాకు నోటీసులిచ్చి, ఎస్ఈసీని విమర్శించిన బాబుకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు. జరిగిన పరిణామాలపై ప్రశ్నిస్తే నోరు నొక్కాలని చూస్తున్నారు. ప్రజల్లో ఎస్ఈసీపై ఉన్న భావనను తొలగించుకోమని సూచించాను. ఎస్ఈసీ అంటే నాకు గౌరవం ఉంది. నా ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోకుండా నోటీసులు ఇచ్చారు. నా భావాన్ని అర్థం చేసుకొని నోటీసులు వెనక్కి తీసుకోవాలి. తొలిదశ తరహాలోనే అన్నివిడతల్లో ఫలితాలు రాబోతున్నాయి. ప్రజా తీర్పుని అడ్డుకోవటం ఎవరితరమూ కాదు. ఏపీలో టీడీపీ భూస్థాపితం కాబోతోంది’’ అన్నారు కొడాలి నాని. చదవండి: నిమ్మగడ్డ ‘ఇంటిఅద్దె అలవెన్స్’ నిగ్గుతేల్చండి -
హౌసింగ్ ఏఈలకు ‘షోకాజ్’
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇప్పటికే లక్షలాది మందికి ఇంటి స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం వారికి ఇళ్లు కూడా మంజూరు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ వేలాది మంది పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తోంది. స్థలాలు అందుకున్న లబ్ధిదారుల నుంచి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆప్షన్లు సైతం ప్రభుత్వం సేకరిస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని ఏ తరహాలో నిరి్మంచుకుంటారనేది లబ్ధిదారులే నిర్ణయించుకుని.. తమ ఆప్షన్ ఏమిటో తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా లబ్ధిదారుల నుంచి వచ్చే ఆప్షన్లను ఆన్లైన్లో నమోదు చేసే పనిని గృహ నిర్మాణ శాఖకు అప్పగించగా.. దానిని ఆన్లైన్ చేయడంలో ఆ శాఖ ఏఈలు క్రియాశీలకంగా పని చేయడం లేదు. 1.40 లక్షల మంది ఆప్షన్లు మాత్రమే నమోదు మొదటివిడత కింద రాష్ట్రవ్యాప్తంగా 15.60 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇప్పటివరకు 14.18 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసింది. అయితే, వీరిలో కేవలం 1.40 లక్షల మంది లబ్ధిదారుల నుంచి మాత్రమే అప్షన్లు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేశారు. దీంతో నమోదులో పురోగతి సాధించని ఏఈలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని హౌసింగ్ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో జిల్లా కలెక్టర్లు ఇప్పటికే అలాంటి ఏఈల జాబితాలను సిద్ధం చేశారు. ఇప్పటికే అనంతపురం కలెక్టర్ పలువురు హౌసింగ్ ఏఈలకు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిగిలిన జిల్లాల్లోని ఏఈలకూ షోకాజ్ నోటీసులు జారీచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. చివరి స్థానంలో చిత్తూరు జిల్లా లబ్ధిదారుల ఆప్షన్ల ఆన్లైన్ నమోదులో చిత్తూరు జిల్లా అధికారులు చాలా వెనుకబడ్డారు. ఆ జిల్లాలో ఇప్పటివరకు 1,66,181 మందికి ఇళ్లు మంజూరు కాగా.. వారిలో కేవలం 29 మంది లబ్ధిదారుల నుంచి మాత్రమే ఆప్షన్లు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేశారు. నెల్లూరు జిల్లాలో 51,059 ఇళ్లు మంజూరు కాగా.. 777 మందికి సంబంధించి ఆప్షన్లను మాత్రమే ఆన్లైన్లో పొందుపర్చారు. గుంటూరు జిల్లాలో 1,51,604 మందికి ఇళ్లు మంజూరు కాగా.. 982 మంది ఆప్షన్లు మాత్రమే నమోదయ్యాయి. -
వోడాఫోన్ ఐడియాకు ట్రాయ్ షాక్
సాక్షి, ముంబై: అప్పుల సంక్షోభానికి తోడు, ఏజీఆర్ బకాయిల ఇబ్బందుల్లో ఉన్న టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియాకు మరో షాక్ తగిలింది. వివాదాస్పద రెడ్ఎక్స్ ప్లాన్లద్వారా వినియోగదారులను తప్పుదోవ పట్టించిందని ఆరోపణలతో టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ వోడాఫోన్ ఐడియాకు షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఇందులో అందిస్తున్న అఫర్లలో పారదర్శకత లేదని, నియంత్రణ సూత్రాలకు అనుగుణంగా లేదని ట్రాప్ ఆరోపించింది. ఈ ఉల్లంఘనపై చర్య ఎందుకు తీసుకోకూడదో "కారణం చూపించమని" సంస్థను కోరింది. ఆగస్టు 31 లోగా సమాధానం ఇవ్వాలని ట్రాయ్ ఆదేశించింది. అయితే ఇదే వివాదంలో భారతి ఎయిర్‌టెల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. వొడాఫోన్ ఐడియా నెట్ స్పీడ్, ప్రియారిటీ కస్టమర్ కేర్ ఆఫర్లతో రెడ్ ఎక్స్ ప్లాన్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎయిర్టెల్ కూడా ప్లాటినం ప్లాన్లతో తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ప్రీమియం సేవలను ఆఫర్ చేస్తోంది. ట్రాయ్ గతంలో ఇదే విషయంపై వోడాఫోన్ ఐడియాతోపాటు ఎయిర్టెల్ ను ప్రశ్నించింది. సంబంధిత డేటాను అందించమని కోరింది. దీంతో ఎయిర్టెల్ ఆ ప్లాన్లకు మార్పులు, చేర్పులు చేసింది. అయితే వోడాఫోన్ ఐడియా మాత్రం ఈ ప్లాన్ కొత్తది కాదంటూ ప్రతికూలంగా స్పందించడంతో వివాదం నెలకొంది. -
కుష్బూకు హైకమాండ్ షోకాజ్ నోటీస్!?
సాక్షి, చెన్నై: నటి కుష్బూకు కాంగ్రెస్ హైకమాండ్ షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైందని సమాచారం. నటి కుష్బూను ఫైర్‌బ్రాండ్‌గా పేర్కొనవచ్చు. నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నారీమె. ఆ మధ్య డీఎంకే నుంచి బయటకు వచ్చిన కుష్బూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రచార కర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వివాదాలకు కేంద్ర బిందువుగా మారే కుష్బూ ఆ మధ్య రజనీకాంత్ ఒక వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. దీంతో రజనీ వివరణ ఇచ్చారు. అప్పుడు కుష్బూ రజనీకాంత్‌కు మద్దతుగా నిలిచారు. తాజాగా మరో వివాదానికి తెరలేపారు. ఇటీవల ప్రధానమంత్రి మోదీ నూతన విద్యావిధానాన్ని ప్రవేశ పెట్టారు. దీన్ని కాంగ్రెస్ ప్రచార కర్త కుష్బూ స్వాగతిస్తూ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంతే కాదు కుష్బూ బీజేపీలో ఉన్నత పదవి వస్తుందనే ఆశతో పార్టీని మారడానికి సిద్ధం అవుతున్నారనే ఆరోపణలను చేస్తున్నారు. దీనికి స్పందిచిన కుష్భూ తనకు పార్టీ మారే ఆలోచన లేదని, అదే విధంగా భావ ప్రకటన స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉందని పేర్కొన్నారు. (కమలం వైపు కుష్బూ చూపు) అదేవిధంగా తన వ్యాఖ్యలు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉంటే రాహుల్‌గాందీకి క్షమాపణ చెప్పుకుంటానని, అంతే కానీ తాను తల ఆడించే రోబో బొమ్మగా ఉండలేనని ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీకి మద్దతుగా వ్యాఖ్యలు చేసిన కుష్బూపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎస్.అళగిరి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లు, కుష్బూకు వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం. (కేంద్ర నిర్ణయానికి ఖుష్భూ మద్దతు) -
లంకా దినకర్‌కు బీజేపీ షోకాజ్ నోటీస్
సాక్షి, అమరావతి: పార్టీ నిర్ణయాలకు భిన్నంగా టీవీ చర్చల్లో మాట్లాడుతున్న లంకా దినకర్‌కు బీజేపీ రాష్ట్ర శాఖ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ► గత ఎన్నికల వరకు టీడీపీలో కొనసాగి తర్వాత ఆయన బీజేపీలో చేరారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చకు వచ్చే అంశాలను కొందరు టీడీపీ నేతలకు చేరవేస్తున్నట్టు దినకర్‌పై ఆరోపణలున్నాయి. ► ఈ నేపథ్యంలో ఆయన నుంచి వివరణ కోరుతూ షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. ► ఇదే కారణంతో మరికొందరు నేతలకూ నోటీసులు జారీ చేసింది. -
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సర్పంచ్‌లకు షోకాజ్ జారీ
సాక్షి, రంగారెడ్డి: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన, అనధికార లేఅవుట్లను అరికట్టడంలో విఫలమైన ఏడుగురు సర్పంచ్‌లు, ఇద్దరు ఉప సర్పంచ్‌లకు జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులు జారీచేయడానికి దారితీసిన అంశాలను ఆమె వివరించారు. 111 జీఓ పరిధిలో ఉన్న మొయినాబాద్ మండలం చిలుకూరులో అనధికార లేఅవుట్లను నిరోధించడంలో స్థానిక సర్పంచ్ గునుగుర్తి స్వరూప విఫలమయ్యారు. అలాగే అదే మండలంలోని తోలుకట్టలో అక్రమ లేఅవుట్లకు, ఇంటి నిర్మాణాలకు సర్పంచ్ కనకమామిడి శ్రీనివాస్ అనుమతులు ఇచ్చారు. కనకమామిడి గ్రామంలో సర్పంచ్ పట్లోళ్ల జనార్దన్‌రెడ్డి.. 111 జీఓ ఉల్లంఘనలు జరిగినా పట్టించుకోలేదు. ఆయా సర్వే నంబర్ల పరిధిలో 32 ఎకరాల విస్తీర్ణంలో అనధికార లేఅవుట్లను నిరోధించడంలో విఫలమయ్యారు. సురంగల్ సర్పంచ్ గడ్డం లావణ్య కూడా ఇదే తరహాలో విఫలమయ్యారు. కందుకూరు మండలం పులిమామిడి సర్పంచ్ వత్తుల అనిత.. 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేసిన పనులకు ఎలాంటి తీర్మాణాలూ, ఎంబీ రికార్డులు, ఓచర్లు, బిల్లులు లేకుండా.. పంచాయతీ కార్యదర్శికి తెలియకుండా చెక్కులు ఇచ్చారు. మహేశ్వరం మండలం సిరిగిరిపురం సర్పంచ్ కాసుల సురేష్.. గ్రామ పంచాయతీ ఖాతాలో రూ.20.22 లక్షలు నిల్వ ఉన్నప్పటికీ నిధుల్లేవని వార్తా పత్రికల ద్వారా తప్పుడు ప్రచారం చేశారు. యాచారం మండలం మొండిగౌరెళ్లి సర్పంచ్ బండమీది కృష్ణ ఎంపీడీఓను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టి అధికారులను భయబ్రాంతులకు గురిచేశారు. గ్రామ పంచాయతీ పాలనలో పంచాయతీ సెక్రటరీ సహకరించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా అవమానకర రీతిలో ప్రవర్తించారు. శంకర్పల్లి మండలం ఇర్రికుంటతండా ఉప సర్పంచ్ పి.లక్ష్మణ్.. 30 రోజుల ప్రణాళికలో భాగంగా పనులు చేస్తుండగా పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి పంచాయతీ సెక్రటరీ విధులకు ఆటంకం కలిగించారు. జీపీ పరిధిలో గతంలో చేసిన అభివృద్ధి పనులకు, సిబ్బంది వేతనాలకు సంబంధించిన చెక్కులపై ఇదే మండలానికి చెందిన మాసానిగూడ ఉప సర్పంచ్ పి.వెంకటేశ్వర్‌రెడ్డి సంతకాలు చేయలేదు. వీటన్నింటిపై విచారణ జరిపిన డీపీఓ.. కలెక్టర్ హరీష్ ఆదేశాల మేరకు మంగళవారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. -
అదితికి కాంగ్రెస్ షోకాజ్ నోటీసు
లక్నో : ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్‌కు ఆ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నడుచుకున్నందుకు ఈ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మ గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ సమావేశాలను ప్రతిపక్ష ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు బహిష్కరించాయి. కానీ అదితి మాత్రం బుధవారం రోజున అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేసి.. దానిపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. దీనిపై యూపీ సీఎల్పీ నాయకుడు అజయ్ కుమార్ లల్లు మాట్లాడుతూ.. ‘పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు అదితికి నోటీసులు జారీ చేశాం. రెండు రోజుల్లో దానిపై వివరణ ఇవ్వాలని కోరాం. అలాగే ఆమెపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోరాదో వివరణ అడిగామ’ని తెలిపారు. కాగా, రాయ్‌బరేలీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అదితి.. ఆర్టికల్-370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. అలాగే గాంధీ జయంతి రోజున కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లక్నోలో చేపట్టిన శాంతి ర్యాలీకి కూడా అదితి హాజరుకాలేదు. అయితే కొంత కాలం నుంచి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న అదితి.. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. చదవండి : ప్రియాంకగాంధీకి షాకిచ్చిన ఎమ్మెల్యే! -
ఇండిగోకు మరో షాక్
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ, ప్రమోటర్ల వివాదంతో చిక్కుల్లో పడిన ఇండిగోకు మరో షాక్ తగిలింది. ఏవియేషన్ రెగ్యులేటర్ (డీజీసీఏ) ఇండిగో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డీజీసీఏ ప్రత్యేక ఆడిట్ బృందం భద్రతా లోపాలను గుర్తించిన నేపథ్యంలో నలుగురు సీనియర్ ఉద్యోగులకు శుక్రవారం నోటీసులిచ్చింది. ట్రైనింగ్ హెడ్ కెప్టెన్ సంజీవ్ భల్లా, చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ కెప్టెన్ హేమంత్ కుమార్, ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ అషీమ్ మిత్రా, క్యూఏ (క్వాలిటీ అస్యూరెన్స్) కెప్టెన్ రాకేశ్ శ్రీవాస్తవలకు ఈ నోటీసులిచ్చింది. విమానాల ల్యాండింగ్ ప్రమాదాల సంఘటనల నేపథ్యంలో అన్ని విమానయాన సంస్థలు , విమానాశ్రయాల్లో దేశవ్యాప్తంగా ఉన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జూలై 8, 9తేదీల్లో గుర్గావ్లోని ఇండిగో కార్యాలయంలో ఆడిట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రధాని జోక్యాన్ని కోరుతున్న గంగ్వాల్ మరోవైపు ఇండిగో ప్రమోటర్ల వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కో ప్రమోటర్ రాహుల్ భాటియా అక్రమాలపై చర్యలు చేపట్టాలని ఇప్పటికే మార్కెట్ రెగ్యులేటరీకి లేఖ రాసిన ఇండిగో ప్రమోటర్ రాకేశ్ గంగ్వాల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారట. సంస్థ ఎదుర్కొంటున్న కార్పొరేట్ పాలన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడాలని ప్రధానిని కోరినట్టు సమాచారం. -
ఆకాష్‌పై వేటుకు కాషాయదళం సన్నాహాలు
భోపాల్ : మున్సిపల్ అధికారిపై క్రికెట్ బ్యాట్‌తో దాడిచేసిన పార్టీ ఇండోర్ ఎమ్మెల్యే, సీనియర నేత కైలాష్ విజయవర్గీయ కుమారుడు ఆకాష్ విజయవర్గీయకు బీజేపీ షోకాజ్ నోటీసు జారీ చేయవచ్చని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గత వారం జరిగిన ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్ కావడంతో ఎమ్మెల్యేపై చర్యలు తప్పవని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎవరి కొడుకైనా ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడితే ఉపేక్షించేదిలేదని ఆకాష్ చర్యపై ప్రధాని తీవ్రస్ధాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. దూకుడుగా వ్యవహరించిన ఆకాష్‌పై చర్యలకు సంబంధించి మధ్యప్రదేశ్ పార్టీ చీఫ్ రాకేష్ సింగ్‌తో ఢిల్లీ నుంచి ఓ పార్టీ సీనియర్ నేత ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీనియర్ బీజేపీ నేత రామ్‌లాల్ సైతం రాకేష్ సింగ్‌తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఆకాష్ ప్రవర్తనపై సీరియస్‌గా ఉన్న బీజేపీ అధిష్టానం ఆయనపై తీవ్ర చర్యలు తీసుకుంటుందని మీడియాలో సైతం ప్రచారం ఊపందుకుంది. ఆకాష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయవచ్చని భావిస్తున్నారు. కాగా ప్రభుత్వ అధికారిపై దురుసుగా ప్రవర్తించిన ఆకాష్‌ను ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
‘ప్రజలే కాంగ్రెస్‌కు షోకాజ్ నోటీసులు ఇస్తారు’
నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ తనకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం కాదని.. ప్రజలే ఆ పార్టీకి షోకాజ్ నోటీసులు ఇస్తారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై విమర్శలు చేయడంతో పాటు.. రాష్ట్రంలో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నయం అని వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్‌రెడ్డికి టీపీసీసీ షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం నల్లగొండలో మీడియాతో మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డి.. కాంగ్రెస్ నేతలు గ్రూపు రాజకీయాలతో పార్టీని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తను నిజాలు మాట్లాడితే కాంగ్రెస్ నేతలకు జీర్ణం కావడం లేదన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంలో తప్పుచేశారని.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రచారంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పారు. భవిష్యత్‌లో తెలంగాణలో కాంగ్రెస్ కోలుకునే అవకాశం కనిపించడం లేదన్నారు. మునుగోడు నియోజకవర్గ క్యాడర్‌తో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. తను కాంగ్రెస్ పార్టీ దుస్థితిపై మాట్లాడితే.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల నుంచి వేలాది ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పారు. తాము గాంధీ భవన్ నేతలం కాదని.. ప్రజల మునుషులమని పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం కేసీఆర్‌తో మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్, మై హోమ్ రామేశ్వరరావులతో కేసీఆర్ నిత్య సంబంధాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఉత్తమ్ పార్టీ నుంచి తప్పుకుంటేనే పార్టీ బాగుపడుతుందని వ్యాఖ్యానించారు. -
రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్ ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్ నోటీసు ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన వ్యాఖ్యలపై ఆరా తీసిన అధిష్టానం పెద్దలు... ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ సహా నేతలందరిపై విమ ర్శలు చేసిన రాజగోపాల్రెడ్డిపట్ల ఉదాసీనంగా వ్యవహరించొద్దని ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని టీపీసీసీ భావిస్తున్నట్టు సమాచారం. రాజగోపాల్‌పై చర్యలు తీసుకుంటే పార్టీ మారేందుకు ఆయనకు అవకాశం ఇచ్చిన వారవుతామనే భావనలో ఉన్న గాంధీ భవన్ వర్గాలు ఇప్పుడు ఏం చేస్తాయనేది హాట్‌టాపిక్‌గా మారింది. నేడు కమిటీ భేటీ... వాస్తవానికి ఎంపీపీ, జెడ్పీ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించారంటూ కొందరిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు సోమవారం భేటీ కావాలని పార్టీ క్రమశిక్షణా సంఘం గతంలోనే నిర్ణయించింది. ఈలోగా రాజగోపాల్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చినందున సోమవారం జరగనున్న భేటీలో ఈ అంశం కూడా చర్చకు రానుంది. రాజగోపాల్ వ్యాఖ్యలను సమావేశంలో క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అవసరమనుకుంటేనే ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. షోకాజ్ జారీ చేసి రాజగోపాల్‌పై చర్యలకు ఉపక్రమిస్తే ఆయనకు పార్టీ మారే స్వేచ్ఛను తామే ఇచ్చినట్టు అవుతుందని, ఆ వ్యూహంతోనే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారని, రాజగోపాల్ ట్రాప్‌లో తాము ఎలా పడతామని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాఖ్యానించడం గమనార్హం. తమపై ఆరోపణలు చేసే ముందు రాజగోపాల్ ఆత్మవిమర్శ చేసుకోవాలని, సొంత మండలంలో తన సోదరుడిని జెడ్పీటీసీగా గెలిపించుకోలేకపోవడంలో బాధ్యులెవరని ఆ నేత ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డికి 19 వేల మెజారిటీ వస్తే ఎంపీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో వెంకట్‌రెడ్డికి కేవలం 4 వేల మెజారిటీయే వచ్చిందని, దీనికి బాధ్యులెవరో రాజగోపాల్‌రెడ్డి తనను తాను ప్రశ్నించుకోవాలన్నారు. రాజగోపాల్ వ్యూహాన్ని తిప్పికొడతామని, పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం కింద స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని, అప్పుడు స్పీకర్‌దే తుది నిర్ణయం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ వ్యవహారంపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయమై టీపీసీసీ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారు. రాజగోపాల్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన పని లేదని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌లోనే ఉంటా... తన సోదరుడు చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా బహిరంగంగా ఎక్కడా స్పందించలేదు. రాజగోపాల్ వ్యాఖ్యలతో తనకేం సంబంధం లేదని, తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని మొదటి నుంచీ చెబుతున్నానని, దానికే కట్టుబడి ఉంటానని వెంకట్‌రెడ్డి తన సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోదరులిద్దరూ చెరో బాట పడతారా? కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్‌పై చర్యలు తీసుకుంటుందా.. కనీసం షోకాజ్ నోటీసు అయినా ఇస్తుందా లేక రాజగోపాల్ వ్యూహాన్ని తిప్పికొట్టేలా వ్యవహరించి ఆయన పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం కింద ఫిర్యాదు చేçస్తుందా? అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది. ముఖ్యులతో రాజగోపాల్ సంప్రదింపులు... పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేసి వార్తల్లోకెక్కిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆదివారం పలువురు కాంగ్రెస్ ముఖ్యులతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తనతో సన్నిహిత సంబంధాలున్న నేతలతో ఆయన మాట్లాడినట్టు సమాచారం. పార్టీపై తాను ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనేది వారికి వివరిస్తూనే భవిష్యత్తులో తాను తీసుకోబోయే నిర్ణయాలకు అండగా ఉండాలని ఆయన కాంగ్రెస్ ముఖ్యులను కోరుతున్నట్టు తెలుస్తోంది. -
ట్వీట్ ఎఫెక్ట్ : ట్రాన్స్ఫర్, షోకాజ్ నోటీసులు
ముంబై : మహాత్మా గాంధీపై ఐఏఎస్ అధికారిణి నిధి చౌదరి చేసిన ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో ఆమెను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కి జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్న నిధి చౌదరిని నీటి సరఫరా, పారిశుద్య శాఖ డిప్యూటి సెక్రటరీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వివాదంపై వివరణ ఇవ్వాల్సిందగా ఆదేశించడమే కాక షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. గాడ్సేకు కృతజ్ఞతలు అంటూ పదిహేను రోజుల కిందట ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. ‘మన కరెన్సీపై గాంధీ ముఖాన్ని తొలగించడం, ప్రపంచవ్యాప్తంగా ఆయన విగ్రహాలను రూపుమాపడం, ఆయన పేరిట నెలకొల్పిన సంస్ధలు, రహదారుల పేర్లు మార్చడం ఇప్పుడు తక్షణం మనం చేయాల్సిన పని.. ఇదే మనం ఆయనకు ఇచ్చే ఘననివాళి.. థ్యాంక్యూ గాడ్సే’ అంటూ ఆమె చేసిన ట్వీట్ కలకలం రేపింది. విమర్శలు వెల్లువెత్తడంతో ట్వీట్‌ను ఆమె తొలగించారు. నిధి చౌదరిని ప్రభుత్వ సర్వీసు నుంచి సస్పెండ్ చేయాలని ఎన్సీపీ నేత జితేంద్ర అవధ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : ‘ఆ ట్వీట్‌పై రాద్ధాంతం అవసరమా’) -
గురువులకు షోకాజ్ నోటీసులు
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది పది ఫలితాలు ఆశించినమేర లేవు. గతేడాది కంటే ఒక అడుగు వెనక్కువేసి 11వ స్థానంలో నిలవడంతో పాటు కొన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణతశాతం బాగా తగ్గింది. దీనిని డీఈఓ శైలజ సీరియస్‌గా తీసుకున్నారు. ఉత్తీర్ణతశాతం ఎందుకు తగ్గింది..దీనికి కారణాలేంటనే విషయంపై ఒక్కోరోజు కొన్ని మండలాలకు సంబంధించిన ఆయా హైస్కూల్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, ఆ డివిజన్‌కు సంబంధించిన డిప్యూటీ డీఈఓలతో నిత్యం డీఈఓ కార్యాలయంలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. లోతుగా చర్చించి ఆరా తీస్తున్నారు. ఏడాదిపాటు బోధనలు అందిస్తే కనీసం పాస్‌మార్కులు కూడా విద్యార్థి సంపాదింకుంటే ఎలా అని గట్టిగా ప్రశ్నించినట్లు తెలిసింది. కొన్ని పేపర్లు కఠినతరంగా వచ్చాయిని కొందరు హెచ్ఎంలు, ఎంఈఓలు బదులిచ్చారు. దీనిపై ఆమె కొంత సీరియస్ అయినట్లు సమాచారం. ఉత్తీర్ణత తగ్గిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతోపాటు సబ్జెక్టు ఉపాధ్యాయులకు నోటీస్‌లు కూడా జారీ చేసి వివరణ అడిగినట్లు తెలిసింది. రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మొదటి నుంచి ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. సబ్జెక్టుల బాధ్యత ఆయా ఉపాధ్యాయులదే... ఏఏ సబ్జెక్టుల్లో విద్యార్థులు ఫెయిల్ అయ్యారో సంబంధిత ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని డీఈఓ ఆదేశించినట్లు తెలిసింది. వారికి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే వరకు సబ్జెక్టు నిపుణులు రోజూ ప్రత్యేక తరగతులను నిర్వహించి పాస్ ఆయ్యేందుకు కృషి చేయాలని ఆదేశాలను ఇచ్చారు. ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ బోధనలను అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 36536 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా 33943 మంది పాసయ్యారు. తెలుగు.. ఉర్థూ సబ్జెక్లులో 4299 మందికి ఏ1 గ్రేడ్ వచ్చింది. 7274 మందికి ఏ2 గ్రేడ్ వచ్చింది. ఇంగ్లీషలో 1193 మందికి ఏ1. 3730 మందికి ఏ1 గ్రేడ్ అలాగే హిందీలో 3348 మందికి ఏ1, 8301 మందికి ఏ2, మ్యాథ్స్‌లో 1930 మందికి ఏ1, 8390 మంది ఏ2, సైన్సు సబ్జెక్టుకు సంబంధించి 1645 మందికి ఏ1, 3983 మందికి ఏ2, సోషల్ సబ్జెక్టులో 3083 మందికి ఏ1, 6891 మందికి ఏ2 గ్రేడ్స్ వచ్చాయి. మొత్తంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి 15,498 మందికి ఏ1, 34069 మందికి ఏ2 గ్రేడ్స్ వచ్చాయి. 28118 మంది బి1, 20505 మందికి బి2, అలాగే 13400 మందికి సి1, 5397 మందికి సీ2 గ్రేడులు రాగా 363 మందికి డి గ్రేడులు వచ్చాయి. 2830 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. మ్యాథ్స్‌తోపాటు సైన్సులో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. మ్యాథ్స్‌లో 1872 మంది ఫెయిలయ్యారు. సైన్సులో 545 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. సోషల్‌లో 126 మంది, హిందీలో 124 మంది, తెలుగు, ఉర్దూల్లో 115 మంది ఫెయిల్ అయ్యారు. వీరందరికి ప్రస్తుతం అయా సబ్జెక్టు ఉపా«ధ్యాయులతో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. సమీక్షలు నిర్వహిస్తున్నాం... పది ఫలితాలపైన నిత్యం పలు మండలాలకు సంబంధించిన హెచ్‌ఎంలతోపాటు ఎంఈఓలతో సమీక్షలు నిర్వహిస్తున్నాం. తక్కువ ఉత్తీర్ణతశాతం వచ్చినందుకు గల కారణాలపై అరా తీçస్తున్నాం. మరీ తక్కుమంది ఉత్తీర్ణలైన చోట్ల అయా సబ్జెక్టు టీచర్లకు వివరణ కోరుతున్నాం. వచ్చే విద్యా సంవత్సరం ఈ పరిస్థితి రాకుండా ఇప్పటి నుంచి ప్రణాళణ మొదలు పెట్టాం. – శైలజ, జిల్లా విద్యాశాకాధికారి -
సాధ్వి ప్రజ్ఞా సింగ్‌కు ఈసీ షాక్
భోపాల్ : బాబ్రీ మసీదు కూల్చివేతపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను భోపాల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు ఆదివారం ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. డిసెంబర్ 6, 1992లో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసంలో మసీదును కూల్చిన బృందంలో తానూ ఉన్నానని, ఈ ఉద్యమంలో పాలుపుంచుకున్నందుకు గర్వపడుతున్నానని శనివారం ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బాబ్రీ విధ్వంసంలో పాల్గొనే అవకాశం తనకు దక్కినందుకు గర్వంగా ఉందని, అలదే ప్రాంతంలో రామ మందిర నిర్మాణం జరిగేలా చూస్తామని ఆ ఇంటర్వ్యూలో సాధ్వి ప్రజ్ఞా సింగ్ చెప్పుకొచ్చారు. భోపాల్ లోక్‌సభ అభ్యర్ధిగా ప్రజ్ఞా సింగ్‌ను బీజేపీ ఖరారు చేసిన అనంతరం ఈసీ ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేయడం ఇది రెండవసారి కావడం గమనార్హం. తనను వేధించిన మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కారే తాను శపించడం వల్లే ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయారని ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఈసీ వివరణ కోరిన సంగతి తెలిసిందే. -
సీఎంకి షాకిచ్చిన ఈసీ
లక్నో : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న కొద్ది పార్టీలన్ని దూకుడు పెంచాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ.. హద్దులు దాటుతున్నారు. ఇలా హద్దు దాటిన వారిపై కేంద్రం ఎన్నికల సంఘం కొరడా ఝుళిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారత సైన్యాన్ని ‘మోదీ కీ సేనా’ అంటూ వ్యాఖ్యానించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. జాగ్రత్తగా మాట్లాడండి.. హద్దులు మీరకండి.. భవిష్యత్తులో మీ ఉచ్ఛారణ పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించండి అంటూ ఈసీ ఆదిత్యనాథ్‌ను హెచ్చరించింది. అంతటితో ఊరుకోక షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. గత ఆదివారం ఘజియాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు కురిపించాడు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులకు బిర్యానీ పెట్టి.. జీ అని గౌరవిస్తే.. మోదీ సేన మాత్రం వారి చేత బుల్లెట్లు తినిపించిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన విపక్షాలు యోగిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశాయి. దాంతో ఏప్రిల్ 5లోపు ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ.. ఆదిత్యనాథ్‌ను కోరింది. అయితే ఆయన చెప్పిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో.. ఆదిత్యనాథ్‌కు హెచ్చరికలు జారీ చేసింది. -
‘ఉన్నతం'గా దోచేస్తున్నారు !
సాక్షి సిటీబ్యూరో: వ్యాపారుల క్రయ విక్రయాలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచి వారి ద్వారా జరిగే వ్యాపారాలకు ప్రభుత్వం నిర్దేశించిన పన్నును వసూలు చేయాల్సిన వాణిజ్య పన్నుల శాఖలోని కొందరు అధికారులే దానికి అడ్డుపడుతున్నారు. ప్రభుత్వ అదాయాన్ని పెంచాల్సిన కొందరు అధికారులు వ్యాపారులతో కుమ్మకై ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. వాణిజ్య పన్ను చట్టాలను ఆసరాగా తీసుకొని వ్యాపారులకు ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి అనంతరం సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలోని ఏడు డివిజన్లలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన కోట్లాది రూపాయ లు అక్రమార్కుల జేబుల్లోకి చేరుతున్నాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. వాణిజ్య పన్నుల శాఖలో అధికారుల అక్రమ బాగోతంపై ‘సాక్షి’ ప్ర త్యేక కథనం.. ♦ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పంజగుట్ట డివిజన్, సోమాజిగూడ సర్కిల్లోని ఓ ప్రముఖ బంగారు నగల దుకాణానికి సంబంధించిన వ్యాపార లావాదేవీలపై ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.23 కోట్లు ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుందని తేల్చారు. అయితే సదరు వ్యాపారి తన పలుకుబడిని వినియోగించి ఉన్నత అధికారులతో ఒప్పందం చేసుకుని కేవలం రూ. 4 కోట్లు మాత్రమే చెల్లించా డు. ఇందుకు గాను ఉన్నతాధికారులకు రూ.కోట్లల్లో ముడుపులు అందినట్లు సమాచారం. ♦ అబిడ్స్ డివిజన్, గౌలిగూడ సర్కిల్లోని ఓ రెడీమెడ్ షోరూంకు సంబంధించి షాప్‌లపై దాడులు నిర్వహించిన శాఖ అధికారులు రూ. 16 కోట్ల పన్ను చెల్లించనందుకుగాను జరిమానా విధించారు. సదరు వ్యాపారి ఉద్యోగుల అండదండలతో సదరు శాఖ ఉన్నతాధికారి సంప్రదించడంతో అతని కేసును పక్కన పెట్టేశారు. ♦ అబిడ్స్ డివిజన్, బషీర్‌బాగ్ సర్కిల్ పరిధిలోని ఓ భవన నిర్మాణ సంస్థకు సంబంధించి ఆడిట్ నిర్వహించిన సర్కిల్ అధికారులు రూ. 3 కోట్లు పన్ను చెల్లించాలని ఆదేశిస్తూ షాకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే సదరు సంస్థ యజమాని కేంద్ర కార్యాలయంలోని ఓ అధికారిని కలిసి సెటిల్మెంట్ చేయాలని కోరినట్లు సమాచారం. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో కేసు రూ.10 లక్షల్లో సెటిల్ కానున్నట్లు తెలిసింది. కేవలం ఈ మూడు డివిజన్లలోనే కాకుండా గ్రేటర్‌పరిధిలోని చార్మినార్, బేగంపేట్, సరూర్‌నగర్, సికింద్రాబాద్‌తో పాటు హైదారాబాద్ రూరల్ ప్రాంతాల్లోనూ అధికారుల అక్రమాల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి రూ. కోట్లల్లో గండి పడుతోంది. నిబంధనలకు నీళ్లు ప్రభుత్వ అధికారులు తాము పనిచేస్తున్న శాఖపరమైన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది మాత్రం నిబంధనలు పట్టించుకోవడం లేదు. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. వ్యాపార సంస్థలు, షాప్‌లపై తనిఖీలు నిర్వహించే అధికారులు వ్యాపార లావాదేవీల సమాచారం నిమిత్తం 304 నోటీసులు జారీ చేస్తారు. ఇందులో సేల్స్, కొనుగోలు బిల్లులు, స్టాక్‌తో పాటు లాభ నష్టాలకు సంబందించిన వివరాలు అందజేయాలని సూచిస్తారు. సదరు వ్యాపారి అకౌంట్స్ వివరాలు అందజేయకపోతే మూడుసార్లు 310 నోటీసులు జారీ చేయాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. అయితే అధికారులు అందుకు విరుద్ధంగా 305 ఏ చట్టం ద్వారా షోకాజ్ నోటీసులు జారీ చేసి భారీ మొత్తంలో పన్నులు చెల్లించాల్సి ఉంటుందని వ్యాపారులను బెదిరిస్తున్నారు. సదరు వ్యాపారిని నేరుగా కార్యాలయానికి పిలిపించుకుని అతడితో బేరం కుదిరాక రూ.కోట్లలో ఉన్న మొత్తాన్ని రూ. లక్షలకు తగ్గించి 305 ఆర్డర్ ఇస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు పూర్తి సమాచారం ఉన్నా వారికి అందాల్సిన వాటా అందుతుండటంతో వారు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి వాణిజ్య పన్నుల శాఖ అధికారుల వైఖరి కారణం గా ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వస్తోంది. వాణిజ్య పన్నుల శాఖను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నందున అధికారుల అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వ్యాపార సంఘాల నేతలు కోరుతున్నారు. అక్రమాలకు పాల్పడితేకఠిన చర్యలు డివిజన్ పరిధిలో సీటీఓల ద్వారా జారీ అయ్యే ప్రతి షోకాజ్ నోటీసుకు సంబంధించిన పన్నులు కచ్చితంగా వసూలు చేస్తాం. 304 నోటీసులతో వ్యాపారులు స్పందించకపోతే మూడు సార్లు 310 నోటీసులు ఇస్తున్నాం. అనంతర 305 ఏ నోటీసులు జారీ చేస్తున్నాం. వ్యాపారుల లావాదేవీలకు అనుగుణంగా ప్రభుత్వానికి రావాల్సిన అదాయాన్ని పూర్తి స్థాయిలో వసూలు చేస్తున్నాం. కింది స్థాయి అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.– కె. సీతాలక్ష్మి, జాయింట్ కమిషనర్ అబిడ్స్ డివిజన్ -
ఎన్డీటీవీకి ఈడీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ మారక ద్రవ్య చట్ట (ఫెమా) ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఎన్డీటీవీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం నోటీసులు జారీ చేసింది. ఎన్డీటీవీకి అందిన రూ 1637 కోట్ల విదేశీ పెట్టుబడులు, మరో రూ 2732 కోట్ల విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఫెమా ఉల్లంఘనలకు పాల్పడినట్టు తమ విచారణలో వెల్లడైందని ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఫెమా చట్టంకింద ఎన్డీటీవీ వ్యవస్ధాపకులు, ఎగ్జిక్యూటివ్ కో చైర్‌పర్సన్స్ ప్రణయ్ రాయ్, రాధికా రాయ్, జర్నలిస్ట్ విక్రమ చంద్ర సహా ఇతరులకు షోకాజ్ నోటీసు జారీ చేశామని ఈడీ తెలిపింది. ఎన్డీటీవీ సమీకరించిన విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఆయా నివేదికలు, సమాచారాన్ని ఆర్బీఐ ముందుంచడంలో జాప్యాలను నోటీసులో ఈడీ ప్రస్తావించింది. మరోవైపు రూ 600 కోట్లు మించిన ఎఫ్‌డీఐకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర అవసరమని, ఈ అనుమతి లేకుండానే ఎన్డీటీవీ గ్రూప్ రూ 725 కోట్ల ఎఫ్‌డీఐ సమీకరించిందని ఈడీ ఆరోపించింది. రూ 600 కోట్లకు తక్కువగా ఎఫ్‌డీఐని చూపడం భారీ కుట్రలో భాగమని ఈడీ ఆరోపించింది. -
మీటూ : సాజిద్‌కు షోకాజ్ నోటీసు
సాక్షి, ముంబై : బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్‌పై పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన క్రమంలో వీటిపై వివరణ ఇవ్వాలని భారత చలనచిత్ర, టీవీ దర్శకుల సంఘం సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. మీటూ క్యాంపెయిన్‌లో భాగంగా తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై వారంలోగా స్పందించాలని లేకుంటే చర్యలు చేపడతామని ఆయనకు జారీ చేసిన నోటీసులో పేర్కొంది. హమ్‌షకల్స్, హిమ్మత్వాలా మూవీల దర్శకుడిగా మీకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని వర్ధమాన నటులు రేచల్ వైట్, సిమ్రాన్ సూరిలపై లైంగిక వేధింపులకు దిగడం దారుణమని పేర్కొంది. ప్రముఖ జర్నలిస్ట్ కరిషామ ఉపాథ్యాయ్ నుంచి ఈ మెయిల్ ఫిర్యాదులు సైతం తమను దిగ్ర్భాంతికి గురిచేశాయని అసోసియేషన్ తెలిపింది. మీ అసభ్య చేష్టలతో భారత చలనచిత్ర, టీవీ దర్శకుల సంఘం ప్రతిష్టను దిగజార్చారని ఆయనకు జారీ చేసిన నోటీసుల్లో ఆందోళన వ్యక్తం చేసింది. ఆడిషన్ కోసం వెళితే.. సాజిద్ ఖాన్‌పై తాజాగా నటి సిమ్రాన్ సూరి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. 2012లో హిమ్మత్వాలా మూవీలో పాత్ర గురించి లుక్ టెస్ట్ కోసం తనను సాజిద్ ఖాన్ తన ఇంటికి రమ్మని పిలిచి తనను లోబరుచుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తాను ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో సాజిద్ ఫార్మల్ దుస్తుల్లో ట్రెడ్‌మిల్‌పై ఉన్నారని, తనను దుస్తులు తీసివేయమన్నారని చెప్పుకొచ్చారు. అందుకు నిరాకరించి తాను అక్కడి నుంచి వచ్చేశానని చెప్పారు. సాజిద్ తర్వాత పలుమార్లు ఫోన్ చేయగా తాను గట్టిగా ప్రతిఘటించానని చెప్పారు. -
రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై టీపీసీసీ తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. షోకాజ్ నోటీసుకు సరైన సమాధానం ఇవ్వాలంటూ 24 గంటల గడువుతో క్రమశిక్షణ కమిటీ ఆయనకు మరో నోటీసు ఇవ్వడం, గడువు కూడా ముగియడంతో ఏం నిర్ణయం తీసుకుంటారోననే చర్చ పార్టీ నేతల్లో కొనసాగుతోంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం సుఖాంతమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో క్రమశిక్షణ కమిటీ గట్టిగానే ఉన్నా... ఎన్నికల ముందు కఠిన నిర్ణయాలు తీసుకోవడం పార్టీకి నష్టం చేస్తుందనే సీనియర్ల అభిప్రాయం మేరకు అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప రాజగోపాల్‌రెడ్డిని హెచ్చరికలతో సరిపెడతారనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. నోటీసు కాలపరిమితి మంగళవారం సాయంత్రంతో ముగియడంతో బుధవారం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మరోసారి సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. మీరేమంటారు..? రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం క్రమశిక్షణ కమిటీ వద్దకు చేరినప్పటి నుంచీ పార్టీలో పెద్ద ఎత్తున తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? ఒకవేళ రాజగోపాల్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఏమిటి? సీనియర్లు ఏమంటారు? ఎమ్మెల్సీగా ఉండి రాష్ట్రవ్యాప్తంగా కోమటిరెడ్డి బ్రదర్స్ పేరుతో సుపరిచితమైన నాయకుడిపై చర్యలు తీసుకుంటే కేడర్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనే దానిపై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. అయితే పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడవద్దని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పాక కూడా రాజగోపాల్‌రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, పార్టీ ఎన్నికల కమిటీలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో క్రమశిక్షణ కమిటీ కూడా దీనిపై తీవ్రంగానే స్పందించింది. ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చి సమాధానమిచ్చేందుకు 48 గంటల గడువిచ్చింది. రాజగోపాల్ 3 పేజీల వివరణ పంపగా ఆయన సమాధానంపై సంతృప్తి చెందని కమిటీ... మళ్లీ 24 గంటల గడువిస్తూ మరో నోటీసు ఇవ్వడంతో వాతావరణం వేడెక్కింది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా ఉన్న నాయకుడిపై చర్యలు తీసుకునే ముందు పార్టీ శాసనసభాపక్ష నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అభిప్రాయాన్ని కమిటీ కోరినట్లు తెలుస్తోంది. దీనికితోడు పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి జైపాల్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి సోదరుడు వెంకట్‌రెడ్డి కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో పరిస్థితి చేయిదాటిపోదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందు ఎందుకు? రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై టీపీసీసీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీ రాజ్యాంగ నిబంధనల ప్రకారం వెళ్లాల్సిందేనని క్రమశిక్షణ కమిటీ అంటుంటే సీనియర్లు మాత్రం రాజగోపాల్‌ను దూరం చేసుకోవడం సరికాదని, ఎన్నికల వేళ ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నా పార్టీకి నష్టం జరుగుతుందని అంటున్నారు. దీనికితోడు అంతర్గతంగా జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో కుంతియా కూడా ఈ విషయంలో మెత్తబడ్డట్టు తెలుస్తోంది. జానా, షబ్బీర్, జైపాల్, వెంకట్‌రెడ్డి జోక్యం కూడా సమస్యను పరిష్కరించే విధంగానే ఉందని, జానా, షబ్బీర్ క్రమశిక్షణ కమిటీకి తెలిపిన అభిప్రాయం ప్రకారం ఎలాంటి చర్యలూ ఉండబోవని తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు, ఘటనలు పునరావృతం కావొద్దని రాజగోపాల్‌ను హెచ్చరిస్తూ సరిపెడతారని సమాచారం. -
కల్కిని నేను.. ఆఫీసుకు రాను..!
అహ్మదాబాద్: ‘విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కిని నేను. ప్రపంచాన్ని మార్చేందుకు యాగం చేస్తున్నా. అందుకే ఆఫీసుకు రావట్లేను. నా యజ్ఞం వల్లే ఇరవయ్యేళ్లుగా దేశంలో పుష్కలంగా వానలు కురుస్తున్నాయి’ అంటూ గుజరాత్ ప్రభుత్వ అధికారి ఒకరు ప్రకటించుకున్నారు. రమేశ్చంద్ర ఫెఫర్(55) అనే ఆయన సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్వాసితులకు పరిహారం అందించే శాఖలో సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన గత ఆరు నెలలుగా ఆఫీసుకు రావట్లేదు. అధికారులు మూడు రోజుల క్రితం ఆయనకు షోకాజ్ నోటీసులిచ్చారు. నోటీసులు అందుకున్న రమేశ్చంద్ర..‘కల్కి అవతారంలో ఈ లోకాన్ని మార్చేందుకు యాగం చేస్తున్నా. ఆఫీసులో యాగం చేయడం కుదరదు. అందుకే ఇంట్లో చేస్తున్నా. యాగం ఫలించి 19ఏళ్లుగా దేశంలో సమృద్ధిగా వానలు పడుతున్నాయి’ అంటూ రెండు పేజీల వివరణ ఇచ్చారు. శుక్రవారం రాజ్‌కోట్‌లో మాట్లాడారు. ‘ఆఫీసులో కూర్చుని కాలక్షేపం చేయటం ముఖ్యమా లేక దేశాన్ని కరువు నుంచి కాపాడటం ముఖ్యమా అనేది పైఅధికారులే నిర్ణయించాలన్నారు. -
మెక్‌డొనాల్డ్స్‌కి ఎన్సీఎల్టీ షోకాజ్ నోటీసు
న్యూఢిల్లీ: ఆదేశాల ధిక్కరణ వ్యవహారానికి సంబంధించి ఫాస్ట్‌ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ కార్పొరేషన్‌తో పాటు దాని భారత విభాగానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీటికి సెప్టెంబర్ 20లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. భారత్‌లో మెక్‌డొనాల్డ్స్ మాజీ భాగస్వామి విక్రమ్ బక్షి ఈ పిటీషన్ దాఖలు చేశారు. మరోవైపు, జాయింట్ వెంచర్ సంస్థ కనాట్ ప్లాజా రెస్టారెంట్ (సీపీఆర్ఎల్) నిర్వహిస్తున్న 169 అవుట్లెట్లకు ఫ్రాంచైజీ లైసెన్సును మెక్‌డొనాల్డ్స్ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ బక్షీ వేసిన పిటీషన్‌ను ట్రిబ్యునల్ కొట్టివేసింది. సీపీఆర్ఎల్ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకూడదని, అలాగే సీపీఆర్ఎల్ ఎండీగా బక్షీని పునర్నియమించాలని ఎన్సీఎల్టీ జులై 13న ఇచ్చిన ఆదేశాలను మెక్‌డొనాల్డ్స్ ధిక్కరించిందని, లైసెన్సులు రద్దు చేసిందని తాజాగా బక్షీ ఆరోపించారు. ఎన్సీఎల్టీ ఆదేశాలపై తాము నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్ఏటీ) ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించరాదంటూ మెక్‌డొనాల్డ్స్, భారత్‌లో దాని అనుబంధ సంస్థ వాదించాయి. కానీ, ఈ వాదనలను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. సెప్టెంబర్ 20లోగా షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇక, ఫ్రాంచైజీ లైసెన్సుల రద్దు అంశంపై దాఖలైన అప్పీలు ఇంకా ఎన్సీఎల్ఏటీ వద్ద పెండింగ్‌లో ఉన్నందున.. దీనిపై బక్షీ దాఖలు చేసిన పిటీషన్‌ను ప్రస్తుత దశలో విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని పేర్కొంది. తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల్లో మెక్‌డొనాల్డ్స్ చెయిన్‌ను సీపీఆర్ఎల్ నిర్వహిస్తోంది. అయితే, నిర్వహణపరమైన విభేదాల కారణంగా ఆగస్టు 2013లో బక్షీని ఎండీ హోదా నుంచి తప్పించినప్పటి నుంచీ ఇరు సంస్థల మధ్య వివాదం నడుస్తోంది. ఇటీవలే ఫ్రాంచైజీ లైసెన్సులను కూడా మెక్‌డొనాల్డ్స్ ఇండియా రద్దు చేసింది. -
'ఆ ఇద్దరి'పై ఐఓఏకి కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాల వ్యవహారంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ)పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కుంభకోణాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్మాడి, చౌతాలాలకు ప్రతిష్టాత్మక సంస్థలో చోటు కల్పించరాదని, తక్షణమే వారు రాజీనామా చేయడమో, లేదంటే తొలగించడమో జరగాలని ఒలింపిక్ సంఘానికి(ఐఓఏకి) కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు బుధవారం షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఒకవేళ మాట వినకుంటే ఐఓఏకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపును రద్దుచేస్తామని హెచ్చరించింది. క్రీడల మంత్రి విజయ్ గోయల్ సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తూ క్రీడారంగంలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యావశ్యకాలని, వాటికి విరుద్ధంగా ఆ ఇద్దరి(కల్మాడీ, చౌతాల) ఎంపిక జరగడం గర్హనీయమని వ్యాఖ్యానించారు. మంగళవారం చెన్నైలో జరిగిన ఒలింపిక్ సంఘం సర్వసభ్య సమావేశంలో కల్మాడీ, చౌతాలలను జీవితకాల అధ్యక్షులుగా ఎన్నుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఒలింపిక్ సంఘానికి కేంద్రం షోకాజ్ నోటీసు నేపథ్యంలో సురేశ్ కల్మాడి కాస్త వెనక్కి తగ్గినట్లు తెలిసింది. 'జీవితకాల అధ్యక్ష' పదవి చేపట్టేందుకు కల్మాడీ సుముఖంగా లేరని పలు జాతీయ చానెళ్లు వార్తలు ప్రసారం చేశాయి. అయితే కల్మాడీగానీ, చౌతాలాగానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. కల్మాడీ, చౌతాలాల నియామకానికి సంబంధించి తాము ఎవ్వరి సూచనను పాటించాల్సిన అవసరం లేదని భారత ఒలింపిక్ సంఘం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే బుధవారం నాటి షోకాజ్ నోటీసుపై ఆ సంస్థ స్పందన వెలువడాల్సిఉంది. (చదవండి: భారత ఒలింపిక్ సంఘం సంచలన ప్రకటన) -
కెమెరాలో ఎమ్మెల్యే అడ్డంగా దొరికిపోయాడు
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అమలు చేస్తున్న మద్యనిషేధం పథకానికి మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తూట్లు పొడిచారు. నర్కటియగంజ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ వర్మ మద్యంతాగుతూ కెమెరాలో అడ్డంగా దొరికిపోయారు. ఎమ్మెల్యే మద్యంతాగుతూ అతిథులకు డ్రింక్ ఆఫర్ చేస్తున్న వీడియో దృశ్యాలు బయటకు వచ్చాయి. భారత్‌లో తయారైన బ్రాండ్లతో పాటు విదేశీ మద్యం కూడా తన దగ్గర ఉన్నట్టు వినయ్ వర్మ అతిథులతో చెబుతున్నప్పటి దృశ్యాలు రికార్డు కావడం కలకలం రేపింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. వినయ్ వర్మకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బిహార్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం.. మద్యం విక్రయించినా, తాగినా, ఇతరులకు ఆఫర్ చేసినా నేరం. దోషీగా తేలితే 10 ఏళ్ల నుంచి జీవితకాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల నుంచి 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది. -
స్టేట్ హోం అధికారులపై మంత్రి సీరియస్
అధికారులకు, సిబ్బందికి షోకాజ్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో స్టేట్ హోం అధికారుల పనితీరుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ తీరు బాగోలేదని, దీన్ని మార్చుకోవాలని వారిని హెచ్చరించారు. ఇక్కడికి వచ్చే అనాథలు, అభాగ్యులను సొంత బిడ్డల్లా చూసుకోవాలన్నారు. యువతులు వెళ్లిపోవడానికి సరైన కారణాలను తెలియజేయాలని అధికారులకు, సెక్యూరిటీ సిబ్బందికి అక్కడే షోకాజ్ నోటీసు జారీ చేశారు. స్టేట్ హోం నుంచి గత బుధవారం 11 మంది యువతులు పారిపోయిన నేపథ్యంలో గురువారం మంత్రి దాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రెస్క్యూహోంతో పాటుగా స్టేట్‌హోం కూడా ఒకే ప్రాంగణంలో ఉండటం వల్ల తరచూ కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఈ రెండు విభాగాలను సాధ్యమైనంత త్వరలో వేర్వేరుగా ఉంచడానికి ప్రయత్నిస్తామన్నారు. అంతకు ముందు పారిపోయి తిరిగి వచ్చిన నవ్య, స్రవంతితో మంత్రి మాట్లాడారు. నవ్య స్పందిస్తూ తన తల్లిని చూడాలని వెళ్లానని, ఇక్కడ కొన్ని పనులను చేయలేకపోతున్నానని చెప్పింది. తనను తన తల్లివద్దకు పంపాలని కోరింది. దీంతో మంత్రి ఆమెను తల్లి వద్దకు పంపే ఏర్పాటు చేయాలన్నారు. స్రవంతి మాత్రం ఇకపై ఎక్కడకు వెళ్లనని చెప్పింది. బందీలుగా ఫీలవుతున్నారు: ఇక్కడికి వచ్చిన వాళ్లు బందీలుగా భావిస్తున్నారు. ఎంత సెక్యూరిటీ ఉన్నా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని స్టేట్‌హోం ఇన్చార్జి డెరైక్టర్ ప్రశాంతి అన్నారు. సౌకర్యాలు తక్కువగా ఉన్నాయన్న మాట వాస్తవమేనని, వంటలు తదితర పనులు వాళ్లే చేసుకోవాల్సి వస్తున్నందున ఇబ్బందితో కూడా పారిపోయే అవకాశం ఉందన్నారు. పోలీసుల అదుపులో మరో ఇద్దరు స్టేట్ హోం నుంచి యువతులు పారిపోయిన ఘటనలో మరో ఇద్దరు బాలికలను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గ్‌కు చెందిన 17 ఏళ్ల బాలికను సంగారెడ్డి టౌన్లో గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడ వడ్డెర బస్తీకి చెందిన 18 ఏళ్ల బాలికను కూడా అమీర్‌పేటలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్దరిని స్టేట్‌హోంకు తరలించారు. -
17న అమ్మకు అన్నీ చెబుతా: జేసీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు షోకాజ్ నోటీసు అందిందని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై తాను ఆరోపణలు చేశానని పేర్కొంటూ, వాటికి సంబంధించి జవాబు చెప్పాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారని తెలిపారు. జవాబు ఇవ్వడానికి ఎంత గడువు ఇచ్చారన్న దానిని పెద్దగా పరిశీలించలేదని చెప్పారు. వారం రోజులు గడువు ఇచ్చి ఉండొచ్చన్నారు. ఈ నెల 17న ఢిల్లీ ఏఐసీసీ సమావేశానికి హాజరై అమ్మకు అన్నీ వివరించి చెబుతానని చెప్పారు. -
జేసీకి షోకాజ్ నోటీసులు: దిగ్విజయ్ సింగ్
యూపీఏ అధ్యక్షురాలు సోనియగాంధీపై వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశామని ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. జేసీ వివరణ ఇచ్చిన తర్వాత చర్యలు చేపడతామన్నారు. గురువారం న్యూఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతంలో పర్యటించడానికి తనకేమి అభ్యంతరం లేదని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో సీమాంధ్రలో పర్యటిస్తానని చెప్పారు. అయితే జనవరిలో విశాఖ నగరంలో పర్యటిస్తానని వెల్లడించారు. రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్ కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా స్వరం పెంచుతున్నారని విలేకర్లు దిగ్విజయ్ సింగ్‌ను ప్రశ్నించగా.... ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు సోనియాకు వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపారు. త్వరలోనే ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేస్తామని దిగ్విజయ్ సింగ్ వివరించారు.